ప్రభుత్వం వినియోగదారులకు ఇంటింటికీ తీసుకు వచ్చి ఇస్తున్న రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్రిష్ణదేవీపేట(పాతూరు) సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు) పిలుపునిచ్చారు. బుధవారం పాతూరు గ్రామంలోని ఇంటింటి రేషన్ పంపిణీ కార్యాక్రమాన్ని ప్రారంభించి అనంతరం సరుకులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యంనాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం ఇంటివద్దే రేషన్ సరుకులు అందించే గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. దీని ద్వారా పూర్తికొలతలతో సరుకులు ప్రజలకు అందుతాయన్నారు. శ్రమకోర్చి రేషన్ షాపుల దగ్గరకి వెళ్లే ఇబ్బందులు తగ్గుతాయన్నారు. రేషన్ పంపిణీ వాహనం సైరన్ వినపడగానే ఏ వీధిలోవారంతా ఆ వీధిలో ఒకేసారి సరుకులు తీసుకోవచ్చునన్నారు. ఈ మంచి వ్యవస్థను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తూనికల్లో తేడాలు వచ్చినా కూడా నిర్వహాకులను ప్రశ్నించవచ్చునన్నారు. లేదంటే తమకైనా ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు, పంచాయతీ వార్డు సభ్యులు వానపల్లి నవ్యరత్నం, కరకకుమారి, చింతలరాము,ఆరుగుళ్ల అర్జునమ్మ,గళ్లా సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసేవే పరమావధిగా మన కొత్త కార్యవర్గం ప్రతిష్టాత్మక గ్రామసచివాలయ వ్యవస్థలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించి జిల్లాలోనే ఉత్తమ పంచాయతీ పేరు తెచ్చుకోవాలని సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు) పిలుపు నిచ్చారు. గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీలో నూతనంగా గెలిచిన సర్పంచ్ ఇతర కార్యవర్గ పరిచియ కార్యక్రమం సచివాలయంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. సుమారు పదేళ్ల తరువాత జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా గెలుపొందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ, ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు, వార్డు సభ్యులను సచివాలయల కార్యదర్శి కిరణ్మయి కార్యాలయంలోని సిబ్బందికి పరిచియం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పందిరి సత్యన్నారాయాణ(సత్యంనాయుడు) మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో ఏర్పాటు చేసి గ్రామసచివాలయ వ్యవస్థలో కొత్త పాలక వర్గంగా పనిచేసే తొలి అవకాశం మనకే వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. అందరు వార్డు సభ్యులు, గ్రామసచివాలయ సిబ్బంది కలిసి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి క్రుషి చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సేవలందించాలన్నారు. మన పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అందరం సమిష్టిగా పనిచేయాలన్నారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చే అర్జీలను కూడా సచివాలయంలో అన్నిశాఖల సిబ్బంది ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ ద్రుష్టికి తీసుకు వస్తే, మండల, జిల్లా స్థాయి అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు వానపల్లి నవ్యరత్నం, కరకకుమారి, చింతలరాము,ఆరుగుళ్ల అర్జునమ్మ,గళ్లా సత్యన్నారాయణ, పి.చిన్నమ్మలు, ఎం.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీస్త్రీలు, చిన్నపిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందేలా చూడాలని క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు) పేర్కొన్నారు. బుధవారం పాతూరు ఎస్సీకాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు టిహెచ్ఆర్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల్లో రక్తహీనతను తొలగించేందుకు ఈ పౌష్టికాహారం పంపిణీ చేస్తుందని అన్నారు. అది అందరికీ అందినపుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ముఖ్యంగా గర్భిణీలలో రక్తహీనత లేకుండా ప్రభుత్వం ఇచ్చే కిట్ లను పూర్తిగా తిని ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలు వారిని చైతన్యవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సురక్షిత కాన్పులకు గర్భిణీలను దగ్గరుండి ఆరోగ్య సిబ్బంది తీసుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నిరుపేద గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ఉంటారన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం గర్భిణిలు ఎంత వరకూ తీసుకుంటున్నారు, వారికి శరీరంలో రక్తంలోని హెచ్ బీ శాతం ఎంతుంతో జాగ్రత్తగా చూడాలన్నారు. ఏ ఒక్క గర్భిణీ ఎనిమిక్ కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడీ కార్యకర్త సత్యవతి,వార్డు సభ్యులు వానపల్లి నవ్యరత్నం, కరకకుమారి, చింతలరాము,ఆరుగుళ్ల అర్జునమ్మ,గళ్లా సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు వి.ఐ. పి పాస్ లు ఉన్నవారికే వి.ఐ.పి దర్శనం ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ నెల 19వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 18వ తేదీ రాత్రి 2 గంటల నుండి వి.ఐ.పి దర్శనం ప్రారంభం అవుతుందని కలెక్టర్ పేర్కొంటూ వి.ఐ.పి దర్శనానికి వచ్చే వారి వివరాలను ముందుగా రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ)కు అందించి పాస్ లు పొందాలని విజ్ఞప్తి చేసారు. వి.ఐ.పి క్యూ లైన్ లో అనేక మంది రావడంతో నిజమైన వి.ఐ.పిలకు, డోనర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ నేపధ్యంలో వి.ఐ.పి పాస్ లను ప్రవేశపెట్టడం జరిగిందని స్పష్టం చేసారు. వి.ఐ.పి పాస్ లు సకాలంలో పొందుటకు ముందుగానే ఆర్.డి.ఓ కు వివరాలు సమర్పించాలని అన్నారు. పాస్ లు లేనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేసారు.
విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. చినముషిడివాడలోని పీఠం ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు గురువందనంతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పర్యవేక్షణలో వార్షికోత్సవాలను ఏర్పాట్లు చేపట్టినట్లు ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా పెందుర్తిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, విశాఖ నగరంలో వేద ధ్వని ప్రతిధ్వనించేలా వేదోక్తమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా దేశ రక్షణార్ధం రాజశ్యామల యాగం, లోక కళ్యాణార్ధం చతుర్వేద పారాయణ నిర్వహిస్తున్నామని అన్నారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ నిత్యం విశేష హోమాలు, యజ్ఞ యాగాదులు తలపెడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా 17వ తేదీన విద్యాభివృద్ధి కోసం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, వ్యాపారాభివృద్ధి కోసం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం, 18వ తేదీన మానవాళి రక్షణ కోసం మనుస్యూక్త హోమం, 19వ తేదీన ఐశ్వర్యాభివృద్ధి, భోగప్రాప్తి కోసం రుద్రహోమం, 20వ తేదీన వివాహసిద్ధి, సంతాన ప్రాప్తి కోసం షణ్ముఖ యాగం చేపడతామని తెలిపారు. ఈ వార్షికోత్సవాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం అధిష్టాన దైవం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తూ లక్షతులసిపూజ, లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన ఉంటాయన్నారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు నిత్య పీఠ పూజ ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 20వ తేదీన రాత్రి 7 గంటలకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖ తీరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు. యజ్ఞ యాగాదులు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. హైందవ ధర్మ పరిరక్షణకు దోహదపడేలా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. విశేష పండితులను ఈ వేదికపై సత్కరిస్తామని స్వామి స్వాత్మానందేంద్ర వివరించారు
గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో జరగనున్న ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామ పంచాయతీ పరిధి లోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం గ్రామ పంచాయతీ పరిధి లో నిర్వహించే పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో ఎవరైనా గొడవలు, అవాంఛనీయ సంఘటనలు సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత వెంటనే 4 గంటలకల్లా కౌంటింగ్ చేపట్టి రాత్రి 8 గంటల లోపు ఫలితాలు వెల్లడించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి వార్డుకు సపరేట్ గా టేబుల్స్ ను ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ ఆలస్యంగా కాకుండా త్వరితగతిన చేపట్టాలని సూచించారు. నరసాపురం గ్రామంలో పోలింగ్ కేంద్రం మార్పు విషయంలో అభ్యర్థులకు, ఓటర్ల కు తెలపాలన్నారు. సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ ఐకి ఆదేశించారు. అనంతరం గ్రామంలో గత ఎన్నికలలో ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలన్నారు. ఎలాంటి విజయోత్సవాలు జరుపుకోరాదని జిల్లా కలెక్టర్ సూచించారు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షర్మిల, ఎంపీడీవో ప్రభాకర్, ఎస్ ఐ గౌస్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీని, గ్రామాన్ని మరింత అభివ్రుద్ధి చేసుకుందామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. 2021 పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్ధులను ఓడించి పార్టీకి, క్రిష్ణదేవిపేట గ్రామానికి విజయాన్ని అందించిన సర్పంచ్ అభ్యర్ధి సత్యంనాయుడు, ఇతర వైఎస్సార్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, అభిమానులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రిష్ణదేవిపేట గ్రామాన్ని అన్ని రకాలుగా అభివ్రుద్ధిచేయడానికి తనవంతు సహకారం పూర్తిగా అందిస్తానని సర్పంచ్ సత్యంనాయుడుకి ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను సత్యంనాయుడు ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకువెళ్లారు. తన నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని, అదే సమయంలో క్రిష్ణదేవిపేట పంచాయతీకి ప్రత్యేకంగా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. వార్డు సభ్యులు, సర్పంచ్, గ్రామంలోని కార్యకర్తలు అంతా పార్టీ అభివ్రుద్ధికి క్రుషి చేయడంతోపాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అందేలా చూడాలన్నారు. గ్రామాన్ని జిల్లాలోనే మంచి గ్రామంగా తీర్చిదిద్దుకునేలా మంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాన్ని అభివ్రుద్ధి చేసుకోగల సత్తా, యువత సహకారం, మహిళల ప్రోత్సాహం ఉన్నందున గ్రామాన్ని పంచాయతీ నిధులతో బాగుచేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సర్పంచ్ ఎన్నికలో కష్టపడిన యువతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాతూరు నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, యువత, అభిమానులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) ప్రతిష్టాత్మక పంచాయతీ పోరులో నిశ్శబ్ద విప్లవం చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అభ్యర్ధులు నిలబడ్డ ఈ పంచాయతీ ఎన్నిక బరిలో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడు) గెలుపు ప్రత్యర్ధులను దారుణంగా మట్టికరిపించింది. ఆ విజయోత్సాహాన్ని నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి బహుమానంగా పాతూరు నుంచి జనసందోహంగా కదిలి వెళ్లి అందించింది. ఎన్నికలో నిలబడిన దగ్గర నుంచి విజయంతోనే మళ్లీ మీ దగ్గరకి తిరిగి వస్తామని చెప్పిన మాటను నిజం చేస్తూ.. సత్యంన్నాయుడు పేనల్ వార్డు సభ్యులు, అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జయ జయధ్వానాలు చేసుకుంటూ, ప్రజావిజయాన్ని వైఎస్సార్సీపీ పార్టీకి తెలియజేసింది. ఆది నుంచి ఈ పంచాయతీలో సత్యంనాయుడు గెలుపు పైనే ప్రత్యేక కధనాలన్నీన్యూస్ కార్డ్ గా ప్రచురిస్తూ వచ్చిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ చెప్పినట్టుగానే సత్యంనాయుడు గెలుపు నల్లేరుమీద నడకే అయ్యింది. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనమంటేనే పాఠకుల్లోనూ, వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల్లోనూ ఒక ప్రత్యేక నమ్మకాన్ని కలిగించింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా సత్యంనాయుడుని ఓడించాలని చూసిన ఏ ఒక్కరి ప్రయత్నాలు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఫలించలేదు. పైగా చేసిన అన్ని సమాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, సమాజిక సమీకరణలు, నమ్మించి మోసం చేసిన తీరు ప్రత్యర్ధి అభ్యర్ధులనే బొక్కబోర్లా పడేలా చేశాయి. ముఖ్యంగా గ్రామంలోని యువత, మహిళలు సత్యంనాయుడికి పట్టం కట్టిన తీరు ప్రత్యర్ధుల అంచనాలకే అందలేదంటే ఈ నిశ్శబ్ధ విప్లవం ఏ స్థాయిలో మిగిలిన ముగ్గురు అభ్యర్ధులను ఓడించడానికి వ్యూహరచన చేసిందో అన్ని రాజకీయ పార్టీలకు కళ్లకు కట్టినట్టు కనిపించింది. నాడు అల్లూరి సీతారామరాజు క్రిష్ణదేవిపేట(పాతూరు) వేదికగా తెల్లదొరలపై తిరగబడ్డట్టుగానే.. ప్రజలు కూడా సత్యంనాయుడిని గెలిపించడానికి మిగిలిన అభ్యర్ధులపై తిరగబడి మరీ చేసిన వ్యూహరచన, చాలా సైలెంటగ్ వేసిన ఓట్ల ఫలితం ఎలా ఉంటుందో నేతలకు చెప్పకనే చెప్పారు. మన్యం పితూరీలో బ్రిటీషువారిని ఎదిరించడానికి అల్లూరి సేన చేసిన వ్యూహరచనను ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్ధి అభ్యర్ధులను తిప్పికొట్టడానికే యువత మొత్తం పుణికి పుచ్చుకున్నారా అన్నట్టుగా పాతూరు యువత, మహిళలు, అభిమానులు, కార్యకర్తలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడు గెలుపుకి ఇంతాలా పనిచేశారని రుజువు చేయగలిగింది. బరిలో నిలబడ్డ ముగ్గురు వ్యక్తులు ఓట్లు సంపాదించినా..అవి గెలవడానికి ఏమాత్రం పనిచేయకపోవడం విశేషం. ఏది ఏమైనా నిశ్శబ్ధ విప్లవం ప్రజల్లో వస్తే వార్ వన్ వన్ సైడ్ అయిపోతుందనడానికి క్రిష్ణదేవీపేటలో 2021లో జరిగిన ప్రతిష్టాత్మక పంచాయతీ ఎన్నికల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడు గెలుపే ఒక ప్రధాన ఉదాహరణగా జాల్లాలోనే ఒక సంచనలంగా మారింది. అంతేకాదు గొలుగొండ మండలంలోని వైఎస్సార్సీపీ కేడర్ లోనూ ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించింది..!
గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్)కి మంచి విజయాన్ని అందించారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వార్ఢు సభ్యులను కొనియాడారు. ఆదివారం ఈ మేరకు సర్పంచ్ గా ఎన్నికైన సత్యంనాయుడుతో కలిసి వార్డు సభ్యులంతా కలిసి వెళ్లి తమ విజయాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల బరిలో నలుగురు వ్యక్తులు నిలబడినప్పటికీ సత్యంనాయుడు పేనల్ కి ఆరు వార్డు మెంబర్లు, సర్పంచ్ గా గెలిపించడం మామూలు విషయం కాదన్నారు. పోరాటాలకు పుట్టినిల్లు అయిన క్రిష్ణదేవిపేట పంచాయతీలో మరోసారి ప్రజలు ప్రత్యర్ధులపై పోరాటం చేసి మంచి అభ్యర్ధిని, పార్టీకి, ప్రజలకు పనిచేసే వ్యక్తిని సర్పంచ్ అభ్యర్ధిగా గెలిపించడం శుభపరిణామం అన్నారు. ఇదే ఉత్సాహాన్ని రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ చూపించాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని, పార్టీ అభివ్రుద్ధికి కూడా క్రుషి చేయాలని ఎమ్మెల్యే వీరందరికీ సూచించారు. అనంతరం వారితో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి వారిని ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అభ్యర్ధి దుంపలపూడి సహదేవుడు, కరక కుమారి, పందిరి రామారావు, పందిరి వెంకటరమణ(ఆర్ఎంపీ బుజ్జి), పాతూరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖజిల్లా గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) ప్రతిష్టాత్మక పంచాయతీలో నలుగురు సర్పంచ్ అభ్యర్ధులు నిలబడ్డ బరిలో వైఎస్సార్సీపీ మద్దతు దారు పందిరి సత్యన్నారాయణ( సాఫ్ట్ వేర్ఇంజినీర్ సత్యంనాయుడు) పేనల్ లో ఆరుగురు వార్డు మెంబర్లు విజయదుందుబీ మోగించారు. ఇక్కడ ఇండిపెండెంట్ పేనల్ అభ్యర్ధికి మూడు వార్డులు రాగా, టిడిపి పేనల్ అభ్యర్ధికి ఒక వార్డు సభ్యుడు గెలుపొందడం విశేషం. నేరుగా వైఎస్సార్సీపీ జెండా వేసుకొని సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో నిలబడ్డ అభ్యర్ధి పేనల్ కి ఒక్కవార్డు గెలవలేకపోవడం చెప్పుకోదగ్గ విషయం. ఆది నుంచి వార్తల్లో నిలిచిన ఈ పంచాయతీ విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా ఇస్తున్న అంచనా కధనాలన్నీ వాస్తవాలవుతూ వచ్చాయి. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలపై పాఠకులకు సరైన గురి ఏర్పడింది. మిగిలిన నాలుగు వార్డుల్లోనూ స్వతంత్ర్య అభ్యర్ధి, టిడిపి అభ్యర్ధి సామాజిక పట్టుతోనే గెలిచినట్టు ఫలితాలు వెల్లడించాయి. నేరుగా వైఎస్సార్సీపీ పార్టీ జెండాతో బరిలో ఉండి నామినేషన్ల దగ్గర నుంచి పోలీంగ్ వరకూ హడావిడి చేసినా ఒక్క వార్డు గెలుచుకోకపోవడంతో.. ఈ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్ధి ఎంపిక విషయంలో మండల నేతల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం వార్డు మెంబర్లుగా గెలిచిన వారందరూ గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారు కావడం చెప్పుకోదగ్గ అంశం..
ఆరు తరువాత ఏడు పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు అనే ఈ శీర్షికతో సరిగ్గా 4 రోజులు క్రితం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రత్యేక కథనంగా ప్రచురిచింది. నేడు ఆ వార్త నిజమైంది. 463 ఓట్లతో వైఎస్సార్సీపీ మద్దతు దారుడు పందిరి సత్యన్నారాయణ (సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ గా అఖండ మెజార్టీతో ముగ్గురు అభ్యర్ధులను ఓడిస్తూ గెలుపొందాడు. దీనితో ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కధనంపై పాఠకులకు పక్కాగా నమ్మకం ఏర్పడింది. ఎప్పుడూ వాస్తవాలకు పెద్దపీట వేసే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు గెలుపు విషయంలోనూ అదే చెప్పింది. అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై పోరుబాట సాగించిన పాతూరులో అల్లూరి సాక్షిగా బరిలోకి దిగి ప్రత్యర్ధులను మట్టికరిపించారు సత్యంనాయుడు. ఈ విషయంలో సత్యంనాయుడు తమ్ముడు ఆర్ఎంపీ బుజ్జి చేసిన నిశ్వార్ధ వైద్య సేవలు విశేషంగా పాతూరు ప్రజలను చైతన్య వంతం చేయడంతోపాటు ఎంతగానో ఆలోచింపజేశాయి. నిజమైన అభ్యర్ధి, నికార్శైన అభ్యర్ధి బరిలో వుంటే వార్ వన్ సైడ్ అయిపోతుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడం విశాఖజిల్లాలోనే చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా సత్యంనాయుడు గెలుపు విషయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కథనాలన్నీ వాస్తవాలవడంతో జిల్లా నలుమూలల నుంచి న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి వందల కొద్దీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కధనాలు రానున్న రోజుల్లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించాలని కూడా శుభాకాంక్షలు తెలియజేశారు పాఠకులు..
విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ గా సత్యంనాయుడు గెలుపొందారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మక పంచాయతీ పాతూరులో ఏ పంచాయతీలోనూ లేని విధంగా నలుగురు అభ్యర్ధులు బరిలో వున్నప్పటికీ ఈ పోటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు గెలుపొందడం విశేషం. అయితే సర్పంచ్ సత్యంనాయుడు మెజార్టీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం 126 ఓట్లు మెజార్టీతో గెలుపొందినట్టు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి వర్తమానం అందింది. కాగా మెజార్టీ పెరిగే అవకాశాలన్నట్టు మా చీఫ్ రిపోర్టర్ బాలు సంఘటనా స్థలం నుంచి లైవ్ అప్డేట్ అందించడానికి సిద్దంగా ఉన్నారు. త్వరలోనే ఆ పూర్తివివరాలను తెలియజేస్తాం...అయితే సాప్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడే పాతూరు సర్పంచ్ అనే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ నాలుగు రోజుల క్రితమే వార్త ప్రచురించింది.
విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని పూర్తిస్థాయిలో మార్చి చూపిస్తానని పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడిన పందిరి సత్యన్నారాయణ( సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) పేర్కొన్నారు. కేవలం గ్రామ ప్రజలకు సేవ చేసుకోవడానికి మాత్రమే తాను చేస్తున్న ఉద్యోగాన్ని, లక్షల రూపాయల జీతాన్ని వదిలి సొంత గ్రామానికి వచ్చానని గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, చెత్త పడేయడానికి చెత్తబండ్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు, విద్యార్ధుల కోసం గ్రంధాలయం, యువత కోసం ఆటస్థలం ఇలా అన్నింటి కోసం శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని చెప్పారు. గ్రామంలో ఎంత మంది అర్హులుంటే అంత మందికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయం ద్వారా సేవలు పొందడం మన హక్కు అని, సేవలన్నీ ప్రజలకు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని సత్యంనాయుడు చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజలకోసమే పనిచేస్తుందని అన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎవరూ ఎవరినీ అర్ధించాల్సిన పనిలేదని, సంక్షేమ పథకాల కోసం ఎవరూ ఎవరికీ డబ్బులు కూడా ఇచ్చే పనికూడా లేదన్నారు. అందరికీ మీ ఇంటి మనిషిగా తోడుంటానని, మీ అందరికీ సేవ చేసుకుంటానని, ఇచ్చిన మాటకే కట్టుబడే ఉంటానని చెప్పారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే క్రిష్ణదేవిపేటను పూర్తిగా అభివ్రుద్ధి చేసి జిల్లా మొత్తం మన గ్రామంవైపే తొంగి చూసేలా చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు.