అవును మీరు చదువుతున్నది నిజమే పాతూరు(క్రిష్ణదేవిపేట)కి పంచాయతీ పండుగొచ్చింది..అభివ్రుద్ధికి ఆమడ దూరంలో మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై పోరు సలిపిన పోరాటాల పురిటిగడ్డ క్రిష్ణదేవీపేటకు నాటి వైభవం మళ్లీ వచ్చినట్టే కనిపిస్తుంది. 2021 పంచాయతీ ఎన్నికల బరిలో పోటీలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నారాయుడు) తన అనుచరులు, అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్య మహిళలతో జరుపుతున్న ఎలక్షన్ కేన్వాసింగ్ అచ్చుగుద్దినట్టు పాతూరుకి మరోసారి సంక్రాంతి పండుగ తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మందికి పైగా జనంతో గడప గడపకూ జరుపుతున్న ఎన్నికల ప్రచారం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అన్నయ్య బాగున్నావా, తమ్ముడూ ఎలా ఉన్నావ్, అక్కా నేను మీ అందరికోసం వచ్చాను, అత్తా నన్ను మీ చల్లని చేతులతో దీవించాలి, మామ్మ నీ కష్టాలు తీరిపోయినట్టే నీ మనవడు వచ్చాడు, మీ ఏ పనికోసం ఎవరినీ అర్ధించాల్సిన పనిలేదు, అన్ని పనులూ నేనే దగ్గరుండి చూసుకుంటాను, మీకు జీవితాంతం సేవచేసుకోవడానికే వచ్చాను అంటూ అందరినీ పేరుపేరునా కుటుంబ సభ్యుడిలా పలుకరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్న తీరు గ్రామంలో ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. పంచాయతీ పోలీంగ్ కి దగ్గర పడుతుండటంతో అన్ని వర్గాల వారిని ముఖ్యంగా మహిళలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్న తీరుకి మంచి ఆదరణ లభిస్తుంది. ఎన్నడూ లేని విధంగా క్రిష్ణదేవీపేట పంచాయతీ ఎన్నికల బరిలో నలుగురు వ్యక్తులు సర్పంచ్ అభ్యర్ధులుగా నిలబడినా, అందరినోటా కాబోయే సర్పంచ్ పందిరి సత్యన్నాయుడే అంటూ అనిపించేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా పాతూరు గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా చర్చనీయాంశం అవుతోంది. ఎవరికి వారు ప్రచారం చేపడుతున్నా, సత్యన్నాయుడు చేస్తున్న ప్రచారంలో కొత్తదనం కనిపిస్తుండటంతో గ్రామస్తులందరూ ఈయనికి బ్రహ్మరధం పడుతున్నారు. ప్రధానంగా దుంపలపూడి సహదేవుడు అండ్ కో చేస్తున్న సహకారం హైలేట్ గా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మాజీ ఉప సంచాలకులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, ఆర్ఎంపీ బుజ్జీ, పదివార్డులకు చెందిన వార్డు మెంబర్లు, అధిక సంఖ్యలో మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీరామ శోభాయాత్ర విశాఖలోని తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర - అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా బీజేవైఎమ్ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్రను ప్రారంభించారు..ఈ సందర్బంగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాటూరి రవీంద్ర మాట్లాడుతూ, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ బాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీరామునికి ఆలయం నిర్మించుకునే భాగ్యం మనకి దక్కినందుకు గర్వపడాలన్నారు. వేలాదిమంది భక్తుల ఆధ్వర్యంలో కొనసాగిన శోభాయాత్ర కొత్త వెంకోజిపాలెం పెట్రోల్ బంక్,ఎంవీపీ క్యాన్సర్ ఆసుపత్రి రోడ్డు,టీటీడీ సర్కిల్ నుంచి ఇసుకతోట సిగ్నల్ మీదుగా జాతీయరహదారి చేరుకొని అక్కడి శ్రీకృష్ణ ఆలయం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం సభ్యులు, శ్రీరామ భక్తులు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవీపేట(పాతూరు) పంచాయతీకి సర్పంచ్ బరిలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు) ప్రచారంలో దూసుకుపోతున్నాడు. పాతూరు గ్రామంలో నిర్వహిస్తున్న కేన్వాసింగ్ కి గ్రామస్తుల నుంచి విశేషంగా స్పందన లభిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాతూరు గ్రామంలో ప్రతీ ఓటరును సత్యన్నాయుడు పలుకరిస్తూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. తనని సర్పంచ్ గా గెలిపిస్తే ఎవరూ ఏ పనికోసం, సంక్షేమ పథకాల కోసం ఎక్కడికీ వెళ్లకుండా తానే అన్నీ అయి చూసుకుంటానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు. ప్రజాసేవకోసం పంచాయతీకార్యాలయంతోపాటు తన ఇంటిదగ్గర మరో కార్యాలయం ఏర్పాటు చేసి మరీ ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తానని బరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి సచివాలయ స్పందన, మండల కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమాల ద్వారా అర్జీలు పెట్టి అర్హులైన వారందరికీ పథకాలు, రేషన్ కార్డులు వచ్చేలా చేస్తున్నానని ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ గ్రామపరిధిలోనే అందించే ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. పాతూరు గ్రామాన్ని జిల్లాలోనే ఒక మంచి అభివ్రుద్ధి చెందిన గ్రామంగా తీర్చదిద్దడానికి ప్రతీ ఒక్క ఓటరు దగ్గరకి వెళ్లి గ్రామాభివ్రుద్ధికి సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికే తన ఇంటి వద్ద ప్రత్యేక కార్యాలయంల ఏర్పాటు చేశానని దాని ద్వారా సేవలు పొందవచ్చునని ఓటర్లకు చెబుతున్నారు. ఎవరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని బాధపడవద్దని.. అందరికీ సమసన్యాయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొదించి దానిని అమలు చేయడానికే తాను సర్పంచ్ అభ్యర్ధిగా మీ ముందుకి వచ్చానని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. అన్నివర్గాల వారికి సమ న్యాయం చేసేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్ధులను 10 వార్డుల్లో నిలబెట్టామని వారే వార్డులోని సమస్యలు తన ద్రుష్టికి తీసుకు వస్తారని, ఆ వెంటనే తాను పరిష్కరించి మీ అందరికీ సేవచేసుకుంటానని చెబుతున్నారు. ఎన్నికల్లో అంతా మాటలు చెబుతారని కానీ తాను గ్రామం రూపు రేఖలు మార్చి చూపించడానికే లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదులుకొని మీకు సేవలు చేయడానికే వచ్చానని తెలియజేస్తున్నారు. గ్రామంలో రాజకీయం చేయడానికి తాను ఈసారి సర్పంచ్ గా నిలబడటం లేదని, కేవలం గ్రామాభివ్రుద్ధే లక్ష్యం చేసుకొని మీ అందరి సహకారం ఆశీర్వాదం కోరుతున్నానని ఓటర్లను అభ్యర్ధిస్తూ ముందుకి సాగుతున్నారు. ఈ ప్రచారం కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు పందిరి వెంకటరమణ(బుజ్జి), అన్ని వార్డుల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టిడిపి నాయకులు విస్త్రుత ప్రరాచం చేపట్టారు. శనివారం ఇంటింటికి వెళ్లీ ఉదయం 8, 12 వార్డుల్లోని వారిని కలిశారు. అనంతరం సాయంత్రం 14, 9 వార్డుల్లోని వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించారు. టిడిపి అధికారంలో వున్నప్పుడు చేసిన అభివ్రుద్ధిని ప్రజలు మరిచిపోకూడదని తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి రాజు అభ్యర్ధి తరపున ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రజలన ఓట్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో దుబాసి రమేష్, మురుకుర్తి గణేష్, కర్రి శ్రీనివాసరావు, తాడేల సంతోష్, గాలి దివాణం,తాడేల సూరన్న, భీమరశెట్టి శ్రీనివాసరావు, మద్దాల లక్ష్మణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీకి సర్పంచ్ బరిలో వున్న పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు)కి గ్రామస్తుల నుంచి విశేషంగా ఆదరణ లభిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాతూరు కాలనీ ప్రాంతంలోని అన్ని వర్గాల వారిని కలిసి ఓట్లను అభ్యర్ధించారు. ఈ మేరకు శనివారం గ్రామంలోని ప్రతీ ఒక్క ఓటరు దగ్గరకి వెళ్లి గ్రామాభివ్రుద్ధికి సహకరించాలని కోరారు. అందరూ ఏకమై ఒక్కట్టిగా నిలిస్తే గ్రామాన్ని జిల్లాలోనే మంచి గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పాడుతుందని అన్నారు. అన్నివర్గాల వారికి సమ న్యాయం చేసేవిధంగా వార్డు మెంబర్లుగా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్ధులను 10 వార్డుల్లో నిలబెట్టామని చెప్పరు. వార్డు సభ్యులను గ్రామస్తులకి పరిచేయం చేస్తూ, వార్డు అభివ్రుద్ధికి తాము ఏం చేస్తామో కూడా గ్రామస్తులకు వివరించారు. తాను మాటల మనిషిని కాదని, గ్రామ రూపు రేఖలు మార్చి చూపిస్తానని ప్రజలకు తన ఆలోచనలను వివరించారు. పుట్టి పెరిగిన గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివ్రుద్ధి చేయడానికే ఈసారి తాను సర్పంచ్ గా పోటీలో నిలబడ్డానని, పెద్ద మనసుతో మీ ఇంటి అన్నగా, తమ్ముడిగా బావించి తనను గెలిపించాలని గ్రామస్తులను పేరు పేరునా కోరారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకి సాగారు. ఈ ప్రచారం కార్యక్రమంలో ఆర్ఎంపీ వైద్యుడు పందిరి వెంకటరమణ(బుజ్జి), అన్ని వార్డుల నుంచి అధిక సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ముందుగా ఆన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ నెల 13న గ్రామ పంచాయితీ పోలింగ్ కు సంబందించి శనివారం పార్వతీపురం నియోజక వర్గం, బలిజిపేట మండలం, గంగాడ, బర్లీ గ్రామ పంచాయతీలలో గంగాడ, బర్లీ గ్రామాల్లో ఎం.పి.పి స్కూల్ లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి కూర్మనాథ్ పరిశీలించారు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఎం.పి.డి.ఓ కి సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగు నీరు, విద్యుత్, స్టేషనరీ, విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు సౌకర్యాలు, ఫర్నిచర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ననుసరిస్తు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో బలిజిపేట ఎం.పి.డి.ఓ , తహశీల్దార్, సెక్రెటరీ, విఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరిస్తూ విధులు నిర్వహించాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి, పార్వతీపురం నియోజక వర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్లో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కు సంబంధించి పార్వతీపురం నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేక అధికారి శనివారం సీతానగరం మండలం ఎం.పి.డి.ఓ కార్యాలయం సందర్శించారు. ముందుగా ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికలకు సంబందించి సీతానగరం మండలంలో 312 పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయవలసిన బ్యాలెట్ బాక్స్ లు, ఇతర ఎన్నికల సామాగ్రి పరిశీలించారు. ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించి ప్రశాంతంగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం తహశీల్దార్, ఎం.పి.డి.ఓ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలకు అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో పర్యటక శాఖ అతిథిగృహంలో ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తదితరులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్.. జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్‌టీసీ, అగ్నిమాపక, మునిసిపల్, వైద్య, ఆరోగ్య తదితర శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికను ఆయా శాఖల అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 19వ తేదీన రథ సప్తమి రోజున సూర్య వాహనంపై గ్రామోత్సవం, ధూప సేవ, ముద్రికాలంకరణ, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం కార్యక్రమాలతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా చివరి రోజున 28వ తేదీన పుష్పక వాహనంపై గ్రామోత్సవం, హంస వాహనంపై తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఏటా జరిగే కల్యాణ మహోత్సవాలకు చేసే ఏర్పాట్లకు అదనంగా ఈసారి కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, విధి నిర్వహణలో ఉన్నఅధికారులు, సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. అవసరం మేరకు మాస్కులు, శానిటైజర్లు వంటి సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ఎన్నికలకు సమాంతరంగా స్వామివారి కల్యాణ ఉత్సవ పనులు చూడాల్సి ఉన్నందున సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని.. అవసరం మేరకు కాకినాడ, పెద్దాపురం డివిజన్ల నుంచి అధికారులకు డిప్యుటేషన్‌పై విధులు కేటాయించాలని సూచించారు. ఈ నెల 19న జరిగే కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి అంతర్వేది వచ్చే అవకాశమున్నందున సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అంతర్వేది చేరుకునేందుకు 130 ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులతో పాటు వివిధ వాహనాల పార్కింగ్‌కు సౌకర్యాలు కల్పించాలన్నారు. కొత్తగా తయారుచేసిన స్వామివారి రథం ఫిట్‌నెస్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ శాంతిభద్రతలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశం తర్వాత కలెక్టర్, ఎస్‌పీ, డిప్యూటీ కలెక్టర్.. ఇతర అధికారులతో కలిసి కొత్త రథాన్ని పరిశీలించారు. తుది దశ పనులపై ఆరా తీశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకున్నారు. తర్వాత స్థానిక రెవెన్యూ అతిథిగృహంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కేన్‌వీడీ ప్రసాద్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ అధికారి యర్రంశెట్టి భద్రాజీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కేవీఎస్ గౌరీశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలోని రావికమతం మండలం కొత్తకోట, దొండపూడి, మేడివాడ ,రావికమతం, చిన పాచిల గ్రామ పంచాయితీలు, కోటవురట్ల మండలం జల్లూరు , కోటవురట్ల , కైలాసపట్నం గ్రామ పంచాయతీలలో నామినేషన్, పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ను శుక్రవారం నర్సీపట్నం డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధారిటీ, మరియు సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఆయా కేంద్రాలలో జరుగుతున్న నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి తగిన సూచనలను జారీచేశారు. ఆనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నేడు శుక్రవారం (5వ తేదీ)నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ( స్క్రూటినీ) ముగిసిందన్నారు. 6 వ తేదీ నామినేషన్ పత్రాలఅభ్యంతరాల/తిరస్కరణ పరిశీలన(అబ్జెక్షన్స్), 7 వ తేదీ తుది నిర్ణయం (డిస్పోసల్ అప్పీల్స్), 8 వ తేదీ నామినేషన్ల ఉప సంహరణ (విత్ డ్రాయల్స్) సాయంత్రం 3గం. లతో ముగుస్తాయన్నారు.వెంటనే అదే రోజు ఎన్నికల బరి లో నిలబడే అభ్యర్థుల తుది జాబితా మరియూ గుర్తులను కేటాయించడం జరుగుతుందన్నారు. నామినేషన్ పత్రాల అభ్యంతరాలకు సంబంధించి అభ్యర్థులు సబ్ కలెక్టరు కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. 13 వ తేదీ శనివారం నర్సీపట్నం డివిజన్ పది మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. పోలింగ్ ఉదయం 6.30 నిమిషాల నుండి సాయంత్రం 3.30 ని.ల వరకూ జరుగుతుందన్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అదే విధంగా నామినేషన్ వేసిన అభ్యర్దులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు చేయాలన్నా సబ్ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు...7731803255, 8465013255 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవాలన్నారు. పర్యటనలో సంబంధిత మండల ఎంపీడీవో లు, తాసిల్దార్ లు, రిటర్నింగ్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా గొలుగొండ మండంలోని క్రిష్ణదేవిపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ప్రస్తుతం జిల్లాలోనే హాట్ టాపిక్ గా నిలుస్తోంది. పాతూరుగా పిలవబడే క్రిష్ణదేవిపేట గ్రామంలోని 1520 ఓటర్లు ఉన్నఈ పంచాయతీలో సర్పంచ్ సీటు కోసం ఏకంగా నలుగురు అభ్యర్ధులు బరిలో పోటీకి నిలబటం చర్చనీయాంశం అవుతుంది. అందులో అధికార పార్టీ నుంచే ముగ్గు అభ్యర్ధులు నిలుచోగా.. ఒకరు పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నిలబడుతున్నానని అందరికంటే ముందుగానే మీడియా ద్వారా ప్రకటించుకున్నారు. ఇక టీడీపీ నుంచి ఒక అభ్యర్ధి బరిలో నిలబడ్డారు. ఈ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా నలుగురు వ్యక్తులు సర్పంచ్ గా పోటీకి బాహా బాహీ అనడం, ఎవరి మద్దతుదారులతో వారు నామినేషన్లు వేయడం కూడా చకా చకా జరిగిపోయింది. నలుగురు వ్యక్తులు మొత్తం 40 మంది వార్డు సభ్యులను రంగంలోకి దించారు. ఎవరి స్థాయిలో వారి వారి బలాన్ని నిరూపించుకోవడానికి అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై మన్యం పితూరి ఉద్యమం నడిపిన పోరాటాల పురిటిగడ్డ క్రిష్ణదేవిపేటను వేదికగా చేసుకున్నారు. కుల, మత, సామాజిక, రాజకీయ పైరవీలకు తెరతీసి ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సిద్దమవుతున్నారు. దీనితో క్రిష్ణదేవిపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నిక విషయంలో జిల్లాలోనే హాట్ హాట్ చర్చలకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ గ్రామంలో అభివ్రుద్ధికి ఏ మాత్రం నోచుకోదు కనీసం అల్లూరి సీతారామరాజు పాద దూళితో పునీతమైన ప్రదేశంగా కూడా నేతలు ఈ గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు..దీనితో ఈ ప్రాంతాన్ని ఎవరు అభివ్రుద్ధి చేస్తారో వారికే తమ మద్దతు ఇస్తామని యువత, మహిళలు, ఇతరులంతా ఏకమై బరిలో నిలబడిన అభ్యర్ధులకు మొహం మీదే చెబుతున్నారు. నలుగురు అభ్యర్ధులకూ సామాజికంగా మంచి ఓటు బ్యాంక్ వుంది. దీనితో బరిలో నిలబడ్డవారిలో ఎవరికి 500 ఓట్లు దాటితే వారు ఈ పంచాయతీ పోరులో సర్పంచ్ సీటులో ఆశీనులవడానికి ఆస్కారం వుంటుంది. గ్రామంలో ఉన్న 1520 ఓట్లలో సుమారు 150 ఓట్ల వరకూ గ్రామం నుంచి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. మిగిలిన ఓట్లన్నీ పూర్తిస్థాయిలో పోలైతే అనుకున్న మేజిక్ ఫిగర్ తో సర్పంచ్ సీటు కైవసం చేసుకోవడానికి ఆస్కారం వుంటుంది. ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వెళ్లిన వారంతా తిరిగి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక పోతే గ్రామంలో అధికంగా వున్న మహిళలు, పెద్దవారు ఓట్లను రాబట్టుకోవడంలో అభ్యర్ధులు పోటీ పడాల్సి వుంటుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అభ్యర్ధులు బరిలో నిలవడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పంచాయతీ ఎన్నికలకు ఈ గ్రామం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులోనూ పార్టీగుర్తుతో కాకుండా ఇతర గుర్తులతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఆశావాహులను పెద్దలు, పార్టీల నేతలు బుజ్జగించాలని చూసినా ఎవరికి వారు, నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఒక చిన్న పంచాయతీలో ఏకంగా నలుగురు అభ్యర్ధులు ఒక సర్పంచ్ సీటు కోసం ఎన్నికల్లో తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి దిగడం విశ్లేషకులకు సైతం పూర్తి పనిచెప్పిటనట్టు అయ్యింది. అయితే అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు జరిగిన తరువాత మరోసారి సీన్ మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈలోగా పంచాయతీపోరుకి సిద్ధ పడిన వారంతా ఎవరిస్థాయిలో వారు ఓటర్లును బుజ్జగించో, బతిమాలో, ప్రలోభాలకు గురిచేసో లేదంటే ఏకంగా బెదిరించో ఓట్లు రాబట్టు కోవాల్సి వుంటుంది. అభ్యర్ధులకు గుర్తులు కేటాయించిన తరువాత, ఎలక్షన్ రోజు ముందు వరకూ పైరవీలు కొనసాగినా ఎలక్షన్ రోజు మాత్రం ఓటర్లు ఎవరికి గట్టిగా గుద్దారనే విషయం తేలుతుంది. క్రిష్ణదేవిపేట పంచాయతీల పోరులో ఆ నలగురిలో ఎవరు సర్పంచ్ సీటుపై ఆశీనులవుతారనేది వేచి చూడాల్సి వుంది..!
లక్షల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదులుకొని తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవచేయడానికి సర్పంచ్ అభ్యర్ధిగా క్రిష్ణదేవిపేట పంచాయతీ బరిలో నిలిచిన పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్)కి గ్రామంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గ్రామంలోని ఏవీధిలోకి వెళ్లినా హారతులు పడుతూ ఘనంగా స్వాగతం చెబుతున్నారు. గురువారం నామినేషన్ల సందర్భంగా పాతూరు గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో అత్యధిక సంఖ్యలో అభిమానులు, వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, మహిళలు, మద్దతు దారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా మహిళలు హారతులు ఇచ్చి, పూలవర్షం కురిపించారు. మాకోసం, మన గ్రామం కోసం వచ్చిన నీవెంటే తామంతా జతకట్టి నడుస్తామంటూ జేజేలు పలికారు. గ్రామంలోని అన్నివీధులు ర్యాలీగా తిరిగి అనంతరం భారీ ఆటో కాన్వాయ్, బైకులతో ర్యాలీగా వెళ్లి ఏజెన్సీ లక్ష్మీపురంలో వార్డు సభ్యులతోపాటు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సత్యన్నారాయణ(సత్యంనాయుడు) మీడియాతో మాట్లాడుతూ, తనను కనీపెంచిన తల్లిదండ్రులు, ప్రేమాభిమానాలు చూపించే గ్రామస్తుల రుణం తీర్చుకోవడానికే తాను ఈసారి సర్పంచ్ అభ్యర్ధిగా బరిలోకి దిగానన్నారు. గ్రామాభివ్రుద్ధే లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనకు ఆకర్షితుడనై తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలి సొంత గ్రామానికి వచ్చినట్టు చెప్పారు. తనపై పాతూరు గ్రామస్తులు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎన్నడూ మరిచిపోలేనని వారందరికీ తనవంతు సహకారం అందిస్తానని, జీవితాంతం సేవలు చేసుకుంటానని చెప్పారు. ఏ నమ్మకంతో అయితే తనను సర్పంచ్ అభ్యర్ధిగా బలపరిచారో ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా గ్రామానికి, ప్రజలకు సేవచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖజిల్లా గొలుగొండ మండలంలోని క్రిష్ణదేవిపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా పందిరి సత్యన్నారాయణ(సత్యన్నాయుడు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్) గురువారం అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సభ్యులు, యువత, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,తన దారులతో కలిసి పెద్ద ర్యాలీగా వెళ్లి ఏఎల్ పురంలోని పంచాయతీ కార్యాలయంలో తన నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నడూ లేనివిధంగా సరికొత్తగా సర్పంచ్ అభ్యర్ధి నామినేషన్ ప్రక్రియకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యన్నాయుడు తెరతీశారు. క్రిష్ణదేవిపేట(పాతూరు) నుంచి ఆటోలు, బైకులు, కార్లతో వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై మన్యం పితూరి తిరుగుబాటు జరిపిన పోరుగడ్డ క్రిష్ణదేవిపేట పంచాయతీకి సర్పంచ్ అభ్యర్ధిగా నామినేషన్ వేసినట్టు చెప్పారు. తన గ్రామం అభివ్రుద్ధి, ఈ ప్రాంతానికి తన జీవితం అంకితం చేయాలనే లక్ష్యంతో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఏమీకాకుండా వదిలి వచ్చానని స్పష్టం చేశారు. గ్రామాభివ్రుద్ధికే తన తొలిప్రాధాన్యత ఇస్తానని, యువత రాజకీయాల్లోకి రావాలనే దివంగత మహానేత వైఎస్సార్ మాలను స్పూర్తిగా తీసుకొని కదన రంగంలోకి అడుగు పెట్టానని అన్నారు. తన రాజకీయ అరంగట్రానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లు ప్రేరణ అని కూడా చెప్పారు. అంతకుముందు గ్రామ దేవతలకు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతు దారులు మాజీ సర్పంచ్ పందిరి అప్పారావు, పందిరిరామారావు, ఆర్ఎంపీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ ఎం.హరినారాయణన్ గారిని అధికారులు కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సంధర్భంగా నూతన కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఎ.సి)గా విధులు నిర్వహించిన జాయింట్ కలెక్టరైన (రెవెన్యూ) డి.మార్కండేయులు, జిల్లా పంచాయతీ అధికారి, ఎన్నికల అధికారులతో చర్చించి ఎన్నికల నియమావళిని పాటిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి మేలుచేసే విధంగా పరిపాలన సాగిస్తానన్నారు. ప్రతి ఐ.ఎ.ఎస్ అధికారి సర్వీసులోకి వచ్చేటప్పుడు పారదర్శకమైన పరిపాలనతో ప్రజలకు మేలుచేయాలనే లక్ష్యంతోనే రావడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వ పధకాల అమలు మరియు పర్యవేక్షణ కొరకు నాకు ఈ అవకాశం కల్పించడం జరిగిందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రజలకు సేవలను అందించే విధంగా పారదర్శకంగా పరిపాలన కొరకు చర్యలు తీసుకుంటానన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలో పోలింగ్, నామినేషన్ సెంటర్లను బుధవారం నర్సీపట్నం డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆధారిటీ ఆఫీసర్,సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య ఆకస్మిక తనిఖీ చేశారు. రెండవ విడత (2వ తేదీ నుండి 4వతేదీ) పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎస్ రాయవరం మండలం పెద్ద గుమ్ములూరు, నక్కపల్లి మండలం వెంపాడు, పాయకరావుపేట మండలం నామవరం, నాతవరం మండలం గన్నవరం, మన్యపు రాట్ల గ్రామ పంచాయితీ ల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి , అక్కడ నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది తో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని అనుసరిస్తూ సిబ్బంది ఒకరినొకరు సమన్వయంతో పనిచేయాలన్నారు .
అనంతరం సబ్ కలెక్టర్ ఆయా మండలాల లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ నామినేషన్ లు దాఖలు చేసే అభ్యర్దులు 4వతేదీ ఆఖరి రోజనీ కానీ అభ్యర్ధులు వారి నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి రోజు ఆఖరి నిముషం 5గంల వరకూ ఆలస్యం చేయకుండా వీలైనంత వేగంగా నామినేషన్లను దాఖలు చేయాలని సూచించారు.
అదే విధంగా అభ్యర్దులు ఎటువంటి ఒత్తిడులకు, భయాందోళనకు గురికావద్దని ధైర్యంగా నామినేషన్లను దాఖలు చేయాలన్నారు . ఎక్కడ ఎటువంటి సమస్య ఎదురైనా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కి సంబంధించి ఎటువంటి సందేహం వచ్చినా, ఫిర్యాదు చేయాలన్నా సబ్ కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్లు... 7731803255, 8465013255 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలను నివృత్తి చేసుకోవాలన్నారు. పర్యటనలో సంబంధిత మండల ఎంపీడీవో లు, తాసిల్దార్ లు, రిటర్నింగ్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.