గిరిజన సమస్యలను ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ పేర్కొన్నారు. ఆయన ఏజెన్సీ పర్యటన లో భాగంగా బుధవారం చింతపల్లి మండలం లంబసింగి గ్రామ సచివాలయంలో కాఫీ రైతులు, గ్రామస్థులు తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు సాగుచేస్తున్న పంటలు మార్కెట్ సదుపాయాలు ఆడిగితెలుసుకున్నారు. కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పర్యాటకుల వలన ఎదురౌవుతున్న సమస్యలు గ్రామస్థులు వివరించారు. లంబసింగి గ్రామం నుంచి చేరువులవేనం గ్రామానికి రోడ్ నిర్మించాలని గ్రామస్తులు చైర్మన్ దృష్టి కి తేగా వెంటనే ఐటీడీఏ పి.ఓ గారితో ఫోన్ లో మాట్లాడి రోడ్ నిర్మించాలని కోరగా పిఓ సానుకూలంగా స్పందించారు. దుస్టుబిన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. పర్యాటక రంగంలో గిరిజన యువతకు శిక్షణ ఇప్పించాలని స్వయం ఉపాధి కల్పించాలని గిరిజన యువకులు కోరారు. సి ఎం దృష్టి కి తీసుకుని వెళతాను అన్నారు. గిరిజన యువత జర్నలిజం రంగంలోకి రావాలని చైర్మన్ పిలుపునిచ్చారు. దానికి అవసరమైన ఏర్పాట్లు, ఫీజుల అకాడమీ చెల్లిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు ,తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపిడివో ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు
తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 150 ఎకరాల్లో వరి పంట నీట మునగిపోయిందని వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాలను ప్రాధమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. ఇందులో 90 ఎకరాల్లో వరి నేలకొరిగిందన్నారు. అదే విధంగా 110 ఎకరాల్లో పత్తి నీటమునిగందని వివరించారు. వర్షాలకు నీట మునిగిన పంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై నేరుగా పంటపొలాల వద్దే రైతులకు వివరిస్తున్నట్టు చెప్పారు. వరి, పత్తి పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సేకరించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే నివేదించామన్నారు. అనంతరం వరదలు తగ్గిన తరువాత పంట పరిస్థితిని నేరుగా పరిశీలించనున్నట్టు వ్యవసాయాధికారి మీడియా వివరించారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉండాలని రాష్ట్ర నరేగా డైరెక్టర్ చినతాతయ్య అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాల విజిలెన్స్ అధికారులతో , హెచ్ ఆర్ లతో డైరెక్టర్, నరేగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ్ కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నరేగా డైరెక్టర్ చినతాతయ్య వివరిస్తూ శాఖ సంబంధించి సిబ్బంది విషయంలో కొరత లేదని, నరేగా నిధులు ప్రక్క దారి పట్టకుండా అధికారులు దృష్టి పెట్టాలని అందులో పేదలకు కల్పించే పని దినాలు, రైతుల కోసం నిర్వహించే ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలని అన్నారు. జాబ్ కార్డుల మంజూరు, తరచూ అధికారుల సమావేశాలు, పనులు కల్పన, హాజరు పట్టికలకు సంబంధించిన వాటిలో ఖచ్చితత్వం, పారదర్శకత ఉండాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా నరేగా నిధుల నిర్వహణ చేయడానికి ప్రగతి నివేదికలను రూపొందించి అధికారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రధాన కార్యాలయ విజిలెన్స్ అధికారి మల్లిఖార్జున కు సూచించారు. శాఖలలో పనిచేసి సిబ్బంది తమ వంతు భాద్యతగా తమ పనిని చేయగలగాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నిర్వహించే సోషల్ ఆడిట్ విధానంలో మార్పు రావాలని, రైతు నీళ్ళు లేకనో, ఇతర పంటల కోసమో ఎండిపోయి , కోల్పోయిన ఉద్యాన పంటలుపై పాడైన 3 సంవత్సరాల తరువాత సోషల్ ఆడిట్ చేసి రైతు నుండి రికవరీ మంచిది కాదని సూచించారు. మనం వారికి మూడు సంవత్సరాల కాలం ఉద్యాన పామతల మొక్కల కాపాడటానికి మాత్రమే ఖర్చులు ఇస్తున్నామని, ఆతరువాత వర్షాభావ పరిస్థితులు, ఇతర కారాణాలు వల్ల ఎండిపోతే మనం వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఆలోచన చేసి సకాలంలో సోషల్ ఆడిట్ నిర్వహించ గలిగితే వాస్తవాలు ప్రజలకు/ రైతులకు/ అధికారులకు తెలుస్తాయని అన్నారు. నరేగాలో వేతన జీవుల సంక్షేమం ప్రధానం కావాలని అన్నారు. శాఖలోని ప్రతి అధికారికి జాబ్ చార్టు ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమీక్షకు ముందు విజిలెన్స్ కమీషనర్ మల్లి ఖార్జున జిల్లా విజిలెన్స్ అధికారుల పనితీరును పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. పెండింగ్ రికవరీలు, పెండింగ్ కేసులు పరిష్కారంపై దృష్టి పెట్టాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో పిడి డ్వామా చంద్రశేఖర్ , జిల్లా విజిలెన్స్ అధికారులు కడప రమణారెడ్డి, చిత్తూరు శివయ్య, నెల్లూరు వేంకటేశ్వరరావు, కర్నూలు అన్వర్ బేగం , హెచ్ ఆర్ లు పుష్ప, రవి కుమార్, ఆనంద కుమార్, విజయ కుమార్, శోబా రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత గిరిజనులకు సాగు హక్కు కల్పించిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని డిసిసిబి చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిలు స్పష్టం చేశారు. బుధవారం అడ్డతీగల మండలంలో 12 పంచాయతీల గిరిజనులకు మంజూరైన పట్టాలను గిరిజనులకు అందేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఎన్ని ప్రభుత్వాలు పాలించినా ఐటిడిఏల అభివ్రుద్ధి, ఆ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలటీ ఆసుపత్రులను నిర్మాణానికి పూనుకున్నది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహరెడ్డి మాత్రమేనన్నారు. రంపచోడవరం లో 50 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఇది పూర్తయితే ఈ ప్రాంత గిరిజనుల ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎపడమిక్ సీజన్ లో గిరిజనులు వింత వ్యాధులు, జ్వరాలతో మ్రుతిచెందేవారని అలాంటి ఘటనలు ఇక పునరావ్రుతం కాకుండా ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గిరిపుత్రు ఆరోగ్యాన్ని కాపాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎస్.రాయవరం గ్రామంలో పొలాల్లో కట్టిన ఇంటి కోసం(బొలిశెట్టి ముఖ్య అనుచరుడు, ఎల్లపు నాగు) వరహానది ఏటిగట్టుని పది అడుగుల మేర తవ్వేసిన ప్రబ్రుతులు దానిని అలాగే వదిలేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది పొంగి ప్రవహించడంతో గట్టు పూర్తిగా నానిపోయి బలహీనంగా మారింది. ఆ గట్టు ఏ మాత్రం డొల్ల పడినా వరహానది వరద నీరు మొత్తం ఎస్.రాయవరం గ్రామంతోపాటు చుట్టుప్రక్కలర మూడు గ్రామాలను ముంచేస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత్తోపట్టుకొని జీవివిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ కు చెందిన ప్రభుత్వ భూమిని అప్పనంగా తవ్వేసినా, అధికారు చూసి అలానే వదిలేశారు తప్పితే రానున్న ప్రమాదాన్ని పసిగట్టి కనీసం గట్టు పూడ్పించలేదంటూ గ్రామానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు, మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అధికారుల ద్వారా తెలుసుకున్న ఆక్రమణ దారులు వరహానది ఏటిగట్టు అవతల బాగాన్ని నీరు పోవడానికి తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గట్టు ఇవతల తవ్విగే గ్రామాలకు ప్రమాదం, గట్టు అవతల తవ్వితే పంట పొలాల మునక ఎటు చూసినా అధికారులు చేసిన తప్పు ఇప్పుడు ఎస్.రాయవరం గ్రామప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది నీరు గట్టుకి ఆనుకొని వున్న పొలాల్లోకి రావడతోపాటు అక్కడే వున్న ఒక ఇల్లూ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. అసలే వరహానది ఏటి ప్రవాహం అధికంగా వుండటంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా హడలిపోతున్నా, ఇరిగేషన్ అధికారులు, ఏటిగట్టును తవ్వినవారు ఏమీ పట్టనట్టు వ్యహరిస్తున్నారని సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. ఏటి గట్టు వాస్తవ పరిస్థితిని ఫోటోలు, వీడియోలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు..ఏటిగట్టు పూర్తిగా వరదనీటితో నానిపోయి డొల్లుగా మారడంతో ఎప్పుడు నది గట్టు నాని వరద ఊరిలోకి వచ్చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, సచివాలయాన్ని, పరిసరాలను ఎలాంటి చెత్తాచెదారం లేకుండా నిత్యం పరిశు భ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రిజిస్టర్ లను, ప్రభుత్వ పథకాల పోస్టర్లను, ఉద్యోగుల హాజరు పట్టికను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పెండింగ్ లేకుండా సచివాలయానికి వచ్చే సర్వీసులకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని, వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో రిజిస్టర్ లను సక్రమంగా మెయింటైన్ చేయాలని, ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళినా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీదారులతో బాధ్యతగా వ్యవహరించి వారికి అవసరమైన సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మునివేలు, డిజిటల్ అసిస్టెంట్ షమీర్, వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గ, మహిళా పోలీసు శిరీషా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీ స్త్రీలు, అపుడే పుట్టిన బిడ్డల నుంచి నెలల పిల్లల వయస్సు వున్నవారిని కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ సూచించారు. శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో 5నెలల పసిబిడ్డ కరోనా వైరస్ తో మ్రుతిచెందిన విషయాన్ని పిల్లల తల్లులు గుర్తుపెట్టుకోవాలన్నారు. వైరస్ ఎప్పుడు ఏ విధంగా ఎవరికి వస్తుందో తెలియకుండా ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది సలహాలు పాటించడంతోపాటు నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చే సమయంలోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే ఆరోగ్య సహాయకుల ద్వారా పేర్లు నమోదు చేసుకొని పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో ఉండి వైద్యం పొందేందుకు కూడా మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నట్టు డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ వివరించారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 'బాలికే భవిష్యత్తు' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జిల్లా,డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఒక రోజు కార్యాలయపు అధికారిగా బాలికకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ గా బాలిక బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ బాలిక కలెక్టర్ గా విధులు నిర్వహిస్తారనేది 10.30 వరకూ గానీ తెలియదు. జిల్లా అధికారులు జిల్లా అంతా జల్లెడ పట్టి కొందరు బాలికల పేర్లను జిల్లా కలెక్టర్ కి నివేదించారు. బాలికల్లో మంచి భవిష్యత్తుకు బాటలు వేయడానికి, స్పూర్తిదాయకంగా ఉండేందుకు కలెక్టర్ ఈ కార్యక్రమం చేపట్టం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కలెక్టర కార్యాలయంలోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బాలికలు ప్రధాన అధికారులుగా ఒక్కరోజు పనిచేసేలా చేయడం ఒక చారిత్రక అంశమే. కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం పట్ల విద్యార్ధినిల తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన యువతకు ప్రత్యేకించి ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ఎమ్మెస్ ఆఫీస్ పై ఇచ్చేందుకు దరఖాస్తు లు కోరుతున్నట్టు రంపచోడవరం ఐటిడిఏ పీవో ప్రవీణ్ ఆదిత్య శనివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం www.apssdc.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని పొంది దరఖాస్తులు నింపి సమర్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ జూమ్ లింక్ తో ఎమ్మెస్ ఆఫీస్ తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ తరగతులు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారని మొత్తం శిక్షణ కాలం 40 గంటలు ఉంటుందన్నారు. ఇందులో బేసిక కంప్యూటర్ ఫండమెంటల్స్ అర్హతగా గుర్తించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి గల గిరిజన యువత దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కొరకు సెల్ నెంబర్ 7989656834 లో సంప్రదించాలని పీఓ సూచించారు...
పాయకరావుపేట నియోజకవర్గంలో అంతా తీవ్రంగా చర్చించుకునే తేడా రాజకీయం జరుగుతోంది.. దళిత ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యావంతుడు, మచ్చలేని మంచి మనిషి ఎమ్మెల్యే గొల్లబాబూరావుని కార్యకర్తల సమావేశంలో వాడు, వీడూ అనేసి.. ఎమ్మెల్యే అవినీతి చిట్టా టైమొచ్చినట్టు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చేసి.. రాజైనా, రెడ్డైనా ఇంకెవరైనా నియోజవకర్గంలో మనల్ని కాదని పనిచేయడానికి బయపడేలా చేయాలని కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి మరీ నోటికొచ్చినట్టు మాట్లాడేసి.. ఆపై ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చాలా మంచి వ్యక్తి నాయకులు, కార్యకర్తలు కోపంలో నోటికొచ్చినట్టు మాట్లాడేసినా మంచి మనసుతో క్షమించేసి..దూరం చేసిన మనల్ని అన్నీ మరిచిపోయి దగ్గర చేసేకుంటారంటారనే వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని వాడూ, వీడు అని మాట్లాడాలంటే ఏ స్థాయి నాయకుడై ఉండాలో, ఎంత అవినీతి చేస్తే ఆ స్థాయిలో మాట్లాడాతారో అటు పార్టీలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ అందరూ గుర్తిస్తారు.. అలాంటిది ఒక సాధారణ ఎంపీటీసి అయిన బొలిశెట్టి ఎమ్మెల్యే గొల్లబాబూరావుతో పాటు, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూడా తన నోటికొచ్చినట్టు మాట్లాడిన కార్యకర్తల సమావేశం యొక్క ఆడియో, స్వయంగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు నియోజకవర్గంలోని అన్ని మండాల్లో తనకు అన్యాయం జరుగుతుందని, తన పనిని తనని చేసుకోనీయకుండా చాలా మంది అడ్డుపడుతున్నారని, ఎమ్మెల్యేని మించి వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చంటి విషయంలో ఎమ్మెల్యే కళ్లముందే తన్నుకున్న తరువాత, పార్టీ పరువుని ఏ స్థాయిలో చెడగొట్టాలో అంతా చెడగొట్టారు. ఆపై కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మనల్ని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులను వెంటేసుకొని పనులు చేయిస్తున్నారనే అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడేసిన బొలిశెట్టి గోవింద్...ఇపుడు అదే కార్యర్తల సమావేశంలో కొందరు బాకా నాయకులతో భజనలు చేయించి, మరీ క్షమాపణ రాగం అందుకోడంతో...పాయకరావుపేట నియోజకవర్గంలో తేడా రాజకీయం జరుగుతుందంటూ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏం అధికార ముందని నోటికొచ్చినట్టూ మాట్లాడి ఇపుడు మళ్లీ క్షమించాలని కోరితే ఎమ్మెల్యే కరిగిపోతే దానికంటే చండాలం మరొకటి వుండదంటూ చర్చకు తెరలేపారు పాయకరావుపేటలోని నియోజకవర్గ కార్యకర్తలు. పైగా ఎమ్మెల్యేకి, తనకి కావాలనే కొందరు దూరం పెంచారనే కొత్త పల్లవి కూడా అందుకోవడం ఎమ్మెల్యేను కావాలనే తక్కువ చేయాలని చూస్తున్నట్టు, ఎమ్మెల్యేను బలంగా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో దెబ్బకొట్టిన వారిని దూరం పెట్టి ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే. దూరంపెట్టి ఎలాంటి పనులు కాకుండా చేసిన ఎమ్మెల్యేను మళ్లీ బుజ్జగించి, అన్నమాటలన్నీ ఉత్తుత్తివే అన్నట్టు చేయాలని చూస్తున్న రాజకీయం పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ కేడర్ ను అబాసు పాలు చేసేలా వుందనేది తేటతెల్లమవుతుంది. అటు పార్టీ అధిష్టానం సైతం ఎంపీటీసి లాంటి వ్యక్తులను ఆ స్థాయికే పరిమితం చేయాలి తప్పితే.. అంతకంటే ఎక్కువ చనువు ఇస్తే ఇలానే వుంటుందని కూడా మాటలు అనిపించుకున్నట్టు పాయకరావుపేటలోనూ, పార్టీలో తీవ్రస్థాయిలోనే ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో బొలిశెట్టిని క్షమించేసి, మళ్లీ నువ్వే ఎస్.రాయవరంలో నాయకుడిగా ఉండాలని చెబితే పరిస్థితి ఎలా వుంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇంత రచ్చ జరిగి, ఎమ్మెల్యేని అందరూ అడిగేలా, వాడూ వీడు అన్నవ్యక్తి చాలా మంచివాడిగా క్రియేట్ చేయాలని చూస్తున్న బాజా కార్యకర్తల మాటలు ఎమ్మెల్యే నమ్ముతారా, లేదంటే నిజంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కోసం ఎమ్మెల్యే చూస్తున్నారా అనే విషయంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి వుంది.. నిజంగా ఎమ్మెల్యే మనసు మార్చుకుంటే అటు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోయడం, పార్టీని తక్కువ చేసి చూపడం ఖాయం. ఇప్పటికే ఆ దిశగా ప్రతిపక్షనేతలు ఎమ్మెల్యే తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. పాయకరావుపేట తేడా రాజకీయంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి..!
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యులతో ప్రతీనెలా 10వ తేదీన ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీసత్యన్నారాయణ సూచించారు. శుక్రవారం యాంటినెటల్ డే సందర్భంగా పీహెచ్సీలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు శరీరంలో రక్తనిల్వలు తగ్గకుండా మంచి బలవర్ధక ఆహారం తీసుకోవాలన్నారు. ఎవరికైనా రక్తం తక్కువగా ఉంటే ఆసుపత్రిలో ఇచ్చే ఫోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా మరీ అత్యవసరం అయిన గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోజ్ కూడా అందించండం జరుగుతుందన్నారు. అదేసమయంలో కరోనా నేపథ్యంలో వీరంతా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే అంశంపై కూడా ఆరోగ్య సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే ఆరోగ్య సహాయకుల ద్వారా పేర్లు నమోదు చేసుకొని పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో ఉండి వైద్యం పొందేందుకు కూడా మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నట్టు డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ వివరించారు. అంతకుముందు వారందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మూడు సచివాలయాలకు చెందిన ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు.
పాయకరావుపేట దళిత ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యావంతుడు సౌమ్యశీలి ఫెర్ ఫెక్ట్ లీడరైన గొల్ల బాబూరావుని నోటికొచ్చినట్టు వాడు, వీడు..అనడమేకాకుండా ఎంతటివాడైనా అంటూ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసీ బొలిశెట్టి గోవింద్ అదేకార్యకర్తల సమావేశంలో క్షమాపణ రాగం అందుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈలెక్కన చూస్తే అందితే జిత్తు...అందకపోతే కాళ్లూ పట్టుకోవడానికి బొలిశెట్టి ఎంతకైనా దిగజారతారనే విషయం అతని మాటలు అనుచరల ద్వారా మరోసారి శుక్రవారం తేటతెల్లమైపోయింది.. అంతకుముందు తన ప్రతీ పనికి అడ్డు పడుతున్నారంటూ.. తనని మించిన స్థాయిలో కొందరు వ్యవరహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే గొల్లబాబూరావు నియోజకవర్గం అంతా గొంతు చించుకుని మరీ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో బొలిశెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు మీడియా ముఖంగా వచ్చి రచ్చరచ్చ అయ్యి.. దాదాపు ఎమ్మెల్యే గొల్లబాబూరావు పరువుపోయినంత పనైంది. ఈ దశలో గొల్ల విషయాన్ని అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లడం, పార్టీ పరువుపోతుందని అలాంటి చోటాలను గ్రామస్థాయికే పరిమితం చేయాలి గానీ మరీ ఎక్కువ చనువు ఇచ్చేస్తే , ఇలానే నోటికొచ్చినట్టు చాన్సుతీసుకొని మాట్లాడతారని అధిష్టానం చెప్పి పంపేసిన నేపథ్యంలో..ఎమ్మెల్యే గొల్ల బొలిశెట్టి పూర్తిగా పక్కన పెట్టారు. అధికారిక కార్యక్రమాల్లో బొలిశెట్టి ఫోటో పెద్దది వేసుకొని, ఎమ్మెల్యే ఫోటో సాధారణ కార్యకర్తలా చిన్నది వేసి మరీ అవమానించడంతోపాటు, కార్యకర్తల ముందే పరువుపోయాల మాట్లాడిన వ్యక్తి.. నెల రోజుల్లో ప్లేటు ఫిరాయించి.. నేడు మళ్లీ క్షమాపణ రాగం పాడి ఆ ఆడియోను కావాలనే మీడియాకు అందేలా అందరికీ పంపారు. అంటే తప్పుజరిగింది.. క్షమించాలనే మాటను రచ్చ జరిగిన మీడియా ద్వారా చెప్పి, ఆతరువాత నేరుగా కార్యకర్తలతో వెళ్లి క్షమించాలని కోరనున్నట్టు అనుచరలతో బాకా కొట్టించిన ఆడియోను మీడియాకి రిలీజ్ చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు...ఈ నెలరోజుల కాలంలో బొలిశెట్టిని ఎమ్మెల్యే కాదంటే నియోజవర్గంలో పరిస్థితి ఏంటో బొలిశెట్టికి అద్దంలో కనబడినట్టు చాలా క్లియర్ గా అందరికీ తెలియజేయడంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయినా చెంపమీద కొట్టి..క్షమించమని అడిగితే ఎవరు క్షమించి పాత స్థానాన్ని కట్టబడతారనే వాదన కూడా పాయకరావుపేట నియోజకర్గంలో బలంగా వినిపిస్తోంది. అదే పరిస్థితిని నేడు పాయకరావుపేట నియోజవర్గంలో కూడా తలెత్తింది. ఎమ్మెల్యేలను కార్యకర్తల ముందు నానా మాటలు మాట్లాడి...ఇపుడు మళ్లీ ఎమ్మెల్యేని క్షమించాలని, ఏదో ఆవేశంలో తప్పు జరిగిందనే విషయాన్ని చెప్పడం ద్వారా మళ్లీ గొల్లను ప్రశన్నం చేసుకునే భజన మొదలు పెట్టాడు బొలిశెట్టి. బొలిశెట్టి క్షమాపలకు కరిగిపోతే ఎమ్మెల్యే గొల్లబాబూరావు పరును నిజంగానే పోతుందని గొల్ల నిజమైన అనుచరులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా బొలిశెట్టిని పక్కన పెడితే బొలిశెట్టి భజన చేసేవారికి నియోజకవర్గంలో ఏ పనులూ కావడం లేదు ఈ క్రమంలో హై డ్రామాలకు మించిన డ్రామాలు పాయకరావుపేట నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల నేపథ్యంలో బొలిశెట్టి కార్యకర్తల మధ్య అన్న మాటలను ఎమ్మెల్యే తుడిచేసుకొని, పార్టీలోకి ఆహ్వానిస్తారా... లేదంటే అవసరాలకు తగ్గ రాజకీయం చేసేవాళ్లను పూర్తిగా పక్కన పెడతారా అనే విషయం తేలాల్సివుంది..