రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వివాహ వేడుకకు హాజరు కావాలంటే అవతలి వారు మంత్రో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, జాతీయస్థాయి వ్యాపారవేత్తో కావాలి.. ఆ స్థాయి వుంటేనే ముఖ్యమంత్రులు వారి ఇంట పళ్లివేడుకలకు హాజరవుతారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నది సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...తన కార్యాలయంలోని ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న బి.రవిప్రసాద్ వివాహానికి సతీసమేతంగా సీఎం వెళ్లి వధూవరులను ఆశీర్వదించి మరీ వచ్చారు. గురువారం ఆ సంఘటన చోటుచేసుకుంది. సీఎం ఒక సాధారాణ ఆఫీస్ బాయ్ పెళ్లికి వెళ్లారంటే ఆయన సింప్లిసిటీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చునంటూ అన్నిశాఖల ఐఏఎస్ లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, యావత్ రాష్ట్ర ప్రజలే చర్చించుకున్నారు. వాస్తవానికి సీఎం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, కార్యదర్శిలు, ప్రధాన కార్యదర్శిలకు సాధారణంగా సీఎంలు గానీ, మంత్రులుగాని ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి కార్యాలయంలో పనిచేసే అటెండరుకు కూడా ఇంత మర్యాదనిచ్చి పెళ్లికి వెళ్లి ఆశీర్వదించడం ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా రాజన్నా బిడ్డా మజాకానా..సీఎం హోదాలో ఉన్నా కార్యాలయంలో పనిచేసేవారం నావాళ్లే అనిభావించంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు సీఎం వైఎస్ జగన్..
పాయకరావుపేట నియోజకవర్గం లోని ప్రతిగ్రామంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పాయకరావుపేట ఎమ్మెల్యే ఏపి అసెంబ్లీ ఎస్ సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం సి.హెచ్.బి ఆగ్రహారంలో వాటర్ స్కీమ్ ను ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతీగ్రామానికి సురక్షిత మంచినీరు అందిచండం ద్వారా మహిళల మంచినీటి కష్టాలను తగ్గించడానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో మినరల్ వాటర్ ప్లాంట్ అంటూ బొమ్మచూపిన టిడిపి నేడు ప్రజల మంచినీటి కష్టాలు తీర్చలేకపోయిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అయినా శాస్వతంగా ఉండేలా సీఎం వైఎస్ జగన్ ఎంతో జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, రైతు భరోసా కేంద్రాలకు వీటిని అనుసంధానం చేయాలని తెలిపారు. కంప్యూటర్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, స్కానర్లు, నాణ్యత కిట్లు, పొట్టు తీసే పరికరాలు కొనుగోలు కేంద్రాలలో తప్పని సరిగా సమకూర్చుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి తప్పని సరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పరికాలన్నీ అందుబాటులో వుంచాలని తెలిపారు. రైతుల కళ్ళాల వద్దకు టెక్నికల్ సిబ్బంది వెళ్ళాలన్నారు. నాణ్యత పరీక్షలు టెక్నికల్ అసిస్టెంట్లు ట్యాబ్ ల ద్వారా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యావసాయ శాఖ, సివిల్ సప్లైలు సహకారంతో కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. రైతులు ఈ క్రాప్ నమోదు తప్పని సరిగా చేసుకోవాలన్నారు. రైతులకు లబ్ది చేకూర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జి.సి.సి. మేనేజరు జి.నరసింహులు, డి.ఆర్.డి.ఎ. ఎ.పిఎం.లు, మన్యదీపిక సి.ఇ.ఓ. కైలాస్ సాహు, వంశధార సి.ఇ.ఓ. బి.సుజాత, వర్షిణి సి.ఇ.ఓ. పి.రాంబాబు, నేచురల్ బాస్కెట్ సి.ఇ.ఓ. టి.మురళి, సునర్ణముఖి సి.ఇ.ఓ. ఎస్.తులసి పాల్గొన్నారు.
అనకాపల్లి నియోజకవర్గంలోని రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ఆర్అండ్ బి నుంచి జీవిఎంసీ అధీనంలో మార్పుచేయాలని కోరుతూ, ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి టి.క్రిష్ణబాబుకి వెలగపూడిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణాలకు నోచుకోకుండా ఉన్న అనకాపల్లిలోని రహదారులతోపాటు, నియోజవర్గ వ్యాప్తంగా మరమ్మతులకు గురైన రోడ్లను తక్షణమే బాగుచేయించాలని కోరినట్టు చెప్పారు. అదేవిధంగా మంత్రి బొత్స సత్యన్నారాయణ ను కూడా కలిసి వినతి పత్రం సమర్పించినట్టు ఎమ్మెల్యే వివరించారు. తన అభ్యర్ధన మేరకు ఇరువురు సానుకూలంగా స్పందించారని అన్నారు. అనకాపల్లి ప్రాంతం జీవిఎంసీలో కలిసిపోయినందున, రోడ్లు, భవనాల మరమ్మత్తులు జివిఎంసీలో కలిపివేయడం ద్వారా పనులు సత్వరమే పూర్తికావడానికి అవకాశం వుంటుందనే విషయాన్ని తెలిసియజేసినట్టు ఎమ్మెల్యే మీడియాకి వివరించారు. అటు మంత్రి బొత్స కూడా రోడ్ల అభివ్రుద్ధికి, మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని హామా ఇచ్చారని అన్నారు.
ప్రభుత్వ పశువైద్య శిబిరాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి టి.లావణ్య పిలుపునిచ్చారు. మంగళవారం శంఖవరం మండలం మండపం గ్రామంలో పశువైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మేకలు50గేదెలు ఆవులు 400గొర్రెలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, సీతాకాలం ప్రారంభంలో పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించి గ్రామసచివాలయ వెటర్నీ సహాయకుల ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే వైద్యసహాయం అందిస్తామని చెప్పారు. అదేసమయంలో మేకలు, ఆవులు, గేదెలకు పాడిరైతులు ఇన్స్యూరెన్సులు కూడా తప్పకుండా చేయించుకోవాలన్నారు. తద్వారా పశువులకు ఏం జరిగినా నష్టపరిహారం పొందడానికి అవకాశం వుంటుందన్నారు. గ్రామసచివాలయాల పశుసంవర్ధ సహాయకుల ద్వారా కూడా వైద్యసేవలు పొందవచ్చునన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన వీరి ద్వారా సేవలు పొందడానికి ఆయా గ్రామసచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ సహాయకులు సతీష్ , అనిల్ ,వాలంటీర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో గత కొంతకాలంగా సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న భీమసింగి ఫ్యాక్టరీ కార్మికులను జేసీ, ఇన్ఛార్జి కలెక్టర్ జీసి కిషోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో, కార్మికులతో సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడు నెలల నుంచి జీతాలు రాకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. చాలా మందికి రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై నాయకులతో మాట్లాడారు. జీతాలు, ఇతర బకాయల్ని త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జేసీ వాళ్లకు హామీ ఇచ్చారు. బకాయలన్నింటినీ 15 రోజుల్లో ప్రతి కార్మికుడికి అందించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. అలాగే అప్కాబ్ చైర్మన్ తో, డీసీసీబీ అధికారులతో మాట్లాడి రుణ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. కార్మికులకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు అండగా ఉంటారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. స్థానిక రెవెన్యూ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని మైనారిటీ విద్యార్ధులకు ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ స్కాలర్ షిప్ ల దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 30వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యం.అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని మైనారిటీలకు చెందిన ( ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బుద్ధులు, పార్శీకులు, సిక్కులు ) విద్యార్ధులు ఈ ఏడాది జాతీయ స్కాలర్ షిప్ కోసం అక్టోబర్ 31లోగా దరఖాస్తులను సమర్పించాలని గడువు విదించిన సంగతి అందరికి విదితమే. అయితే కరోనా నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు నవంబర్ మాసం నుండి ప్రారంభం కానున్నందున జాతీయ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు ఆమె ఆ ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని మైనారిటీలకు చెందిన విద్యార్ధులు ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కొరకు మైనారిటీ సంక్షేమ కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, విజయనగరం కార్యాలయాన్ని నేరుగా గాని లేదా 94904 98948, 82475 54334,94403 99588 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
దిశా చట్టం చేసిన తరువాత జరిగిన 390 ఘటనలలో 7రోజులలో దర్యాప్తు పూర్తి చేసామని , 108 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గాజువాక మండలం చినగంట్యాడ గ్రామం సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని సోమవారం నాడు ఉన్నతాధికారులతో కలసి మంత్రి పరామర్శించారు. రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును వరలక్ష్మీ తల్లిదండ్రులు పద్మ ప్రియ, పి.సత్య గురునాథ్ లకు హోంమంత్రి, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ , గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించి తక్షణం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశా చట్టం స్పూర్తితో 7రోజులలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామని అన్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని, నిందితుని తండ్రి ఇతర కుటుంబ సభ్యుల పై బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరులో చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితునికి 7 నెలలలోనే ఉరిశిక్ష ఖరారు అయిందని తెలిపారు. విజయవాడలో చిన్నారి పాపను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో 4 నెలలలో నిందితునికి ఉరిశిక్ష పడిందని అన్నారు. 3,4 సంవత్సరాల వయస్సు గల చిన్న పిల్లలపై కూడా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, తెలిసిన వాళ్లే ఈ విధంగా పూనుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన పరిస్థితి అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా వుండడానికి పౌరులు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలని కోరారు సమాజంలో మార్పులు వస్తున్న క్రమంలో, ఆడా మగా సమానమని స్నేహ భావంతో మెలుగుతున్నప్పుడు, కొంతమంది ఈ విధమైన ఉన్మాధ చర్యలకు పూనుకోవడం బాధాకరమని అన్నారు.యుక్త వయస్సు వచ్చిన పిల్లలకు తల్లిదండ్రులు భద్రత గురించి తెలియజేయాలని కోరారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు ఆడపిల్లలతో ఏ విధంగా ప్రవర్తించాలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వుందని అన్నారు. చట్టాలపై మగ పిల్లలకు ఆడ పిల్లలకు అవగాహన కలిగించడానికి తగు చర్యలు చేపడతామన్నారు.ప్రతి విద్యార్థిని దిశ యాప్, ఎ.పి.పోలీస్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు
యుక్త వయస్సు వచ్చిన ఆడ పిల్లలు బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా అల్లరి పెడితే, ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తే తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇలాంటి సంఘటనలలో పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మళ్లీ వాటికి పూనుకోకుండా హెచ్చరించ వలసిన అవసరం వుందన్నారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిశా చట్టం ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఎ.సి.పి.రామాంజనేయ రెడ్డి, ఆర్.డి.ఒ. పి.కిషోర్ , గాజువాక యం.ఆర్.ఒ. యం.వి.ఎస్.లోకేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భారతీయ జనతాపార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చి వివిధ పార్టీలకు చెందిన వారు బీజేపిలోకి వస్తున్నారని బీజేపి నాయకులు గవిరెడ్డి రఘు సత్య సింహా చక్రవర్తి అన్నారు. ఆదివారం విశాఖజిల్లా, మాకవరపాలెం మండలంలో తూటి పాల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన మద్దతుదారులు చిత్రాడ శ్రీను, పైల రవి, రొంగల గణేష్, కిలపర్తి శివ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ చక్రవర్తి కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యువత బీజేపి వైపు ఆకర్షితులు అవుతున్నారనడానికి ఈ చేరికలే సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మిరపల పద్మ, మండల ఉపాధ్యక్షుడు కుల్లయ్య, మండల కార్యదర్శి మర్రి నాయుడు, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చింతపల్లి పెంటయ్య, పాపయ్యపాలెం బూత్ కమిటీ అధ్యక్షులు ఎర్రా రామకృష్ణ, కామిరెడ్డి ప్రసాదు, కొల్లు రమేష్ బాబు, వజ్ర గడ బూత్ కమిటీ అధ్యక్షులు తమరాన అప్పలనాయుడు, బొడ్డు రామారావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహా మనిషి పొట్టి శ్రీరాములు అని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ, అనేక పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్బవించిందన్నారు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించాక ఏర్పడిన తరువాత తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమన్నారు. తెలుగు బాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది శ్రీ పొట్టి శ్రీరాములు వల్లనే నన్నారు. 1952 అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 15 అర్థరాత్రి మరణించే వరకు 58 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేశారని, ఫలితంగా జవహర్ లాల్ నెహ్రు నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దిగివచ్చి 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. అది అన్ని రాజ్యాంగ నియమాలను పూర్తిచేసుకొని 1అక్టోబర్ 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని బలమైన ప్రజల కోరికలకు అనుగుణంగా 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాజదానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆ తరువాత నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి పనిచేశారన్నారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో..ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి సుప్రజ , డి.యస్.పి లు యస్.బి గంగయ్య, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, దిశా పి.యస్ రామరాజు, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గాజువాక ఘటనపై సీరియస్‌గా స్పందించారు. నిందితుల్లో ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్‌ని ఆదేశించారు. బాధితురాలు వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సీఎస్‌లను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగడం వలన విద్యార్ధినిల తల్లిడండ్రుల్లో అభద్రతా భావం ఏర్పడుతందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా నింధితులను కఠినంగా శిక్షించడం ద్వారా బాధితురాలికి న్యాయం జరుగుతుందన్నారు. అదే సమయంలో అత్యవసర సమంయలో విద్యార్ధులకు శ్రీరామ రక్షగా వుండే దిశా యాప్‌ను విద్యార్ధినిలంతా డౌన్‌లోడ్ చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని డిజిపికి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసచివాలయాల్లోని మహిళా సంరక్షణా కార్యదర్శిల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర సమయాల్లో పోలీలసు ఆశ్రయించాలనే ఆలోచన వచ్చేలా అధికారులు విద్యార్ధినిలను చైతన్య పరచాలన్నారు..
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ద్వారా శ్రీవారి భక్తులకు ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ప్రసారాలను అందిస్తూ వస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా వున్న హిందీవారికి కోసం హిందీలో కూడా ప్రసారాలను చేయాలని టిటిడి భావిస్తుంది. ఈ క్రమంలో శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకి కూడా అధికంగానే విరాళాలు అందుతున్నాయి. దానికి అనుగుణంగానే శ్రీవారి సేవలన్నీ బక్తులకోసం చాలా వరకూ లైవ్ గానే అందిస్తుంది. ఒకప్పుడు సాధరాణంగా ఉంటే ఎస్వీబీసీ ప్రసారాలకి ఇపుడు దేశవ్యాప్తంగా భక్తుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఈతరుణంలోనే కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే సాయిక్రిష్ణ యచేంద్ర హయాంలో హిందిప్రసారాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
భారతదేశంలో బిసి వర్గాలకు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యం మరెవరూ ఇచ్చిన దాఖలాలు లేవని పాయకరావుపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం పాయకరావుపేట మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ లలో పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి ఆయా కార్పొరేషన్ లలో డైరెక్టర్లుగా నియమించడం అభినందనీయమన్నారు. అనంతరం వీరిని ఎమ్మెల్యే గొల్ల బాబురావు వైసీపీ శ్రేణులతో కలసి డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. రాజ్యాంగ పదవిలో ఉండి నిమ్మగడ్డ రమేషకుమార్ నిష్పక్షపాతంగా పని చేయడంలేదని, టీడీపీకి కొమ్ముకాసేవిధంగా ఆయన వ్యవహార శైలి ఉందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆరోపించారు. అంతకుముందు ఎమ్మెల్యే అధ్యక్షతన మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, నాలుగు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని నక్కపల్లి మండల విద్యార్ధుల కష్టాలు కొత్తగా మంజూరైన డిగ్రీ కాలేజీతో తీరనున్నాయని పాయకరావుపేట ఎమ్మెల్యే,అసెంబ్లీ ఎస్సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం పాయకరావుపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వై ఎస్ జగన్ అన్ని విధాల సహకరిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ మంజూరు అయ్యిందన్నారు. తద్వారా నియోజకవర్గంలోని విద్యార్ధులంతా ఇక డిగ్రీ చదువులు నక్కపల్లిలోనే చదువకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాధానం మిన్న అనే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తించి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్ధులకు అందుంతని చెప్పారు. నియోజకవర్గానికి డిగ్రీ కాలేజి కల ఎమ్మెల్యే గొల్ల బాబురావు కృషితో సాకారమైందని నాలుగు మండలాల్లోని నాయకులు ఎమ్మెల్యే గొల్ల బాబురావు ను నాలుగు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.