1 ENS Live Breaking News

ఎస్.రాయవరంలో ఘనంగా గౌరమ్మ ప్రతిష్ట..

విశాఖజిల్లాలోని ఎస్.రాయవరంలో శనివారం గౌరమ్మ వరిదుబ్బును గ్రామస్తులు ఘనంగా ప్రతిష్టించారు. గ్రామంలో పంటుల బాగా పంటలు పండాలని కోరుతూ, గౌరమ్మ ప్రతిష్టిస్తూ వస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్.రాయవరంలో గ్రామపెద్దలు గౌరమ్మపేరుతో వరిదుబ్బును ప్రతిష్టించారు. అమ్మవారి పేరుతో వరిదుబ్బుని తీసి వాటితోపాటు  గౌరీపరమేశ్వరుల విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. అమ్మవారిని మేళ తాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గౌరీ పరమేశ్వరుల ఆలయ చైర్మన్ భీమరశెట్టి రమణ అప్పారావు సహాయకులు భీమరశెట్టి నాగ సూరిబాబు, మద్దాల సత్తిబాబు, భీమరశెట్టి సత్యనారాయణ, భీశెట్టి నాయుడు,  కొణతాల కృష్ణ, మళ్ళ సత్తిబాబు, సోమిరెడ్డి రాజు, గాలి సత్యనారాయణ, కర్రి శ్రీను, భీమరశెట్టి శ్రీనివాసు గ్రామంలోని మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్.రాయవరం

2020-11-14 15:43:18

సిబ్బంది సమయపాలన పాటించాల్సిందే..

 ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సకాలంలో అందే విధంగా  సచివాలయాలు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎమ్. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గురువారం విశాఖజిల్లాలోని సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం, మొగలిపురం, గొట్టివాడ, ఆరిపాక గ్రామాలలో పర్యటించి సచివాలయ సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఎప్పుడు, ఎక్కడికి వెళ్లి సేవలు అందించినదీ మినిట్ బుక్ లో రాయాలన్నారు. అదే సమయంలో వివిధ సంక్షేమ పధకాలకు సంబంధించి జాబితాలు ప్రదర్శించాలన్నారు. సచివాలయాలలో ప్రదర్శిస్తున్న సిటిజన్ చార్ట్ ను, లబ్ధిదారుల జాబితాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన అర్హతలను అందరికీ తెలియ జేయాలన్నారు. గ్రామాలలో పారిశుద్ద్యం పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆరోగ్య కేంద్రాలు (వెల్ నెస్ సెంటర్స్), రైతు భరోసా కేంద్రాలను కూడా సందర్శించి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు.

సబ్బవరం

2020-11-12 22:14:13

బొక్కింది బయటకు కొస్తుందని డుమ్మాకొట్టారు..

రూ.లక్షలు అక్రమంగా బొక్కి..మిగిలినవి తను కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించుకున్నాడు ఇంకే గ్రామసభకు వస్తాడు.. బహుసా అధికారులే వెళ్లద్దొని ఉంటారు.. ప్రజల సొమ్ము అప్పనంగా మేసినోడు గ్రామసభకి వస్తే జనం కడిగేస్తారని సభకు రాకుండా దాక్కున్నాడు.. ఇంకా డేష్ డేష్ అంటూ తిట్ల దండకం..ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదు విశాఖజిల్లా, ఎస్.రాయవరం గ్రామస్తులు.. ఇదే గ్రామసచివాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులు దారిమళ్లించిన ఈఓపీఆర్డీ త్రిమూర్తులు గురువారం జరిగిన గ్రామసభకు డుమ్మా కొట్టారు. దీంతో గ్రామసభకు వచ్చిన వారంతా నోటికొచ్చిన అమ్మనా బూతులు తిడుతుంటే గ్రామసభ నిర్వహించిన సిబ్బంది అంతా వినలేక...విననట్టు నటించాల్సి వచ్చింది. త్రిమూర్తులతోపాటు, కార్యదర్శి డిఎస్వీ అపర్ణ ఇద్దరే కలిసి సుమారు రూ.10లక్షలు ప్రభుత్వ నిధులు తమ కుటుంబ సభ్యులకు ఖాతాలకు దారి మళ్ళించారు. ఈ విషయం ప్రభుత్వాధికారులకు తెలిసి విచారణ జరిపి వాస్తవాలు రాష్ట్ర అధికారులకు పంపించారు. అయితే నాటి నుంచి నేటి వరకూ గ్రామస్తులకు మొహం చాటేస్తున్న వీరు ఈరోజు జరిగిన గ్రామసభకు కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. నిధులు కాజేసిన విషయం ప్రజలకు తెలిసి మొత్తం ఒకేసారి తిరగబడాతరని గ్రహించే గ్రామసభకు గైర్హాజరయ్యారా అంటూ వచ్చిన సిబ్బందిని అడగటంతో వారంతా ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా ముక్తకంఠం కోరారు. ఇదే విషయాన్ని పదే పదే మీడియాకి తెలియజేయడం కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది..

ఎస్.రాయవరం

2020-11-12 22:02:24

రూ.15లక్షలు బొక్కేస్తే వేడుక చూస్తున్నారు..

ప్రభుత్వ సొమ్ము అప్పనంగా మీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించి నొక్కాలయానుందా..వాడని బ్లీచింగుకి, వినియోగించని ఫినాయిలుకు, అసలు చెత్త తుడవని చీపుర్లలన్నీ అయిపోయాయని దొంగబిల్లులు పెట్టాలనుందా..సచివాలయంలోకి అవసరమేయ్యే సామాగ్రిని పంపిణీ చేయడానికి సొంత కుటుంబ సభ్యులనే వ్యాపారస్తులను చేయాలనుందా...అయితే మీరు విశాఖజిల్లాలోని ఏదో మేజర్ పంచాయతీలోని గ్రామసచివాలయానికి బదిలీల చేయించుకుంటే సరి...ఇక్కడ అవినీతి జరిగినా, జరిగిన అవినీతి ఆధారాలతో బయట పడినా అధికారులు చర్యలు తీసుకోరు..విచారణ మాత్రం ఆగమేఘాలపై చేసేసి...చర్యలు తీసుకోవడంలో మాత్రం నీళ్లు నములుతారు... ఏంటి ఇంకా అర్థంకాలేదా...అక్రమార్కులను జిల్లాలో స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలోనే వెనుకేసుకు వస్తారన్నమాట...ఇదేదో కావాలని అంటున్న మాటలుకాదు ఎస్.రాయవరం మండలంలో (వై.త్రిమూర్తులు(కొరుప్రోలు), డిఎస్వీ అపర్ణ(గుడివా), ఎవివిఎస్.ప్రసాద్(కొత్తరేవుపోలవరం) జరిగిన అవినీతిపైనా, నగదును తమ కుటుంబ సభ్యులకు అడ్డదారిలో పంపిన వైనంపైనా నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారిణి అవినీతి జరిగిన సచివాలయాల్లో(14వ ఆర్థిక సంఘం నిధులు) పై విచారణ చేసి, జరిగిన వ్యవహారాన్ని ఆధారాలతో సైతం వెలికితీశారు(అంతకంటే ముందు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ఈ ముగ్గురు కార్యదర్శిలు చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు సేకరించి వార్తా కధనాలు అందిస్తూ వస్తుంది..ఇపుడు కూడా బ్యాంకు స్టేట్ మెంట్లు మొత్తం ఈఎన్ఎస్ వద్ద భద్రంగా ఉన్నాయి). ఆ విషయాన్ని నేరుగా జిల్లా పంచాయతీ అధికారిణి ద్వారా స్టేట్ కమిషనర్ కి పంపించామని చెప్పిన తరువాత నెలలు గడిచిపోతున్నాయి.. ఒక్క ఎస్.రాయవరం మండలమే కాదు, జిల్లాలో అనేక మండలాల్లో సచివాలయ కార్యదర్శిలుఈఓపీఆర్డీ స్థాయి సిబ్బంది కూడా అవినీతికి పాల్పడమే ఇందుకు నిదర్శనం. ఎస్.రాయవరం మండలంలో  ఆ ముగ్గురు సచివాలయ కార్యదర్శిలు సుమారు రూ.15 లక్షలు మొత్తాన్ని తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధులు మళ్లించేసిన విషయం డివిజనల్ పంచాయతీ అధికారి విచారణలో బయటపడినా నేటికీ  అవినీతికి పాల్పడ్డ కార్యదర్శిలపై నేటివరకూ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు మరి కొన్ని బిల్లులు ఇంకా మంజూరు కావాల్సివుంది.. అవికూడా మంజూరైతే అవినీతి మొత్తం మరింత పెరిగే అవకాశం వుంది. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిని ఈఎన్ఎస్ వివరణ కోరగా ఎస్.రాయవరం మండలంలో గ్రామసచివాలయ కార్యదర్శిలు(వై.త్రిమూర్తులు(కొరుప్రోలు), డిఎస్వీ అపర్ణ(గుడివా), ఎవివిఎస్.ప్రసాద్(కొత్తరేవుపోలవరం) అవినీతికి పాల్పడిన విషయంలో నర్సీపట్నం డిఎల్పీఓ విచారణ చేశారని ఆ విచారణ నివేదికను తదుపరి చర్యల నిమిత్తం కమిషనర్ కి పంపినట్టు డిపిఓ తెలియజేశారు.. అధికారులు నుంచి అవినీతి వాస్తవమని ఉత్తర్వులు రాగానే సంబంధింత కార్యదర్శిలు, ఈఓపీఆర్డీపై చర్యలు చేపడతామని చెప్పారు. అయితే రెండు నెలలు దాటుతున్నా నేటికీ సదరు కార్యదర్శిలపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతపెద్ద మొత్తంలో సచివాలయ సిబ్బంది ఇంత దారుణంగా అడ్డదారిలో ప్రభుత్వ నిధులు బొక్కేస్తే జిల్లా అధికారులు చర్యలు తీసుకునే విషయంలో కాలయాపన చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా కమిషనర్ కార్యాలయం స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారని కూడా సమాచారం. తాము అవినీతిచేసినా, వారిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రస్థాయిలో అధికారులను, జిల్లా స్థాయిలో తమ సంఘం నేతలపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది(ఎస్.రాయవరం సచివాలయం ఫోటో వేయడానికి కారణం కూడా లేకపోతేదు ఎవివిఎస్.ప్రసాద్ ప్రస్తుతం ఇక్కడే పనిచేస్తున్నారని)... ఎంతైనా అవినీతి వ్యవహారం కదా... చాలా మందే తోడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..ఎం జరుగుతుందో వేచిచూడాల్సిందే..!

s.rayavaram

2020-11-11 13:20:45

కేంద్రానికి వైఎస్సార్సీపీ, టీడిపి వత్తాసెందుకు..

రైతాంగం, కార్మికుల జీవితాలు దుర్బరం చేసే చర్యలు, దుర్మార్గపు చట్టాలను కేంద్రం తెస్తుంటే స్వప్రయోజనాలతో  మన రాష్ట్ర అధికార  వైఎస్ఆర్సీపీ , ప్రతిపక్ష టిడిపి వంత పాడుతున్నాయనీ సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్  బి. గంగారావు ఆరోపించారు. మంగళశారం విశాఖలోని సిపిఎం అక్కయ్యపాలెం జోన్ కమిటీ  ఆధ్వర్యంలో  ప్రజాచైతన్య యాత్ర  సీతంపేట జంక్షన్ నుంచి రాధాకృష్ణ గుడి,దళిత కాలనీ,80 ఫీట్ రోడ్డు, స్కీం ఇళ్ల కాలనీ, రాజేంద్ర నగర్ వరకూ నిర్వహఇంచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  కేంద్ర బిజెపి ప్రభుత్వం , ప్రత్యేక హోదా,రైల్వే జోన్ ఊసే ఎత్తడం  లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు  దాసోహమంటు ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే ప్రభుత్వ రంగ స్టీల్,రైల్వే,డిఫెన్స్ మరియు నౌకా,విమాన ,విద్యుత్ రంగాలను ప్రైవేటు వారికిచ్చి ప్రజల బ్రతుకులు ఫణంగా పెడుతున్నారనీ,  ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే సిపిఎం పార్టీ ఈవిధానాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నాడని,  ఈ నెల 26 న దేశవ్యాప్త సమ్మెకు ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంతకు ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి కరపత్రాలు పంచారు. ఈ ప్రచారంలో పార్టీ జోన్ కార్యదర్శి ఆర్పీ రాజు,ప్రదీప్,బాబ్జి,పోతునాయుడు,అప్పారావు,ఆదిలక్ష్మి ,సుందరి తదితరులు పాల్గొన్నారు.

Seethampeta

2020-11-10 18:05:12

అనంతకు ధీటుగా పంచాయితీల అభివ్రుద్ధి..

అనంతపురం నగరానికి దీటుగా నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎ.నారాయణపురం పంచాయతీలో మంగళవారం ‘జనం కోసం జనంలోకి’ కార్యక్రమం నిర్వహించారు. నారాయణపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత భువనేశ్వరనగర్, ఎస్సీ కాలనీ, వంక కొట్టాల, ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే అనంత తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఎంతో ఆప్యాయంగా వారిని పలుకరిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు సరిగా పని చేయడం లేదని గ్రహించిన ఎమ్మెల్యే అనంత.. ప్రజల పట్ల బాధ్యతగా మెలగకుంటే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి గడప వద్దకు చేర్చడానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామన్న విషయాన్ని సిబ్బంది, వాలంటీర్లు గుర్తుంచుకోవాలన్నారు. నారాయణపురం పంచాయతీలో ఇప్పటికే రూ.2.30 కోట్లతో కాలువలు, రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మరో రూ.8 కోట్లు కేటాయించామని, మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధికి కేవలం మాటలకే పరిమితం చేసిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. నారాయణపురం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, అనంతపురం రూరల్‌ పంచాయతీల్లో కాలువలు, రోడ్లు లేవన్న మాటే రాకుండా పనులు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేకంగా క్యాలంటర్‌ ప్రకటించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని చెప్పారు. అధిక వర్షాలతో వేరుశనగ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు.

ఎస్.నారాయణపురం

2020-11-10 17:50:24

గుమ్మరేగుల కార్యదర్శిగా ఆర్.నాగు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మళ్ళీ సచివాలయాల్లో గ్రేడ్ 4 కార్యదర్శుల నియామకాలను చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం గ్రామానికి చెందిన రాయి నాగు రౌతులపూడి మండలం గుమ్మరేగుల సచివాలయానికి గ్రేడ్ 4 కార్యదర్శిగా నియమితులు అయ్యారు.  గత సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల ఉద్యోగాలలో కూడా తను అన్నవరం  సచివాలయం 3 కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా గ్రేడ్ 4 కార్యదర్శిగా నియమితులు అయ్యారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కలిసి ఆయన ఆశీస్సులు తీసికున్నారు. తాను గుమ్మరేగుల సచివాలయం కార్యదర్శిగా నిధుల్లో చేరిన సందర్బంగా తను మీడియాతో మాట్లాడుతూ 'ప్రభుత్వం తనకు కేటాయించిన  విధులను బాధ్యత, నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు.

Sankhavaram

2020-11-09 18:47:41

ఆఫీస్ సబార్డినేట్ పెళ్లికి సీఎం సతీసమేతంగా..

రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వివాహ వేడుకకు హాజరు కావాలంటే అవతలి వారు మంత్రో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, జాతీయస్థాయి వ్యాపారవేత్తో  కావాలి.. ఆ స్థాయి వుంటేనే ముఖ్యమంత్రులు వారి ఇంట పళ్లివేడుకలకు హాజరవుతారు.. కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నది సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...తన కార్యాలయంలోని ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న బి.రవిప్రసాద్ వివాహానికి సతీసమేతంగా సీఎం వెళ్లి వధూవరులను ఆశీర్వదించి మరీ వచ్చారు. గురువారం ఆ సంఘటన చోటుచేసుకుంది. సీఎం ఒక సాధారాణ ఆఫీస్ బాయ్ పెళ్లికి వెళ్లారంటే ఆయన సింప్లిసిటీ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చునంటూ అన్నిశాఖల ఐఏఎస్ లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, యావత్ రాష్ట్ర ప్రజలే చర్చించుకున్నారు. వాస్తవానికి సీఎం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, కార్యదర్శిలు, ప్రధాన కార్యదర్శిలకు సాధారణంగా సీఎంలు గానీ, మంత్రులుగాని ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి కార్యాలయంలో పనిచేసే అటెండరుకు కూడా ఇంత మర్యాదనిచ్చి పెళ్లికి వెళ్లి ఆశీర్వదించడం ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా రాజన్నా బిడ్డా మజాకానా..సీఎం హోదాలో ఉన్నా కార్యాలయంలో పనిచేసేవారం నావాళ్లే అనిభావించంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు సీఎం వైఎస్ జగన్..

Velagapudi

2020-11-05 14:13:39

ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయిలు..

పాయకరావుపేట నియోజకవర్గం లోని ప్రతిగ్రామంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని  పాయకరావుపేట ఎమ్మెల్యే  ఏపి అసెంబ్లీ ఎస్ సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం సి.హెచ్.బి ఆగ్రహారంలో వాటర్ స్కీమ్ ను ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతీగ్రామానికి సురక్షిత మంచినీరు అందిచండం ద్వారా మహిళల మంచినీటి కష్టాలను తగ్గించడానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో మినరల్ వాటర్ ప్లాంట్ అంటూ బొమ్మచూపిన టిడిపి నేడు ప్రజల మంచినీటి కష్టాలు తీర్చలేకపోయిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అయినా శాస్వతంగా ఉండేలా సీఎం వైఎస్ జగన్ ఎంతో జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Nakkapalli

2020-11-04 17:05:00

20న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు.  బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, రైతు భరోసా కేంద్రాలకు వీటిని అనుసంధానం చేయాలని తెలిపారు.  కంప్యూటర్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు,  స్కానర్లు, నాణ్యత కిట్లు, పొట్టు తీసే  పరికరాలు కొనుగోలు కేంద్రాలలో తప్పని సరిగా సమకూర్చుకోవాలన్నారు.  ఈ నెల 15వ తేదీ నాటికి తప్పని సరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పరికాలన్నీ అందుబాటులో వుంచాలని తెలిపారు.  రైతుల కళ్ళాల వద్దకు టెక్నికల్ సిబ్బంది వెళ్ళాలన్నారు.  నాణ్యత పరీక్షలు టెక్నికల్ అసిస్టెంట్లు ట్యాబ్ ల ద్వారా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు  కేంద్రాలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు.  వ్యావసాయ శాఖ, సివిల్ సప్లైలు సహకారంతో కొనుగోలు  కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు.  రైతులు ఈ క్రాప్ నమోదు తప్పని సరిగా చేసుకోవాలన్నారు. రైతులకు లబ్ది చేకూర్చాలని తెలిపారు.   ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జి.సి.సి. మేనేజరు జి.నరసింహులు, డి.ఆర్.డి.ఎ. ఎ.పిఎం.లు,  మన్యదీపిక సి.ఇ.ఓ. కైలాస్ సాహు, వంశధార సి.ఇ.ఓ.  బి.సుజాత, వర్షిణి సి.ఇ.ఓ.  పి.రాంబాబు, నేచురల్ బాస్కెట్ సి.ఇ.ఓ. టి.మురళి, సునర్ణముఖి సి.ఇ.ఓ. ఎస్.తులసి పాల్గొన్నారు.              

2020-11-04 15:32:04

అనకాపల్లి రోడ్లు బాధ్యత జీవిఎంసీకి అప్పగించండి..

అనకాపల్లి నియోజకవర్గంలోని రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ఆర్అండ్ బి నుంచి జీవిఎంసీ అధీనంలో మార్పుచేయాలని కోరుతూ, ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి టి.క్రిష్ణబాబుకి వెలగపూడిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణాలకు నోచుకోకుండా ఉన్న అనకాపల్లిలోని రహదారులతోపాటు, నియోజవర్గ వ్యాప్తంగా మరమ్మతులకు గురైన రోడ్లను తక్షణమే బాగుచేయించాలని కోరినట్టు చెప్పారు. అదేవిధంగా మంత్రి బొత్స సత్యన్నారాయణ ను కూడా కలిసి వినతి పత్రం సమర్పించినట్టు ఎమ్మెల్యే వివరించారు. తన అభ్యర్ధన మేరకు ఇరువురు సానుకూలంగా స్పందించారని అన్నారు. అనకాపల్లి ప్రాంతం జీవిఎంసీలో కలిసిపోయినందున, రోడ్లు, భవనాల మరమ్మత్తులు జివిఎంసీలో కలిపివేయడం ద్వారా పనులు సత్వరమే పూర్తికావడానికి అవకాశం వుంటుందనే విషయాన్ని తెలిసియజేసినట్టు ఎమ్మెల్యే మీడియాకి వివరించారు. అటు మంత్రి బొత్స కూడా రోడ్ల అభివ్రుద్ధికి, మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని హామా ఇచ్చారని అన్నారు.

Anakapalle

2020-11-04 15:20:57

పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ పశువైద్య శిబిరాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి టి.లావణ్య పిలుపునిచ్చారు. మంగళవారం శంఖవరం మండలం మండపం గ్రామంలో పశువైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మేకలు50గేదెలు ఆవులు 400గొర్రెలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, సీతాకాలం ప్రారంభంలో పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించి గ్రామసచివాలయ వెటర్నీ సహాయకుల ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే వైద్యసహాయం అందిస్తామని చెప్పారు. అదేసమయంలో మేకలు, ఆవులు, గేదెలకు పాడిరైతులు ఇన్స్యూరెన్సులు కూడా తప్పకుండా చేయించుకోవాలన్నారు. తద్వారా పశువులకు ఏం జరిగినా నష్టపరిహారం పొందడానికి అవకాశం వుంటుందన్నారు. గ్రామసచివాలయాల పశుసంవర్ధ సహాయకుల ద్వారా కూడా వైద్యసేవలు పొందవచ్చునన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన వీరి ద్వారా సేవలు పొందడానికి ఆయా గ్రామసచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ సహాయకులు సతీష్ , అనిల్ ,వాలంటీర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

మండపం

2020-11-03 17:06:41

2వారాల్లో భీమసింగి సమస్య పరిష్కారం..

విజయనగరం జిల్లాలో గత కొంతకాలంగా సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తున్న భీమసింగి ఫ్యాక్టరీ కార్మికులను జేసీ, ఇన్ఛార్జి కలెక్టర్ జీసి కిషోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. కార్మిక సంఘాల నాయకులతో, కార్మికులతో సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడు నెలల నుంచి జీతాలు రాకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. చాలా మందికి రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై నాయకులతో మాట్లాడారు. జీతాలు, ఇతర బకాయల్ని త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జేసీ వాళ్లకు హామీ ఇచ్చారు. బకాయలన్నింటినీ 15 రోజుల్లో ప్రతి కార్మికుడికి అందించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. అలాగే అప్కాబ్ చైర్మన్ తో, డీసీసీబీ అధికారులతో మాట్లాడి రుణ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. కార్మికులకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు అండగా ఉంటారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. స్థానిక రెవెన్యూ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

2020-11-02 20:42:26

జాతీయ స్కాలర్ షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలోని మైనారిటీ విద్యార్ధులకు ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ జాతీయ స్కాలర్ షిప్ ల దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 30వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యం.అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని మైనారిటీలకు చెందిన ( ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బుద్ధులు, పార్శీకులు, సిక్కులు ) విద్యార్ధులు ఈ ఏడాది జాతీయ స్కాలర్ షిప్ కోసం అక్టోబర్ 31లోగా  దరఖాస్తులను సమర్పించాలని గడువు విదించిన సంగతి అందరికి విదితమే. అయితే కరోనా నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు నవంబర్ మాసం నుండి ప్రారంభం కానున్నందున జాతీయ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు ఆమె ఆ ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని మైనారిటీలకు చెందిన విద్యార్ధులు ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మరిన్ని వివరాల కొరకు మైనారిటీ సంక్షేమ కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, విజయనగరం కార్యాలయాన్ని నేరుగా గాని లేదా 94904 98948, 82475 54334,94403 99588 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. 

Srikakulam

2020-11-02 19:12:25

వరలక్ష్మి కుటుంబానికి రక్షణ కల్పిస్తాం..

దిశా చట్టం చేసిన తరువాత జరిగిన 390 ఘటనలలో 7రోజులలో దర్యాప్తు పూర్తి చేసామని , 108 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత  అన్నారు.  గాజువాక మండలం  చినగంట్యాడ గ్రామం  సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని  సోమవారం నాడు ఉన్నతాధికారులతో కలసి మంత్రి పరామర్శించారు. రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును వరలక్ష్మీ తల్లిదండ్రులు పద్మ ప్రియ, పి.సత్య గురునాథ్ లకు  హోంమంత్రి, జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ , గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్  మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించి తక్షణం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశా చట్టం  స్పూర్తితో 7రోజులలో  దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామని అన్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని, నిందితుని తండ్రి ఇతర కుటుంబ సభ్యుల పై బైండోవర్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరులో చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో  నిందితునికి 7 నెలలలోనే ఉరిశిక్ష ఖరారు అయిందని తెలిపారు. విజయవాడలో  చిన్నారి పాపను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో 4 నెలలలో నిందితునికి ఉరిశిక్ష పడిందని అన్నారు. 3,4 సంవత్సరాల వయస్సు గల  చిన్న పిల్లలపై కూడా  అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, తెలిసిన వాళ్లే ఈ విధంగా పూనుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన  పరిస్థితి అన్నారు.  ఇలాంటి సంఘటనలు జరగకుండా వుండడానికి పౌరులు కూడా  తమ వంతు బాధ్యత తీసుకోవాలని కోరారు సమాజంలో మార్పులు వస్తున్న క్రమంలో, ఆడా మగా సమానమని స్నేహ భావంతో మెలుగుతున్నప్పుడు, కొంతమంది ఈ విధమైన ఉన్మాధ చర్యలకు పూనుకోవడం బాధాకరమని అన్నారు.యుక్త వయస్సు వచ్చిన  పిల్లలకు తల్లిదండ్రులు భద్రత గురించి తెలియజేయాలని కోరారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు ఆడపిల్లలతో ఏ విధంగా ప్రవర్తించాలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వుందని అన్నారు. చట్టాలపై మగ పిల్లలకు ఆడ పిల్లలకు అవగాహన కలిగించడానికి తగు చర్యలు చేపడతామన్నారు.ప్రతి విద్యార్థిని దిశ యాప్, ఎ.పి.పోలీస్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు యుక్త వయస్సు వచ్చిన ఆడ పిల్లలు  బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా అల్లరి పెడితే, ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తే తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలని  కోరారు. ఇలాంటి  సంఘటనలలో పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి  కౌన్సిలింగ్ ఇప్పించి  మళ్లీ వాటికి పూనుకోకుండా హెచ్చరించ వలసిన అవసరం వుందన్నారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిశా చట్టం ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఎ.సి.పి.రామాంజనేయ రెడ్డి, ఆర్.డి.ఒ. పి.కిషోర్ , గాజువాక యం.ఆర్.ఒ. యం.వి.ఎస్.లోకేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Gajuwaka

2020-11-02 19:08:27