ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్న సభ్యుల పెండింగ్ సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్ప ర్సన్ జి.విజయలక్ష్మి హామీ ఇచ్చారు. ఆదివారం విశాఖలోని నాయుడుతోటలో ఏపి పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి ద్వితీయ వార్షికోత్సవ సమావేశాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో పద్మశాలి కులానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త అత్యంత ప్రాధాన్యత కల్పించాలని, చేనేత కార్మికులను కూడా ఆదుకోవడంలో అన్ని విదాల ముందంజలో ఉందన్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారా నికి సీఎంతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రాష్ట్ర ఆప్కో సంస్థ చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ, పద్మశాలి ఉద్యోగులంతా ఒక అసోసియే షన్ గా ఏర్పడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జి.వెంకట శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సమావేశంలో పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల సంఘం పెద్దలు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ జి.రంగజనార్ధన్, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవీ.నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి కెవి.సత్యనారాయణ, కోశాధికారి టీ.చంద్రశేఖర్ విశాఖ జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ మురళి, సెక్రటరీ పి.సత్యానంద్, వైస్ ప్రెసిడెంట్ ఆకుల విశ్వేశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నీలం జోగరాజు, కార్యదర్శి చుక్కల కరుణాకర్, సభ్యులు పందిరి శ్రీనివాసరావు, పసగడుగుల మల్లిబాబు, ఆంధ్ర ప్రదేశ్ పద్మశాలి కుల సంఘం పెద్దలు తెడ్డు వెంకటేశ్వరరావు, రామ్ కుమార్ తో పాటు జీవీఎంసీ ఏపీఆర్ఓ నాగేశ్వరరావు, పలువురు ఉద్యోగులు, కుల పెద్దలు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ రమ్య, శ్రీ లిఖిత చేసిన నృత్య ప్రదర్శన అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. పలు ప్రభుత్వ శాఖల్లో విశేష సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులతో పాటు పదవ తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులతో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.