1 ENS Live Breaking News

శ్రీ సత్యదేవుడిని దర్శించుకున్న దేవాదాయశాఖ కమిషనర్

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ దేవాదావశాఖ కమిషనర్ ఎస్.సత్యన్నారాయణ దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం ఈ మేరకు అన్నవరం వచ్చిన ఆయనకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అంతరాయలయంలో సత్యదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిషనర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఈఓ స్వామి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Annavaram

2023-07-28 08:29:05

బూదరాళ్ల రహదారిలో ముమ్మరంగా పోలీస్ తనిఖీలు

ఆంధ్రా ఒడిసా సరిహద్దు ప్రాంతంలో ఈనెల జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. అడువులు, సరిహద్దు ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల వారోత్సవాల నియంత్రణ చర్యల్లో భాగంగా బుధవారం కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో  కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తమ పోలీస్ సిబ్బందితో అటవీప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బూదరాళ్ల రోడ్డులో గుడ్లపల్లి, మర్రివాడ,  తదితర పరిసర ప్రాంతాలలో ఏరియా డామినేషన్ నిర్వహించారు. అనుమానస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఏజెన్సీలోని నైట్ హాల్ట్ ఆర్టీసి సర్వీసులను పోలీస్ స్టేషన్ల వద్దే నిలుపుదల చేస్తున్నారు.

Koyyuru

2023-07-26 16:12:36

నిర్ణీత సమయానికి హైవేలో హోటళ్లు మూసివేయాలి

జాతీయ రహదారికి అనుకొని వున్న హోటళ్లు, దాబాలు నిర్ణీత సమయానికి ప్రతీరోజూ మూసివేయాలరి నక్కపల్లి సిఐ జి.అప్పన్న సూచించారు. నక్కపల్లి  సర్కిల్ పరిధి లో ఉన్న హోటళ్లు , దాబాల యజమానులతో బుధవారం సాయంత్రం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు రాత్రి పదిగంటలకల్లా హోటళ్లు , దాబాలు మూసివేయాలన్నారు. హోటళ్ల లో ఎవరైనా కూర్చుని మద్యం సేవించినా.. గొడవలకు దిగినా యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. హైవే డాబాలు పక్కన ఎవరైనా వాహనాలు ఆపిన సమయంలో ప్రమాదాలు జరిగితే దానికి సదరు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఐ ప్రసాదరావుతోపాటు సిబ్బంది, పలు హోటళ్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Nakkapalli

2023-07-26 13:38:12

అరకు ప్రాంతంలో సెల్ టవర్లను సత్వరమే నిర్మించండి

కేంద్రప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన సెల్ ఫోన్ టవర్లను సత్వరమే పూర్తిచేసి గిరిజ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను మెరుగు పరచాలని అరకు ఎంపి గొడ్డేటి మాధవి కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆమె బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సమాచార వ్యవస్థ, ఇబ్బందులను వివరించారు. అల్లూరి సీతారమరాజు జిల్లాలోని అరకు, మన్యం పార్వతీపురం జిల్లాలలో ప్రధానంగా నెలకొన్న పలు రైల్వే సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ టవర్లు, రైల్వే పనులకు సంబంధిచి ప్రత్యేకంగా వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో నేటికీ సెల్ ఫోన్లు సైతం పనిచేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా చాలాచోట్ల సెల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

Araku (St)

2023-07-26 13:16:45

జగనన్న ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

విశాఖజిల్లాలో జగనన్న కాలనీ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున సంబంధిత శాఖల అధికారులు , గుత్తేదారులని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం  జిల్లాలోని జగనన్న లేఅవుట్ల ఇళ్ల నిర్మాణంపై వెబెక్స్ ద్వారా జిల్లాలోని ఎస్ఈ లు , డీఈలు, ఏఈలు , జివిఎంసి , అన్ని మండలాల ఎంపిడిఓలు , గుత్తేదారులతో  తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమీక్షలో  పాల్గొన్న అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గుత్తేదారు  వారీగా సమీక్ష నిర్వహించారు. బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న గృహాలన్నీ బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలన్నారు.

 బేస్మెంట్ లెవెల్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న గృహాలన్నీ రూప్ క్యాస్టింగ్ స్థాయికి తీసుకురావాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి స్టేజి అప్డేషన్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ లను లేఅవుట్లకు ఎప్పటికప్పుడు సరఫరా చేసేలా చూడాలని, సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి పనిచేయాలన్నారు .
ఈ వెబెక్స్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , హోసింగ్ పిడి శ్రీనివాసరావు , వి ఎం అర్ డి ఎ అధికారులు , ఈపీడీసీఎల్ , మండల పరిధిలోని ఎంపీడీఓ లు,  ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-25 15:47:12

టమాటా ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసకుంటుంది..

టమాటా దిగుబడి తగ్గి, మార్కెట్ లో ధరలు హాఠాత్తుగా పెరగడంతో.. వినియోగదారులకు సబ్సిడీ ధరపై టమాటాలు విక్రయించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం కొవ్వూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద గల రైతు బజారులో సబ్సిడీ పై టమాటా విక్రయ కౌంటర్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం టమాలను సబ్సిడీ ధరపై వినియోగదారులకు మంత్రి అందజేశారు. రూ.50 లకే నాణ్యమైన, స్వచ్చమైన టమాటాలు ప్రభుత్వం అందించడంతో మహిళలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడానికి సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మొన్నటి వరకు ఎండలు, ఇప్పుడు భారీ వర్షాల కారణంగా టమాటా దిగుబడులు తగ్గాయని, దీంతో మార్కెట్లో టమాటా ధరలు ఆమాంతం పెరిగి కిలో ధర రూ.120 నుంచి రూ.150 లు ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో టమాటాలు అందిస్తోందని హోంమంత్రి తానేటి వనిత వివరించారు. కొవ్వూరు రైతు బజారుకు సోమవారం సుమారు 800 కిలోల(30 ట్రేలు) నాణ్యమైన టమాటాలు దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఈసబ్సిడీ టమాటా పలమనేరు రైతులు నుండి స్వయంగా ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.  

Kovvur

2023-07-03 10:29:12

టీడీపీ విజయంతోనే యువతకు న్యాయం.. గంటా రవితేజ

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, అప్పుడే యువతకు తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని ఆ పార్టీ యువనేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు, మరో మాజీ మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ అన్నారు.. యువగళం పాదయాత్రలో భాగమై.. అనంతరం నెల్లూరులో నారా లోకేష్‌తో రవితేజ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ యువతకు అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందన్నారు.. నిరుద్యోగ సమస్యకు చెక్‌ చెప్పి.. ఉద్యోగావకాశాలు పెరగాలంటే అదొక్క టీడీపీతోనే సాధ్యమన్నారు. యువతకు నిరుద్యోగ భృతి అందించిన ఒకే ఒక్క పార్టీ టీడీపీయేనని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో యువతకు అధిక సీట్లు కేటాయించే అవకాశముందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. తగిన ఉద్యోగావకాశాలు కరువై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువత కృషి చేయాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. యువతీయువకులంతా సంఘటితంగా టీడీపీకి మద్దతు పలికి.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపించాలని విజ్ఞప్తి చేశారు.

nellore

2023-07-03 09:36:56

గిరి ప్రదక్షిణలో భక్తులకు ఆర్యవైశ్యుల ఫలహార వితరణ..

సింహాచలం వరాహ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సీతమ్మధార మెయిన్ రోడ్ హెచ్. బి.కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద గల బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా భక్తులకు ఇడ్లీ, టమాటా బాత్, తీపి బూంది పలహారాలను అందించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి నిర్విరామంగా అందజేశారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఈ శిబిరంలో సేవ చేస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులను గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు బలవర్ధకమైన ఫలహారం అందిస్తున్నందుకు అభినందించి కొంతసేపు భక్తులకు ఫలహార పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నల్లూరి నూకరాజు. కార్యదర్శి పూసర్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిఏటా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ భక్తులకు ఫలహారం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.  కార్యక్రమ చైర్మన్ పూసర్ల సుధీర్ మాట్లాడుతూ, సంఘం సభ్యులు స్వచ్ఛంద విరాళ రూపంలో అందించిన పచారీ సరుకులు, నగదు  మొత్తంతో భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు విరించారు. అంతకుముందు ఈ పలహార వితర కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాదులు ఎం.కే. శ్రీనివాస్, ఎం.ఎస్. వెంకటేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గ్రంధి దుర్గాప్రసాద్, కన్యకాపరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం మాజీ అధ్యక్షుడు విన్నకోట రామమూర్తి, సభ్యులు దుర్గా సోమేశ్వరరావు వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు, సుగ్గు శివకుమార్, కె.వి. రమణయ్య, పూసర్ల సంజీవరావు, కంకటాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-03 06:31:09

గిరిప్రదక్షిణలో తాగునీరు, పారిశుద్ధ్యంపైనే ప్రత్యేక దృష్టి

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని జివిఎంసి కమిషనర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ  పేర్కొన్నారు. ఆదివారం ఆయన గిరి ప్రదక్షిణ మార్గంలో లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యంపై దృష్టి సారించామని, ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలూ సహకరించాలన్నారు. భక్తులు సులువుగా ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకునేలా పోలీస్‌ శాఖ సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుండడంతో పలు ప్రాంతాల్లో 20 డ్రోన్ల ద్వారా చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా దృశ్యాలన్నీ జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానమవుతాయి. దీంతో ఎక్కడెక్కడ ఏఏ లోటుపాట్లున్నాయి, వాటిని అధిగమించడం ఎలా అనే విషయమై పలువురికి సూచనలిచ్చారు. ప్రదక్షిణ ముగిసేంత వరకు కమాండ్‌ కంట్రోల్‌లో సిబ్బంది ఉంటారని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్‌ ఆదేశించారు. సాయంత్రానికే లైటింగ్‌ సిద్ధం కావాలని, కొన్ని చోట్ల కొత్తగా రోడ్లేయడంతో వాటి పిక్కలు భక్తుల కాళ్లకు తగలకుండా క్రషర్ బూడిద వేయాలని సూచించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్  డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజనీరు రవి కృష్ణంరాజు, పట్టణ ప్రణాళిక అధికారి సునీత, మంచి నీటి సరఫరా విభాగ ఎస్‌ఈ వేణుగోపాల్‌, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేష్‌, ఆయా ప్రాంతాల జోన్ల కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-07-02 16:04:58

మాదక ద్రవ్యాలతో వచ్చే అనర్ధాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్ధులు పాఠశాల స్థాయి నుంచే మాదక ద్రవ్యాలతో వచ్చే అనర్ధాలు, నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూలులో ఏర్పాటు చేసిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు ఒక వ్యక్తిని ఏవిధంగా నాశనం చేస్తాయో, వాటి భారిన పడితే జీవితంలో ఎంత నష్టపోతామనే విషయాలను సిఐ విపులంగా తెలియజేశారు. ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా గంజాయి, నాటుసారా రవాణాను నియంత్రిస్తున్నదన్నారు. గ్రామాల్లో ఇలాంటి మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదంటే..14500కి ఫోన్ చేయాలన్నారు. ఎస్ఐ అజయ్ బాబు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

 గంజాయి, కొకైన్, మత్తుఇంజక్షన్లు, బ్రౌన్ షుగర్ వంటి వాటిపైనా వాటి వలన జరిగే అనర్ధాలపైనా విద్యార్ధులు అవగాహన పెంచుకోవడం ద్వారా మరింత మందికి తెలియజేయడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా మత్తు పదార్ధాల వినియోగాన్ని నియంత్రించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్.కళాంజలి, గౌతమి, నాగమణిలు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల్లోని రాకాలను చిత్రాల ద్వారా వివరించి, వాటి వలన జరిగే నష్టాలతో తల్లిదండ్రులు ఏవిధంగా బాధపడతారనే అంశాలను తెలియజేశారు. ఇతర మహిళాపోలీసులు రమ్య, చిన్నారి, నీలిమ, స్వర్ణలత తదితరులు వివిధ మాదక ద్రవ్యాలు, వాటివలన కలిగే నష్టాలను, వాటికి సంబంధించిన గోడపత్రికలతో విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కిరోన్, కోటేశ్వర్రావు, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-06-22 09:32:22

“మత్తు” మహమ్మారిని పారద్రోలండి - ఎస్ఐ జె.సురేష్

యువతను మత్తులో ముంచేత్తుతూ, వారి భవితకు పరిణమిస్తున్న మాదకద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ  జె.సురేష్ అన్నారు. ఈనెల 26న మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శనివారం పురుషోత్తపురం, హెచ్.పీ కాలనీలోని కంఫర్ట్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగ ణంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన నివాసితుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖపట్నం డ్రగ్ వినియోగంలో, రవాణాలో ప్రముఖంగా విచారకరమన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనలో మార్పును ఉండాలని, ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వారి గమనాన్ని మనం నిర్దేశించగలమన్నారు. డ్రగ్ వ్యాపారులు యువతను టార్గెట్ చేసుకుని తమ వ్యాపారం విస్తృతం చేసుకునే విధానాన్ని వివరించారు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలిగొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు అన్నారు. ఆరోగ్యానికి హానికరమైన డ్రగ్స్ వాడినా, అమ్మినా చట్టపరంగా నేరమన్నారు. ఈ  నేరగాళ్ళ భరతం పట్టేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.14 500 ఫోన్ ద్వారా వారి ఉనికిని తమకు తెలియపరచాలన్నారు. సచివాలయంలో పోలీస్ విధులు నిర్వహిస్తున్న రత్నం, ప్రసన్న మాట్లాడుతూ  ఆన్ లైన్ మోసాలకు గురవుతున్న నగర ప్రజలు, బోగస్ ఫైనాన్స్ సంస్థల పట్ల అప్రమత్తం కావాలని సూచించారు. కంఫర్ట్ హోమ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వివి రమణమూర్తి, ఎంఎస్ శ్రీనివాసు, కేడిఆర్ రెడ్డి, ఏవి నాగభూషణరావు, వి ఉమామహేశ్వరరావు, బిటి రావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Pendurthi

2023-06-17 17:03:07

విద్యను పొందడం పిల్లల ప్రాథమిక హక్కు..

బడి ఈడు పిల్లలు, కౌమారదశలో ఉన్న వారందరికీ విద్యను పొందడం ప్రాథమిక హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకుని ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  పేదరికం తదితర కారణాలవల్ల పిల్లలు విద్యకు, అభ్యాసానికి దూరంగా ఉంటున్నారని అన్నారు.  సెకండరీ  స్థాయిలో బడి మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటుందని అన్నారు. బడికి పోని  వారు లేదా బడికి వెళ్లి మధ్యలో మానేసిన వారు కూడా బడిలో చేరాలన్నారు. పిల్లలు బడి బయట ఉండకుండా విద్యాబుద్ధులు నేర్చుకునేటట్టు చూడటం తల్లిదండ్రుల బాధ్యత అని వెంకటరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే మొదటి ఆస్తి వారి చదువేనని సూచించారు. చదువు విషయంలో ప్రతీ తల్లిదండ్రులు పూర్తిగా చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, ఎస్. శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-06-17 08:09:20

శివాజీ పార్కు పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన

విశాఖ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు వైయస్సార్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం  మూడవ జోన్ 17వ వార్డు పరిధిలోని శివాజీ పార్కు  పునరాభివృద్ధి పనులకు విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ గేదెల లావణ్య తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ఎన్నో ఏళ్లగా అభివృద్ధికి  నోచుకొని ఉన్న శివాజీ పార్కును సుమారు రూ. 153.30 లక్షల వ్యయంతో పునరాభివృద్ధి   పనులకు శంకుస్థాపన చేశామని, ముఖ్యంగా వాకింగ్ ట్రాక్, పిల్లల ఆడుకునే సామగ్రి, బెంచీలు,  మరుగుదొడ్లు, గ్రీనరీ, తాగునీటి సదుపాయం, వ్యాయామ పరికరాలు ఏర్పాటు లాంటివి ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పార్కు పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు గేదెల నాగరాజు, కార్పొరేటర్ నెక్కల లక్ష్మి సురేష్, పర్యవేక్ష ఇంజనీర్ సత్యనారాయణ రాజు, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-17 07:38:36

నగరవాసుల ఆహ్లాదానికి పార్కులు ఎంతో అవసరం

ఆహ్లాదానికి పార్కులు ఎంతో ఉపయోగపడతాయని  నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 3వ జోన్ 19వ వార్డు ఎంవిపి సెక్టార్ 2లో జీవీఎంసీ సాధారణ నిధుల నుండి సుమారు రూ.95 లక్షల వ్యయంతో బృందావనం చిల్డ్రన్ పార్కును రెయిన్ భో ధీమ్ పార్కుగా అభివృద్ధి  చేసేందుకు తూర్పు నియోజకవర్గం అక్రమాని విజయనిర్మలతో కలిసి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఆహ్లాదానికి నగరంలో పార్కులు అవసరమని, పార్కులో అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. ఎంపీపీ సెక్టార్ 2 లో బృందావనం చిల్డ్రన్ పార్కును రెయిన్ భో ధీమ్ పార్కుగా ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించి శంకుస్థాపన చేసామన్నారు. రెయిన్బో ఆకారంలో వాకింగ్ ట్రాక్ను వినూత్నంగా ఏర్పాటు చేయడంతో పాటు, పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ ఆహ్లాదం కల్పించేందుకు గ్రీనరీ, వ్యాయామ పరికరాలు, మరుగుదొడ్లు, తాగునీరు,  విద్యుత్తు, సందర్శికులు కూర్చునేందుకు బెంచీలు, రక్షణ గోడ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమానివిజయనిర్మల మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గం పరిధిలో ప్రతి వార్డుకు ఒకటి లేదా రెండు పార్కులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డును  ఒక మోడల్ వార్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పర్యవేక్షణ ఇంజనీరు సత్యనారాయణ రాజు, జోన్ల కమిషనర్ విజయలక్ష్మి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-17 07:33:11

ఉత్సాహంగా గడప గడపకూ మన ప్రభుత్వం

గొలుగొండ మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహాంగా సాగుతుంది. శనివారం మండలంలోని పాతమల్లంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నిరుపేదల పక్షపాతి ప్రభుత్వమన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మనదేన్నారు. ముందుగా బుడ్డడపాడు , చంద్రయ్య పాలెం, కొత్త పాలెం,హుకుంపేట, నిమ్మగెడ్డ, పాత మల్లంపేట గ్రామాల్లో పర్యటించారు. అక్కడ ప్రభుత్వ పధకాలు ఏ విధంగా అందుతున్నాయో మహిళలను అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో గొలుగొండ ఎంపిపి మణికుమారి, జెడ్పీటిసి సుర్ల గిరిబాబు, పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ పలువురు సర్పంచులు, ఎంపీటిసిలు,నాయకులు కార్యకర్తలు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Golugonda

2023-06-17 07:22:44