1
తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకర్గంలో కొత్త ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 కార్ల ర్యాలీతో ప్రత్తిపాడు ఇన్చార్జిగా వరపుల రాజా సత్యప్రభ అన్నవరంలో చేసిన ఎంట్రీ తగ్గెదే లే అన్నట్టుగా సాగింది. వరుపుల రాజా హఠాత్మరణం తరువాత ఆమె భార్య సత్యప్రభ నియోజకవర్గ పగ్గాలు చేపట్టారు. వస్తూ వస్తూనే తొలిసారి అన్నవరం వచ్చి సభ నిర్వహించారు. నాడు వరపులకు వచ్చిన అభిమానం కంటే నేడు ఆమె భార్యకు ప్రజలు, టిడిపి కార్యకర్తలు,నాయకుల నుంచి వచ్చిన అభిమానం, అండదండలు అందరినీ ఆలోచింపజేశాయి. పెద శంకర్ల పూడి నుంచి బయలు దేరిన అభిమానుల కాన్వాయ్.. లంపకలోవ,ఉత్తర కంచి, ఒమ్మంగి, శరభ వరం, గజ్జనపూడి, వెంకట నగరం, కొంతంగి కొత్తూరు, యు.జె.పురం,నెల్లిపూడి, కత్తిపూడి, సీతయ్యమ్మ పేట, గ్రామాల మీదుగా అన్నవరం చేరుకుంది. అక్కడ సత్యదేవుని పాదాల మండపం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. సత్యప్రభకు అభిమానులు, కార్యకర్తలు అడుగడునా బ్రహ్మరధం పట్టారు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ తొలిరోజు కార్యక్రమంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలను, నాయకులను కలుసుకున్నారు. అనంతరం తొలిపావాంచ వద్ద సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. వరుపుల రాజాపై చూపించిన ప్రేమ, అభిమానాలు, తనపైనా చూపించి మీ తోబుట్టువుకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లోటిడిపి నాయకులు వెన్న శివ, ముదినూరి మురళి కృష్ణం రాజు, బద్ది రామారావు ,సరమర్ల మధుబాబు, పర్వత సురేష్, మిరపల నరసయ్య, బండారు సురేష్, రాయి శ్రీనివాసరావు, ఇసం శెట్టి భాస్కరరావు, గోపి అమరధి వెంకటరావు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.