1 ENS Live Breaking News

ఎమ్మెల్సీ ఫలితాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారిచేసింది. ఓట్లు లెక్కించినా తుది తీర్పునకు లోబడి ఫలితం ఉంటుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు  హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు అభ్యర్థి, న్యాయవాది శ్రీనివాసరావు. అం తేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చారన్న పిటిషనర్ ఎన్నికలు జరగని చోట హైకోర్టుకు సెలవులు ఇచ్చారని కోర్టుకి తెలియజేశారు.  ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదని తెలియజేయడంతో పిటిషన్‌ను అనుమతించి విచా రణ చేపట్టింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ తరపున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. సెలవులు లేకపోవడంతో అభ్యర్థికి లాయర్లు, ఉద్యోగులు ఓటు వేయలేకపోయారని కోర్టుకి తెలియజేశారు. చాలా మంది న్యాయవాధులు ఓటు హక్కు అవకాశాన్ని కోల్పోయారని కోర్టుకి తెలియజేశారు. దీనితో ఓట్లు లెక్కించినా తుది తీర్పునకు లోబడే ఉండాలంది హైకోర్టు.

Amaravati

2023-03-15 15:56:23

1998డిఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 క్వాలిఫైడ్ డిఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాబితాలో  రాష్ట్ర వ్యాప్తంగా 4534 మంది క్వాలి ఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో వీరి నియామకం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 27న ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేస్తూ ఈ ఉత్తర్వుల ద్వారావీరందరుకి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాలని కమీషనర్ కు  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు డిఎస్సీ అభ్య ర్ధులకు పోస్టింగులు ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇస్తుండటం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

Tadepalli

2023-03-15 14:14:16

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపుపై భారీ అంచనాలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ గెలుపుపై ఆ నలుగురుపై ఎవరికి వారు భారీ అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికలబరిలో37 మంది నిలబడి నా, ప్రధా నంగా పోటీ మాత్రం 4గురు అభ్యర్ధుల మధ్యే నెలకొంది.  మొత్తం ఓట్లు 2లక్షల 89వేల214 కాగా మూడు జిల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో జిల్లాలో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయి.2వస్థానంలో శ్రీకాకుళం, మూడవ స్థానంలో విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి. అయితే గెలుపుపై అధికారపార్టీతోపాటు, మిగి లిన మూడు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ అయిన తరువాత ఓటర్లు ఏ అభ్యర్ధికి ఓటు వేశారో ఈసారి బహిరంగంగా చెప్పడంతో గెలుపుపై ఎవరి అంచనా ల్లో వారు నిమగ్నమయ్యారు. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించడం, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు భా రీగా ఓటింగ్ లో పాల్గొనడంతో గెలుపుపై భిన్నకధనాలు వినిపిస్తున్నాయి. చూడాలి విజయం ఎవరిదో..!?

Visakhapatnam

2023-03-15 02:56:45

ప్రెస్ & మీడియా అక్రిడిటేషన్ సవరణకు ఓకే కానీ..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రెస్ అండ్ మీడియా విషయంలో అక్రిడిటేషన్ మంజూరుకి సంబంధించిన నిబంధనల సవరణకు తొలిసారిగా..అంటే మూడున్నరేళ్లు పూర్తయిన తరువాత అంగీకారం తెలిపింది. గతంలో దినపత్రికలకు జిఎస్టీ తీసేయాలని, పత్రిక ప్రింటింగ్ లో సడలింపులు ఇవ్వాలని, చిన్న-మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని యూనియన్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదు. కానీ ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ప్రభుత్వం ప్రెస్ అండ్ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 142 జీఓ సవరణకు ఆమోదం తెలిపినా స్వల్ప మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది తప్పా చిన్న, మధ్యతరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీ లకు ప్రభుత్వ ప్రకటనల విషయంలో మార్పు ఉండకపోవచ్చునని చెబుతున్నారు సీనియర్ జర్నలిస్టులు. అంతేకాకుండా మార్చి 31 వరకూ పాత అక్రిడిటేషన్లు ఎక్సటెన్ష న్ ఇచ్చన ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్లు ఇస్తుందా.. వాటికే గడువు పెంచుతుందా తేల్చలేదు..!

Amaravati

2023-03-14 16:24:23

ఉత్తరాంధ్ర MLCపై ఉపాధ్యాయుల, ఉద్యోగుల ప్రభావం

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపుపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రభావం గట్టిగా పడేటట్టు కనిపిస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా 3జిల్లా ల్లో అత్య ధికంగా ఉపాధ్యాయులు పనిగట్టుకొనిమరీ ఈసారి ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్లు చేయించారు. అదేసమయంలో ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కూడా ఫలప్ర దం కాలే దు. ఉద్యోగులు కూడా నల్లబ్యాడ్జీలతోనే నిరసన తెలియజేస్తున్నారు. దీనితో ఎమ్మెల్సీ ఎన్నికపై వీరిఓటు ప్రభావం గట్టిగానే చూపిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. అంతేకాకుండా సామాజిక మాద్యమాల్లో కూడా ఇదేవిషయమై పెద్దస్థాయిలో చర్చకూడా నడుస్తున్నది. మనఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్పుతేవాలని అనేని నాదాన్ని బలంగా ఓటర్లలోకి చాపక్రిందనీరులా తీసుకెళ్లారని తెలుస్తుంది. ఉద్యోగులేకాకుండా, ఉపాధ్యాయులు, వారి పిల్లలు, బంధువులు, వారికి తెలిసిన వారితోకూడా పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపి క్రాస్ ఓటింగ్ జరిగేలా పక్కాపథక రచనచేశారని చెబుతున్నారు. చూడాలి ఏంజరుగుతుందో..! 

Visakhapatnam

2023-03-13 09:22:08

MLC పీఠం దక్కాలంటే అందులో సగం ఓట్లుపడాలి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో ఏ అభ్యర్ధి గెలవాలన్నా ప్రస్తుతం రిజిస్టర్ అయిన 2,89,214 ఓట్లలో సగానికిపైగా ఒక అభ్యర్ధికి పడాలి. ప్రస్తుతం ఎన్నికల బరిలో 37 మంది నిలబడినా..ప్రధాన పోటీ మాత్రం నలుగురు అభ్యర్ధుల మధ్యే ఉన్నది. ఎన్నికల 13వ తేది ఉదయం 8గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 331 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది. ఎమ్మెల్సీ పీటంపై అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు పీడిఎఫ్, బీజేపీ అభ్యర్ధులు కూడా ఎవరి ధీమాలో వారున్నారు. ఎన్నడూలేనివిధంగా సార్వత్రిక ఎన్నికలను తలిపించే విధంగా ఈసారి ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరు అన్నివర్గాల ప్రజలను ఆలోచింపజేస్తున్నది. ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్ధులు గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ మిగతా అభ్యర్ధుల వలన ఈసారి ఓట్లు చీలిపోతాయనే భయం అందరినీ వెంటాడుతోంది. మొదటి ప్రాధాన్యత అత్యధిక ఓట్లు ఎవరికి వస్తాయోననే ఉత్కంఠ మొదలైంది..!

vizag

2023-03-12 06:17:51

జనసేన సహకారంతోనే ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ గెలుస్తాం

బిజేపీ-జనసేన పొత్తుతోనే ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపితో జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. ఈ విషయం పదే పదే చెప్పాల్సిన పనిలేదని, జనసేన సహకారం బిజెపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా ఉందన్న ఆయన ఈసారి బిజీపీ లక్షకు పైగా ఎమ్మెల్సీ ఓట్లు రిజిస్ట్రేషన్ చేయించిందన్నారు. బిజేపీ అభ్యర్ధి మాదవ్ పై పట్టభద్రులు, నిరుద్యోగులకు నమ్మకం ఉందన్న సోము 2024 ఎన్నికల్లో ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుందన్నారు. హామీలిచ్చి మడమతిప్పేసిన సీఎంను ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు బీజేపి తెలియజేసిందన్నారు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుందో ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఈసా ఎమ్మెల్సీ గెలిచేది బీజేపీనే అని నొక్కిచెప్పారు.

Visakhapatnam

2023-03-09 10:58:58

తొలిరోజు జిఐఎస్ సమ్మిట్ లో రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో తొలిరోజు రూ.రూ.11.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పేర్కొ న్నారు. జిఐఎస్ వేదిగా ఈ విషయాన్ని సీఎం ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా 92 ఎంఓయూలును  కుదుర్చుకోనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయన్న సిఎం మిగిలిన 248 ఎంఓయూలు రేపు కార్యరూపం దాల్చనున్నాయన్నారు. ఈ ఒప్పందాల విలువ రూ.1.15 లక్షల కోట్లు కాగా. వీటిద్వారా దాదాపు 2లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు రానున్నాయి. రిలయెన్స్‌, అదాని, ఆదిత్య బిర్లా, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్‌ వంటి కంపనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. 

Visakhapatnam

2023-03-03 14:28:58

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ జీతాలు పడలేదు

మొన్న పాఠశాల ఉపాధ్యాయులు, నిన్న జిల్లా శాఖల అధికారులు, నేడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. కారెవరూ జీతాలు 1వ తేదినా టికి పడటానికి అనర్హులు. ఒక ప్రభుత్వశాఖతో మొదలై ఆలస్యం క్రమేపీ అన్ని ప్రభుత్వశాఖలకూ వర్తింపజేస్తోంది ప్రభుత్వం.  ఏ ప్రభుత్వ శా ఖ అధికారులకు జీతాలు పడకపోయినా సచివాలయ ఉద్యోగులకు జీతాలు 1వ తేదినాటికి టంచనుగా పడేవని చెప్పిన వారు మీ పరిస్థితే మా కూ వచ్చిందంటూ ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు. అందులోనూ సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ ప్రస్తుతం పనిచే యడం లేదనే వార్త కూడా రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వైరల్ అవుతుంది. సాధారణ జీతాలతోపాటు, ఇతర ఏ రకమైన బిల్లులు పెట్టడానికి వీ లుపడని పరిస్థితిని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.  మొదట పదిరోజులు ఆలస్యంగా పడిన జీతాలు, ఆపై 15 రోజులయ్యే పరిస్థితి వస్తే బ్యాంకు ఈఎంఐలు, హౌసింగ్ లోన్లకు పెనాల్టీలు కట్టక తప్పదంటున్నారు ఉద్యోగులు.

Visakhapatnam

2023-03-02 09:43:18

రుషికొండను ఏమార్చడానికే GVMC కమిషనర్ మార్పు

విశాఖలో రుషికొండను నామరూపాలు లేకుండా చేసి ఏమాచర్చడానికి, అడ్డదారిలో అనుమతులు తేవడం కోసమే ఆఘమేఘాలపై జివిఎంసీ కమిషనర్ ను మార్చినట్టు ప్రణాళిక మార్పుతో తేటతెల్లమైంది. నిర్మాణాలు ప్రారంభానికి ముందు ఏపనులకైనా అనుమతి ఇచ్చే జివిఎంసీ 61 ఎకరాల్లో దాదాపు నిర్మాణాలు పూర్తయిన తరువాత రుషికొండ వద్ద చేసేస్తున్న పనులకు అనుమతి ఇవ్వడాన్ని బట్టి ఏస్థాయిలో అడుగులు వే స్తున్నరో తెలుసుకోవచ్చు. తొలిప్లాన్ లో 2.88 ఎకరాలకే అనుమతి ఇచ్చినట్టు కోర్టుకి నివేదించింది ప్రభుత్వం. ఏపీ టూరిజం ఎస్ఈ కె.రమ ణ జివిఎంసికి పంపిన మొదటి ప్లానులో 12.46 ఎకరాలకు 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. దీనిపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో కేసు వేయడంతో 2.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఏకంగా కొత్త ప్లాన్ లో 61. 03 ఎకరాల్లో నిర్మాణాలకు జివిఎంసీ అనుమతులు ఇచ్చేయడం చర్చనీయాంశం అవుతోంది..!

Visakhapatnam

2023-03-01 04:30:08

రీసర్వేతో పేదల భూములకు రక్షణ కల్పించాలి

పేద‌ల జోలికి వెళ్లొద్ద‌ని, వారు సాగుచేసుకుంటున్న‌ భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ భూప‌రిపాల‌న చీఫ్ క‌మిష‌న‌ర్ జి.సాయిప్ర‌ సాద్   అధికారుల‌ను ఆదేశించారు. భూ క‌బ్జాల‌కు పాల్ప‌డే మోతుబ‌రుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. పేద‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు మ‌రియు భూ ర‌క్ష ప‌థ‌కం క్రింద చేప‌ట్టిన స‌మ‌గ్ర భూ స‌ర్వేపై, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో, స‌ర్వే, భూరికార్డుల క‌మిష‌న‌ర్ సిద్దార్ధ‌జైన్ తో క‌లిసి, సిసిఎల్ఏ సాయిప్ర‌సాద్‌ మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ముందుగా మూడు జిల్లాల్లో జ‌రుగుతున్న‌ రీస‌ర్వే ప్ర‌క్రియ వివ‌రాల‌ను క‌లెక్ట‌ర్ల‌ద్వారా తెలుసుకున్నారు. 

భూ సర్వే ప్ర‌క్రియ‌ను ఖ‌చ్చితంగా, మ‌రింత ప‌క‌డ్భందీగా  నిర్వ‌హించ‌డంతోపాటు, వివ‌రాల‌ను మ‌రింత స‌ర‌ళంగా న‌మోదు చేసే ప్ర‌క్రియ‌పై దృష్టిపెట్టారు. దీనికోసం వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. న‌మోదు చేసే స‌మ‌యంలో వారికి ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. డేటా ఎంట్రీ సుల‌భంగా  చేసేందుకు తీసుకోవాల్సిన‌ చ‌ర్య‌లు, అందుకు ప‌డుతున్న స‌మ‌యంపై వారితో చ‌ర్చించారు.    ఈ సంద‌ర్భంగా సిసిఎల్ఏ  మాట్లాడుతూ, గ్రౌండ్ ట్రూతింగ్ ఖ‌చ్చితంగా చేస్తే, మిగ‌తా ప్ర‌క్రియ కూడా స‌జావుగా జ‌రుగుతుంద‌ని అన్నారు. విఆర్ఓ లాగిన్‌లోని అంశాల‌ను 38 నుంచి 20కి త‌గ్గిస్తామ‌ని చెప్పారు. భూముల కేట‌గిరీకి సంబంధించి అగ్రిక‌ల్చ‌ర్‌, హార్టిక‌ల్చ‌ర్ లేదా నాన్ అగ్రిక‌ల్చ‌ర్ విభాగాల‌ను మాత్ర‌మే ఉంచుతామ‌ని తెలిపారు. అలాగే నీటి వ‌న‌రుల‌కు సంబంధించి మేజ‌ర్‌, మీడియం, మైన‌ర్ ఇరిగేష‌న్ ఆప్ష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. 

రైతుల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను న‌మోదు చేసే ప్ర‌క్రియ‌ను కూడా మ‌రింత స‌ర‌ళంగా చేస్తామ‌న్నారు. అదేవిధంగా 9(2), 10(2) నోటీసుల‌ను జారీ చేసేందుకు ప్రింటెడ్ ఫారాల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఎక్క‌డ ప్ర‌భుత్వ భూమి ఉన్నా 22 ఏలో న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. అసైన్డ్ భూమి కొన్న‌వారికి  పిఓటి ప్ర‌కారం నోటీసు ఇచ్చి, దానిని ప్ర‌భుత్వ భూమిగా న‌మోదు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ భూముల‌ను సాగుచేసుంటున్న నిరుపేద‌ల జోలికి వెళ్లొద్ద‌ని సిసిఎల్ఏ స్ప‌ష్టం చేశారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, శ్రీ‌కాకుళం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌కేష్ బాలాజీ ల‌ఠ్క‌ర్, మ‌న్యం జిల్లా క‌లెక్టర్ నిశాంత్ కుమార్‌, జెసి ఓ.ఆనంద్‌, జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కె.మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డిఓలు, మూడు జిల్లాల స‌ర్వేశాఖ ఎడిలు, తాశిల్దార్లు, డిటిలు, మండ‌ల స‌ర్వేయ‌ర్లు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-28 13:29:09

ఏపీ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో 57,927 మందికి అర్హత

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈనెల 19 నిర్వహించిన ఎస్ఐ ప్రలిమినరీ పరీక్షలో 57, 927 మంది అర్హత సాధించారు. మొత్తం 1,51,288 మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లను మార్చి 4వ తేదీ వరకూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పరీక్ష లకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీని విడుదల చేసింది. ఆ సమయంలోనే అభ్యర్ధులు తమ ప్రిలిమినరీ పరీక్ష ఏవిధంగా రాశారో పరీక్షించు కున్నారు. అదే కీతో నేడు ఫలితాలు విడుదల అయ్యాయి. https://slprb.ap.gov.in/ అనే వెబ్ సైట్ లో రిజల్ట్స్ ను పొందు పరిచారు. అభ్యర్ధు లు నేరుగా వారి రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ క్రింద కాలమ్ లోనే అభ్యర్ధుల ఓఎంఆర్ షీట్లు కూడా డౌన్ లోచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్హత సాధించిన వారంతా ఫిజికల్ టెస్టుకు అర్హత సాధిస్తారు. అందుతో కూడా అర్హత సాధిస్తే ఎస్ఐ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ఏ ఒక్క పరీక్ష తప్పినా వారు ఈ ఎంపిక ప్రక్రియ నుంచి తప్పుకోవాల్సిందే.

Tadepalli

2023-02-28 06:38:07

1000 కోట్లతో మరో పరిశ్రమ 2వేల మందికి ఉపాధి

తూర్పుగోదావరి జిల్లాలో రూ.1000 కోట్ల పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి వరుణ్‌ గుప్తా తెలియజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎంను కలిసిన త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. దానికి అనుగుణంగా పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నాయని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ సోలార్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటైతే ఎంతోమందికి పరోక్షంగా ఉపాది లభిస్తుందని పరిశ్రమ నిర్వాహకులు తెలియజేశారు.

Tadepalli

2023-02-27 16:37:55

టీటీడీ యాప్ లో పంచగవ్య ఉత్పత్తుల సమాచారం

టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల గురించి టీటీడీ వెబ్సైట్ లోనే కాకుండా ఇటీవల రూపొందించిన యా ప్ లో కూడా సమాచారం పొందుపరచాలని ఈవో  ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వినియోగదా రులకు సులువుగా చేరువ కావచ్చునని ఆయన తెలిపారు.  తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష జరిపా రు. 15 రకాల పంచగవ్య ఉత్పత్తుల్లో 10 ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు ఈవో దృష్టికి  తెచ్చారు. వీటిని  మరిం త ఎక్కువగా  వినియోగదారులకు చేరవేయడానికి ,ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో  చెప్పారు.టీటీడీ ఆలయాల్లో వినియో గించిన పుష్పాలతో తయారు చేస్తున్న ఫొటో ఫ్రేమ్ లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. వివిధ సైజులు, ఫ్రేమ్ లతో తయారు చేసిన వాటి వెనుక వైపు ఈ ఉత్పత్తి గురించిన పవిత్రత,ప్రాముఖ్యతను అర్థమయ్యేలా ముద్రించాలన్నారు. వీటిపై గణాంక శాఖ అధికారులు సమీక్ష చేయాలని ఈవో సూచించారు.

       అంతకు ముందు తిరుమల , తిరుపతిలో పరకామణి అంశంపై ఈవో సమీక్ష జరిపారు. నాణాలు వివిధ బ్యాంకులకు క్రమ పద్దతిలో పంపే ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు ఏ రోజు నాణాలు ఆరోజు తీసుకుని వెళ్ళేలా ఉన్న వ్యవస్థను మరింత ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని శ్రీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నాణాలు నిల్వ ఉండకుండా ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.  జేఈవో సదా భార్గవి, ఎఫ్ ఎ సీఏవో  బాలాజి, పరకామణి ఎఈవో  రాజేంద్రతో పాటు పలువురు అధికారులు  పాల్గొన్నారు.

Tirumala

2023-02-27 14:18:03

తెలంగాణ-ఒడిసా మధ్య ఆర్టీసీ సర్వీసులు షురూ

ఇకపై తెలంగాణ-ఒడిసా మధ్య తెలంగాణ ఆర్టీసులు నడవనున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల మధ్య పరస్పరం బస్ సర్వీసు లు నడిపేందుకు ఆయా రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.  టీఎస్ఆర్టీసీ 10 సర్వీసులు నడిపితే ఓఎస్ఆర్టీసీ 13 సర్వీసులు తెలంగాణకు నడపనుంది. హైదరాబాద్-జైపూర్ 2, ఖమ్మం-రాయగఢ్ 2, భవానీపట్నం-విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. చాలా కాలం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడపాలని భావిస్తున్నప్పటికీ వీలు పడలేదు. దానికితోడూ ఒడిసా నుంచి చాలా మంది తెలంగాణకు వివిధ పనులపై నిత్యం వెళుతుంటారు. అలాంటివారికి ఇప్పటి వరకూ రైళ్లు, కొన్ని ప్రైవేటు బస్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా ఒడిసా, తెలంగాణ ఆర్టీసీల మద్య ఒప్పందం కుదరడం లో రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు నడిపేందుకు మార్గం సుగమం అయ్యింది.

Telangana

2023-02-27 09:14:07