1 ENS Live Breaking News

విలీనం దిశగా సచివాలయ మహిళా పోలీసు పోస్టులు..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయశాఖలో  గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు పోస్టులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా హైకోర్టులో దాఖలైన కేసు తరువాత ఈ పోస్టులను హోంశాఖలో ఉంచాలా..? లేదంటే వేరొక శాఖలో విలీనం చేయాలా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. 2019లో ఈశాఖను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశారు. అయితే నాటి నుంచి నేటివరకూ ఈ మహిళా పోస్టుల పోస్టులపై హైకోర్టుల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవలే నమోదైన కేసుకి సంబంధించి మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ విధులకు వినియోగించమని, వారిని పోలీసులుగా పరిగణించడం లేదని హైకోర్టుకి అఫడిట్ దాఖలు చేశారు డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి. ఆ తరువాత నుంచి మహిళా పోలీసులకు లైన్ డిపార్ట్ మెంట్ లేకుండా పోయింది. గతంలో గ్రామ సంరక్షణ, గ్రామాల్లోని విద్యార్ధినిలు, మహిళలకు అండగా ఉంటూ దిశ సేవలను అందించేవారు. ఆ తరువాత వీరిని పోలీసు స్టేషన్లలో విధులకు వినియోగించడంపై కేసు దాఖలు కావడంతో ఆ పనుల వారిని నిలిపివేశారు. అంతేకాకుండా పోలీసుశాఖకు సంబంధించి ఏ ఒక్క పనికూడా వారికి చెప్పడం లేదు. ప్రస్తుతం వారంతా ఓటరు నవీకరణ కోసం బిఎల్వో విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తమకు లైన్ డిపార్ట్ మెంట్ కేటాయించాలని, మళ్లీ పోలీసుశాఖ పనులు, పాత డ్యూటీ చార్టునే అప్పగించాలంటూ అన్నిజిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం కోర్టులో కేసులు నలుగుతున్న సమయంలోనూ.. ఒకే జాబ్ విషయంలో పదే పదే కోర్టు కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో మహిళా పోలీసులను వారి వారి విద్యార్హతను బట్టి ఖాళీగా ఉన్న పోస్టుల్లో విలీనం చేయడం ద్వారా పూర్తిస్థాయిలో సచివాలయ ఉద్యోగాలన్నీ భర్తీచేసినట్టు అవుతుందనే సూచనను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్న కోర్టుకేసులతోపాటు, భవిష్యత్తులో కోర్టుకేసులు దాఖలతై ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని చెప్పినట్టుగా కూడా తెలిసింది. ఈ శాఖఏర్పాటైన దగ్గర నుంచి నేటివరకూ దాఖలైన కేసుల్లో పురోగతి ప్రభుత్వం తరపునుంచి సాధించకపోవడాన్ని కూడా ప్రభుత్వంలోని అధికారులు, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నదని తెలిసింది. కాగా మహిళా పోలీసుల సేవలు రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పుష్కలంగా అందుతున్నాయి. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా మహిళా పోలీసులు సచివాలయాల్లోని సేవలతోపాటు, ఎన్నికల విధులు, ఐసిడిఎస్ విధులు, పోలీసుశాఖ విధులు, గ్రామ సంరక్షణ విధులు ఇలా అన్నిరకాలుగా పనిచేస్తున్నారు. ఇలా పనిచేసే శాఖను మరొక శాఖలో విలీనం చేస్తే.. ఒక్క శాఖ యొక్క పనులే చేయించగలుగుతామనే వాదన కూడా ఇతర అధికారులు తెరమీదకు తీసుకొచ్చినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అందునా గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత ఇంకా రానందున వారిని ఇతర శాఖల్లోకి ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి భర్తీచేయడం ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేసినట్టుగా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు చెబుతున్నారు.

సచివాలయ మహిళా పోలీసు విభాగం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన తరువాత దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఎంతో చక్కగా ప్రజల్లోకి వెళ్లింది. వీరి ద్వారా గ్రామంలోనే రక్షణ చర్యలు చక్కగా సాగుతున్నాయి. వర్తక వాణిజ్యాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు దగ్గర నుంచి గ్రామాల్లో జరిగే ఆందోళనలు నియంత్రించడం, ఉద్యోగులు ఇళ్ల వద్ద ధర్నాలకు వెళ్లకుండా రాత్రంతా కాపలాకాయడం, కోర్టు సమన్ల సమాచారం అందించడం, నాటు సారా నియంత్రణ, స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్ధినిలకు రక్షణ చర్యలు, దిశయాప్ వినియోగంపై అవగాహన ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం వుండేది. ఇపుడు కోర్టుకేసు కారణంగా అవన్నీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా పోలీసుశాఖ విధుల నుంచి వీరిని తప్పించారు. దీనితో మహిళా పోలీసు అనే పేరుకి అర్ధం మారిపోయింది. ఈ తరుణంలో తెరపైకి వచ్చిన అంశాలను కూడా ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నదట. మహిళా పోలీసులు ఉద్యోగులందరూ  నాల్గవ తరగతి కేడర్ కిందకు వస్తున్నందున వీరిని రాష్ట్రవ్యాప్తంగా వున్న జిల్లా ఎస్పీ కార్యాలయాలు, సబ్ డివిజన్లు, దిశ పోలీస్ స్టేషన్లు, పోలీస్ కమిషనరేట్లలో మినిస్టీరియల్ స్టాఫ్ గా నైనా వినియోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. పైగా చాలా మంది ఉద్యోగులు బిటెక్ చేసి ఉన్నందున వారిని సైబర్ విభాగం, కమ్యూనికేషన్ విభాగాల్లోనూ వినియోగిస్తే పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాలు తీసే ఒత్తిడి కూడా ఉండదనే ఆలోచన కూడా పోలీసుశాఖలోని అధికారులు చర్చిస్తున్నారని సమాచారం.

మరోప్రక్క ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సేవలు, వారి ద్వారా ప్రభుత్వానికి కలిసొస్తున్న పనులను ప్రభుత్వం బేరీజు వేస్తున్నది..ఈ నేపథ్యంలో కోర్టుకేసులు కాస్త ఇబ్బంది పెట్టినా..వీరందరినీ డిఎస్సీ ద్వారా ఏపిపిఎస్సీతో నియామకాలు చేపట్టినందున ఒక ప్రత్యేక విధి విధానాలు రూపొందించి వీరి ఉద్యోగాలకు చట్టభద్దత తీసుకువస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కోర్టులో దాఖలవుతున్న కేసులన్నీ మహిళా పోలీసు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరగలేదనే విషయాన్ని కేసుల్లో ప్రస్తావిస్తున్నారు ఫిర్యాదు దారులు. వాస్తవానికి మహిళా పోలీసులకు కూడా ప్రభుత్వంపోలీసుశిక్షణను అందించింది. వారికంటే మెరుగ్గా గ్రామాల్లో వీరి సేవలను ఎంతో చక్కగా వినియోగిస్తున్నది. కానీ ప్రభుత్వంలోని కొన్ని సర్వీసు రూల్స్ వీరి నియామకాల విషయంలో మోకాలడ్డుతున్నాయి. వాటిని అదిగమించే విషయంలో కూడా పోలీసుశాఖ గాని, హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ గానీ ప్రత్యేకంగా ద్రుష్టిసారించిన దాఖలాలు లేవు. కోర్టుల్లో కేసులు దాఖలైనపుడు కేసు నుంచి బయటపడేందకు అఫడివిల్లు దాఖలు చేస్తున్నది తప్పితే వాటికి పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని మాత్రం చూపించడంలో ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విషయం తాజా కోర్టుకేసుల్లో నిరూపితం అయ్యింది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో విలీనాన్ని ఎంచుకుంటుందా..? పోలీసుశాఖలోని మినిస్టీరియల్ సిబ్బందిగా వారిని వినియోగిస్తుందా..? లేదంటే సచివాలయాల్లోనే గ్రామ, సంరక్షణా కార్యదర్శిలుగానే పోలీసు అనుబంధ విభాగంగా వినియోగిస్తుందా..? అనేవిషయం తేలాల్సివుంది..!

Tadepalli

2023-08-01 04:19:38

గ్రామ సచివాలయ మహిళాపోలీసులకు స్టేషన్లతో కాలం చెల్లింది..!

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 15వేలకు పైచిలుకు మహిళా పోలీసులకు, పోలీస్ స్టేషన్లు,అక్కడి విధులతో కాలం చెల్లిపోయింది. ఇకపై సచివాలయ మహిళా పోలీలను ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులుగా పరిగణించేది లేదని డిజిపి రాజేంధ్రనాధ్ రెడ్డి హైకోర్టుకి ఆఫడవిట్  సమర్పించారు. ఇకపై ఎవరినీ పోలీసులుగా పరిగించమని అందులో పేర్కొన్నారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న  సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావాల్సిన పూర్తి సహాయసహకారాలు అందిస్తారని అందులో పేర్కొన్నారు. కాగా గ్రామ,వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గరనుంచి ఒక్క మహిళా పోలీసు పోస్టులపైనే హైకోర్టులో కేసులు నమోదు అవుతున్నాయి. కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ ను, తమ ఆదేశాలను ఏ ఒక్క స్టేషన్ ఆఫీసర్, సిఐ, డిఎస్సీ, ఎస్పీ ఎవరు అతిక్రమించినా కఠినచర్యలు తీసుకుంటామని కూడా స్టేట్ పోలీస్ కాన్ఫరెన్సులో డిజిపి ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. దానితో నేటి నుంచి ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. కోర్టుకి సమర్పించిన ఆఫడవిట్ లోని అంశాలన్నీ సచివాలయ మహిళా పోలీసుల విధుల విషయంలో పోలీసుశాఖ పాటించనున్నది.

 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీస్ ను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు  శాంతి భద్రతల  వంటి వాటికి వినియోగించడం,  తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే లక్ష్మణరేఖను ప్రత్యేక ఉత్తర్వులతో డిజిపి  గీసి ఉంచారు. దానితో మహిళా పోలీసులకు పోలీస్టేషన్లకు సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్టు అయ్యింది. వాస్తవానికి మహిళా పోలీసు విభాగం ఏర్పాటు చేయడం అసలు పోలీసుశాఖలోని హోం గార్డుల దగ్గర నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ఇష్టం లేదు. వారి అసహనాన్ని చాలా సందర్భాల్లో వెళ్లగక్కేవారు. వీరందరూ తమ క్రింద ఉద్యోగులుగా వ్యవహరించేవారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా డిజిపి కార్యాలయానికి తెలిసినా క్రింది స్థాయి సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అదే సమయంలో వీరిని తరచుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ డ్యూటీలు, స్టేషన్ రికార్డ్ వర్క్, సభులు, సమావేశాలు జరిగినపుడు బందోబస్తు డ్యూటీలకు, కోర్టు సమన్లు వచ్చినపుడు వాటి సమాచారం వీరితోనే సదరు నోటీసు దారులకు తెలియజేయడానికి వినియోగించేవారు. ఇపుడా విధానాలకు పూర్తిగా కోర్టుకేసు, డిజిపి ఆదేశాలతో అడ్డుకట్ట పడినట్టు అయ్యింది.

దేశంలో ఎక్కడాలేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వశాఖను అయితే ఏర్పాటు చేశారుగానీ 2019 అక్టోబరు 2 నుంచి నేటి వరకూ సుమారు 19 ప్రభుత్వశాఖల్లోని రాష్ట్ర ముఖ్యకార్యదర్శిలకు వారిలో వారికే సమన్వయం లేకుండా పోయింది. ఒకశాఖ జారీచేసిన ఉత్తర్వులు మరోశాఖ నేటివరకూ అమలు చేయడం లేదు. మరోప్రక్క జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను పక్కన పెట్టి అందరు సిబ్బందినీ అన్ని శాఖల విధులకూ నేటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ఏపీలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖ ఉద్యోగులు ఆశాఖ విధులను మాత్రమే నేటికీ చేస్తూ వస్తున్నారు. కానీ ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రమే అన్ని ప్రభుత్వశాఖల విధులు, పనులు సచివాలయాల్లో చేయాల్సి వస్తున్నది. విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా అన్నిశాఖల జిల్లా అధికారులు సచివాలయశాఖ ఉద్యోగులపై అజమాయిషీ చేస్తూ ఉండటం. ఇక్కడి ఉద్యోగులందరూ వారి జిల్లా, డివిజన్, అన్నిమండలశాఖ అధికారులతోపాటు, సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శిలకూ సమాధానాలు చెప్పుకోక తప్పడంలేదు.

ఏ ప్రభుత్వంలోనైనా ఏదైనా కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటుచేసినా..దానికి సిబంధించిన చట్టబద్దతను అసెంబ్లీలో ప్రత్యేక బిల్లుద్వారా రెండేళ్లలో పూర్తిచేస్తుంది. ఆపై సదరు ప్రభుత్వశాఖకు  ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్, అడిషనల్ డెక్టర్, జిల్లా అధికారి, డివిజన్ అధికారి, మండల అధికారి ఇలా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని రకాల పోస్టులను తయారు చేస్తుంది. ఈశాఖ అధికారులతోనే ప్రభుత్వంలోని ఏ సర్వీసు నిబంధనలతో ఏ ఉద్యోగాలను భర్తీచేశారో..దానికి తగ్గట్టుగా వారికి ప్రమోషన్ ఛానల్, ఇంక్రిమెంట్లు, డిఏలు, ఎస్ఆర్ మాన్యువల్ ఏర్పాటు చేయాలి. కానీ నేటివరకూ గ్రామ, వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం చట్టభద్దతే కల్పించలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు తరచూ ఏదోవిధంగా ఈశాఖపై కోర్టులో కేసులు దాఖలవుతూనే ఉన్నాయి. ఒక్క మహిళా పోలీసు విభాగంపై 2 కేసులు నేటికీ హైకోర్టులో ఉన్నాయి. ఫలితంగా ఈశాఖలోని ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన 2ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ఇచ్చామని ప్రకటించిన సమయంలో కూడా వీరికి ఐఆర్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డిఏ కూడా వీరికి వర్తింపచేయలేదు. ఈ కారణాలతో అసలు తమ ఉద్యోగాలు రెగ్యులర్ వా..కాంట్రాక్టు పద్దతిలోనే ఉన్నాయా అనే అనుమానాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఈశాఖ ఉద్యోగులకు అడుగడునా, అవమానాలు, ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అటు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు కూడా రావడంలేదు. చూడాలి కోర్టు కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈశాఖ విషయంలో ముందు ముందు ఏవిధంగా వ్యవహరిస్తుందనేది..!

Amaravati

2023-07-28 04:30:19

గ్రామపంచాయతీల్లో ఆగస్టు15 నుంచి డిజిటల్ చెల్లింపులు

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 12940 గ్రామ పంచాయతీల్లోని, 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 15నుంచి డిజిటల్ చెల్లింపులు చేపట్టేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో యూపిఐ, డిజిటల్ పేమెంట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంతో ఏపీలో కూడా దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధమవుతున్నది.కాగా ఏపీలో13 జిల్లాలు 26జిల్లాలు అయినా.. ప్రస్తుతానికి కేంద్రం ద్రుష్టిలో మాత్రం నేటికీ 13 జిల్లాలుగానే ఉన్నాయి. ఇక డా.వైఎస్సార్ కడప జిల్లాలో-800 గ్రామ పంచాయతీలు, పశ్చిమగోదావరి-888, విజయనగరం- 929, విశాఖపట్నం- 944, శ్రీకాకుళం-1101, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు-961,ప్రకాశం-1036, కర్నూలు-899, క్రిష్ణ-972, గుంటూరు-1016, తూర్పుగోదావరి-1012, చిత్తూరు జిల్లాలో-1381 పంచాయతీల్లో డిజిటల్ పేమెంట్లు చేసేలా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లుచేసింది.

Tadepalli

2023-07-27 01:40:58

కారుణ్య నియామకాల ద్వారా సచివాలయ ఉద్యోగాలభర్తీ

ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో మ్రుతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించనుంది. ఆ ఉద్యోగాలన్నీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఖాళీల్లో భర్తీచేయాలని 26 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా రాష్ట్రవ్యాప్తంగా 2917 మంది మ్రుత్యువాత పడగా.. ఇప్పటి వరకూ 2744 మంది కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఆగస్టు 24 నాటికి అపాయింట్ మెంట్లు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కాగా నియామాలు పూర్తిచేసిన నివేదికను సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వానికి అందజేయాలని ఆయా ప్రభుత్వశాఖల అధికారు లు, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన తరువాతన రెండుసార్లు డిఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1.25 లక్షల మంది ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.

Amaravati

2023-07-26 15:59:07

13ఫైనాన్స్ కమిషన్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయండి

ఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్న సమయంలో 13 ఫైనాన్స్ కమిషన్ కాంట్రాక్టు హెల్త్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో ఏపి ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రాజారావు ఆధ్వర్యంలో ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, సర్వీసుల సలహాదారు ఎన్.చంద్రశేఖరరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల వినతిని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉద్యోగులంతా 2016లో జిఓ నెంబరు 9‌0 ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్దతిలో 1‌‌‌‌00శాతం గ్రాస్ సాలరీతో నియమితులయ్యారని చెప్పారు. ఆ తరువాత ఉద్యోగులందరినీ జిఓనెంబరు 27 అమలుచేసిన సమయంలో ఎంటిఎస్ క్రిందకి మార్పు చేశారని తెలియజేశారు. అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. సలహాదారుని కలిసిన వారిలో నాగరాణి, సోమామణి, అనురాధ, శ్రీలక్ష్మి, చైతన్య, నాగరాజు అన్నపూర్ణ, సౌమ్య, కిషోర్, వలి, నిరంజన్, పల్లవి, చిన్న, వీరభద్ర, చందన, ప్రశాంతి, రవినాయక్, విజయలక్ష్మి, వినయ్, చినవెంకయ్య, రజనీ, చక్రవర్తి, శిల్ప కళ్యాణి తదితరులు పాల్గొ్న్నారు.


Amaravati

2023-07-26 11:11:25

కారుణ్య నియామకాలకు సిపిటి పరీక్ష తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారుణ్యనియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఖచ్చితంగా ఉద్యోగాలు పొందిన వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సిపిటి) పాస్ కావాలనే కీలక నిబంధన పెట్టింది. ఈ మేరకు అభ్యర్ధులు ఉద్యోగాలు పొందిన తరువాత రెండేళ్ల ప్రొభేషన్ కాలంలో ఈపరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని..ఆ తరువాత మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 75 ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ మ్రుతిచెందిన వారి పిల్లలకు కారుణ్యనియామకాలు గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేపట్టింది. అప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన వారందరికీ సిపిటి పరీక్షను తప్పనిసరి చేసింది. ఇపుడు అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులు కూడా ఈ పరీక్ష పాస్ కావాలని నిబంధన పెట్టింది. కాగా ప్రస్తుతం చాలావరకూ ఉద్యోగులు విధులన్నీ కంప్యూటర్ పైనే జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ కీలకనిర్ణయం తీసుకుంది.

Visakhapatnam

2023-07-25 09:38:55

మళ్లీ చిక్కుల్లో పడనున్న సచివాలయ మహిళా పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మహిళా పోలీసుల విభాగానికి బాలారిష్టాలు తప్పడం లేదు. ఆది నుంచి ఈ విభాగం ఉద్యోగులపై కోర్టు కేసులు పడుతూనే ఉన్నాయి. తాజాగా సచివాలయ మహిళా పోలీసులను సాధారణ పోలీసులు మాదిరిగా విధులకు పంపించడా న్ని..పరిగ ణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు దాఖలైంది. దానికి ప్రభుత్వం నుంచి ఏజి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వారిని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్, బందోబస్తు డ్యూటీలు వేయడానికి సవాల్ చేస్తూ ఈ కేసు దాఖలైంది. దానితో డిజిపి కార్యాలయం నుంచి వారికి పోలీసు విధులు అప్పగించకుండా ఆదేశాలిస్తామని కోర్టుకి విన్నవించింది. గతంలోనే వీరిని మహిళా పోలీసులుగా ఏవిధంగా నియమిస్తారనే అంశంపై ఉమ్మడి విశాఖజిల్లా నుంచి నిరుద్యోగ అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. దానిపై పూర్తిస్థాయి తీర్పు పూర్తవకుండానే మరో కేసు దాఖలవడం చర్చనీయాంశం అవుతోంది. ఒక్క మహిళా పోలీసుల విభాగంలోనే కోర్టు కేసులు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. దానికి ప్రభుత్వం దగ్గర కూడా సాంకేతిక పరమైన సమాధానాలు లేకపోవడంతో ఆ కేసుల విషయంలో హోంశాఖ నెగ్గే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు హోంశాఖ ద్వారానే వీరికి నియామక ఉత్తర్వలు జారీచేశారు. తొలుత మహిళా సంరక్షణా కార్యదర్శిల పేరుతో నియామకాలు ఇచ్చిన ఏపి ప్రభుత్వం తరువాత వారి హోదాను మహిళా పోలీసుగా మార్చింది. వారికి సర్వీస్ రూల్స్ ని అమలు చేస్తూ ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేసింది. సీనియర్ మహిళా పోలిస్(హెడ్ కానిస్టేబుల్ హోదా) ఆ తరువాత ఏఎస్ఐ, ఎస్ఐ, ఆపై సిఐలుగా పదోన్నతులు వీరికి కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే వీరందరినీ దిశ పోలీస్ స్టేషన్లు, విధులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచించింది. ఆదిశగా ఒక్కో పోలీసు విధులను వీరికి కేటాయిస్తూ వచ్చింది. సరిగ్గా పోలీస్ స్టేషన్లలో విధులు, బందోబస్తులు, కోర్టు సమన్లు, నాటుసారా రవాణా సమాచారం ఇలా అన్నివిభాగాల్లోనూ వీరిని వినియోగించి నిజమైన పోలీసులుగా వీరిని పరిగించడంపై అభ్యంతరాలు వ్యక్తమై విషయం కోర్టులో కేసు వరకూ వెళ్లడంతొ.. పోలీసు విధులను వారికి అప్పగించమని ఏజి ద్వారా డిజిపి కార్యాలయం హైకోర్టుకి విన్నవించింది.

మరోప్రక్క వీరికోర్టు కేసుల నెపమో, లేదంటే ఉద్యోగులందరి సర్వీసులు రెగ్యులర్ కాలేదనే సాంకేతిక కారణమో తెలీదు కానీ గ్రామ, వార్డు సచివాలయ 
ఉద్యోగుల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వశాఖకు మంత్రివర్గ బేటీలో ఆమోదించి.. ఆపై అసెంబ్లీలో చట్టబద్దత కల్పించకుండా వదిలేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరికి సర్వీసు రూల్సును కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. రెండేళ్ల తరువాత రెగ్యులర్ చేస్తామ ని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత అదనంగా 9నెలలు వీరితో పనిచేయించింది. ఆ సమయంలో ఉద్యోగులు రెండు ఇంక్రిమెంట్లు, రెండు డిఏలు, ఆ 9 నెలలపాటు ఫుల్ పేస్కేలు, పీఆర్సీకి సంబంధించి ఐఆర్ ను కూడా ఉద్యోగులు కోల్పోయారు. వీరు కోల్పోయిన ఇంక్రిమెంట్లు, డిఏలు, ఐఆర్ పై నేటికీ ఇదేశాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రశ్నించడం లేదు. ఈ లెక్కన చూస్తే ఈ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత రాకపోతే వచ్చే ప్రభుత్వం మారితే వీరి ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. 

భారతదేశం మొత్తం ఏపీవైపు తొంగిచూసే విధంగా కొత్తగా ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ శాఖకు సంబంధించి సాంకేతిక పరమైన అంశాలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. నేటికీ సుమారు 19శాఖల సిబ్బందికి, జిల్లాకలెక్టర్లకు, జిల్లా, మండల అధికారులకు కూడా పూర్తిస్థాయిలో ఈశాఖపై అవగాహన రాలేదంటే..ఈశాఖపై ప్రభుత్వం ఏ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ఇటీవల అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసిన డిఏని, సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడంపైనా ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. సర్వీసు రెగ్యులర్ అయిన ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇంక్రిమెంటు విషయంలో టార్గెట్లు పూర్తికాకపోతే మొదటి ఇంక్రిమెంట్ వేసేది లేదని జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఎందుకు ఇవ్వడం లేదంటే ఆ ఒక్కటీ అడగొద్దు అని జిల్లా అధికారులు సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అనుమానాల మధ్య మా ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలినియని ఆయోమయ భయం తమను వెంటాడుతోందని ఉద్యోగులు భయాంతోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు కూడా 2024 ఎన్నికల్లో ప్రభావం చూపిచే అవకాశాలున్నాయిని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి.

Visakhapatnam

2023-07-21 04:40:37

ఈఎన్ఎస్ వార్తకు స్పందన..వెలువడిన ఆన్ లైన్ ఉత్తర్వులు

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు సంబంధించిన అంతర్ జిల్లాల బదిలీలపై హోంశాఖ స్పందించింది. గత నెలలో పూర్తికావాల్సిన బదిలీల ప్రక్రియన వాయిదా పడుతూ వచ్చింది. ఈ విషయమై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్తంగా మహిళా పోలీసుల బదిలీలకు ఎదురుచూపులే శీర్షికన వరుస కథనాలు ప్రచురించింది. దీనితో ఎట్టకేలకు ప్రభుత్వం హోంశాఖ ద్వారా జిఓఆర్టీనెంబరు 776 పేరిట ఉత్తర్వులు జారీచేస్తూ..బదిలీలుకోరుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్లో జాబితా విడుదల చేసింది. మరో రెండురోజుల్లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వీరికి బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలొచ్చాయి. మరోవైపు ఆన్ లైన్ జాబితాలో పేర్లు ఉన్నవారు సంబంధింత నోడ్యూస్ సర్టిఫికేట్లు సిద్దం చేసుకోవాలని కూడా సూచించారు. 

Visakhapatnam

2023-07-20 15:27:09

సచివాలయ ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఎదురుచూపులే..?!

గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకి ప్రభుత్వం చేపడతామన్న పరస్పర బదిలీలు(మ్యూచ్ వల్) ప్రక్రియకు తేదీ ఖరారు చేయకపోవడంతో ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకున్నవారంతా ఉసూరుమంటూ వేచి చూడాల్సి వస్తోంది. ఈనెల 10 నుంచి 12 లోపు అన్ని రకాల బదిలీలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్స్ విషయంలో ఎందుకనో వెనక్కి తగ్గింది. దీనితో ఉద్యోగులు నిరాశపడిపోయారు. చాలామంది ఇటీవల తేదీ ఖరారు చేసి జిల్లాలకు రమ్మని చెప్పిన తరువాత.. తూచ్ మళ్లీ మీకు బదిలీల తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో చాలమంది ఉద్యోగులు తిరిగి వారి ఉద్యోగ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కొందరు ఉద్యోగులు తేదీ ప్రకటించేస్తారని బ్రమపడి నాలుగైదు రోజులు సెలవులు వాడేసుకొని వెనక్కి వెళ్లకుండా ఉండిపోయారు. తీరా తేదీని ప్రకటించకపోవడంతో చేసేది ఏంలేక ఆదివారం సాయంత్రం పెట్టేబేడా సర్ధుకుని విధులకు వెళ్లిల్సిన దుస్తితి ఏర్పడింది. జిల్లాల పరిధిలోని బదిలీలను ఇచ్చిన సమయానికే పూర్తిచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల విషయంలో ఆలోచనలో పడింది. దీనితో ఆ ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా పడింది.


అందరికీ బదిలీల చేసిన ప్రభుత్వం తమను మాత్రం గాలికొదిలేసిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాల్లో ఉన్న డిఎల్డిడీఓలకు, జిల్లాశాఖల అధికారులకు సమాచారం లేకపోవడం వారు కూడా చేతులెత్తేస్తున్నారు.. ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే అందరికీ ఒకేసారి తెలుస్తుంది కదా అంటూ ఉద్యోగులపై చిరాకు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల బదిలీల ప్రక్రియ జరిగిపోయినా..స్థాన చలనం కదిలిన సచివలయం నుంచి బదిలీ జరిగిన సచివాలయంలో చేరేందుకు వీలు లేకుండా వారం రోజుల పాటు ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. ఇదంతా 19 ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపంగానే చెబుతున్నారు. పోనీ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే జరిగినందున కనీసం ఆన్ లైన్ కౌన్సిలింగ్ సైతం చేపకట్టకపోవడం వెనుక ఆంతర్యం ఉద్యోగులకు అంతుపట్టడం లేదు.. అసలు తాము దరఖాస్తు చేసుకున్న ప్రదేశాలకు బదిలీలు చేస్తారో..చేయరోననే ఆందోళనను ఉద్యోగులు వ్యక్తం చేయడం విశేషం. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా కాకుండా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు మాత్రమే వీరి ఉద్యోగాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి నేటి వరకూ అంతా కాస్త తేడాగానే చేస్తున్నది ప్రభుత్వం. దీనితో సాధారణ ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా తాము లేమనే బావన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొననసాగితే 2024 ఎన్నికల్లో ఈ శాఖ ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

Amaravathi

2023-06-26 03:03:37

బాబ్బాబు.. మా సచివాలయాల్లో ఈ సేవలన్నీ అందిస్తున్నాం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక.. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఏపీవైపు తొంగిచూసేలా చేసిన ఏకైక ప్రభుత్వ శాఖ..గ్రామ, వార్డు సచివాలయశాఖ.. రాష్ట్రంలో ఈ ప్రభుత్వశాఖ వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా..ఒక్కో సచివాలయంలో ఎంత మంది ఉద్యోగులుంటారు..ఏ శాఖ సిబ్బంది ఉంటారు..ఏఏ రకాల సేవలు అందింస్తారో ఎవరికీ తెలీదు.. వీరూ ప్రజలకు తెలియజెప్పలేదు.. కాదు కాదు..వారికి కేటాయించిన డ్యూటీ చార్ట్ ఏంటో ఈ శాఖ ఉద్యోగులకే తెలీదు.. అందుకే ఇన్నేళ్లు దాటుతున్నా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేసే సేవలు తెలియకపోవడంతో  ఉచితంగా కొన్ని రోజులు సేవలు అందించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానికోసం ప్రత్యేకంగా నెలరోజులు ప్రత్యేక ప్రచారానికి ఈరోజునుంచే తెరలేపింది. రాష్ట్రంలోగ్రామ, వార్డు సచివాలయశాఖలో 26 జిల్లాల్లో 14వేల 5 సచివాలయాల్లో సుమారు 1.35 లక్షల మంది ఉద్యోగులు..వీరంతా ఒకేసారి వారి ప్రభుత్వశాఖలకు సంబంధించిన సేవలపై గ్రామాల్లోని పెద్దలకు, ప్రచారం చేస్తే ఎప్పుడో ఇక్కడి సేవలపై అవగాహన వచ్చేది. కానీ అలాచేయకపోవడంతో ప్రభుత్వమే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి బాబ్బాబు అంటూ పూనుకోవాల్సి ఇపుడు ప్రచారం చేయాల్సి వస్తోంది.

ప్రజలకు అవగాహన జరుగుతుందిలా..
రాష్ట్రంలో జూన్ 24 నుంచి నెల రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్  ద్వారా సుమారు 745 సేవలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తారు. ఈప్రచారం జరుగుతున్న సమయంలో 11 రకాల సేవలు(ఆధార్, కుల, ఆదాయ, నివాసం, జనన, మరణ, ఓబిసి తదితర) ఉచితంగానే ఇస్తారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధులకు, డ్వాక్రా సంఘాలకు, తెలిసేలా ప్రచారం చేపడతారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ద్రువీకరణ పత్రాలు కావాలంటే సచివాలయాల ద్వారా తీసుకోవాల్సి వుంటుంది. అయితే అక్కడ ఏ తరహా సేవలు అందిస్తారనే విషయంలో నేటివరకూ పూర్తిస్థాయి అవగాహన ప్రజలకు లేదు. దీనితో ఇపుడు ఆ సేవలపై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక నాయకుల సహకారంతో ప్రజల్లోకి తీసుకెళతారు. అలా చేయడం ద్వారా గ్రామం లేదా వార్డులోని సచివాలయాల దగ్గరకే ఏ అవసరం వచ్చినా వెళ్లాలనే అవగాహన ప్రజలకు కల్పిస్తారు.

రాష్ట్ర, జిల్లా, మండల అధికారుల వైఫల్యమే..
అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లా, మండల శాఖ అధికారుల వైఫల్యం వలనే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన, చైతన్యం రాకుండా పోయాయనడాకి 19శాఖల్లో వారిలో వారికి సమాచార లోపమనే చెప్పాలి. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి బెదిరించి విధులు చేపట్టేలా చేయడం తప్పితే ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సక్రమంగా ఒక్క ప్రభుత్వశాఖ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టే సమయంలో కూడా సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పలేదు. ఇక్కడ ఉద్యోగులకు సర్వీస్ ప్రొభేషన్ ఖరారు అయ్యేంత వరకూ రాష్ట్ర అధికారి, జిల్లా కలెక్టర్, మండల అధికారులు వరుసుగా వీరందరినీ భయపెట్టే పనులు చేయించడం వలనే సిబ్బంది కావాలనే సచివాలయాల్లో అందే సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లలేదనే విషయం మీడియా ద్వారా చాలాసార్లు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీచేస్తే పంచాయతీరాజ్ కి పడేది కాదు..విద్యాశాఖ అమలు చేసే ఆదేశాలు ఇంజనీరింగ్ శాఖకు నచ్చేది కాదు..ఇలా ఏ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినా మండలాల్లో ఎంపీడీఓలు వాటిని అమలు పరిచేవారు కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు రెగ్యులర్ కావాల్సి వుందనే బెదిరింపులూ వచ్చేవి. వెరసీ మూడేళ్లు దాటిపోతున్నా నేటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లోని సేవలు ప్రజల్లోకి వెళ్లలేదు..

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసినా ప్రజలందరూ అన్ని రకాల సేవల కోసం మీ సేవా కేంద్రాలనే ఆశ్రయించేవారు. ముఖ్యంగా రెవిన్యూశాఖకు సంబంధించిన అన్ని పనులూ అక్కడే జరిగేవి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మీసేవా కేంద్రాలకు వెళ్లిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 5 సచివాలయాల ద్వారా అన్ని రకాల సర్వీసులు అందించే ఏర్పాటు ప్రభుత్వశాఖల వారీగా చేసి ఉంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగేది. అంతేకాకుండా అపుడు మీసేవాల్లో ఇచ్చే ద్రువీకరణలు వేరుగా..సచివాలయాల్లో ఇచ్చే ద్రువీకరణలు వేరుగా ఉండటం వనలన కూడా అందరూ మీసేవ కే ఎక్కువ మొగ్గు చూపేవారు. అంతేకాకుండా మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులకు సిబ్బంది కూడా ముందుకెళ్లి పనులు చేసేవారు. దానిని గుర్తించిన ప్రభుత్వం మీసేవాల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖ పత్రాలనే వివిధ రకాల ద్రువీకరణల కోసం వినియోగించడం మొదలు పెట్టిన తరువాత మీసేవ, సచివాలయాలకు మధ్య వ్యత్యాసం అందరికీ తెలిసింది. ప్రస్తుతం చేసే ప్రచారంతో మరింత మందికి తెలిసే అవకాశం వుంటుంది.

ఉద్యోగులు తలచుకుంటే వారం రోజులు చాలు..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న 1.35 లక్షల మంది ఉద్యోగులు ఒక్కసార తలుచుకుంటే..వారి ప్రభుత్వశాఖల వారీగా అందించే సేవలను ప్రచారం చేయడం మొదలు పెడితే ప్రజలందరికీ ఒకేసారి అవగాహన వస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే వారంరోజులు సరిపోతుంది. తద్వరా ఇంటి ముంగిటే సచివాలయ సేవలు అందుతున్నాయనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, Ens Live యాప్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఈశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రచారం చేస్తే మరింత త్వరగా ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ అవుతయాని వరుస కథనాల ద్వారా తెలియజేసింది. అయితే శంఖంలో పోస్తేనే తీర్ధం అయినట్టుగా.. ప్రభుత్వానికి సచివాలయాల్లో అందించే సేవలపై ప్రత్యేకంగా ప్రచారం చేయాలనే ఆలోచన రావడానికి మూడేళ్లు దాటిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఒక పక్కా ప్రణాళికతో సేవలపై ప్రజలకు అవగాహన పెంచడంతోపాటు,  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో కంప్యూటర్ల సంఖ్య కూడా పెంచితే మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం వుంటుంది. లేదంటే అన్నిశాఖల భారం ఒక్క డిజిటల్ అసిస్టెంట్ పైనే ప్రస్తుతం పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది తేలాల్సి వుంది..!

Amaravathi

2023-06-24 07:03:36

APCPSEAతో వాస్తవాలను తెలియజేసే సిపిఎస్ ఉద్యోగి మేలుకో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి.. ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రచారాలను, సంబురాలను ఉద్రుతం చేస్తున్న వేళ..ఆం ధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వాస్తవాలను అందరికీ తెలియజేసే పనిలో పడింది. అసలు సిపిఎస్ రద్దుచేసి ప్రభుత్వం మనం దాచుకున్న డబ్బుని మనకే ఇస్తుందంటూ ఒక వాస్తవాన్ని తెలియజేసే చైతన్యకార్యక్రమాలకు తెరలేపింది. ఇపుడు ఆ మెసేజు, అవగాహన రాష్ట్రంలోని సుమారు 3.50 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ను ఆలోచింప జేస్తున్నది. ఈ క్రమంలోనే సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ ద్వారా ప్రభుత్వం అంతకంటే గొప్పగా ఇస్తామని చేస్తున్న ప్రచారంలో నిజమెంతో తెలియజేస్తుంది. ఆ విషయాలను సిపిఎస్ ఉద్యోగులతోపాటు పాఠకులు కూడా తెలుసుకుంటారనే ఆలోచనతో సోషల్ మీడియాలో తారా స్థాయిలో జరుగుతున్న ఆచర్చను మీ ముందుకి తీసుకు వస్తున్నా్ం. ఈ లెక్కలు చూసిన వారు ఎవరైనా కిమ్మనకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో.. అవేంటో మీరూ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి.. !

ప్రతీ నెల కట్ చేసిన (బేసిక్+డి.ఎ. పై) 10% అమౌంట్ అంటే.... నెలకు సుమారు రూ.6,000/-  చొప్పున 33 సంవత్సరాల సర్వీస్ అంటే సంవత్సరానికి ₹72,000/- చొప్పున 33 సంవత్సరాల సర్వీసుకు మొత్తంమీద  రూ.23,76,000/-  ఉద్యోగుల జీతం నుండి కట్ అవుతుంది. దీనికి వడ్డీ తక్కువలో తక్కువగా సుమారు రూ. 6,24,000/- అనుకుంటే .... మన పదవీవిరమణ నాటికి ప్రభుత్వం వద్ద ఒక  సిపిఎస్ ఉద్యోగి నుండి రూ.30,00,000/- లకు పైబడిన అమౌంట్ ఉంటుంది. ఈ  అమౌంట్ ఏమోవుతుందో తెలిసిన వారు చెప్పగలరు. ఇక ఆ రూ.30,00,000బ్యాంకులో జమ చేస్తే నెలకు సుమారు ఎంత వడ్డీ రావచ్చునో అంచనా వేస్తే....ప్రభుత్వం మనకు 50% పింఛను ఎలా ఇస్తానంటుందో తెలుస్తుంది. 

 చిన్న మనవి..
 మనం ప్రతీ నెల సిపిఎస్ డిడక్షన్ కింద లెక్కించిన రూ.6000/- అంచనా మాత్రమే సర్వీసు మొత్తం ఈ అమౌంట్ పెరుగుతూ పోతుంది. అంటే పదవీవిరమణ నాటికి ప్రభుత్వం వద్ద ఉద్యోగి అమౌంట్ రూ.30,00,000/- లకు పైబడే ఉంటుంది.


ముఖ్య గమనిక:- 
1) జిపిఎస్ అమలైతే ప్రభుత్వం నెలనెలా కట్టే తన మేచింగ్ గ్రాంట్ 10% ఆపేస్తుంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ కాదు. 2) ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ఈ పదకం వల్ల ఉద్యోగులకు లాభం లేదు. ఎందుకంటే ఈ రోజున జీవన ప్రమాణాల ప్రకారం 62 సంవత్సరాలకు పదవీవిరమణ చేసిన ఉద్యోగి సుమారు 10 లేదా 15 సంవత్సరాలకు మించి జీవించరు. కావున ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బులు తీసుకున్న ప్రభుత్వమే లాభపడుతుంది తప్ప ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు నిట్ట నిలువునా మోసపోతారు

 
కొసమెరుపు... జిపిఎస్  పేరుతో ఇచ్చే పెన్షన్ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా ప్రభుత్వానికి మంచి రాజకీయ ప్రచారం. మాత్రం జరుగుతుందని ఆ ప్రచారంలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగి ఇన్నేళ్లు సర్వీసు చేసినందుకు ప్రయోజనం వుంటుంది తప్పితే.. జిపిఎస్ వలన తాము దాచుకున్న డబ్బు తమకే ప్రభుత్వం ఇస్తూ..తమకోసం చాలా మంచిగా ఆలోచిస్తుందన్నట్టుగా రంగులు పులుముకుంటుందని కూడా ఈప్రచారకులు చైతన్యం తీసుకు వస్తున్నారు. మరో పక్క గత్యంతరం లేక ప్రభుత్వం అమలు చేస్తానన్న జిపిఎస్ ను స్వాగతిస్తున్నామని చెబుతున్న ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా సిపిఎస్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక ఎదురవుతుంది. సిపిఎస్ రద్దు అంశం ముగిసిపోయిందని ప్రభుత్వం చెబుతున్నా.. సిపిఎస్ ఉద్యోగులు మాత్రం దానిని వదలడం లేదు. చూడాలి ఈ జిపిఎస్ ప్రభావం 2024 సాధారణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది..!

Amaravathi

2023-06-23 02:13:40

Ens Live వార్తకు స్పందన..సచివాలయ ఉద్యోగులకు ఆర్డర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేస్తున్న తాత్సారంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ Ens Live, న్యూ స్ వెబ్ సైట్ www.enslive.net ప్రచురించిన ‘సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ సరే..నియామక ఉత్తర్వులేవి’ వార్తపై అధికారులు స్పందించారు. వెనువెంటనే కౌన్సి లింగ్ అయిన అభ్యర్ధులకు పోస్టింగ్ ఆర్డర్లు జారీచేశారు. ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పుగోదావరి జిల్లాతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేశారు.  మరోవైపు పట్టణ పురపాలకశాఖ రాష్ట్ర అధికారులు కూడా కౌన్సిలింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్ధుల వివరాలను ఆన్ లైన్ చేసి..ఆ జాబితాను అధికా రికంగా విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల సమయంలో కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే అదేరోజు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. లేదంటే జాబితా ప్రకటించి, సదరు కార్యాలయాలకు ఉత్తర్వులు చేరవేస్తారు. కానీ సచివాలయ ఉద్యోగుల విషయంలో చెప్పిన సమయానికి కౌన్సిలింగ్ నిర్వహించకపోగా.. ఆలస్యంగా చేసిన కౌన్సిలింగ్ తరువాత కూడా వారికి బదిలీల అయిన చోటుకి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. ఏ ప్రభుత్వ శాఖకు జరగని విధంగా..విభిన్నంగా ప్రక్రియ జరగడాన్ని కూడా ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లిం  ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చాం. 

విషయం తెలుసుకున్న అధికారులు ఆఘమేఘాలపై పోస్టింగ్ ఆర్డర్లకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేశారు. ఏఏ ప్రాంతాలకు అభ్యర్ధులకు బదిలీలు జరిగాయో ఆయా ప్రదేశాల్లోని సచివాలయాల్లో విధుల్లోకి చేరాలంటూ సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులురావడంతో సచివాలయ ఉద్యోగులు ఈవిషయాన్ని ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయాని ఫోన్లు చేసి తెలియజేసి ధన్యవాదములు తెలియజేశారు. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయశాఖ కు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడంతోపాటు, ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే విషయంలోనూ సామాజిక బాధ్యత వహిస్తుందని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులపై వరుస కథనాలు ప్రచురించడం వలనే ప్రభుత్వ వర్గాలు సత్వరమే స్పందించాయని పేర్కొన్నారు. వాస్తవాలను అత్యంత వేగంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు తెలియజేసే విషయంలో మొదటి నుంచి ఒకే ఒరవడిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ప్రదర్శిస్తూ వస్తున్నాయి. ఇకపై కూడా ఉద్యోగుల సమస్యలపైనే కాకుండా..కొన్ని తేడా వ్యవహారాలపైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం..!

Amaravati

2023-06-23 02:00:33

సచివాలయ ఉద్యోగులకు కౌన్సిలింగ్ సరే..నియామక ఉత్తర్వులేవి..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏశాఖ ఉద్యోగులకు జరగని విధంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రకటించిన తేదీకి అభ్యర్ధన బదిలీల ప్రక్రియ జరగకపోవడం.. జరిగే సమయానికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉద్యోగులకు తరువాత చేపడతామని వారికి ఇంటికి పంపడం.. ఆ తరువాత జిల్లాల్లోనే కౌన్సిలింగ్ లు చేపట్టడం అన్నీ జరిగిపోయాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా చాలా జిల్లాల్లో కౌన్సిలింగ్ తరువాత ఉద్యోగు జాయిన్ అవ్వాల్సిన సచివాలయాలకు నియామక ఉత్తర్వులు నేటికొచ్చి జారీచేయలేదు. పైగా ఏ సచివాలయానికి ఏ ఉద్యోగి వెళుతున్నారో చెప్పే జాబితాను కూడా సదరు సచివాలయాల్లో నోటీసు బోర్డులో పెట్టిస్తామన్న ఉత్తర్వులు కూడా అమలుకాలేదు. ఇక అంతర్ జిల్లాలకు బదిలీలు, పరస్పర బదిలీల కోసం దరఖాస్తులు పెట్టుకున్నవారు ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుందో తెలీక  వేచిచూస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో సుమారు 19 ప్రభుత్వశాఖలు మిలితమై ఉండటం ఆ శాఖలకు సంబంధించిన రాష్ట్ర అధికారులకు మధ్య పరస్పర సహకారం, సమాచారం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతున్నది. 

సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అభ్యర్ధ బదిలీల ప్రక్రియకు గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేశారు. కానీ దానిప్రకారం ఎక్కడా జరగకపోవడం విశేషం. అసలు ఉద్యోగుల కౌన్సిలింగ్ కి సంబంధించినంత వరకూ ఇచ్చే ఉత్తర్వులు ఒకటి.. తీరా ఆతేదికి అక్కడికి చేరుకుంటే జరిగేది మరొకటి అవుతున్నది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగుల కౌన్సిలింగ్ అంటే అది జరిగిన వెంటనే కేటాయించిన ప్రదేశానికి బదిలీలు చేసిన నియామక ఉత్తర్వులు అక్కడే ఇచ్చేసేవారు. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. కౌన్సిలింగ్ పూర్తయినా చాలా మందికి కేటాయించిన ప్రదేశాలకు సంబంధించి నియామక ఉత్తర్వులు నేటికీ అందలేదు. దీనితో కొందరు కేటాయించిన ప్రదేశాలు నచ్చక.. పాతప్రదేశాల్లోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకొని జిల్లాశాఖల కార్యాలయాలకు తిరుగుతున్నారు. అయితే వారికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొన్నిరోజులు వేచి ఉండాలనే సమాధానం మాత్రం చెబుతున్నారు. దీనితో తమ పరిస్థితి ఏమిటో తమకే అర్ధం కావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు జరిగిన కౌన్సిలింగ్ కు సంబంధించి వచ్చిన ఉత్తర్వులు, తరువాత జరిగిన విధానం, ఆపై కేటాయించిన ప్రదేశాల్లోకి వెళ్లి జాయిన్ కావడానికి నియామక పత్రాలు ఇవ్వకపోవడాన్ని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా వింతగానే పరిగణిస్తున్నారు.

జిల్లాల పరిధిలో కౌన్సిలింగ్ లు పూర్తయినందున ఇక పరస్పర బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ఉండకపోవచ్చునని, వారికి కేటాయించిన ప్రదేశాలకు సంబంధించి వారి మాత్రుశాఖల అధికారులు ఆన్ లైన్ లో ఉత్తర్వులు పంపిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ జరగని ఉద్యోగులకు తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆవేదన చెందుతున్నారు. వారి జిల్లాశాఖల కార్యాలయాలకు సమాచారం కోసం ప్రయత్నించినా..రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకుండా తాము మాత్రం ఏం చేయగమని ఆ చిరాకంతా ఉద్యోగులపై ప్రదర్శిస్తుండటం విశేషం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జిల్లాశాఖల ఉద్యోగులు కౌన్సిలింగ్ పూర్తయిన అభ్యర్ధులకు వెంట వెంటనే నియామక పత్రాలను జారీచేసి ఉద్యోగులు ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. కొన్ని జిల్లాల్లో మాత్రం తీరా కౌన్సిలింగ్ అయ్యే సమయాన్ని 2రోజుల ముందు ప్రకటించి, ఉద్యోగులు వచ్చేసిన తరువాత వారికి మళ్లీ ఎప్పుడు కౌన్సిలింగ్ పెడతామో చెబుతామని ప్రకటించడంతో సదరు అంతర్ జిల్లాలకు దరఖాస్తు చేసుకున్నవారంతా ఉసూరు మంటూ వెనుతిరగాల్సి వచ్చింది. మరికొందరు ఇప్పటి వరకూ సెలవులపైనే దరఖాస్తు చేసుకున్న జిల్లాల్లోనే ఉండిపోయారని సమాచారం అందుతుంది. ఈగందగోళ పరిస్థితిపై ప్రభుత్వం నిర్ధిష్ట ప్రకటన చేయకపోవడం వలన ఉద్యోగులు అయోమయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కౌన్సిలింగ్ పూర్తయిన వారికి నియామక పత్రాలు, ఇంకా కౌన్సిలింగ్ జరగని వారికి తేదీల ప్రకటన, లేదంటే ఆన్ లైన్ లోనే చేస్తామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు..!

Amaravati

2023-06-22 04:00:49

ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్నీ ఉచితమే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయంతీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూన్ 23న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేవలం నాలుగు వారాల పాటు ఈ ఉచిత సేవలు కొనసాగుతాయి. దానికోసం సచివాలయశాఖలోని సాఫ్ట్ వేర్ ను, వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నారు. భారతదేశంలోనే ప్రపధమంగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సేవలు అందించడకోసం దీనిని ఏర్పాటు చేసినా..ఇక్కడ అందించే సేవలపై ఉద్యోగులే సరైన అవగాహన ప్రజలకు కల్పించేవారు కాదు. అటు రాష్ట్ర అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు పదే పదే ఆదేశించినా సిబ్బంది వాటిని పెడచెవిన పెట్టేవారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసే సౌలభ్యం కలిగింది. ఇక్కడి నుంచి జారీచేసే కుల, నివాస, జనన, మరణ, వివాహ, మ్యూటేషన్, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు ఇలా అన్ని సేవలనూ ఉచితంగానే చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విధంగా చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఏపని కావాలన్నా సచివాలయాలకే వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇటు జిల్లా అధికారులకు, అటు రాష్ట్ర అధికారుల ద్వారా సమన్వయంతో ప్రజల వద్దకే సచివాలయ సేవలను తీసుకెళ్లాలని భావించిన ప్రభుత్వానికి ఫలితాలు తక్కువగానే వచ్చాయి. అదే సమయంలో సచివాలయ సేవలపై అవగాహన కూడా రాలేదు. ఒక్కసారిగా సేవలన్నీ ఉచితం అనేసరికి ఇపుడు ఏపని కావాలన్నా అంతా సచివాలయాల వద్దకే పరుగులు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.

ఉద్యోగుల అవినీతికి చెక్ పెడుతూ పర్యవేక్షణ..
ఒకప్పుడు  కుల, నివాస, జనన, మరణ, వివాహ, మ్యూటేషన్, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు ద్రువీకరణ పత్రాలు పొందాలంటే మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అంతేకాకుండా అక్కడ సిబ్బందికి, అధికారులకి మామూళ్లు ముట్టజెబితే వారికి తీరిక సమయాల్లో ద్రువీకరణ పత్రాలు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తరువాత చాలా వరకూ అవినీతికి అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ చాలా మంది సచివాలయ, రెవిన్యూ ఇతర శాఖల ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. వీరందరినీ ఒకేసారి దారిలోకి తేవాలంటే సేవలన్నీ ఉచితం చేసి వాటిపై పర్యవేక్షణ చేపడితేనే దారిలోకి వస్తారని భావించిన ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ద్రవీకరణ పత్రాలు సచివాలయాల నుంచి ప్రజలకు చేరాలి. ఉచితంగా అందించే ఈ సేవలపై ఏ ఒక్క ఉద్యోగి అయినా లంచాలకు కక్కుర్తి పడితే సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మండల అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ఈ శాఖకు అనుబంధంగా ఉన్న అధికారులంతా నిత్యం సచివాలయాలను సందర్శిస్తూ ఇక్కడ అందే సేవలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయాల సేవలు ఉచితంగా అందడంతోపాటు, నాలుగు వారాలు ఇక్కడి సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన వస్తుంది. అటు మీసేవ కార్యకలాపాలకు కూడా పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అక్కడ డబ్బులిచ్చి పనిచేయించుకోలేనివారంతా సచివాలయాల ద్వారా ఉచితంగానే సేవలు పొందడానికి వీలుపడుతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం కొంతమేరే ఉండటం..ఇదంతా ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు కొట్టి పడేస్తున్నాయి. ఇది కూడా 
జియో ఫ్రీ సిమ్ లానే ఉంటుందని అందరికీ అలవాటైన తరువాత మళ్లీ రేటు పెడతారనే ప్రచారమూ అపుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోవడం 
విశేషం. చూడాలి ఏం జరుగుతుందనేది.!

Amaravati

2023-06-21 03:19:42

సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లాల బదిలీలెప్పుడో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహిస్తున్న బదిలీల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తొలుత జిల్లా పరిధిలో బదిలీలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అంతర్ జిల్లాల ఉద్యోగులకు, పరస్పర బదిలీలకు సంబంధించిన సమాచారం ఇంకా ఇవ్వలేదు. ఇటీవలే ఉమ్మడి 13 జిల్లా్లో జరిగిన బదిలీల ఉద్యోగులకు కౌన్సిలింగ్ తరువాత ఆర్డర్లు ఇచ్చారు. వారంతా ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ అవుతున్నారు. వాస్తవానికి జిల్లాల ప్రక్రియ పూర్త యిం ది కనుక అంతర్ జిల్లాల బదిలీలు కూడా చేపడితే ఈ అభ్యర్ధన బదిలీల విషయం పూర్తయిపోతుంది. కానీ అలా చేయకుండా జిల్లా పరిధిలోన బదిలీలను మాత్రమే ప్రభు త్వం పూర్తిచేసింది. తొలుత జూన్ 19న అంతర్ జిల్లా బదిలీలు జరుగుతాయని అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ అది జరగకపోవడంతో దరఖాస్తు చేసుకు న్నవా రంతా ప్రభుత్వం ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. మిలిన వారికి కూడా బదిలీల ప్రక్రియ చేపడితే మొత్తం బదిలీల ప్రక్రియ శేషం లేకుండా ఉంటుంది. 

Tadepalli

2023-06-19 03:53:31