1 ENS Live Breaking News

సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేసేందుకు కసరత్తు ప్రారంభం అయ్యింది. దానికోసం త్వరలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనాలని ప్రభుత్వం భావిస్తుందట. దానికంటే ముందుగా రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ..విధినిర్వహణలో మరణించిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల క్రింద సచివాలయాల్లోనే ఉద్యోగాలు కల్పించడం ద్వారా కొంత భర్తీని చేపట్టి ఆ తరువాత మిగులు ఉద్యోగాను భర్తీచేయాలని అధికారులు యోచిస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో పాత 13 జిల్లాలు, విభజన 26 జిల్లాల వారీగా ఖాళీలను ఇప్పటికే జిల్లా అధికారులు గుర్తించారు. ఆయా ఖాళీలను భర్తీచేయడానికి కారుణ్య నియామకాల్లో భర్తీచేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ముఖ్యంగా కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీచేయడం ద్వారా ప్రజలకు సచివాలయాల ద్వారా సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే చాలా జిల్లాల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బదిలీల ప్రక్రియ పూర్తి అయ్యేనాటికి ఖచ్చితంగా మిగిలిన ఖాళీలను భర్తీచేయడానికి చర్యలు తీసుకోవాలని..దానికోసం పరిపాలనా పరమైన అనుమతుల కోసం పంపామని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల్లో అత్యధికంగా వెటర్నరీ అసిస్టెంట్లు ఖాళీలు అధికంగా ఉండగా.. తరువాత స్థానంలో హార్టికల్చర్, మహిళా పోలీసుల, పంచాయతీ కార్యదర్శిలు, డిజిజల్ అసిస్టెంట్లు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేసేస్తే ప్రభుత్వం నియమించాలనుకున్న 1.35 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీచేసినట్టు అవుతుంది. ఉద్యోగాలు పొందిన వారే వివిధ ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగాల కంటే మంచి ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ఇలా ఏర్పడిన ఖాళీలు సుమారు 15 నుంచి 18వేల వరకూ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాకుండా 2023 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేల ఖాళీలు ఇదేశాఖలో ఉద్యోగ విరమణల ద్వారా ఏర్పడనున్నాయని సమాచారం. 2024 ఏప్రిల్, మే, నాటికి ఒక్క పంచాయతీ కార్యదర్శిలే 1300 మంది ఉద్యోగ విరమణ చేయననున్నారు. అదీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచడంతో వీరి ఉద్యోగాలు అప్పటి వరకూ ఉండనన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని సచివాలయాలు కార్యదర్శదర్శితోపాటు ముగ్గురు, నలుగురు సిబ్బందితోనే నడుస్తున్నాయి. అందులో ప్రాధాన్యత కలిగిన వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ తదితర పోస్టులను సాధ్యమైనంత త్వరగా కారుణ్య నియామకాల కోటాలో భర్తీచేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఏ శాఖలో ఉద్యోగి మ్రుతిచెందినా..దానికి సంబంధించిన పోస్టింగులను ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే భర్తీచేస్తుండటం విశేషం. మరోవైపు ఏపీపోలీసుశాఖలో తీసిన నోటిఫికేషన్ లోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా చాలామంది ప్రిలిమినరీ పరీక్షను సచివాలయ ఉద్యోగులు అధిగమించారు. మిగిలిన రెండు పరీక్షల్లోనూ విజయం సాధిస్తే మరికొంత మంది సచివాలయ సిబ్బంది పోలీసుశాఖలోకి వెళ్లిపోనున్నారు. అపుడు మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఒకరకంగా అలా సిబ్బంది వెళ్లిపోతారనే కారణంతోనే పోలీసు నియామక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేసి ప్రభుత్వం మిగిలిన రెండు దశల పరీక్షలను చేపట్టడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. సచివాలయాల్లో ప్రధానశాఖల సిబ్బంది ఖాళీలు భారీగా ఏర్పడితే సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే ఊహించిన ప్రభుత్వం కారుణ్య నియామకాల్లోనే ఎక్కువ మందిని భర్తాచేయాలని చూస్తుంది. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ నాటికి మిగులు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయాలని కార్యాచరణ చేపడుతున్నది. నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులకు మళ్లీ కొలువుల పండుగ వస్తుంది..!

Amaravathi

2023-06-10 04:10:44

గ్రామాల్లోనూ ఇక 5జి ఇంటెర్ నెట్ సేవల విస్తరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాల్లోని అన్ని గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ ను విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఏపిఎస్ఎఫ్ఎల్ ను ఆర్ధికంగా బలోపేతం చేయడంతోపాటు, అన్ని గ్రామాలకు 5జి ఇంటర్నెట్ అందించాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఎంపిక చేసిన గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ ను మరింతగా అభివ్రుద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని  గ్రామాల్లో ఇప్పటి వరకూ సాధారణ కేబుల్ టివి, డిటిహెచ్, ఓటిటి యాప్ లు అందుబాటులోకి రాగా..అత్యంత వేగంగా ఏపీ ఫైబర్ నెట్ ను అభివ్రుద్ధి చేసి ప్రజలకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ తోపాటు, కేబుల్ సర్వీసులు, టెలీఫోన్ సేవలను తీసుకురావాలిని యోచిస్తున్నది. దానికోసం ఏపీఎస్ఎఫ్ కి రూ.445.7 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ టివిల వినియోగం, స్మార్ట్ ఫోన్ ల వినియోగం గ్రామాలలో అధికంగా పెరిగినందున అక్కడే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఆన్ లైన్ సేవలు, విద్య అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తన్నది.

 దానికోసం ఏపిఎస్ఎఫ్ఎల్ ను విస్తరించి మండల కేంద్రం నుంచి అన్ని గ్రామపంచాయతీలకు విస్తరించి, పాఠశాలలు, డిజిటల్ లైబ్రెరీలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, పిహెచ్సీలకు హై బ్యాండ్ విడ్త్ ను అనుసంధానించనున్నది. ఇంటర్నెట్ లో లోపాలు రాకుండా, అంతరాయాలు లేకుండా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, విద్యార్ధులు, ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని కూడా ఏపీ ఫైబర్ నెట్  ద్వారా అందిం చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను అదేరోజు ఏపీ ఫైబర్ నెట్ లోనే ఇంట్లో ఉండి చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 14వేల 5 గ్రామ, వార్డుసచివాలయాలతోపాటు, అన్ని పంచాయతీలు, గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

తాడేపల్లి

2023-06-09 05:17:05

సచివాలయ ఉద్యోగుల బదిలీల షెడ్యూలు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ఆన్ లైన్ దరఖాస్తుల పరిశీలిన జూన్10 నుంచి ప్రారంభం అవుతుందని గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ సర్క్యులర్ జారీచేశారు. జూన్12న అభ్యర్ధులకు కేటాయించిన మండలాలు, వార్డుల జాబితా, తిరస్కరణలు ఆన్ లైన్ లో పొందు పరుస్తారు. 14న ఉద్యోగులకు కౌన్సి లింగ్ నిర్వహించి అదేరోజు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేస్తారు. అంతేకాకుండా వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వీటిపై ఏమైనా అభ్యరంత రాలుంటే 15నుంచి జిల్లా కలెక్టర్ కు నివేదించుకోవచ్చునని పేర్కొన్నారు.

Tadepalli

2023-06-08 11:01:16

సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ 15వరకూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువును జూన్ 15 వరకూ పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వుల వచ్చాయి. వాస్తవానికి నేటి నుంచి 10వ తేదీవరకూ కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం మొదట ప్రకటించింది. అయితే ఉమ్మడి జిల్లాలు విడిపో యిన తరువాత అక్కడి నుంచి సమాచారం రావడం ఆలస్యం కావడం, బదిలీల ప్రక్రియకు అధికారుల నియామకం తదితర కారణాల ద్రుష్ట్యా ఈ ప్రక్రియను ఈనెల 15వర కూ పెంచారు. కాగా ఇప్పటికే అన్ని జిల్లాల్లో సిబ్బంది తమ వివరాలు ఆన్లైన్ చేసుకున్నారు.

Tadepalli

2023-06-08 07:49:26

డిఏకి నోచుకోని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక..ప్రజల ఇంటిముంగిటే సమస్యలు తీర్చే జనదీపిక.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడుగడుగునా అన్యా యానికి గురవుతుంది. రాష్ట్రప్రభుత్వం ఈ శాఖలోని ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వెంటనే ప్రొభేషన్ చేస్తామని చెప్పి తొమ్మిది నెలలు ఆలస్యంగా చేయ డంతో ఆదిలోనే పేస్కేలు, ప్రొబేషన్ రెగ్యులైజేషన్ సమయంలో కలవాల్సిన 2 ఇంక్రిమెంట్లు కోల్పోయిన ఉద్యోగులు ఇపుడు డిఏలు కూడా కోల్పోయే పరిస్థితి దాపు రించిం ది. సక్రమంగా రెండేళ్లు పూర్తికాగానే ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ పూర్తయి వుంటే ఇపుడు ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు డిఏ అందుకోవడానికి ఆస్కారం వుండేది. కానీ అది జరగలేదు. ప్రభుత్వం విడుదలచేసిన డిఏ బకాయి గ్రామ, వార్తు సచివాలయ ఉద్యోగులకు వర్తిస్తుందో లేదో తెలియకుండా ఉంది. సదరు డిఏ జిఓలో ఈశాఖ ప్రస్తావన లేకపోవడమే కారణంగా కనిపిస్తున్నది. పీఆర్సీ ద్వారా పేస్కేలు పెంచినట్టు చూపించిన ప్రభుత్వం సర్వీసు ప్రొభేషన్ అంటే ఏడాదికి ఒక ఇంక్రిమెం టు చొప్పున, రెండేళ్లకు రెండు ఇంక్రిమెంట్లు రెగ్యులర్ అయిన తరువాత ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కలపాల్సి వుంది. కానీ అలా ప్రభుత్వం చేయలేదు. అలా అప్పుడే ఉద్యోగులకి తొలినష్టం ప్రారంభం అయ్యింది. ఆ తరువాత కూడా ఆ విషయాన్ని ఈశాఖ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లకపోవడం విశేషం.

గ్రామ, వార్డు సచివాలయ శాఖకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా అన్ని ప్రయోజనాలు వర్తించవని ఇక్కడే ప్రధమ నిరూపణ అయ్యింది. ఏ ప్రభుత్వశాఖలోనైనా రెగ్యులర్ ఉద్యోగాల్లో చేరిన తరువాత రెండేళ్లకి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. ఆ సమయంలో 2 ఇంక్రిమెంట్లు కలిపి పేస్కేలుకి జమచేస్తారు. కానీ సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ చేసే సమయానికి పీఆర్సీని వర్తింప చేస్తున్నట్టు చూపించి వాటిని కోతవేసేశారు. వాస్తవానికి 2 ఇంక్రిమెంట్లు కలిసిన తరువాత పీఆర్సీ వర్తిస్తే ఒక్కో సచివాలయ ఉద్యోగికి కనీసం 3 నుంచి 5వేల రూపాయల జీతం పెరిగేది. అలా జరగకపోగా ఆలస్యంగా సర్వీసు ప్రొబేషన్ చేయడం ద్వారా పేస్కేలుతోపాటు, సుమారు 2డిఏలను కూడా కోల్పోయారు ఉద్యోగులు. అసలు సచివాలయశాఖ ఉద్యోగులకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 1999 వర్తింపచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ప్రయోజనాలు వర్తింపజేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కాకుండా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వశాఖలోనైనా వారికి కేటాయించిన శాఖ విధులు మాత్రమే చేస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రంలో అన్ని శాఖల విధులు, ఖాళీగా ఉన్న సిబ్బంది శాఖల విధులు కూడా బలవంతంగా నిర్వర్తించాల్సి వస్తున్నది. ఇంతచేస్తున్నా, తమ శాఖకు ప్రభుత్వం కల్పిస్తామని చెప్పిన చట్టబద్ధత నేటికీ కల్పించలేదని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు, నిర్మాణ రంగ కంపెనీల్లో వేలాది రూపాయాల జీతాలు వదులుకొని రెగ్యులర్ ఉద్యోగాలనే ఒకే ఒక్కకారణంతో వచ్చిన తమకు తీవ్ర నష్టం జరుగుతోందని వాపోతున్నారు. ఒక సందర్భంలో అసలు మావి రెగ్యులర్ ఉద్యోగాలా..లేదంటే అలా చెప్పుకునే కాంట్రాక్టు ఉద్యోగాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంటుందని కూడా చర్చకు తెరలేపుతున్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన తరువాత మంచి ఉద్యోగాలు వస్తే.. కొందరు ఈ సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్లిపోవడంతో చాలా చోట్ల భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం వాస్తవానికి ఆ సేవలు అందించే ఉద్యోగుల విషయంలో మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనడానికి తాజా పరిణామాలే ఉదాహరణ.

రానున్న రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖను మరింత బలోపేతం చేసి ప్రజలకు ఉత్తమంగా సేవలు అందిస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం ప్రచారాలకు పెద్దపీట వేసి.. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగుల విషయంలో మాత్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. సరిగ్గా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ చేసే సమయంలో పీఆర్సీ వర్తింపజేస్తున్నామని చెప్పి, ఐఆర్ వీరికి వర్తింపజేయలేదు. ఆ తరువాత ఆలస్యంగా సర్వీసు రెగ్యులర్ చేయడం వలన సుమారు రెండు డిఏలు, పూర్తిస్థాయి పేస్కేలు కోల్పోవాల్సి వచ్చింది. ఇపుడు తాజాగా డిఏ కూడా కోల్పోయారు ఉద్యోగులు. ఇదే పరిస్థితి కొనసాగినా..ఈ శాఖకు చట్టబద్దత కల్పించి ఇతర ప్రభుత్వశాఖలకు వర్తింపజేసే ప్రయోజనాలు వర్తింపజేయకపోయినా ఉద్యోగులు మరింతగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో కమిషనర్, ముఖ్యకార్యదర్శిలు చొరవతీసుకోకపోతే పరిస్థితి విషమించి, చాలా ప్రయోజనాలు కోల్పోతారు సచివాలయ ఉద్యోగులు. ఇంత దారుణంగా నష్టపోయిన సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..!

Tadepalli

2023-06-08 02:55:06

డిఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డిఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిఓఎంఎస్ నెంబరు66 ద్వారా ఉద్యోగులకు, డిఏజిఓఎంఎస్ నెంబరు 67 ద్వారా పెన్షనర్లకు డిఆర్ 2.73% మంజూరు చేశారు.  ఈ కొత్త డిఏ ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది.  జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్,  మార్చి నెలల్లో 3  సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లిస్తారు. ఈ కొత్త డిఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డిఏ మొత్తం 22.75%  అవుతుంది.

Tadepalli

2023-06-07 06:57:40

సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్ పై డైలమా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక కౌన్సిలింగ్ పై ఉద్యోగులు డైలమాలో పడిపోయా రు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలపై స్పౌజ్, మ్యూచ్ వల్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇతరుల కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నవారిని ప్రత్యేక అనుమానాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కౌన్సిలింగ్ జూన్ 8,9,10 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే పాత ఉమ్మడి జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. బదిలీ లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కౌన్సిలింగ్ లో ప్రాంతాలు మార్చుకోవడానికి వీలుపడుతుందా..? లేదంటే ప్రభుత్వ శాఖలు చూపించిన ఖాళీల్లోనే చేరాల్సి వుంటుం దా..? ఆరోగ్య సమస్యలు, స్పౌజ్ కోటాలో దరఖాస్తు చేసుకున్నవారికి నచ్చిన ప్రదేశాలు ఎంపిక చేసుకునే అవకాశం వుందా..? అనే అనుమానాలు ఉద్యోగులును వెంటాడుతున్నాయి. అంతేకాకుండా కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో సిటిలుగా వున్న ప్రాంతాల్లో పోలీస్ కమిషనరేట్ లు ఉన్న చోట జిల్లాల్లో జిల్లా పోలీసు కార్యాలయాలు తొలగించారు. 

దీనితో మహిళా పోలీసులకు సంబంధించిన కౌన్సిలింగ్ జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో జరుగుతుందా, పోలీసు కమిషనరేట్ పరిధిలో జరుగుతుందా అనేది కూడా తేలలేదు.  కమిషనరేట్ లు లేని చోట్ల జిల్లా ఎస్పీలే ఉంటారు కనుక కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు ఉండవు. కానీ విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి పక్క జిల్లాల్లో జిల్లా పోలీసు కార్యాలయాలు ఉన్నాయి. వీరికి అక్కడ బదిలీలు జరుగుతాయా అనేది తేల లేదు. రేపటి నుంచే కౌన్సిలింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నవారెవరికీ నేటికి ఆయా ప్రభుత్వశాఖల నుంచి సమాచారం రాలేదు. ఎక్కడ కౌన్సిలింగ్ కి హాజరు కావాలో కూడా తెలియకఉద్యోగులందరూ డైలమాలో ఉన్నారు. అయితే వారి మాత్రుశాఖల అధికారులు మాత్రం అందరికీ కేటాయించిన ఉమ్మడి జిల్లా శాఖల కార్యాలయంలోనే బదిలీలు జరుగుతాయని..సెల్ ఫోన్లకు సమాచారం, మెసేజులు వస్తాయని చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది.

Amaravati

2023-06-07 06:20:27

గురువారం నుండి అందుబాటులోకి ఈ-ఆటోలు

క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ ఈ-ఆటోలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఉదయం ప్రారంభించనున్నారని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై.శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రెటరి మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి చెత్తను తడిపొడిగా వేరుగా సేకరణ చేయడానికి 516 ఈ-ఆటోలను ప్రభుత్వం అందించిందన్నారు. ఈ-ఆటోలను ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తమ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభిస్తారన్నారు. శుక్రవారం నుండి ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల వార్డ్ సచివాలయాల వారిగా ఈ-ఆటోలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా మెరుగైన ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేయడానికి అవకాశం కల్గుతుందన్నారు. ఇప్పటికే ప్రజారోగ్య కార్మికులకు దశల వారిగా ఆటోల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చామన్నారు. ఈ-ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు స్వచ్చంధ్ర కార్పోరేషన్ ఎండి, సిడిఎంఏ, జిల్లా కలెక్టర్, విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కమిషనర్లకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.

Tadepalli

2023-06-06 14:37:16

అక్రిడిటేషన్ల జారీలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం

రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలోనిఅక్రిడిటేషన్ల జారీ విషయంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాష్ట్ర సమాచార కమిషనర్ విజయకుమార్ రెడ్డికి ఏపీయూ డబ్ల్యూజే ప్రతినిధి వర్గం తెలిపింది. ఆమేరకు మంగళవారం రాష్ట్ర సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం కలిసి సమస్యలను వివ రించింది. జిల్లాల కలెక్టర్లు వాస్తవికతను గుర్తించకుండా జీవో పేరుతో ఎక్కువ మంది జర్నలిస్టుల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని వివరించారు. అనేక చోట్ల సమాచారశా ఖ జిల్లా అధికారులు కలెక్టర్లను తప్పుదారి పట్టిస్తున్నారని కమిషన్ ర్ కు తెలిపారు. జిల్లాలవారీ సమస్యలు వివరించిన అనంతరం సమస్యల పరిష్కారంపై సమాచార శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్న పత్రికలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ నిబంధనలను సడలించాలని నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా దానికి బదులుగా తమ పత్రిక ఆదాయపన్ను పరిధిలోకి రాదనే  విషయాన్ని  సెల్ఫ్ డెక్లరేషన్ ద్వారా తెలియజేస్తే సరిపోతుందని  కమిషనర్ తెలిపారు. 

మండలాల్లో ఫ్రీలాన్స్  జర్నలిస్టుల అక్రిడేషన్ మంజూరుకు పది సంవత్సరాల అనుభవంవుండాలన్న నిబంధన ప్రతిబంధకంగా మారిన విషయం ను నాయకులు వివరించారు. అయితే సదరు జర్నలిస్ట్ పది సంవత్సరాల అనుభవాన్ని వివరిస్తూ  సెల్ఫ్ డెక్లరేషన్ ఇస్తే సరిపోతుందని కమిషన్ ర్  తెలిపారు.  ఆ మేరకు జిల్లాలలోని సమాచార శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని జాయింట్ డైరెక్టర్ కస్తూరి ని ఆదేశించారు.  జిల్లాలలో డెస్క్ లలో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లకు పాత పద్ధతినే అక్రిడేషన్ మంజూరు చేయాలని, అందుకోసం పత్రికల పేజీలు నిబంధనలను సడలించాలని కమిషనర్ ను నాయకులు కోరారు . ఈ విషయం పై సమీక్ష అనంతరం ఆయా పత్రికలు ఎన్ని పేజీలు తో వస్తుంది మరోసారి చూసి అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రాలలో చిన్న పత్రికలకు వన్ ప్లస్ వన్ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు టూ ప్లస్ టు ఇవ్వాలని కోరారు ఈ విషయంపై మరోసారి పరిశీలిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. కమిషనర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, కృష్ణా అర్బన్ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, సీహెచ్ రాంబాబు,  తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2023-06-06 11:59:49

ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి కష్టాలు తీరనున్నాయి

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల ప్రసూతి కష్టాలు తీరే సమయం ఆశన్నమైనమైంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన  దగ్గర నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net,  ens live app ద్వారా ప్రత్యేక కధనాలను ఇదే విషయమై ప్రచురిస్తూ వస్తోంది. ప్రభుత్వం ప్రసూతి శెలవులు తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొభేషన్ గడువు కూడా పెంచుకుంటూ వచ్చింది. అదే విషయాన్ని పతాక స్థాయిలో ప్రచారం చేయడంతో, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో ఈసారి చలనం వచ్చింది. మంత్రివర్గ కమిటీలో ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాయి. దీనితో ఈ విషయాన్ని మంత్రవర్గ సమావేశంలో చర్చిస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మహిళా ఉద్యోగులకు ఇచ్చే 6నెలల ప్రసూతి శెలవులను అడ్డం పెట్టుకొని, నూతనంగా ఉద్యోగాల్లో చేరిన వారి ప్రొభేషన్ గడువు మరో ఆరు నెలలు పెంచడంతో వారి రెగ్యులర్ పేస్కేలు నష్టపోతున్నారని, అదే సమయంలో వారికి వచ్చే పదోన్నతులు కూడా మరో 6నెలలు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఈఎన్ఎస్ లైవ్ యాప్ కథనాలతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో చైతన్యం తీసుకు వచ్చింది.

కొత్త పీఆర్సీ, బకాయి డిఏలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్ తదితర విషయాలపై మంత్రవర్గంతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు ప్రసూతి శెలువులు, సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచడం, కొన్ని చోట్ల, ఆరు నెలలు దాటిన తరువాత శెలవుల బిల్లులకి జిల్లా కార్యాలయాల చుట్టూ తిప్పే కంటే..శెలవులు ఇచ్చే సమయంలోనే జీతం మంజూరు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే శెలవులను సర్వీసు ప్రొభేషన్ కు లింకు పెట్టకూడదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనితో దిగివచ్చిన ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు డిమాండ్ పరిగణలోకి తీసుకుంటే మహిళా ఉద్యోగులకు ప్రసూతి కష్టాలు తీరిపోనున్నాయి. ప్రసూతి శెలవుల విషయం ప్రభుత్వం ద్రష్టికి వెళ్లడానికి  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, www.enslive.net,  ens live app ప్రత్యేక కథనాలు ఎంతో దోహదం చేశాయని, సదరు వార్తలు చూసిన ఉద్యోగులు విశాఖలోని న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేసిన ధన్యవాదములు తెలియజేశారు. 

ప్రభుత్వ ఉద్యోగులు, డిమాండ్లు విషయంలో ఆదినుంచి ప్రత్యేక చొరవ తీసుకోవడంతోపాటు, ప్రభుత్వం ఆలోచించే విధంగా, ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా ens live app ద్వారా ప్రత్యేక కధనాల రూపంలో తెలియజేస్తుందని. అదే ఒరవడిని ఇకముందు కూడా కొనసాగించాలి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. వారి అభ్యర్ధనే కాకుండా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించిన విధంగా ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారి వెంట ens live app ఉంటుందని కూడా ప్రకటిస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వ తాజా వార్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని వర్గాల మీడియాగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజా పక్షాన నిలిచి అటు ప్రజలకు, ఇటు ఉద్యోగులకు అసలైన వారధిగా ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ఎప్పటికీ నిలిచే ఉంటుందని కూడా చెబుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు విధినిర్వహణ చేయకపోతే ఏ ఒక్క కార్యక్రమం ముందుకి సాగదని ప్రభుత్వం గ్రహించాలి.. ఆదిశగా వారి న్యాయమపరమైన డిమాండ్లు పరిష్కరించాలి..అదేస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందాలి ఇదే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ లక్ష్యం..!

Tadepalli

2023-06-06 03:17:25

బదిలీలకు 15522 మంది సచివాలయ ఉద్యోగుల దరఖాస్తు

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని  15522 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అందులో గ్రామ సచివాలయ  ఉద్యోగులు 12464 మంది కాగా, వార్డు సచివాలయ ఉద్యోగులు 3058 మంది. అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారు 2476 మంది, స్పౌజ్ కోటా క్రింద 866, మ్యూచ్ వల్ బదిలీలు 1610 మంది ఉన్నారు. ఇక జిల్లాల్లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నవారు 13046 మంది ఉద్యోగులు కాగా, అదర్స్ లో 8788 మంది ఉన్నారు. అత్యధికంగా రూరల్ పంచాయతీల్లో గ్రేడ్6 కార్యదర్శిలు(డిజిటల్ అసిస్టెంట్లు)1977 మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 453 మంది, అత్యధికంగా మహిళా పోలీసులు 389 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక అవకాశం లేకపోయినా ఏడుగురు ఎనర్జీ అసిస్టెంట్లు కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కౌన్సిలింగ్ విధానం లేదా, ఉత్తర్వుల రూపంలో బదిలీలు చేపట్టనుంది.

Tadepalli

2023-06-05 11:22:54

రైస్ కార్డు కోసం మరో అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రుప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డు కోసం అర్హులైన వారికోసం మరో అవకాశం కల్పించిందని సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఒక సర్క్యులర్ ద్వారా తెలి యజేశారు. ఈ మేరకు ఆ ఉత్తర్వులను 26జిల్లాల కలెక్టర్లకు, జిల్లా సివిల్ సప్లై అధికారులకు పంపించారు. ఈ ఉత్తర్వు ద్వారా ఏడాదిలో రెండు సార్లు మాత్రమే రైస్ కార్డు కోసం అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం రైస్ కార్డులు మంజూరు చేస్తా రు. రైస్ కార్డులో మార్పులు, చేర్పులు, ఒంటరి వ్యక్తులుగా వున్నవారు రైస్ కార్డుకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని సమాచారం రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాల యాలతో పాటు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది దగ్గర అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా దరఖాస్తులను గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వా రా సచివాలయాల్లో పెట్టుకోవచ్చునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Amaravathi

2023-06-04 15:29:41

అన్నిమండలాల జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడేషన్లు

అక్రిడేషన్ల మంజూరులో జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని  సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకత్వ బృందం బుధవారం సమాచార శాఖ కమిషనర్ ను ప్రత్యేకంగా కలిసి చర్చలు జరిపింది. దీనిపై కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అన్ని మండలాల్లో పనిచేసే విలేకరులకు గతంలో లాగే అక్రిడేషన్ ఇవ్వటానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల డిపిఆర్ఓ లకు సమాచారం అధికారికంగా పంపిస్తామని తెలిపారు. సంబంధిత జర్నలిస్టులు డిపిఆర్ఓలను సంప్రదించి వారి సూచనలు మేరకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు. చిన్న పత్రికలకు పాత జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా కొత్త జిల్లా కేంద్రానికి కూడా అక్రిడేషన్ ఇవ్వడానికి సమాచార శాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త జిల్లా కేంద్రానికి అదనంగా రెండు అక్రిడేషన్లు ఇవ్వటానికి కూడా పరిశీలన చేసి ఇచ్చే విధంగా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి కూడా పాల్గొన్నారు. సమాచార శాఖ కమిషనర్ ను  కలిసిన వారిలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షులు కంచల జయరాజ్ ,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఏచూరి శివ , ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు చావా రవి, అర్బన్ జిల్లా కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్  సభ్యులు నాగరాజు , తదితరులు సమాచార శాఖ కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

Vijayawada

2023-05-17 15:16:49

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతుందిలా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75 ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది బదిలీలకు పచ్చజెండా ఊపింది. దానికోసం ప్రత్యేకం జిఓనెంబరు-71ని ఫైనాన్స్ విభాగం విడుదలచేసింది. వాటితో పాటు 12 అనుబంధ జిఓలను కూడా విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తాను పనిచేస్తున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం జరిగే బదిలీల్లో స్థాన చలనం కలగనుంది. ఉద్యోగుల బదిలీపై ఇప్పటికే ఉన్న నిషేదాన్ని  22-05-2023 నుండి 31-05-2023వరకు ప్రభుత్వం సడలించింది. దానికి అనుగుణంగా ఆయా శాఖల అధికారులు నిబంధనలను అనుసరించి బదిలీల ప్రక్రియన చేపట్టనున్నారు.  ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు ఆధారంగా   బదిలీలు జరిగే తీరు ఈ విధంగా ఉంటుంది. 

1. ప్రస్తుతం జరగబోయే బదిలీలు ఉద్యోగుల అభ్యర్థన మరియు పరిపాలనాపరమైనటువంటి (administrative grounds) కారణాలతో మాత్రమే ఉంటాయి.

2. ఏప్రిల్ 30 నాటికి ఒకే స్టేషన్లో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు మాత్రమే అభ్యర్థన బదిలీలకు అర్హులు మరియు ఒకే స్టేషన్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీలు చేస్తారు.

3. ఒక ఉద్యోగి అన్ని క్యాడర్లలో కలిపి ఆ స్టేషన్లో పనిచేసిన కాలం మొత్తాన్ని పరిగణించబడుతుంది. స్టేషన్ అనగా నగరం,పట్టణం, గ్రామం  అవుతుంది అంతేగాని కార్యాలయము లేదా సంస్థ కాదు. అయితే, స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ కోసం, స్టేషన్ అంటే జోన్‌లోని కార్యాలయం అని అర్థం, ఎందుకంటే వారి అన్ని కార్యాలయాలు జిల్లా ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఉన్నాయి.

4. ప్రస్తుతం జరగబోవు బదిలీలకు దిగువ తెలిపిన అంశాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.  40% లేదా అంతకన్నా ఎక్కువ Disability ఉన్న ఉద్యోగులు... 

 5.కారుణ్య నియామకం ద్వారా నియమించబడిన వితంతు ఉద్యోగులు  భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయి ఉండాలి.

6.ఉద్యోగుల పిల్లలు ఎవరైతే మానసిక స్థితి బాగోదు  (Mentally Challenged) వారికి వారు చూపిస్తున్న ఆసుపత్రి దగ్గరలో ఉద్యోగులు గాని ఉద్యోగుల యొక్క భర్త లేదా భార్య గాని వారి పిల్లలు గాని లేదా తల్లిదండ్రులు గాని.. లేదా వారిపై ఆధారపడి ఉన్నవారు గానీ క్యాన్సరు, ఓపెన్ హార్ట్ ఆపరేషన్, నరాలకు సంబంధించిన ఆపరేషన్, కిడ్నీ మార్పిడి అయినవారికి మెడికల్ సదుపాయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ.  

7. ITDA ప్రాంతాలలో పోస్టింగ్ కోసం..  50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులు. ఐటిడిఎ పరిధిలో ఇంతకు ముందు పని చేయని ఉద్యోగులు మైదాన ప్రాంతంలోని సర్వీసు నిడివిని బట్టి చేస్తారు.

8.ITDA ప్రాంతాలతో పాటు, బదిలీలలో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్న ఇంటీరియర్ ప్లేసెస్ మరియు వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు.
 
1) బదిలీలపై సడలింపు 22 మే 2023 నుండి 31 "మే 2023 వరకు అమలులోకి వస్తుంది.

2.ఫిర్యాదులు/ ఆరోపణలకు అవకాశం లేకుండా అత్యంత పారదర్శకంగా బదిలీ ఉత్తర్వులను అమలు చేయడానికి సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహిస్తారు. ఈ మార్గదర్శకాల యొక్క ఏదైనా ఉల్లంఘన తీవ్రంగా పరిగణించబడతారు.

3. ప్రత్యేక కార్యాచరణ వ్యవస్థలను కలిగి ఉన్న కింది విభాగాలు, పై మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా తమ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన వారి స్వంత బదిలీ మార్గదర్శకాలను రూపొందించవచ్చు. వాటిలో ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు, 

   1) వాణిజ్య పన్నులు 
   2)ప్రొహిబిషన్ & ఎక్సైజ్  
   3)స్టాంపులు & రిజిస్ట్రేషన్ 
   4)రవాణా శాఖ, మరియు 
    5)వ్యవసాయ శాఖ. వారు కూడా 31-మే- 2023 నాటికి ప్రక్రియను పూర్తి చెయ్యాలి.

4.విద్యా శాఖలు అనగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య మరియు సంక్షేమ శాఖల క్రింద పనిచేస్తున్న విద్యా శాఖలు పై బదిలీ మార్గదర్శకాల నుండి మినహాయించబడ్డాయి.మరియు వారు ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో తమ శాఖలకు సంబంధించిన వారి స్వంత బదిలీ మార్గదర్శకాలను కూడా రూపొందించుకోవచ్చు. 

6. సర్క్యులర్ మెమో నెం. GAD01- SWOSERA/ 27/2019- SW, GA (సర్వీసెస్ వెల్ఫేర్) డిపార్ట్‌మెంట్, dt.15.06.2022లో జారీ చేయబడిన గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ అసోసియేషన్‌ల ఆఫీస్ బేరర్‌ల బదిలీలపై స్టాండింగ్ సూచనలు వర్తిస్తాయి.

7. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు  బదిలీ కోసం నిర్దిష్ట అభ్యర్థన చేసినప్పుడు మాత్రమే బదిలీ చేయబడుతుంది.  లేని పక్షంలో వారికి ఈ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వడమైనది. వీలైనంత వరకు, స్పష్టమైన ఖాళీ లభ్యతకు లోబడి ఈ కేటగిరీల ఉద్యోగులను వారికి నచ్చిన ప్రదేశంలో పోస్ట్ చేయవచ్చు.

8. ఏదైనా ఉద్యోగి పై పెండింగ్‌లో ఉన్న అభియోగాలు/ ఏసీబీ/ విజిలెన్స్ కేసులు ఉన్న యెడల వారి అభ్యర్థనలు బదిలీ కోసం పరిగణించబడవు. 

9. బదిలీలపై నిషేధం 01.06.2023 నుండి అమలులోకి వస్తుంది.

Tadepalli

2023-05-17 14:58:13

ENS ఎఫెక్ట్.. ట్రాన్స్ ఫర్స్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీలకు పచ్చజెండా ఊపింది. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారు, ఐదేళ్లుగా ఒకే చోట ఉన్నవారిని బదిలీలు చేస్తామని పేర్కొంది. అయితే ఈబదిలీలకు సంబంధించి ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలకు సంబంధించి ప్రత్యేక జీఓలు విడుదల కాను న్నాయి. ఈనెల 22 నుంచి 31వరకూ బదిలీల ప్రక్రియ సాగనుంది. ప్రభుత్వశాఖల వారీగా ఇచ్చే బదిలీల జీఓల్లో విధి విధానాలు ప్రకటించ నున్నారు. చాలాకాలం నుంచి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బదిలీలు జరగలేదు. ఇదే విషయమై ఈఎన్ఎస్ వరుస కధనాలు ప్రచు రిస్తూ వస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలపై కూడా చట్టబద్ధత అడ్డు వస్తుందనే విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. దీనితో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సచివాలయ సిబ్బంది విషయంలోనూ ప్రత్యేకంగా బదిలీలకు సంబంధించిన నిబంధ నలు తయారు చేయాలని సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డరెక్టర్లను ఆదేశించారు. అన్నీరూట్లు క్లియరై ఈనెల 22నుంచి బదిలీలు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tadepalli

2023-05-17 11:29:26