1 ENS Live Breaking News

తిరుమలలో అన్యమత ప్రచారం నిషేదం..

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు,  చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి,  తిరుమ‌లకు తీసుకువెళ్ళ‌డాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది.  టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి వ‌ద్ద అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది టీటీడీ ఎన్నో ద‌శాబ్ధాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌. ఇటీవల కాలంలో తిరుమల కు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేస్తున్నారు. వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి  స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది.

Tirumala

2022-05-07 15:21:51

25నుంచి హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

తిరుమ‌ల‌లో ఈ నెల 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతిని వైభ‌వంగా నిర్వ‌హిం చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారు ల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఉద‌యం హ‌నుమ‌జ్జ‌ యంతి ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.   ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌ల‌మైన అంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ వ‌ద్ద‌, జాపాలీ తీర్థం, నాద‌నీరాజ‌నం వేదిక‌, ఎస్వీ వేద పాఠ‌శాల‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హణ‌కు ఏర్పాట్లు చేయాల‌న్నారు. మే 29న ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం నిర్వ‌హించేందుకు ఆయా విభాగాల అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఆయా రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మాల‌ను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛాన‌ళ్ల ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌న్నారు. ఈ ఉత్స‌వానికి సంబంధించి ఆక‌ట్టుకునేలా ప్రోమో రూపొందించాలని కోరారు.

నాదనీరాజ‌నం వేదిక‌పై నిర్వ‌హించే ప్ర‌వ‌చ‌నాల‌కు సంబంధించి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌,  ప‌వ‌న‌కుమార శ‌ర్మ త‌దిత‌ర పండితుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. అంజ‌నాద్రి వైభ‌వం, ఇతిహాస హ‌నుమ‌ద్విజ‌యం, యోగాంజ‌నేయం, వీరాంజ‌నేయం, భ‌క్తాంజ‌నేయం ప‌లు అంశాల‌పై ప్ర‌వ‌చ‌నాలు ఉంటాయ‌న్నారు. ఏర్పాట్ల‌కు సంబంధించి ఇంజినీరింగ్‌, అన్న‌దానం, ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, ఎస్వీ వేద పాఠ‌శాల‌, భ‌ద్ర‌తా విభాగం, పిఆర్వో, ఎస్వీబీసీ విభాగాలు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు.   ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ సిఈవో  సురేష్‌కుమార్‌, ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిఇ ర‌విశంక‌ర్‌రెడ్డి, విజివో  బాలిరెడ్డి, పండితులు ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌,  కుప్పా విశ్వ‌నాథ‌శర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-07 13:07:15

Tadepalli

2022-05-07 05:23:16

సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం

యూఎన్‌డీపీ భాగస్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్ధిర ఆర్ధిక ప్రగతి కోసం నిర్ధేశించుకు న్న లక్ష్యాల సాధనపై మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటుచేయనున్న ప్రభుత్వం, ఈ అంశంపై సీఎం  వైఎస్‌ జగన్‌తో సమావేశమై చర్చించిన నీతి ఆయోగ్‌ సభ్యుల బృందం. ఈ సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్‌ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్‌ (ఐఏఎస్‌), చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్, యూఎన్‌డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, నీతి ఆయోగ్‌ ఎస్డీజీ ఆఫీసర్స్‌ అలెన్‌ జాన్, సౌమి గుహ, యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ రెప్రజెంటెటివ్‌ డెన్నిస్‌ కర్రీ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-06 16:28:57

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు వేగంపెంచాలి

రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకంలో నిర్మాణం చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి.రమేష్ అధికారులను ఆదేశించేరు.ఇళ్ళ నిర్మాణ పనుల ఫై అలసత్వం ప్రదర్శించవ ద్దుని,లక్ష్యాలను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేసేరు. జిల్లాల హౌసింగ్ హెడ్స్,ఇతర అధికారులు ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ చేయడం ఫై ప్రత్యెక ద్రుష్టి సారించాలని,రూఫ్ లెవెల్ కు వచ్చిన ఇంటి నిర్మాణాలు పూర్తీ చేయడానికి యుద్ద ప్రాతిపదిక ఫై పనిచేయాలని ఆయన స్పష్టం చేసేరు.వీటితో పాటు ఆప్షన్-III కింద మంజూరు అయిన ఇళ్ళు నిర్మాణ పన్నులన్నీ అన్ని ఈ నెల 31వ తేది లోపల ప్రారంభం చేయాలని మంత్రి ఆదేశించేరు .రాష్ట్రంలోని అన్నిజిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులు,ఇంజినీర్లు,ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కార్యాలయం నుంచి  వీడియో సమావేశం ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రతి అధికారి లక్ష్యాలును పూర్తి చేయాలని ప్రతి 15రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని,అధికారులందరూ ఇళ్ళ నిర్మాణాల పూర్తికి కృషి చేయాలని మంత్రి స్పష్టం చేసేరు. లేఅవుట్ ల వారిగా నియమితులైన నోడల్ అధికారులు సత్వరమే ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ కావటానికి మున్సిపల్ కమిషనర్లు,పంచాయితీరాజ్,విద్యుత్ ఇతర శాఖల అధికారులులతో సమన్వయం చేసుకోవాలని,నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాలూ కల్పించి లబ్దిదారులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేసేరు.ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన నీరు ,అంతర్గత రహదారులు విద్యుత్ లైన్లు తొలగింపు తదితర మౌలిక వసతుల పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించేరు.ఇళ్ళ నిర్మాణాలకు సంభందించిన పనులలో ఎటువంటి జాప్యం పనికిరాదని లబ్దిదారులకు ఏవిధమైన సహకారం కావాలన్న అందిచాలని మంత్రి విజ్ఞప్తి చేసేరు.గృహనిర్మాణ శాఖకు చెందిన సీనియర్ అధికారులు,జిల్లాల ప్రత్యెక అధికారులు రాష్ట్రంలోని అన్ని లేఔట్లను సందర్శించి ఇళ్ళనిర్మాణాల వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కోరేరు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులందరినీ ఇళ్ళ నిర్మాణాలలో భాగస్వాములు చేయాలని మంత్రి స్పష్టం చేసేరు.

ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి అజేయ్ జైన్ మాట్లాడుతూ అన్ని లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులు,జియో టేగింగ్ తదితర పనులును వెంటనే పూర్తీ చేయాలని ఆదేశించేరు.ఈ సమావేశంలో   రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  నారాయణ భరత్ గుప్తా,జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్  శివ ప్రసాద్,ఎగ్జికూటివ్ డైరెక్టర్  ఎం.కమలాకర బాబు,రాష్ట్రంలోని అన్ని జిల్లా హౌసింగ్ హెడ్స్,డివిజనల్ అధికారులు,ఇంజినీర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-06 15:10:01

గాల్లోనే మహిళా పోలీసు సర్వీసు ప్రొబేషన్

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిత్యం ఏదో ఒక తేడా వ్యవహారంతో వార్త ల్లో నిలుస్తూనే ఉంటంది. ఇపుడు కూడా ఇదే శాఖలో పనిచేసే మహిళా పోలీసుల సర్వీస్ ప్రొబేషన్ విషయంలోనూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై, అందులో పనిచేసే ఉద్యోగులు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసు కుంటే వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం ఆదిలోనే ప్రకటించింది. ఆతరు వాత అక్టోబరు 2021 నవంబరు2 కి రెండేళ్లు పూర్తయినా..వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. తరువాత మరో 9నెలలు గడుపు పొడిగించి ఆపై సర్వీస్ రెగ్యులర్ కావాలంటే పరీక్ష పాస్ కావాలనే నిబంధన పెట్టింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 400 పైచిలుకు మహిళా పోలీసులు పరీక్షలు రాసి పాసయ్యారు. కానీ ప్రభుత్వం వారి పరీక్షల రిజల్ట్ ను ప్రకటించలేదు. కానీ రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారి సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి మాత్రం సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ చేయించుకోవాలని ఆదేశాలిచ్చింది. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చి పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులు ప్రభుత్వం పెట్టిన టెస్టు పాసైతే రిజల్టు ఇచ్చేవారని, మీరంతా ఆ టెస్టులు పాస్ కానప్పుడు మేము మీ సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలు పై ఎలా సంతకాలు చేస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ఎంపీడీఓలు, వార్డుల్లో జోనల్ కమిషనర్లు మొరాయిస్తూ ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లను వెనక్కి పంపేస్తున్నారు. ఈ విషయం మహిళా పోలీసుల మాత్రుశాఖ అయిన హోం డిపార్ట్ మెంట్ కి తెలిసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో డీజీపీగానీ, జిల్లా స్థాయిలో ఎస్పీలుగానీ వీరి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో తమ రెండేళ్ల 9నెలల ప్రొబేషన్ సర్వీసు గాల్లోనే ఉండిపోయిందనీ, మిగిలిన శాఖల సిబ్బందికి ఎంపీడీఓలు ప్రొబేషన్ క్లియరెన్సు సంతకాలు చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా వున్న సచివాలయ మహిళా పోలీసులు ఆందోళన చెందుతున్నారు. 

ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల నియామకాలు రాజ్యాంగ విరుద్దంగా జరిగాయనే కేసు హైకోర్టులో పెండింగ్ లోవుంది. ఇవేకాకుండా ఖాకీ యూనిఫారం విషయంలోనూ, పదోన్నతిల విషయంలో మరో కేసు కోర్టులో వుంది. సచివాలయ వ్యవస్థపై అధికంగా హైకోర్టులో కేసులు ఉన్నప్పటికీ మహిళా పోలీసుల విషయంలో మాత్రం కేసులు గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటున్నాయి. ఇదే తరుణంలో సచివాలయ మహిళా పోలీసులు ఉద్యోగాలు సర్వీసు ప్రొబేషన్ తరువాత రెగ్యులర్ చేయకుండా ఉంటే ఈ మొత్తం ఉద్యోగాలు రద్దు అయినా రద్దు అవుతాయనే ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా సాగుతోంది. అంతేకాకుండా ఇదే విషయమై చాలా మీడియా ఛానళ్లు, పత్రికలు, ఆఖరికి సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో డిబేట్లు జరుగుతున్నాయి. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే రెగ్యులర్ ఉద్యోగులకు 33 నెలలపాటు ప్రొబేషన్ చేయించింది ఏపీ ప్రభుత్వం. ఇంత చేసినా వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా అనే అనుమానం నేటికీ ఉద్యోగులను వెంటాడుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. దీనితో సచివాలయ మహిళా పోలీసులకు తీవ్రమైన భయం పట్టుకుంది. వీరికి ప్రభుత్వం పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విషయాన్ని నేటికీ ప్రకటించకపోవడం, రెండేళ్లు పూర్తిచేసుకున్నవారికి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ పై ఎంపీడీఓలు సంతకాలు చేయకపోవడం వీరిని మరింతగా భయపెడుతూ, తీవ్రంగా ఆందోలన కలిగిస్తున్నాయి.

 ఈ క్రమంలో అటు ప్రభుత్వంలో నుంచి గానీ, ఇటు జిల్లా పోలీసుశాఖ  నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాకపోతే వీరి పరిస్థితి, వీరి సర్వీసు ప్రొబేషన్ నిజంగానే గాల్లోనే ఉండిపోయే పరిస్థితులు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏపీలో ఏర్పాటైన దగ్గర నుంచి ఈశాఖ యొక్క అన్ని రకాల తాజా సమాచారాలను, జరుగుతున్న తప్పులను, ఈ శాఖ ద్వారా ప్రజలకు అందే సేవలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net  ద్వారా అందిస్తూ వచ్చే కార్యక్రమంలో భాగంగానే మహిళా పోలీసుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో కూడా జరుగుతున్న జాప్యం, అధికారులు స్పందించకపోవడం, మండల స్థాయిలో ఎంపీడీఓ సదరు ఫైళ్లపై సంతకాలు చేయకపోవడమనే విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు ప్రజల ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఈఎన్ఎస్ ఎల్లప్పుడూ తమవంతు సహకారం అందిస్తుందనే విషయాన్ని కూడా మరోసారి ఈ సందర్భంగా ప్రకటిస్తుంది. చూడాలి ప్రభుత్వం ఇప్పటికైనా సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ విషయంలో ఏ విధంగా స్పందిస్తుంది, వారికి ఏ తరహా బరోసా ఇస్తుందో..!

Tadepalli

2022-05-06 05:09:18

ఆర్బీకేలకు పీఎసిఎస్ లు అనుసంధానం

ఆంధ్రప్రదేశ్ లోని 10,778 రైతుభరోసా కేంద్రాలను (RBK)లను రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(PACS)కు అనుసంధానించి రైతులకు ఉత్తమసేవలు అందించాలని, తద్వారా గ్రామ స్థాయిలో రైతులు, గ్రామీణ సమాజానికి విస్తృత సేవలందించాలన్న ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాకార బ్యాంకు లిమిడెడ్ (ఆప్కాబ్) కార్యాలయంలో డీసీసీబీ చైర్ పర్సన్ లు, సీఈవో లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆప్కాబ్ అభివృద్ది కోసం చైర్ పర్సన్ లు, అధికారులు చెప్పిన ప్రతి  విషయంపై కూలంకషంగా మంత్రి కాకాణి చర్చించారు. అనంతరం  PACS అడాప్షన్ పాలసీ, 59వ యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ 2021-22, కార్పోరేట్ గవర్నెన్స్ పాలసీ, COBNET మొబైల్ యాప్ లను మంత్రి విడుదల చేశారు. ఆప్కాబ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రగతిని  మంత్రికి వివరించారు. అనంతరం 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు మంత్రిని కలిసి  శాలువాతో సత్కరించి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాభినందనలు తెలిపారు.

                ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... అప్కాబ్ 2021-22 వసంవత్సరానికి 40% పైగా వృద్ధి రేటుతో అద్భుతమైన  ప్రగతిని సాధించిందని, వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు.  ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ వ్యవసాయ రుణ పంపిణిలలో సహకార బ్యాంకులు మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకార రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింన్నారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం APCOB, DCCBలకు 295 కోట్లు షేర్ కేపిటల్ రూపంలో సహయం చేసిందన్నారు.  ఈ రోజు APCOB గాని, 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కానీ లాభాల్లో నడుస్తున్నాయంటే దానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు.  ఈ బ్యాంకులపై శ్రద్ధ వహించి, గత సంవత్సరం దాదాపు రూ. 600 కోట్ల పైచిలుకు బకాయిలు విడుదల చేయడం జరిగిందన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రోజు జిల్లా కేంద్ర, సహకార బ్యాంకులు, APCOB లాభాల ఉండి.. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై సమీక్ష నిర్వహించడం ఆనందదాయకమన్నారు.  సహకార బ్యాంకులకి బకాయిలు విడుదల చేయడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ స్కీములతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

  రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవసాయ యాంత్రీకరణ, ఆర్బీకే గోడౌన్ల నిర్మాణం వంటివి మన బ్యాంకుల ద్వారా చేపించి, పెద్దఎత్తున ఈ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్బీకేలు, పీఏసీఎస్ ల అనుసంధానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీఏసీఎస్ ల బలోపేతానికి ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు మేలు కలిగిలే అవసరమైన అన్ని వసతులు, సదుపాయాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని.. ఆ రకమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.  మూడంచెల సహకారవ్యవస్థలో పైనున్నరెండు అంచెలు APCOB, DCCBs ఆర్థికంగా బలపడ్డాయని, దిగువన ఉన్నప్రాథమిక వ్యవసాయ సంఘాలుఇంకా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఛైర్ పర్సన్ లకు, సీఈవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాలని మంత్రి కోరారు. ముఖ్యంగా రైతుల శ్రేయస్కారం కలిగించే చర్యలు, కంప్యూటరైజేషన్ కు ప్రణాలికలు రూపొందించామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. .

                 ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఎం. ఝాన్సీ రాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధు సూదన్ రెడ్డి,  సీసీ అండ్ ఆర్సీఎస్ బాబు. ఏ., ఆప్కాబ్ ఎండీ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, సీజీఎం ఎన్. రాజయ్య, ఆప్కాబ్ 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు, సీఈఓ లు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-05 10:56:04

పిఏసి-2లో అన్నప్రసాదసేవలు ప్రారంభం

తిరుమలలోని పిఏసి- 2లో భక్తుల కోసం అన్నప్రసాద సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 కారణంగా 2020 మార్చిలో టిటిడి పిఎసి-2 వద్ద అన్నప్రసాదాన్ని మూసివేయగా, మళ్లీ ఈరోజు తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా  అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో పద్మావతి పూజలు నిర్వహించి రెండేళ్ల తర్వాత అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు. దీనితో మళ్లీ శ్రీవారి భక్తులకు పిఏసి-2లో అన్నప్రసాదం అందుబాటులోకి వచ్చించి. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్ర‌త్యేకాధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి, ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-05 08:22:03

టీటీడీకి బ్యాట‌రీ వాహ‌నాలు విరాళం

కోల్‌కతాకు చెందిన సుమిత్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్‌డి  ప్రకాష్ చౌదరి గురువారం ఉదయం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి  రూ.50 లక్షల విలువచేసే  10 బగ్గీలను విరాళంగా అందజేశారు.  శ్రీ‌వారి ఆలయం ముందు అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి దాత వాహనాలను అందజేశారు. అనంతరం వాటికి పండితులతో పూజా కార్యాక్రమాలు నిర్వహించి వాటిని ప్రారంభించారు. ఈ బగ్గీలను శ్రీవారి ఆలయానికి ముఖ్యంమంత్రి, ప్రధాన మంత్రి, గవర్నర్, రాష్ట్రపతి వంటి ప్రముఖులు వచ్చిన సందర్భంలో వీటిని వినియోగించనున్నారని తెలుస్తుంది.   ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల డిఐ ఎం.జానకిరామ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2022-05-05 07:37:46

శ్రీ‌వారి మెట్టు న‌డ‌క‌దారి పునఃప్రారంభం

శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాన్ని గురువారం ఉద‌యం టీటీడీ చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి పునఃప్రారంభించి, ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమల కు  అనుమ‌తించారు. అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ,  గ‌త ఏడాది నవంబ‌రు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు శ్రీ‌వారి మెట్టు మార్గంలో  పెద్ద బండ‌రాళ్ళు ప‌డి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. ఇంజినీరింగ్ అధికారులు   యుద్ధ ప్రాతిపాదిక‌న న‌డ‌క మార్గాన్ని రూ.3.60 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేశార‌ని చెప్పారు. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్టు మార్గంలో మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్ట‌ర్ల‌ను చైర్మ‌న్ అభినందించారు.  ఈ మార్గం గుండా  ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌న్నారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్న‌ట్లు , 
శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని వివ‌రించారు.

 అనంత‌రం శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో త్వ‌రిత‌గ‌తిన మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేసిన సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ - 2  జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇఇ  సురేంద్ర‌రెడ్డి, ఈరోడ్కు చెందిన ఆర్ఆర్ బిల్డ‌ర్స్ డిజిఎమ్  ఆర్ముగంను చైర్మ‌న్ శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదాల‌తో స‌న్మానించారు.  ఈ కార్య‌క్ర‌మంలో బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎం.ఎల్‌.ఏ.  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, బోర్డు స‌భ్యులు  పోకల ఆశోక్ కుమార్‌,  మొరం శెట్టి రాములు, జెఈవోలు  స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, శ్రీ‌నివాస‌మంగాపురం ఆల‌య డెప్యూటీ ఈవో  వ‌ర‌ల‌క్ష్మీ, డిఇ  ర‌విశంక‌ర్ రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-05 06:23:10

‘బూడి’ పైనే పంచాయతీరాజ్ ఆశలు..

ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇపుడు అనకాపల్లి జిల్లావైపే తొంగి చూస్తోంది.  అవును..రాష్ట్ర రాజకీ యాల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తూ, ఎంతో ప్రాముఖ్యత వున్న పంచాయతీరాజ్ మరియు గ్రామీనాభివ్రుద్ధి మంత్రిత్వ శాఖను కట్టబెట్టిన ప్రజామోదం పొందిన ప్రభుత్వంగా  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రాధాన్యత సంత రించుకుంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే జీవితంలో ప్రభుత్వ విప్, మంత్రి పదవి రావడం అరుదుగా వుంటుంది. అలాంటిది ఒకసారి ప్రభుత్వ విప్ తోపాటు, ఏకంగా డిప్యూటీ సీఎం పదవి పొందిన వ్యక్తిగా బూడి ముత్యాలనాయుడు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. గ్రామం నుంచి రాష్ట్రాభివ్రుద్ధిలో ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిగా, ప్రజలు మెచ్చిన నేతగా కూడా ఎదిగారు. అందులోనూ జిల్లాల విభజనలో ఒకే జిల్లాకి ఒక డిప్యూటీ సీఎం, మరో మంత్రి పదవి వస్తే ఆ జిల్లాపై రాష్ట్రం ద్రుష్టి ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వశాఖల్లో ఎంతో ప్రాధాన్యత వున్న శాఖకు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అనకాపల్లి జిల్లాను ఏ స్థాయిలో ముందుకి తీసుకెళ్లబోతున్నారనే ఆలోచనలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. పరిపాలనలోనూ, అభివ్రుద్ధి విషయంలో చాలా పట్టువున్న ‘బూడి’ కొత్తగా మారిన అనకాపల్లి జిల్లాపై తనదైన శైలిలో ముద్రవేస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రజలు రెండున్నరేళ్లుగా చాలా దగ్గరగా చూస్తున్నారు. తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువైన సచివాలయ వ్యవస్థను మరింతగా ప్రజల ముందుకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇపుడు బూడి అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఉపాది హామీ పథకంలోని పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1900 కోట్ల చెల్లింపులు చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇపుడు అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్నాయి. వచ్చీరావడంతోనే పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పిస్తే..రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధిలో ఇంకెలాంటి మార్పులు తీసుకు వస్తారనే ఆలోచన అందరిలోనూ పుట్టేలా చేసి ప్రజల ద్రుష్టిని మరల్చగలిగారు. 

           భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ఒక లక్షా 30వేల ఉద్యోగాలతో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత అభివ్రుద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా ఈ శాఖను అభివ్రుద్ధి చేయాలన్నది ‘బూడి’ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనుగుణంగానే చేసిన నిర్మాణాలు, కట్టడాలకు ఇబ్బందులు రాకుండా గ్రామీణ ఉపాది హామీ పనుల బిల్లులు క్లియర్ చేయడానికి రంగం సిద్ధం చేయడం కూడా దానికి మరింత ఊతమిచ్చింది. వీటితోపాటు, ప్రస్తుతం కొత్త జిల్లాలో సుమారు 75 ప్రభుత్వశాఖలకు మంచి అధికారులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనే మరో లక్ష్యాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా సచివాలయ శాఖలో మిగులు ఖాళీల భర్తీ, ఎన్ఎంఆర్ ఉద్యోగుల రెగ్యులైజేషన్,  పదోన్నతులు, బదిలీలు.. ఇలా చాలా కార్యక్రమాలు పెండింగ్ లో ఉండిపోయాయి. వాటితోపాటు కొత్త జిల్లాలో అన్ని శాఖలకు జిల్లా అధికారుల నియామకాలు పూర్తయితే ఆ తరువాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా రాష్ట్రంలోనే అనకాపల్లిలోనే తొలుత నిర్మాణం చేపట్టే అవకాశాలూ కూడా లేకపోలేదు. అదే జరిగితే ‘బూడి’ ప్రధాన లక్ష్యం నెరవేరి జిల్లా పేరు రాష్ట్రంలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదేమో. అందరి మరిషిగా, ప్రజా నేతగా నియోజవర్గంలోనే కాకుండా ఇపుడు కేబినెట్ లోనూ ఒక కీలక భూమిక పోషించే అనకాపల్లి జిల్లా మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బూడి ముత్యాలనాయుడు అభివ్రుద్ధి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా వుంటుందనే విధంగా చేసి చూపించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగానే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడు నెలల్లో కొత్త జిల్లాలో అధికారుల కూర్పు పూర్తయితే, ఇక తరువాత మొత్తం అంతా జిల్లా అభివ్రుద్ధిపైనే డిప్యూటీ సీఎం ద్రుష్టికేంద్రీకరిస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎదురులేని నేతగా, ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న బూడి, తన మార్కును నూతన జిల్లా అనకాపల్లి జిల్లాపై అదే స్థాయిలో చూపించి సరికొత్త రీతిలో అభివ్రుద్ధి చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు..! 

తాడేపల్లి

2022-05-04 04:59:40

రూ.1900కోట్ల బిల్లులు చెల్లింపునకు చర్యలు

రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద చేసిన పనులకు సంబంధిం చి 1900 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుం టున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చెప్పారు. అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షించారని అన్నారు.ఈసందర్భంగా పంచాయితీరాజ్ శాఖలో వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని,ఉపాధిహామీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సియం ఆదేశించారని చెప్పారు.ఉపాధిహామీ పధకంలో చేసిన పనులకు సంబంధించి 1900 కోట్ల రూ.ల బిల్లులను వెంటేనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సియం ఆదేశించారన్నారు.అదే విధంగా మెటీరియల్ కాంపొనెంట్ తో నిర్వహించే రైతు భరోసా కేంద్రాలు,గ్రామ సచివాలయాల భవనాలు,వెల్నెస్ కేంద్రాలు,బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు సహా వివిధ భవన నిర్మాణాలకు ఎక్కడా సిమ్మెంట్ కొరత లేకుండా చూడాలని సియం ఆదేశించారని ముత్యాల నాయుడు వివరించారు.నిరంతర సిమ్మెంట్ సరఫరాకై ఆయా కంపెనీలతో సంప్రదించేందుకు వీలుగా ఒక లైజన్ అధికారిని నియమించాలని సియం ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.

        రాష్ట్రంలోని 9వేల కి.మీల పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకుగాను 1073 కోట్ల రూ.లు విడుదల చేసేందుకు వెంటనే అవసరమైన పరిపాలనామోదాన్నిఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ఇందుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించి పనులను కూడా మొదలు పెట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.పనుల నాణ్యత విషంయలో ఎంతమాత్రం రాజీపడే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.ఎక్కడైనా పనుల నిర్వహణలో నాణ్యత లోపించినట్టు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన 83కోట్ల రూ.ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సియం ఆదేశించారని ఆబిల్లులను కూడా వెంటనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

        గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పధకంలో చేసిన పనులకు సంబంధించిన 800 కోట్ల రూ.లు బకాయిలను కూడా వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నీటి ఎద్దడి గల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతోందని తెలిపారు.అదే విధంగా జగనన్న కాలనీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ముత్యాల నాయుడు చెప్పారు.  వైయస్ఆర్ జలకళ కార్యక్రమం కింద ఉచితంగా బోరు తవ్వించడం,విద్యుత్ కనక్షన్, పైపు వేయడం తోపాటు దూరంగా ఉన్న పొలాల్లో బోరువేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 2లక్షల రూ.లు వరకూ ప్రభుత్వమే భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు మీడియాకు వివరించారు.వైయస్సార్ చేయూత కార్యక్రమాన్నివిజయవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.

        గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చేందుకు ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ రెండేసి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు చెప్పారు.ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తను వేరువేరుగా సేకరించి దానిని సెగ్రిగేషన్ పాయింటుకు రవాణా చేసేందుకు వీలుగా ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్ ను అందించనున్నట్టు ఆయన తెలిపారు.స్వచ్ఛ సంకల్పం పధకంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గ్రీన్ అంబాసిడర్లుగా పిలవబడుతున్నవారిని ఇకమీదట క్లాప్ మిత్రలుగా పిలవాలని నిర్ణయించడం జరిగిందని ఆయన చెప్పారు.వారికి చెల్లించాల్సిన మూడు నెలల జీతాల బకాయిలను కూడా వెంటనే చెల్లించడంతో పాటు ఇకమీదట వారికి నెలనెలా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వెల్లడించారు. ఈసమావేశంలో నర్సీపట్నం ఎంఎల్ఏ పి.ఉమాశంకర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-03 14:44:22

ఏపీలో కొత్తజిల్లాలకు ఆర్టీసీ సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్త జిల్లాలకు ప్రజలు, ఉద్యోగులు, వివిధ పను లపై  ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో వున్న ఆర్టీసీ డిపోల నుంచి కొత్తజిల్లాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపే కార్యక్రమానికి తెరలేపింది. నిత్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తో పాటు ఇతర 75 ప్రభుత్వ శాఖల అధికారులను కలవడానికి వెళ్లాలంటే ప్రభుత్వంలోని ఆర్టీసీ సర్వీసులు ఒక్కటే మార్గం. దానిని ద్రుష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి కొత్త జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. గతంలో హైవే సర్వీసుగా నడిపే బస్సులను ఇపుడు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల మీదుగా నడిపేలా కూడా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీనితో అన్ని డిపోలలోని మేనేజర్లు డిపోల నుంచి కొత్త ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, నాన్- స్టాఫ్ సర్వీసులతోపాటు, ఇతర అన్ని రకాల సర్వీసులను కూడా జిల్లా కేంద్రాల్లోని బస్ స్టాప్ లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరగడంతోపాటు, ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలను దగ్గర చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. కొత్తగా ఆర్టీసీలో బస్సు ఛార్జీలు పెంచినప్పటికీ, ప్రజలకు, ప్రయాణీకులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణీకులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ సేవలను వినియోగించుకునే అవకాశం వుంది. కొత్త జిల్లాల విభజన తరువాత చాలా మంది ఉద్యోగులు జిల్లా కేంద్రాలకు దగ్గరగా వున్న వారి సొంత గ్రామాలు, పట్టణాల నుంచి అధికంగా నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు. ఆ విధంగా కూడా కొత్త జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సులకు గిరాకీ, ప్రయాణీకుల సంఖ్యపెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల ద్వారా కొత్త జిల్లా కేంద్రాలకు బస్సు సర్వీసులను తిప్పుతున్నారు. ఇప్పటికే వున్న సర్వీసుల సంఖ్యను మరింతగా పెంచే కార్యాచరణ చేపడుతున్నారు.

Tadepalli

2022-04-30 06:49:15

టిటిడి ఎక్స్‌ అఫిషియో ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెఈఓ(ఆరోగ్యం, విద్య)  సదా భార్గవి, డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు కస్తూరిబాయి, విజిఓ  బాలిరెడ్డి, పేష్కార్  శ్రీహరి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-29 08:07:27