1
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్న వేళ.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతం విషయంలో అందించిన కధనాలు మరోసారి అక్షర సత్యం అయ్యాయి. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రస్తావించారు కూడా. అవును మీరు చదువుతున్నది నిజం.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు 2తో రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయిన తరువాత వారికి కేవలం రూ.20 వేలు మాత్రమే జీతం అందుతుందని, మరో ఏడాది పాటు ఉద్యోగులు అదే రూ.15వేలు జీతానికి లేదా మరో ఐదు వేలు పెంచి రూ.20వేలు చేసి మాత్రమే ఇస్తుందని(పీఆర్సీ అమలు జరిగితేనే అది కూడా)ముందుగానే ప్రత్యేక కధనాన్ని అందించింది. అయితే ఆ కధనాన్ని చూసిన సచివాలయ ఉద్యోగులు, మరి కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఫేక్ వార్త అని, సత్యదూరమని కొట్టిపడేశాయి. అంతేకాదు ఎవరూ నమ్మ వద్దని పట్టించుకోవద్దని కూడా ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈఎన్ఎస్ కధనంలో చెప్పిన విధంగానే 2022 జూలై నెల జీతంలో అదీ పెంచిన జీతం జూలై నెల జీతంతో అమలు చేస్తామని ప్రకటించింది. దీనితో ఈఎన్ఎస్ రాసే వార్తల్లో ఎక్కడా తేడాలు ఉండవని, అసత్యలు ఉండవని మరోసారి ప్రభుత్వ ప్రకటన ద్వారా తేటతెల్లం అయిపోయింది. తేడాగా ఆలోచించే ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నేతలకు, ఈఎన్ఎస్ కధనాలను మరింత తేడాగా, తప్పుడుగా వారి వారి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేసే వారికి ప్రభుత్వ ప్రకటనే ఒక చెంపపెట్టులా తగిలిందనేది అందరూ గుర్తుంచుకునేలా చేసింది.
ఇక్కడ రాష్ట్రప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు..తప్పు పట్టడం అసలే లేదనే విషయాన్ని కాస్త తేడాగాళ్లు గుర్తుంచుకోవాలి. కేవలం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత ఏ మీడియా సంస్థ వెలుగులోకి తేవని విషయాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ , www.enslive.net ద్వారా బయటకు తీసుకు రావడంతో పాటు, ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలు, అదే సమయంలో ఉద్యోగుల సమస్యలను కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తామని అక్టోబరు 2నే ప్రకటించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అదే చేస్తున్నాం. ఇక ముందు కూడా అదే చేస్తాం.. అయితే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న న్యూస్ నెట్వర్క్ ను వినియోగించి తాజా విశేషాలను ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మధ్యలో ప్రజానికానికి చేరవేస్తున్నాం. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తయిన తరువాత కూడా రూ.15 వేల జీతం మాత్రమే వస్తుందని, లేదంటే మరో ఏడాది రూ.5వేలు పెంచి రూ.20 మాత్రమే జీతం అందుకుంటారని సరిగ్గా ఆరు నెలల క్రితమే ఈవిషయాన్ని ప్రత్యేక కధనంగా అందించాం. ఇపుడు అదే నిజమైంది. అంతేకాదు పీఆర్సీతోపాటు పెరిగిన జీతం జూలై నెల నుంచి మాత్రమే అమలు చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డే ప్రకటించడం కూడా విశేషం. అంటే ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ జీతం జనవరి నుంచే తీసుకుంటే ఒక్క సచివాలయ ఉద్యోగులే ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ చెప్పటినట్టుగా ఏడాది తరువాత రూ.20వేలు పెరిగిన జీతంగా తీసుకుంటున్నారు. అంటే ఏడాది పాటు పెరిగిన జీతం నష్టపోతున్నట్టే కదా(ఏమో చెప్పలేం ఏడాది తరువాత రెగ్యులర్ పేస్కేలు, పెంచిన పీఆర్సీ పే స్కేలు జూలై నెల జీతం కలిపి ఇచ్చినా ఇవ్వొచ్చు, లేదంటే ప్రభుత్వంపై భారం పడుతుందని ఇవ్వకపోవనూ వచ్చు)..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి సమస్యలు, ప్రభుత్వం అమలు చేయని జీఓల విషయంలోనూ, ప్రొబేషన్ రెండేళ్లుపూర్తయినా వారి సర్వీసులు రెగ్యులర్ చేయని విషయంలోనూ, సాంకేతిక కారణాలను, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ ప్రత్యేక కధనాల రూపంలో అందిస్తున్నది. రానున్న రోజుల్లో కూడా అందిస్తుంది కూడా. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈఎన్ఎస్ వారి వెనుక ఉండి వారి సమస్యలను ప్రత్యేక కధనాల రూపంలో ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళుతుంది. అప్పుడైనా..ఇప్పుడైనా..ఎప్పుడైనా.. ఈఎన్ఎస్ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మాత్రమే పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. వాస్తవానికి ప్రొబేషన్ పూర్తిచేసుకొని, ప్రభుత్వం పెట్టిన అన్ని టెస్టులు పాసైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెంచిన జీతం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు అమలు చేసి వుంటే సచివాలయ ఉద్యోగులకు కూడా చాలా ఆనందించేవారు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. కనీసం సచివాలయ ఉద్యోగులు రెండవ శనివారం, ఆదివారాల్లో సైతం వారి సాధరణ పనులు చూసుకోకుండా ప్రభుత్వం కోసం పనిచేశారనే కోణంలో కూడా ఆలోచించలేదు. పైగా కరోనా పాండమిక్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందించిన సేవలు మాత్రం వెలకట్టలేనివి. చాలా మంది కరోనా మహమ్మారికి బలయ్యారు..మరికొంద మంది ఆ వైరస్ భారిన పడి మంచాన కూడా పట్టారు. అలాంటి సమయంలోనూ ఒక్క ఉద్యోగి కూడా ఒక్క సెలవు కూడా పెట్టకుండా విధులు నిర్వహించారు. కానీ ఇవేమీ ప్రభుత్వం పనిగణలోకి తీసుకోలేదు. ఆ విషయాలను కూడా ఈఎన్ఎస్ తన ప్రత్యేక కధనాల విషయంలో ప్రస్తావించిన పాఠకులకు తెలుసు.
అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు లబ్ది(జనవరి నెల నుంచి పీఆర్సీ అమలు చేసిన పెరిగి జీతం) సమానంగా చేకూరిందా అంటే లేదనే ప్రభుత్వ ప్రకటన ద్వారానే తేటతెల్లమైపోయింది. అంతేకాకుండా నాటి నుంచి నేటి వరకూ వీరి సర్వీసు రూల్సు విషయంలోనూ, వారి వారి ప్రభుత్వశాఖల జిల్లా అధికారుల ఆదేశాలు సచివాలయాల్లో అమలు జరిగే విషయంలోనూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తరువాతనై తీసుకుంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఫలితంగా చాలా మంది ఉద్యోగులు, ఇటు కొంతమంది పంచాయతీ కార్యదర్శిలు, కొద్ది మంది తేడా సచివాలయ కార్యదర్శిలు, మరికొంత మంది మండల అధికారుల ఓవర్ యాక్షన్ వలన నరకం చూడాల్సి వస్తుంది. చాలా కాలం తరువాత చాలా మంది పంచాయతీ కార్యదర్శిలు ఎక్కువ మంది అన్నిశాఖల సిబ్బంది చూడటం ద్వారా వారి పైశాచికత్వాన్ని, తెలిసీ తెలయని ప్రభుత్వ నిబంధనలు(వీరిలో చాలా మందికి ఆంధ్రప్రదేశ్ సబార్టినేట్ సర్వీస్ రూల్స్, యాక్టు తెలియనే తెలియవనే విషయం గుర్తుంచుకోవాలి) అజమాయిషిని, దానికి కాస్త తేడా ఓవరేక్షన్ కూడా సచివాలయ ఇతరశాఖల ఉద్యోగులపై కూడా చూపిస్తున్నారు. ఇది ఈఎన్ఎస్ చెబుతున్న విషయం కాదు సచివాలయ ఉద్యోగులు, అందునా మహిళా ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు. సహచర ఉద్యోగులు పడుతున్న వేదనలు. అయితే సిబ్బంది కూడా తాము ఇబ్బంది పడుతున్నా బాధలు పడి సర్వీసు రెగ్యులైజేషన్ కోసం అంతా వేచి ఉన్నారు.
ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ పూర్తయిపోతే లెక్క తేడా వుంటుందని సంకేతాలు కూడా కొంత మంది ఉద్యోగులు ఇస్తున్నారు కూడా.. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోవడంతో వీరి సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ కూడా మరో ఏడాది పొడిగింపు జరుగుతుందని ప్రభుత్వం చెప్పకనే పీఆర్సీ ప్రకటించిన సమయంలో చెప్పేసింది. చివరిగా ఈఎన్ఎస్ చెప్పేది ఒక్కటే ప్రభుత్వానికే కాదు మరెవరికీ తాము వ్యతిరేకం కాదు, మరెవరకీ చేరువ అసలే కాదు.. ప్రభుత్వం చేసే అభివ్రుద్ధి, మంచి ఏస్థాయిలో పతాక శీర్షికలతో కధనాలు అందించామో..అదే సమయంలో కొందరు అధికారుల అనాలోచిత చర్యల వలన ప్రభుత్వానికి మచ్చవచ్చే సమయంలోనూ, అదే సమయంలో ఉద్యోగులు పడే ఇబ్బందులను, తద్వారా ప్రభుత్వానికి వచ్చే చెడ్డపేరును కూడా ఆదే స్థాయిలో ఆ విషయాలను,వాస్తవాలను బయటకు తీసుకు వస్తామని ప్రకటిస్తున్నాం. ఈ విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఎవరికీ భయపడేది అసలే లేదని బల్లగుద్ది చెబుతున్నాం. తేడాగా ఆలోచించే వారి విషయంలో వాస్తవాల కధనాలతోనే ప్రజల ముందుకి వెళతామని, అందిస్తామని హెచ్చరిస్తున్నాం కూడా. ఈఎన్ఎస్ కథనాలు వాస్తవాలవడం ఇది మొదటి సారి కాదు, చివరి సారి అసలే కాదు..ఈ పరంపర జీవనదిలా కొనసాగుతూనే వుంటుంది..!