1 ENS Live Breaking News

సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ కి అన్నీ అడ్డంకులే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొభేషన్ డిక్లరేషన్, సర్వీసు రెగ్యులైజేషన్ కి సాంకేతిక కారణాలు, హైకోర్టులో దాఖలవుతున్న కేసులు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ కారణాలన్నీ గట్టెక్కాలంటే కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వార్త చదివే వారందరికీ కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కాని సాంకేతిక కారణాలు, ఎదురుగా కనిపిస్తున్న సమస్యలు సంగతి తెలుసుకుంటే సచివాలయ ఉద్యోగులంతా ముక్కున వేలేసుకోక తప్పదు. వాస్తవానికి ఇదంతా ప్రభుత్వం కావాలని చేసినది కాకపోయినా రెగ్యులర్ జాబ్ కి పాటించాల్సిన నియమ నిబంధనలు ప్రభుత్వ శాఖలు ఖచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి. అక్కడే అసలు చిక్కంతా వచ్చి పడింది. అదే సమయంలో కొందరు మండల అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు వారికేదో ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పినట్టుగా.. సచివాలయాల సందర్శనకు వచ్చిన సమయంలో పనిగట్టుకొని మరీ చేస్తున్న ప్రచారాలు కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెంచేస్తున్నాయి. దీనితో సచివాలయ ఉద్యోగాలు రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ సమయంలో కాకుండా మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టేయవచ్చే ప్రచారం ఊపందుకుంది. సాంకేతిక కారణాలు, కొందరు అధికారులు చేస్తన్న ప్రచార విషయం ఇదే శాఖలో వున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు సైతం తెలియకపోవడం, వారికి తోచినట్టుగా ప్రకటనలు మీడియాకి జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు ఒక లక్షా 24వేలకు పైగా ఉద్యోగులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అందులో అత్యధిక శాతం మంది ఉద్యోగులు అక్టోబరు నెలలోనే విధుల్లోకి చేరలేదు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ విధుల్లోకి చేరిన వారూ ఉన్నారు. అంటే వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్లు పూర్తిస్థాయిలో సర్వీసు పూర్తిచేసుకుంటేనే ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి ఆస్కారం వుంటుంది. అలా కాకుండా మెడికల్ లీవులు పెట్టినా, ప్రసూతి సెలవులు పెట్టి మళ్లీ సర్వీసు రెగ్యులైజేషన్ ను వాడుకున్న సెలవులన్నీ పూర్తి అయ్యేవరకూ అంటే.. విధుల్లోకి చేరిన తేది తరువాత ఆరునెలలు దాటితేనే(ప్రసూతి, మెడికల్ సెలవులకు అయితే) వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేయడానికి మాత్రమే వీలుపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కోవిడ్ వైరస్ వచ్చి 14 రోజులు మెడికల్ సెలవులు తీసుకున్నా, అంతకంటే అధికంగా సెలవులు తీసుకున్నా అదే పరిస్థితి ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ విషయం చాలా మంది ఉద్యోగులకు తెలియదు. ఈ అంశాలన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తప్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లేఖలు రాసినా, సర్వీసు రూల్స్ ని రెగ్యులర్ ఉద్యోగులకు ఖచ్చితంగా అమలు చేసి తీరక తప్పని పరిస్థితి ప్రభుత్వానిది. ఆ విధంగా నిబంధనలు పొందుపరిచారు.

ప్రభుత్వంలో ఏ శాఖలోని రెగ్యులర్ జాబ్ అయినా ప్రొబేషన్ పూర్తి అయి సర్వీస్ రెగ్యులర్ కావాలంటే.. ఖచ్చితంగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకొని తీరాల్సిందే. దీర్ఘకాలిక సెలవులు పెట్టకూడదు. శాఖపరమైన శిక్షణ పూర్తిచేసుకొని ఉండాలి. డిపార్ట్ మెంటల్ టెస్టులు కూడా ఖచ్చితంగా పాసై వుండాలి. అన్నింటికంటే మించి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రెగ్యులర్ కావాలంటే సర్వీస్ రిజిస్టర్(ఎస్.ఆర్) ప్రారంభంతో పాటు పోలీస్ వెరిఫికేషన్ పూర్తి అయి వుండాలి. అవన్నీ ఏ ఉద్యోగి అయితే క్లియర్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం సర్వీసుని రెగ్యులర్ చేస్తుంది. అలాకాకుండా ఏ ఒక్కటి మిగిలిపోయినా వారి సర్వీసు అనుకున్న సమయానికి రెగ్యులర్ కాకపోగా, నిబంధనలను అనుసరించి సమయం వచ్చే వరకూ ప్రభుత్వానికి సర్వీసు రెగ్యులర్ చేసే అవకాశం వుండదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ నిబంధన అమలు చేయకపోయినా సదరు శాఖ జిల్లా అధికారులు, డిఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఇరకాటంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇక గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సాంకేతిక కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో ఉన్న ఉద్యోగులంతా వారి విధుల్లోకి ఒకే సమయానికి చేరలేదు. అక్టోబరు 2 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ విధుల్లో చేరుతూనే ఉన్నారు. అలా చూసుకుంటే వీరి ప్రొబేషన్ సమయం పూర్తవ్వాలంటే ఫిబ్రవరి వరకూ ఆయా ఉద్యోగుల విధుల్లో చేరిన నెలను బట్టి ఆధార పడి వుంటుంది. అంతేకాకుండా అన్నిశాఖల ఉద్యోగులకు శాఖాపరమైన శిక్షణ పూర్తికాలేదు. చాలా మందికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు కూడా పూర్తికాలేదు. అన్నింటికంటే మించి 60శాతం ఉద్యోగులకు పోలీస్ వెరిఫికేషన్ ఇంకా పూర్తికాలేదు. కొన్నిశాఖల ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పూర్తయినా వారు పాస్ అయ్యారో, లేదో వారి ఫలితాలు వెలువడకపోవడం కూడా మరో కారణం. వీటితోపాటు పలు కేసులు హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ రాకపోవడం. ఇంత వరకూ ఒక ఎత్తైతే కొందరు మండల అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని, అప్పటి వరకూ ఇప్పుడిచ్చే జీతం రూ.15వేలు కాకుండా రూ.20వేలకు పెంచి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. కాగా అక్టోబరు 2 నాటికి ఎంతమంది ఉద్యోగులకైతే రెండేళ్లు పూర్తయిందో వారి సర్వీసులను సర్వీస్ రూల్స్ ను అనుసరించి రెగ్యులర్ చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి నుంచి వచ్చిన సర్క్యులర్ ఆధారంగా జిల్లాల్లో గ్రామ,వార్డు సచివాలయ జెసీలు ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. అదీ కూడా పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే. 

మరోపక్క గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ప్రసూతి సెలవుల అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా సర్వీసు రెగ్యులర్ చేయాలని, మెడికల్ లీవులు(కరోనాలీవ్,  సిక్ లీవ్)ను కూడా పరిగణలోకి తీసుకోకుండా చూడాలని ఉద్యోగ  సంఘాలు చేసిన వినతిపత్రాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది(ఇంకా పరిశీలన దశలోనే ఉంది). అంతా బాగుంది అనుకుంటే మహిళా పోలీసులను జీఓ నెంబరు 59 ద్వారా పోలీసుశాఖలో విలీనం చేయడం చట్టవిరుద్దమంటూ హైకోర్టులో కేసుపడటం, అంతేకాకుండా జీవో నెంబరు 2 ద్వారా గ్రామకార్యదర్శిలకు కాకుండా వీఆర్వోలకు డీడీఓ అధికారాలు కట్టబెట్టిన అంశం కూడా హైకోర్టు పరిధిలోనే వుంది. ఈ విషయంలో ప్రతివాది పంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సివచ్చిందనే ఘాటు వ్యాఖ్యలను కూడా హైకోర్టు చేయడం ప్రభుత్వం తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. పైగా సుమారు 5 నుంచి 10 శాతం మంది ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం, మరి కొందరు ఉద్యోగులను జెసిలు, జిల్లా కలెక్టర్లు కొన్ని కొన్ని శాఖాపరమైన అంశాల్లో సస్పెండ్లు చేయడం(కొందరికైతే ఇంకా రీపోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇవ్వలేదు) ఇలా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కు అడుగడుగునా అవాంతరాలే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వలను, సర్వీసు నిబంధనలను  అనుసరించి 19ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు సంబంధించి జిల్లా అధికారులు జాబితాలను సిద్దం చేస్తున్నప్పటికీ పరిస్థితి ఇప్పుడప్పుడే తీరేటట్టుగా అయితే కనిపించడం లేదనే విషయం ఎదరుగా వున్న కొరకరాని కొర్రీలే స్పష్టం చేస్తున్నాయి. చూడాలి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. వీరి సర్వీసును రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి ఎంతమందికి సర్వీసు రెగ్యులర్ చేస్తుందో.. పేస్కేలు ఏవిధంగా  అమలు చేస్తుందో..!

Tadepalli

2021-10-29 01:45:24

సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోతలు..

అవును గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత మొదలైంది.. దానికి బయో మెట్రిక్ హాజరు, సెలవులు, ప్రభుత్వమే  జీఓ ద్వారా ఇచ్చిన సెలవులను కూడా కలిపేసి జీతాల్లో కోత విధిస్తున్నట్టు ఉద్యోగుల సీఎఫ్ఎంఎస్ ఐడీ జాబితాలను ఉద్యోగులకు చరవాణిలకు పంపింది ప్రభుత్వం. రోజుకో కొత్త నిబంధన తెరపైకి తెస్తున్న ప్రభుత్వం కొత్తగా బయోమెట్రిక్ ను జీతాల కోతకు కారణంగా చూపింది. ఇదే సమయంలో సెలవురోజుల్లో పనిచేసిన పనిని సైతం గుర్తించకపోగా.. బయో మెట్రిక్ మిషన్లు పనిచేయని తప్పుకి కూడా ఉద్యోగులనే బాధ్యులను చేసింది. ఫలితంగా ఇచ్చే రూ.15వేలు జీతంలో ఒక్కో ఉద్యోగికి ఒక్కో విధంగా జీతం కోత విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం వారి జీతం కోత జాబితాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆది నుంచి చెబుతూనే ఉంది బయో మెట్రిక్ హాజరు లేకపోతే  జీతాల్లో కోత విధిస్తామని.. చెప్పినట్టుగానే అక్టోబరు మాసం నుంచే దానిని అమల్లోకి తీసుకు వచ్చింది.  ప్రభుత్వమే ఇచ్చిన సెలవులకి, చేసిన పనికీ కూడా జీతాల్లో కోత విధిస్తారని.. తమ జీతంలో కోత పడినట్టు సమాచారం వస్తే తప్పా తమకి తెలియలేనది సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామసచివాలయాలు ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. ఈ ప్రొబేషన్ పీరియడ్ తరువాత ఉద్యోగులందరినీ సర్వీసు నిబంధనలు అనుసరించి రెగ్యులర్ చేయాల్సి వుంది. ఆ సమయంలోనే వారికి ఖచ్చితంగా విధులకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వేస్తేనే జీతం ఇస్తాం.. లేదంటే కోతవిధిస్తామనే భయాన్ని తెలియజేసింది. ఒక్క గ్రామసచివాలయ ఉద్యోగులకే కాకుండా గ్రామపంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తింపజేసింది ప్రభుత్వం. దీనితో అక్టోబరు మాసం జీతాల్లో ఒక్కో ఉద్యోగికి రూ.800, 1500, 2500 చొప్పున జీతాల్లో కోత పడినట్టుగా ఉద్యోగుల చరవాణీలకు సమాచారం రావడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. విధులకు వచ్చి పనిచేసినా జీతాల్లో కోత విధించడమేంటని తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన సెలవులు వినియోగించుకున్నవారికి కూడా జీతాల్లో కోతవిధించడం విశేషం. చాలా మంది సచివాలయ ఉద్యోగులు విధి నిర్వహణ పూర్తయిన తరువాత సాయంత్రం 5గంటలకు బయో మెట్రిక్ వేయాల్సి వుంది. ఆ సమయంలో సర్వర్లు పనిచేయక బయో మెట్రిక్ పనిచేయని తప్పకి కూడా ఉద్యోగులే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఏ రోజు అయితే బయో మెట్రిక్ పనిచేయలేదో ఆ విషయాన్ని బయోమెట్రిక్ మిషన్ ను మొబైల్ ఫోన్లలో స్క్రీన్ షాట్లు తీసి, ఫోటోలు తీసి అధికారులకు సామాజిక మాద్యమాల్లోనూ, రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కాగా ప్రొబేషన్ పూర్తయి సర్వీసు రెగ్యులర్ అవుతున్న సమయంలో ఉద్యోగులకు విధినిర్వహణ ఖచ్చితత్వం గురించి తెలయాలని, ప్రభుత్వ ఆదేశాలు ఏ స్థాయిలో అమలు జరుగుతాయో తెలియడం కోసమే ఈ బయోమెట్రిక్ హాజరు నిబందనను అమలు చేసి చూపించినట్టుగా ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే జీతాల్లో కోత విధించినట్టుగా వచ్చిన జాబితాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..లేదంటే ఉద్యోగులు అధికారుల ద్వారా సమస్యను తెలియజేసిన విధంగా వార్ణింగ్ గా చూపించి రూ.15వేలు జీతం పూర్తిగా ఇస్తుందా అనేది దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. కాగా అటు అధికారులు మాత్రం ముందుగా చేసిన హెచ్చరిక మేరకే జీతాల్లో కోత విధించినట్టుగా చెబుతున్నారు. ఇక్కడ మరో మెలిక ఏంటంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల బిల్లులు ప్రతీ నెలా 25వ తేదీన ఆన్ లైన్ చేస్తారు. కానీ ఉద్యోగుల జీతాల్లో కోత పడినట్టుగా 22వ తేదీనే ఉద్యోగుల సెల్ ఫోన్లకు సమాచారం రావడం విశేషం. దానిని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మండల, జిల్లా, రాష్ట్ర అధికారుల ద్రుష్టికి సైతం తీసుకెళ్లేలా చేసింది. మొదలైన ఈ బయోమెట్రిక్ జీతాల కోతను సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా కొనసాగిస్తుందా..లేదంటే ఉద్యోగులకు ఒక అవకాశం ఇస్తుందా అనేది తేలాల్సి వుంది..చూడాలి ఏం జరుగుతుందో..!

Tadepalli

2021-10-23 07:11:01

ప్రభుత్వ సెలవులన్నీ అదనపు విధులకే..!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సాధారణ సెలవులన్నీ అధనపు విధులు హరించేస్తున్నాయి.. కాదు కాదు ఆవిధంగా అధికారులు వీరికి సెలవులు రానీయకుండా చేస్తున్నారు.. ప్రతీ పనీ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే చేస్తుందని కాస్త గట్టిగా మాట్లాడే అధికారులు.. ఏ నిబంధనతో ప్రభుత్వం  ఇచ్చే సెలవు రోజుల్లో సచివాలయ ఉద్యోగులతో అదనపు విధులు నిర్వహిస్తున్నారో సెలవు రోజుల్లో డ్యూటీలు వేసే అధికారులు వివరించాల్సి వుంది..  ప్రభుత్వం ఇచ్చే సెలవురోజుల్లోనే సచివాలయ ఉద్యోగులకు ఏదో ఒక అదనపుపని అప్పగిస్తూ(అడిషనల్ ఫ్రీ డ్యూటీ.. ఇది ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాదు, లెక్కగట్టరు..) వీరికి కనీసం సెలవులను వినియోగించుకునే అవకాశం ఇవ్వడం లేదు. మిగిలిన శాఖల సిబ్బందితో పోల్చుకుంటే ఆరోగ్య సహాయకుల పరిస్థితి అయితే మరీదారుణం. వీరు చేపట్టే కోవిడ్ విధులకు వేళాపాలా అస్సలు ఉండటం లేదు. కోవిడ్ వేక్సినేషన్ సమయంలో ఉదయం 8గంటలకు ప్రత్యేక క్యాంపైన్ చేసే రోజుల్లో అయితే ఉదయం 6గంటలకే విధులకు హాజరైతే.. ఇచ్చిన టార్గెట్ వేక్సిన్లు పూర్తయ్యేవరకూ వాళ్లు ఇంటి మొహం పెట్టడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఆదివారాలు, 2వ శనివారాలు, ఇతర సాధారణ సెలవులు ఇలా ఎప్పుడు పడితే అపుడు వీరికి సెలవులను వినియోగించుకోకుండా చేస్తున్నారు అధికారులు. శెలవురోజుల్వో అధనపువిధులు చేసినందుకు వీరికి మిగిలిన సమయంలో సెలవులు ఇస్తున్నారా అంటే అదీలేదు. పైగా ఇచ్చిన ఇచ్చిన సెలవులన్నీ మాత్రం సిక్ లేదా సిఎల్ రిజిస్టర్ లో తప్పనిసరిగా రికార్డవుతున్నాయి.. అధికారులు వాటిని ఖచ్చితంగా నిబంధనల ప్రకారం చేయాలని ఆదేశాలు సైతం జారీచేస్తున్నారు. ఇలా సిఎల్ పెట్టినపుడు సెలవులను ప్రభుత్వ నిబంధనల ప్రకరారం రికార్డు చేసే అధికారులు, సెలవురోజుల్లో పనిచేసినందుకు మాత్రం ఎందుకు ప్రత్యేక ఆదేశాలతో పనిచేసినందుకు రికార్డు చేయడం లేదంటే.. అది మా పరిధిలో లేదని చేతులెత్తేస్తున్నారు.  మరి ఎందుకు తమతో సెలవురోజుల్లోనూ అదనపు విధులు అప్పగిస్తూ ఎందుకు  పనిచేయిస్తున్నారని ప్రశ్నిస్తే ఆ ఒక్కటీ అడక్కు అంటూ బీరాలు పోతున్నారు అధికారులు. ఇచ్చే రూ.15వేల జీతంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు ఒక లక్షా 24వేల మందికి పైగా ఉద్యోగులు ప్రభుత్వం ఏవిధంగా చెబితే ఆవిధంగానే విధులు నిర్వహించాల్సి వస్తుంది. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన మూడు నెలలకేయ కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ కరోనా పేరుతోనే సచివాలయ సిబ్బంది సెలవు రోజుల్లో కూడా అదనపు విధులు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అదనపు విధులు చేసినందుకు చాలా మంది ఉద్యోగులు కోవిడ్ బారిన సైతం పడ్డారు. కొందరు గ్రామవాలంటీర్లు, సచివాలయ, పంచాయతీ ఉద్యోగులు మ్రుత్యువాత పడిన సందర్భాలూ ఉన్నాయి.  ఎవరూ ఎదురు ప్రశ్నవేయకుండా సర్వీసు రెగ్యులరైజేషన్ బూచీని చూపిస్తూ కొన్ని చోట్ల అధికారులు సైతం బెదిరింపులకు దిగుతుండటం విమర్శలకు తావిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం సెలవు దినాల్లో ఉద్యోగులతో అదనపు పనులు చేయించకూడదు. ఒకవేళ చేయించాల్సి వస్తే.. అలా చేయించిన ప్రతీ పనికీ అంటే ఎన్నిరోజులు పనిచేస్తే అన్ని రోజులకు.. సాధారణ రోజుల్లో విధులకి ఇచ్చే జీతాన్ని లెక్క గట్టి ఉద్యోగులకు ఇవ్వాలి. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఈ నిబంధనల అమలు కాకపోగా ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సెలవులను అధికారులే అదనపు పనులు అప్పగించి హరించేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులు కూడా కావాలని చేయడం లేదు.. ప్రభుత్వం వారికి అప్పగించిన పనిని సాధారణ రోజుల్లో కాకుండా సెలవు రోజుల్లోనే సచివాలయ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. ఇప్పటికే సర్వీసు రెగ్యులరైజేషన్ పేరుతో కనీసం పేస్కేలు జీతానికి కూడా నోచుకోని సచివాలయ సిబ్బంది, ఇపుడు ప్రభుత్వం ఇచ్చే సెలవులను సైతం కోల్పోవాల్సి వస్తుంది. ఏమైనా అడగాలంటే వీరికి పై అధికారులుగా ఉన్న ఎంపీడీఓలు, వారిపై ఉండే డీఎల్డీఓలు, ఆపై గ్రామ, వార్డు సచివాలయ జేసీలు వీరిపై కన్నెర్ర జేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తమను కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పరిగణించకుండా.. స్కూలు, కాలేజీ విద్యార్ధులను బెదిరించినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే వింత నిబంధనలు, సెలవు రోజుల్లో రికార్డుకాని అధనపు విధులు, రెండేళ్లు పూర్తయినా సర్వీసు నిబంధన అమలు చేయకపోవడం, ఉద్యోగులకు బెదిరిపులు ఇవన్నీ చూడాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించినా.. ఇందులో పనిచేసే అత్యధికశాతం మంది ఉద్యోగుల నుంచి మాత్రం తీవ్ర నిరసన ఎదుర్కొనేలా చేస్తున్నాయి అధికారులు చేస్తున్న విధానాలు. ఈ విషయాలన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు, ప్రభుత్వం ఈ శాఖకోసమే నియమించిన గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లకు తెలిసినా, ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించినా..షరా మామూలుగానే ప్రభుత్వ సెలవు దినాల్లోనే వీరికి అధనంగా పనులు అప్పగించడం విశేషం. బహుసా ప్రభుత్వ సెలవులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అర్హులు కారేమో..!

Tadepalli

2021-10-19 04:24:06

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సీఎం వైఎస్ జగన్ పూజలు..

సీఎంవైఎస్‌ జగన్‌ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ది హనుమాన్‌ ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అవధూత, దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిశారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి  వెంకటేశ్వర రావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపి వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2021-10-18 12:16:11

రేపే ఈద్ మిలాదిన్ నబి.. ప్రభుత్వ శెలవుదినం

ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను ఈ నెల 19 కి మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్టీ.నెం.1707 ను సోమవారం జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను గతంలో ప్రకటించినట్లుగా ఈ నెల 20 కి బదులు 19 కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఈ ఉత్తర్వులను జారీచేశారు.

Tadepalli

2021-10-18 10:36:29

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్హరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మొదటి కోర్టు హాల్ లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో తొలుత భారత రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ ఆర్డరును  రిజిస్ట్రార్ జనరల్ బి.ఎస్.భానుమతి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా  జస్టిస్ రవినాథ్ తిల్హరితో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.  న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ గంగారావు, జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ రఘనందనరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్  సురేష్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు, రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోషియేషన్ అద్యక్షులు కె.జానకి రామి రెడ్డి, సీనియర్ అడ్వకేట్స్, అడ్వకేట్స్,రిజిస్ట్రార్స్ తదితరులు ఈ ప్రమాణ స్వీకార  కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tadepalli

2021-10-18 08:30:01

శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.  అనంత‌రం ఈవో, అదనపు ఈవోలు కలిసి  ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం, అగరబత్తులు, 2022 డైరీ క్యాలెండరు అందజేశారు.  శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా దంపతులు అఖిలాండం వద్ద  కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.  ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్  హైకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, జస్టిస్  నరేంద్ర కుమార్ వ్యాస్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-15 16:14:02

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్  ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,  దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి  శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ , పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. అనంతరం సిజెకి సీఎంతో పాటు మంత్రులు కూడా పుష్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

Tadepalli

2021-10-13 16:18:50

ఏపీ సీఎం సంప్రదాయాలు పాటించే వ్యక్తి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ సంప్రదాయాలకు విలువ ఇచ్చేవ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి చెప్పారు. టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవోధర్మారెడ్డి దంపతులు మంగళవారం తిరుమల లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. అనంతరం వీరు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామివారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి మాట్లాడుతూ, రాఘవేంద్రస్వామివారి కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. స్వామివారి ఆదేశంతో తిరుమల కు వచ్చి శ్రీ వేంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామివారి దయతోనే జరిగిందన్నారు. కార్యక్రమం చాలా బాగా, సంప్రదాయ బద్దంగా నిర్వహించారని టీటీడీని అభినందించారు.

Tirumala

2021-10-12 06:55:48

2022 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం వైఎస్.జగన్

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టిటిడి ముద్రించిన 2022వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు ల‌క్ష‌, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

Tirumala

2021-10-11 17:21:33

2021-10-11 14:53:47

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..

శ్రీవారి  బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు. ముందుగా  సీఎం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు  పరివట్టం కట్టారు. అక్కడినుంచి పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని  మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆల‌యానికి చేరుకుని స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి కలిసి స్వాగతం పలికారు. దర్శనానంతరం ముఖ్యమంత్రికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు,  డ్రైఫ్లవర్ టెక్నాలజీతో చేసిన స్వామివారి చిత్రపటం, కాఫీ టేబుల్‌బుక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి,  కన్నబాబు,  కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు గురుమూర్తి, మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  మార్గాని భరత్,  రెడ్డెప్పరెడ్డి, ఎమ్మెల్యేలు  కరుణాకర్ రెడ్డి,  రోజా,  బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకటే గౌడ,  ఆదిమూలం,  చింతల రామచంద్రారెడ్డి,  ఆరణి శ్రీనివాసులు,  మేడా మల్లికార్జున రెడ్డి,  తిప్పేస్వామి, ఆర్.ప్రతాప్ కుమార్ రెడ్డి, చిత్తూరు జడ్ పి ఛైర్మన్  శ్రీనివాసులు, బోర్డు సభ్యులు  ప్రశాంతి రెడ్డి,  పోకల అశోక్ కుమార్, కాటసాని రాంభూపాల్ రెడ్డి,  మధుసూదన్ యాదవ్,  కె.సంజీవయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి  వాణీ మోహన్, జిల్లా కలెక్టర్  హరినారాయణన్, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ  వెంకట అప్పలనాయుడు, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్  భూమన అభినయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-11 14:52:47

సప్తగోప్రదక్షిణ మందిర ప్రారంభించిన సీఎం..

తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమ‌వారం సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న  ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో  స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు.  తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ భక్తులు ముందుగా సకలదేవతా స్వరూపిణిగా భావిస్తున్న గోమాతను దర్శించుకుని, తరువాత శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టిటిడి నిర్మించింది. తిరుమలకు నడకదారిలోనూ, వాహనాల్లోనూ వెళ్లే భక్తులకు అనువుగా ఉండే చోట ఈ మందిరం నిర్మించడం జరిగింది.

ప్రాముఖ్యతలు..
 ఏడు కొండలకు సూచికగా ఏడు గోవులు, వాటి దూడల నడుమ శ్రీవేణుగోపాలస్వామి విగ్రహం, గోదర్శనం, గోపూజ, ప్రత్యేకంగా గ్రహశాంతి నివారణ పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరం ఏర్పాటు చేయడమైనది. భక్తులు వారు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ద్రవ్యములు గానీ, గ్రాసం గానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశం కల్పించడం జరిగింది. కనుమరుగవుతున్న భారతీయ స్వదేశీ గోజాతులు, వాటి ఔన్నత్యాన్ని దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా తెలియజేసే విధంగా గోవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. పూజకు సంబంధించిన వివిధ జాతుల గోవులను గోసదన్‌లో ఉంచి వాటి ఆలనాపాలనా చూసేందుకు వీలుగా గోసదన్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, ఉపసభాపతి కోన రఘుపతి, మంత్రులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు  గురుమూర్తి,  మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, జె ఈ ఓ  సదా భార్గవి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్  భూమన అభినయ రెడ్డి, దాత  శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-11 12:31:15

నడకదారి పైకప్పును ప్రారంభించిన సీఎం..

తిరుప‌తిలోని అలిపిరి నుండి తిరుమ‌ల జిఎన్‌సి టోల్ గేట్ వ‌ర‌కు పున‌ర్నిర్మించిన న‌డ‌క‌మార్గం పైక‌ప్పును సోమ‌వారం సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌ ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. అలిపిరి నుంచి తిరుమలకు నడచివెళ్లే మార్గంలో 40 సంవత్సరాల క్రితం పైకప్పు నిర్మించారు. ఈ పైకప్పు అక్కడక్కడా పాడై పునరుద్ధరణ అవసరమైంది. ఈ పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో నడకమార్గంలో నూతనంగా పైకప్పు నిర్మించడానికి ముందుకొచ్చింది. అలిపిరి నుండి గాలిగోపురం వరకు 1100 మీటర్ల దూరం కొత్తగా గాల్‌వాల్యూమ్‌ రూఫింగ్‌ షెల్టర్లు నిర్మించారు. గాలిగోపురం నుంచి తిరుమల జిఎన్‌సి వరకు 3,250 మీటర్ల దూరం కొత్తగా ఆర్‌సిసి రూఫ్‌ షెడ్లు ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  నారాయణ స్వామి, ఉపసభాపతి  కోన రఘుపతి, మంత్రులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీలు గురుమూర్తి,  మిథున్ రెడ్డి,  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్, అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఎం.సచిన్,  ఏవీఎస్ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-11 12:26:41

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు..

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ మంత్రి  శేఖ‌ర్ బాబు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య ఛైర్మన్  రవిచంద్రన్ ఆధ్వ‌ర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.  శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు.

Tirumala

2021-10-10 11:13:54