1 ENS Live Breaking News

రేషన్ కార్డుతో ప్రొబేషన్ కి మెలికపెట్టారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ నిబంధనల ప్రకారమే చేస్తుందని..దేశంలో ఇచ్చిన జీఓలను అచ్చుగుద్దినట్టు పాటించే ప్రభుత్వం దేశంలోనే రాష్ట్రానిదేనని అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాని అమలులో మాత్రం ‘చెప్పడానికే శ్రీరంగ నీతులు’అన్నచందాన వ్యవహరించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఇచ్చిన జీఓలను కావాలనే అమలు చేయకుండా వదిలేయడం ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే చేయడం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 34 వేల మంది ఉద్యోగులకు అర్ధం కాకుండా వుంది. మళ్లీ ఇపుడు పుండుపై రోకటి పోటు అన్నట్టుగా ఇపుడు.. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది తెలుపురంగు రేషన్ కార్డు వినియోగిస్తున్నారని వారంతా ప్రభుత్వానికి కార్డులు సరెండర్ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి సర్కారు..దానికి రేషన్ కార్డులేని నిరుపేదలు ఎంతో హర్షించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది నేటికీ రేషన్ కార్డు వినియోగిస్తున్నవారందరీకి గొంతులో పచ్చివెలక్కాయ్  కూడా పడింది. దానికి స్పందించిన ఉద్యోగులు తమ రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి ముందుకొస్తే..దానికి నియమ నిబంధనలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు( ఉదాహరణకు అనంతపురం జిల్లాలో 65 మండలాల్లో 9313 మంది) వైట్ రేషన్ కార్డు దారుల కుటుంబాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ-కేవైసీ, ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసినపుడు ఆ కార్డులు లైవ్ లో ఉన్నట్టు చూపిస్తున్నాయి. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చూస్తున్న ఉద్యోగులకు వాటిని ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. అలాగని కొంత మంది ఉద్యోగులు సరెండర్ చేయడానికి గానీ, వారి పేర్లను తొలగించుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రస్తుతం అన్నిజిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల రేషన్ కార్డులను సరెండర్ చేయాలని ప్రత్యేక సర్క్యులర్లు జారీచేశారు.

అలాగని మండలస్థాయిలో తహశీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో జెసీలు సైతం దానికి ఏ విధంగా సరెండర్ చేయాలి(ఉద్యోగి మాత్రమే తప్పుకోవాలా..లేదంటే కుటుంబం మొత్తానికి కార్డు రద్దు చేసుకోవాలా) అనే విషయంలో దిశ నిర్దేశం చేయలేదు. దీనితో తాము ఉన్న రేషన్ కార్డులో నుంచి తమపేరు ఎలా బయటకు తీయించాలనే విషయం, కార్డు సరెండర్ చేసే విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు క్లారిటీ రాలేదు. ఇదిలా వుంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తెలుపురంగు రేషన్ కార్డులో సచివాలయ ఉద్యోగులన్న కార్డులకు నిత్యవసర సరుకుల దుఖాణంలో సరుకులు కూడా ఇవ్వడం మానేశారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం రూ.15000వేలు మాత్రమే ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ లో జీతంగా ఇస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుపేదల వార్షిక ఆదాయం రూ.2.50లక్షలు ఉంటే వారు పేదవారిగానే లెక్క.  కానీ సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు కావడంతో వారి జీతాలు వార్షిక ఆదాయం లెక్కన చూసుకుంటే రూ.రెండు లక్షల లోపుగానే ఉన్నాయి. అలాంటపుడు వీరు నిరుపేదల జాబితాలోకి రారా అంటే.. ఖచ్చితంగా రారు అనే సమాధానం చెబుతున్నది ప్రభుత్వం. ఇలా ప్రకటించిన తరుణంలో రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులంతా వారున్న రేషన్ కార్డుల్లో నుంచి తమ పేర్లను తొలగించాలని ప్రయత్నిస్తుంటే వారికి పరిష్కారం దొరకడం లేదు. అన్నీ నిబంధనల ప్రకారం చెప్పే ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరిన వెంటనే ప్రకటించాల్సి వుంది. కానీ సుమారు రెండేళ్ల పాటు కామ్ గా ఊరుకొని ‘మావోడికి మెదిలినపుడే’ మొదలెట్టాలి అన్నట్టుగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తవుతున్న తరుణంలో ఈ నిబంధన పెట్టడమేంటని ఉద్యోగులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

ఆది నుంచి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కాస్త తేడానే వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా నియమించిన ప్రభుత్వం నేటి వరకూ తమకు అధికారాలివ్వకపోగా.. ఇప్పటికే అమలులో ఉన్న జీఓ నెంబరు 149ని అమలు చేయకుండా పంచాయతీ గ్రేడ్-1,4 వాళ్లను మాత్రమే డిడిఓలుగా కొనసాగిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనే ఎందుకు అమలు చేయడం లేదంటే ‘ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారని’ ఇలా అయితే తాము ప్రజలకు ఏం సమాధానం చెబుతామని, అధికారాలు లేకుండా తాము ఏ విధంగా సేవలు చేస్తామని వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంతో వివక్షకు గురవుతూ ఉద్యోగాలు చేస్తున్నామని..ఈ సమయంలో తామున్న రేషన్ కార్డులను సరెండర్ చేయమంటున్నారని.. వచ్చే ఈ తక్కువ జీతంతో ఎలా కుటుంబాలను నెట్టుకు రావాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి సరెండర్ చేయడానికి ముందుకొస్తే దానికి సరైన సూచనలు గానీ, సలహాలు గానీ చేయడం లేదని సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఈ ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు తక్కువ జీతం ఒక కారణమైతే..తీవ్ర మైన వివక్ష రెండో కారణంగా, అధికారాలు లేని ఉద్యోగాలు మూడో కారణంగా తమను వెంటాడుతున్నాయని వాపోతున్నారు. అన్నింటినీ భరిస్తూ విధులు నిర్వహిస్తున్నా తమకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని..ప్రశ్నించిన పాపానికి సస్పెండ్ లు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘రాజు తలచుకుంటే దెబ్బలకు..డబ్బులకు కొదవా’ అన్నట్టు రాష్ట్రంలో వున్న ఏ ప్రభుత్వశాఖలో లేని విధి విధానాలు, జీఓలు అమలు కాకపోవడం ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే ప్రభుత్వం చేపట్టడం దారుణమనే వాదన సర్వత్రా వినిపిస్తుంది. రేషన్ కార్డులతో ప్రొబేషన్ కి మెలిక పెడుతూ, కఠిన చర్యలంటూ ఇపుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజు రోజుకీ ఆశక్తిని రేపుతోందంటున్నారు విశ్లేషకులు..!

Tadepalle

2021-08-25 01:52:50

ఏపీలో జూనియర్‌ కాలేజీల ఫీజులు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కాలేజీలకు..ఎంపీసీ, బైపీసీలకు రూ.15000, ఇతర గ్రూపులకు రూ.12000 విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయాలి. అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో..ఎంపీసీ, బైపీసీలకు రూ.17,500, ఇతర గ్రూపులకు రూ.15000 చెల్లించాలి. ఇక కార్పొరేషన్ల పరిధిలో.. కాలేజీలు ఎంపీసీ, బైపీసీలకు రూ.20,000, ఇతర గ్రూపులకు రూ.18000 మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. అంతకు మించి అధికంగా వసూలు చేసే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కరోనా తరువాత ఫీజులు ఈ విధంగా ప్రకటించడం పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది..

Tadepalle

2021-08-24 15:40:47

ఆంధ్రకేసరికి నివాళులు అర్పించి సీఎం జగన్..

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించారు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం అసువులు బాసారని, అలాంగి త్యాగమూర్తులను ప్రతీఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.*ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌ కూడా పాల్గొని టంగుటూరికి నివాళులు అర్పించారు.

Tadepalle

2021-08-23 13:19:07

జీఓ-149పై పంచాయతీరాజ్ శాఖ 2నాల్కల దోరణి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో సింహభాగమైన పంచాయతీకార్యదర్శిల విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ శాఖ రెండు నాల్కల దోరణి అవలంభిస్తుంది. పంచాయతీరాజ్ శాఖలోని జీఓనెంబరు 149ను అనుసరించి గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 వరకూ అన్ని అధికారాలు, రికార్డుల నిర్వహణ, జమాఖర్చుల విధులు చేపట్టవచ్చునని చెబుతూనే.. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎక్కడ అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీనితో విసుగు చెందిన ఉద్యోగులు నేరుగా సమాచారహక్కు చట్టాన్ని ప్రయోగించిన సందర్భంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధి శాఖ  పౌరసమాచార అధికారి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ అదికూడా అమలుకి మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఉత్తుత్తి కార్యదర్శిలుగా నేటికీ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక అంశాలన్ని ఇటు ప్రభుత్వము, గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు గమనించాల్సి వుంది. చూపించడానికే ప్రభుత్వ జీఓలు తప్పా వాటిని అమలు చేయడానికి మాత్రం పంచాయతీరాజ్ శాఖలో చోటులేదని.. ఎందుకంటే ఆ విషయాన్ని సమాచారహక్కు చట్టం దరఖాస్తుకి జవాబు ఇచ్చిన కమిషనర్ కార్యాలయ అధికారులే స్పష్టం చేశారు. దానికి కూడా కారణం లేకపోలేదు. 2019లో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి నేటి వరకూ ఎంపీడీఓలు, డిపీఓలు, జిల్లా కలెక్టర్లు ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల క్రిష్ణ ద్వివేదికి సైతం నేరుగా జీఓనెంబరు 149ని అమలు చేయమని, ప్రభుత్వ జీఓ ప్రకారం తమ పరిధి, విధులు, జాబ్ చార్టు కేటాయించాలని దరఖాస్తులు చేసినా అవన్నీ బుట్టదాఖలే అయ్యాయనడానికి ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడమే.

పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు.. గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149ని ప్రకారం అధికారాలు బదలాయించకపోవడం వలన ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న ఇంటిపన్ను నవీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి కార్యదర్శిలందరికీ వారి వారి సచివాలయ పరిధి మేరకు అధికారాలు, రికార్డులు, నిధులు కేటాయిస్తే వారి పరిధిలో పనివారు చక్కగా చేసుకుని ఉండేరు. కానీ ఇపుడు ఆ అధికారాలన్నీ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్-1-4 కార్యదర్శిల దగ్గరే వదిలేదయడంతో వారికి పనిచేయడం చేత కాక మళ్లీ గ్రామసచివాలయ ఉద్యోగులకు, కార్యదర్శిలకు ప్రత్యేక డ్యూటీలు వేసి వారితో చేయించుకునే పరిస్థి నెలకొంది. ఇదొక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40శాతానికి పైగా ఇంటిపన్నుల బకాయిలు పేరుకు పోయాయి. వాటిని కూడా ప్రస్తుతం పంచాయతీల కార్యదర్శిలు వసూలు చేయడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. గ్రేడ్-1-4 పంచాయతీ కార్యదరద్శిలంతా సచివాలయ ఉద్యోగులపై అజమాయిషీ చలాయించినంతగా వసూళ్లు వెళ్లాంటే మాత్రం తెగ నొప్పులు పడిపోతున్నారు. అక్కడ బిల్ కలెక్టర్లు, కొన్ని మేజర్ పంచాయతీలకు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నా.. వారికి పనిచేయడం చేతకాక ఆ పనులన్నీ మేజర్ పంచాయతీ పరిధిలో వున్న మూడు సచివాలయ సిబ్బందితోనే చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 కార్యదర్శిల వరకూ వాదోపవాదాలు, కొన్నిచోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఏకంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలపై తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రొబేషన్ లో వున్న గ్రామసచివాలయ సిబ్బంది కూడా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలుగా వున్న వారి మాటలను వినీ విననట్టు వ్యవహరిస్తూ పనిచేస్తున్నారు. అక్టోబరు 2 నుంచి జవరిలోపు అందరి సచివాలయ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ అవుతాయి. ఈసమయంలో పంచాయతీల్లో పెండింగ్ పనులు పూర్తయ్యాయా సరేసరి లేదంటే మాత్రం అవి పూర్తికావడానికి, పెండింగ్ ఇంటి పన్నులు వసూలు చేయడానికి ఎంత సమయం పడుతుంతో లెక్కలేదు. ఇప్పటి వరకూ తమ ఉద్యోగాలకి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భయపడుతూ, ప్రొబేషన్ లో మచ్చపడకూడదని మాత్రమే ఇప్పటి వరకూ గ్రామ సచివాలయ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కాస్త నెమ్మదిగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు ఎంపీడీఓ మిలాఖత్ అయి కావాలనే గ్రామ సచివాల కార్యదర్శిలను, సిబ్బంది చులకనగా చూస్తున్నారు. ఎన్నిచూసినా, ఏం చేసినా ప్రభుత్వ నిభందనల మేరకు విధులు నిర్వహిస్తూ.. చాలా చోట్ల అధికారులు తిట్టినా ఓపికతో విధులు నిర్వహిస్తున్నారు సచివాలయ సిబ్బంది. ఈ తరుణంలోనే మరో 4 నెలల సమయం  పూర్తై వీరి సర్వీసులు రెగ్యులర్ అయితే మాత్రం ఏ సచివాలయ సిబ్బందీ ఫాల్స్ ప్రెస్టీజీతో మూర్ఖంగా వ్యవహరించే అధికారుల ఒత్తిడిని, మాటలు, చులకనగా వ్యవహరించే తీరును ఓపిక పట్టరనే సంకేతాలను అపుడే సిబ్బంది విడుదల చేస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన జీఓనెంబరు 149ని పంచాయతీరాజ్ శాఖ గానీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి గానీ ఎందుకు అమలు చేయడం లేదనే విషయంలో సరిగ్గా నేటికీ క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఎంత కాలం నాన్చుతుందో ఓపికతోనే చూద్దామనే ధీమాలోనే గ్రేడ్-5 కార్యదర్శిలతోపాటు, సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. విశేషమేంటంటే కొన్ని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శి మొదలు కొని అన్ని శాఖల సిబ్బంది ఒక మాటమీదకు వచ్చి సచివాలయం-1 అంటే ప్రస్తుం మేజర్ పంచాయతీలుగా వున్న చోట కొన్ని పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సివున్నా.. తమకు ప్రభుత్వం కేటాయించిన విధులన్నాయని చెప్పి తప్పించుకు పోతున్నారు. ఈ తరుణంలో చాలా పనులు పెండింగ్ లో పడిపోతున్నాయి. ఇదే సమయంలో కొందరు గ్రేడ్-1-4 కార్యదర్శిలు ఉద్యోగులపై వీర ప్రతాపం చూపించినా ఫలితం లేకుండా పోతుంది. కొన్ని పంచాయతీల్లో సిబ్బంది ఏమీ అనలేక కావాలని జీతాలు ఆలస్యంగా బిల్లులు చేసే పనికి పూనుకుంటున్నారు పంచాయతీల కార్యదర్శిలు. ఈ విషయాలన్నీ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యాలయానికి, స్థానిక ఎంపీడీఓలకు, జిల్లా పంచాయతీ అధికారులకు సమాచారం ఉన్నప్పటీకి నోరు మెదపకుండా అలానే ఉండిపోతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందాన.. పంచాయతీలకు సిబ్బంది ఉన్నా వారికి సాంతికపరంగా పనిచేసే విధానం, కంప్యూటర్ వర్క్ పై అవగాహన లేకపోవడంతో చచ్చినట్టు మళ్లీ సచివాలయ ఉద్యోగులతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు. దానికి కారణం ఒక్కటే ప్రస్తుతం గ్రామసచివాలయ శాఖ పనిచేస్తున్న 80శాతం మంది ఉద్యోగులు బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంటెక్, కొన్ని సచివాలయాల్లో పీహెచ్డీలు చదివిన వారు కూడా ఉండటమే. అంతేకాదు అత్యధిక చదువులున్న ప్రభుత్వ శాఖ ఉద్యోగులున్న శాఖగా  గ్రామ, వార్డు సచివాలయశాఖ రికార్డులకెక్కింది. ఈరోజుకీ చాలా పంచాయతీల్లో కార్యదర్శిలు పదవ తగరతి, మెట్రుక్యులేషన్, అత్యధిక చదువు ఇంటర్ వరకూ మాత్రమే పూర్తిచేసిన వారు ఉండటమే దీనికి ప్రత్యేక కారణం. 

ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటీకి కావాలనే నాన్చుడు దోరణి అవలంభిస్తుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు  అధికార బదలాయింపులు జరగాల్సి వుంది. అదే సమయంలో సచివాలయాల్లోని 14 శాఖల సిబ్బందినీ వారి పనులను వారిని చేసుకోనీయాలి. అలాకాకుండా ఇటు పంచాయతీరాజ్ శాఖ, అటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కావాలనే గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందకూడదనే అడ్డుకట్ట వేయాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. అలాకాకపోతే ఈపాటికే గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19రకాల సిబ్బంది సర్వీసు రూల్సు, జాబ్ చార్టు, ఆయా ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వమే అమలు చేసిన జీఓలను అమలు చేసి  ప్రజలకు 50శాతం చేరువ కావాలి. నేటికీ సచివాలయాల్లో ప్రభుత్వం ఏ తరహా సేవలు అందిస్తున్నదో ప్రజలకు తెలియపోవడానికి కారణం కూడా ఇదే. తమకు అధికారాలు ఇవ్వనపుడు లేని అధికారాలతో ప్రజలకు ఏం సేవలు చేస్తామని ప్రశ్నిస్తున్నారు గ్రేడ్-5 ఉద్యోగులు. ఒక రకంగా చాలా సేవల వివరాలు గ్రేడ్-5 కార్యదర్శిల ద్వారా ప్రజలకు ఎక్కువగా తెలుస్తాయి. ఒక వేళ మిగిలిన ప్రాంతాల్లోవున్న గ్రేడ్-1-4 కార్యదర్శిలు చెప్పాలన్నా వారికి ప్రస్తుతం ఆన్ లైన్ పనులు, ఇతర జీఓలు వాటిపై అవగాహన లేదు సరికదా చాలా మంది వాటిని చదివి అర్ధం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేరు. దానికి ప్రధాన లోపం కనీసం చాలా మంది డిగ్రీ చదువు ఇంగ్లీషులో  ప్రావీణ్యత లేకపోవడమే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే జనవరి2022 దాటిన తరువాత నుంచి సచివాలయ సిబ్బంది నుంచి ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కునే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. చూడాలి ఇప్పటికై ప్రభుత్వం జీఓనెంబరు 149 అమలు చేయడంతోపాటు, అన్నిశాఖలకు సంబంధించి ఆయాశాఖల జాబ్ చార్టు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓ ప్రకారం అమలు చేస్తుందో.. లేదంటే ఇంకా పాద పద్దతిలోనే నాన్చుడు వ్యవహారాన్నే కొనసాగిస్తుందో..!

Tadepalle

2021-08-21 02:31:32

24,25న ఎపిఎస్‌ఎస్‌డిసి నైపుణ్యపోటీలు..

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నైపుణ్యపోటీలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రెండు రోజులపాటు జరిగే పోటీలను కేఎల్ యూనివర్సిటీతోపాటు స్వర్ణభారతి ట్రస్ట్, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిపెట్, నేచురల్స్, ఆంధ్రా లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, శ్రీవిశ్వకర్మ గోల్డ్ స్మిత్ ల దగ్గర కూడా వివిధ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి టాప్ ప్లేస్ లో నిలిచినవారిని త్వరలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని 2022 సెప్టెంబర్లో చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.

ఈ సందర్భంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రారంభ వేడుకలను నిర్వహించేందుకు కేఎల్ యూనిర్సిటీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎపిఎస్‌ఎస్‌డిసి పనిచేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలకు ఎంపికైనవారు మంచి ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయికి కూడా ఎంపికై రాష్ట్రానికి మంచి పేరుకు తీసుకురావాలన్నారు. 

అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చైనాలో 2022లో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు గాను ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిర్వహించామన్నారు. 32 విభాగాల్లో పోటీలకు గాను మొత్తం 21,515 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన 397మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. వీరంతా కేఎల్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి.. మన దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం పొందడంతోపాటు చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచ నైపుణ్య పోటీల్లో సత్తా చాలాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైపుణ్య శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపారని.. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు  మన యువతకు అందించాలన్న ఉద్దేశ్యంతో అనేక సంస్థలతో కలిసి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ డి.వి రామకోటి రెడ్డి, కె. విజయ్ మోహన్ కుమార్, వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్స్ కన్వీనర్ డాక్టర్ గుజ్జుల రవి, కెఎల్ యూనివర్సిటీ ప్రోవైస్ చాన్సులర్ ప్రొఫెసర్ వెంకట్రామ్, కెఎల్ యూనివర్సిటీ డీన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-18 16:39:18

మొహరం శెలవు తేదీ మార్పు..జీఓ జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహరం శెలవుతేదీని మార్పుచేస్తూ జిఓఎంఎస్ నెంబరు 1341, 1342 ను విడుదల చేసిందని మైనార్టీ సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి మొహరం పండుగ గురువారం వచ్చిందని, అయితే శుక్రవారం ముస్లిం కుటుంబాలకు ఎంతో పవిత్రమైన రోజని దానిని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గురువారం ఆగస్టు 19 శెలవుకి బదులు ఆగస్టు 20న ప్రభుత్వ ఐచ్చిక శెలవును ప్రభుత్వం ప్రకటించినట్టు పేర్కొన్నారు.

Tadepalle

2021-08-18 14:21:45

హెచ్ఆర్ఎంఎస్ లో సాంకేతిక లోపం..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామసచివాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అత్యవసరంగా సెలువులు పెట్టాలంటే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హెచ్ఆర్ఎంఎస్(హ్యూమన్ రీసోర్స్ మేన్ పవర్ సిస్టమ్)లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఇటు పంచాయతీ కార్యదర్శిలకు గానీ, అటు పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు గానీ లాగిన్ ఇవ్వకపోవడంతో వీరికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సెలవుచీటి రాసి సచివాలయంలోనూ, అటు పోలీస్ స్టేషన్లలోనూ ఇచ్చినా ఫలితం ఉండటం లేదు. బయోమెట్రిక్ అటెండెన్సు విధానం కూడా హెచ్ఆర్ఎంఎస్ కు అనుసంధానం అయి ఉండటంతో మహిళా పోలీసులు సెలువులు పెట్టిన సమయంలో బయోమెట్రిక్ సిస్టమ్ లో విధులకు హాజరు కానట్టు చూపిస్తుంది. దీనితో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులు సాధారణ సెలవులు పెట్టుకోవడానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎస్ఐలకు తెలియజేసినా.. ఇంకా హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లు తమకు కూడా ఇవ్వలేదని ఎస్ఐ లు చెబుతున్నారు. దీనితో వీరి సెలవులు ఆన్ లైన్ లో నమోదు కావడం లేదు. తమకు అత్యవసర సమయంలో సెలవులు తీసుకునేందుకు హెచ్ఆర్ఎంస్ లాగిన్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని మహిళా పోలీసులు వేడుకుంటున్నారు. అయితే గ్రామసచివాలయశాఖలోని సుమారు 19 శాఖలకు చెందిన సిబ్బందికి చెందిన ప్రభుత్వ శాఖల విధులు, ఆన్ లైన్ సిస్టమ్ అంతా నవీకరణ జరుగుతుందోని సచివాలయ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి తెలియజేశారు. త్వరలోనే ఈ సాంకేతిక సమస్య తీరనుందని ఆయన స్పష్టం చేశారు..ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని ఆయన వివరించారు. ఈ విషయం అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల నుంచి వస్తున్న సచివాలయ మహిళా పోలీసులు  ఇబ్బందులను ద్రుష్టిలో పెట్టుకొని  ప్రభుత్వం త్వరితగతిన సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. మహిళా పోలీసులు ఆందోలన పడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.

Tadepalle

2021-08-18 03:04:08

ఏపీలో కొత్త కర్ఫ్యూ సడలింపులివే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కోవిడ్ కర్ఫ్యూ సడలింపులు ప్రకటించింది. తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఇవ్వాలని అధికారులను సిఎం వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఎవరు మాస్కు ధరించకపోయినా ఫైన్లు వేయడం ద్వారా ఖచ్చితంగా మాస్కు ధారణ చేస్తారని అభిప్రాయ పడ్డారు.

Tadepalle

2021-08-17 15:17:37

థర్డ్ వేవ్ వచ్చినా దైర్యంగా ఎదుర్కోవాలి..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, రాబోయే థర్డ్ వేవ్ పై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ, స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రమంతా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం 
మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూళ్లలో కరోనా వైరస్ టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం అందేలా చూడాలాన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకొని కేసులు పెట్టాలన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కాగా రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 17,218,రికవరీ రేటు 98.45%,పాజిటివిటీ రేటు 1.94 % గా ఉందన్నారు. 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు 10,
3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు 3 ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు. థర్డ్ వేవ్ వచ్చినా  20,464 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. ఇక డి టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు 27,311 అందుబాటులో ఉన్నాయని, ఆగష్టు నెలాఖరునాటికి 104 చోట్ల ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేయడంతో పాటు మరో 36 చోట్ల సెప్టెంబరు రెండోవారానికి పూర్తి చేయనున్నట్లు అధికారులకు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో  ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tadepalle

2021-08-17 14:27:44

2023కి సమగ్ర భూ సర్వే మొత్తం పూర్తికావాలి..

భారత దేశంలో తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వందేళ్ల తర్వాత ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతోందని ఎంతోప్రతిష్ట్మాకంగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష  పథకంపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆధునిక టెక్నాలజీ, సచివాలయాల్లోని సర్వేయర్లు అందరినీ వినియోగించి
జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి చేయాలన్నారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలన్న సీఎం  అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని సూచించారు.  సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్‌ కావాలన్నారు. ఆ భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని, అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయాలని, దీనికోసం అవసరమైన సాప్ట్‌వేర్‌ను సమకూర్చుకోవాలన్నారు.
సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండంతోపాటు, దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం సూచించారు. 

అనంతరం అధికారులు మాట్లాడుతూ, అనుకున్న సమయానికి కచ్చితంగా సమగ్ర భూసర్వే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీని కచ్చితంగా దేశంలో మొదటి స్ధానంలో నిలబెడతామన్న అధికారులు సీఎంకి తెలియజేశారు. సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4వేలు చొప్పున రోజుకు 16వేల సర్వేరాళ్లు ఉత్పత్తి చేస్తామని భూగర్భగనులశాఖ అధికారులు తెలియజేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్,  పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-12 15:16:41

అట్టడగు వర్గాల అభివ్రుద్ధికి విశేష క్రుషి..

రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్ధానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) ఛైర్మన్‌గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ గురువారం తాడేపల్లిలోని లిడ్‌క్యాప్ ప్రధాన కార్యాలయంలో పదవీబాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బలహీన అట్టడుగు వర్గాల వారిని గత ప్రభుత్వం విస్మరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యస్‌సి యస్‌టి బిసి వర్గాల వారు ఆర్ధిక ఎ దుగుదలకు దూరం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో బలహీనవర్గాల వారుపడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అప్పుడు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడ్డారన్నారు. దేశంలో ఎ క్కడాలేనివిధంగా పేదప్రజలకు 38 లక్షల ఇళ్లస్ధలాలను మంజూరు చేయడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో యస్‌సి యస్‌టి వర్గాల వారికి అధికప్రాధాన్యతనిచ్చి వారు ఆర్ధికంగా నిలదొక్కుకోవడం ద్వారా సమాజంలో సముచితస్ధానం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్ధేశ్యమన్నారు. 

లిడ్‌క్యాప్ సంస్ధ ద్వారా అట్టడుగువర్గాలవారికి ఆర్ధికప్రయోజనం చేకూరే విధంగా కృషి చేయాలని ఆయన నూతన ఛైర్మన్‌కు సూచిస్తూ అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ పేదబలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డే నన్నారు. ఇటీవల కార్పోరేషన్ ఛైర్మన్‌లుగా అధికశాతంమంది బలహీనవర్గాలవారిని ఆయన ఎ ంపిక చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిర్జీవమైన లిడ్‌క్యాప్ సంస్ధకు జవసత్వాలను తీసుకొచ్చి ముందుకు నడపడం ద్వారా సంస్ధపై ఆధారపడిన బలహీనవర్గాల వారికి ప్రయోజనాలు కల్పించేందుకు ఇప్పటికే తాను ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు పరచడం ద్వారా ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని సఫలీకృతం చేసి ఆయన మన్ననలను పొందేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలోలెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టరు కె. హర్షవర్ధన్, జనరల్ మేనేజరు యం. పుష్పవతి, అసిస్టెంట్ మేనేజరు యన్. అధికారి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-12 14:13:58

గ్రామ సచివాలయాల్లో కానరాని స్పందన..

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలు, 13 మంది జిల్లా కలెక్టర్లు.. మరో 13 మంది గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు.. వీరందరీకి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పదే పదే చెబుతున్నమాట ఒక్కటే ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుమ్మం వద్దనే స్పందన కార్యక్రమం నిర్వహించమని. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. కానీ ఈ కాలంలో సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన  ఒక మంచి కార్యక్రమంగా ప్రజలకు చేరువ చేయలేకపోతున్నారంటే తప్పెవరది. సోమవారం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు స్పందన అర్జీదారులతో నిండిపోతున్నాయి. వందల సంఖ్యలో వివిధ సమస్యలపై దరఖాస్తులు అధికారుల ముందుకి చేరుతున్నాయి. వేల సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన నిర్వహిస్తే ఈ పరిస్థితి వచ్చేదా అంటే కాదనే చెబుతారు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నీ సచివాలయాల ద్వారానే అందించాలని సీఎం నెత్తీనోరూ కొట్టుకుంటుంటే జిల్లా కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు నిర్లక్ష్యమో తెలీదు గానీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకూ ఒక్క సచివాలయంలో కూడా స్పందన కానరావడం లేదు. 

అన్నీ వున్నా అల్లుడినోట్లో శని అన్నట్టుగా తయారైంది ఇపుడు సచివాలయాల పరిస్థితి. ఒకప్పుడు గ్రామపంచాయతీలో ఒక కార్యదర్శి, పెద్ద పంచాయతీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు లేదా, ఒక బిల్ కలెక్టర్ ఉండేవారు. ఇపుడు అదే స్థానంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత సుమారు 14శాఖల సిబ్బంది అందుబాటులో వున్నా ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇవేవో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్, www.enslive.net కావాలని అంటున్న మాటలు కాదు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మాత్రమే జరుగుతున్న స్పందన కార్యక్రమంలో నమోదవుతున్న  అర్జీలు చెప్పే సంఖ్య. విచిత్రం ఏంటంటే అర్జీదారుడు ఇచ్చే దరఖాస్తుని జిల్లా కలెక్టర్ కి ఇచ్చినా.. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినా పరిష్కారం అయ్యేది స్థానికంగానే.. ఎందకనో స్పందన అంటే ప్రజలకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయమనే గుడ్డి నమ్మకం వచ్చేసింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా రాష్ట్రంలోని మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్1,2,3,4 కార్యదర్శిలంతా వారి రాజకీయ సామర్ధ్యాన్ని ఉపయోగించి రెండు మూడు పంచాయతీలకు డిప్యుటేషన్లు, ఇన్చార్జిలు వేయించుకోవడమే. ఇలా అదనపు పనులు తమపై వేసుకొని.. ఉన్న సచివాయాల్లో పూర్తిస్థాయిలో ఉండక, అటు ఇన్చార్జి పంచాయతీలు, సచివాలయాల్లో అందుబాటులో ఉండక స్పందన కార్యక్రమ నిర్వహణ కష్టంగా మారుతోంది. అందులోనూ ప్రస్తుత సచివాలయ ఉద్యోగులు మినహా గతంలో పంచాయతీల్లో పనిచేసే 70శాతం మంతి పంచాయతీ కార్యదర్శిలకు కనీసం కంప్యూటర్ వినియోగం కూడా తెలీదు. దీనితో ఇక్కడకి ఏ సమస్యపై పరిష్కారం కోసం వచ్చినా దరఖాస్తు దారుడు తెచ్చే అర్జీ ఆన్ లైన్ చేసే దిక్కుండేది కాదు. ఇపుడు ప్రతీ గ్రామ సచివాలయాలనికి డిజిటల్ అసిస్టెంట్ తోపాటు మరో 13ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులో వున్నప్పటికీ స్పందన కార్యక్రమం మాత్రం సక్రమంగా జరగడం లేదు.

జిల్లా కలెక్టర్లు, జెసీల ఉత్తుత్తి పర్యటనలు..
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, జెసిలను తప్పనిసరిగా వారంలో 4 రోజులు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించడంతో వారంతా సచివాలయ సందర్శనకు వెళుతున్నారు.. తప్పితే అక్కడ స్పందన జరుగుతున్న తీరుపై ద్రుష్టి పెట్టడం లేదనే విషయం కలెక్టర్ కార్యాలయాలకు వచ్చే అర్జీలే తేటతెల్లం చేస్తున్నాయి. వెళ్లిన ప్రతీసారీ ప్రభుత్వ లక్ష్యాన్ని వల్లెవేస్తున్నారు తప్పితే ఎందుకు స్పందన నిర్వహించడం లేదు.. ఎందుకు గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేయడం లేదనే విమర్శలున్నాయి. అందులోనూ కలెక్టర్లు, జెసిలు సచివాలయ సందర్శనకు వెళ్లే ప్రతీసారీ ముందుగా సమాచారం ఇచ్చిగానీ వెళ్లడం లేదు. అలా సమాచారం అందుకున్న సచివాలయ సిబ్బంది కలెక్టర్ వచ్చే సమయానికి అంతా సిద్దం చేసి పనిచేస్తున్నట్టుగా కలరిస్తున్నారు. దీనితో గ్రామాల్లో సచివాలయ సేవలు బాగా అందుతున్నాయని రికార్డు చేసుకొని వచ్చేస్తున్నారు కలెక్టర్లు జేసిలు. ఒక్కసారి అధికారులు మారు వేషంలో వస్తే తప్పా సచివాలయాల్లో ఏం జరుగుతుందనేది బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది..

సచివాలయాల్లో అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిలు..
ఒక పక్క సచివాలయాల్లో తెగ పనిచేసేయాలని ఆదేశాలు, ఆగ్రహాలు వ్యక్తం చేసే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చే విషయంలో నేటికీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. జీఓనెంబరు 149 ఆధారంగా మేజర్ పంచాయతీల్లో విభజించిన సచివాలయ పరిధిలు ఆధారంగా అధికారాలు, విధులు, రికార్డులు, ఖజానా చిట్టా విభజించాల్సి వున్నా ప్రభుత్వం మాత్రం నేటికీ ఆపనిచేయలేదు. దీనితో చేతిలో అధికారం లేని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు తమపరిధిలోనే వారు ఆడుతూ, పాడుతూ పనిచేయాల్సి వస్తుంది. అలాగని కాస్త గట్టిగా పనిచేయాలంటే అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లో ఉండిపోవడంతో తాము చేయడానికి ఏముందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 వరకూ అందరూ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులమే అయినప్పటికీ కేవలం అధికారాలు మాత్రం గ్రేడ్-1,2,3,4 వాళ్లకు ఇచ్చి ఇతర కార్యాలయ పనులు మాత్రం మాతో చేయిస్తున్నారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. చేతిలో అధికారం లేకపోవడంతో సచివాలయంలో పనిచేసే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా మాట వినడం లేదని వాపోతున్నారు. ఏ చిన్న పనికోసమైనా సచివాలయం-1లో వుండే గ్రేడ్ 1,2,3,4  కార్యదర్శిల దగ్గరకే వెళ్లాల్సి వస్తుందని, అందులో వారికి డిప్యుటేషన్లు, రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు కేటాయింపు జరగడంతో సాధారణ పనులు కూడా పెండింగ్ లో ఉండిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే మండలంలోని ఎంపీడీఓ, డిపీఓ, జిల్లా కలెక్టర్, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించినా తమకు అధికార బదలాయింపులు చేయలేదని చెబుతున్నారు. తప్పులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని పనిచేయలేదని, స్పందన నిర్వహించలేదని మమ్మల్ని ఎలా నిందిస్తారని గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఒంటి కాలిపై లేస్తున్నారు.

ప్రభుత్వం ముందు గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా అధికారాలు బదలాయిస్తే తప్పా.. వారి అధికారం వినియోగించి సచివాలయాల్లో స్పందన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించే పరిస్థి కనిపించడం లేదు. అటు ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకొని, జిల్లా కలెక్టర్లు, సచివాలయ జాయింట్ కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పిస్తే తప్పా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం, ఇంటి ముంగిటే స్పందనతో సమస్యలకు పరిష్కారమనే ప్రధాన సమస్య పరిస్కారం అయ్యేట్టట్టు కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..!

Tadepalle

2021-08-10 01:34:35

ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక..

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సోమవారం అమరావతిలో ఏర్పాటైంది. ఇందులో స్టేట్ జనరల్ బాడీకి యునానిమస్ గా  జ్ఞానవేణి కుంచే వైస్ ప్రెసిడెంట్, రాజేష్ బాత అసోసియేట్ కార్యదర్శిలు స్థానం దక్కింది. ఇక కార్యవర్గం చూసుకుంటే ఫౌండర్ ప్రెసిడెంట్  డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ కె.వి రమణ, అసోసియేట్ ప్రెసిడెంట్స్ హరి దాస్ ఈరన్న, జనరల్ సెక్రటరీ ఎం సునీల్ కుమార్, సెక్రటరీ -కోఆర్డినేషన్ ఆర్. రాజా నాయక్,అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్ జయలక్ష్మి, ట్రెజరర్  సి.హెచ్ ఆనంద్, సెక్రెటరీ ఫైన్ ఆర్ట్స్ అండ్ ప్లానింగ్  డాక్టర్ ఎల్ ఆనంద్ కుమార్, యు పద్మావతి,  రీజనల్ ప్రెసిడెంట్స్  ఎం రవికుమార్, కె.వి నాగజ్యోతి,  ఎస్ కృష్ణా రావు,వెంకటేశ్వర్లు, పబ్లిసిటీ సెక్రెటరీ కొత్తపల్లి వెంకటరమణలుగా వున్నారు. ఈ కార్యవర్గం 2021-2024 వరకూ పనిచేస్తుందని ప్రచార విభాగం తెలియజేసింది.

Tadepalle

2021-08-09 14:39:53

ఇక మహిళా పోలీస్ గా పిలవాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అనే హోదా జీఓఎంఎస్ నెంబరు 129 నుంచి 60లతో మహిళా పోలీసుగా మారిపోయింది. రాష్ట్ర హోంశాఖ ఉద్యోగులుగా ఉన్నవీరందరినీ ఇకపై మహిళా పోలీసులుగానే పిలవాలని ఆదేశిస్తూ.. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు జీఓనెంబరు 129ను ఎమెండ్ మెంట్ చేస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 60ని విడుదల చేసింది. దీని ప్రకారం సాధారణ పోలీసులకు ఉండే అన్ని అధికారాలు మహిళా పోలీసులకు కూడా వర్తిస్తాయని అందులో పేర్కొంది. అంతేకాకుండా వీరికి పోలీసు సిబ్బంది మాదిరిగా శిక్షణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎక్కడైనా వారందరినీ మహిళా పోలీసులుగా పిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు ఆ జీఓలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిని అదనపు సాధారణ గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరిచినట్టుగా వివరించింది. ఈ యొక్క విషయాన్నిసీఎం ఓఎస్డీ, పీఎస్ లతోపాటు  రాష్ట్ర డీజీపి కార్యాలయం, స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హోంమంత్రి కార్యాలయాలకూ ప్రత్యేకంగా తెలియజేశారు. డిజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీ కార్యాలయాలకు, అక్కడి నుంచి ఎస్పీకార్యాలయం, సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు, అక్కడ అడ్మిన్ ఎస్పీలకు ఈ సమాచారం చేర్చింది ప్రభుత్వం. 

గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగం విషయంలో పోలీస్ శాఖలోనే కింది స్థాయి సిబ్బందికి(హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ) ఉన్న అనుమానాలు, వారి ఇబ్బందులను నివ్రుత్తి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక జీఓ, గెజిట్లను అందరికీ సర్క్యూలేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాలో వచ్చిన ఈ జీఓలు, గెజిట్ లపై పోలీసుశాఖలోని ఏ ఒక్క సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, వ్యవహరించడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుళ్లుగానీ, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఏ విధంగానూ.. ఏ స్థాయి వారైనా అదైర్య పరిచేవిధంగా కానీ, వారంతట వారే మహిళా పోలీసు ఉద్యోగాలకు రాజీనామాలు చేసే విధంగా ప్రేరేపించేలా వ్యవహరించినా వారిపై ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం నుంచి హోంశాఖలో ఏ జీఓ వచ్చినా దానిని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల గ్రూపులో పెట్టి అవగాహన కల్పిస్తున్నారు.  

అదే సమయంలో స్టేషన్ పరిధిలోని పోలీసులు కూడా వారి స్టైల్ లోవారూ నోటికొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా పసిగట్టిన జిల్లా ఎస్పీలు అన్ని డివిజన్ల డిఎస్పీలకు, సర్కిల్ ఇనెస్పెక్టర్లకు, స్టేషన్ ఎస్ఐలకు కూడా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహిళా పోలీసులను హోంశాఖ ఉద్యోగులుగా ఇష్టం ఉన్నా, లేకపోయినా గుర్తించాలని చెబుతున్నారు. అయినప్పటికీ  మహిళా పోలీసు నియామకాలు, ప్రత్యేక జీఓలు, ప్రభుత్వ గెజిట్లు(రాజపత్రం) విడుదలైనా కొందరు కిందిస్థాయి పోలీసులు వారి పద్దతి మార్చుకోని సిబ్బందిపై స్టేట్ ఇంటెలి జెన్సుతో కాకుండా, సెంట్రల్ ఇంటెలి జెన్సు ద్వారా స్టేషన్ స్థాయిలో సిబ్బంది మహిళా పోలీసుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనే కోణంలో ప్రభుత్వం నిఘా పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే డిజిపీ గౌతం సవాంగ్ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు మహిలా పోలీసు వ్యవస్థను గ్రామాల్లో పూర్తిస్థాయిలో వ్యవస్థీకరించి గ్రామ సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగానే మహిళా పోలీసులతో ప్రత్యేక గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఏం జరిగినా తక్షణమే సదరు పోలీస్ స్టేషన్ కి సమాచారం అందేవిధంగా పక్కా నెట్వర్క్ ను కూడా పెంచారు. ఈ క్రమంలో ప్రభుత్వము, ఏపీ పోలీస్ బాస్, డిజిపీ గౌతం సవాంగ్ సైతం మహిళా పోలీసు అనే పదంతోనే వీరిని వ్యవహరిస్తున్నారు. ఇకపై స్టేషన్ లోని పోలీసులు సిబ్బంది కానీ, ఎస్ఐలు, సీఐలు, డిఎస్పీలు జీఎంఎస్కే అని వ్యవహరించకూడదని, ఆ పదాలన్నీ జీఓనెంబరు 60తో కనుమరుగు అయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది..!


Tadepalle

2021-08-09 01:50:53

మరోసారి టిటిడి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆదివారం జిఓనెంబరు 146 ను విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లోనే ట్రస్టుబోర్డు సభ్యులను కూడా నియమిస్తామని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడీ చైర్మన్ గా వైవీ ఇప్పటికే రెండేళ్లు చైర్మన్ గా పనిచేశారు. మళ్లీ ఆయననే ప్రభుత్వం చైర్మన్ గా తిరిగి నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి తనను మరోసారి టిటిడి చైర్మన్ గా తిరిగి నియమించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్నో మంచికార్యక్రమాలు చేపట్టారు వైవీ..

Tadepalle

2021-08-08 07:38:53