1 ENS Live Breaking News

అక్టోబర్ 7నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించనున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు,  కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దేవీనవరాత్రులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
7వ తేది నుంచి 15వ తేదీ వరకూ ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శం ఇస్తారని  వివరించారు.11-10-2021న శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి(ఉపాలయం)కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్సైట్ లో పూర్తివివరాలు పొందుపరుస్తామని వివరించారు.

Vijayawada

2021-09-22 12:00:34

సమాచారశాఖ అధికారులకు ఇన్ కమింగ్ , ఔట్ గోయింగ్ కాల్స్ కట్..

ఆంధ్రప్రదేశ్ లోని  సమచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది అధికారిక ఫోన్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కట్ ఆగిపోయాయి. ఒక్క అధికారులకే కాదు.. కమిషనర్, జెడీ, ఏడీల దగ్గర నుంచి జిల్లాల్లోని ఏపీఆర్వోల దాకా అందరి నెంబర్లు పనిచేయడం లేదు.  దీనితో వారంరోజుల నుంచి సమాచారశాఖలో వారి సొంత మొబైల్ నెంబర్లును మాత్రమే  వినియోగించాల్సి వస్తుంది. రాష్ట్రంలోని తమశాఖలో అందరు అధికారులదీ ఇదే పరిస్తితి అని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసర పనిపై ఎవరు కాల్ చేయాలన్నా అధికారిక నెంబర్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్  కాల్స్ నిలిపివేయబడ్డాయి అనే సమాధానం వస్తున్నది. అలాగని జిల్లా కలెక్టర్లు, జెసిలకు తప్పితే సమాచారశాఖ అధికారుల పర్శనల్ నెంబరులు మరెవరికీ తెలియడం లేదు.  ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వంలోని గ్రూప్ నెట్వర్క్ గా వున్న ఈ నెంబర్లుకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లింకపోవడం వలనే పోస్ట్ పెయిడ్ గా వున్న ఈ నెంబర్లకు ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ నిలిపివేశారనే ప్రచారం జరుగుతుంది.  ఈ విషయం సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వరకూ వెళ్లింది. ఏం జరుగుతుందనేది తేలాల్సి వుంది. 

Tadepalli

2021-09-21 06:26:18

ఈ అపూర్వ విజయం మరిచిపోలేనిది..సీఎం

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పరిషత్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.. శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. నిండు మనసుతో హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈరోజు ఇచ్చిన ఈ విజయం, అఖండ విజయం ప్రభుత్వంపైనా, నాపైనా బాధ్యతను మరింతగా పెంచాయి. ఈరోజు ఎన్నికల తేదీ నుంచి కూడా ఒక్కసారి గమనించినట్లైతే, 2019 ఎన్నికల్లో అక్షరాలా 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు 22 స్థానాలు, అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అక్షరాలా 50 శాతం పైచిలుకు ఓట్లతో, 86 «శాతం అసెంబ్లీ సీట్లతో, 87 శాతం పార్లమెంటు సీట్లతో.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రయాణం మొదలైందన్నారు. అక్షరాలా 13,081 పంచాయతీలకు గానూ 10,536 పంచాయతీలు.. అంటే అక్షరాలా 81 శాతం పంచాయతీలలో పార్టీ మద్దతుదారులను దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ప్రజలందరూ మనందరి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. దాని తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఏకంగా 75కు 74 చోట్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గెలిపించుకోగలిగాం. అక్షరాలా 99 శాతం. 12 చోట్ల మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 12కు 12.. 100 శాతంతో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ కూడా గెలిపించారన్నారు.

Tadepalli

2021-09-20 13:39:52

ఆంధ్రప్రదేశ్ కొంప ముంచుతున్న జిఎస్టీ..

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. వ్యాట్ అమలులో వున్నప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయం 14 నుంచి 15 శాతం వ్రుద్ధిని నమోదు చేసుకున్న ఏపీ ప్రభుత్వం జిఎస్టీ అమలు జరిగిన తరువాత ఇపుడు 10శాతానికి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రప్రభుత్వం భారీ స్థాయిలో ఆదాయం కోల్పోయే పరిస్థిలు నెలకొన్నాయి. జిఎస్టీ వలన ఏపీ ఏ విధంగా ఆదాయం కోల్పోతుందో.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన ప్యాకేజీ ఏపీకి రావడం లేదో అనే విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లక్నోలో జరిగిన 45వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ద్రుష్టకి తీసుకెళ్లారు. జిఎస్టీ వలన నష్టం తప్పితే ఆదాయం సమకూరడం లేదనే విషయాన్ని కౌన్సిల్ ద్రుష్టికి తీసుకెళ్లి పలు కీలక అంశాలను చర్చించారు. బుగ్గన తీసుకొచ్చిన అంశాలను బట్టి జిఎస్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుకుంటుందా అనే కోణం కనిపించింది. జిఎస్టీ అమలు లోకి వచ్చిన తరువాత ఏడుశాతం క్షీణత అంటే మామూలు విషయం కాదు. ఇక జిఎస్టీలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఒక్కసారి పరిశీలిస్తే.. జిఎస్టీపై వ్యారాస్తులకు, సంస్థలకు, వాణిజ్య సంస్థలకు పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పాటు చేయలేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ల రాష్ట్రపరిధిలో కాకుండా కేంద్ర పరిధిలోనే ఉంచుకుంది. జిఎస్టీపై అవగాహన లేనివారు ముందుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని..తరువాత మళ్లీ దానిని కేన్సిల్ చేయించుకోవడానికి ప్రభుత్వానికి అపరాద రుసుము వేలల్లో కట్టాల్సి రావడంతో జిఎస్టీ వలన జరుగుతున్న నష్టాలను వ్యాపారస్తులు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి తెలియజేయడంతో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కు ముందుకి రావడం లేదు. పైగా జిఎస్టీ రిటర్న్స్ దాఖలు విషయంలో అత్యధిక ఫైన్లు వేయడం కూడా జిఎస్టీ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నది. ఈ విషయం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అర్ధమైంది. బంగారు కోడిపెట్టలా మంచి ఆదాయ వనరుగా మారుతుందని భావించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తిరిగి వారి ఆదాయానికే గండి కొట్టేలా జిఎస్టీ మారడంతో మళ్లీ అన్ని రాష్ట్రప్రభుత్వాల చూపు వ్యాట్ పైకే మల్లుతున్నట్టు జిఎస్టీ కౌన్సిల్ లో పలు రాష్ట్రాలు కేంద్రం ద్రుష్టికి సమస్యలను తీసుకెళ్లాయి.

జిఎస్టీ వలన వచ్చే నష్టాలు పూడ్చుకోకపోయినా, జిఎస్టీని చమురు విక్రయాలకు అమలు చేయకపోయినా భారీ నష్టాలే వచ్చే అవకాశం వుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు, ఎన్ని ఆలోచనలు చేసినా జిఎస్టీ విషయంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని మరో వ్యాపారస్తుడిని హెచ్చరించేలా చేస్తుంది. జిఎస్టీ రిటర్స్న్ దాఖలు విషయంలో ఆదాయ పన్ను దాఖలు చేసే విధంగా కనీసం గడువు పెంచకపోవడం, అపాదర రుసుము అధికంగా విధించడమే జిఎస్టీ నష్టాలకు కారణంగా కనిపిస్తుంది. నేటికీ జిఎస్టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ అధికారులకు సైతం అవగాహన లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ తరుణంలో ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన జిఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించిన అంశాలు ఇపుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ పథకాలు అమలు కావాలంలే ఆదాయం చాలా ఎక్కువగా కావాల్సి వుంది. ఈ తరుణంలో అన్ని రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఏపీ ప్రభుత్వానికి జిఎస్టీ ఇపుడు ఒక పెద్ద గుదిబండలా తయారైంది. ఆదాయం తెచ్చి పెడుతుందనుకుంటే ఉన్న ఆదాయ మార్గాలను మొత్తం తగ్గిపోయేలా చేస్తుంది. దానికి కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ అధికారులు చేపడుతున్న విధానాలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో జిఎస్టీ వలన ఆదాయం కాస్త బారీగా వస్తుందనుకుని లెక్కలు వేసిన ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. అనుకున్నదానికంటే ఆదాయం ఐదుశాతానికి తగ్గిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఈ  జిఎస్టీ వలన వ్రుద్ధి రేటు పడిపోయినా.. వాణిజ్య పన్నుల ద్వారా ఆదాయం తగ్గిపోయినా కేంద్రం మెప్పుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో జోడి కట్టి జిఎస్టీని కొనసాగిస్తుందో..లేదంటే పాత వ్యాట్ విధానానికికే మొగ్గు చూపిస్తోందో..అదీ కాదంటే..జిఎస్టీ వలన కలిగినే నష్టాలపై ఇతర రాష్ట్రప్రభుత్వాలను ఆలోచించాలా చైతన్యం తెస్తుందా అనేది ప్రశ్నార్ధకమైంది. అదీకాదంటే ఆదాయ పన్ను రిటర్న్స్ మాదిరిగా జిఎస్టీ రిటర్న్స్ కు కూడా అపరాద రుసుములు లేని అవకాశం ఇచ్చి సంస్ధల ద్వారా జిఎస్టీతో ఆదాయాన్ని పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతుందో అనేది వేచిచూడాలి. 


Tadepalli

2021-09-18 04:29:56

mptc,zptc కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు..

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పిలు, డిపిఓలు,జడ్పి సిఇఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ  ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున ఆయా కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.అదే విధంగా కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడ కుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్,ఎస్పిలు కూర్చుని కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్దం చేసుకొని సక్రమంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జి గా పెట్టాలని సిఎస్ కలెక్టర్లును ఆదేశించారు. అంతేగాక జెసిలను పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియలో బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కలెక్టర్లు ఆదేశించారు.

ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తోపాటు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయంలో 24గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న శాంతి భద్రతల అదనపు డిజిపి రవి శంకర్ మాట్లాడుతూ అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు. అంతేగాక అన్ని కేంద్రాల్లో నిరంతర సిసిటివి నిఘా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

అంతకు ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ కౌంటింగ్ నిర్వాహణకు సంబంధించిన మార్గ దర్శకాలను వివరిస్తూ ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మరియు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ల లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి వెంటనే మరో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తీసుకువచ్చే సమయంలో పూర్తిగా సిసిటివి కవరేజ్ చేయాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిగా శానిటేషన్ చర్యలు తీసుకోవాలని గిరిజా శంకర్ కలెక్టర్లును ఆదేశించారు. అదే విధంగా కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు అందరూ విధిగా మాస్క్,ఫేస్ షీల్డు వంటివి ధరించి గుర్తింపు కార్డుతో  కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించేలా చూడాలని  ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2021-09-17 14:33:19

ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

 వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా  ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ రోజుకు 15 నుంచి 20 వేల మంది భక్తులకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందని చైర్మన్ వివరించారు. ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే కార్యక్రమం సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని, త్వరలోనే ఈ సమస్యను అధిగమించి ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని చెప్పారు.

Tirumala

2021-09-17 12:11:27

అమ్మవారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.  ఆలయం వద్ద టిటిడి  జెఈవో శ్రీమతి సదా భార్గవి  స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్  గోస్వామి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.  దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు.  ఆల‌య డెప్యూటీ ఈవో  కస్తూరి బాయి, ఎఈవో ప్రభాకర్ రెడ్డి, విజిఓ, మనోహర్  ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-09-12 06:54:32

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి..

రాష్ట్ర‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అరుప్ కుమార్ గోస్వామి ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అద‌న‌పు ఈవో, సివిఎస్వోగోపినాథ్ జెట్టి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపట్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్ బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-12 06:26:36

చిత్తూరుజిల్లాకు మాత్రమే సర్వదర్శనం..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం  కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వ దర్శనం టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. అయితే, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయం తెలియక సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతికి వచ్చి ప్రయత్నించి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టిటిడి  తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టిటిడికి సహకరించాలని విజ్ఞపి చేస్తున్నది. కేవలం ఇపుడు చిత్తూరు జిల్లాకి చెందిన వారికి మాత్రమే జారీచేస్తున్నట్టు తెలియజేస్తుంది.

Tirumala

2021-09-11 14:44:14

ఏపీలో కొత్తగా వీరికే డిపార్ట్ మెంటల్ టెస్టులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సరికొత్త విధానాలకు తెరలేపింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఒక్కశాఖలోని  డిపార్ట్ మెంటల్ పరీక్షల లేని వారికి కూడా క్రియేట్ చేసి మరీ నిర్వహిస్తోంది. గతంలోలేని ప్రభుత్వ శాఖలకు సైతం ఇపుడు కొత్తగా టెస్టులు నిర్వహించి దేశవ్యాప్తంగా వున్న రాష్ట్రాల ద్రుష్టిని ఏపీవైపు మరల్చుకుంటోంది. ఈ విషయంలో ఉద్యోగులను నుంచి తీవ్ర నిరసన ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. ఉద్యోగులకు ఈ పరీక్షలు వింతగానూ, కొత్తగానూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దానికి ప్రత్యేక నిర్వచనం చెబుతోంది. అదీకూడా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిన తరువాత ఈ డిపార్ట్ మెంటల్ టెస్టులు ఉంటాయని ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని లక్షా 34వేల మంది ఉద్యోగులు ప్రభుత్వం తీరుపై ఒంటికాలపై లేచి మరీ మండిపడుతున్నారు. డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైన తరువాత మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయాన్ని కనీసం ఏడాది ముందుగా చెప్పి, సిలబస్ ఇచ్చి ఉంటే ఉద్యోగులంతా ఉత్తీర్ణత సాధించేవారని,, తీరా సర్వీసు రెగ్యులర్ చేయడానికి నెలరోజుల ముందు పరీక్ష పెట్టి పాసైతేనే సర్వీస్ రెగ్యులర్ అంటే ఎంత మంది పాసై ఉద్యోగాలు రెగ్యులర్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ప్రాధమిక శిక్షణ తప్పా మరే ఇతర శిక్షణలు ఇవ్వలేదని, ఈ కారణంగానే డిపార్ట్ మెంటల్ పరీక్షలు ఖచ్చితంగా పెట్టి అందులో సిలబస్ ను ప్రత్యేకంగా ఉంచి వారికి శిక్షణ స్థాయిలో ఉంటుందనే కారణంతోనే ఈ విధంగా డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేని వారికి కూడా పరీక్షలు పెడుతున్నామని ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్, www.enslive.net కి ప్రత్యేకంగా చెప్పారు. అదే సమయంలో ఈఎన్ఎస్ కూడా ఇదే పరీక్ష విషయాన్ని ముందుగా ఉద్యోగులకు చెప్పి ఉంటే పరిస్థితి బాగుండును కదాని ప్రశ్నిస్తే.. కరోనా సమయం కావడంతో అప్పుడు ప్రకటించలేదనే మాటను ఆ అధికారి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 8శాఖలకు అసలు డిపార్ట్ మెంటల్ టెస్టులే లేనపుడు ఏ విధంగా వీటిని నిర్వహిస్తారని కూడా ఈఎన్ఎస్ ప్రశ్నిస్తే.. ఆయా శాఖల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ పై అవగాహన వస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి శిక్షణ వారికి చాలదని.. ఆకారణంతోనే శిక్షణ తరహాలో కూడి డిపార్టమెంటల్ పరీక్షలు వీరికి నిర్వహిస్తున్నామని ఆ అధికారి బదులిచ్చారు. దానికి మహిళా పోలీస్ లనే ఉదాహరణగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న వీరికి అన్ని పోలీస్ స్టేషన్లలో లోనూ వారం రోజుల పాటు ప్రత్యేకంగా రెండవ దఫా శిక్షణ కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇపుడు కూడా ఉద్యోగులంతా మెరిట్ ప్రాతిపదిక మార్కులు తెచ్చుకోవాల్సిన పనిలేదని, క్వాలిఫై అయితే సరిపోతుందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను పోగొట్టడానికే ఈ క్లారిఫికేషన్ తమకున్న సమాచారం మేరకు ఇస్తున్నామని కూడా(పేరు రాయడానికి ఒప్పుకోని అధికారి) చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా..దేశం మొత్తం తొంగిచూసే ప్రభుత్వ శాఖగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూపుదిద్దుకోవడానికి మాత్రం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ముందుచూపుతో ఆలోచిస్తున్నారని తడుముకోకుండా చెప్పారు. ఇపుడు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులంతా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో సీఎం ను ఆశానికి ఎత్తేస్తారని చెప్పడం విశేషం. ఈ డిపార్టమెంటల్ టెస్టులు కూడా ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు విధినిర్వహణలో అన్నిరకాలుగా సౌకర్యంగా ఉండాలనే ప్రభుత్వం నిర్వహిస్తోందని.. ఇందులో వేరే ఉద్ధేశ్యం ఏమీ లేదని మాత్రం ప్రభుత్వంలోని పెద్దలు వల్లెవేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఏ శాఖలోని ఉద్యోగులకూ లేని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోవిధంగా స్పందించి, పరీక్షలు నిబంధనలు పెట్టడం మాత్రం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది..!

Tadepalli

2021-09-11 05:53:16

విష్ణునివాసం లో గదుల కేటాయింపులు..

తిరుపతి లో రాబోయే శనివారం నుంచి భక్తులకు విష్ణు నివాసం లో గదులు  అందుబాటులోకి తేవాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా కోవిడ్ వల్ల విష్ణునివాసం గదుల కేటాయింపు తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆమె విష్ణు నివాసం వసతి సముదాయం లోని గదులు, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ,  ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ ఎదురుగా గదుల సమాచారం తెలిపే వివరాలు ఏర్పాటు చేయాలన్నారు.  అదేవిధంగా స్థానిక ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమాచారం తెలియడం వల్ల భక్తులు సులభంగా స్థానిక ఆలయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని జెఈఓ చెప్పారు. శ్రీనివాసం నుంచి టూరిజం శాఖ స్థానిక ఆలయాలకు బస్సులు నడుపుతున్న విషయం విదితమే. విష్ణు నివాసంలో 50 శాతం గదులు భక్తులకు ఆన్ లైన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విష్ణు నివాసం చుట్టూ మొక్కలు నాటి, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.  అనంతరం ఆమె రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడుతూ, శనివారం నుంచి గదులు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం ఆమె  రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలను  పరిశీలించారు. కోవిడ్ కారణంగా ఈ సత్రాలు భక్తులకు తాత్కాలికంగా కేటాయించనందువల్ల చిన్నపాటి మరమ్మతులకు గురికావడం,  పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం  గమనించారు. గదుల మరమ్మతులు త్వరగా చేయించి పిచ్చి మొక్కలు తొలగించి ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారుచేయాలని ఆదేశించారు.  ప్రస్తుతానికి మూడవ సత్రంలోని గదులు భక్తులకు అందుబాటులోకి తేవాలని,  ఈ లోపు రెండవ సత్రంలో మరమ్మతులకు గురైన గదుల పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈఈలు  కృష్ణారెడ్డి,   సుమతి,  డిప్యూటీ ఈ ఈ  జోగయ్య,  సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ,  విష్ణు నివాసం ఏ ఈ ఓ  సీతామహాలక్ష్మి ఈ పర్యటనలో పాల్గొన్నారు. 

Tirupati

2021-09-09 14:51:10

సీఎం సహాయనిధికి అపోలో రూ.2 కోట్లు విరాళం..

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్‌ టు ఆంధ్రాకు రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది. ఆ మొత్తానికి  సంబంధించిన చెక్కులను అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతా రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైయస్‌.జగన్‌కు అందజేశారు. ఈ సందర్బంగా వారిని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆపోలో  ప్రెసిడెంట్‌ (ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కార్పొరేట్‌ డవలప్‌మెంట్‌) నరోత్తమ్‌ రెడ్డి, సీఈఓ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్‌) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్‌ వెర్టికల్‌) శివరామకృష్ణన్‌లు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-09-09 14:43:44

ప్రముఖ ఆదాయ వనరుగా పర్యాటకరంగం..

ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు.  పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతోపాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా శాఖలు, పర్యాటక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ప్రపంచంలో థాయిల్యాండ్, మలేషియా, స్విట్జర్లాడ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే అభివృద్ది పథంలో పయనిస్తున్నాయని, అదే తరహాలో రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ది పర్చేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కోవిడ్ కు ముందు సాలీనా రూ.120 కోట్ల మేర ఆదాయం పర్యాటక శాఖ ద్వారా వచ్చేదని, ప్రస్తుతం  కోవిడ్ పరిస్థితుల్లో అది రూ.60 కోట్లకు పడిపోయిందన్నారు. కోవిడ్ ఆసుపత్రులు,  కోవిడ్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించే బాధ్యతను పర్యాటక సంస్థ చేపట్టడం వల్ల అంతమాత్రం ఆదాయానన్నా సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ఇటు వంటి గడ్డు పరిస్థితుల నుండి పర్యాటక శాఖను కాపాడి, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకొనేలా పర్యాటక రంగాన్ని అభివృద్ది పరుస్తున్నామన్నారు. 
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, పర్యాటక హోటళ్ల వివరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క పర్యాటకునికి తెలిసే విధంగా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి దసరా పండుగలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ యాప్ ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసే విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మాసం ఒక ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు.   రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా మరియు రాయలసీమ పర్యాటక సర్క్యూట్లకు ఒక్కొక్క మేనేజరు చొప్పున మొత్తం నలుగురు మేనేజర్లను నియమించి ప్రత్యేక వోల్వో బస్సుల ద్వారా రెండు  లేక మూడు రోజులపాటు పర్యాటక ప్యాకేజిలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా సర్క్యూట్లలో గల పర్యాటక ప్రాంతాలకు చుట్టుప్రక్కల నున్న రాష్ట్రాల నుండి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది  కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 24  ప్రభుత్వ, 164 ప్రైవేటు బోట్లు అన్నింటినీ ఆపరేషన్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లైన్ లను నడిపేందుకు సంబందిత సంస్థలతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.   ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బాపట్ల, సూర్యలంక తదితర 13  ప్రాంతాల్లో ఐదు నక్షత్ర హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో 50 శాతం హోటళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నామన్నారు.  అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 37 పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి గూగుల్ సెర్చి టాప్ టెన్ బెస్టు హోటళ్లలో అవి కనిపించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో “ ప్రసాదం” పథకం  అమల్లో బాగంగా  టెంపుల్ టూరిజం అభివృద్దికి చర్యలు చేపట్టామని, రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ది పనులు ఇప్పటికే చేపట్టామని, మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ది పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, యువజన శాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Tadepalle

2021-09-08 12:42:27

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం..

రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో  జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి తో  జాతీయ జర్నలిస్టుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులంతా సజ్జల రామకృష్ణారెడ్డిని  కలిసి పలు అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జర్నలిస్టులు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల సమస్య,హెల్త్ ఇన్సూరెన్స్ ,ప్రమాద బీమా పాలసీ వంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీను బాబు వివరించారు. ప్రధాన పత్రికలతో పాటు చిన్న పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన అనేక మంది జర్నలిస్టులు పలు సమస్య లు ఎదుర్కొంటున్నారని సజ్జల  దృష్టికి తీసుకు వెళ్ళారు.  అంతేకాకుండా దశాబ్దాల తరబడి ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల కూడా జర్నలిస్ట్ లు తీవ్ర ఆందోళన చెందుతున్న వివరించారు. ఇక  1994లో విశాఖలో  23 మంది జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించిన నేటికీ వారికి ఎన్ఓసి లు జారీ చేయలేదని శ్రీనుబాబు సజ్జలకు  వివరించారు.  మరోవైపు 2005 ఆక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఘం సుమారు ఐదున్నర కోట్లు ఎన్నో ఏళ్ల క్రితం ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని, అనేక వ్యయ ప్రయాసలకోర్చి సొమ్ము చెల్లించినప్పటికి  నేటికీ  ప్రభుత్వము ఆయా  స్థలాలు సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం కూడా తీవ్ర ఆవేదనకు  గురిచేస్తుందన్నారు. విశాఖ అర్బన్ అధ్యక్షులు పి.నారాయన్  మాట్లాడుతూ, తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, అనేక సంవత్సరాల నుంచి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియజేశారు. ఆయా అంశాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. వీటిపై సజ్జల సానుకూలం గా స్పందించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సజ్జల హామీఇచ్చారు. చిన్న పత్రికలును ఆదుకుంటా మన్నారు. అనంతరం సజ్జలకు శ్రీనుబాబు సింహాద్రినాథుడు జ్ఞాపికను అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 13 జిల్లాలు కు చెందిన  జర్నలిస్టు సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలేల్ల అప్పి రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్రఅధ్యక్షులు వెంకటరావు,  ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు. విశాఖ నుంచి జర్నలిస్ట్ సంఘం నాయకులు ఈరోతి ఈశ్వర్ రావు, బందరు శివప్రసాద్, జి.శ్రీనివాసరావు,సీతారామ్ మూర్తి, ఆనంద్ రావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-09-06 14:28:00

శ్రీవారి నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం..

దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారుచేసి, దాన్ని చిలికి వెన్న తయారుచేసి స్వామివారికి సమర్పించేందుకు ఉద్దేశించిన న‌వ‌నీత సేవ‌లో భ‌క్తులు పాల్గొనేందుకు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి ఏడు బ్రాండ్ల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు విక్ర‌యం కోసం అందుబాటులోకి తెస్తామ‌న్నారు. తిరుప‌తి టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో శ‌నివారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. స్వామివారికి చెందిన సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈఓ వివరించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు టిటిడి అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో స‌దా భార్గ‌వి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీబీసీ సీఈవో  సురేష్‌కుమార్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-04 06:35:34