1 ENS Live Breaking News

MVR పై ఆ.. చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడానికి కారణమిదే

అనకాపల్లిలోని ప్రముఖ వ్యాపారవేత్త, యువతకు రోల్ మోడల్.. సేవాబానికి నిలెవెత్తు చిరునామా అయిన ముత్యాల వెంకటేశ్వర్రావు (ఎంవీఆ ర్)పై ఒకవర్గం కావాలనే బురదచల్లే అసత్య ప్రచారాలకు తెరలేపింది.. అడిగింత మొత్తం ఇవ్వకపోతే అభివృద్ది విషయంలో ఆయన చేసిన ప్రకటనలను వ్యంగ్యంగా చిత్రీకరించే చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. వాస్తవానికి ఎంవీఆర్ కి ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఆయనను పొలిటికల్ గా ప్రమోట్ చేసేందుకు, దానికి అయ్యే ఖర్చును అడ్డంగా లాగేందుకు కొన్ని పత్రికలు, మీడియా పనిగట్టుకొని తేడా ప్రచారాలకు దిగుతున్నాయి.  తొలుత సామాజిక సేవగా బావించి చాలా చిన్న చిన్న పత్రికలు, ఛానళ్లకు చేయూత అందించిన ఆయన వాస్తవాలు తెలుసుకొని నిజంగా పనిచేసే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. దానితో తేడా మీడియాకు అది మింగుడు పడలేదు. వెంటనే గతంలో ఈయన చేసిన ప్రచారాలను తప్పుడుగా చిత్రీకరించే వంటా, వార్పులు మొదలెట్టారు.

Anakapalle

2023-04-19 08:55:10

కాలంచెల్లిన విజెఎఫ్ పాలకవర్గాన్ని తక్షణమే రద్దుచేయండి

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో 12ఏళ్లుగా సొసైటీ/ట్రస్టుల నిబంధనలు పాటించకుండా, కాలంచెల్లిపోయినా అధికార దాహంతో అనధికారికంగా పరిపాలిస్తున్న కార్య వర్గాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జునకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చాంబర్ లో ప్రత్యేకంగా ఈ ఫిర్యాదును అందజేశారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈశ్వర్, శ్రీనివాస్, జార్జి తదితరులు మీడియాతో మాట్లాడుతూ, వాస్తవా లను ప్రజలకు ప్రసార మాద్యమాల ద్వారా తెలియజేసేది జర్నలిస్టులేనని అలాంటి జర్నలిస్టులే సెక్షన్ 23 ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్టు 2001ను తుంగలోకి తొ క్కి మరీ విజెఎఫ్ లో పాలకవర్గంగా కొనసాగుతున్నారని అన్నారు. జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా ఒక్కఏడాది గడిచినా ఆ పాలకవర్గం ప్రభుత్వ నిబంధనల ప్ర కారం రద్దయినట్టేనని దానికి సంబంధించిన జీఓను కలెక్టర్ కు అందజేశారు. 

Visakhapatnam

2023-04-17 17:04:46

జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

విశాఖలోని విజ్ఞాన కేంద్రంలో జరిగే జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సీనియర్ జర్నలిస్టులు ఎన్ఎన్ఆర్, వర్మ, ఎల్జీనాయుడు, సూర్యనారా యణ, రామక్రిష్ణ, రవికాంత్, బంటయ్య, ఎంఎస్, వెంకట్, ఈఎన్ఎస్ బాలు, తదితరులు విజెఎఫ్ సభ్యులను కోరారు. మంగళవారం ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమంలో విజెఎఫ్ పూర్వ కార్యవర్గాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్ చేపడుతున్న వ్యతిరేక విధానాలపై జర్నలిస్టులు త మ విలువైన సూచనలు, సలహాలు చేస్తారని, ఒక కార్యాచరణ రూపొందించనున్నారని పేర్కొన్నారు. ఈ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం విజెఎఫ్ కి వ్యతిరేకం కాదని, కే వలం అందులోని పాలకవర్గం 12ఏళ్లుగాఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వ నిబంధనలను సైతం తుంగలోకి తొక్క పాలిస్తున్న విధానాలపై చర్చించ డానికేనని స్పష్టం చేశారు. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Visakhapatnam

2023-04-17 16:49:01

అప్రజాస్వామిక విజెఎఫ్ పాలకవర్గంపై కలెక్టర్ కి ఫిర్యాదు

ఒకటి కాదు 2కాదు ఏకంగా 12ఏళ్లు తగదునమ్మా అంటూ కోర్టు కేసుల నెపంతో విజెఎఫ్ ను ఏలినక పాలక వర్గం అప్రజాస్వామికంగా(Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)ను తుంగలోకి తొక్కిన వైనం పై సీనియర్ జర్నలిస్టు బంటయ్య ఆధ్వర్యంలో సోమవారం స్పందనలో జర్నలి స్టులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుచేశారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకేసులు ఉన్నాయని గానీ, నిధుల ఖర్చుపై గానీ ఎలాంటి సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా వారి పదవీకాలం అయిపోయినప్పటికీ విజెఎఫ్ ను వీడకుండా కనీసం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా విజెఎఫ్ పరువు తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో విజెఎ ఫ్ పై విచారణ చేయాలంటూ జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున జిల్లా రిజిస్ట్రార్ మూర్తిని ఆదేశించారు. అసలు విజెఎఫ్ ఏనిబంధనను ఉల్లంఘించిందనే విషయమై లిఖితపూర్వ కంగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. 

Visakhapatnam

2023-04-17 16:30:30

ఘనంగా ఐఎస్‌టీడీ వ్యవస్థాపక దినోత్సవం

ఐఎస్‌టీడీ  విశాఖపట్నం చాప్టర్‌ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో సీఎండీ అతుల్‌ భట్‌ సమక్షంలో ఈ కార్య క్రమాన్ని చేపట్టారు.  శిక్షణ సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడంలో కృషి చేసినందుకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌  కె.శ్రీనివాస రావును ఘనంగా సత్కరించారు.  అలాగే సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో  ఆ సంస్థ డైరెక్టర్‌ డి.సత్యనారాయణ, ఇతర సభ్యులతో కలిసి వ్యవస్థాపక దినోత్సవాన్ని చేపట్టారు. ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఫర్‌ డ్రోన్‌ టెక్నాలజీ, ఆంధ్రా యూనివర్శిటీ, సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌, గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలోనూ ఈ దినోత్సవాన్ని జరిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో విశాఖపట్నం చాప్టర్‌ సభ్యులంతా వ్యవస్థాపక దినోత్సవాన్ని మరింత వేడుకగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఊఎస్‌ఈఐ ఫార్మాస్యూటికల్స్‌ ఐటీ హెడ్‌ జోసెఫ్‌ కిరణ్‌ కుమార్‌ ముఖ్య వక్తగా హాజరయ్యారు. గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రిన్సి పాల్‌  కె.వి.రమణ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విభాగాధిపతి మధు కుమార్‌లను తమ తమ సంస్థల్లో ఐఎస్‌టీడీ విద్యార్థి చాప్టర్‌లను ప్రారం భించినందుకు ఈ సందర్భంగా సత్కరించారు. 

విశాఖపట్నం చాప్టర్‌ నుండి ఈ-జర్నల్‌ ప్రగ్యా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థలోని పలువురు సభ్యులు మాట్లాడుతూ విశాఖపట్నం చాప్టర్‌లో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థల నుండి 600 మందికి పైగా సభ్యులు ఐఎస్‌టీడీలో ఉన్నారన్నారు. హెచ్‌ఆర్‌ రంగంలోని ప్రముఖు ల భాగస్వామ్యం ఉందన్నారు. భారత కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన ఈ జాతీయ స్థాయి ప్రొఫెషనల్‌ బాడీ డిప్లొమా కోర్సులను నిర్వ హించడం, హెచ్‌ఆర్‌ సోదరభావం కోసం ఈవెంట్‌లు, కార్యకలాపాలను నిర్వహించడంలో విజయవంతమవుతోందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఐఎస్‌టీడీ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.సాంబశివరావు, చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఓఆర్‌ఎం రావు, గౌరవ కార్యదర్శి డాక్టర్‌ హేమ యడవల్లి, ఇతర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, విద్యార్థి విభాగం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-11 13:12:32

17న విజయనగరం జిల్లాలో మత్స్యకారుల గుర్తింపు

విజయనగరం జిల్లాలోని చేపల వేట నిషేధం విధించే సమయంలో మత్స్యకార భరోసా అందించేందుకు  ఏప్రిల్ 17న ఒక్కరోజే అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో  లబ్దిదారులను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నట్టు జిల్లా మత్స్యశాఖ  ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలి యజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వేట నిషేధభృతి పధకం క్రింద వివరాలు నమోదు చేసే సిబ్బందికి మత్స్యకారులు సంఘం సభ్యులు తమ పూర్తివివరాలు తెలియజేయాలని ఆమె సూచించారు. లబ్దిదారులు ముఖ్యంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ (ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో లింక్ ఉన్నది), బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, వాలిడ్ ఫిషింగ్ లైసెన్స్ తప్ప నిసరి తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని అందించి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే ఎన్యూమరేటర్లకు ఆ దేశాలు జారీచేసినట్టు ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మీడియాకి వివరించారు.

Vizianagaram

2023-04-11 13:03:04

ఏప్రిల్ 15నుంచి జూన్14 వరకూ చేపలవేట నిషేధం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రాదేశిక సముద్ర జలాలలో చేపలవేట చేసే మెకనైజడ్, మోటారు బోట్లు ద్వారా నిర్వహించే అన్నిరకాల చేపల వేటను  ఏప్రిల్ 15నుంచి జూన్ 14వరకు 61 రోజులు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ ఆర్ టి సంఖ్య  76ను జారీ చేసిందని విజయనగరం జిల్లా మ త్స్యశాఖ  ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడా రు. వివిధ చేపలు, రొయ్యల జాతులు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్స హించే కార్యక్రమంలో భాగంగా ఈ నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరతను సాధించవ చ్చునని ఆమె వివరించారు. ఉత్తర్వులు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా  డిడి నిర్మలకుమారి హెచ్చరించారు. మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, నేవీ అధికారులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు.

Vizianagaram

2023-04-11 12:44:31

రోజుకి 200 మందికి కోవిడ్ పరీక్షలు చేయండి..

విశాఖజిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 50 మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఖ్యను సోమవారం నుంచి 200కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర రావు తెలిపారు. ఈ మేరకు అన్ని పీహెచ్సీల వైద్యాధికారులకు సమాచారం అందించారు.  మరో వైపు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు సంబం ధించి కూడా బ్లీచింగ్ చైన్ ఎప్పటి కప్పుడు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించా లని, బయటకు వెళ్లేటపుడు, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవాలని, నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని సూచిస్తున్నారు. ఎక్కువ మంది ఉండే చోటకు వెళ్లడం శ్రేయస్కరం కాదంటున్నారు.

2023-04-10 14:19:56

సీతంపేటలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో  డాక్టర్ నవ్య, టీటీడీ అధికారులతో  కలసి సోమవారం ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ టీటీడీ స్వామివారి ఆలయాలు నిర్మిస్తోందని  తెలిపారు. ఇందులో భాగంగా గిరిజన ప్రాంతమైన సీతంపేటలో శ్రీవారి ఆలయాన్ని చక్కగా నిర్మించినట్లు చెప్పారు. మే 4వ తేదీ నుంచి ఇక్కడ భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామన్నారు. ఆలయ సమీపంలోని కల్యాణ మండపాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పరిసర ప్రాంతాల భక్తులు  విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

      ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. మహాసంప్రోక్షణ అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలని, కల్యాణ మండపాన్ని స్థానిక గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
     కార్యక్రమానికి వచ్చే అర్చకులు,ఇతర అధికారులు,సిబ్బంది, శ్రీవారి సేవకుల వసతి కోసం ఐటి డి ఎ అతిథి గృహం, పాఠశాలలు పరిశీలించారు. ఆతరువాత మన్యం జిల్లా రాజాం లోని శ్రీవారి ఆలయాన్ని జేఈవో ఇతర అధికారులు సందర్శించారు.  టీటీడీ చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి, ఎస్ ఈ (విద్యుత్ ) వెంకటేశ్వర్లు , విజివో మనోహర్, గిరిజన కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ సంధ్యా రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Seethampeta

2023-04-10 13:02:48

శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

టీటీడీకి చెందిన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 3న అంకురార్పణం నిర్వహిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నా యి. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఈ మేరకు టిటిడి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది.

04-05-2023 - ధ్వజారోహణం -   పెద్దశేష వాహనం

05-05-2023- చిన్నశేష వాహనం - హంస వాహనం

06-05-2023- సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం

07-05-2023 - కల్పవృక్ష వాహనం  సర్వభూపాల వాహనం

08-05-2023 - మోహినీ అవతారం - గరుడ వాహనం

09-05-2023 - హనుమంత వాహనం - గజ వాహనం

10-05-2023 - సూర్యప్రభ వాహనం  - చంద్రప్రభ వాహనం

11-05-2023 - రథోత్సవం, ఆర్జితకల్యాణోత్సవం - అశ్వవాహనం

12-05-2023 - చక్రస్నానం - ధ్వజావరోహణం.

Nagalapuram

2023-04-10 11:46:25

కోవిడ్ ను ఎదుర్కొనేందుకు 100పడకలతో విమ్స్ సిద్ధం

కోవిడ్ Xbb1.16 భారత దేశంలో కూడా  ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి, రెండో వేవ్ లలో డెడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రిగా నిలిచిన విమ్స్ ను 100 పడకలతో సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన మాక్ డ్రిల్ ను విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ ను విజయవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అందులో భాగంగా కోవిడ్ రోగులకు అందించాల్సిన మందులు, ఆక్సిజన్ సరఫరాల ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం 100 పడకలను కేటాయించడం జరిగిందని అవసరం బట్టి వాటి సంఖ్యను 600 పడకల వరకు పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 200 ఐసీయూ పడకలకు అందుబాటులోకి తీసుకునిరాగల సామర్థ్యం విమ్స్ ఆస్పత్రికి ఉందన్నారు. 

విమ్స్ లో అందుబాటులో ఉన్న రెండు ఆక్సిజన్ ట్యాంకులు, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పరిశీలించి పని తీరును గమనించడం జరిగిందన్నా రు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కోవిడ్ ను ఎదుర్కొన్నందుకు ఎవరు ఎవరు ఎటువంటి విధులు నిర్వర్తించాలి అనేది కేటాయించడం జరిగిందని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో రోగులకు ఉత్త మ వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  విమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సాధారణ రోగులకు ఉత్తమ వైద్యం అందించడంలో నిమగ్న మై ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా ఫీవర్ ఒపీను ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు.  అక్కడే రోగులకు పరీక్షించి కరోనా పాజిటివ్ అయితే కోవిడ్ వార్డుకు సాధారణ జ్వరం అయితే సాధారణ వార్డుకు తరలిం చడం జరుగుతుందన్నారు.

Visakhapatnam

2023-04-10 11:17:07

వైభవంగా శ్రీ సీతారాముల స్వామివారి కల్యాణం

చంద్రగిరి  శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం శ్రీ‌ సీతారాముల కల్యాణం నేత్ర‌ప‌ర్వంగా  జరిగింది.    ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

   అనంతరం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ కోదండరామస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  దేవేంద్ర బాబు, ఏఈవో పార్థసారథి,  సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు టెంపుల్ ఇన్స్పెక్టర్  గోపాలకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Chandragiri

2023-04-05 15:43:09

డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఎంత‌ గానో కృషి చేశార‌ని, వారి అడుగుజాడ‌ల్లో అంద‌రం న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని హైదరాబాద్ లోని ఉస్మానియా వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ లా డీన్ ఆచార్య గాలి వినోద్ కుమార్ కోరారు. జ‌గ్జీవన్‌రామ్ 116వ జయంతి వేడుకలను తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆచార్య గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ 52 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌ర‌త‌మ భేదాలు లేకుం డా అంద‌రికీ విశేషంగా సేవ‌లందించిన అజాత‌శ‌త్రువు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అన్నారు. పాఠ‌శాల వ‌య‌సులోనే రెండు కుండ‌ల విధానాన్ని వ్య‌తిరే కించార‌ని, రిజ‌ర్వేష‌న్‌లో వ‌చ్చే స్కాల‌ర్‌షిప్ కాద‌ని మెరిట్ స్కాల‌ర్‌షిప్ పొందిన మేధావి అని కొనియాడారు. కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశం లో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత వారికే ద‌క్కుతుంద‌న్నారు.
  

       అంతకుముందు టిటిడి అధికారులు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన ప‌లువురికి జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మం మొద‌ట్లో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారుడు డా.ఎం.భిక్షు నాయక్ బృందం  ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రభుత్వ సిటి కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా.కోయి కోటేశ్వరరావు, తిరుపతి క్రైమ్ సిఐ  పి.సుమతి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు  స్నేహలత, ఆనంద‌రాజు, జగదీశ్వరి, ఇఇ మ‌నోహ‌రం ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

Tirupati

2023-04-05 15:36:03

అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలన..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై బుధవారం జిల్లా  అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ,నగర పోలీస్ కమిషనర్  సిహెచ్ శ్రీకాంత్, .జాయింట్ కలెక్టర్ విశ్వనాధ్, డీసీపీలు సునీల్ సుమిత్. ఆనంద్ రెడ్డి.. ఇతర పోలీసు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సింహాచలం ఈవో వి త్రినాధరావు తో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పలు ప్రాంతాల్లో పరిశీలించారు. తొలుత వీరంతా కళ్యాణ వేదిక వద్దకు చేరుకొని  క్యూలైన్ల మార్గాలు,, భక్తులు వాహనాలు పార్కింగ్ ఇతర సదుపాయాలు కోసం ఉత్సవ మాస్టర్ ప్లాన్ ను నిషితముగా పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఉచిత దర్శనం 300, 1000, 1500 క్యూ లైన్లు ఏ విధంగా వేగంగా ముందుకు సాగుతాయని  ఈఓ త్రినాధ్ రావు ను, ఈఈ ను అడిగి తెలుసుకున్నారు. 

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు వీరికి వివిధ క్యూలైన్లు చూపించారు. గత ఏడాది ఏర్పాటుచేసిన క్యూలైన్ లకు ఈ ఏడాది ఏర్పాటుచేసిన వాటికి వ్యత్యాసం అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లు వేగవంతంగా  సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని దేవస్ధానం అధికారులు కి కలక్టర్ సూచించారు. భక్తులు ఎక్కువసేపు వేచి చూడకుండా వేగవంతంగా సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా చూడాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణం తో పాటు వివిధ మార్గాల రూట్లను పరిశీలించారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీ , ప్రోటోకాల్  ప్రముఖులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి ను దర్శించుకోవాలని  అందుకు తగ్గ ఏర్పాట్లు చేద్దామని అధికారులు చర్చించారు.అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ సంయుక్తంగా ఏఏ మార్గాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కాసేపు మాట్లాడుకున్నారు. అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత ఏడాది నిజరూప దర్శనం ఉత్సవం పూర్తి స్థాయి లో విజయవంతం  ఐయ్యిందన్నరు.

 ఉత్సవం ప్రారంభ దశలో వర్షం కురవడము వల్ల కొద్ది పాటి   ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నది కలక్టర్ కు తెలియజేశారు. ఐతే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారము తో చందనోత్సవం విజయవంతం చేద్దామని కలక్టర్ మల్లికార్జున అన్నారు..  అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి లో పక్కాగా చేసుకోవాలి అన్నారు. ఆనంతరం వీరు సింహాద్రి నాథుడు ను దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు వీరి పేరిట నిర్వహించారు.ఆలయ ఈఓ త్రినాధ్ రావు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు దినేష్ రాజ్, సంపంగి శ్రీను, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2023-04-05 09:40:27

కల్యాణానికి విచ్చేసే భక్తుల ఏర్పాట్లు పరిశీలన

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే  భక్తుల కోసం  చేపట్టిన ఏర్పాట్లను జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు.  ఆలయం ఎదుట టీటీడీ  అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ  వైట్ రైస్, వెజిటబుల్ పలావు, చట్ని, కేసరి,  రసం, సాంబారు, పప్పు, వెజిటబుల్ కర్రీ భక్తులకు వడ్డిస్తున్నారు. పలువురు భక్తులను పలకరించి అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ టీటీడీ  పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళ్యాణ వేదిక దగ్గర భక్తులకు పంపిణీ చేసేందుకు  పులిహోర ప్యాకెట్ల తయారీని పరిశీలించారు. కళ్యాణానికి విచ్చేసే భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, కుంకుమ, కంకణం, 2 చిన్నలడ్డూ ప్రసాదం, పులిహోర, వాటర్ బాటిల్ కలిపి తయారు చేసిన కిట్లను పరిశీలించారు. గ్యాలరీలోకి ప్రవేశించే ముందే భక్తులకు ఈ ప్రసాదం కిట్లను అందజేయాలని అధికారులకు సూచించారు.

      జేఈవో  వెంట టీటీడీ  చీఫ్ ఇంజనీర్  నాగేశ్వరరావు,  విద్యుత్ విభాగం ఎస్.ఇ  వెంకటేశ్వర్లు, డిఇ చంద్రశేఖర్, ఇఇ  సుమతి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి,విజీవో మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు.

Ontimitta

2023-04-05 08:57:53