1 ENS Live Breaking News

హైటెక్ విధానంలో వాహనాల లెక్కింపు సులభతరం


జాతీయ రహదారిపై వార్షిక వాహనాల లెక్కింపు సులభతరమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాహనాల లెక్కింపు చేపడుతున్నారు.  అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఈ సర్వే నిర్వహి స్తున్నారు. గతంలో రోడ్లపై మనుషులు ఉండి ఎన్ని వాహనాలు వెళుతున్నాయి, వస్తున్నాయనేది  రాసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పో యింది. జాతీయ రహదారిపై రెండు వైర్లు అమర్చి వాటికి సీసీ కెమెరా ఏర్పాటుచేసి అటుగా వెళ్లే వాహనాలు సంఖ్యతో పాటు వాటి వివరాలు పూర్తిగా నమోదయ్యేలా అధునాత విధానాలను ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాకుండా  వాహనాల బరువుని కూడా నమోదు చేస్తున్నారు. ద్విచ క్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు వంటి వాటిని లెక్కింపు స్పష్టంగా వెల్లడవుతుంది. ఈ వాహనాల రాకపోకల సర్వే ప్రకా రం రోడ్లు పటిష్ఠ పర్చడం, విస్తరించడం వంటివన్నీ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతుంది.

2023-03-31 08:01:34

ఎస్వీ ఔషధ ఉత్పత్తుల నూతన కేంద్రం ప్రారంభం

నరసింగా పురంలోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో  నూతనంగా నిర్మించిన ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎవి ధర్మారెడ్డి ప్రారంభించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్,ఈవో  నూతన భవనంతో  పాటు మందుల ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం  మీడియాతో మాట్లాడారు. పూర్వీకులు మనకు అందించిన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి టీటీడీ ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 1983లో ఆయుర్వేద వైద్య కళాశాలను, దానికి అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఆయుర్వేద ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆయుర్వేద ఆసుపత్రికి అవసరమయ్యే మందులు సొంతంగా తయారుచేసుకోవడం కోసం నరసింగాపురంలో 1990వ సంవత్సరంలో 14.75 ఎకరాల్లో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. మొదట 10 రకాల మందులు మాత్రమే తయారు చేసిన ఈ ఫార్మసీ క్రమేణా 80 రకాల మందులు తయారు చేసి ఆయుర్వేద ఆసుపత్రితో పాటు తిరుపతి, తిరుమలలో డిస్పెన్సరీలకు సరఫరా చేస్తోందన్నారు.

   ఫార్మసీని మరింత అభివృద్ధి చేసి ఆయుర్వేద వైద్యాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి మా పాలకమండలి నిర్ణయించిందని చైర్మన్ వివరించారు.
 ఇందుకోసం ఫార్మసీ భవనాలనూ ఆధునీకరించడంతో పాటు,  మూడు ఔషధఉత్పత్తి కేంద్రాలను నిర్మించి రూ.3.90 కోట్లతో అధునాతన యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదట విడతగా తొలి ఔషధ ఉత్పత్తి కేంద్రం శుక్రవారం  ప్రారంభించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.    ఇప్పటిదాకా సంవత్సరానికి రూ.1.5 కోట్లు విలువ గల మందులను తయారు చేసే ఈ ఫార్మసీలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఏడాదికి రూ.5 కోట్ల విలువ చేసే మందులను తయారు చేసే సామర్థ్యం లభిస్తుందని ఆయన తెలిపారు.  ఇక్కడ తయారుచేసే ఆయుర్వేద మందులను టీటీడీ అవసరాలకు పోను, మిగిలినవి ఆయుష్‌ వైద్య శాలలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పందం జరిగిందని చైర్మన్  చెప్పారు.

కొన్ని ప్రత్యేకమైన, ప్రాచుర్యం పొందిన మందులను టీటీడీ విక్రయశాలల్లో  ప్రజలకు అందుబాటులోకి తేవడానికి  ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.
శుక్రవారం ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రంలో మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేస్తారన్నారు. భవిష్యత్‌లో 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి  ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.  జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ , ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం,ఈఈ  మురళీ కృష్ణ, విజివో  మనోహర్ ,ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tirupati

2023-03-31 07:48:00

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి


శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.  తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు  శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపు రాణం, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ,  అనంతరం ఉత్సవ మూర్తులను వాహన మండ పానికి వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.   ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  మోహన్, సూపరిం టెండెంట్‌ రమేష్‌ కుమార్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Tirupati

2023-03-30 13:59:47

శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు  వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యా యి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉద‌యం 7.45 నుండి 8.15 గంట‌ల మ‌ధ్య మేష ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంక‌ణ‌భ‌ట్టార్  శ్రీ‌నివాస‌భ‌ట్టార్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో  దేవేంద్ర బాబు, ఏఈవో  పార్థ సారధి, సూపరిండేంట్  శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్  గోపాల కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.      

Chandragiri

2023-03-30 09:50:03

వ్యవ‌సాయ మార్కెటింగ్ క‌మిష‌న‌ర్ 31న జిల్లాలో ప‌ర్యట‌న‌

రాష్ట్ర వ్యవ‌సాయ మార్కెటింగ్ శాఖ క‌మిష‌న‌ర్‌, మార్క్ ఫెడ్ ఎం.డి. రాహుల్ పాండే శుక్రవారం జిల్లాలో ప‌ర్యటించ‌నున్నట్టు ఆ శాఖ స‌హాయ సంచాల‌కులు వై వి శ్యాంకుమార్ తెలిపారు. త‌న ప‌ర్యట‌న‌లో భాగంగా జిల్లాలో ప‌లు మార్కెట్ యార్డులు, రైతుభ‌రోసా కేంద్రాలు, రైతుబ‌ జార్‌ల‌ను క‌మిష‌న‌ర్ సంద‌ర్శిస్తార‌ని, జిల్లా కేంద్రంలో వ్యవ‌సాయ మార్కెటింగ్ శాఖ కార్యక‌లాపాల‌పై స‌మీక్షిస్తార‌ని పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ రాహుల్ పాండే తొలుత విజ‌య‌న‌గ‌రం మార్కెట్ యార్డును సంద‌ర్శించి అనంత‌రం అక్కడే జిల్లాలో మార్కెటింగ్ శాఖ కార్యక్రమాల‌పై స‌మీక్ష నిర్వహిస్తార‌ని తెలిపారు. అనంత‌రం ఆర్ అండ్ బి రైతుబజార్‌ను సంద‌ర్శిస్తార‌ని, నెల్లిమ‌ర్ల మండ‌లం గుషిణిలోని ఎం.పి.ఎఫ్‌.సి. గోడౌన్‌ను సంద‌ర్శిస్తార‌ని పేర్కొన్నారు. భోగాపురంలోని వేబ్రిడ్జిని, పూస‌పాటిరేగ మండలం కొప్పెర్లలో రైతుభ‌రోసా కేంద్రాన్ని సంద‌ర్శించి అనంత‌రం విశాఖ వెళ‌తార‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2023-03-30 06:47:57

సీఎంను మళ్లీ ఆశీర్వదించండి–ఎమ్మెల్యే కురసాల

ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ నగరంలోని రూరల్‌ నియోజవర్గ పరిధిలోని డివిజన్లలోని లబ్ధిదారులతో వైఎస్సార్‌ ఆసరా 3వ విడత సంబరాలతో ఆయన పాల్గొన్నారు. 3వ డివిజన్‌ గుడారిగుంట మూడు గుళ్ళ సెంటరు లో ఈ కార్యక్రమం నిర్వహించారు.కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర అధ్యక్షు రాలు సుంకర శివప్రసాన్నసాగర్,మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమీషనర్‌ నాగనరసింహరావు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఆసరా రుణమాఫీ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 8 అర్బన్‌ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు రూ.3.20 కోట్ల చెక్కును లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా మహిళలు, మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి పాలాభిషేకం చేశారు.

 ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఆసరా పథకం కింద రూ.120కోట్లు రుణమాఫీ అవుతున్నాయ న్నారు. మూడో విడతగా రూ.40కోట్లు మాఫీ అయ్యాయన్నారు. చెప్పాండంటే చేస్తారని ముఖ్యమంత్రి జగనన్నపై ప్రజల్లో ముఖ్యంగా అక్క చెల్లె మ్మల్లో ఉందని ఆ విధంగా ఆయన ఆసరా పథకం అమలు చేస్తూన్నారన్నారు. ఆయన హామీ ఇస్తే శాసనంగా అమలు చేస్తున్నారన్నారు. దేశం లో ఆదర్శవంతంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారన్నారు. కార్యాక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కుర సాల సత్యనారాయణ, మాజీ కార్పొరేటరు వడ్డి మణికుమార్,  ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ నారాయణరావు, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రీజనల్‌ కో ఆర్డినేటరు జమ్మలమడక నాగమణి, కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మాజీ కార్పొరేటరు శైలజ, వడ్డీ మణికుమార్  వైఎస్సార్‌ సీపీ నాయకులు, అధికారులు, నేరేళ్ళు, జగన్నాధం, రాజారపు కృష్ణ, వాసిరెడ్డి సూరిబాబు, కృప పాల్గొన్నారు.   

Kakinada

2023-03-29 15:15:30

సింహాచలం అప్పన్న ఉత్సవాలకు కి ఆహ్వానం

సింహాచలం అప్పన్న సన్నిధిలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలకు దేవస్థానం అధికారులు, పండితులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వ రూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం పీఠానికి వెళ్ళి ఆహ్వాన పత్రికను అందజే సారు. అప్పన్న సన్నిధిలో ఏటా నిర్వహించే చందనోత్సవం, తిరు కళ్యాణోత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వచ్చాయి. ఏప్రిల్ 2వ తేదీన తిరు కళ్యాణోత్సవం, 23వ తేదీన చందన మహోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరు కావల్సిందిగా పీఠాధిపతులను సింహాచ లం దేవస్థానం ఇన్ ఛార్జ్ ఈఓ త్రినాధ్, పండితులు కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని, వేసవికాలం అ యినందున ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్వరూపానందేంద్ర స్వామి అధికారులకు సూచించారు.

Visakhapatnam

2023-03-29 13:30:22

అల్లూరి జిల్లాలో ఏప్రిల్ 1న ఉచిత వైద్యశిబిరం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో  ఏప్రిల్ ఒకటవ తేదిన విశాఖపట్నం గాయత్రీ విద్యాపరిషత్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ హల్త్ కేర్ అండ్ మెడి కల్ టెక్నోలజీస్  ఆద్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. పాడేరు కలక్టరేట్ ఆవరణలో జరుగు ఈ ఉచిత వైద్యశిభిరాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గాయత్రీ వైద్య కళాశాలలోని ప్రముఖ వైద్యులు పాల్గొంటారని, బిపి, షుగర్, ఇ.సి.జి, కంటి పరీక్షలు వంటి  వైద్య పరిక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు.

Paderu

2023-03-29 08:03:43

కోదండరామస్వామివారి ఆలయంలో కవి సమ్మేళనం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని  టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల  ఆధ్వర్యంలో మార్చి 30వ తేదీ పోతన భాగవతం అంశంపై  కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.  మార్చి 31వ తేదీ  శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది.  ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జియస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన "పోతన భాగవతం''పై  ప్రముఖ పండితులు ఎం.నారాయణ రెడ్డి - రుక్మిణి సందేశం , డా.బి.గోపాలకృష్ణ శాస్త్రి - శ్రీరామ జననం, డా.కె.సుమన- సీతారామ కళ్యాణం,  పి.శంకర్ - భక్తి రసం,  వి.చిన్నయ్య - కుచేలోపాఖ్యానం,  ఎం.లోకనాధం - శరణాగతి తత్వం  అంశాలపై కవి సమ్మేళనం జరుగుతుంది.

అదేవిధంగా మార్చి 31వ తేదీ  టీటీడీ అర్చక శిక్షణ కోఆర్డినేటర్ డా.హేమంత్ కుమార్ అధ్యక్షతన  ''శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'' పై
 ఎల్.జగన్నాథ శాస్త్రి - గడియారం వెంకట శేషశాస్త్రి రామాయణం,  ఎం.మల్లికార్జున రెడ్డి -  రామాయణ కల్పవృక్షం,  వై. మధుసూదన్ -  శ్రీ రంగనాథ రామాయణం, డా.సి.శివా రెడ్డి-శ్రీమద్ వాల్మీకి రామాయణం,   యు.భరత్ శర్మ - చంపూ రామాయణం, డా. పి.నీలవేణి - మొల్ల రామాయణం అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు.  శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ  వరకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  

Vontimitta Kodanda Rama Swamy Temple

2023-03-29 02:41:15

విశాఖ సాగరతీరంలో జి20 పతాకం విహంగ వీక్షణం

విశాఖలో నిర్వహించే జి20 సదస్సుల పతాకాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలీకాఫ్టర్ ద్వారా వినూత్నంగా నగరవాసులకు తెలియజేశారు. ఆర్కే బీచ్ నుంచి నగరంలో సదస్సు లు జరిగే ప్రాంతాలు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ప్రదేశాల్లో ఈ హెలీకాఫ్టర్ అత్యంత క్రింది నుంచి వెళ్లి నగరవాసులకు కనువిందు చేసింది. హెలీకాఫ్టర్ కి కట్టిన జి20 పతాకం, విశేషంగా ఆకట్టుకుంటోంది. జి20 సదస్సులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అన్ని విషయాలను విశేషంగానే  ప్రజలకు తెలియజేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Visakhapatnam

2023-03-26 06:07:02

శభాష్ గ్రామ సచివాలయ మహిళాపోలీస్ చాందిని..ఎస్పీ

శభాష్  ధర్మవరం గ్రామ సచివాలయ మహిళా పోలీస్ చాందినీ, లావణ్య, రాధ మీరంతా మిస్సింగ్ కేసులను చాలా చక్కగా గుర్తించి కేసు పరిష్కారంలో మంచి ప్రతిభచూపా రు. ఈ తరహా విధినిర్వహణ ప్రభుత్వ సర్వీసులో చక్కటి గుర్తింపును తీసుకొస్తుంది..ఇకపై కూడా మంచి సేవలు అందించండి, ప్రజాసేవలో పోలీసు రక్షణ మరింతగా తెలి యజేయండి.. అంటూ ఎంతో ఉత్తేజపూర్వక ప్రోత్సాహాన్ని ఇచ్చారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు. జిల్లాలో మిస్సింగ్ కేసుల పరిష్కారంలో గ్రామసచివాల య మహిళా పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో చక్కని ప్రతిభ చూపిస్తున్నారని కితాబిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో వీరితోపాటు రిజియా సుల్తానాకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థలో మహిళాపోలీసులు కీలకంగా మారారని, వారి యొక్కలు ప్రజలకు అత్యవసర సమయంలో తెలుస్తున్నాయని అన్నారు.ఏఎస్పీ, డిఎస్పీలు పాల్గొన్నారు.

Kakinada

2023-03-25 16:54:58

కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్దరణకు చర్యలు

ఇంటిగ్రేటెడ్ క‌మాండ్‌, కంట్రోల్ సెంట‌ర్ (ఐసీసీసీ) కార్య‌క‌లాపాల పున‌రుద్ధ‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారులకు సూచించారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఎస్‌సీసీఎల్‌) 37వ డైరెక్ట‌ర్ల బోర్డు స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని సీసీటీవీల ద్వారా నిఘా, ప‌బ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్ట‌మ్ వంటి ముఖ్య‌మైన కార్య‌క‌లాపాలు క‌మాండ్‌, కంట్రోల్ సెంట‌ర్ ద్వారా కొన‌సాగించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై నివేదిక రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి అయిదుగురు స‌భ్యుల‌తో ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద చేప‌ట్టిన సైన్స్ సెంట‌ర్‌, క‌ళాక్షేత్రం, స్కేటింగ్ రింక్ ప‌నుల‌పైనా స‌మావేశంలో చ‌ర్చించారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిని ప్రారంభించి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. స‌మావేశంలో కాకినాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్, కేఎస్‌సీసీఎల్ సీఈవో, ఎండీ కె.ర‌మేష్‌; స్వ‌తంత్ర డైరెక్ట‌ర్లు టీవీఎస్ కృష్ణ‌కుమార్‌, డా. జేవీఆర్ మూర్తి, డైరెక్ట‌ర్ సందీప్ కుల్హారియా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-03-25 12:31:37

విశాఖలో ఆ ప్రాంతాలన్నీ రెడ్ జోన్ విత్ నో డ్రోన్

విశాఖలో జి20 సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు ఉండే ప్రదేశాలన్నీ తాత్కాలిక నో డ్రోన్ విత్ రెడ్ జోన్ గా ప్రకటించినట్టు సిటీ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్,  ముడసర్లోవ పార్క్,  కైలాసగిరి కొండ, ఆర్.కె. బీచ్, జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ, ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార ప్రాంతాను గుర్తించి నట్టు సిపి పేర్కొ్న్నారు. ఈ ప్రాంతాల్లో హెలెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎవరైనా అనుమతిని అతిక్రమిస్తే అలాంటి డ్రోన్లను ధ్వంసం చేయనున్నట్టు హె చ్చరించారు. 

Visakhapatnam

2023-03-25 10:40:48

ప్రసాద్ పథకం నిధులకు 2వ విడత ప్రతిపాదనలు పంపాలి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తుందని,అందులో భాగంగానే తొలి విడతగా సింహాచలం దేవస్థా నానికి మంజూరు చేసిన రూ.54 కోట్ల  పనులను వేగవంతం చేసేవిధంగా సహకారం అందించాలని విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ను సింహాచలం దేవస్థానం ధర్మక ర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. శనివారం ఎంపీ ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శ్రీను బాబు ఘనంగా సత్కరించి సింహాద్రినాధుని జ్ఞాపిక బహుకరిం చారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి తొలి విడతగామంజూరుచేసిన నిధుల పనులు ప్రారంభం కాలేదని ఎంపికి వివరిం చారు. పర్యాటక శాఖ ద్వారా ఈపనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఇందుకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన సహకారం అందించే విధముగా కృషి చేయాలని కోరా రు. అలాగే2వ విడత నిధులు మంజూరుకు సహకారం అందించాలన్నారు.  ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తానన్నా రని శ్రీను బాబుకి హామీ ఇచ్చారు.

Visakhapatnam

2023-03-25 10:22:42

విశాఖ పెట్రోలు బంకుల్లో డిఎస్ఓ ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోలు బంకులు వినియోగదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని.. అలాచేయని బంకులపై చర్యలు తప్పవని డిఎస్ఓ సూర్యప్రకాశ రావు హెచ్చరించారు. గురువారం విశాఖలోని ఎంవీపిలో సుజిత ఏజెన్సీతోపాటు పలు బంకులపై ఏకకాలంలో ఆయన తన బ్రుందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ పెట్రోల్ బంక్ యాజమాన్యం  ఉచితంగా గాలి, మరుగుదొడ్లు, మంచినీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. వినియోగదారులు కోరికమేరకు పెట్రోలు, డీజిల్ కొలతలు కూడా వేసి చూపించాలన్నారు. వాటికోసం ప్రత్యేకంగా కొలతపాత్రలను పెట్రోలు పైపులవద్ద ఉంచాలన్నారు. బంకు ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రిజిస్టర్లలో సంఖ్య మేరకు స్టాకు ఉండాలని, ఖచ్చితంగా ప్రతీ కొనుగోలు దారునికి బిల్లులు ఇవ్వాలన్నారు. శానిటేషన్, మరుగుదొడ్లు, ఉచిత గాలి బోర్డులు ఈబంకులో సక్రమంగా లేవనే విషయాన్ని గుర్తించినట్టు డిఎస్ఓ చెప్పారు.

Visakhapatnam

2023-03-23 09:52:52