1 ENS Live Breaking News

VJFఅనధికార కార్యవర్గాన్ని తక్షణమే రద్దుచేయాలి

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం( వీజేఎఫ్- ప్రెస్ క్లబ్) అనధికార కార్యవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ శనివారం వీజేఎఫ్ సభ్యుల ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ .మల్లికార్జునకు ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనధికార కార్యవర్గం చేపట్టిన సభ్యత రెన్యువల్ ,నూతన సభ్యత్వం నమోదు చెల్లుబాటు కాదని అర్హులైన సభ్యులందరికీ సభ్యత్వ నమోదుకు ఐదుగురితో కూడిన కమిటీని వేసుకోవాలని మెజారిటీ సభ్యులు భావిస్తున్నారని, అనంతరం అధికారుల సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహణకు సహకారం అందిం చాలని కలెక్టర్ ను ప్రతినిధులు కోరింది. 2015లో జరగాల్సిన కార్యవర్గ ఎన్నికలు కోర్టు ఇంజక్షన్  వల్ల సంవత్సర కాలం నిలిచిపోయా యని ఈ కేసు ఓ పి నెంబర్ 661 /2015 ను 2016 లోని కోర్టు  కొట్టివేసిందని  అప్పటినుండి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేవని కలెక్టర్ తెలిపారు. ఇంకా కేసులు ఉన్నాయంటూ సభ్యులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపూరితంగా గత ఏడేళ్లుగా అనధికారకంగా కార్యవర్గం కొనసాగుతుందని వివరించారు. 

వీజేఎఫ్ బైలా ప్రకారం రెండేళ్లకు ఒకసారి  ఎన్నికలు ,ప్రతి ఏడాది సర్వసభ్య సమావేశం నిర్వహించి కార్యక్రమాలను నివేదిక , జమా ఖర్చుల వివరాలు సభ్యులకు అంద అందజేసి సమావేశం ఆమోదం పొందాలన్నారు ఈ నిబంధనలను కార్యవర్గం పాటించలేదని కలెక్టర్ కు చెప్పారు. సంస్థకు వస్తున్న ఆదాయం ,డొనేషన్లు వివరాలు సభ్యులు చెప్పకుండా రహస్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యపై  ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ వేశామని అనివేదిక తమకు చేరిందని తెలిపారు. నివేదిక పరిశీలన అనంతరం చర్యలు చేపడతామని త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. కలెక్టర్ ను కలవడానికి ముందు కలెక్టరేట్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు .అనధికార  కార్యవర్గం  దిగిపోవాలని,  జరుగుతున్న అక్రమాలపై న్యాయ విచారణకుజరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

  ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఎన్. వర్మ, బి. రవికాంత్ ,ఎల్ ,జి, నాయుడు ,బంటయ్య, సూర్యం , వాసు, కుర్ర విజయ్ కుమార్, ఈశ్వర్ చౌదరి ,పి సత్యనారాయణ, సూర్యం, కీర్తన ,బి. ఏ. నాయుడు, హరనాథ్ ,చక్రవర్తి ,నరసింహం,,శ్రీనివాసరావు,కుమార్ ,కిరణ్ ,దొండా రమేష్,ఎస్వీ రమణ ,గౌతమ్ , ఎం .శ్రీహరి ,పృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-29 17:01:30

అనకాపల్లిలో 80% పూర్తైన జగనన్నే మా భవిష్యత్తు

జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాలు అనకాపల్లి నియోజకవర్గంలో 80% పూర్తిచేసినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పేర్కొన్నారు. శనివారం అనకాపల్లిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దంతులూరి దిలీప్ కుమార్ కలిసి ఆ యన మీడియాతో మాట్లాడారు. సీఎం పిలుపుమేరకు 19 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పంద వచ్చిందన్నారు. మ ళ్లీ గుడివాడ అమర్నాధ్ నే ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామనే మాట ప్రతీ ఒక్కరి నుంచి పెద్దఎత్తున వస్తుందన్నారు. వైెఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అడగమన్న 5 ప్రశ్నల ద్వారా ప్రజల సమాధానాలు స్వీకరించడం తోపాటు మద్దతు కూ డా పొందామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పొందిన వారు ప్రభుత్వం సూచించిన నెంబరుకి మిస్డ్ కాల్స్ కూడా తమ మద్దతుని తెలియజేశా రని చెప్పారు. మండల అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, గైపూరు రాజు, జాజుల రమేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Anakapalle

2023-04-29 07:02:52

నూకాంబిక అమ్మవారి ట్రస్టుబోర్డుని నియమించండి

 అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దేవస్థానం ట్రస్టు బోర్డు నియమకానికి మొక్కుబడి ప్రకటన కాకుండా పూర్తి వివరాలతో సమగ్ర ఉత్తర్వును ప్రభుత్వం విడుదల చేయా లని పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కో`ఆర్డినేటర్‌, సమాచార హక్కు, వినియోగదారుల రక్షణ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ గురువారం ఒక ప్రటకనలో డిమాండ్‌ చేశారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ట్రస్టు బోర్డు నియామకం కోసం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వు (నెం. ఎ1/396/2023 తేది : 25-4-2023) అసం పూర్తిగా, ఆక్షేపనీయంగా ఉందని విమర్శించారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌లకు లేఖ వ్రాసినట్టు పేర్కొన్నారు. ఏటా రూ. 4 కోట్లు ఆదాయం సమకూరుతున్న దేవస్థానానికి ట్రస్టు బోర్డును నియమించాలని ఏడాదిగా ఆర్టీఐ చట్టం (కేసు నెం. 19032/ఎస్‌ఐసీ-ఆర్‌ఎస్‌ఆర్‌/2022) ద్వారా చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షనీయమన్నారు. అయితే తాజాగా వెలువడిన ఉత్తర్వులో ట్రస్టు బోర్డు సభ్యుల సంఖ్య, అర్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తు నమూనా, చిరునామా తదితర వివరాలు లేకుండా మొక్కుబడిగా ప్రకటన జారీ చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్దేశపూర్వకంగా సాంకేతిక సమస్యలు సృష్టించి ట్రస్టు బోర్డును నియమించకుండా కాలయాపన చేసే దురుద్దేశంతో జారీ చేసిన ఉత్తర్వులా ఉందని వెంకటరమణ అనుమానం వ్యక్తం చేశారు.

                ఆచార వ్యవహారాలు, ఆగమశాస్త్రంపై అవగాహన ఉన్న అర్హులను మాత్రమే ధర్మకర్తలుగా నియమించాలని ఆయన కోరారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టం 30/1987లోని సెక్షన్లు 13, 15, 17, 18, సవరణ చట్టం 8/2014, 31/2019, ప్రభుత్వ సర్య్కులర్లు (నెం.42 తేది : 8-12-2001)కు విరుద్దంగా జరిగిన ట్రస్టు బోర్డు సిఫార్సులు, నియామకాలకు సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలని వెంకటరమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

                ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి 10 దేవస్ధానాల్లో ఒకటిగా, ఆదాయం ప్రాతిపాదికన 6`ఎ2 దేవస్థానంగా గుర్తింపు పొందిన శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్ధానానికి గత 8ఏళ్లుగా ట్రస్టు బోర్డు నియామకానికి నోచుకోకపోవడం ‘స్ధానిక’ పాలకుల వైఫల్యమని ఆయన దుయ్యబట్టారు. 2019లో ట్రస్టు బోర్డు నియామకం కోసం ప్రభుత్వ ఉత్తర్వు (ఆర్టీ నెం. 986 రెవిన్యూ (ఎండోమెంట్స్‌-11) డిపార్ట్‌మెంట్‌ తేది : 30-9-2019) ప్రకారం స్వీకరించిన దరఖాస్తులు ఏమైనట్టు ఆయన నిలదీశారు. భక్తుల ఆదాయంతో నడుస్తున్న దేవస్ధానాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, అధికారులు జీతాలు పొందుతూ ట్రస్టు బోర్డును నియమించకుండా జాప్యం చేస్తున్నారని, తక్షణం జోక్యం చేసుకోవాలని కాండ్రేగుల వెంకటరమణ ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

Anakapalle

2023-04-27 10:53:23

చేపలవేట సమయంలో రక్షణ చర్యలు తప్పక పాటించాలి

మత్స్యకారులు సముద్ర జలాల్లో వేటకు వెళ్లే సమయంలో రక్షణ చర్యలు ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణ రక్ష జరుగుతుందని విజయ నగరం జిల్లా మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎం. నిర్మల కుమారి పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పధకం క్రింద 30 మంది సముద్ర మత్స్యకారులకు “సముద్ర రక్షణ పరికరాలు మరియు భద్రత” అనే అంశంపై ౩ రోజులపాటు ఫిష్ సీడ్ ఫారం లో నిర్వహించి న నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను మత్స్య కారుల సద్వినియోగం చేసుకొని లబ్దిపొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించాల్సిన రక్షణ చ ర్యలు, ఆ సమయంలో ఉపయోగించాల్సిన పరికరాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా  తమ తమ గ్రామాల లో మిగిలిన ఇతర మత్స్యకారులకు తెలుసుకున్న విషయాలను చెప్పాలన్నారు. మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించాల్సిన రక్షణ పరికరాల వివరాలు, వాటి వినియోగంపై విశాఖపట్నం సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్, నాటికల్ అండ్ ఇంజ నీరింగ్ ట్రైనింగ్ యునిట్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఈ  శిక్షణా కార్యక్రమంలో జిల్లా మత్స్యాకార సహకర సంఘం అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న, సిఐఎఫ్ట టి  ప్రతినిధులు డా. ఎం.ఆర్. మహాదేవ్ కొంకణి, అభిషేక్, నిశిత్, ఎఫ్డీఓ యు.చాందిని,  ఇతర మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-27 08:05:26

విశాఖజిల్లాకు వసతి దీవెన రూ.41.17 కోట్లు

జగనన్న వసతి దీవెన క్రింద రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో  41.17కోట్ల రూపాయలు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా, నార్పల లో ఏర్పాటు చేసిన బహిరంగ  సభలో పాల్గొని ముఖ్యమంత్రి వె.యస్.జగన్మోహన్ రెడ్డి వర్చు వల్ విధానం ద్వారా 2022-23 విద్యా సంవత్సరం సంబంధించి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో సీఎం ప్రారంభించగా, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో  జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య మంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం విశాఖపట్నం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా రూ.41,17,45,000 మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున ప్రజా ప్రతినిధులతో  తో కలిసి లబ్ధిదారులకు  అందజేసారు. 

తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్ధులకు స్కాలర్ షిప్లు లభించాయని తెలిపారు.  విశాఖపట్నం జిల్లాకు 43,938 మంది విద్యార్ధులకు సంబంధించి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో 41.17 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఇందులో 4,238 మంది ఎస్.సి విద్యార్థులు వారి తల్లుల  ఖాతాల్లో 3.95 కోట్ల రూపాయలు, 168 మంది ఎస్.టి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో 15.52లక్షలు, 38,109 మంది బి.సి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.35.72 కోట్లు, 1,423 మంది మైనారిటీ  విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.1.34 కోట్ల  రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు వసతి  దీవెన కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే సచివాలయం లో ఉండే సంబంధిత అధికారులకు తెలియజేసినట్లు అయితే  వారు పరిష్కరిస్తారన్నారు.

   జిల్లా నుండి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.యస్ విశ్వనాథన్, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణ మూర్తి, జిల్లా బి. సి సంక్షేమాధికారి శ్రీదేవి, డిసిఎంఎస్ చైర్ పర్సన్ పల్లా చిన్నతల్లి, నగరాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పిళ్ళా సుజాత , రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ , యాత కార్పొరేషన్ చైర్ పర్సన్ పిళ్ళా సుజాత నూకరాజు , నాగవంశం సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ అప్పలకొండమ్మ ,   పలువురు విద్యార్థులు పాల్లొన్నారు.

Visakhapatnam

2023-04-26 15:13:01

చాపా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్పాహార వితరణ

విశాఖలోని చాపా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు బాలక్రిష్ణ నిరాశ్రయులైన రోడ్డుప్రక్క అనాధలకు అల్పాహారం వితరణ కార్య క్రమం చేపట్టారు. ఈ మేరకు మంగళవారం విశాఖలోని  రైల్వేస్టేషన్ కి వెళ్లేదారిలోని దొండపర్లి ఫ్లై ఓవర్ క్రింద ఉన్న 50మందికి పెరుగువడ, నేతి వడలు, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాపా బాలక్రిష్ణ మీడియాతో  మాట్లాడుతూ, నిత్యం నిరుపేద భక్తులను కాశీ యాత్రకు ఉచితంగా తీసుకెళ్లి వస్తుంటామని, ఆ సందర్భంలో యాత్రముగించుకొని వచ్చిన తరువాత ఇలా అన్నదాన సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆశ్రమంలోని భక్తులతోపాటు, రోడ్డుప్రక్కన నిరాశ్రయులైన వారికి కూడా తమ ట్రస్టుద్వారా ఆహారాన్ని అందిస్తుంటా మని చెప్పారు. ఇదేరోజు ఆశ్రమంలో కూడా 50 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిపిట్టు వివరించారు. ఆ పరమశివుని కరుణతో తన వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

Visakhapatnam

2023-04-25 13:29:39

మిస్సింగ్ కేసులపై తక్షణమే దృష్టిసారించండి

మిస్సింగ్ కేసులు, సాధారణ మరణాలు (174 సి.ఆర్.పి.సి), ఫోక్షో కేసులను పూర్తిస్థాయిలో సమీక్షించి చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మురళీ కృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి, దర్యాప్తు లో ఉన్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోక్షో కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి నిర్ణీత సమ యంలో చార్జ్ సీట్ వేయాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న నిందితులు పై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం ద్వారా పీ.డీ యాక్టు నమోదు చేయ డానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, తగాదాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువ నమోదు చేయాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు తో పాటు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం మరియు రోడ్డు భద్రత నియమాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.వేసవి కారణంగా రాత్రి సమయాలలో వేడిని తట్టుకోలేక చాలామంది ప్రజలు ఆరుబయట నిద్రిం చటం, ఇంటి తలుపులు తెరిచి ఆదమరిచి నిద్రించడం జరుగుతోందన్నారు. దొంగలు అదునుగా తీసుకొని చోరీలకు పాల్పడే అవకాశం ఉ న్నందున ప్రజలు తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి పగలు గస్తీలలో అనుమానాస్పద వ్యక్తుల ను ఫిన్స్ పరికరం ద్వారా తనిఖీ చేస్తూ, సంబంధిత వ్యక్తికి నేరచరిత్ర తెలుసుకోవడం ద్వారా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

స్పందన ఫిర్యాదు దారుల సమస్యలు ప్రాముఖ్యతనిచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దత్తత గ్రామాల కానిస్టేబుల్స్, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల గ్రామాల నుండి వచ్చే సమాచారంపై అధికారులు త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) బి.విజయ భాస్కర్, అదనపు ఎస్పీ (క్రైమ్స్)  పి.సత్యనారాయణ రావు, అనకా పల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ  పి.శ్రీనివాసరావు, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ కె.ప్రవీణ్ కుమార్, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, లక్ష్మణ్ మూర్తి, అప్పలనాయుడు, సతీష్ ఎస్సైలు  భీమరాజు, రఘువర్మ   జిల్లా సిఐలు , ఎస్సైలు ఈసమా వేశంలో పాల్గొన్నారు.

Anakapalle

2023-04-25 12:17:48

భూ సర్వేపనులు సత్వరమే పూర్తిచేయాలి

భూ సర్వే పనులు నిర్ణీత  కాలవ్యవధిలో పూర్తి చెయ్యాలని  రెవెన్యూ డివిజనల్ అధికారులు,మండల తాసిల్దారులను జాయింట్ కలెక్టర్ కే ఎస్  విశ్వనాథన్ ఆదేశించారు.మంగళవారం ఉదయం కలెక్టరేట్  సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తాసిల్దార్లుతో జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ రెవిన్యూ  శాఖ పనులపై   సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశం లో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీసేవ, ఏపీ సేవ, స్పందన ద్వారా ప్రజల నుంచి వచ్చే దరఖాస్థులపై సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏపీఐఐసి, ఎన్ హెచ్ 16, రైల్వేస్ భూములకు సంబంధించి మ్యుటేషన్ పనులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. , రీ సర్వే పనులు నిర్ణీత కాల వ్యవధి లో పూర్తి చేయాలని అధికారులకు  ఆదేశించారు.  

ఈనెల 26 నుండి మే25 వరకు  నెల రోజులు పాటు  మండల తాసిల్దార్ కార్యాలయంలో సింగిల్ విండో సేవలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజలు  భూపట్టాలకు సంబంధించి సవరణలు చేసుకోవచ్చన్నారు. గాజువాక హౌసింగ్ కి సంబంధించి జీవో  నెంబరు 301 మరియు,388 పై ప్రజలకు సచివాలయ సిబ్బంది ద్వారా  అవగాహన కల్పించాలని అన్నారు . పంపిణీకి సిద్ధంగా ఉన్న భూ పట్టాలను ప్రజలకు వెంటనే అందించాలన్నారు .   సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసి భూములకు సంబందించిన పనులు , స్పందన వినతులు  పరిష్కరించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో   డిఆర్వో శ్రీనివాసమూర్తి , భీమిలి ఆర్డిఓ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్  సర్వే విజయ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఈశ్వరరావు,ఎస్ డి సీలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-04-25 11:34:30

కీట‌క జ‌నిత వ్యాదుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

కీట‌క జ‌నిత వ్యాదుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని  ఐటిడి ఏ  పిఓ  వి. అభిషేక్ అన్నారు.మ‌లేరియా నివార‌ణ మనంద‌రిపైనా ఉంద‌న్నారు. మంగ‌ళ‌వారం  ప్ర‌ప్రంచ మ‌లేరియా దినోత్స‌వం సంద‌ర్బంగా స్థానిక అంబేడ్క‌ర్ కూడ‌లి వ‌ద్ద మ‌లేరియా నివార‌ణ‌పై అవ‌గాహ‌నా ర్యాలీని ఆ య‌న జెండా ఊపి ప్రాంభించారు. ఈ సంద‌ర్భంగా పి ఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల‌లో మ‌లేరియా నివార‌ణ చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిం చాల‌న్నారు. దోమ‌ల పెరుగుద‌ల‌ను అరిక‌ట్ట‌డానికి  డ్రైడేల‌ను ప‌క్కాగా అమ‌లు చేయాల‌ని సూచించారు. ఇంటి ప‌ర‌స‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌న్నారు. ఎక్క‌డా నీటి నిల్వ‌లు లేకుండా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు.శుక్ర‌వారం , సోమ‌వారం, బుధ‌వారాల‌లో డ్రైడే పాటించాల‌ని స్ప‌ష్టం చేసారు.  ఏదో ఒక ప‌నిచేసామ‌ని కాకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌క్కాగా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డితే ప్ర‌జ‌ల‌ను మ‌లేరియా బారిన ప‌డ‌కుండా కాపాడ‌వ‌చ్చ‌ని అన్నారు. దోమ తెర‌ల వినియోగంపై గిరిజ‌నుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పేర్కొన్నారు.  అనంత‌రం  ర్యాలీని అంబేడ్క‌ర్ కూడ‌లి నుండి  ఐటిడి ఏ  కార్యాలయం వ‌ర‌కు నిర్వ‌హించారు. ఈ  కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌లేరియా అధికారి సాంబ‌మూర్తి, వైద్య సిబ్బంది, మ‌లేరియా సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Paderu

2023-04-25 11:23:07

కీటక జనిత వ్యాధులను వ్యాప్తిని అరికట్టాలి..

జాతీయ  కీటక జనిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా మలేరియా, డెంగ్యూ తదితర కీటక జనిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అధికారు లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవా న్ని పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించి కీటక జనిత వ్యాధులు, మలేరియా డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణ చర్యల పై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదైనన ఏడు డెంగ్యూ కేసులు పట్ల సత్వరమే స్పందిస్తూ నియంత్రణ కొరకు చికిత్సలు బలోపేతం చేయా లన్నారు. దోమల లార్వాలు ఉత్పత్తి అయ్యే మురికి కుంటలు, పరిసరా లను గుర్తించడంతోపాటు ప్రతి శుక్రవారం డ్రైడే పటిష్టంగా చేపట్టాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్స్ స్ప్రేయింగ్ కార్యక్రమాల ద్వారా చేపడుతూ ఆరోగ్యకర సమాజస్థాప న దిశగా పాటుపడాలన్నారు. 

Amalapuram

2023-04-25 11:20:18

అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో

రామచంద్రాపురం మండలంలోని దుర్గ సముద్రం, రేణిగుంట అక్షయ క్షేత్రం మానసిక వికలాంగుల, ప్రత్యేక అవసరాలు కల వారి సేవా కేం ద్రాలను టీటీడీ జేఈవో సదాభార్గవి మంగళవారం సందర్శించి సేవలు పొందుతున్న వారిని చూశారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివ రాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, అక్షయ కేంద్రానికి టీటీడీ ఏడాదికి రూ 15 లక్షల మేరకు ఆర్థిక సహా యం చేసేదన్నారు. కోవిడ్ ప్రబలినప్పటి నుండి ఈ సహాయం నిలిపి వేసినట్లు ఆమె తెలిపారు. తిరుమల, తిరుపతి లోని మానసిక వికలాంగు లు, ప్రత్యేక అవసరాలున్న వారిని ఈ కేంద్రాలకు తరలించి సేవలు అందిస్తున్నారని ఆమె చెప్పారు.  ఇక్కడి పరిస్థితిలను పరిశీలించి ఈవో కు నివేదిక అందిస్తామని, ఆర్థిక సహాయం పునరుద్ధరణ కు సంబంధించి ఆయన నిర్ణయం తీసుకుంటారని జేఈవో వివరించారు.డిఈవో భా స్కర రెడ్డి,పిఆర్వో డాక్టర్ రవి, బాల మందిరం ఎఈవో అమ్ములు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-04-25 10:21:55

దోమల నిర్మూలన అందరి ప్రధమ కర్తవ్యం

మలేరియా వ్యాప్తికి కారణమైన  దోమలు లేకుండా చేయాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. హేమంత్ పిలుపునిచ్చారు.  ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆయన జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దోమలు పెరగడానికి కార ణం మురికి కుంటలు, ఇళ్లలో నీరు నిల్వ ఉంచడమేనని చెప్పారు.  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం కాలువల్లో మందులు చల్లడం, ఫాగిం గ్, వారానికి ఒకరోజు డ్రై డే పాటించాలని చెప్పారు.  వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు అందరూ సహకరించాలన్నారు. దోమల వల్లనే మలేరి యా డెంగ్యూ మొదలైన వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పారు. ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుంచి బయలుదేరి నెహ్రూ చౌక్ బాలాజీ రావు మార్కెట్ మీదుగా తిరిగి ఎన్టీఆర్ స్టేడియం కు చేరుకున్నది.  ఈ ర్యాలీలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శారదాబాయి జిల్లా మలేరియా అధికా రి డాక్టర్ ఉమామహేశ్వరరావు, మలేరియా శాఖ, జీవీఎంసీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-25 09:35:37

MVRపై కావాలని బురద చల్లేందుకు తేడామీడియా కుట్ర

నిశ్వార్ధ సేవలకు ప్రతి రూపం..యువతకు ఉపాది అవకాశాలు కల్పించే సేవాభావం..చెరగని చిరునవ్వుకి కేరాఫ్ అడ్రస్ అనకాపల్లిలోని ప్రము ఖ వ్యాపారవేత్త,  ముత్యాల వెంకటేశ్వర్రావు(ఎంవీఆర్). అలాంటి మంచి వ్యక్తిపై తేడా మీడియా కావాలని బురదచల్లే ప్రయత్నం చేస్తోంది.  ప నిగట్టుకొని అసత్యప్రచారాలు చేస్తోంది. ఎలాగైనా ఉన్నమంచిపేరుని చెడగొట్టాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అయినా ఎంవీఆర్ వా టిని పట్టించుకోవడం లేదు సరికదా తాను అనుకున్న లక్ష్యం ప్రజలకు సేవచేయడం, మీడియాకు చేయూతనివ్వడం. ఈ క్రమంలో చాలా వదం తులు వస్తాయి. అలాంటి చిల్లర ప్రచారాలను పట్టించుకుంటే సమయం వృధా అవుతుంది అంటూ సున్నితంగా తోసి పుచ్చుతున్నారు. అడి గినంత మొత్తం ప్రకటనలు, తమ అవసరాలకు ఇవ్వలేదనే అక్కసుతో శతవిధాలా ప్రయత్నించి చివరకు బురదచల్లే పనికి పూనుకున్నాయి. దానికి కొందరు వెనుకుండి మరీ కధ నడిపిస్తున్నారనే ప్రచారమూ గట్టిగానే సాగుతోంది. ఇంత జరుగుతున్నా ఎంవీఆర్ మాత్రం చెరగని చిరు నవ్వుతో.. చేసుకోనీయండి ఎంతకాలం అసత్యాలను వండి వారుస్తారు..నిజం ఈరోజు కాకపోయిన రేపైనా తెలుస్తుంది అంటూ చెత్తరాతలను చిత్తుగా కొట్టి పడేస్తున్నారు. మంచి సంకల్పంతో ప్రజల సేవచేసి, యువతకు ఉపాధి చూపించాలనే లక్ష్యంతో ఎంవీఆర్ పనిచేస్తున్నారని అది చాలా మందికి నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భంలోనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జనంలోకి వస్తాయిని ఎంవీఆర్ యువసేన సైతం బలంగానే తేడా ప్రచారాలను తిప్పికొడుతోంది.

అడిగింత మొత్తం ఇవ్వకపోతే అభివృద్ది విషయంలో ఆయన చేసిన ప్రకటనలను వ్యంగ్యంగా చిత్రీకరించే నీచ ప్రచారాలు చేస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఎంవీఆర్ కి ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ, అంతెందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. అందునా కాస్త తేడాగా వ్యవహరించే సదరు మీడియాకి అస్సలు తెలియదు కనుుుకనే ఆయనను పొలిటికల్ గా ప్రమోట్ చేసేందుకు, దానికి అయ్యే ఖర్చును అడ్డంగా లాగేందుకు కొన్ని పత్రికలు, మీడియా పనిగట్టుకొని అసత్య ప్రచారాలకు దిగుతున్నా యని ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని కధనాలే రుజువు చేశాయి. తొలుత సామాజిక సేవగా బావించి చాలా చిన్న చిన్న పత్రికలు, ఛానళ్లకు, జర్నలిస్టుల సంఘాలకు చేయూత అందించిన ఆయన వాస్తవాలు తెలుసుకొని నిజంగా పనిచేసే మీడియా సంస్థలను, జర్నలిస్టులను ప్రోత్స హించడం మొదలు పెట్టారు. దానితో తేడా మీడియాకు అది మింగుడు పడక అదే స్థాయిలో వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది.. వెంటనే గతంలో ఈయన చేసిన ప్రచారాలను, హామీలను తప్పుడుగా చిత్రీకరించే వంట మొదలెట్టారు. అయినప్పటికీ ఎంవీఆర్ యువసేన వాటిని ఎక్కడికక్కడ తిప్పికొడుతూ వస్తున్నది. ఎక్కడైనా తేడా జరిగితే రాయండి దానిని మేమే స్వాగతిస్తాం..అంతే తప్పా తిన్నింటి వాసాలు లెక్కెట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. సో తేడా మీడియా మీ పప్పులిక ఉడకవని తేలిపోయింది..అయినా కాదు కూడదు అనుకుంటే.. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఏం చేస్తారనేది..! 

Anakapalle

2023-04-25 04:49:13

భోగాపురం ఎయిర్‌పోర్టు రాష్ట్రానికి ప్ర‌తిష్టాత్మ‌కం

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉత్త‌రాంధ్ర‌కే కాకుండా, రాష్ట్రానికే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారా య‌ణ పేర్కొన్నారు. మే 3వ తేదీన ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా జ‌రిగే ఎయిర్‌పోర్టు శంకుస్థాప‌నా కార్య‌క్ర‌మానికి ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయా ల‌ని జిల్లా అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. విమానాశ్ర‌య శంకుస్థాప‌న, ముఖ్య‌మంత్రి బ‌హిరంగ స‌భ నిర్వ‌హ‌ణ‌కు అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్ల‌పై, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మ‌న్వ‌య‌ స‌మావేశాన్ని నిర్వ‌ హించారు. ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను, ఈ సంద‌ర్భంగా వివిధ శాఖ‌ల అ ధికారుల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను వివ‌రించారు.

              ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వం తం చేయాల‌న్నారు. హెలీప్యాడ్‌, భూమి పూజ‌, పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌, బ‌హిరంగ స‌భ వేదిక‌ల వ‌ద్ద ప్ర‌త్యేకాధికారుల‌ను నియ‌మించి, వారికి బాధ్య‌ త‌లు అప్ప‌గించాల‌ని సూచించారు. ప‌టిష్ట బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని జిల్లా ఎస్‌పిని ఆదేశించారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేం దుకు ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అన్నారు. వారంతా స‌భ‌కు వ‌చ్చి, తిరిగి ఇంటికి వెళ్లేవ‌ర‌కు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ముఖ్యంగా త్రాగునీరు, మ‌జ్జిగ విస్తృతంగా పంపిణీ చేయాల‌న్నారు. వాట‌ర్ ట్యాంక‌ర్ల‌ను కూడా సిద్దంగా ఉంచాల‌న్నారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఉప‌యోగించేందుకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా నాలుగు 104 వాహ‌నాల‌ను కూడా సిద్దం చేయాల‌న్నారు. 

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న జిల్లాలో ఆరోజు ఉద‌యం 10.30కు ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 12.30 క‌ల్లా ముగుస్తుంద‌ని చెప్పారు. ప్ర‌తీఒక్క‌రూ అప్ర‌ మ‌త్తంగా ఉండి, త‌మ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించి, సిఎం ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి కోరారు. ఈ స‌మావేశంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంఎల్‌సి ఇందుకూరి ర‌ఘురాజు, ఎంఎల్ఏ శంబంగి వెం క‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, ఎస్‌పి దీపిక‌, జెసి మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-04-24 10:28:40

సమాజానికి మంచి చేయడమే నిజమైన పౌరసేవ

ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా నిబద్ధతతో మంచి ఆలోచనలతో విధులు నిర్వహిస్తున్నందునే అభివృద్ధి సాధ్యపడుతున్నదని జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి తెలిపారు. శుక్రవారం సివిల్ సర్వెంట్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు సమాజానికి తోడ్పడే విధంగా అమలు చేయడంలో సివిల్ సర్వెంట్స్ ప్రతిభ ప్రతిఫలిస్తుందన్నారు. దేశ నిర్మాణం జాతి పురోగతికి బాటలు వేసేలా సమిష్టి కృషితో పనిచేసినప్పుడు ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా సమయంలో సివిల్ సర్వెంట్స్ ప్రతిభ, సేవా భావం అందరికీ తెలిసిందన్నారు.

 అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ భాయ్ పటేల్ సివిల్ సర్వెంట్స్ గూర్చి మాట్లాడుతూ వారు "దేశానికి  స్టీల్ ఫ్రేమ్" అని అభివర్ణించారని చెప్పారు. తరువాత అదే తేదీని సివిల్ సర్వెంట్స్ డే గా జరుపు కుంటున్నట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన చట్టాలను సక్రమంగా అమలయ్యేలా సివిల్ సర్వెంట్స్ పర్యవేక్షిస్తారు అన్నారు.  జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు ప్రణాళిక అధికారి రామారావు, డ్వామా పిడి ఇ.సందీప్ దేశంలో సివిల్ సర్వెంట్స్ ప్రస్థానం, విజయాలను గూర్చి తెలియజేశారు. అనంతరం జిల్లా అధికారులతో జెసి ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.

Anakapalle

2023-04-21 13:39:51