1 ENS Live Breaking News

డీజిల్,పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి..

కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీతమ్మదార జంక్షన్ అల్లూరి విగ్రహం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ ,ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీజిల్, పెట్రోల్,వంట  గ్యాస్ ధరలు పెరగడం తప్పా తరగడం కనిపించలేదున్నారు. చమురు ధరలను జిఎస్టీ పరిధిలోకి రావడం ద్వారా రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగి నిత్యవసర సరుకు ధరలైనా తగ్గుతాయని అభిప్రాయ పడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ ,పెట్రోల్ ధరలపై వ్యాట్, సెస్ పన్నులను డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ 20 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంపీలు,మంత్రులు ధరలు పెరుగుతున్న వారికి పట్టనట్టు వ్యవరించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరల పై ప్రజలు ప్రతి ఘటనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పడాల గోవిందు, ఎన్.మధు రెడ్డి ,లంక గోవింద్ ,రావి కృష్ణ ,కెల్లా రమణ ,వెంకట్రావు ,జగన్నాథం ,తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-01 14:15:38

నిత్యాన్నదానాలకు రూ.2 లక్షలు విరాళం..

శ్రీకాకుళంలోని అరసవల్లి, శ్రీకూర్మం నిత్యాన్నదాన్న కార్యక్రమాలకు రూ.2 లక్షలు విరాళం అందాయి. నిత్యాన్నదానానికి రూ.2 లక్షలను సంఘ సేవకులు బరాటం కామేశ్వరరావు, రాజ్యలక్ష్మీ దంపతులు, కుమారుడు సతీష్‌దివ్యతో కలిసి సోమవారం అందించారు. శ్రీకూర్మం నిత్యాన్నదానానికి రూ.లక్షను ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు ద్వారా ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌కు అందించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఉన్నతమైన సేవలందిస్తున్నారని కొనియాడారు. సమాజానికి మంచి చేసే ఇలాంటి కుటుంబానికి  చేయూతను అందిస్తామన్నారు. విరాళ దాత మాట్లాడుతూ, నిత్యాన్నదానానికి తమవంతుగా స్వామి ఆలయానికి విరాళం అందించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానం నిరాటంకంగా సాగేందుకు తమ వంతు బాధ్యతగా అరసవల్లి, శ్రీకూర్మంకు చెరో లక్ష అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరసవిల్లి పాలకమండలి సభ్యులు మండవల్లి రవి, అంధవరపు రఘు, మండల మన్మధరావు, గాయత్రి, ఏపిడబ్ల్యుజేఎఫ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్‌ ‌క్లబ్‌ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్‌, ‌గుర్తు చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-01 13:12:20

ఏఎంజీ రథ్ డెచిమన్ సేవలు హర్షనీయం..

వైద్యులు దేవుడితో సమానమని విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఏఎంజీ రథ్ డెచిమన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 21వ వార్డు రెల్లివీధిలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో ప్రజలకు వైద్యసేవలు చాలా అవసరమన్నారు. అలాంటి వైద్యసేవలు ఉచితంగా నిర్వహించడానికి ఏఎంజీ రథ్ డెచిమన్ ఆసుపత్రి ముందుకి రావడం అభినందనీయమన్నారు.  కరోనా సమయంలో చాలా మందికి వైద్యసేవలు పొండం కూడా కష్టమవుతున్న తరుణంలో ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా పరీక్షలు చేయడం తో ఉచితంగా మందులు సరఫరా చేయడం చెప్పుకోదగ్గ అంశమని కొనియాడారు.  ఈ మెగా క్యాంపు లో వైద్య నిపుణులు  జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనికాలజీ, పెడియాట్రిక్స్, సర్జికల్ ఆన్కలజి, ఫిజియోథెరఫీ, అన్ని డిపార్ట్మెంట్ ల స్పెషలిస్ట్ డాక్టర్లు కాంప్ లో పాల్గొని ఉచిత మందులు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, 3టౌన్ సిఐ ఈశ్వర రావు , వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-30 21:21:08

ఫిబ్రవరి 1 న ఈసీ కమిషనర్ జిల్లాకు రాక..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఫిబ్రవరి 1వ తేదీన విజయవాడ నుండి హెలికాఫ్టర్  లో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారని, అక్కడ నుండి అదే రోజు బయలుదేరి మధ్యాహ్నం 3.45  గం.లకు  శ్రీకాకుళం చేరుకుంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయంట్ కలెక్టర్లు, ఎస్.పి, అడిషనల్ ఎస్.పి.లు, డి.ఎస్.పి.లు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ, డిప్యూటీ సి.ఇ.ఓ, ఆర్.డి.ఓ.లు, జల్లా పంచాయితీ అధికారి, తదితర అధికారులతో పంచాయితీ ఎన్నికల ప్రక్రియపై  సాయంత్రం 4.00 గం.ల నుండి 5.30 గం.ల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీకాకుళం నుండి బయలుదేరి విజయనగరం వెళ్తారని జిల్లా కలెక్టర్ వివరించారు.

Srikakulam

2021-01-30 21:02:50

కంట్రోల్ రూమ్ పనితీరు ఆదర్శవంతంగా ఉండాలి..

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు ప్రశంసనీయంగా ఉండాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. శనివారం కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారిలతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలిస్తూ క్షేత్ర స్ధాయిలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించే విధంగా ఆయా విభాగాలు సజావుగా పని చేయాలన్నారు. ఎవరైనా ఫోన్ ద్వారా గానీ, నేరుగా గానీ ఏదైనా సమాచారం కోరితే ఇవ్వాలన్నారు. అదే విధంగా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.  ఈ పరిశీలనలో డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, జిల్లా పంచాయతీ అధికారి ఎస్.వి.నాగేశ్వర్ నాయక్, మెప్మా పిడి శ్రీరమణి, తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-01-30 20:56:25

ఏజెన్సీలో నిర్మాణాలకు కావాల్సింనత ఇసుక..

ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టే నిర్మాణాలకు అవసరమైన 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సమకూర్చడం జరుగుతుందని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశతో కలిసి జిల్లా స్ధాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎజెన్సీ ప్రాంతాలైన ఎటపాక, గుర్తేడు , పెంటకోడు, కె.కోట ప్రాంతాల్లో ఉపాధి హామీ పధకం నిధుల ద్వారా నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని, దీనికి అవసరమైన 10 వేల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీకి కమిటీ ఆమోదించిందన్నారు. సబరి నది ధార్డ్ ఆర్డర్ స్కీమ్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాజోలు దగ్గర మల్కీపురం మండలంలో 2,520 క్యూబిక్ మీటర్ల ఎత్తులో అక్రమంగా నిల్వ చేసిన బొండు ఇసుకను ప్రభుత్వ ఇళ్ళ స్ధలాలకు సిధ్ధం చేస్తున్న లేఅవుట్ల చదునుకు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రోజు వారీ వినియోగదారుల అవసరాల నిమిత్తం సుమారుగా 26 వేల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి రోజు సుమారుగా 22 వేల మెట్రిక్ టన్నుల ఇసుక బల్క్ బుకింగ్, ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు, సాధారణ వినియోగదారులకు బుకింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లా ఖనిజ వ్యవస్ధ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇది వరకు మంజూరు చేసిన పనుల ప్రగతిని కలెక్టర్  ఈ సందర్భంగా సమీక్షించారు. జిల్లా ఇప్పటి వరకు జిల్లా ఖనిజ వ్యవస్ధ ద్వారా రూ.31.52 కోట్లు సమకూర్చగా దీనిలో రూ.19.50కోట్లు ఖర్చు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఖనిజ వ్యవస్ధ ద్వారా 500 పనులు పూర్తి చేయగా, 321 పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో కొత్తగా 3.84 కోట్లతో కొత్త పనులు మంజూరుకు సిధ్ధంగా ఉన్నాయన్నారు. దీనికి అవసరమైన నిధులకు ఇసుక పై రావల్సిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) రెవెన్యూను జిల్లాకు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిడి మైన్స్ కు కలెక్టర్ సూచించారు.పురోగతిలో ఉన్న పనులను శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించి, సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.  ఈ సమావేశంలో రంపచోడవరం ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, డిపిఓ ఎస్.వి. నాగేశ్వర్ నాయక్, ఆర్.డబ్ల్యూ.ఎస్. సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.గాయత్రీదేవి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ., నాగరాజు, ఎస్.ఎస్.ఏ. పిఓ బి .విజయ్ భాస్కర్ , గనులు, భూగర్భవనరుల శాఖ సహాయ సంచాలకులు డి.రంగకుమార్,జిల్లా ఇసుక అధికారి డిహెచఎస్ రవి కుమార్, వ్యవసాయ శాఖ డిడి ఎస్.మాధవరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-01-30 20:54:44

పోలియో ఆదివారం విజయవంతం కావాలి..

జ‌న‌వ‌రి 31న పోలియో ఆదివారం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు తూర్పుగోదావ‌రి డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ కేవీఎస్ గౌరీశ్వర‌‌రావు తెలిపారు. శ‌నివారం కాకినాడ‌లోని డీఎంహెచ్‌వో కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో డా. గౌరీశ్వ‌ర‌రావు మాట్లాడారు. ఆదివారం చేప‌ట్ట‌నున్న ప‌ల్స్ పోలియో వ్యాక్సిన్ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను వివ‌రించారు. అంచ‌నాల ప్ర‌కారం జిల్లాలో 4,69,445 మంది 0-5 ఏళ్ల వ‌య‌సు చిన్నారులు ఉన్న‌ట్లు తెలిపారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల‌కు చెందినవారు 3,22,338 మంది, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన‌వారు 1,13,311 మంది, గిరిజ‌న ప్రాంతాల‌కు చెందిన‌వారు 33,796 మంది ఉన్న‌ట్లు వివ‌రించారు. మొత్తం 6,40,000 డోసుల‌ను సిద్ధంగా ఉంచామ‌న్నారు. వ్యాక్సిన్ వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో 2296, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 612, గిరిజ‌న ప్రాంతాల్లో 958 మొత్తం 3,866 పోలియో వ్యాక్సిన్ కేంద్రాల‌ను ఏర్పాటు ‌చేసిన‌ట్లు తెలిపారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 88, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 22, గిరిజ‌న ప్రాంతాల్లో 30 మొత్తం 140 మొబైల్ వ్యాక్సిన్ బృందాల‌ను సిద్ధం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మొబైల్ బృందాలు ప్ర‌త్యేక వాహ‌నాల ద్వారి వివిధ మార్గాల్లో ప్ర‌యాణించి వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. బ‌స్ స్టేష‌న్లు, రైల్వే స్టేష‌న్లు, విమానాశ్ర‌యాలు, మార్కెట్లు త‌దిత‌ర చోట్ల కూడా పోలియో వ్యాక్సిన్ పాయింట్లు ఏర్పాటు చేశామ‌న్నారు. 387 మంది సూప‌ర్‌వైజ‌ర్ల‌ను నియ‌మించామ‌న్నారు. ఆశా కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిపి 7470 మంది వైద్య‌, ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు వీరికి అద‌నంగా అంగ‌న్‌వాడీ, ఐకేపీ, డ్వాక్రా త‌దిత‌రాల‌కు సంబంధించిన సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచిన‌ట్లు వివ‌రించారు. ఫిబ్ర‌వ‌రి 1, రెండో తేదీల్లో ఇంటింటి స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని, వ్యాక్సిన్ వేయించుకోకుండా ఇంకా మిగిలిపోయిన చిన్నారుల‌కు ఈ రోజుల్లో ఇస్తామ‌న్నారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మూడో తేదీన కూడా ఇంటింటి స‌ర్వే ఉంటుంద‌న్నారు. పోలియో వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 31, ఫిబ్ర‌వ‌రి 1, 2 తేదీల్లో కోవిడ్ వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం లేద‌న్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ య‌థాత‌థంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రుగుతుందన్నారు. *కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోహ‌లు వ‌ద్దు: కోవిడ్ టీకా వంద శాతం సుర‌క్షిత‌మైంద‌ని.. ఎలాంటి అపోహ‌లకు తావు లేకుండా కోవిడ్ టీకా వేయించుకోవాల‌ని డీఎంహెచ్‌వో తెలిపారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌న్నారు. టీకా వేయించుకున్న త‌ర్వాత ఏమైనా జ్వ‌రం, చిన్న ద‌ద్దుర్లు వంటివి వ‌స్తే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఫిబ్ర‌వ‌రి అయిదో తేదీ నుంచి పోలీసు, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మునిసిప‌ల్ శాఖ‌ల‌కు చెందిన వారికి కోవిడ్ టీకా వేయ‌నున్న‌ట్లు డా. గౌరీశ్వ‌ర‌రావు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా ఇమ్యునైజేష‌న్ అధికారి డా. అరుణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-01-30 20:53:35

నైపుణ్యానికి పునాదులు ప్రయోగశాలలు..

పాఠశాల స్థాయిలో ప్రయోగశాలలు విద్యార్ధుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అన్నారు. శనివారం మహా విశాఖ నగరపాలక సంస్థ 45వ వార్డు గాంధీగ్రాం లోని జివిఎంసి ఉన్నత పాఠశాలలో కోరమండల్ ఫెర్టిలైజెర్స్ ఆర్ధిక సహాయంతో నిర్మించిన సైన్స్ ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోరమండల్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం వారు పాఠశాలలోని సైన్స్ ప్రయోగశాల నిర్మాణం కొరకు రూ.5.35లక్షలు మంజూరు చేసారని, ఆ నిధులతో సైన్స్ ప్రయోగశాలని నెలకొల్పమన్నారు. అందుకు కోరమండల్ ఫెర్టిలైజర్స్ మానవ వనరుల విభాగపు ప్రధాన అధికారి కె. రంగ కుమార్ మరియు ఫైనాన్స్ ప్రధాన అధికారి జె. మహేష్ వారికి అదనపు కమిషనర్ జివిఎంసి కమిషనర్ తరుపున అభినందనలు తెలిపారు.  ఈ సందర్భంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మానవ వనరుల విభాగపు ప్రధాన అధికారి  కె. రంగ కుమార్, ఫైనాన్స్ ప్రధాన అధికారి జె. మహేష్, జివిఎంసి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.        

Visakhapatnam

2021-01-30 20:46:09

ఫిబ్రవరి 1 నుంచి అంగన్ వాడీలు తెరుచుకోవాలి.

కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల కారణంగా జిల్లాలో గత మార్చి నెల నుండి  మూసివేసిన అంగన్ వాడీ కేంద్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల కనుగుణంగా 36 నుండి 72 నెలల వయసు చిన్నారులకు ప్రీ స్కూల్ విద్య, మద్యాహ్న భోజనం అందించేందుకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి  తిరిగి తెరవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి  ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.  ఉదయం 9 గం.ల  నుండి మద్యాహ్నం 1 గం. వరకూ కోవిడ్-19 భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటిస్తూ అంగన్ వాడీ కేంద్రాలను నిర్వహించాలని ఆమె సూచించారు.  అన్ని అంగన్వాడీ కేంద్రాల బయట లోపల ఆరోగ్యకరమైన పరిశుబ్రవాతావరణం, శానిటైజేషన్, మాస్కుల వినియోగం విధిగా పాటించాలని ఆదేశించారు.   అలాగే గర్భిణులు, బాలింతలు, 6 నుండి 36 నెలల వయసు చిన్నారులకు ప్రస్తుతం అమలు చేస్తున్న టేక్ హోమ్ రేషన్ విధానాన్ని యథావిధిగా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ కొనసాగించాలని తెలిపారు.

Kakinada

2021-01-30 20:41:59

5ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి..

 పోలియో నివార‌ణే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు నేడు జిల్లా వ్యాప్తంగా ప‌‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా వ్యాధి నిరోధ‌క టీకాల అధికారి డా.ఎం. నారాయ‌ణ పేర్కొన్నారు. ప‌ల్స్ పోలియో టీకాల పంపిణీకి ప‌క్కా ఏర్పాట్లు చేశామ‌ని.. తగిన సిబ్బందిని నియ‌మించామ‌ని వెల్ల‌డించారు. ఈ మేరకు శ‌నివారం జిల్లా వైద్యారోగ్య కార్యాల‌యంలో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు. 0-5 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన 2.41 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు మొత్తం 3 ల‌క్ష‌ల డోసులు సిద్ధం చేశామ‌ని చెప్పారు. కార్య‌క్రమాన్ని స్థానిక రాజీవ్ అర్బ‌న్ సెంట‌ర్లో క‌లెక్ట‌ర్ చేతుల మీదుగా లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నామ‌ని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద‌‌యం 7.00 గంట‌ల నుంచి సాయంత్రం 5.00 వ‌ర‌కు కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. మొద‌టి రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1650 బూత్‌ల ద్వారా టీకా పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. టీకాల పంపిణీలో మొత్తం 3300 బృందాలు పాల్గొంటున్నాయ‌‌ని ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నామ‌ని తెలిపారు. వాటిలో 83 మొబైల్‌, 32 ట్రాన్సిస్ట్ బృందాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల్లో త‌గిన ఏర్పాట్లు చేశామ‌ని, గిరిజ‌న ప్రాంతాల‌కు సిబ్బంది ఒక రోజు ముందుగానే చేరుకున్నార‌ని తెలిపారు. సుశిక్షితులైన‌ 6600 మంది సిబ్బంది సేవ‌ల్లో పాల్గొని పిల్ల‌ల‌కు టీకా అంద‌జేస్తార‌న్నారు. మొద‌టి రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బూత్‌ల‌లో సిబ్బంది టీకా పంపిణీ చేస్తార‌ని, ఒక వేళ ఎక్క‌డైనా పిల్ల‌లు ఉండిపోతే ఫిబ్ర‌వ‌రి 1, 2వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తార‌ని స్ప‌ష్టం చేశారు.  ప్ర‌యాణంలో ఉన్న‌ పిల్ల‌ల‌కు కూడా టీకా   బూత్‌ల వ‌ద్ద‌కు వ‌చ్చే పిల్ల‌ల‌కు టీకా వేయ‌టంతో పాటు.. బ‌స్సు, రైల్వే స్టేష‌న్‌ల‌లో ప్ర‌త్యేకంగా నియమించిన బృందాలు టీకాలు వేస్తాయ‌ని చెప్పారు. అలాగే ట్రాన్సిస్ట్ బృందాలు ప్ర‌యాణించే బ‌స్సుల్లో కూడా పిల్ల‌ల‌కు టీకాలు అంద‌జేస్తాయ‌ని వివ‌రించారు. జిల్లా న‌లుమూల‌లా వివిధ ప్రాంతాల్లో.. అలాగే జిల్లా స‌రిహ‌ద్దుల్లో కూడా ప్ర‌త్యేక బృందాల‌ను నియ‌మించామ‌ని.. ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా కార్య‌క్ర‌మాన్ని అంద‌రి స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. క‌రోనా దృష్ట్యా అన్ని జాగ్ర‌త్త‌లు క‌రోనా నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని డిప్యూటీ డీఎం&హెచ్‌వో డా.చామంతి పేర్కొన్నారు. విధుల్లో పాల్గొనే వైద్యులు, సిబ్బంది, ఆశా కార్య‌క‌ర్త‌లు విధిగా మాస్క్ ధ‌రించేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ టీకా పంపిణీ చేస్తామ‌ని, అలాగే ప‌రిస‌రాల‌ను ముందుగానే శానిటైజ్ చేయిస్తామ‌ని వివ‌రించారు. పిల్ల‌ల‌ను తీసుకొచ్చే త‌ల్లిదండ్ర‌లు కూడా విధిగా మాస్క్ ధ‌రించాల‌ని, పిల్ల‌ల‌కు కూడా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమె సూచించారు. స‌మావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్‌వో డా. టి.వి. బాల‌ముర‌ళీ కృష్ణ, ఇత‌ర వైద్య సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-30 20:15:10

నిండు జీవితానికి - రెండు చుక్కలు..

అపుడే పుట్టిన పిల్లల నుంచి 5సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పల్స్ పోలియో టీకా చుక్కలు ప్రతి సంవత్సరం వేయించుకుంటున్నాం, కాబట్టి అవసరం లేదని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన కోరారు.  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లో సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం (తేదీ 31-01-2021)న జరుగుతుందని  అన్నారు. భారత దేశంలో ఆఖరి పోలియో కేసు జనవరి 2011 లోను, మన రాష్ట్రంలో జులై 2008 లోను, విశాఖ జిల్లాలో జనవరి 2007 లోను నమోదు అయ్యాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత దేశాన్ని మార్చి 13, 2014 న పోలియో రహిత దేశం గా ప్రకటించిందని అన్నారు. కానీ మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లలో కేసులు నమోదు అయినందున, తప్పనిసరిగా వేసుకోవాలని ఇందులో భాగంగా జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గలిగిన 4,81,517 మంది చిన్నారులకు ఓరల్ పోలియో వాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3786 పోలియో కేంద్రాలను,123 ట్రాన్సిట్ కేంద్రాలను,168 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్నారు. 15,144  మంది వ్యాక్సినేటర్ (Vaccinator) లను,  379 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 532 హై రిస్క్ (High Risk) ప్రాంతాలు అనగా మురికి వాడలు,సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలు, మత్స్యకారుల ఆవాసాలు, ప్రయాణ సౌకర్యం లేని ప్రాంతాల (Slums, Nomads, Brick klins, Construction Areas, Fisherman Community, Hard to Reach Areas) ను గుర్తించి వాటిని  సూక్ష్మ ప్రణాళిక లో చేర్చి,  ఆ ప్రాంతాల్లోని అర్హులైన 15,746 చిన్నారులకు పోలియో వాక్సిన్ వేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.  రేపు 31-01-2021(ఆదివారం) నాడు నిర్దేశిత పోలియో కేంద్రాలలోనూ, తేదీ 01/02/2021 నుంచి 03/02/2021 వరకు (సోమ, మంగళ, బుధవారాలలో)  గృహ సందర్శనలో భాగం గా పోలియో బూత్ లలో వ్యాక్సిన్  వేయని చిన్నారులను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు. ఈ వ్యాక్సిన్ 31-01-2021 (ఆదివారం) నాడు  అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్ లలో, అన్ని పంచాయతీ కేంద్రాలలోను  మరియు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలోను వేస్తారని చెప్పారు. కావున అర్హులైన చిన్నారులందరికీ  ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వేయనున్న ఈ చుక్కలు అదనపు డోసు మాత్రమేనని, ఇదివరకే వ్యాక్సిన్ తీసుకొన్నప్పటికీ మరల పల్స్ పోలియో రోజున ఈ వ్యాక్సిన్ ఇప్పించవలసిందిగా తల్లిదండ్రులను కోరారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశాల మేరకు స్త్రీ,శిశు సంక్షేమ, విద్యా, రెవిన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, గిరిజన సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖల సమన్వయంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. 

Visakhapatnam

2021-01-30 19:54:43

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ బరిలోకి దిగి..

ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నెలకు లక్షల్లో జీతం..పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం..కారు బంగ్లా, మంచి హోదా,ఆస్తి అంతస్తు..స్వదేశంలోగానీ, విదేశాల్లోగానీ ఉద్యోగం చేసేంత నెట్వర్క్, టేలంట్..కానీ ఇవేమీ అతగాడికి నచ్చలేదు. సుదీర్ఘ కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసి దేశ విదేశాలు తిరిగి తిరిగి ఆ కార్పోరేట్ ఉద్యోగాన్నిఏమీ కాకుండా వదిలేసి  ప్రజల సేవచేయడానికి గ్రామానికి వచ్చేశాడు.. ఆయన పేరే పందిరి సత్యన్నారాయణ, ఇతగాడిని అంతా చిన్ననాటి నుంచి సత్యంనాయుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈయన తండ్రి పందిరి అప్పారావు 30ఏళ్లు పాతూరుగా పిలబడే క్రిష్ణదేవీపేట గ్రామానికి  సర్పంచ్ గా సేవలు అందించారు. పుట్టిన గ్రామానికి తనవంతు సహకారం అందించాలని, గ్రామాన్ని జిల్లాలోనే  ఉత్తమ గ్రామంగా అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సర్పంచ్ గా మారాలనుకున్నాడు. క్రిష్ణదేవీపేట గ్రామ పంచాయతీ బరిలో నిలుచున్నాడు. విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి మన్యం పితూరీ నడిపిన పోరాటాల పురిటిగడ్డ)లో పంచాయతీ పోరుకి సిద్దమయ్యాడు. యువత మొత్తం ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కే మద్దతు పలుకుతున్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్యాచరణ కూడా తయారు చేసి ఒక క్రమబద్ధంగా గ్రామాన్ని అభివ్రుద్ధి చేయడాని పూనుకున్నాడు. అసలే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశాడేమో...గ్రామంలోని సమస్యలన్నింటినీ ఫోటోలు, ప్రాంతాలతో సహా కంప్యూటరీకరణ చేసిమరీ మొత్తం అభివ్రుద్ధికి రూట్ మేప్ సిద్ధం చేసుకున్నాడు. గ్రామంలోని అన్ని వర్గాలకు అనుగుణంగా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి స్పెషల్ గా ఒక విధి విధానాన్ని తయారు చేశాడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఇంట్లోనే రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, జెరాక్సు మిషన్లు పెట్టి ప్రభుత్వ పథకాలకు స్థానికులు దరఖాస్తు చేసుకునే ప్రతీ కార్యక్రమానికి తనవంతుగా సహాయం అందిస్తున్నాడు. దగ్గరుండి అన్ని పథకాలకు దరఖాస్తులు చేయిస్తూ గ్రామస్తులకు సహాయ పడుతున్నాడు. రేషన్ కార్డులు, వితంతు పించన్లు, హౌసింగ్, జగనన్న విద్యాదీవెన ఒకటేంటి అన్ని పథకాలను అవగాహలేని వారికి దగ్గరుండి మరీ దరఖాస్తు చేయిస్తున్నాడు. ఒక వేళ మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినా తానే దగ్గరుండి మరీ వారిని తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో తనవంతుగా చేయూతనిస్తున్నాడు. గ్రామంలో వాలంటీర్లు ఉన్నప్పటికీ వారికంటే ఎక్కువగా సేవలదించడంలో మందుంటున్నాడు సత్యం నాయుడు. ఇక పోతే ఈయన సోదరుడు పందిరి వెంకటరమణ, ఈయనను అంతా ఆర్ఎంపీ బుజ్జి అంటారు. ఈయన కూడా తన చదువుని పక్కనపెట్టి గ్రామస్తులకు సేవ చేయడానిక ప్రాధమిక వైద్యం(ఫ్టస్ట్ ఎయిడ్ సర్వీస్) చేస్తూ గ్రామంలో ఎవరికి ఏ వైద్య అవసరం వచ్చినా తక్షణ సహాయం చేస్తుంటాడు. గ్రామంలో ఎవరికి జర్వం వచ్చినా, దగ్గొచ్చినా తక్షణమే గుర్తొచ్చే పేరే ఆర్ఎంపీ బుజ్జి అంతగా ప్రాచుర్యం వచ్చింది ఈయన చేసే వైద్య సహాయంతో. ప్రాధమిక వైద్యం చేస్తూ, తనపరిధిలో తాను కూడా సేవలందిస్తూ వస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఒకసారి కూరగాయలు, మరోసారి మాస్కులు, ఇంకోసారి సబ్బులు పంపిణీ  ఇలా అన్నిరకాలుగా గ్రామస్తులకు సహాయం చేస్తూ వస్తున్నారు. వీరి కుటుంబం మొత్తం ప్రజాసేవలోనే ఉంటూ గ్రామస్తుల నోట్లో నానుతూ ఉన్నారు. ఒక కుటుంబం మొత్తం ప్రజాసేవకు పూనుకోవడం విశాఖజిల్లాలోనే ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. ఎంత చదువు చదువుకున్నా లక్షల జీతం కోసం అంతా అర్రులు చాస్తున్న ఈ రోజుల్లో అదే లక్షల రూపాయల జీతాలన్ని, మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని, గ్రామాభివ్రుద్ధికోసం పంచాయతీ సర్పంచ్ గా బరిలో నిలబడ్డ ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అన్ని వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తోంది, ముఖ్యంగా యువత నుంచి ఆ మద్దతు మరింతగా వుంది...!

క్రిష్ణదేవిపేట

2021-01-30 19:42:36

ఆచార్య గంగారావు పదవీ విరమణ..

 ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మశీ కళాశాల ఆచార్యులు బట్టు గంగారావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఎంతో బాగా గడవాలని ఏయూ వీసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన విరమణ సందర్భంగా తన చాంబర్ లో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం వీసి మాట్లాడుతూ, ఫార్మశీ ఆచార్యునిగా ఉన్నసమయంలో యూనివర్శిటీకి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఒకరంగా అలాంటి ఆచార్యులు ఉద్యోగ విరమణ చేయడం బాధకలిగించినా విధినిర్వహణలో ఏ ఉద్యోగికైనా అది తప్పదన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య రాజేంద్ర ప్రసాద్‌, ‌పాలక మండలి సభ్యురాలు ఆచార్య క్రిష్ణమంజరి పవార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2021-01-30 19:31:40

అహింసామూర్తికి ఘన నివాళి..

జాతిపిత, అహింసామూర్తి మహాత్మగాంధీ వర్ధంతిని శనివారం ఉదయం ఏయూలో నిర్వహించారు. ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మగాంధీ విగ్రహానికి వర్సిటీ అధికారులు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఐక్యత, సమగ్రత, సమిష్టితత్వం గాంధీజీ నుంచి నేర్చుకోవాలన్నారు. దేశాన్ని ఏకం చేస్తూ స్వాతంత్య్ర పోరాటం జరిపిన విధానం నిరుపమానమన్నారు. ప్రపంచానికి సత్యం, అహింసల శక్తిని చాటిన మహనీయునిగా మహాత్మగాంధీ నిలుస్తారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య ఎస్‌.‌సుమిత్ర, ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్‌, ‌పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, డీన్‌లు సి.హెచ్‌ ‌పాండు రంగా రెడ్డి, టి.షారోన్‌ ‌రాజు, ప్రవేశాల సంచాలకులు ఆచార్య నాయుడు, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సమన్వయకర్త ఆచార్య ఎస్‌.‌హరనాథ్‌, ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ఆర్‌.‌శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-30 19:18:39

ఏయూతో వైఎంసిఏ ఎంఓయూ..

ఆంధ్రవిశ్వవిద్యాలయంతో వైఎంసిఏ అవగాహన ఒప్పందం చేసుకుంది. శనివారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌వైఎంసిఏ అద్యక్షులు మేథ్యూ పీటర్‌లు సంతకాలు చేశారు. అనంతరం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. 20కి పైగా దేశాలకు చెందిన విద్యార్థులకు వర్సిటీలో విద్యను అభ్యశించడం జరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా వీరికి అవసరమైన వసతి కల్పనకు వైఎంసిఏ ముందుకు వచ్చిందన్నారు. విద్యార్థులకు పూర్తిస్తాయిలో వసతులను కల్పిస్తుందన్నారు.వర్సిటీలో పెరుగుతున్న విదేశీ విద్యార్థులకు అనుగుణంగా నూతన హాస్టల్స్ ‌నిర్మాణం జరుపుతామన్నారు.  వైఎంసిఏ అంతర్జాతీయ సభ్యులు రోలండ్‌ ‌విలియమ్స్ ‌మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం రెండు సంస్థలకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు.  ప్రస్తుతం వర్సిటీలో చేరిన 60 మంది విదేశీ విద్యార్థులకు వసతి కల్పించే దిశగా 30 గదులను సేవాభావంతో నామమాత్రపు రుసుముతో అందిస్తున్నామన్నారు.విద్యార్థులకు వసతి, జిమ్‌, ‌వైఫై సదుపాయం, టీవీ రూం, కిచెన్‌, ‌వాషింగ్‌ ‌మెషీన్స్, ‌సెక్యూరిటీ పర్యవేక్షణ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ ఆచార్య ఇ.ఎన్‌ ‌ధనుంజయ రావు, వైఎంసిఏ డైరక్టర్లు ఇజ్రాయిల్‌, ‌ప్రకాష్‌ ‌బెన్హా, అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్స్ ‌చీఫ్‌ ‌వార్డెన్‌ ఆచార్య పాల్‌ ‌డగ్లస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Andhra University

2021-01-30 19:17:22