1 ENS Live Breaking News

వివక్షతే దేశాభివ్రుద్ధికి ఆటంకం..

వివక్షత, వేర్పాటు విధానాలు అభివృద్ధికి నిరోధకాలుగా నిలుస్తాయని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. శనివారం ఉదయం ఏయూ సెంటర్‌ ‌ఫర్‌ ‌సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ ఇం‌క్లూజివ్‌ ‌పాలసీ(సిఎస్‌ఎస్‌ఇఐపి) నిర్వహించిన వెబినార్‌ ‘ ‌రిలిజియస్‌ ‌మైనారిటీస్‌-ఐడెంటిటీ, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అం‌డ్‌ ఇం‌క్లూజన్‌’‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వివక్షతను ఏ స్థాయిలోను ఉపేక్షించడం సరికాదన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతీయత ఆధారంగా వ్యక్తులను వేరుచేయడం సమర్ధనీయం కాదని, ఇది దేశ అభివృద్ధికి విఘాతంగా మారుతుందన్నారు. సమాజంలో అందరినీ మిళితం చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమన్నారు. న్యాయవాది జాహా ఆరా మాట్లాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరిస్తూ పూర్తిస్థాయిలో సమానత్వాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్రం సంచాలకులు ఆచార్య పి.సుబ్బారావు తదితరులు ప్రసంగించారు.

Andhra University

2021-01-30 19:15:48

కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్..

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిర్యాధులు స్వీకరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ రేయింబవళ్ళు పని చేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించామన్నారు. కంట్రోల్ రూమ్ లో  సిబ్బంది మూడు షిప్టులలో పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పిర్యాధులను 08942 240605, 08942 240606 ఫోన్ నంబర్లకు తెలియజేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్ లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పి.జగ్గారావు (8790446164), కె.భరద్వాజ చౌదరి (9550311645)., మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎస్.రమేష్ (9100314196), జె.గోపా (9440968844)., రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎన్.అఖిల్ (7989788135), ఎన్.లోహిత్ కుమార్ (8341569944) విధుల్లో ఉంటారని ఆయన తెలిపారు. ప్రజల నుండి వచ్చే పిర్యాధులను స్వీకరించి వాటిని రిజిస్టర్ లో నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించినట్లు ఆయన చెప్పారు. పిర్యాధుల తక్షణ పరిష్కారానికి సంబంధిత తహశీల్దార్, ఎంపిడిఓ, ఎం.సి.సి , ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాలకు సమాచారం అందించాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు. 

శ్రీకాకుళం

2021-01-30 19:14:06

పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలి..

సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 31న జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ అది వారం జిల్లాలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి 1,616 బూత్ లను ఏర్పాటు చేసామని చెప్పారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 968, పట్టణ ప్రాంతాల్లో 119, గిరిజన ప్రాంతాల్లో 529 ఏర్పాటు చేసామని తెలిపారు. 7,218 మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు.  ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి చిన్నారులు పల్స్ పోలియో చుక్కలు వేసుకున్నది లేనిది పరిశీలిస్తారని తెలిపారు. జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులు 2,33,683 మంది ఉన్నారని చెప్పారు. మూడు లక్షల డోస్ లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షణకు 158 సూపర్ వైజర్లు నియమించామని చెప్పారు. సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్ధలు, మత్స్యకార ప్రాంతాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయుటకు  83 మొబైల్ టీమ్ లు, రైల్వే స్టేషన్లు, బస్సుస్టేషన్లు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, సంతలు, జాతరలు తదితర ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం 50 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసామని వివరించారు. జిల్లాలో 275 హై రిస్క్ ప్రాంతాలు ఉన్నాయని, అచ్చట 20,608 కుటుంబాలు ఉండగా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు 7,344 మంది ఉన్నారని చెప్పారు. చిన్నారులను తీసుకు వచ్చే తల్లిదండ్రులు కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసారు. పోలియో చుక్కల కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని డి.ఎం.హెచ్.ఓ చెప్పారు.         అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ పోలియో చుక్కలను వేయించడంలో తల్లిదండ్రులు అశ్రద్ధ వహించరాదన్నారు. ఇప్పటికి పోలియో భయం ఉందని పేర్కొంటూ 2020 సంవత్సరంలో ప్రక్క దేశాలైన పాకిస్తాన్ లో 84, ఆప్ఘానిస్తాన్ లో 56 కేసులు నమోదు అయ్యాయని, వాటి ప్రభావం ఉండవచ్చని తెలిపారు. పోలియో ద్వారా దివ్యాంగులుగా మారడం వలన ఇతరులపై ఆధారపడే అవకాశం రావచ్చని, అటువంటి పరిస్థితిని చిన్నారులకు తల్లిదండ్రులుగా కల్పించరాదని కోరారు. జిల్లాలో నువ్వల రేవులో 2004లో చివరి పోలియో కేసు నమోదు కాగా, దేశంలో 2011లో పశ్చిమ బెంగాల్ లో మత్స్యకార ప్రాంతంలో చివరి పోలియో కేసు నమోదు అయిందన్నారు. 2014 సంవత్సరం నుండి దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారు చిన్నారులను పోలియో చుక్కలకు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. వాలంటీర్లు పోలియో కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షణ చేసి ఏ ఒక్కరూ తప్పిపోకుండ చూడాలని ఆయన కోరారు.         ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, పి.ఓ డిటి డా.జె.కృష్ణ మోహన్, రాష్ట్రీయ బాల స్వాస్త్యా కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-01-30 17:54:17

స్నేహపూరిత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు..

గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్. (పూ.అ.భా) డి. మార్కండే యులు పేర్కొ న్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మం దిరంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ సెంథిల్ కుమార్ తో కలిసి జిల్లాలోని పోలీసు సబ్ డివిజన్ డి.ఎస్.పి లతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభి వృద్ధి) వి. వీర బ్రహ్మం, మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజా, చిత్తూరు తిరుపతి రేణుక, కనక నరసారెడ్డి, చిత్తూరు సబ్ డివిజన్ సుధాకర్ రెడ్డి, పలమనేర్ సబ్ డివిజన్ గంగయ్య, మదనపల్లి రవి మనోహర్ ఆచారి, పుత్తూరు యశ్వంత్,డి పి ఓ దశరధ రా మి రెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి లు పాల్గొన్నారు... ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్ని కల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈనెల 29వ తేదీ నుండి మొదటి విడతలో చిత్తూరు డివిజన్ లో, రెండవ,మూడవ విడత లలో మదనపల్లి డివిజన్, నాల్గవ విడత లో తిరుపతి డివిజన్ లో ఎన్నికలు జరుగు తాయని తెలి పారు.. చిత్తూరు డివిజన్ లోని ఇరవై మండలాలకు ఈనెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు... మదనపల్లి డివిజన్ రెండవ విడత లో బి.కొత్తకోట,చిన్న గొట్టి గల్లు, గుర్రంకొండ, కె.వి. పల్లి, కలకడ, కలికిరి, కురబల కోట,మదనపల్లి, ములకల చెరువు, నిమ్మనపల్లి,పి.టి. యం,పెద్ద మండ్యం, పీలేరు, రామసముద్రం తంబళ్లపల్లి, వాల్మీకిపురం, ఎర్ర వారి పాలెం మొత్తం 17 మండలా ల్లో... మూడవ విడతలో బైరెడ్డిపల్లి, చౌడే పల్లి, గంగవరం, గుడిపల్లి కుప్పం, పలమనేరు, పెద్ద పంజాణి, పుంగనూరు, రామకుప్పం, రొంపిచర్ల, శాంతిపురం,సదుం, సోమల వి.కోట మొత్తం 14 మండ లాల్లో జరుగునని, నాలుగో విడత లో తిరుపతి డివిజన్ కు సంబంధించి 14 మండ లాలలో ఎన్నికలు నిర్వహణ జరగనున్నాయని తెలిపారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ లతో సమన్వయం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని చిత్తూరు డివిజన్ సంబంధించి ఈ నెల 29 నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందుగా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, నామినేషన్ వేసేందుకు అభ్యర్థి తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మండల స్థాయి అధికారుల తో సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Chittoor

2021-01-28 18:29:42

ఆలయాలకు భద్రత కట్టుదిట్టం..

విశాఖజిల్లాలోని ఆలయాలన్నింటికీ భద్రత కట్టుదిట్టం చేసినట్టు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి తెలియజేశారు. విశాఖలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆలయాల్లో సిసికెమెరాలు నిఘా పెంచామన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఆలయాలకు భద్రత పెంచామన్నారు. ప్రతీ గ్రామంలోని సచివాలయ మహిళా పోలీసులు కూడా గ్రామంలో ఆలయాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. వారితోపాటు, ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నామన్నారు. కొందరు కావాలనే దుశ్చర్చలకు పాల్పడకుండా గ్రామస్తులు ఏకమైతే అవాంఛనీయ సంఘటనల నుంచి రక్షణ దొరుకుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నిగ్రామాల్లోని ఆలయాలకు సంబంధించిన సంరక్షణకు సంబంధించి అటు పోలీసుశాఖ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని వివరించారు. గ్రామాల్లో ప్రజలు అన్నివిషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేసమయంలో గ్రామాల్లోని ఆలయాలు, దేవాలయాలకు సంబంధించిన రక్షణ విషయంలో ప్రభుత్వానికి సహకారం అందించడం ద్వారా ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారముంటుందన్నారు. గ్రామాల్లో ఆలయాలను ప్రజలు సంరక్షించుకోవడానికి స్వచ్చందంగా ముందుకు రావాలని  అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి సూచిస్తున్నారు.

Visakhapatnam

2021-01-28 18:21:10

పంచాయతీ ఎన్నికల్లో ఆర్.ఓల పాత్ర కీలకం..

పంచాయతీ సాదారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, కావున ప్రతీ రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రవర్తన నియామావళిని క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆర్.ఓలకు సూచించారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ సాదారణ ఎన్నికలపై ఆర్.ఓలకు, ఏ.ఆర్.ఓలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే కీలకపాత్ర కలెక్టర్ అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలవుతుందని, కావున జిల్లాలోని అన్ని పంచాయతీలలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించారు. అలాగే ప్రతీ గ్రామ పంచాయతీలో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సంతకం చేసిన తదుపరే ఎన్నికల నోటిఫికేషన్  జారీచేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకు వచ్చే సందేహాలను ఆర్.ఓలే నివృత్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ ఒక్కరికీ హేండ్ బుక్ పంపిణీ చేయడం జరిగిందని, వీటితో పాటు శిక్షణ కూడా ఇస్తున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ఆర్.ఓలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని  ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల గుర్తులు, ఇండిపెండింట్లు, ఉండబోవని స్పష్టం చేసారు. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన అనంతరం తుదిజాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో, ఆయా పేర్లులోని అక్షర క్రమాన్ని అనుసరించి గుర్తులు ( సింబల్స్ ) కేటాయించాలని సూచించారు. ఎన్నికలలో సర్పంచ్ పోటీలలో పాల్గొనే యస్.సి., యస్.టి, బి.సి అభ్యర్ధులు రూ.1500/-లు, ఇతరులు రూ.1000/-లు, అలాగే వార్డు మెంబరుగా పోటీచేసే యస్.సి., యస్.టి, బి.సి అభ్యర్ధులు రూ.1000/-లు, ఇతరులు రూ.500/-లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. 10వేలకు పైబడిన జనాభా ఉన్న ప్రాంతాలలో సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్ధులు రూ.2.50లక్షలు, వార్డు మెంబర్లయితే రూ.50 వేలు, అదేవిధంగా 10వేలకు తక్కువ జనాభా గల ప్రాంతాలలో సర్పంచ్ కు రూ.1.50 లక్షలు , వార్డు మెంబర్లయితే రూ.30వేల వరకు ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో పోటీచేసేందుకు నిషేధమని, అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన నాటికి ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగరాదని వివరించారు. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి సంబంధిత ఫారాలు తప్పనిసరిగా పూర్తిచేసిన పిదపే ఏకగ్రీవంగా ఆమోదించాలని అన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆర్.ఓలు అడిగిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేసారు. తొలుత శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు ఆర్.ఓలకు, ఏ.ఆర్.ఓలకు పంచాయతీ సాదారణ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.         ఈ శిక్షణ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ప్రత్యేక ఉపకలెక్టర్ బి.శాంతి, విజిలెన్స్ అధికారి వెంకటరమణ, డివిజనల్ పంచాయతీ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-01-28 18:10:10

సీఎం వైఎస్ జగన్ ద్రుష్టికి జర్నలిస్టు సమస్యలు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళతానని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యన్నారాయణ పేర్కొన్నారు. గురువారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ, అర్హులైన  జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వున్న సమస్యల పరిష్కారానికి కూడా క్రుషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన వినతిని,  ప్రస్తావించిన సమస్యలను ఎంపీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందని అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించే విషయంలో తోడుంటానని బరోసా ఇచ్చారు.  ఈ సందర్భంగా  అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ, వర్కింగ్‌ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పెద్దలంతా ఎంతో సముఖుంగా ఉన్నారని ఎంవీవీకి వివరించారు. ముఖ్యంగా జర్నలిస్టులకు గృహ వసతి, భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పద్మజ, ప్రభాకర్, సూర్య, మాధవి, జుబేర్, దేవిశ్రీ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-28 12:08:29

ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి..

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని కోర్టుహాల్‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌న్న‌ద్ధ‌త‌పై ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్‌పీ షేముషి బాజ్‌పాయ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి త‌దిత‌రుల‌తో క‌లిసి అధికారుల‌తో క‌లెక్ట‌ర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సెన్సిటివ్‌, హైప‌ర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని పోలీసు, రెవెన్యూ అధికారుల‌కు సూచించారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో అధికారులు ప‌నిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లకు సంబంధించి వివిధ ప‌నుల నిర్వ‌హ‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేకంగా అధికారుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలిపారు. ఈ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సి ఉంటుంద‌న్నారు. జిల్లా స్థాయిలో ప్ర‌త్యేకంగా కంట్రోల్‌రూంను ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఫిర్యాదులను స‌త్వ‌రం ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూం, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి బాధ్య‌త‌ల‌ను బీసీ కార్పొరేష‌న్ ఈడీకి అప్పగించిన‌ట్లు వెల్ల‌డించారు. మైక్రో అబ్జ‌ర్వ‌ర్స్, వెబ్ కాస్టింగ్‌, వీడియోగ్ర‌ఫీ అంశాల‌ను డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ చూస్తార‌న్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి అందించే బాధ్య‌త‌ను జిల్లా పంచాయ‌తీ అధికారికి అప్ప‌గించిన‌ట్లు వివ‌రించారు. బ్యాలెట్ పెట్టెల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను జెడ్‌పీ సీఈవోకు, ఎన్నిక‌ల వ్య‌యం అంశాల బాధ్య‌త‌ను జిల్లా ఆడిట్ అధికారికి కేటాయించిన‌ట్లు వివ‌రించారు. సిబ్బంది శిక్ష‌ణ అంశాల బాధ్య‌త‌ను మెప్మా ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌కు అప్ప‌గించామ‌న్నారు. డీపీవో, సీపీవో కార్యాల‌యాల సిబ్బందికి బ్యాలెట్ పేప‌ర్ల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించామ‌న్నారు. డీఈవో, డీఐవో, డీటీవో, డీఎల్‌డీవోలు త‌దిత‌ర అధికారుల‌కు కూడా ప్ర‌త్యేక విధులు కేటాయించిన‌ట్లు తెలిపారు. ఇలా ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా ద‌శ‌ల వారీగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.      రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వీసీ: పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గడ్డ ర‌మేశ్‌కుమార్ వెల‌గ‌పూడి నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, రాజమండ్రి అర్బన్ ఎస్పి షేమూషి బాజ్ పాయ్,  జేసీ (డీ) కీర్తి చేకూరి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌త పరంగా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్‌.. ఎస్ఈసీకి తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నామ‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం క‌ల‌గ‌కుండా చూసేందుకు బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ తెలిపారు. ఓ వైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేందుకు.. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ఆటంకం లేకుండా చూసేందుకు సిబ్బందిని మోహ‌రిస్తామ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో అడిషనల్ ఎస్పి కరణం కుమార్, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, పెద్దాపురం ఆర్‌డీవో ఎస్‌.మ‌ల్లిబాబు , సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు వివిధ విభాగాల అధికారులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-01-27 21:57:03

పంచాయతీ ఎన్నికలకు సిద్దం కావాలి..

చిత్తూరు జిల్లాలో ఈ నెల 29 నుంచి మొదటి విడత గ్రామ సర్పంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందుకు అధికారులు అందరూ సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మార్కండేయులు అన్నారు. ఈ నెల 29 న స్టేజ్ 1ఎన్నికల అధికారులుకు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో బుధవారం సాయంత్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రారంభమవుతుందని విడుదల చేసే సమయంలో గ్రామస్థుల నుంచి సంతకాలు తీసుకోవాలని, అదేవిధంగా ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ లు స్వీకరించాలన్నారు.అనంతరం స్క్రూటినీ పకడ్బందీగా నిర్వహించాలని ఆ తర్వాత ఎవరైనా ఉపసంహరణలు కార్యక్రమం పూర్తి అయిన అనంతరం రంగంలో ఉన్న వారి జాబితాను ప్రదర్శించాలని అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మేరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తూ వారి గుర్తులను తెలిసేవిధంగా డిస్ప్లే చేయడంతోపాటు అభ్యర్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎన్నికల కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి ఇ నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా చేతిలో జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలలో ఏకగ్రీవం జరిగిన మండలాలలో విధులు నిర్వహించిన రిటర్నింగ్ అధికారులకు ఈ ఎన్నికలలో ఇటువంటివి విధులు ఆలాట్ చేయకూడదని ఆయన అన్నారు. జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిష్పక్షపాతంగా ఇలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి దశరధ రాంరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు డివిజన్ పరిధిలో 98 మంది స్టేజ్ 1 అధికారులు కావాల్సి ఉండగా 115 మంది నీ ఎంపిక చేశారని ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయిందని ఓటర్ లిస్టు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా దీనికి సంబంధించి జోనల్ ఆఫీసర్ లను అబ్జర్వర్లును వెబ్ కాస్టింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతో పాటు పోలింగ్ స్టేషన్లను మొదట చూసుకోవాలని కోరారు. కొన్ని పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలంటే సంఖ్య పెంచకుండా స్టేజి 2 అధికారులైనఎం డి ఓ తాసిల్దార్ లకు సమాచారం ఇచ్చి మార్చుకోవాలన్నారు ఈ సమాచారాన్ని డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎన్నికల అధికారికి జిల్లా ఎన్నికల అధికారి కూడా సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మార్కండేయులు, జడ్పీ సీఈవో ప్రభాకర రెడ్డి ,డి పి ఓ దశరథ రామి రెడ్డి,ఆర్ డి ఓ రేణుక ,డీఎల్ పి ఓ రూప వాణి, ఎన్నికలకు సంబంధించి న స్టేజి 1 అధికారులు పాల్గొన్నారు

Chittoor

2021-01-27 21:55:11

పిల్లలందరికీ పోలీయో చక్కులు వేయాలి..

విశాఖజిల్లాలోని పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2  పి. అరుణ్ బాబు ఆదేశించారు.  బుధవారం తన చాంబర్ లో పోలియో చుక్కలు కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  31వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.  జిల్లాలో 3 వేల 786 పోలింగ్ కేంద్రాలలో 4 లక్షల 81 వేల 517 మంది 0-5 వయసు గల పిల్లలు ఉన్నట్లు చెప్పారు. పోలియో చుక్కలు వేయుటకు సంబంధిత సిబ్బందిన సిద్దం చేసుకొని సిద్దంగా ఉండాలన్నారు.  పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయాలన్నారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.యస్. సూర్యనారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. యస్. జీవన్ రాణి, జివియంసి సి.ఎం.ఓ. డా. కె. శాస్త్రి, జిల్లా వైద్య విధాన సమన్వయ కర్త డా. లక్ష్మణరావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డా. జి. భవాణి, యూనిసెఫ్ డా. విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2021-01-27 21:34:48

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహకాలు..

ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం భారీ పారితోషికాలు ప్రకటించింద‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెం.34 విడుద‌ల చేసింద‌ని, గ‌తంలో కంటే ఆర్థిక న‌జ‌రానాలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కొన్నారు. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలలో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగితే రూ.5 లక్షలు, 2001 నుంచి 5000 లోపు జనాభా ఉన్న పంచాయతీలలో ఏకగ్రీవం జరిగితే రూ.10 లక్షలు, 5001 నుంచి 10 వేల వ‌ర‌కు జనాభా ఉన్న పంచాయతీలలో ఏకగ్రీవం జరిగితే రూ.15 లక్షలు, 10 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలలో ఏకగ్రీవం జరిగితే రూ.20 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం పారితోషికంగా చెల్లిస్తుంద‌ని వివ‌రించారు.  గ్రామాల్లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు..  ప్ర‌జ‌ల్లో ఐక్యతను పెంపొందించేందుకు ప్ర‌‌భుత్వం ఈ చ‌ర్య‌లు  తీసుకుందన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు ప్రకటించిందని పేర్కొన్నారు.

విజయనగరం

2021-01-27 21:32:09

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం ఉన్నాం..

విజయనగరం జిల్లాలో  గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం  సిద్దంగా వుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెలిపారు.  బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లతో స్థానిక సంస్థ ఎన్నికలపై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.  విజయనగరం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమగు మేన్ పవర్, మెటీరియల్ సిద్దంగా వుందని తెలిపారు.  జిల్లాలో స్థానిక ఎన్నిలకలను మూడు విడతలలో నిర్వహిస్తే బాగుంటుందని ఎన్నికల కమిషనర్ ను కోరారు.  విజయనగరం డివిజన్ లో 19 మండలాలు వున్నాయని,ఈ మండలాలలో రెండు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కోరగా  ప్రతిపాదనలు పంపాలని ఎన్నికల కమిషనర్ తెలిపారు.  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. రాజకుమారి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ప్రణాళికలను  తయారు చేస్తున్నట్లు తెలిపారు.    ఈ వీడియో కాన్ఫెరెన్సులో  సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, సబ్ కలెక్టర్ విథేఖర్, సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, ఆర్.డి.ఓ. భవానీశంకర్, డిపిఓ సునీల్ రాజకుమార్, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-27 21:30:19

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన‌ త‌గిన ఏర్పాట్లు చేసుకొని ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధికారుల‌ను ఆదేశించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన ఏర్పాట్లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించేందుకు.. సూచ‌న‌లు చేసేందుకు జిల్లాలోని అన్ని మండ‌లాల ఎంపీడీవోలు, ఎమ్మార్వోల‌తో ఆయ‌న బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప‌లు సూచ‌న‌లు, ఎన్నిక‌ల షెడ్యూల్ తదిత‌ర అంశాల‌పై మార్గ‌‌నిర్ధేశ‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఎన్నిక‌ల షెడ్యూల్, తేదీల‌ను ప్ర‌కటించ‌క ముందే పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించి అక్క‌డ ప‌రిస్థితుల‌ను స‌రిచేసుకోవాల‌ని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా స‌‌మ‌స్య‌లుంటే గుర్తించి ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. స‌మ‌స్యాత్మ‌క‌, అతి స‌మ‌స్యాత్మ‌క‌, సున్నిత‌, అతి  సున్నిత కేంద్రాల‌ను గుర్తించి త్వ‌రిత‌గ‌తిన నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బేరీజు వేసి తాజాగా కేంద్రాల‌ను గుర్తించాల‌ని, తాజా నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. క‌మిష‌న‌ర్‌తో జ‌రిగిన మీటింగ్‌లో జిల్లాకు సంబంధించి మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్ప‌గా అంగీకారం తెలిపార‌ని.. కావున మొదటి ద‌శ‌లో పార్వ‌తీపురం, రెండు మూడు ద‌శ‌ల్లో చీపురుప‌ల్లి, ఎస్‌.కోట డివిజ‌న్‌లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని చెప్పారు. జిల్లా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువడే లోగా అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. ఈ లోగా పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ మెటీరియ‌ల్ ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. కేంద్రాల్లో క‌నీస వ‌స‌తులైన తాగునీరు, లైట్లు, బ‌ల్ల‌లు, కుర్చీలు త‌దిత‌ర ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల సిబ్బంది త‌ర‌లింపు, ఎన్నిక‌ల  సామ‌గ్రి త‌ర‌లింపు కేంద్రాల‌ను, రూట్ మ్యాప్‌ల‌ను  సిద్ధం చేసుకొని ఉండాల‌ని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులను ముందుగానే ప‌రిశీలించుకోవాల‌ని, ఎమైనా మ‌ర‌మ్మ‌తులు ఉంటే చేయించాల‌ని చెప్పారు. ముందుగా డెమో నిర్వ‌హించి బిగ్‌, మీడియం, స్మాల్ బాక్సుల్లో ఎన్ని ఓట్లు ప‌డ‌తాయో స‌రిచూసుకోవాల‌ని సూచించారు. శాంతి భ‌ద్ర‌త స‌మ‌స్యలు త‌లెత్త‌కుండా వ్య‌వ‌హరించండి  జిల్లాలో గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స‌మ‌స్యాత్మ‌క గ్రామాల‌ను, పోలింగ్ కేంద్రాల‌ను గుర్తించి త‌గిన ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. తగిన పోలిస్ సిబ్బంది సహాయం తీసుకోవాల‌ని, దానికి త‌గిన రిక్వెస్టులు ముందుగానే త‌యారు చేసుకోవాల‌ని చెప్పారు. గ్రామాల్లో కుల‌, మ‌త‌, వ‌ర్గ విభేదాలు రాకుండా.. ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు రాకుండా ఇప్ప‌టి నుంచే త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల కోడ్ నియ‌మావ‌ళిపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల కోడ్ నియ‌మావ‌ళి ఇన్ ఛార్జిగా త‌హ‌శీల్ధార్‌లు వ్య‌వ‌హ‌రిస్తారని స్ప‌ష్టం చేశారు.  శాంతి భ‌ద్ర‌త స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా పోలీస్ శాఖ‌తో స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. పోలీసు బందోబ‌స్తు లేకుండా బ్యాలెట్ బాక్సుల‌ను త‌ర‌లించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. * ముసుగులు వేయండి.. ఫ్లెక్సీలు తొల‌గించండి* గ్రామాల్లో జాతీయ నాయ‌కుల విగ్ర‌హాల‌కు త‌ప్పించి మిగిలిన అన్ని రాజ‌కీయ సంబంధిత విగ్ర‌హాల‌కు ముసుగులు వేయాల‌ని చెప్పారు. గ్రామాల వ‌ర‌కే కోడ్ అమ‌ల్లో ఉంటుంది కాబ‌ట్టి.. అక్క‌డ రాజ‌కీయ నాయ‌కుల విగ్ర‌హాల‌కు ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ముసుగులు వేయాల‌ని.. అలాగే రాజ‌కీయ సంబంధిత, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే ఎలాంటి ఫ్లెక్సీలూ ఉండ‌రాద‌ని స్ప‌ష్టం చేశారు.  ఏక‌గ్రీవ పంచాయ‌తీల ఫ‌లితాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించండి ఎక్క‌డైనా గ్రామ పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవానికి అవ‌కాశం ఉంటే దానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోండి అని సూచించారు. అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ముందుకు వ‌స్తే అంగీక‌రించాల‌ని చెప్పారు. ఎవ‌రిపైనా ఎలాంటి ఒత్తిడి గానీ, ప్ర‌లోభాలు పెట్ట‌డానికి గానీ వీలు లేదు. దీనిలో నిష్ఫ‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. ఏక‌గ్రీవ పంచాయ‌తీల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జల్లో, ప్ర‌తినిధుల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. ఇరు వ‌ర్గాలు సమ‌న్వ‌యంతో.. శాంతియుతంగా వ్య‌వ‌హ‌రించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.  నిర్ణీత గడువులోగా శిక్ష‌ణ‌లు నిర్ణీత గ‌డువులోగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ముగించాల‌ని, దానికి స‌మాయ‌త్తం కావాల‌ని సూచించారు. శిక్ష‌ణ‌లు మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించాల‌ని చెప్పారు. ముందుగా ఆర్‌వోలు, ఏఆర్‌వోలు త‌ర్వాత పీవోలు, ఏపీవోలకు శిక్ష‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు. త‌దుప‌రి జ‌రిగే స‌మావేశంలో నామినేష‌న్ల ప‌ర్వం, తీసుకోవాల్సిన చ‌ర్య‌లు , అభ్య‌ర్థుల అర్హ‌త‌లు, అన‌ర్హ‌త‌ల గురించి చ‌ర్చిస్తాన‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో సంయుక్త కలెక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కె.సింహాచ‌లం, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తి రావు, జిల్లా పంచాయ‌తీ అధికారి సునీల్ రాజ్ కుమార్‌, జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్డీవో బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డ్వామా పీడీ నాగేశ్వ‌రరావు, డీడీవో రామ‌చంద్ర‌రావు, ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-27 21:28:26

సజావుగా పంచాయతీ ఎన్నికలు జరగాలి..

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన‌ త‌గిన ఏర్పాట్లు చేసుకొని ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధికారుల‌ను ఆదేశించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించిన ఏర్పాట్లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించేందుకు.. సూచ‌న‌లు చేసేందుకు జిల్లాలోని అన్ని మండ‌లాల ఎంపీడీవోలు, ఎమ్మార్వోల‌తో ఆయ‌న బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప‌లు సూచ‌న‌లు, ఎన్నిక‌ల షెడ్యూల్ తదిత‌ర అంశాల‌పై మార్గ‌‌నిర్ధేశ‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఎన్నిక‌ల షెడ్యూల్, తేదీల‌ను ప్ర‌కటించ‌క ముందే పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించి అక్క‌డ ప‌రిస్థితుల‌ను స‌రిచేసుకోవాల‌ని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా స‌‌మ‌స్య‌లుంటే గుర్తించి ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. స‌మ‌స్యాత్మ‌క‌, అతి స‌మ‌స్యాత్మ‌క‌, సున్నిత‌, అతి  సున్నిత కేంద్రాల‌ను గుర్తించి త్వ‌రిత‌గ‌తిన నివేదిక అంద‌జేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బేరీజు వేసి తాజాగా కేంద్రాల‌ను గుర్తించాల‌ని, తాజా నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. క‌మిష‌న‌ర్‌తో జ‌రిగిన మీటింగ్‌లో జిల్లాకు సంబంధించి మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్ప‌గా అంగీకారం తెలిపార‌ని.. కావున మొదటి ద‌శ‌లో పార్వ‌తీపురం, రెండు మూడు ద‌శ‌ల్లో చీపురుప‌ల్లి, ఎస్‌.కోట డివిజ‌న్‌లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని చెప్పారు. జిల్లా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువడే లోగా అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. ఈ లోగా పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ మెటీరియ‌ల్ ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. కేంద్రాల్లో క‌నీస వ‌స‌తులైన తాగునీరు, లైట్లు, బ‌ల్ల‌లు, కుర్చీలు త‌దిత‌ర ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల సిబ్బంది త‌ర‌లింపు, ఎన్నిక‌ల  సామ‌గ్రి త‌ర‌లింపు కేంద్రాల‌ను, రూట్ మ్యాప్‌ల‌ను  సిద్ధం చేసుకొని ఉండాల‌ని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులను ముందుగానే ప‌రిశీలించుకోవాల‌ని, ఎమైనా మ‌ర‌మ్మ‌తులు ఉంటే చేయించాల‌ని చెప్పారు. ముందుగా డెమో నిర్వ‌హించి బిగ్‌, మీడియం, స్మాల్ బాక్సుల్లో ఎన్ని ఓట్లు ప‌డ‌తాయో స‌రిచూసుకోవాల‌ని సూచించారు. శాంతి భ‌ద్ర‌త స‌మ‌స్యలు త‌లెత్త‌కుండా వ్య‌వ‌హరించండి  జిల్లాలో గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స‌మ‌స్యాత్మ‌క గ్రామాల‌ను, పోలింగ్ కేంద్రాల‌ను గుర్తించి త‌గిన ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. తగిన పోలిస్ సిబ్బంది సహాయం తీసుకోవాల‌ని, దానికి త‌గిన రిక్వెస్టులు ముందుగానే త‌యారు చేసుకోవాల‌ని చెప్పారు. గ్రామాల్లో కుల‌, మ‌త‌, వ‌ర్గ విభేదాలు రాకుండా.. ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు రాకుండా ఇప్ప‌టి నుంచే త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల కోడ్ నియ‌మావ‌ళిపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల కోడ్ నియ‌మావ‌ళి ఇన్ ఛార్జిగా త‌హ‌శీల్ధార్‌లు వ్య‌వ‌హ‌రిస్తారని స్ప‌ష్టం చేశారు.  శాంతి భ‌ద్ర‌త స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా పోలీస్ శాఖ‌తో స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. పోలీసు బందోబ‌స్తు లేకుండా బ్యాలెట్ బాక్సుల‌ను త‌ర‌లించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. * ముసుగులు వేయండి.. ఫ్లెక్సీలు తొల‌గించండి* గ్రామాల్లో జాతీయ నాయ‌కుల విగ్ర‌హాల‌కు త‌ప్పించి మిగిలిన అన్ని రాజ‌కీయ సంబంధిత విగ్ర‌హాల‌కు ముసుగులు వేయాల‌ని చెప్పారు. గ్రామాల వ‌ర‌కే కోడ్ అమ‌ల్లో ఉంటుంది కాబ‌ట్టి.. అక్క‌డ రాజ‌కీయ నాయ‌కుల విగ్ర‌హాల‌కు ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ముసుగులు వేయాల‌ని.. అలాగే రాజ‌కీయ సంబంధిత, ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే ఎలాంటి ఫ్లెక్సీలూ ఉండ‌రాద‌ని స్ప‌ష్టం చేశారు.  ఏక‌గ్రీవ పంచాయ‌తీల ఫ‌లితాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించండి ఎక్క‌డైనా గ్రామ పంచాయ‌తీల్లో ఏక‌గ్రీవానికి అవ‌కాశం ఉంటే దానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోండి అని సూచించారు. అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ముందుకు వ‌స్తే అంగీక‌రించాల‌ని చెప్పారు. ఎవ‌రిపైనా ఎలాంటి ఒత్తిడి గానీ, ప్ర‌లోభాలు పెట్ట‌డానికి గానీ వీలు లేదు. దీనిలో నిష్ఫ‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంద‌ని పేర్కొన్నారు. ఏక‌గ్రీవ పంచాయ‌తీల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జల్లో, ప్ర‌తినిధుల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. ఇరు వ‌ర్గాలు సమ‌న్వ‌యంతో.. శాంతియుతంగా వ్య‌వ‌హ‌రించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.  నిర్ణీత గడువులోగా శిక్ష‌ణ‌లు నిర్ణీత గ‌డువులోగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ముగించాల‌ని, దానికి స‌మాయ‌త్తం కావాల‌ని సూచించారు. శిక్ష‌ణ‌లు మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించాల‌ని చెప్పారు. ముందుగా ఆర్‌వోలు, ఏఆర్‌వోలు త‌ర్వాత పీవోలు, ఏపీవోలకు శిక్ష‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు. త‌దుప‌రి జ‌రిగే స‌మావేశంలో నామినేష‌న్ల ప‌ర్వం, తీసుకోవాల్సిన చ‌ర్య‌లు , అభ్య‌ర్థుల అర్హ‌త‌లు, అన‌ర్హ‌త‌ల గురించి చ‌ర్చిస్తాన‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. స‌మావేశంలో సంయుక్త కలెక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కె.సింహాచ‌లం, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తి రావు, జిల్లా పంచాయ‌తీ అధికారి సునీల్ రాజ్ కుమార్‌, జిల్లా ప‌రిష‌త్ సీఈవో వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్డీవో బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డ్వామా పీడీ నాగేశ్వ‌రరావు, డీడీవో రామ‌చంద్ర‌రావు, ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-27 21:25:40

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి..

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలోని ఆర్డీవోలు  ప్రత్యేక కలెక్టర్లు తాసిల్దార్లు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా చదవాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు తు.చ. తప్పకుండా ఎన్నికల నిర్వహణ జరగాలన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశలుగా జరుగుతాయన్నారు. ఎన్నికల నియమావళి అనుసరించి తగిన కార్యాచరణ కు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. జీవీఎంసీ లోని 98 వార్డులు, నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాలలో తప్ప మిగిలిన గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల నియమావళి  అమలవుతుందన్నారు. ఎన్నికల నిర్వహణలో చేయకూడని పనులు, చేయవలసిన పనులు, తరచుగా వచ్చే సందేహాలను నివృత్తి చేయడం, ఎలక్షన్ కమిషన్ నుండి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలు నియమ నిబంధనలపై అవగాహనతో ఉండాలన్నారు. ఎన్నికల నియమావళి అమలు నిఘా కమిటీలో తాసిల్దారు, ఎంపీడీవో, సబ్ ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై ప్రచురించిన హేండ్ బుక్స్ లో ఉన్న విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలన్నారు.  ప్రస్తుతం ఎన్నికలతో సంబంధం ఉన్న ఉద్యోగుల బదిలీలు నిలిపి వేయబడ తాయని ఇదివరలో ఇచ్చి, అమలుకాని ఉత్తర్వులు రద్దు అవుతాయని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, డి ఆర్ ఓ ప్రసాద్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య,   జిల్లా పంచాయతీ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్   సీఈఓ నాగార్జునసాగర్, డిఆర్డిఏ పిడి విశ్వేశ్వర రావు, ఆర్డీవో సీతారామారావు,   ప్రత్యేక ఉప కలెక్టర్లు రంగయ్య, సూర్యకళ, పద్మలత, అనిత, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-27 21:22:08