స్వేచ్చా యుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టా లని రాష్ట్ర ఎన్నికల కమి షనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు - 2021 లకు సంబందించి సన్నద్దత నిర్వహణలపై జిల్లా ఎన్ని కల పరిశీలకులు సిద్దార్థ జైన్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరినారాయణన్, అనంత పురం రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా టాటా, చిత్తూరు, తిరుపతి ఎస్.పి లు సెంథిల్ కుమార్,వెంకట అప్పలనాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ లు (రెవెన్యూ, అభివృద్ది) డి.మార్కండేయులు, వి.వీరబ్రహ్మం,మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, ట్రైని కలెక్టర్ విష్ణు చరణ్, తిరు పతి ఆర్.డి.ఓ కనక నర్సా రెడ్డి,డి.పి.ఓ దశరథ రామి రెడ్డి,నోడల్ అధికారులు, డి.ఎస్.పి లు, సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్భంగా రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ మాట్లాడు తూ స్వేచ్చయుత వాతా వరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేంధుకు అధికారులందరూ సమన్వ యంతో పని చేయాలని ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునేలా విధంగా అవగాహన చేపట్టాలని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగాలని తద్వారా మెరుగైన సమా జంనకు అవకాశం ఏర్పడు తుందని ఈ దిశగా అధికా రులు కృషి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల నిర్వహణకు సంబందించి తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో దళిత సంఘాల నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ముందుగా ఏయూకు వీసీగా నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసి వీసీ ప్రసాద రెడ్డిని సత్కరించారు. విశ్వవిద్యాలయంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగే దిశగా కృషిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయం ప్రగతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు వ్యవస్థాపకులు కె.బి.ఆర్ అంబేద్కర్, ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గంజి చింతయ్య, దళిత లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శి బుంగ రాజు, రమాబాయి అంబేద్కర్ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అద్యక్షుడు ఎన్.రమణ, ఎస్సీ సంక్షేమ సంఘం విశాఖ అర్బన్ అద్యక్షులు అద్దల జనార్ధన రావు, ఆచార్య ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్-19 టీకా పూర్తిగా సురక్షితమైందని.. ఎలాంటి అపోహలకు తావు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జీజీహెచ్‌లోని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంలో రెండో దశ టీకా వేసే కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బుధవారం నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల ఫ్రంట్‌లైన్ సిబ్బందికి టీకా పంపిణీ జరుగుతోందన్నారు. తొలి డోసు వేసుకున్నాక మళ్లీ 28వ రోజున రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుందని, దీనికి 14 రోజుల తర్వాత ఇమ్యూనిటీ వస్తుందని వివరించారు. టీకా గురించి అనవసర భయాందోళనలు వీడి.. ఆరోగ్యకర సమాజానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని మెడికల్ కళాశాలల విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, కలెక్టరేట్ సిబ్బంది, కాకినాడ నగర పాలక సంస్థ ఉద్యోగులు తదితరులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని వివరించారు. ఎవరికైనా జ్వరం, చిన్నపాటి దద్దుర్లు వంటివి వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనవసర భయాన్ని వీడి టీకా వేయించుకోవాలని సూచించారు. అనంతరం జేసీ.. కోవిడ్ టీకా వేయించుకున్న వారితో నేరుగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన ఎనిమిదివేల మాస్కులను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ వైడీ రామారావు.. జాయింట్ కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. అరుణ, కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు శిక్షణాకార్యక్రమాలు దోహదపడతాయని శిక్షణా కార్యక్రమ సమన్వయకర్త, విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయితీ సాధారణ ఎన్నికల నిర్వహణపై స్టేజ్ -2 ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల మాస్టర్ ట్రైనీలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనీలు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించి ఎన్నికల అధికారులకు ఎటు వంటి సందేహాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో శిక్షణను ఇవ్వాలని తెలిపారు. ఓటింగ్ సమయంలో అభ్యర్థి ఎపిక్ కార్డు తప్పని సరిగా తీసుకు వెళ్ళాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వంటి ఐడెంటీ కార్డులు వుండాలన్నారు. అభ్యర్ధులు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసే ఎన్నికల వ్యయాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో బుక్ చేయాలన్నారు. ప్రచార నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల అనుమతితో మాత్రమే ఇంటిపై జెండాలు కట్టడం, స్లోగన్స్ వ్రాయడం వంటివి చేయాలన్నారు. దీనికి అయిన ఖర్చును కూడా ఎన్నికల వ్యయం క్రింద బుక్ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతీ అంశం చాలా ముఖ్యమైనదన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతీ అంశంలోను తప్పక పాటించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ తెలిపారు. కౌంటింగ్ సమయంలో స్టేషనరీ సామగ్రిని సిధ్ధంగా వుంచుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంటు, అభ్యర్ధులను కౌంటింగ్ టేబుల్ వద్దకు అనుమతించవచ్చునని చెప్పారు. ముందుగా వార్డు మెంబర్ల కౌంటింగ్ జరగాలన్నారు. అనంతరం సర్పంచ్ ల బ్యాలట్ పేపర్ల కౌంటింగ్ చేయాలన్నారు. పి.ఓ.లు తప్పనిసరిగా డెయిరీని ఖచ్చితంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ముందుగా చెల్లని ఓట్లను విడగొట్టాలని, వాటిని వేరే బండిల్ లో చుట్టి ఒక దగ్గర వుంచాలని తెలిపారు. దీని వలన ఓట్ల లెక్కింపు త్వరతిగతిన పూర్తి అవుతుందన్నారు. బ్యాలట్ పేపర్ వెనుక డిస్ట్రుబ్యూషన్ మార్క్, ప్రిసైడింగ్ ఆఫీసరు సంతకం తప్పనిసరిగా వుండాలన్నారు. రి-కౌంటింగ్ అవసరమైతే ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని వివరించారు. మాస్టర్ ట్రైనీలు ఈ అవగాహనా కార్యక్రమంలో చక్కగా అవగాహన పొందాలన్నారు. మాస్టర్ ట్రైనీలు తిరిగి ట్రైనింగ్ క్లాసులను నిర్వహించి శిక్షణ పొందే అధికారులకు అన్ని విషయాలను క్షుణ్ణంగా అవగాహన కల్పించాలన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి.శాంతి, బి.సీతారామ మూర్తి, ఎం.అప్పారావు, విజిలెన్స్ అధికారి ఆర్.వెంకట రమణ, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నిక జరగడానికి 44 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో డ్రై డేలను ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిక జరిగే ముందు రోజు నుంచే మద్యం దుకాణాలు మూసివేయాలని.. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు తెరవడానికి వీలు లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాలో 13, 17, 21వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాలు, మూసివేయాల్సిన మద్యం, కల్లు దుకాణాలు, బార్ల వివరాలను వెల్లడించారు.
* మొదటి దశలో...
పైన పేర్కొన్న ఉత్తర్వుల మేరకు జిల్లాలో మొదటి దశకు సంబంధించి 11వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 13వ తేదీన ఎన్నిక మరియు కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు బాడంగి, బలిజపేట, బొబ్బలి, గరుగుబిల్లి, గుమ్మలక్షీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, రామభద్రపురం, సాలూరు, సీతానగరం, తెర్లాం మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలి.
* రెండో దశలో...
జిల్లాలో రెండో దశ ఎన్నికకు సంబంధించి 15వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 17వ తేదీన ఎన్నిక మరియు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, విజయనగరం మండలాల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలి.
* మూడో దశలో...
జిల్లాలో మూడో దశకు సంబంధించి 19వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 21వ తేదీన ఎన్నిక మరియు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, గంట్యాడ, బొండపల్లి, జామి, ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలో ఉండే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలి.
పని చేసేచోట మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు తప్పవని సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. మహిళల హక్కుల పరిరక్షణ లో భాగంగా పని చేసే చోట మహిళల పై లైంగిక వేధింపుల నిరోధించడానికి 2013 లో ప్రభుత్వం చట్టం చేసిందని, ఈ చట్టం పై అన్ని కార్యాలయాలు, సంస్థలలో అవగాహన కల్పించాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో పని చేసే చోట మహిళల పై లైంగిక వేధింపుల నిరోధక అంతర్గత కమిటీ సమీక్ష సమావేశం జే.సి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ చట్టం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్వచ్చంద సంస్థలు, నర్సింగ్ హోం లు, హాస్పిటల్స్ , సేవ, సహకార, విద్య సంస్థల్లో వర్తిస్తుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా, మానసికంగా బాధ కలిగేలా ప్రవర్తించినా, భౌతికంగా శరీరాన్ని తాకినా , మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ప్రవర్తించినా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి సంఘటనలు జరిగితే నెల రొజూ లోపు ఫిర్యాదు చేయాలని, కొన్ని సార్లు ఫిర్యాదు చేయక పోయినా సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని, రుజువైతే ఈ చట్టం ప్రకారం శిక్షలు అమలు జరపాలని అన్నారు. ఈ చట్టం లోనున్న అంశాలు, శిక్షల పై ప్రతి సంస్థ లోని ఉద్యోగులకు అవగాహన ఉండాలని అన్నారు. ఇలాంటి కేసులను నిరోధించడానికి ప్రతి సంస్థ నందు మహిళా ఉద్యోగులతో ఇంటర్నల్ కమిటీ లను వేయాలని అన్నారు.
ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి తొలుత చట్టం లోని సెక్షన్లు, శిక్షలు తదితర అంశాలను వివరించారు. మహిళల పట్ల అసభ్యకర సంఘటనలు జరిగితే ఫిర్యాదు అందినా లేదా తెలిసిన వెంటనే గోప్యంగానే విచారణ జరపడం జరుగుతుందని, పని చేసే చోటా మహిళల గౌరవానికి భంగం కలగని రీతి లో కేసు ను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. నేర తీవ్రతను బట్టి బదిలీలు, ఉద్యోగం నుండి తొలగించడం, ప్రమోషన్ నిలుపుదల, అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుందని, ఫిర్యాదు చేసిన 60 రోజుల నిండి 90 రోజుల లోపు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యాలయం లో ఈ చట్టం అమలు జరపాలని అన్ని కార్యాలయాలకు సర్కులర్ పంపడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాదికారి వెంకటేశ్వర రావు, డి.పి.ఓ పద్మావతి, దిశా పోలీ స్టేషన్ డి.ఎస్.పి త్రినాద్, పలు శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది హాజరయ్యారు.
అనాధ పిల్లల్ని శిశు గృహాలలో స్వంత పిల్లల్లా చూసు కుంటున్నారని, శిశు గృహాల సిబ్బంది అబినందనీయులని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి(జువనల్ జస్టిస్ బోర్డు) బి.శిరీష పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా చైల్డ్ లైన్ సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గ హాజరైన శిరీష మాట్లాడుతూ అనాధ పిల్లలు, తప్పిపోయిన, భిక్షాటన చేస్తున్న, బాల కార్మిక పిల్లల పట్ల కరుణా భావాన్ని చూపించడం మానవ ధర్మమన్నారు. అనాధలను దత్తత నివ్వడం వలన వారికి మంచి భవిష్యతు దొరుకుతుందని అన్నారు. బాలల ను రిమాండ్ లో ఉంచడానికి జిల్లాలో సరైన షెల్టర్ హోం లేదని, విశాఖపట్నం తరలించవలసి ఉంటుందని, జిల్లాలో ఒక హోం ను మజురు చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు. జువనల్ జస్టిస్ బోర్డు లోని అంశాలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు చూడాలని అన్నారు. బాల నేరాలను అరికట్టడానికి కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని అన్నారు.
ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా తుప్పల్లో పడేసిన అమానుషమైన సంఘటనలు జరుగుతున్నాయని, అలంటి బాలల కోసం ఉయ్యాలా అనే పధకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రధానమైన 14 ప్రాంతాల్లో ఈ ఉయ్యాలా పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ ఉయ్యాలా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. అనాధలను దత్తత తీసుకోవాలనుకునే వారు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను బట్టి వారికీ దత్తత నివ్వడం జరుగుతోందన్నారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు సహకరిస్తున్నారని, బాల్య వివాహాలపై గ్రామాల్లో అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు.
ఈ సమావేశంలో దిశా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి త్రినాద్, స్వచంద సంస్థల ప్రతినిధులు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి లక్ష్మి, కార్మిక, విద్య శాఖ, పోలీస్, వైద్యారోగ్య తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్-19 వేక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, దీనిపట్ల అపోహలు విడనాడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. ప్రతీఒక్కరూ వేక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో రెండో విడత కోవిడ్-19 వేక్సినేషన్ ప్రక్రియ బుధవారం మొదలయ్యింది. స్థానిక రాజీవ్‌నగర్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ సతీసమేతంగా హాజరై, స్వయంగా తాను వేక్సిన్ వేయించుకొని, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రెండో విడత కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సుమారు 27 వేల మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 38 వేక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడత కార్యక్రమం క్రింద వైద్యారోగ్య సిబ్బంది, అంగన్‌వాడీలు తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వేక్సినేషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరికోసం 32 సెంటర్ల ద్వారా సుమారు 14వేల మందికి వేక్సిన్ వేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 11వేల మంది వరకూ వేక్సిన్ వేయించుకున్నారు. వీరికి కూడా మరోవైపు వేక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
అపోహలు విడనాడాలి ః కలెక్టర్
కోవిడ్ వేక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ కోరారు. వేక్సిన్ వేయించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండోవిడత వేక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, ఈ నెల 16 వరకూ దీనిని కొనసాగిస్తామని చెప్పారు. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో మన జిల్లా ఎంతో ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని, గత కొన్ని నెలలుగా మరణాలు లేవని చెప్పారు. అయినప్పటికీ మనంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్లే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా వేక్సిన్ వేయించుకోవాలని సూచించారు. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే బాలింతలు, కొన్ని రకాల మందులు పడనివారు, అలర్జీలు ఉన్నవారు మాత్రమే వేక్సిన్ వేయించుకోకూడదని అన్నారు. ప్రజారోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సతీమణి శైలజా బాయి, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహనరావు, డాక్టర్ రవికుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మంచి పరిణామమని మాజీ కేంద్ర మంత్రి,బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు, పాట్నా వర్సిటీ ఆచార్యులు సంజయ్ పాశ్వాన్ అన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ పరిశోధనలు, పేటెంట్‌లు తదితర అంశాలపై వీసీ వివరించారు. విశాఖ కాస్మోపాలిటన్ సిటీగా నిలుస్తుందన్నారు. నగర ప్రాధాన్యత గుర్తించిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి వివాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రనలుమూలలా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని వివరించారు. వీటిని ఆధారంగా చేసుకుని సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ఈ సందర్భంగా ఆచార్య సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని తాను త్వరలో కలుస్తానన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటు చేయడానికి గల కారణాలు, వీటి పనితీరు, ఏర్పాటు పర్యవసానాలు, అభివృద్దికి దోహదపడే విధానాలపై అధ్యయనం చేయడం ఎంతో అవసరమని సూచించారు.ఈ దిశగా విశ్వవిద్యాలయం ఆచార్యులు కృషిచేయాలని తెలిపారు. యువ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ వెళుతున్నారన్నారు. విశాఖ నగరంలో అన్నీ ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రజల సంస్కృతులు, జీవనం ఎంతో ఉన్నతమైనదన్నారు. సంస్కృతే నిజమైన బలమన్నారు. కళలు, నైపుణ్యాలు మన దేశంలో దర్శనమిస్తాయన్నారు. అనంతరం వర్సిటీ తరపున ఆచార్య సంజయ్ పాశ్వాన్‌ను సత్కరించి, వర్సిటీ జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, గెస్ట్‌హౌస్ డీన్ ఆచార్య టి.షారోన్ రాజు, విశ్రాంత ఆచార్యులు క్రిష్ణయ్య, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోలింగు శాతం కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శాంతి భద్రతలు, నోడల్ అధికారులు, పోలింగ్ అధికారులు, బ్యాలెట్ పేపర్లు, మొదటి విడత నామినేషన్ల ఘట్టం, తదితర విషయాలపై ఎన్నికల కమిషనర్ కు వివరించారు. అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, పాడేరు ఆర్డిఓ శివజ్యోతి, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్ ఎన్నికల ఏర్పాట్లపై, గతంలో పోలింగ్ శాతం, ఏక గ్రీవాలు, పోలింగ్ స్టేషన్లు, ఓటర్లు, మేన్ పవర్ ,రూట్లు, జోన్లు, శిక్షణలు, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్ అమలు తదితర అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు. డిసిపి ఐశ్వర్య రస్తోగి, నర్సీపట్నం ఎఎస్పి తుహిన్ సిన్హా, చింతపల్లి ఎఎస్పి విద్యాసాగర్ రెడ్డి, పాడేరు డిఎస్పి రాజ్ కమల్, అనకాపల్లి డిఎస్పి, ఎసిపిలు ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు, వాహనాలు తనిఖీ, సమస్య, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, వాహనాల తనిఖీ, గ్రామాల సందర్శన, తదితర విషయాలపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు వివరించారు.
ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రతిభావంతమైన అధికారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో శాంతియుతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు పట్ల జిల్లా కలెక్టర్ ను, జిల్లా పోలీసు అధికారులను అభినందించారు.
ఈ సమావేశంలో నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, అదనపు డి.జి. ఎన్. సంజయ్, డిఐజి ఆఫ్ పోలీస్ కె.రంగారావు, ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, ఎఎస్పి, డిఎస్పి, ఎసిపిలు, జడ్పి సిఇఓ, నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు భద్రతా చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. విశాఖ జిల్లాలో ప్రతిభావంతులైన అధికారులు ఉన్నారని సంపూర్ణ అవగాహనతో ఎన్నికల నిర్వహణకు ప్రాముఖ్యత ఇస్తున్నారని ప్రశంసించారు. ఆదర్శవంతమైన పరిపాలన సంస్కరణలు కావాలన్నారుఅయితే జిల్లాలో పోలింగ్ శాతం మెరుగవ్వాలన్నారు. గతంలో రాష్ట్రంలో 85 శాతం పోలింగ్ వుంటే విశాఖ జిల్లాలో 75 శాతం పోలింగ్ జరగడం గమనించాలన్నారు. జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేందుకు అధికారులు, ప్రజాస్వామ్య వాదులు కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లను పాల్గొనేలా చేయాలని పిలుపునిచ్చారు
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఓటు వేసి ప్రజాస్వావమ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. రాజ్యాంగం చెప్పిందే ఎలక్షన్ కమిషన్ చెబుతోందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయని తెలియజేశారు. వోటు హక్కు వినియోగించు కునేందుకే పోలింగ్ రోజు శలవు ప్రకటిస్తారని గమనించాలన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటింగ్ సమయం పెంచామని ఉదయం గం. 6:30 నుండి మధ్యాహ్నం గం.3 30ల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి పౌరుడు ఓటు చేసే విధంగా మంచి వాతావరణం కల్పించాలన్నారు. అన్నిరాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు సమాన అవకాశాలు కల్పిస్తామని ఏ పార్టీని కించపరచడం జరుగదన్నారు. అందరిపట్ల సమభావం, సమన్యాయం, సమదృష్టితో చూస్తామని వెల్లడించారు. ఏకగ్రీవాలకు కమిషన్ వ్యతిరేకం కాదని గతంలోనూ అటువంటివి జరిగాయన్నారు. అయితే ఎక్కువ శాతం ఏకగ్రీవాలు ప్రజా స్వామ్య స్పూర్తిని బలహీన పరుస్తాయన్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వమే ప్రజాస్వామ్యం అని అభివర్ణించారు.
బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఎదగడానికి ఎన్నికలు దోహదపడతాయన్నారు. మహిళలతో పాటు అన్ని వర్గాల వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందాలన్నారు. ఈ నెల 3వ తేదీన ఎన్నికల కమిషన్ లో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ నిఘా వ్యవస్థ తో పాటు మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలన్నారు. మీడియా ఒక బలమైన శక్తి అని చెప్తూ ప్రెస్ లో తులనాత్మక, విశ్లేషణాత్మక వార్తలు, కథనాలు రావాలన్నారు.
మృతుని ఇంటికి ముందుగా వెళతా
ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, డి.ఐ.జి.రంగారావు, పోలీసు కమిషనరు మనీష్ కుమార్, ఎస్.పి. బి.కృష్ణారావు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో తొలి విడత పోలింగుకు సిద్ధం కావాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల క్రిష్ణా ద్వివేది అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ, పోలింగ్ సామాగ్రి నాణ్యంగా ఉన్నదీ లేనిది సరి చూసుకోవాలన్నారు. ఓటరు వేలి పై వేసే మార్క్ కు సంబంధించిన సిరా పరిశీలించాలన్నారు పి.వో.లు, ఏ.పీ.ఓ.ల నియామకం పూర్తి చేయాలన్నారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అనకాపల్లి డివిజన్ లో పోలింగుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, స్క్రూటినీ, విత్ డ్రాయల్ తరువాత బ్యాలెట్ పేపర్ పై దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణ సామాగ్రి ఆయా ఎం.డి.ఓ. కార్యాలయాలకు పంపించడం జరిగిందన్నారు. స్టేషనరీ, ఇంకు, బ్యాలెట్ బాక్సులు అన్నీ సిద్ధం చేస్తున్నామని, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా తరగతులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, పి. అరుణ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి, జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ. నాగార్జునసాగర్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ శాఖ కమీషనరు గిరిజాశంకర్ , ఎన్నికల కార్యదర్శి కన్నబాబుతో కలసి విజయవాడ నుండి సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేస్తూ పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థులకు గుర్తింపు చిహ్నాలు కేటాయింపులలో మరియు స్ట్రాంగ్ రూముల భద్రతపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియ జిల్లా కలెక్టరు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పంచాయతీఎన్నికలు పటిష్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టరు శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరించారు. జిల్లాలో నాలుగు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మరియు కౌంటింగ్ సామాగ్రిని సిద్థం చేశామని, అలాగే తొలి విడతకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను ఇప్పటికే సిద్థం చేశామని, అభ్యర్థుల నామినేషన్ పరిశీలన అనంతరం తుది జాబితా ప్రకటించగానే బ్యాలెట్ పత్రాల ముద్రణకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు చక్రధర్ బాబు, పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శికి వివరించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితం గా అమలు జరిగేలా మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు యివ్వడం జరిగిందని, అలాగే కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి పోలింగ్ జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టరు వివరించారు. జిల్లాలో 24,640 మంది పోలింగ్ సిబ్బందిని గుర్తించి వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను షెడ్యూలు వారీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు.