1 ENS Live Breaking News

పూర్తి అవగాహనతోనే ఎన్నికల ప్రక్రియ..

పూర్తి అవగాహనతో  ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత  పంచాయతీ ఎన్నికలపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత మండల అభివృధ్ధి  అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.  ముందుగా  బ్యాలట్ బాక్సులను సిధ్ధంగా వుంచుకోవాలన్నారు.  డిజిటల్ అసిస్టెంట్లను నియమించుకుని వార్డువారీగా దాఖలయిన నామిమేషన్ వివరాలను రోజువారీ అప్ లోడ్ చేయాలన్నారు.  కులాలవారీగా రిజర్వేషన్ల నిక్కచ్చి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు పంపించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్ధులకు ఇవ్వవలసిన నిర్ణీత ఫారాలను, ప్రోఫార్మాలను అందించాలన్నారు. పోలింగ్ స్టేషన్లను పరిశీలించుకోవాలన్నారు.  ఉదయం 6.30 గం.ల నుండి పోలింగ్ ప్రారంభం కానున్నదన్నారు. నామినేషన్ల అనంతరం విత్ డ్రాయల్స్, స్కూటినీ, రిజెక్షన్లు, అభ్యర్ధుల  తుది జాబితాల వివరాల తయారీ తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు.  పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, రూట్ మేప్ లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఏర్పాటు. బేలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలని చెప్పారు. వీడియో కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడతలో పాతపట్నం, టెక్కలి, ఎచ్చెర్ల నియోజక వర్గాలలోని 10 మండలాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  లావేరు, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, ఎల్.ఎన్.పేట, కొటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండల పరిథిలలోని 319 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 2902 వార్డులలో, 2940 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల జరగనున్నాయని తెలిపారు.  కావున బ్యాలట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, ఓటరు లిస్టులు పక్కాగా  వుండాలన్నారు.  ఎన్నికలు సజావుగా నిక్కఛ్ఛిగా జరగాలన్నారు.   ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహనతో నిర్వహించాలన్నారు.                  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా పంచాయితీ అధికారి వి.రవి, మండల అభివృధ్ధి అధికారులు, ఇ.ఓ.పి.ఆర్.ఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2021-01-27 21:02:15

మౌళిక సదుపాయాలన్నీ కల్పిస్తాం..

విశాఖ లో రైల్వే న్యూ కాలనీ ఇందిరానగర్ కాలనీ లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేవారు.  వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణలతో కలిసి బుధవారం రైల్వే న్యూకాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 76 ఇళ్లకు కావాల్సిన సదుపాయాలకు సంబంధించిన రూ.30 లక్షలతో కూడి అభివ్రుద్ధి పనులకు శంఖుస్థాపన అనంతరం, వివిధ అంశాలపై నేరుగా విజయసాయిరెడ్డి ఈ ప్రాంతీయులతో మాట్లాడారు. భవిష్యత్తు లో ఎటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పట్టాలు ఇచ్చే కార్యక్రమం  ఉంటుందని విజయసాయిరెడ్డి ఈ ప్రాంతీయులకు హామీ ఇచ్చారు. విశాఖలోని నగరవాసుల కష్టాలు మొత్తం తీర్చవిధంగా అభివ్రుద్ధికార్యక్రమాలతోపాటు, మౌళిక వసతులు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈవిషయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ లు స్వయంగా తన ద్రుష్టికి తీసుకు వచ్చారన్నారు. దీనితో ఇక్కడ మౌళిక వసుతులు కల్పించడానికి ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. ఎంపీ mvv సత్యనారాయణ మాట్లాడుతూ, విశాఖలో ఏ ప్రాంత వాసులు ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వ లక్ష్యమని దానికోసమే నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి  వచ్చామన్నారు. మత్స్యకార చైర్మన్ కోలా గురువులు , యువజన అధ్యక్షులు రాజీవ్ , స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ళ లీలా శ్రీనివాస్, లీడర్ రమణమూర్తి, శ్రీనుబాబు, కార్పొరేటర్ అభ్యర్థులు, వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-01-27 20:44:34

భీమిలీ నియోజకవర్గం క్లీన్ స్వీప్ లక్ష్యం..

భీమిలీ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు క్లీన్ స్వీప్ చేసి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి బహుమతిగా అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బుధవారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, త్వరలో అందించబోయే సంక్షేమ పథకాల విషయాన్ని ప్రజలకు తెలియజేసి పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాలు సర్పంచులు గెలవాలన్నారు. ఆ బాధ్యత మండలాల వారీగా పార్టీ నాయకులు తీసుకోవాలన్నారు.  అదేవిధంగా పంచాయతీల వారీగా సర్పంచ్ అభ్యర్ధులు కూడా ప్రజలతో మమేకమై గెలుపుదిశగా పనిచేయాలన్నారు. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో ఉన్నారని దానిని సర్పంచ్ అభ్యర్ధులు వాటిని నిలబెట్టు కోవాలన్నారు. అయితే చంద్రబాబు చేస్తున్నదుష్ప్రచారాలను తిప్పి కొట్టే విధంగా సంక్షేమ పథకాలు సంబందించిన కరపత్రాలను ప్రతి ఇంటికి అందించటంతో పాటు వాటికి సంబంధించిన వివరాలను తెలియపరచాలని కోరారు. అలాగే పార్టీలో నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా సమన్వయం తో పనిచేసి ప్రతి ఓటు పార్టీ సానుభూతి అభ్యర్దులు ఓటు పడే విధంగా  ప్రత్యేక శ్రద్ధ తో పని చేయాలన్నారు.రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని దీని ద్వారా అన్ని ప్రాంతాలు ఉన్నత స్థాయిలో అభివృధ్ధి సాదించటంతో పాటు ప్రజలకు సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుతాయని ఈ విషయాలను కూడా ప్రత్యేకించి వివరించాలని మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు. పంచాయతీ ఎన్నికలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఈ విధంగా గ్రామాలలో ప్రశాంత నెలకొనేలా ఏకగ్రీవలకు ప్రాధాన్యత ఇవ్వంలన్నారు.రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలనుకు ఐదు లక్షల ప్రోత్సాహం రెండు వేల నుండి ఐదు వేల జనాభా పంచాయతీలు ఏకగ్రీవనికి 10 లక్షలు ఐదు వేల నుండి పదివేల జనాభా పంచాయతీలకు 15 లక్షలు పదివేలకు పైనున్న పంచాయతీ ఏకగ్రీవలకు 20 లక్షలు ప్రోత్సాహకాలు ఇవ్వటం జరుగుతుందన్నారు.నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయితీలలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి పంచాయతీ పోరులో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కోరారు.ఈ సమావేశంలో భీమిలీ,ఆనందపురం , పద్మనాభం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ, జడ్పీటిసి అభ్యర్దులు  పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-27 20:04:32

ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం..

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఉత్తర్వులు జారీ చేసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుటకు సమన్వయకర్తగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతారావును నియమించగా, మానవ వనరుల నిర్వహణ విభాగానికి జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, సామగ్రి పంపిణీ, శిక్షణా తరగతుల నిర్వహణ సమాచారం అందజేయటకు ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ బి.శాంతి, బ్యాలెట్ పేపర్ నిర్వహణ కార్యక్రమాలను డి.ఆర్.డి.ఓ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతిశ్రీ, బ్యాలెట్ బాక్సుల నిర్వహణకు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాస రావు, పోస్టర్ బ్యాలెట్ ల నిర్వహణకు ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ ఎం.అప్పారావు, సామగ్రి సరఫరాకు ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ పి.కాశీవిశ్వనాథ రావు, వాహనాలు సమకూర్చుటకు డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమీషనర్ డా.వడ్డి సుందర్, బ్యాలెట్ బాక్సుల పంపిణీ తదితర అవసరాలకు వాహనాల నిర్వహణకు హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఎన్నికల నియమావళి అమలు పరిశీలనకు ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, ఓటరు జాబితాల సమన్వయానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి లను నియమించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ జారీ చేసే ఆదేశాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా విధులను నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రవర్తనా నియమావళి అమలు అధికారులుగా తహశీల్దార్లు : పంచాయతీ ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. ఈ మేరకు మండల స్ధాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పరిశీలనకు తహశీల్దార్లను నియమించారు. పంచాయతీ స్ధాయిలో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. తహశీల్దార్లు మండలాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలించి రోజు వారీ నివేదికను నోడల్ అధికారి మరియు ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావుకు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతి రోజు పంపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Srikakulam

2021-01-27 19:36:35

పంచాయతీ ఎన్నికలకు సిద్దం చేయండి..

ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగడానికి అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (ఎస్.ఇ.సి) ఎన్.రమేష్ కుమార్  ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టాలని ఎస్.ఇ.సి ఆదేశించారు. ప్రతి అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు కూడా నైతిక విలువలకు కట్టుబడి జరగాలని ఆయన సూచించారు. తొలి దశ ఎన్నికలను రీషెడ్యూల్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, ఏపీ పంచాయతీ రాజ్ యాప్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలెక్షన్ కాల్ సెంటర్ గా అది పనిచేస్తుందని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తులు యాప్ ద్వారా మెసేజ్, వీడియో క్లిప్ పంపించ వచ్చని ఆయన తెలిపారు. యాప్ లో అందిన ఫిర్యాదులను పర్యవేక్షించుటకు అధికారులు ఉంటారని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటువంటి విధానం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియతో వాలంటీర్లకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేసారు. పంచాయతీ కార్యదర్సుల సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు.  పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ బేలెట్ పేపర్ ప్రింటింగ్ పూర్తి అయిందని అన్నారు.  వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది వాక్సినేషన్ కు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపరచడం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ తో చర్చించామని పేర్కొన్నారు. డిఐజి ఎల్.కె.వి.రంగారావు,  జాయింట్ కలెక్టర్లు సుమిత్, డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీఓలు ఐ కిషోర్, టివిఎస్జీ కుమార్, డిపిఓ వి.రవి కుమార్, జెడ్పి సిఇఓ లక్ష్మీపతి, ఎస్డీసిలు బి.శాంతి, కాశీ విశ్వనాథ రావు, పి.అప్పారావు, సిపిఓ ఎమ్.మోహన రావు, డిటిసి డా.వడ్డి సుందర్, డిఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ, హౌసింగ్ పిడి టి.వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.రజనీకాంత రావు , డివిజనల్ అభివృద్ధి అధికారి ఆర్.వి.రామన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-27 17:17:45

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..

విశాఖ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు వివరించారు. బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్. పి లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్,  ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా లో వ్యాక్సినేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతోందని వివరించారు. విశాఖపట్నం నుంచి నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, రూరల్ ఎస్పీ బి.కృష్ణా రావు, జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్. గోవింద రావు, డిఆర్ఓ ఎ.ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్, డిఆర్డీఏ పిడి విశ్వేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-27 17:15:04

మొదటి దశలో 319 పంచాయతీల్లో ఎన్నికలు..

శ్రీకాకుళం జిల్లాలో మొదటి దశలో 319 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు.  ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో  మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (ఎస్.ఇ.సి) ఎన్.రమేష్ కుమార్  ఆదేశించారని తెలిపారు. ప్రతి అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు తగిన భరోసా కల్పించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జిల్లాలో ఎన్నికల సిబ్బందికి గురువారం నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఎక్కడ నామినేషన్లు దాఖలు చేయాలో తెలియజేయడం జరుగుతుందని అన్నారు.  పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

Srikakulam

2021-01-27 17:07:43

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి..

ఎన్నికలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, రూట్ మేప్ లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ఉప కమీషనర్ ను ఆదేశించారు. బేలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలని చెప్పారు. వీడియో కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.          ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీఓలు ఐ కిషోర్, టివిఎస్జీ కుమార్, డిపిఓ వి.రవి కుమార్, జెడ్పి సిఇఓ లక్ష్మీపతి, ఎస్డీసిలు బి.శాంతి, కాశీ విశ్వనాథ రావు, పి.అప్పారావు, సిపిఓ ఎమ్.మోహన రావు, డిటిసి డా.వడ్డి సుందర్, డిఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ, హౌసింగ్ పిడి టి.వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.రజనీకాంత రావు , డివిజనల్ అభివృద్ధి అధికారి ఆర్.వి.రామన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-27 17:03:30

భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలి..

భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా వుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు  పేర్కొన్నారు.  బుధవారం ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటాక్ హెరిటేజ్  వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు విచ్చేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారత దేశ సంస్కృతి చాలా గొప్పదని అన్నారు. ఇది ప్రపంచ దేశాలకే ఆదర్శనీయ మన్నారు.  అదే విధంగా మన జిల్లాలో కూడా మంచి సంస్కృతి, కళలు, ప్రకృతి వనరులు వున్నాయన్నారు. ముఖ్యంగా  కళింగాంధ్ర చరిత్రను మనందరం  తెలుసుకోవాలన్నారు.  ఏప్రియల్ నెలలో విద్యార్ధులకు అవగాహన కలిగించు నిమిత్తం, ఇంటాక్ హెరిటేజ్  వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  మన జిల్లాలోని ప్రజలు వలసలకు వెళ్ళే వారు  వున్నారని, దేశంలోని నిర్మాణ పనులు, కట్టడాలలోను మన జిల్లా వాసులు ఎక్కువగా వుంటారని   కష్టించే తత్వం కలవారని చెప్పారు.  సురంగి మోహన రావు మాట్లాడుతూ, విద్యార్ధులు మన కళలు, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కలిగి వుండాలని భవిష్యత్తరాలకు తెలియ చెప్పవలసిన ఆవశ్యకత వుందని అన్నారు. ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్ మాట్లాడుతూ, జనవరి 27, 1984వ సం.లో ఢిల్లీలో ఇంటాక్ హెరిటేజ్ స్థాపించడం జరిగిందని, మన జిల్లాలో 1990వ సం. జనవరి 27న అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.పి.సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  ప్రతీ ఏటా ఇదే రోజున ఇంటాక్ హెరిటేజ్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగుతున్నదని, విద్యార్థులకు క్విజ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించి వారికి బహుమతులను అందచేయడం జరుగుతున్నదని తెలిపారు. మానవతావిలువలను ప్రతీ ఒక్కరు అలవరచుకోవాలన్నారు. అనంతరం క్విజ్,  వ్యాసరచన పోటీలు, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్ధినులకు బహుమతులు అందచేసారు.   వ్యాసరచన పోటీలలో పి.చాందిని మొదటి బహుమతి, బి.కృప రెండవ బహుమతి, ఎస్.వనిత మూడవ బహుమతికి ఎంపిక అయ్యారు. వక్తృత్వపు పోటీలలో ఎన్.వెంకటలక్ష్మి మొదటి బహుమతి, పి.దేవీ ప్రసన్న రెండవ బహుమతి పొందగా, ఎల్.ఐశ్వర్య మూడవ బహుమతి పొందారు.                      ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్-ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి, నటకుల మోహన్ రావు, సి.హెచ్.కృష్ణారావు, ఎం.ఆర్.జె.నాయుడు, ఎకడమిక్ కో-ఆర్డినేటర్ శంకరనారాయణ, స్వీప్ స్వఛ్ఛంద సంస్థ డైరక్టర్ కొమ్ము రమణ మూర్తి, యు.ప్రత్యూష, రాజు, విద్యార్ధినులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-27 15:31:20

ఘనంగా 72 వ గణతంత్ర దినోత్సవం..

శ్రీకాకుళం జిల్లాలో గణతంత్ర దినోత్సవం వేడుకలు    ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా  జరిగాయి.   మంగళవారం 72  వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ జె.నివాస్  ముఖ్య అతిధిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  అనంతరం పోలీసుల  గౌరవ వందనాన్ని స్వీకరించి,  ప్రజలను వుద్దేశించి ప్రసంగించారు.  అనంతరం విద్యార్ధుల మాస్ డ్రిల్, సాంస్కృతిక కార్యక్రమాలు జిరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా  స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, జిల్లా కలెక్టర్లు సన్మానించారు.  అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సాంప్రదాయం ఆధ్వర్యంలో నమో భారతాంబ నృత్యం, న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులచే కరోనా వారియర్స్ ఏమిచ్చి తీర్చాలి నీ రుణం అనే నృత్యం, సాయి విద్యా మందిర్ విద్యార్ధులచే రైతు రాజ్యం పదరా.పదరా.. పదరా న్యత్యం, పోలాకి కె.జి.బి.వి. విద్యార్ధులచే మన *ఇండియా* నృత్యం, ఆర్.సి.ఎం.  లయోలా  స్కూల్ విద్యార్ధులచే ఇదే భారత దేశం నృత్యం, ఐ.టి.డి.ఎ. హడ్డుబంగి ఆశ్రమ  పాఠశాల  విద్యార్ధినుల  థింసా న్యత్యాలు అలరించాయి. ఇందులో న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్ధులచే కరోనా వారియర్స్ చేసిన ఏమిచ్చి తీర్చాలి నీ రుణం అనే నృత్యం ఆహూతులను చలింపచేసింది. థింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. ప్రభుత్వ శకటాలకు బహుమతులుః-         ఈ సందర్భంగా  తమ తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుపుతూ ప్రభుత్వ శకటాల ప్రదర్శన  జరిగింది.  ఈ ప్రదర్శనలో సమగ్ర గిరిజనాభివృధ్ధి సంస్థ శకటానికి ప్రధమ బహుమతి, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ శకటానికి ద్వితీయ బహుమతి,  జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి  తృతీయ బహుమతి,  అటవీశాఖ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ శకటాలకు   కనసోలేషన్ బహుమతులు  లభించింది.                      అనంతరం ప్రభుత్వ విధి నిర్వహణలో ఉత్తమ  సేవలను అందించిన ఉద్యోగులు ఎడిషనల్ ఎస్.పి.  పి.సోమశేఖర్, జిల్లా విద్యా శాఖాధికారి కె.చంద్రకళ,  జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, ఐసి.డిఎస్  పిడి జి.జయదేవి, ఎడి హాండ్లూమ్స్ వి.పద్మ, జిల్లా అటవీశాఖాధికారి సి.హెచ్.కృపావరంజిల్లా పంచాయితీ అధికారి వి. రవికుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు ఎ.డి. కె. ప్రభాకరరావు, ఎపిఎస్ డబ్ల్యు.ఆర్.ఇ.ఐ. కో-ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి,  తదితర అధికారులకు ప్రశంసా పత్రాలను బహూకరించారు. కోవిడ్ వారియర్స్ కు ప్రశంసాపత్రాలు:   2020 సం.లో మానవాళి మనుగడకే కరోనా ముప్పు తెచ్చిన విషయం అందరికీ విదితమే.  మన జిల్లా కలెక్టర్ జె.నివాస్ అవిరళ కృషి, నిస్వార్ధ సేవ, యంత్రాంగాన్ని సన్నిధం చేసి కరోనాను ఎదుర్కోవడంలో విశేష కృషి చేయడంతో కరోనా మరణాలు, కరోనా కేసులు మన జిల్లాలో తగ్గు ముఖం పట్టాయి.   కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య సేవలను అందించిన వైద్యులు, ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎంలు, సచివాలయ సిబ్బంది, ప్రత్యేక అధికారులకు ప్రశంసా పత్రాలను అందించడం విశేషం   జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్ధ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ, బి.సి.కార్పోరేషన్, ఎస్.సి.కార్పోరేషన్, వ్యవసాయ శాఖ, ఐ.టి.డి.ఎ, తదితర ప్రభుత్వ శాఖలు తమ శాఖలు నిర్వహిస్తున్న వివిధ అభివృధ్ధి కార్యక్రమాలు, పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.  కార్యక్రమ వ్యాఖ్యాన కర్తగా వావిలపల్లి జగన్నాధం నాయుడు వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.రామకృష్ణ, ,  జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్, సంయుక్త కలెక్టర్లు కె.శ్రీనివాసులు,  సుమీత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ గనూర్ ధనుంజయ, ట్రైనీ కలెక్టర్ నవీన్, జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు,  జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి,  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.సి.నాయక్, శ్రీకాకుళం, పాలకొండ  రెవెన్యూ డివిజనల్ అధికారులు  ఐ.కిశోర్, టి.వి.ఎస్.జి. కుమార్,   నగర పాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య,   తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-26 18:51:21

జివిఎంసీ ఉత్తమ అధికారిగా..డా.సన్యాసిరావు..

ఆయన రంగంలోకి దిగితే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం కావాల్సిందే..ఆయన క్షేత్ర పర్యటనకు వస్తున్నారంటే సిబ్బంది మొత్తం అరగంట ముందుండాల్సిందే..ఈరోజు కార్యక్రమం రేపు చేద్దామనే మాట ఆయన డిక్షనరీలోనే ఉండదు..అర్హుహులైన ప్రతీ నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆయనది అందివేసిన చేయి..ఆయనే విశాఖ జివిఎంసీ అదనపు కమిషనర్ డా.సన్యాసిరావు. ఉత్తమమైన విధినిర్వహణకు ఆయన నిలువట్టద్దం. అందుకే ఆయననే ఎప్పుడూ ఉత్తమ అధికారి అవార్డులు ఈయననే వరిస్తాయి..అవును నిజంగానే ఆయన ఉత్తమ అధికారి..అధికారిగానే కాదు..ఒక వ్యక్తిగా సమాజసేవకుడిగా కూడా ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందుతారాయన...ఒక్కమాటలో చెప్పాలంటే అడిషనల్ కమిషనర్ గారు ఆఫీసులో ఉంటే మన సమస్య తీరినట్టే అనే బరోసా వివిద సమస్యలపై ఫిర్యాదుచేయడానికి వచ్చే అర్జీదారుల్లో కల్పించారంటే ఈయన విధినిర్వహణ, సమయస్పూర్తి, సహాయం, సేవ చేసే గుణం ఏస్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జివిఎంసి ప్రత్యేక అధికారి వి.వినయ్ చంద్ ఈయనను ఉత్తమ అధికారిగా గుర్తిస్తూ 2వ సారి అవార్డును అందజేశారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖలోని ఏ అధికారికైనా అవార్డు వస్తే అదేదో సాధించినట్టుగా చాలా మంది అధికారులు, సిబ్బంది ఫీలైపోతున్న ఈరోజుల్లో, మనం ఏ స్థాయిలో ప్రజలకు ఒక ప్రభుత్వ అధికారిగా సేవలు అందిస్తున్నామో అదే మనకి అసలు, సిసలైన పీపుల్స్ అవార్డు అని భావిస్తారు సన్యాసిరావు. విశాఖ స్మార్ట్ సిటీలో చాలా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయడంలో సన్యాసిరావు ఎంతో కీలకంగా వ్యవహరించారు. డైనమిక్ ఐఏఎస్ అధికారి డా.స్రిజన నేత్రుత్వంలో ఏపనిచేసినా తిరుగులేకుండా పూర్తిచేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారీయన. కరోనా సమయంలో అధికారులతో కలిసి ప్రాణాలకు తెగించి మరీ చేసిన ఈయన విధినిర్వహణకు మచ్చుతునకగా చెప్పొచ్చు. జీవిఎంసిలో ఉత్తమ అధికారి అవార్డు డా.సన్యాసిరావుకి రావడంలో చాలా మంది అధికారులు తమకు కూడా వచ్చినట్టు ఆనందపడ్డారు దానికి కారణం ఒక్కటే..ఈయన క్రింద పనిచేసే అధికారులు బాగా పనిచేస్తేనే ఈయన పరిపాలన అంతచక్కగా ఉందని చెప్పడానికి కూడా కారణమవుతుంది. అదనపు కమిషనర్ డా.సన్యాసిరావు గణతంత్రదినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారిగా అవార్డు స్వీకరించడం పట్ల జీవిఎంసీ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేయడంతోపాటు, ప్రత్యేకంగానూ, వ్యక్తికగతంగానూ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న కాలంలో ఈయన మరిన్ని ఉత్తమ అవార్డులు స్వీకరించాలని ఆశిద్ధాం..!

విశాఖపట్నం

2021-01-26 17:18:19

అవకాశాలు, మేధస్సుకు వేదిక భారత్‌..

అపార మేధస్సుకు, అనంత అవకాశాలకు వేదికగా భారత దేశం నిలుస్తుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోద్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, జాతీయ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ నూతన సమాజానికి అనుగుణంగా, అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యను విద్యార్థులకు చేరువ చేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, తీవ్రవాద రహితంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ముందుగా ఏయూలోని మహాత్మాగాంధీ, డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాజ్యాంగ రచనకు విశేష కృషిచేసారన్నారు. ఎందరో పోరాటాలు, త్యాగాలు అనంతరం స్వాతంత్య్రం సాకారం అయిందన్నారు. రాజ్యాంగం సామాజిక మార్పుకు, సమానత్వానికి వారధిగా నిలచిందన్నారు. అనంతరం జాతీయ సేవా పథకం విద్యార్థులకు, పోగ్రాం అధికారులకు పురస్కారాలను ప్రధానం చేశారు. ఎన్‌సిసి, ఏయూ సెక్యూరిటీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌ప్రిన్సిపాల్స్, ‌డీన్స్, అధికారులు, ఆచార్యులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-26 13:26:41

కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు..

జర్నలిస్టు కుటుంబాలు శుభిక్షంగా ఉండాలని, కరోనా వైరస్ పూర్తిగా సమసి పోవాలని వేడుకుంటూ శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి ఈమేరకు అమ్మవారిని ధర్శించుకొని, విగ్రహానికి పాలభిషేకం చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, అమ్మలగన్న అమ్మ, ఉత్తరాంధ్రాను చల్లగా కాచికాపాడే కనకమహాలక్ష్మీ తల్లికి ప్రత్యేక పూజలు చేసినట్టు చెప్పారు. జర్నలిస్టుల కష్టాలు, సమస్యలు తీర్చి చల్లగా చూసేలా అమ్మవారిని వేడుకున్నట్టు వివరించారు. తన జీవితాంతం జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు సేవచేసే భాగ్యాన్ని కూడా ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా వుందని వివరించారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Visakhapatnam

2021-01-25 21:24:45

విజయనగరం స్పందనకు 206 వినతులు..

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 206 వినతులు అందాయి. ఈ వినతులను సంయుక్త కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్, జిల్లారెవెన్యూ అధికారి గణపతిరావు, సహాయ కలెక్టర్ సింహాచలం, విపత్తుల ప్రోజెక్టు డైరెక్టర్ పద్మావతి స్వీకరించారు.  అమ్మవడి, రైతు భరోసా, సదరం, వసతిదీవెన, పింఛన్లు, పౌరసరఫరాలు, బియ్యంకార్డులు, ఉపాధి పనులు తదితర శాఖలకు అర్జీదారుల నుండి దరఖాస్తులు అందాయి.   ఆయా శాఖల ఉన్నతాధికారులకు దరఖాస్తులను అందజేస్తూ వినతులు సత్వరమే పరిష్కారం చేయాలని సూచించారు. ఈ స్పందనలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.

Vizianagaram

2021-01-25 18:38:15

కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ కు ఉత్తమ అవార్డు..

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్  మ‌రో  అరుదైన పుర‌స్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలోనే ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల అధికారిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఆయ‌న ఎంపికైన విష‌యం తెలిసిందే. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూషణ్‌ హరిచందన్  చేతుల మీదుగా విజయవాడ లోని ఏ.పి.రాజ్ భవన్ లో సోమ‌వారం  ఈ అవార్డును స్వీక‌రించారు.  ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ధేశించిన అన్ని అంశాల‌నూ జిల్లాలో స‌కాలంలో పూర్తి చేయ‌డం ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కు ఈ అరుదైన అవార్డు ల‌భించింది. జిల్లాలో ఎప్ప‌టిక‌ప్పుడు ఓట‌ర్ల జాబితాల‌ను అప్‌డేట్ చేయ‌డం, ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించ‌డం, అధిక ఓటింగ్ శాతాన్ని న‌మోదు చేయ‌డం, పోలింగ్ కేంద్రాల నిర్వ‌హ‌ణ‌, రాజ‌కీయ పార్టీల‌కు వివిధ అంశాల్లో త‌ర‌చూ అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, స్లీప్ కార్య‌క్ర‌మాన్ని వినూత్నంగా, విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం, నిరంత‌రం కొన‌సాగే కార్య‌క్ర‌మాల‌తోపాటు,  ప్ర‌త్యేక ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని కూడా విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం, దీనిలో భాగంగా అందిన ద‌ర‌ఖాస్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి, త‌గు మార్పులూ, చేర్పుల‌ను పూర్తి చేయ‌డం, క్లెయిముల‌ను ప‌రిష్క‌రించ‌డంలో రాష్ట్రంలోనే ప్ర‌ధ‌మ స్థానంలో నిల‌వ‌డం త‌దిత‌ర అంశాల ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఉత్త‌మ ఎన్నిక‌ల అధికారిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎంపిక చేసింది. అవార్డు ప్ర‌ధాన కార్య‌క్ర‌మంలో ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యనిర్వహణ‌ అధికారి కే. విజయానంద్, రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ సతీమణి శైల‌జా బాయి కూడా పాల్గొన్నారు.   బెస్ట్ ఇఆర్ఓగా బాలా త్రిపుర సుంద‌రి            ఉత్త‌మ ఇఆర్ఓగా  కెఆర్ఆర్‌సి స్పెష‌ల్ డిప్యుటీ క‌లెక్ట‌ర్ బాలా త్రిపుర సుంద‌రి ఎంపిక‌య్యారు. ఆమె కూడా సోమ‌వారం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ చేతుల‌మీదుగా రాజ్‌భ‌వ‌న్‌లో అవార్డును అందుకున్నారు. విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్ప‌టిక‌ప్పుడు క్లెయిముల‌ను ప‌రిష్క‌రించినందుకు గానూ ఆమెను ఉత్త‌మ ఇఆర్ఓగా ఎంపిక చేశారు.

Vizianagaram

2021-01-25 18:36:09