1 ENS Live Breaking News

టీటీడీకి శానిటైజర్లు బహూకరణ..

వైవి మెడికల్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం 6 లక్షల రూపాయల విలువచేసే శానిటై జర్లు, సోపులు, విటమిన్ టాబ్లెట్లు, ఫేస్ షీల్డ్ లు  టీటీడీకి బహూకరించారు. తిరుమల అన్నమయ్య భవన్ వద్ద  టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డికి వీటిని అందించారు. విజయవాడకు చెందిన రాజేశ్వరి మెడికల్స్ సహకారంతో వీటిని అందించామని వైవి మెడికల్ యూత్ అధ్యక్షుడు టి.చంద్రశేఖర్ రెడ్డి, జక్కా సీతారామాంజనేయులు,  సురేష్ తెలిపారు. టీటీడీ ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-05 20:08:04

ఎన్నికలకు సమస్త ఏర్పాట్లు పూర్తి..

విశాఖజిల్లాలో పంచాయితీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వెల్లడించారు.  జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గాను సిబ్బందిని నియమించడం, అవసరమైన రవాణా, మెటిరియల్, కోవిడ్ మార్గదర్శకాలను పాటించడానికి పి.పి.ఇ. కిట్లు, మాస్కులు, శానిటైజర్లు  సిద్దం చేయడం జరిగిందన్నారు.  శుక్రవారం కలెక్టరు ఛాంబరులో తనను కలసిన విలేఖరులతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను గురించి వివరించారు. ఎన్నికల సందర్భంగా డ్యూటీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అందరూ విధులలో వున్నారన్నారు. అనకాపల్లిలో ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియను అబ్జర్వర్ అదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు.  పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొదట విడత  ఎన్నికలు జరుగుతున్న అనకాప్లలి డివిజన్ లో  12 మండలాల్లో  340 గ్రామ సర్పంచ్ పదవులకు 44 గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మిగిలిన 296 సర్పంచ్ లకు 767 మంది అభ్యర్థులు  పోటీలో వున్నారు. మొత్తం 3250   వార్డు మెంబర్లకు 804 మంది ఏకగ్రీవంగా ఎన్నికవగా మిగతా 2441  వార్డులకు 5260   అభ్యర్థులు పోటీలో  ఉన్నారని వెల్లడించారు. నర్సీపట్నంలో 2584 వార్డులలోను 8619 మంది పోటీ చేస్తుండగా 261 పంచాయితీలలో 1435 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. విలేఖరుల ప్రశ్నకు సమాధానముగా గుర్తుల కేటాయింపు జరగవలసి వుందని, పాడేరులో నామినేషన్ల ప్రక్రియ రేపటి నుండి జరుగుతుందన్నారు. పాడేరులో 3వదశలో రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుంతుందన్నారు. 244 గ్రామ పంచాయితీలకు 2446 వార్డులకు నామినేషన్ల స్వీకరించడం జరుగుంతుంది. పాడేరులో ఉ.6.30 గం. నుండి మ.1.30 గం. వరకు పోలింగు జరుగుతుందని పోలింగు పూర్తవగానే కౌంటింగు జరుగుతుందని వివరించారు. మంచినీళ్లు , విద్యుత్ , శానిటేషన్, రాత్రిబస, భోజనాలు మొదలగు  ఏర్పాట్లు గావించడవం జరుగుతుందన్నారు. ఇందుకు గాను రూట్ ఆఫీసర్లు ముందుగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఓటర్లందరూ ఓటింగులో పాల్గొనాలన్నారు.

Visakhapatnam

2021-02-05 19:46:13

ఈ డబుల్ మీనింగ్ కామెడీ చేస్తే నవ్వలేక చస్తారు..

నవ్వు ఎన్నో రోగాలను నయం చేస్తుందంటారు. ఈరోజుల్లో కడుపుబ్బా నవ్వే జోకులు టార్చిలైటు వేసి వెతికినా ఎక్కడా దొరడం లేదు. కానీ తిరునాళ్లు, గ్రామదేవతల పండుగల్లో మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అవేనండీ అలనాటి బుర్రకధలు. నేటికీ కొందరు కళాకారులు ఈ బుర్రకధలను ప్రదర్శిస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఎపుడైనా మనసుకి చిరాకు అనిపించినా, మనసారా నవ్వుకోవాలంటే కంప్లీట్ డబుల్ మీనింగ్ డైలాగులుండే ఈ బుర్రకధలను ఒక్కసారి చేస్తే సరి దగ్గువచ్చేలా నవ్వుకోవడం ఖాయం..

Visakhapatnam

2021-02-05 16:54:02

ప్రజల కనీస అవసరాలన్నీ తీరుస్తాం..

ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాల‌న్నిటినీ తీరుస్తామ‌ని రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం చిత్త‌శుద్దితో ప‌నిచేసే ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమూ త‌మ ప్ర‌భుత్వానికి రెండు క‌ళ్లు అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, దేవాదాయ శాఖామాత్యులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో పూర్తి చేసిన వివిధ అభివృద్ది ప‌నుల‌ను ఆరంభించేందుకు, ప్రారంభోత్స‌వ మాసోత్స‌వాలు పేరిట చేప‌ట్టిన వినూత‌న్న‌ కార్య‌క్రమానికి మంత్రులు శుక్ర‌వారం శ్రీ‌కారం చుట్టారు. వివిధ అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా దాస‌న్న‌పేట‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడారు. రాజ‌కీయాల‌కు, పార్టీల‌కు అతీతంగా త‌మ ప్ర‌భుత్వం అంద‌రి సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లంద‌రి క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు. వారి సంక్షేమానికి చిత్త‌శుద్దితో కృషి చేస్తామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జిల్లాలో అభివృద్ది పూర్తిగా కుంటుబ‌డింద‌ని, ప్ర‌జ‌ల సంక్షేమాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో తాగునీటి స‌మ‌స్య‌ను పూర్తిగా ప‌రిష్క‌రించేందుకు అప్ప‌ట్లో రామ‌తీర్ధ‌సాగ‌ర్ ప్రాజెక్టును తెచ్చామ‌ని, రాజ‌కీయ కార‌ణాల‌తో గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు దీనిని ఉద్దేశ‌పూర్వ‌కంగా క‌క్ష‌గ‌ట్టి ప్ర‌క్క‌న‌బెట్టార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను, వారి సంక్షేమాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోనివారికి ప‌ద‌వులు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంద‌న్నారు. త‌మ‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని పేర్కొన్నారు. అర్హులంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని, ఇది నిరంత‌ర కార్య‌క్ర‌మంగా కొన‌సాగుతుంద‌ని మంత్రి బొత్స‌ చెప్పారు.                  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డా లేనివిధంగా 31 ల‌క్ష‌ల‌మందికి ఇళ్ల స్థ‌లాలు ఇచ్చి, త‌మ ప్ర‌భుత్వం రికార్డు సృష్టించింద‌న్నారు. తాము కొత్త‌గా ఊళ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని, దానిలో భాగంగా గుంక‌లాంలో సుమారు 12వేల ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని చెప్పారు.  త‌మ ప్ర‌భుత్వానికి అభివృద్ది, సంక్షేమ‌మూ రెండు క‌ళ్లు లాంటివ‌న్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కేలండ‌ర్ ప్ర‌కారం అమ‌లు చేసిన ఘ‌న‌త  ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌ని కొనియాడారు. అన్ని ప్రాంతాల స‌మాన అభివృద్ది కోస‌మే మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింద‌న్నారు.  గ‌త ఐదేళ్లూ అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబునాయుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్ని మోసం చేశార‌ని విమ‌ర్శించారు. పేద‌ల‌కు ఇళ్ల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవ‌డానికి చంద్రబాబు ప్ర‌య‌త్నించార‌ని మంత్రి ఆరోపించారు.                   విజ‌య‌నగ‌‌రం ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, అధికారంలోకి వ‌చ్చిన 18 నెల‌ల్లోనే ఇచ్చిన హామీల‌న్నిటినీ నెర‌వేర్చిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికే ద‌క్కింద‌న్నారు. సుమారు 3,648 కిలోమీట‌ర్ల త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌లో తెలుసుకున్న ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను, ఇబ్బందుల‌ను అధికారంలో వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి తొల‌గిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌లంద‌రి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అంద‌జేస్తున్నార‌ని అన్నారు.                   స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హించిన ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, దాస‌న్న‌పేట ప్రాంతంలో త్రాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని అన్నారు. కేవ‌లం రెండేళ్ల‌లోనే ఈ స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించామ‌ని, ఇంటింటికీ కొళాయిలు కూడా మంజూరు చేస్తామ‌ని చెప్పారు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు స‌క్ర‌మంగా త్రాగునీరు అందించేందుకు ఏడు చోట్ల రిజ‌ర్వాయ‌ర్లును నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం సుమారు 15వేల కిలోలీట‌ర్ల నీరు అందుబాటులో ఉంద‌ని, కొత్త‌గా నిర్మించే ట్యాంకుల ద్వారా అద‌నంగా మ‌రో 5000 కిలోలీట‌ర్ల నీరు అందుబాటులోకి వ‌స్తుంద‌ని స్వామి తెలిపారు.                    ఈ కార్య‌క్ర‌మాల్లో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ‌, మున్సిప‌ల్ ఇంజ‌నీర్ కె.దిలీప్‌, సూప‌రింటిండెంట్ ఇంజ‌నీర్ బిహెచ్ శ్రీ‌నివాస్‌, ఎఎంసి వైస్ ఛైర్మ‌న్ జ‌మ్ము శ్రీ‌నివాస‌రావు, పార్టీ నాయ‌కులు ఆశ‌పు వేణు, డాక్ట‌ర్ విఎస్ ప్ర‌సాద్‌, ఎస్‌వివి రాజేష్‌, బొద్దాన అప్పారావు, త‌విటినాయుడు త‌దిత‌ర ప‌లువురు నాయ‌కులు, మున్సిప‌ల్ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-05 14:33:30

ఎన్నిక‌ల్లో జోన‌ల్ అధికారుల పాత్ర కీల‌కం..

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జోన‌ల్ అధికారుల పాత్ర చాలా కీల‌క‌మ‌ని, అంద‌రి అధికారుల‌తో, సిబ్బందితో స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఎన్నిక‌ల‌ను స‌జావుగా ‌నిర్వ‌హించాల్సిన బాధ్యత వారిపై ఉంద‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌తి అంశంపై జోన‌ల్ అధికారులు పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు. జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో శుక్ర‌వారం జ‌రిగిన జోన‌ల్ అధికారుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ పాల్గొని మాట్లాడారు. ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ప‌లు సందేహాల‌ను నివృత్తి చేశారు. జోన‌ల్ అధికారులు ఇటు జిల్లాస్థాయి అధికారులు, మండ‌ల‌, గ్రామ స్థాయి అధికారుల‌తో స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప్ర‌తి అంశంపైనా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని చెప్పారు. ప్ర‌తి ద‌శ‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఎన్నిక ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేందుకు అన్ని చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌ణాళికాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లూ జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలన్నారు. ఆర్‌వోల‌తో, ఏఆర్‌వోల‌తో, రూట్ అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దిస్తూ ప్ర‌క్రియను స‌జావుగా నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌కు సంబంధించిన తాజా అంశాల‌పై జిల్లా కేంద్రానికి స‌మాచారం ఇవ్వాల‌ని, ఎన్నిక ముగిసిన త‌ర్వాత పూర్తి వివ‌రాల‌తో కూడిన నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు. వీలైనంత మేర సాధ్యమైన‌న్ని పోలింగ్ కేంద్రాల‌ను సంద‌ర్శించాల‌ని, అక్క‌డ ప‌రిస్థితుల‌పై స‌మాచారం అందించాల‌ని హిత‌వు ప‌లికారు. జోన‌ల్ అధికారుల‌కు ఎక్జిక్యూటివ్ మ‌రియు మెజిస్ట్రీయ‌ల్ అధికారులు ఉంటాయి కాబ‌ట్టి ఎన్నిక ప్ర‌క్రియ‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొన్నారు. స‌మ‌స్యాత్మ‌క గ్రామాలు, పోలింగ్ కేంద్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని, అవ‌స‌ర‌మైతే పోలిస్ అధికారుల‌తో కూడా సంప్ర‌దించి స‌మ‌స్య‌లు లేకుండా చూసుకోవాల‌ని ఉప‌దేశించారు. ఎన్నిక ముందు రోజు నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ ముగిసేంత వ‌ర‌కు జోన‌ల్ అధికారులు జవాబుదారీత‌నం వ‌హించాల‌ని, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కలెక్ట‌ర్ సూచించారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎప్పుడూ మిగ‌తా వారికి ఆద‌ర్శంగానే నిలిచింద‌ని.. ఈ సారి కూడా మ‌న‌మే అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా, ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలంటే జోన‌ల్ అధికారులు ధైర్యంగా ఉండాల‌ని, స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించాలన్నారు. అలాగే నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను, ప‌ద్ధ‌తుల‌ను ఎన్నిక‌ల‌లో జొప్పించ‌రాద‌ని, నిబంధ‌న‌ల ప్రకారం ప్ర‌తి ఒక్క‌రూ న‌డుచుకోవాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా పంచాయ‌తీ అధికారి సునీల్ రాజ్ కుమార్‌, జిల్లా ప‌రిష‌త్ సీఈవో టి.వెంక‌టేశ్వ‌ర‌రావు, డీఎల్‌డీవో రామ‌చంద్ర‌రావు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-05 14:31:47

మొక్క‌ల పెంప‌కంతో ఆయ‌ష్షు పెరుగుతుంది..

మొక్క‌ల పెంప‌కంతో ప‌ర్యావ‌రణంలో ఆక్సిజ‌న్ స్థాయి పెరుగుతుంద‌ని.. త‌ద్వారా మన ఆయ‌ష్షు పెరుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలోని శివరాం సాగరం చెరువు, జగ్గు గుప్తవాణి చెరువుల వ‌ద్ద శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అప‌రిశుభ్ర‌తే అనారోగ్యానికి కార‌ణ‌మ‌ని, మ‌న ఇంటినే కాకుండా మ‌న గ్రామాన్నికూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌ని అన్నారు. ఆరోగ్యానికి మించిన సంప‌ద మ‌రొక‌టి లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చెరువుల‌ను కాపాడుకోవాల‌ని.. వ్య‌ర్థాలు వేసి నీటిని క‌లుషితం చేయ‌వ‌ద్దని సూచించారు. 150 క్రోటాన్ మొక్కలు స్పాన్సర్ చేసిన శ్రీసాయి సిద్ధార్థ విద్యాసంస్థ‌లు కరస్పాండెంట్ ఎస్‌. చంద్రశేఖర్‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా  అభినందించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా అట‌వీ అధికారి బి.జాన‌కిరావు, ఎంపీడీవో ఎంవీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం, ఈవోపీఆర్డీ వి.వి.రవికుమార్, చేయూత ఫౌండేషన్ సొసైటీ ఉపాధ్య‌క్షురాలు లెంక సంధ్య‌,  అధ్య‌క్షుడు ఎం.రాము స్థానిక న్యాయవాది కె. రామునాయుడు, ఎన్.ఆర్‌.ఈ.జి.ఎస్ ఏపీవోలు సత్యవతి, జి. ప్రతిమాదేవి, వెలుగు ఏపీఎం రమేష్, స్ఫూర్తి అసోసియేష‌న్ అద్య‌క్షుడు వై.వి. సాయి కుమార్, సచివాలయ సిబ్బంది, కేజీబీవీ విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-02-05 14:29:40

రెవిన్యూ సిబ్బందికి కలెక్టరేట్ లో కోవిడ్ వాక్సిన్..

 కోవిడ్ వాక్సిన్ లో భాగంగా  ఫ్రంట్ లైన్ వారియర్స్  అయిన కలెక్టరేట్  పరిధి లోగల రెవిన్యూ సిబ్బందికి శుక్రవారం కో వాక్సిన్ టీకా వేసారు.  సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, పలు  సెక్షన్లకు చెందిన సిబ్బందికి  కల్లెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా  వైద్య ఆరోగ్య శాఖా దికారి డా. ఎస్.వి. రమణ కుమారి పర్యవేక్షణ లో ఈ టీకా వేసారు.  ముందుగానే ఆన్లైన్ ద్వార సంబంధిత వెబ్సైటు నందు రెవిన్యూ అధికారుల, సిబ్బంది పేర్లన్నీ నమోదు చేసుకోవడం జరిగిందని , అందుకు సంబంధించిన పత్రాలను నింపి సంతకాలు  తీసుకున్నారు.  టీకా వేసిన తర్వాత అర్ధ గంట వరకు  అబ్సర్వేషన్ గదిలో ఉంచారు. అనంతరం వైద్య సిబ్బంది  బి.పి ,పల్స్ అక్షీ మీటర్  తో పల్స్ రేట్ ను తనిఖీ చేసిన  అంతా  నార్మల్ గా ఉండడం తో  పంపించారు.  టీకా తీసుకున్న తర్వాత తన శరీరం లో ఎలాంటి మార్పులు  కనపడలేదని, అంత సాధారణంగానే ఉందని సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు తెలిపారు.  శుక్రవారం  సాయంత్రం వరకు  రెవిన్యూ సిబ్బంది అందరకు టీకా వేయడం జరుగుతుందని జిల్లా  వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు. 

Vizianagaram

2021-02-05 14:28:22

వంశీ క్రిష్ణశ్రీనివాస్ కి SCRWA శుభాకాంక్షలు..

వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు, మంచి మనిషి, సేవాతత్పరుడు, నా అనుకునే వారికి అండగా నిలిచే మ్రుదు స్వభావి వంశీక్రిష్ణ శ్రీనివాస్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం వంశీక్రిష్ణశ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆయన ఇంటి దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గజమాలతో ఘనంగా సత్కరించారు. అంతకు ముందుగా కాంగోతో ఊరేగింపుగా వంశీ నివాసానికి చేరుకొని వంశీతో కేక్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ, విశాఖనగరంలో వైఎస్సార్సీపీకి తిరుగులేని నేత వంశీ మాత్రమే అన్నారు. పార్టీ అభివ్రుద్ధికిగానీ, ప్రజాసేవకు గానీ ఈయనకు మించిన వ్యక్తి లేరని కొనియాడారు. ఎందరికో తన పరిధికి మంచి సేవలు చేసే మంచి వ్యక్తి వంశీక్రిష్ణశ్రీనివాస్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు జీ.వి.సాగర్,దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-05 14:17:29

కర్మాగాలరాశాఖ ఉద్యోగినిపై వేటు పడింది..

శ్రీకాకుళం జిల్లాలోని కర్మాగారాల శాఖ కార్యాలయ ఉద్యోగినిపై సస్పూండ్ వేటు పడిండి. ఈ మేరకు జిల్లా కర్మాగారశాఖ డైరెక్టర్  డైరక్టర్ డి.చంద్రశేఖర వర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. తనిఖీ  కార్యాలయంలో (Inspector of Factories) సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి కార్యాలయంలో చేసిన అవకతవలు నిగ్గుతేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విధినిర్వహణలో అలసత్వం కారణంగానే ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సి.సి. కెమేరా ఫుటేజీ ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు.  అంతేకాకుండా ఈమెవచ్చిన అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి  క్రమశిక్షణా చర్యలలో భాగంగా ఆమెను సస్పెండ్ చేసినట్లు  డైరక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Srikakulam

2021-02-05 14:05:24

ఇంధన పొదుపు అందరి బాధ్యత..

ఆర్టీసీ బస్సుల ఇంధన సామర్ధ్యం పెంచి, ఇందనాన్ని పొదుపు చేయడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఆర్.టి.సి డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.వరలక్ష్మీ సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్.టి.సి 1వ డిపోలో ఇంధన పొదుపు మాసోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం బస్సుల ఇంధన సామర్ధ్యం 5.48గా ఉందని, ఆ సామర్ధ్యాన్ని మరింత పెంచే దిశగా సిబ్బంది కృషిచేయాలని కోరారు. ప్రతీ డ్రైవరు సురక్షిత ప్రయాణానికి అవసరమైన పంచ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఏక్సిలేటరును జాగ్రత్తగా వాడాలని, కంటి చూపుతూనే బ్రేకును వినియోగించాలని చెప్పారు. బస్సు నిర్ధిష్టమైన వేగాన్ని అందుకున్న తదుపరి ఏక్సిలేటర్ పవర్ పాయింటుతో నడపాలని అన్నారు. ఇంజిన్ స్పీడ్, వాహనం స్పీడ్ మేచ్ అయ్యేవిధంగా చేసే విధానాన్ని పవర్ పాయింట్ విధానం అని అంటారని, ప్రస్తుతం వచ్చిన కొత్త బస్సులన్నింటికీ ఈ విధానం వర్తిస్తుందన్న సంగతిని ఆమె గుర్తుచేసారు.  ఏటవాలు రోడ్లపై, మలుపులు ముందు ఏక్సిలేటర్ పెడలుపై పాదాలను పూర్తిగా తీసివేయాలని ఆమె సూచించారు. ప్రతీ స్టేజీకి, స్పీడ్ బ్రేకర్లను ముందుగానే గుర్తించి ఏక్సిలేటర్ వాడకాన్ని నిలిపివేయాలని ఇటువంటి కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం వలన ఇంధన సామర్ధ్యం పెరుగుతుందని, ఈ విషయాన్ని వాహనం నడిపే ప్రతీ డ్రైవరు గుర్తెరగాలని పిలుపునిచ్చారు.  ఇంధనం చాలా విలువైందని, ఇంధనం పొదుపులోనే ఆదాయం ఉందని,  కావున డ్రైవర్లు కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపట్టి ఇంధనం పొదుపు చేయాలని ఆమె కోరారు.           గతేడాది కరోనా కారణంగా బస్సులు నిలిపివేయడం వలన ఆదాయం తగ్గిందని, ప్రస్తుతం జాతీయ రహదారుల విస్తరణ 98 శాతం పూర్తయినందున నష్టపోయిన ఆదాయాన్ని పూర్తిచేసేలా డ్రైవర్లు, మెకానిక్ లు, శ్రామిక్, సూపర్ వైజర్లు కృషిచేయాలని ఆమె ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా ఇంధన సామర్ధ్యం పెంచడంలో విశేష సేవలు అందించిన డ్రైవర్ కె.రాజారావు, మెకానిక్ కె.జె.రావు, జయదేవ్, టైర్ మెకానిక్ రామ్మోహన్, గేరేజ్ సూపర్ వైజర్ జి.వి.కె.రాజు, ఇంధన పొదుపులో ప్రధాన భూమిక పోషించిన ఈశ్వరరావులకు డెప్యూటీ సిటిఎం బహుమతులను అందజేసి అభినందనలు తెలిపారు.  ఆర్.టి.సి 1వ డిపో మేనేజర్ వి.ప్రవీణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, శ్రీకాకుళం సేల్స్ మేనేజర్ ప్రియాంక, డ్రైవర్లు, సూపర్ వైజర్లు, మెకానిక్ లు, శ్రామిక్ , ఆర్.టి.సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-02-05 14:01:11

ఉపాది శిక్షణ సద్వినియోగం చేసుకోండి..

ఉపాది లభించే కోర్సులను నిరుద్యోగ యువత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జెసి జి.రాజకుమారి అన్నారు. గురువారం తూర్పు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ ఏరియా లోగల ప్రధాన మంత్రి కౌశల కేంద్రాన్ని  జెసి సందర్శించారు. ఈ సందర్భంగా  సెంటర్ నందు జరిగే శిక్షణా కార్యక్రమాలు సమీక్షించి ఆటోమోటివ్ టూ అండ్ త్రీ వీలర్స్ టెక్నీషియన్ మరియు రూమ్ అటెండెంట్ శిక్షణార్థులు తో శిక్షణ వివరాలు, వాటి ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణను ఎలా ఉపయోగించుకోవాలో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఢి. హరీష్ శేషు  మరియు ఇ. సి. ఏ. ఏడ్యూ స్కిల్స్ ఫ్యాకల్టీ మరియు ఇతరు సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-02-04 18:19:04

నిష్ప‌క్ష‌పాతంగా విధులు నిర్వ‌ర్తించాలి..

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో క్షేత్ర‌స్థాయిలో కీల‌క‌పాత్ర పోషించే ప్రిసైడింగ్ అధికారులు, స‌హాయ ప్రిసైడింగ్ అధికారులు నిష్ప‌క్ష‌పాతంగా, బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. గురువారం కాకినాడ‌లోని రంగ‌రాయ మెడిక‌ల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వ‌హించిన 767 మంది ప్రిసైడింగ్‌, స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో పోలింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు ప‌లు సూచ‌న‌లు చేశారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ స‌మ‌యంలో, పోలింగ్ త‌ర్వాత ఈ మూడు ద‌శ‌ల్లో పీవోలు, ఏపీవోలు, ఇత‌ర పోలింగ్ సిబ్బంది అత్యంత అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఏ చిన్న పొర‌పాటుకు అవ‌కాశం లేకుండా ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని, శిక్ష‌ణ స‌మ‌యంలో రిసోర్స్ ప‌ర్స‌న్లు చేసిన సూచ‌న‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని సూచించారు. గ‌తంలో ఎన్నిక‌ల సిబ్బందిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అంటే ప్ర‌తిసారీ స‌వాలే అని అందువ‌ల్ల ఏమ‌రుపాటు త‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. చెక్‌లిస్ట్‌కు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేప‌ర్లు, పేప‌రు సీల్స్ త‌దిత‌ర సామ‌గ్రిని సిద్ధం చేసుకోవాల‌ని.. ఏవైనా సందేహాలుంటే ముందే పై అధికారుల‌ను సంప్ర‌దించి నివృత్తి చేసుకోవాల‌న్నారు. కోవిడ్-19 నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుగుణంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. జిల్లాలో నామినేష‌న్ల ప్ర‌క్రియ స‌జావుగా సాగుతోంద‌ని.. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించి, ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని వివ‌రించారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం స్టేజ్‌-1, స్టేజ్‌-2 అధికారుల శిక్ష‌ణ జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌కు గైర్హాజరు అయిన అధికారులు, సిబ్బందికి షోకాజు నోటీసులు అందించ‌నున్న‌ట్లు జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ హెచ్చ‌రించారు.  స‌‌మావేశంలో జిల్లా పంచాయ‌తీ అధికారి ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్ ఎస్‌.మ‌ధుసూధ‌న్‌, రిసోర్స్ ప‌ర్స‌న్ జ‌గ్గారావు, పీవోలు, ఏపీవోలు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-02-04 18:11:55

జెఎల్‌కు ఎంపికైన విద్యార్థులకు అభినందన..

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్టస్ ‌కళాశాల పరిధిలోని తెలుగు విభాగంకు చెందిన ఆరుగురు పరిశోధకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జూనియర్‌ ‌లెక్చరర్‌(‌జెఎల్‌) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఉద్యోగాలు భర్తీ చేయగా, వీరిలో 6గురు ఏయూ నుంచి ఎంపిక కావడం గర్వకారణం. ఈ సందర్భంగా జెఎల్‌గా ఎంపికైన విద్యార్థులను తెలుగు విభాగంలో ఉదయం సత్కరించారు. విద్యార్థులు తమ ప్రతిభతో ఉపాధి అవకాశాలను పొందడం పట్ల విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. జెల్‌గా ఎంపికైన విద్యార్థులు ఎస్‌.‌రమణ, ఎల్‌.‌ప్రశాంత్‌, ‌టి.మానస కుమారి, డాక్టర్‌ ఎన్‌.‌శివ కుమార్‌, ఏ. ‌సాయిరాం, పి.రాజేశ్వర రావులను అభినందించారు. 

Andhra University

2021-02-04 18:06:45

విభాగాల నిర్వహణ సక్రమంగా ఉండాలి..

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్టస్ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్‌ ‌గురువారం కళాశాల పరిధిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఉదయం ఆయన సోషల్‌ ‌సైన్సెస్‌ ‌భవనంలోని షోషియాలజీ, సోషల్‌ ‌వర్క్, ‌జర్నలిజం, థియేటర్‌ ఆర్టస్, ‌సంగీతం, జపాన్‌ ఇన్ఫర్మేషన్‌ ‌సెంటర్‌ ‌విభాగాలను తనిఖీ చేశారు. ఆచార్యులు, పరిశోధకులు, సిబ్బంది హాజరు పట్టికలు పరిశీలించారు. ఆచార్యులు సెలవుపై వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు మరొక ఆచార్యులు పాఠం చెప్పే విధంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. తరగతుల నిర్వహణ పటిష్టంగా జరగాలని తెలిపారు. విద్యార్థులు నిత్యం తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. తరగతుల నిర్వహణ, సిలబస్‌, ‌కాలపట్టిక వంటివి పరిశీలించారు. విభాగాలలో అందిస్తున్న కోర్సులు, తరగతుల నిర్వహణ తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సైతం వర్సిటీ వసతులను, ఆచార్యుల నిపుణతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న పూర్తి కాలాన్ని జ్ఞాన సముపార్జనకు, ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలన్నారు.

Andhra University

2021-02-04 18:01:41

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి..

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా మైక్రో అబ్జర్వర్ లు నిష్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వహించాలని  ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ ను నిశితంగా గమనించే బాధ్యతను మైక్రో అబ్జర్వర్ లపై ఉంచిందని తెలిపారు. సర్పంచ్,  వార్డు సభ్యుల కోసం పోలింగ్, ఓట్ల లెక్కింపు,  అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం జారీ చేసిన నియమ, నిబంధనలను, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్ లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా జరిగితే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయా లోపాలను తమ నివేదిక లో పొందుపరచాలని కోరారు. అంతకుముందు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్ నియమ‌ నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-04 17:37:22