1 ENS Live Breaking News

సీఎం వైఎస్.జగన్ భవిష్యత్ మార్గ నిద్దేశకుడు

రాష్ట్రంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ మార్గ నిద్దేశకులుగా దక్షిణ నియోజకవర్గం ఎం.ఎల్.ఎ  వాసుపల్లి గణేష్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం ప్రజా రవాణా శాఖ, వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్  రాష్ట్ర కమిటీ సర్యసభ్య సమావేశం విశాఖలోని దొండపర్తి జి.వి.ఎం.సి కళ్యాణమండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వాసుపల్లి హాజరై మాట్లాడారు. ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వికేంద్రీకరణ అంటే కేవలం కర్నూలు, అమరావతి, విశాఖపట్నం లో రాజధానిని నిర్మించాలని కాదని మొత్తం ఆంద్రప్రదేశ్ నే రాజధానిగా చేయాలని లక్ష్యం అని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వ మనుగడకు కీలకమని, అందుకు ప్రభుత్వనికి ఉద్యోగులు సహకరించాలని కోరారు. తమ సంఘం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షు, ప్రధాన కార్యదర్శి ఆర్ దేవరాజులు, జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

 ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన దగ్గర నుండి జి.ఓలు విడుదల, వాటిని అమలు వరకు ఉద్యోగుల సంక్షేమం కొరకు కృషి చేసిందని చెప్పారు.  పీఆర్సీ 2022 లో మిగిలివున్న 2096 మంది ఉద్యోగుల సమస్య పరిష్కారాం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.వి.వి.సత్యనా రాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.కె.హాబీబ్, ఉప ప్రధాన కార్యదర్శిలు టి.రవిశంకర్, జి.పి.రావు, కార్యదర్శిలు అప్పారావు, పి.వి.రావు, ప్రచార కార్యదర్శి యు.వి.రత్నం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా అధ్యక్షు, కార్యదర్శిలు, డిపో అధ్యక్షు, కార్యదర్శిలు నాయకులు, ఉద్యోగులు తదితర అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Dondaparthy

2022-12-14 14:28:31

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకి అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఎం.కుమార్ రెడ్డి టిటిడి బుధవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. టిటిడి పరిపాలన భవనంలో జేఈఓ వీరబ్రహ్మంకు ఈ మేరకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి అన్నప్రసాదం ప్రతీ భక్తుడికి పూర్తిస్థాయిలో చేరాలన్నదే తమ కోరికని..తిరుమలకు వచ్చిన ప్రతీ భక్తుడూ..స్వామివారి అన్నప్రసాదం సీకరించాలని, తరిగొండ వెంగమాంబను స్పూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.

Tirumala

2022-12-14 13:58:19

భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలి

భావితరాలకు చక్కని పర్యావరణం అందించేందుకు ఇంధన వనరులను బాధ్యతతో వినియోగించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు.  బుధవారం భీమవరం ప్రకాశం సబ్ సెంటర్ లో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు .ముందుగా ఇంధన పొదుపుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి  ఇంధనాన్నిపొదుపుగా వినియోగించుకుంటామని  అక్కడకు హాజరైన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు .
అనంతరం  మాట్లాడారు. భారతదేశ పౌరునిగా ప్రతి ఒక్కరూ విద్యుత్ వృధాను అరికట్టి  సరైన రీతిలో వినియోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. 

అలాగే క్షేత్రస్థాయిలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పలు రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ గృహ వినియోగదారులు ,పరిశ్రమ దారులు పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ఇతర ఇంధన వనరులను ఉపయోగించడంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతిరోజు పెట్రోల్ తో వాహనం నడుపుతున్నామని దాంతోపాటు సైకిల్ని కూడా వినియోగిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ఎల్ఈడి దీపాలు,  సోలార్ వంటి వాటిని వినియోగించు కోవాలన్నారు.  ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని, అలాగే క్షేత్రస్థాయిలో ప్రతి సచివాలయం పరిధిలో కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

 ప్రజలందరూ కూడా వీటిపై అవగాహన కలిగి ఇంధన వనరుల ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
 ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ దాసిరాజు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వి. ఆదిశేషు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ కాన్, డిఈలు ఎం. రాజగోపాల్ ,పి .రాంబాబు,ఇతర అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-14 12:33:50

ఇంధ‌న పొదుపు అంద‌రి బాధ్య‌త‌..కలెక్టర్

ఇందన పొదుపు అంద‌రి బాధ్య‌త అని, ఇంధ‌నాన్ని ఆదా చేయ‌డంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం సాయంత్రం కాకినాడ క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఇంధన పొదుపు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరచేందుకు కలెక్టరేట్‌లో ర్యాలీని జెండా ఊపి క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. బాలాజీ చెరువు కూడలి వరకు నిర్వ‌హించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు చర్యల సమాచారంతో ముద్రించిన ప్ర‌చార ప‌త్రాల‌ను క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఇంధన పొదుపు అంశంపై పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటివి నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌ల్లో ఇంధ‌న పొదుపుపై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ఈ ఉత్స‌వాలు దోహ‌దం చేస్తాయ‌న్నారు. అవ‌స‌రం మేర‌కు మాత్ర‌మే విద్యుత్‌ను వినియోగించాల‌ని, రాయితీపై ల‌భించే సోలార్ ప్యానెళ్ల‌ను ఏర్పాటుచేసుకోవాల‌ని సూచించారు. ఎల్ఈడీ బ‌ల్బుల వినియోగం వ‌ల్ల విద్యుత్ ఆదా అవుతుంద‌ని.. అందుకే ఈ బ‌ల్బుల వినియోగాన్ని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇళ్లలో వీలైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేసే స్టార్ రేటెడ్ ఉప‌క‌ర‌ణాల‌ను ఉప‌యోగించాల‌న్నారు. సుస్థిర భ‌విష్య‌త్ కోసం ఇంధ‌న పొదుపు అత్యావ‌శ్య‌క‌మ‌ని.. భావిత‌రాల భ‌ద్ర‌త కోసం ఇంధ‌నాన్ని పొదుపుగా ఉప‌యోగించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర న‌ష్టం క‌లిగించే క‌ర్బ‌న ఉద్గారాల‌ను నియంత్రించేందుకు ఇంధ‌నాన్ని ఆదా చేయాల్సి ఉంద‌ని.. ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి.ప్రసాద్, డీఈఈలు టి.విష్ణుమూర్తి, ఎల్ఎల్ఎన్ కిరణ్; ఏఈలు, విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-14 11:42:17

రుణాలు పొందిన వారు నిర్మాణాలు మొదలు పెట్టాలి

గృహాల కోసం రుణం పొందిన వారంతా పక్కా గృహాల నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. విజయకృష్ణన్ ఆదేశించారు. జగనన్న కాలనీలలోని గృహనిర్మాణాల పురోగతిపై గృహనిర్మాణ శాఖ, డి.ఆర్.డి.ఎ., మెప్మా అధికారులతో బుధవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఆమె సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలలో పక్కా గృహాల నిర్మాణాలలో పురోగతి కనిపించాలని కలెక్టర్ చెప్పారు. బాపట్ల జిల్లాలో అధికారులకు నిర్ధేశించిన లక్ష్యాలను  చేరుకోలేకపోవడం ఏమిటని నిలదీశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలన్నారు. అధికారులు, బేల్దారి మేస్త్రీలు, లబ్దిదారులతో జగనన్న లేఅవుట్లలోనే సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. లేఅవుట్లలోని ఎన్ని స్థలాలకు రుణం ఇచ్చారో వాటన్నింటిలో గృహనిర్మాణాలను చూపించాలన్నారు. లబ్దిదారుల నుంచి డబ్బులు తీసుకున్న బేల్దారి మేస్త్రీలు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనే అంశాలపై పరిశీలన చేయాలన్నారు. గృహనిర్మాణాలకు అవసరమైన కూలీలను సమకూర్చాలని ఆమె సూచించారు. పక్కా గృహాల నిర్మాణానికి మంజూరు చేసిన రుణాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం మంచిపద్దతి కాదన్నారు.

   జగనన్న కాలనీలలో వనరులు సమకూర్చినప్పటికి పక్కా గృహాల నిర్మాణం జరగకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో గృహనిర్మాణాలు పురోగతి లేకపోవడంపై కలెక్టర్ ఆరాతీశారు. అధికారుల పనితీరు మార్చుకోవాలని ఆమె ఆదేశించారు. వేమూరులో ఏర్పాటు చేయాల్సిన గృహనిర్మాణ శాఖ డివిజనల్ ఇంజినీరు కార్యాలయాన్ని నేటికి గుంటూరు జిల్లా తెనాలిలోనే కొనసాగించడంపై కలెక్టర్ మండిపడ్డారు. మూడు రోజుల్లో కార్యాలయాన్ని తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. చీరాల, పర్చూరు, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాలలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవడం లేదన్నారు. పనిచేసే అధికారులే జిల్లాలో ఉండాలని, శ్రద్ధలేనివారు ఇతర జిల్లాలకు వెళ్లిపోవచ్చని ఆమె సున్నితంగా మందలించారు. గడిచిన నెల రోజుల్లో 8,664 గృహనిర్మాణాలు లక్ష్యం కాగా ప్రస్తుతం 4,800 గృహాల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించడంపై ఆమె నిలదీశారు. పట్టణ ప్రాంతాలలో గృహనిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. గృహాలు నిర్మించుకునే లబ్దిదారులకు రుణం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. వారంలో రెండురోజులపాటు క్షేత్రపర్యటనలు ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జగనన్న కాలనీలకు సమీపంలో దెబ్బతిన్న పంట కాల్వల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ప్రతిరోజు పక్కాగృహాల నిర్మాణాలపై కలెక్టరేటుకు నివేదిక పంపాలని ఆమె ఆదేశించారు.

     సమావేశంలో డి.ఆర్.డి.ఎ. పి.డి. బి. అర్జున రావు, మెప్మా పి.డి. టి. రవికుమార్, డ్వామా పి.డి. వై. శంకరనాయక్, గృహనిర్మాణ శాఖ ఇంజినీర్లు, డి.ఆర్.డి.ఎ. ఏరియా కోఆర్డినేటర్లు, మున్సిపల్ కమిషనర్లు, మెప్మా సిటీ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Bapatla

2022-12-14 10:52:51

6 మండలాల్లో రైతు ఉత్పత్తి కేంద్రాలు.కలెక్టర్

బాపట్ల జిల్లాలో 6మండలాల్లో రైతు  ఉత్పత్తి కేంద్రాలు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్ లో  రైతు ఉత్పత్తి సంస్థల జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు రైతు ఉత్పత్తి సంస్ధలు ఏర్పాటు చేయడానికి కమిటీ కి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కమిటీ పరిశీలించి జిల్లాలో కొల్లూరు, చేరుకుపల్లి,వేమూరు, మార్టూరు,అద్దంకి, సంతమాగులూరు, మండాల్లో రైతు ఉత్పత్తి సంస్థ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్  పటిష్ట లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2023-24 ను ఆవిష్కరించారు.ఈ పటిష్ట లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆధారoగా బ్యాంకులు క్రెడిట్ ప్లాన్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ చెప్పారు.ఈ సమావేశంలో నాబార్డు ఎల్.డి.ఎం కె.ఆర్.డి. కార్తికే,జిల్లా సహకార అధికారి రామారావు, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం.మదన్ మోహన్ శెట్టి,పశుసంవర్ధక శాఖ జె.డి హనుమంతరావు, ఉద్యాన వన శాఖ జె.డి జెనెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Bapatla

2022-12-14 10:45:11

విద్యుత్ పొదుపు చేస్తే మనం దేశానికి సేవ చేసినట్లే

విద్యుత్ ను పొదుపు చేస్తే దేశానికి సేవ చేసినట్లే నన్ని జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు అన్నారు. ఇంధన వారోత్సవాల్లో భాగంగా ఎపి ఎపి డి సి.ఎల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీ నీ జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన పొదుపు చేయడం ప్రతి ఇంటిలో రోజు వారి అలవాటుగా మారాలన్నారు. విద్యుత్ పొదుపు చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పరోక్షంగా సహకరించినట్లు అవుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా భావి తరాల మంచి భవిష్యత్ ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రధానంగా ఇంధన పొదుపు చేయడం విద్యార్ది దశ నుంచే నేర్పించాలని కోరారు. విద్యుత్ పొదుపు అనేది ఉద్యమం లా ఉండాలన్నారు. 

పొదుపు వారోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అనంతరం ఎపి ఈ పి.డి.సి.ఎల్ సూపరెండెంట్ పి.నాగేశ్వరరావు విద్యుత్ పొదుపు వారోత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా గ్రామ స్థాయిలో ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు అవగాహన ర్యాలీ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 20.తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో భాగంగా విద్యార్దులకు క్విజ్, వ్యాసరచన, వ్రకృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇంధన పొదుపు చేయమనేది ప్రతి మనిషి పాటించాలన్నారు. ఏసి లు వాడటం 24.డిగ్రీలు నుంచి ఆ పైన ఉంచి వాడటం వలన పొదుపు చేయడం అవుతుందన్నారు. ర్యాలీలో విద్యుత్ శాఖ ఈ ఈ నాగిరెడ్డి కృష్ణ మూర్తి,డీ. ఈ లు,విద్యుత్ శాఖ సిబ్బంది,ఉద్యోగులు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-12-14 06:31:45

నాడు నేడు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

కాకినాడ జిల్లాలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో చేప‌ట్టిన రెండో ద‌శ నాడు-నేడు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా.. విద్య‌, స‌మ‌గ్ర శిక్ష‌, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా త‌దిత‌ర శాఖ‌ల ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లిసి అన్ని మండ‌లాల ఎంఈవోలు, ఫీల్డ్ ఇంజ‌నీర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మనబడి- నాడు నేడు రెండో దశ కార్యక్రమంలో భాగంగా పాఠ‌శాల‌ల్లో అద‌న‌పు త‌ర‌గ‌తి గదులు, మ‌రుగుదొడ్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటు త‌దిత‌ర పనులు మంజూరు చేయం జ‌రిగింద‌ని.. ప్ర‌స్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున త్వ‌రిత‌గ‌తిన ప‌నుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. 

అవ‌స‌ర‌మైన మేర‌కు సిమెంట్‌, ఇసుక క్షేత్ర‌స్థాయిలో అందుబాటులో ఉండేలా జిల్లాస్థాయి ఇంజ‌నీరింగ్ అధికారులు ప్ర‌ణాళికాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, పంచాయ‌తీరాజ్‌, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులు‌ సమన్వయంతో పనిచేసి నిర్మాణ పనుల‌కు సంబంధించిన ల‌క్ష్యాల‌ను పూర్తిచేయాల‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నుల్లో పురోగ‌తి చూపించాల‌న్నారు. పూర్త‌యిన ప‌నుల‌కు సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేయాల‌ని ఆదేశించారు. అదే విధంగా స‌మావేశంలో డ్రాపౌట్లు, మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కంపైనా చ‌ర్చించారు. డ్రాపౌట్ విద్యార్థుల‌ను గుర్తించి తిరిగి పాఠ‌శాల‌లో చేరే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 

ఇందుకు సంబంధించి ఎంఈఈవోలు స‌మ‌గ్ర నివేదిక‌ను అంద‌జేయాల‌ని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ డీఈవో ఆర్‌జే డానియ‌ల్ రాజు, ఏపీడబ్ల్యూఐడీసీ ఎస్ఈ కె.ల‌క్ష్మ‌ణ‌రెడ్డి, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస‌రావు, వివిధ మండ‌లాల ఎంఈవోలు, వివిధ శాఖ‌ల ఫీల్డ్ ఇంజ‌నీర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-13 13:32:47

దీన్ దయాల్ సేవలు మిజోరాంకు అందించాలి...

దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ సేవలు మిజోరం, ఒరిస్సా ప్రాంతాల్లో విస్తృతం చేయాలని తన సహాయ సహకారాలు అందిస్తానని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు  అన్నారు. దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినికిడి లోపం ఉన్న నిరుపేదలకు 200 మందికి ఉచితంగా వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించింది.  మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మిజోరం గవర్నర్  మాట్లాడుతూ దీన్ దయాల్ శ్రవణా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేగుల రామాంజనేయులు చేస్తున్న సేవలు హర్షణీయం అన్నారు.  ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో  15 మేజర్ క్యాంపులు పెట్టి 8200 మందికి ఉచితంగా వినికిడి మిషన్లు ఇవ్వడం అనేది చాలా ఆనందమైన విషయం. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి ఈ నాలుగు జిల్లాలని పైలెట్ ప్రాజెక్టుగా స్వీకరించి ఎల్కేజీ టు పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఐడెంటిఫికేషన్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్లు అందించాలని ఫౌండేషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి తమ వంతు సహకారం సహకారం అందిస్తామన్నారు. 


 దీన్ దయాల్ శ్రవణ ఫౌండేషన్  వ్యవస్థాపకులు రామాంజనేయులు  మాట్లాడుతూ ప్రతి ఏడాది నిరుపేద వినికిడిలోపం ఉన్న బాధితులకు గుర్తించి వారికి సరిపడే పరికరాలు అందిస్తామన్నారు.  భారతదేశంలో వినికిడి లోపం నిర్మూలన చేయడమే తమ సంస్థ కర్తవ్యం అన్నారు. 2034 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వినికిడి సమస్య లేని రాష్ట్రంగా చేయాలనే లక్ష్యం ఉందన్నారు.  ఆర్ఎస్ఎస్ సహ ప్రాంత ప్రచారకులు పి జనార్ధన్, ఎన్ ఎఫ్ ఎల్ డైరెక్టర్  తోట సర్వారాయుడు, మాట్లాడుతూ దీన్ ద ఫౌండేషన్ కి ఎన్ ఎఫ్ ఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఫౌండేషన్ కి 10 లక్షల రూపాయలు వినికిడి మిషన్ల కొరకు ఇస్తున్నామన్నారు.  ఈ యొక్క కార్యక్రమము ఎన్ఎఫ్ఎల్ ద్వారా చేస్తున్నామన్నారు .  ఓఎన్జిసి ఇండిపెండెంట్ డైరెక్టర్  అజిత్ కుమార్ రాజు, ఫార్మర్ వైస్ చాన్సులర్ ఆంధ్ర యూనివర్సిటీ జి నాగేశ్వరావు, వెస్ట్రన్ కోల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అగర్వాల్, మీదాని ఇండిపెండెంట్ డైరెక్టర్ వి చక్రపాణి,  బిజెపి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్రారెడ్డి,  షిప్పింగ్ కార్పొరేషన్ డైరెక్టర్  కే ఎన్ పి చక్రవర్తి , మిదాని ఇండిపెండెంట్ డైరెక్టర్ వి చక్రపాణి ,  బిజెపి సీనియర్ నాయకులు చెరువు రాంకోటయ్య  ,  ఫార్మా కౌన్సిల్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొని దాదాపు 200 మందికి ఉచిత వినికిడి మిషన్లో పంపిణీ చేశారు.

Visakhapatnam

2022-12-13 13:12:13

జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను అధిగమించాలి..

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మం కింద మంజూరైన ప‌నుల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తిచేయాలని రాష్ట్ర గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా చీఫ్ ఇంజ‌నీర్ టి.గాయ‌త్రీదేవి అధికారులను ఆదేశించారు. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) కార్య‌క్ర‌మం అమ‌లుపై  మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ విధాన‌గౌత‌మి స‌మావేశ మందిరంలో స‌మీక్షా  స‌మావేశం నిర్వహించారు.  జిల్లాలో  ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి ఇంటికీ మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో అమ‌ల‌వుతున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్-హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌తి ఇంటికీ సుర‌క్షిత తాగునీటిని  అందించి.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో కాకినాడ గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌, ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఇంజ‌నీరింగ్ అధికారులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-12-13 13:04:12

క్షయరోగులకు అరబిందో ఫార్మా భారీ సహాయం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  క్ష‌య వ్యాధి నిర్మూల‌న‌లో పెద్ద ఎత్తున స‌హాయం అందించేందుకు ప్ర‌ముఖ ఔష‌ధ ఉత్ప‌త్తుల సంస్థ‌ అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ ముందుకొచ్చింది. దేశంలో క్ష‌య‌వ్యాధి నిర్మూల‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రి టి.బి.ముక్త్ భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలో 300 మంది క్ష‌య వ్యాధిగ్ర‌స్తుల‌కు ఆరు నెల‌ల‌పాటు పౌష్టికాహారం అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్య‌త నిధుల నుంచి రూ.12.60 ల‌క్ష‌లను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆరు నెల‌ల‌పాటు 300 మంది రోగుల‌కు ఫుడ్ బాస్కెట్‌లు అంద‌జేసేందుకు జిల్లా లెప్ర‌సీ, ఎయిడ్స్‌, క్ష‌య నియంత్ర‌ణ విభాగానికి రూ.12.60 ల‌క్ష‌లు చెక్కు రూపంలో అంద‌జేసింది. 

ఈ మేర‌కు సంస్థ ఎం.డి. కె.నిత్యానంద‌రెడ్డి త‌ర‌పున‌ చెక్కును అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారికి అంద‌జేశారు. ఆరు నెల‌ల‌పాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రాకోసం రూ.4200 ఖ‌ర్చు చేసేందుకు వీలుగా ఈ స‌హాయం అందిస్తున్నామ‌ని సంస్థ ప్ర‌తినిధులు వివ‌రించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కోరిన మీద‌ట ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో 1,000 మంది క్ష‌య వ్యాధిగ్ర‌స్తుల‌కు త‌మ ఫౌండేష‌న్ ద్వారా రూ.42 ల‌క్ష‌ల స‌హాయం అందిస్తున్న‌ట్టు సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో 400 మందికి రూ.16.80 ల‌క్ష‌లు, శ్రీ‌కాకుళం జిల్లాలో 300 మందికి రూ.12.60 ల‌క్ష‌ల స‌హాయాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్య‌త కింద అంద‌జేశామ‌న్నారు. జిల్లాలో క్ష‌య వ్యాధి నిర్మూల‌నలో భాగంగా రోగుల‌కు పౌష్టికాహారం స‌ర‌ఫ‌రాలో పెద్ద ఎత్తున విరాళం అందించిన అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ కు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Vizianagaram

2022-12-13 12:44:17

ఉద్యోగుల ఆందోళనకు ఎమ్మెల్సీ మాధవ్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పింఛనర్లు తమకు ఇవ్వవలసిన జీతాలు ప్రతీనెలా 1వ తారీఖున ఇవ్వాలని చేస్తున్న ఆందోళనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , బీజేపీ శాసన సభ పక్ష నేత, ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ తన మద్దతు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వ   ఉద్యోగులకు  ప్రతినెలా 1వ తేదీన రావలసిన జీతాలు, 2వ వారం దాటిన తర్వాత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 2018 నుండి పెరిగిన జీతాల  ఏరియర్సు , 7 డీఏ లు ఇప్పటి వరకు ఇవ్వకపోగా, కనీసం జీతాలు కూడా సమయానికి ఇవ్వక పోవడాన్ని  తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆందోళన చేస్తున్న ఉద్యోగులను  నోటీసులు,కేసులు తో బెదిరించడం సరైన విధానం కాదన్నారు. 

సమయానికి జీతాలు రాకపోవడం కారణంగా బ్యాంకు రుణాలు తీసుకున్న వారు, దీర్గకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేషెంట్సు (రోగులు), ముఖ్యంగా పింఛనర్లు అనేక ఇబ్బందులు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి  తలెత్తిందని ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ప్రతి నెలా ఇదే తంతు జరగడం వలన ఉద్యోగులలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రతీనెలా 1వ
తేదీన జీతం, ఫించన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

Visakhapatnam

2022-12-13 12:38:08

శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలని టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,  శ్రీనివాస సేతు పనులు  ఇప్పటికే 85 శాతం  పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 60 మీటర్ల స్టీల్ గర్డర్ లను జనవరి 31వ తేదీకి  నాటికి ఏర్పాటు చేయాలన్నారు. డెక్స్ ల్యాబ్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్ వైపు, సుబ్బలక్ష్మి విగ్రహం వైపు, రేణిగుంట రోడ్డు వైపు, తిరుచానూరు రోడ్డు వైపు జరుగుతున్న పనులపై  సమీక్షించారు.

 అదేవిధంగా పాదాచారులు నడి చేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయంలో శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సంస్థ మేనేజర్  రంగస్వామిని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈవోలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, ఎఫ్ ఎ అండ్ సీ ఏవో  బాలాజీ, సి ఇ  నాగేశ్వరరావు,  మున్సిపల్  ఎస్ ఇ   మోహన్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జిఎం చంద్రమౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-12-13 12:15:35

ఒక‌రి నేత్ర‌దానం...ఇద్ద‌రి జీవితాల‌కు వెలుగు

ఒక‌రి నేత్ర‌దానంతో ఇద్ద‌రికి చూపునివ్వ‌డం ద్వారా వారి జీవితాల్లో వెలుగును నింప‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి అన్నారు. నేత్ర‌దానం ప‌ట్ల ఉన్న అపోహ‌ల‌ను విడ‌నాడి, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, ముఖ్యంగా యువ‌త ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. కంటోన్మెంటులోని ఇండియ‌న్ రెడ్‌క్రాస్ కొత్త భ‌వ‌నంలో, నేత్ర‌దాన కేంద్రాన్ని మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, స‌ర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అని చెప్పారు. క‌ళ్లు లేనివారికి మాత్ర‌మే చూపువిలువ తెలుస్తుంద‌ని అన్నారు. ఇలాంటి వారికి చూపునిచ్చేందుకు రెడ్ క్రాస్ ఆధ్వ‌ర్యంలో నేత్ర‌దాన కేంద్రాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. 

నేత్ర‌దానం చేసిన వారినుంచి కార్నియాను సేక‌రించ‌డానికి ఈ ఐ బ్యాంకు కార్నియా క‌ల‌క్ష‌న్ సెంట‌ర్‌ ఉప‌యోడ‌ప‌డుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతానికి ఎల్‌వి ప్ర‌సాద్ లేబ‌రేట‌రీలో కార్నియాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో ఇక్క‌డే భ‌ద్ర‌ప‌రిచి, కంటి శ‌స్త్ర‌చికిత్స‌ల‌ను కూడా చేసే స్థాయికి రెడ్‌క్రాస్ ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. నేత్ర‌దానం చేసిన వారినుంచి క‌ళ్ల‌ను తొల‌గించ‌డం జ‌ర‌గ‌ద‌ని, కేవ‌లం కార్నియాను మాత్ర‌మే సేక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. మ‌ర‌ణించిన త‌రువాత క‌ళ్ల‌ను వృధా చేయ‌కుండా, మ‌రొక‌రి జీవితాల‌కు వెలుగునివ్వాల‌ని సూచించారు. నేత్ర‌దానం ప‌ట్ల భ‌యాన్ని, అపోహ‌ల‌ను విడ‌నాడి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ముందుకు రావాల‌ని కోరారు.
   
          జిల్లాలో కేన్స‌ర్ నిర్ధార‌ణా శిబిరాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో చాలామందికి అడ్డ‌పొగ త్రాగ‌డం అల‌వాటు వ‌ల్ల‌, నోటి కేన్స‌ర్ కేసులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. స‌ర్వైక‌ల్ కేన్స‌ర్‌, బ్రెస్ట్ కేన్స‌ర్ కూడా కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. ఎంత‌ త్వ‌ర‌గా కేన్స‌ర్‌ను గుర్తించ‌గ‌లిగితే, న‌యం చేసుకొనే అవ‌కాశాలు అంత ఎక్కువ‌గా ఉంటాయ‌ని అన్నారు. దీనికోసం కేన్స‌ర్ స్కీనింగ్ ప‌రీక్ష‌లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని చెప్పారు.  బైపిసి చ‌దివిన విద్యార్థినుల‌కు నైపుణ్య శిక్ష‌ణా కేంద్రం ద్వారా ఏఎన్ఎం శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. కేన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కృషి చేస్తున్న రెడ్ క్రాస్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను, బోర్డుల‌ను క‌లెక్ట‌ర్‌ ఆవిష్క‌రించారు. నేత్ర‌దాన కేంద్రానికి దాత‌ల నుంచి విరాళాల‌ను స్వీక‌రించారు.

Vizianagaram

2022-12-13 12:11:13

పడాల రామారావు విగ్రహా ఏర్పాటుకి అనుమతివ్వండి

స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు విగ్రహాన్ని స్థానిక గోదావరి గట్టున మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పార్కులో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ప్రక్కన పడాల రామారావు బస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి నివ్వాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలతను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కోరారు. ఈ మేరకు ఆమెకు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు మాట్లాడుతూ పడాల రామారావు శతాధిక గ్రంథకర్త, అల్లూరి చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉందని,  అలాగే అల్లూరి అనుచరులు, కుటుంబీకులతో సంబంధం ఉన్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. పడాల రామారావు మాజీ రాష్ట్రపతి వి. వి. గిరితో సత్కరింపబడ్డారని, పడాల రామారావుపై తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ కూడా పూర్తి చేసుకున్నదని పడాల వీరభద్రరావు కలెక్టర్ కు వివరించారు. 

2017లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఆనాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితో నగరపాలక సంస్థ స్థలాన్ని కేటాయించిందని, అదే స్థలములో అల్లూరి విగ్రహం ప్రక్కన పడాల రామారావు బస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని పడాల వీరభద్రరావు కలెక్టర్ కు విన్నవించగా అందుకు కలెక్టర్ మాధవీలత సుముఖత వ్యక్తం చేసి నగరపాలక సంస్థకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా 2020లో తంతి తపాలా శాఖ వారు పడాల రామారావు పేరున  విడుదల చేసిన ప్రత్యేక కవర్ ను జ్ఞాపికగా పడాల వీరభద్రరావు కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యుడు యర్ర ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-12-12 16:14:58