1 ENS Live Breaking News

శతశాతం అక్షరాస్యత దిశగా విజయనగరం జిల్లా

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చేపట్టిన చిట్టిగురువులు కార్యక్రమం ద్వారా శత శాతం అక్షరాస్యత సాదించడం, సఖి బృందాలను ఏర్పాటు చేసి యువతులలో ధైర్యాన్ని నింపి వారికీ భరోసా నివ్వడం సంతృప్తిని కలిగించాయని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.   కౌమార బాలికల విద్య, ఆరోగ్యం, ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా 3,272 బృందాలను 89 వేల మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జిల్లాకే ప్రత్యేకమని అభిప్రాయం వ్యక్తం చేసారు.  కలెక్టరేట్ సమావేశ మందిరం లో  శుక్రవారం ఆమె పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు.  జిల్లాలో ఏడాది లో సాధించిన విజయాలను, ప్రాజెక్టుల పురోగతి పై పాత్రికేయులకు వివరించారు. 
 చిట్టి గురువులు కార్యక్రమం ద్వారా 8370 మంది నిరక్షరాశ్యులను నమోదు చేయాగా 8004 మంది 95.6 శాతం పరీక్ష లో పాస్ అయ్యారని తెలిపారు.  జిల్లాలో నాడు నేడు కార్యక్రమం క్రింద మొదటి దశ లో 849 , రెండవ దశ లో 739 పాఠశాలలను, 17కళాశాలలను  అభివృద్ధి చేయడానికి పనులు చేపట్టగా 70 శాతం  వరకు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు.

 జమ్మునారాయణపురం పాఠశాల జాతీయ స్థాయి లో స్వచ్చ విద్యాలయ పురష్కారాన్ని సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. కే.జి.బి.వి. ఫలితాల్లో  కూడా మొదటి స్థానం లో నిలిచామని, బై జూస్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఉపాధి హామీ పధకం లో జిల్లాలో అత్యధిక పనులను చేపట్టి 304.3 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాష్ట్రం లోనే ప్రధమ స్థానాన్ని సాధించిందని తెలిపారు. అదే విధంగా అత్యధిక వేతనాలను చెల్లించిన జిల్లాగా నిలిచిందని, 1.4 కోట్ల పని దినాలను కల్పించి రెండవ స్థానం లో నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో 4 లక్షల 61 వేల  మంది వేతన దారులు ఉండగా 2 లక్షల 77 వేల మంది మహిళలు పని చేస్తూ రాష్ట్రం లో అత్యధిక మహిళలు పనిచేస్తున్న రెండవ జిల్లాగా కూడా గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు.

  
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని అన్నారు.  ప్రత్యేకంగా మహిళా పారిశ్రామిక వేత్తల కోసం రెల్లి లో 158 ఎకరాలను కేటాయించడం  జరిగిందని పేర్కొన్నారు.   రూ.10 కోట్ల తో మెడికల్ డయాగ్నొస్టిక్స్, మరో 10 కోట్ల తో రెండు రైస్ మిల్లులను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలిపారు.  ఎం.ఎస్.ఎం.ఈ క్రింద మాంగో జెల్లీ, బెల్లం శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ, ప్లేస్ మెంట్ క్రింద 2500 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని, మరో 3500 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని వివరించారు. ఈ ఏడాది లో భోగాపురం ఎయిర్పోర్ట్, మెడికల్ కళాశాల, జాతీయ రహదారుల పనులు పురోగతి సాధించాయని, ట్రైబల్ యూనివర్సిటీ, భోగాపురం శంకుస్థాపణలు త్వరలో జరుగుతాయని తెలిపారు.  అందుకు సంబంధించిన  భూ సేకరణ పూర్తి అయ్యిందని, మెడికల్ కాలేజీ లో వచ్చే జూన్ కి అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.  అతి పెద్ద లే అవుట్  గుంకలాం లో 10 వేల మందికి మంజూరు చేసిన గృహా నిర్మాణాలు  వేగంగా  జరుగుతున్నాయని, త్వరలో గృహ ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు.

 
పించన్ల ఎంపికకు 6 స్టెప్ పద్ధతి :
జిల్లాలో కొత్తగా 10 వేల మందికి పించన్లను మంజూరు చేయడం జరిగిందని,  తెలిపారు.  6 స్టెప్ వెరిఫికేషన్ లో అనర్హులుగా గుర్తించిన 4800 మందికి నోటీసు లు జరీ చేయడం జరిగిందని,  అందులో విచారణ అనంతరం  50 శాతం వరకు అర్హత సాధించిన వారు ఉన్నారని, వారికీ పించన్ అందజేయడం  జరుగుతుందని తెలిపారు. మిగిలిన వారిలో కొందరు ప్రూఫ్ లను సమర్పించడానికి సమయం కావాలని అడుగుతున్నారని, వారికీ కొంత సమయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పించన్ పై ఎలాంటి ఆందోళన వద్దని, నిజమైన, అర్హత ఉన్న వారందరికీ పించన్ అందుతుందని స్పష్టం చేసారు. జిల్లా ప్రజలంతా పండగలను కోవిడ్ దృష్టి లో పెట్టుకొని జరుపుకోవాలని, 2023లో   ప్రజలందరికీ మంచి జరగాలని,ఆరోగ్యంగా ఉండాలని,  జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని ఆశిస్తున్నానని, ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలను  తెలిపారు. 

Vizianagaram

2022-12-30 14:10:47

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందనకు 43 అర్జీలు

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీపై అధికారులు దృష్టి పెట్టి, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
 కాకినాడల  కలెక్టరు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా.. డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి డిఎస్ సునీతలతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 43 అర్జీలు అందగ వాటి పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు  పంపించారు.  కార్యక్రమంలో రెవెన్యూ, భూమి సమస్యలు, సంక్షేమ పథకాల, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, గృహం, పింఛన్ మంజూరు వంటి అంశాలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టరు కృతిక శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతినెల ఆఖరు శుక్రవారం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, నాణ్యతతో కూడిన నివేదికతో గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-30 13:36:42

ఉపాధ్యాయ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి, ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ డిమాండ్ చేసారు. ఏపీ రాష్ట్రంలో 50వేల 677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలో మీడియాకి ప్రకటనల విడుదల చేశారు. డీయస్సీ విషయంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పిన వైసీపీ నేతలు,ప్రస్తుతం తాము అధికారంలో కి వచ్చిన  3సంవత్సరాల 6 నెలలు  తర్వాత కూడా  డీయస్సీ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేక పోయారని మాధవ్ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోవడం వలన విద్యా నాణ్యత  తగ్గుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కాలండర్ ను అమలు చేయకుండా కాలయాపన  చేస్తోందని ఎద్దేవా చేసారు. రోజు రోజుకు నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల నమ్మకం పోతోందని పేర్కొన్నారు.  అన్ని శాఖలలో ఖాళీ పోస్టులు ఎన్నెన్ని ఖాళీగా  ఉన్నాయో  వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ మాధవ్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.

Visakhapatnam

2022-12-30 13:31:00

భక్తులతో సంయమనం, సహనంతో వ్యవహరించండి

సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల తో సంయమనం, సహనంతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో  సదా భార్గవి ఉద్యోగులకు సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యోగులతో సమీక్ష నార్వహించారు. తిరుపతి లోని 9 ప్రాంతాల్లో సుమారుగా  100 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయన్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లలో విధులకు నియమించిన సిబ్బందికి శుక్రవారం శ్వేత భవనంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌంటర్లల్లో విధుల్లో ఉన్న సిబ్బంది యాత్రీకులతో మాట్లాడకుండా వేగంగా టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. 

Tirumala

2022-12-30 12:28:24

వాడిపోయే పూలబొకేలొద్దు.. పనికొచ్చే పుస్తకాలివ్వండి

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌మ‌కు శుభాకాంక్ష‌లు చెప్పేట‌ప్పుడు, ఒకరోజులోనే వాడిపోయి వడలిపోయే ఫ్ల‌వ‌ర్ బొకేల‌ను తీసుకురావ‌ద్ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. వాటికి బ‌దులుగా విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే పుస్త‌కాలు, నోట్‌బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు లాంటి సామ‌గ్రిని మాత్ర‌మే తీసుకురావాల‌ని సూచించారు.పూలబొకే వ చ్చే ఆనందం కంటే పుస్తకాలు పిల్లలకు పంచడం ద్వారా మరింత రెట్టింపు వుంటుందన్నారు. కాగా  జిల్లా క‌లెక్టర్ ఆదివారం ఉద‌యం 9 గంట‌లు నుంచి, క‌లెక్ట‌ర్ క్యాంపు ఆఫీసులో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌ని డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు తెలియజేశారు.

Vizianagaram

2022-12-30 12:23:04

కాకినాడ ఎస్పీ రవీంధ్రనాధ్ బాబుని కలిసిన ఈఎన్ఎస్ చీఫ్

కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబును ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చీఫ్ అండ్ సీఎండీ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో ఈఎన్ఎస్ నెట్వర్క్ విస్తరణ, ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net కార్యక్రమాలు, త్వరలో ప్రారంభించ బోయే దిన పత్రికకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో ఈఎన్ఎస్ మీడియా నెట్వర్క్ ను విస్తరించడం అభినందనీయమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈఎన్ఎస్ మీడియా ద్వారా మంచి సమాచారాన్ని అందించి  అసత్యప్రచారాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకి తీసుకెళ్లడానికి ఉపయోగపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా, అన్నవరం ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-30 12:10:00

సమాజంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం

ప్రజలకూ ప్రభుత్వానికీ వారధిగా సమాజంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన భూమికను పోషించాల్సి ఉందని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పిజివిడి ప్రసాద రెడ్డి పేర్కొన్నారు. బుధవారం డాబాగార్డెన్స్లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన నూతన సంవత్సరం 2023 స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆచార్య  పిజివిడిప్రసాద రెడ్డి నూతన సంవత్సరం డైరీని ఆవిష్కరించారు. ఈసందర్భంగా విసీ మాట్లాడుతూ జర్నలిస్టులు సమతూకంగా తమ కథనాలతో సమాజాన్ని మేల్కొలపడంలో బాధ్యతవహించాల్సి ఉందన్నారు. ఫోర్తు ఎస్టేట్ జర్నలిజం వృత్తిలోకి వచ్చిన వారు నిబద్ధతతో ఉంటూ రాగద్వేషాలకు  అతీతంగా కీలక బాధ్యతను నిర్వర్తించాలన్నారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నిరంతరం న్యూస్ సేకరణలో ఉండే జర్నలిస్టులు తమఆరోగ్యాన్నిపరిరక్షించుకుంటూ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. 

బంగారు అశోక్ కుమార్ అధ్యక్షులుగా ఉన్న స్మార్టు సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి జర్నలిస్టు సంఘాలు ఈ విషయంలో అండదండగా నిలవడం అభినందనీయం
అన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ జర్నలిస్టులతో మమేకమై ఎప్పుడూ ఉంటుందని చెప్పిన ఆయన కొత్త సంవత్సరంలో జర్నలిస్టులూ వారి కుటుంబీకులూ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వర రావు(ఎన్ఎన్ఆర్)
మాట్లాడుతూ, జర్నలిస్టులతో ఏయూ ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డి నూతన డైరీ ఆవిష్కరణలో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు. మంచి వ్యక్తిగా జర్నలిస్టులతో సన్నిహితంగా మెలిగే ఆచార్య ప్రసాదరెడ్డి ఔన్నత్యాన్ని ఈసందర్భంగాఎన్ఎస్ఆర్ కొనియాడా
రు. వచ్చే 2023వ సంవత్సరం జర్నలిస్టులకూ, వారి కుటుంబ సభ్యులకూ మేలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ అప్పారావు (శ్రీనివాస్) కర్యదర్శి నివేదికను వినిపించిన కార్యక్రమంలో ఎస్సీఆర్ డబ్ల్యుఎ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ, సంఘం ఆవిర్భావం, సభ్యుల సంక్షేమం కోసం సంస్థ తరపున చేస్తున్న కార్యకలాపాలను
వివరించారు.

 పాత్రికేయుల కోసం పాత్రికేయులు స్వయంగ నడుపుతున్న ఆదర్శ సంఘం ఎస్సీఆర్
డబ్ల్యుఎ అన్నారు. నిరంతరం పాత్రికేయుల సంక్షేమం కోసం పరితపించే సంస్థగా వారి యోగ క్షేమాలు, కష్ట నష్టాల్లోనూ పాలుపంచుకుంటూ ఎప్పుడూ వెన్నంటే పాత్రికేయ
లతోనే ఉంటున్న సంఘం అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి ప్రదర్శనలు అలరించాయి. భరత ఖండమే నా దేశం అంటూ ఎస్ఎస్వి అపర్ణ ప్రదర్శించిన కూచిపూడి నృత్యంతో పాటూ ఇతర సాంస్కృతిక ప్రదరర్శనలూ ఆక ట్టుకున్నాయి. సభ్యులకు ఆచార్య ప్రసాదరెడ్డి, ఎన్ఎన్ఆర్, అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్లు డైరీలు స్వీట్లు, పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలోఎస్సిఆర్డిడబ్ల్యుఎ కార్యవర్గ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్,కోశాధికారి అశోక్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాయుడు, లక్ష్మణ్,పద్మజ,ముఖ్య సలహదారులు కర్రి సత్యనారాయణ,సభ్యులు వినోద్,శ్రీనివాస్,శరత్,సూరిబాబు,శిరీష,రవి,గౌరీ మమేకమయ్యారు.

Visakhapatnam

2022-12-28 13:59:14

ఐఎస్‌టీడీ ఆధ్వర్యంలో ప్రముఖులకు సత్కారం

ఆదర్శప్రాయమైన విజయాలు వివిధ రంగాల్లో సాధించిన ముగ్గురు ప్రముఖులను ఇండియ న్‌ సొసైటీ ఫర్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎస్‌టీడీ) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బుధవారం ఈ కార్యక్రమం విశాఖ పౌరగ్రంథాలయంలో అట్టహాసంగా సాగింది. ఐఎస్‌టీడీ జాతీ య వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ప్రొఫెసర్‌ ఎన్‌.సాంబశివరావు, ఐఎస్‌టీడీ విశాఖపట్నం చాప్టర్‌ కు గొప్ప సహకారం అందించిన గీతం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ శివ రామ కృష్ణ, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సి.దాస్‌ ఐఎస్‌టీడీ విశాఖపట్నం చాప్టర్‌ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి, సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. మాపల్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో, సీఐఐ గత ప్రెసిడెంట్‌ జి.శివ కుమార్‌ ‘చేంజ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పోస్ట్‌ పాండమిక్‌’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌టీడీ చైర్మన్‌ డాక్టర్‌ ఒ.ఆర్‌.ఎం.రావు, గౌరవ కార్యదర్శి డాక్టర్‌ హేమ యడవల్లి, కోశాధికారి జి.సరస్వతి రావు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, డాక్టర్‌ పి.ఎస్‌.ఠాగూర్‌, ఐఎస్‌టీడీ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-28 13:50:36

నేటి నుంచి ఐటీడీఏ స్థాయి గిరి విజ్ఞాన సంబరాలు

గిరి విజ్ఞాన సంబరాలను విజయవంతంగా నిర్వహించాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. తలారి సింగి  ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో నిర్వహించనున్న గిరి విజ్ఞాన సంబరాల ఏర్పాట్లను మంగళవారం పిఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల28,29,30 తేదీలలో గిరి విజ్ఞాన సంబరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటీడీఏ స్థాయిలో జరుగుతున్న గిరి విజ్ఞాన సంబరాల్లో 122 స్కూల్స్  నుండి విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ప్రతిరోజు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు, ఏ  టి డబ్ల్యు ఓ ఎల్. రజని, హెచ్ఎం ఆర్. జాన్, పలువురు ఉపాధ్యాయులు తదితరుల పాల్గొన్నారు.

Paderu

2022-12-27 12:12:27

ఓటర్లు జాబితా ఫిర్యాదులపై ప్రత్యేక టోల్ ఫ్రీనెంబర్

ఓటర్ల జాబితా పై సందేహా  నివృత్తికి, ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 18004256826ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చట మార్చటం తొలగించుట ఫోటో మార్పు, పోలింగ్ కేంద్రాల మార్పు, పోలింగ్ కేంద్రాల బదలాయింపు మొదలగు అంశాలకు సంబంధించి ఫారం 6, 7, 8 లలో దరఖాస్తులు స్వీకరించిన విషయం విధితమే.  ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తులపై తీసుకున్న చర్యలు, వాటి పరిష్కారం, వాటి పరిశీలన ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవటానికి, ఎపిక్ కార్డుల వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 18004256826 నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు.

Paderu

2022-12-27 11:30:20

అటవీ పంటలతో విలువ అధారిత ఉత్పత్తులు

గిరిజనులు పండించే పంటలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించుటకు ప్రభుత్వం నుండి కావలసిన సహకారం కొరకు ప్రణాళికలు తయారుచేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరు కార్యాలయంలో ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారులు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ, డి.ఆర్.డి.ఎ. అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ గిరిజనులు వారు పండించిన పంటలను తక్కువ రేటుకే దళారులకు అమ్ముకుంటున్నారని, వారి పంటలకు ఎక్కువ ధర లభించుటకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి గల అన్ని అవకాశాలను అన్వేశించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల నిర్వహణలో లోపాలు, వాటి అనుసంధానత,  పనితీరు మెరుగుపరచుటకు   తీసుకు రావలసిన సంస్కరణలను గూర్చి తెలియజేయాలన్నారు. 

పసుపు, ఫైనాపిల్, చింతపండు, జీడిమామిడి  పంటలలో ఇప్పటికే కొన్ని ఉత్పత్తులను తయారుచేస్తున్నప్పటికి, మరిన్ని ఎక్కువ రకాల ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. మార్కెటింగు ప్రణాళికకు  సంవత్సరంలో  ఏ పంట ఎప్పుడు వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది వివరాలతో కేలండరు తయారుచేసి అమలుచేయాలన్నారు. జీడిపప్పు, తృణధాన్యాలను కలిపి బిస్కట్స్, న్యూట్రిషన్ పౌడరు, చిరుతిండిపదార్దాలు తయారు చేయవచ్చునని, పసుపుతో ఆయుర్వేద, సౌందర్య ఉత్పత్తులు, అరటిపంట  వ్యర్థాలతో పర్యావరణ హితమైన  బోజనం ప్లేట్లు, కప్పులు తయారు చేయవచ్చునని జిల్లా కలెక్టరు  తెలిపారు. చిన్న యూనిట్లు ఏర్పాటుకు ఆర్థిక సహాయం, మార్కెటింగు,  బ్రాండింగు, ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ప్రచారం కొరకు  ప్రభుత్వం నుండి కావలసిన సహకారం కొరకు ప్రణాళికలు తయారుచేసి పంపించాలని తెలిపారు.

ఫైనాపిల్ ఉత్పత్తులు తయారీకి  సీతంపేటలో  అయిదు కోట్ల రూపాయలతో ప్రాసెసింగు యూనిట్ నెలకొల్పుటకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సీతంపేట ఐ.టి.టి.ఎ.  ప్రోజెక్టు అధికారి బి. నవ్య తెలిపారు.  పార్వతీపురం ప్రోజెక్టు అధికారి సి. విష్ణు చరణ్  ప్రస్తుతం మార్కెటింగు చేస్తున్న ఉత్పత్తుల గురించి వివరించారు.  

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్,  జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, సహాయ ప్రోజెక్టు అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-27 11:20:41

జిల్లాలో ఆక్వా కల్చర్ పురోగతి సాధించాలి:కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆక్వా కల్చర్ పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా కల్చర్ అథారిటీ (ఏపి ఎస్ ఎడిఎ) చట్టం 2020 అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జరిగింది. జిల్లాలో గల అన్ని నీటి వసతులను వినియోగించు కోవాలని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులు, మత్స్య రంగంలో అర్హులైన అనుభవం ఉన్న దేశీయ మత్స్యకారులను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. 

జిల్లా మత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఆక్వా కల్చర్ అథారిటీ (ఏపి ఎస్ ఎడిఎ) చట్టం 2020 ద్వారా చేపల ఉత్పత్తి, సరఫరా చేసేవారు, చేపల మార్కెటింగ్ చేసే వారికి ఏపి ఎస్ఎడిఎ నిబంధనల మేరకు లైసెన్సులు జారీ చేయాలని వివరించారు. ఇందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు జరిగాయని ఆయన చెప్పారు. మండల స్థాయిలో తహశీల్డార్లు అధ్యక్షులుగా ఉంటారని ఆయన అన్నారు. కమిటీలకు అందిన దరఖాస్తులను ఇ - మత్స్యకార్ లాగిన్ లో పెట్టాలని, ఇందుకు లాగిన్, పాస్ వర్డ్ లను ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి.సీతారాం, జిల్లా భూగర్భ జలాల అధికారి ఏ. రాజశేఖర రెడ్డి, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్. అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-27 10:12:44

కలెక్టరేట్ ను అధ్యయనంచేసిన జర్నలిజం విద్యార్ధులు

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన డిగ్రీ విద్యార్ధుల ఇంట‌ర్న్ షిప్‌లో భాగంగా రేడియో అల 90.8 ఎఫ్‌.ఎం ఆధ్వ‌ర్యంలో  శిక్ష‌ణ పొందుతున్న కాకినాడ పిఠాపురంరాజా ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌ జ‌ర్న‌లిజం విద్యార్ధులు సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప‌నితీరును అధ్యాయ‌నం చేసారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ఉన్న జిల్లా కలెక్టరు డా.కృతికాశుక్లా ను విద్యార్థులు కలిసారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా విద్యార్ధుల‌ను ఉద్ధేశించి మాట్లాడుతూ జ‌ర్న‌లిజం కోర్సు పూర్తి చేసిన విద్యార్ధుల‌కు ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్య‌మాల‌లో విస్తృత‌మైన ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌న్నారు. సోష‌ల్ మీడియా విస్తృతంగా విస్త‌రిస్తున్నందున‌ జ‌ర్న‌లిజం విద్యార్ధుల‌కు ఉపాధి అవ‌కాశాలకు కొద‌వ‌లేద‌ని ఆమె తెలిపారు. జ‌ర్న‌లిజం విద్యార్ధులు నైతిక విలువ‌ల‌తో కూడిన ప‌నితీరును క‌న‌ప‌ర‌చి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించాల‌ని కలెక్టరు కృతికా శుక్లా ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో రేడియో అల 90.8 ఎఫ్‌.ఎం స్టేష‌న్ డైరెక్ట‌ర్ ఎం.స‌త్య‌, యునైటెడ్ న్యూస్ నెట్‌వ‌ర్క్ డైరెక్ట‌ర్ జి.ఖ్యాతీశ్వ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-26 14:02:13

ప్రతి ఒక్కరూ ఆధార్ నవీకరణ చేయించు కోవాలి

2010 నుంచి 2016 సంవత్సరం మధ్య ఆధార్ కార్డు పొందిన వారందరూ ఆధార్ కార్డును నవీకరణ చేయించు కోవాలని ఐటిడిఎ పి.ఓ.ఆర్. గోపాల కృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన పాడేరులోని తన కార్యాలయంలో ఆధార్ కార్డ్ అప్డేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆధార్ గుర్తింపు ద్వారా వివిధ ప్రభుత్వ పధకాలకు మరియు బ్యాంకు సేవలను  ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభముగా పొందుటకు అవకాశం వుంటుందని చెప్పారు. తమ పేరు, ఐడి మరియు చిరునామా కు సంబదించిన రుజువు పత్రములతో ఆధార్ అప్ డేట్ చేయించుకోవాలని చెప్పారు.పూర్తి
వివరాలకు మీ దగ్గరలోని ఆధార్ కేంద్రం నకు తమ పేరు మరియు చిరునామా కు సంబదించిన రుజువు పత్రములతో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
పి ఎం యు అధికారి మల్లికార్జున, ఆధార్ సబ్బంది నాగరాజు తదిరులు పాల్గొన్నారు.

Paderu

2022-12-26 13:37:12

విజయనగరంలో స్పందనకు 133 వినతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 136 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 72 ఉన్నాయి. పింఛన్ల కోసం, రేషన్ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర  సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్,  డి.ఆర్.ఓ గణపతి రావు,  ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, దొర పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Vizianagaram

2022-12-26 12:49:33