1 ENS Live Breaking News

అట్టడగు వర్గాల అభివ్రుద్ధికి విశేష క్రుషి..

రెక్కాడితేగానీ డొక్కాడని అట్టడుగువర్గాల వారికి ఆర్ధికప్రయోజనాలను కల్పించి సమాజంలో సముచితం స్ధానం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) ఛైర్మన్‌గా నియమితులైన కాకుమాను రాజశేఖర్ గురువారం తాడేపల్లిలోని లిడ్‌క్యాప్ ప్రధాన కార్యాలయంలో పదవీబాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బలహీన అట్టడుగు వర్గాల వారిని గత ప్రభుత్వం విస్మరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యస్‌సి యస్‌టి బిసి వర్గాల వారు ఆర్ధిక ఎ దుగుదలకు దూరం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో బలహీనవర్గాల వారుపడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అప్పుడు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడ్డారన్నారు. దేశంలో ఎ క్కడాలేనివిధంగా పేదప్రజలకు 38 లక్షల ఇళ్లస్ధలాలను మంజూరు చేయడంతోపాటు గృహనిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో యస్‌సి యస్‌టి వర్గాల వారికి అధికప్రాధాన్యతనిచ్చి వారు ఆర్ధికంగా నిలదొక్కుకోవడం ద్వారా సమాజంలో సముచితస్ధానం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్ధేశ్యమన్నారు. 

లిడ్‌క్యాప్ సంస్ధ ద్వారా అట్టడుగువర్గాలవారికి ఆర్ధికప్రయోజనం చేకూరే విధంగా కృషి చేయాలని ఆయన నూతన ఛైర్మన్‌కు సూచిస్తూ అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ పేదబలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డే నన్నారు. ఇటీవల కార్పోరేషన్ ఛైర్మన్‌లుగా అధికశాతంమంది బలహీనవర్గాలవారిని ఆయన ఎ ంపిక చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిర్జీవమైన లిడ్‌క్యాప్ సంస్ధకు జవసత్వాలను తీసుకొచ్చి ముందుకు నడపడం ద్వారా సంస్ధపై ఆధారపడిన బలహీనవర్గాల వారికి ప్రయోజనాలు కల్పించేందుకు ఇప్పటికే తాను ప్రణాళికలను రూపొందించుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు పరచడం ద్వారా ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని సఫలీకృతం చేసి ఆయన మన్ననలను పొందేందుకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలోలెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్) మేనేజింగ్ డైరెక్టరు కె. హర్షవర్ధన్, జనరల్ మేనేజరు యం. పుష్పవతి, అసిస్టెంట్ మేనేజరు యన్. అధికారి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-08-12 14:13:58

గ్రామ సచివాలయాల్లో కానరాని స్పందన..

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలు, 13 మంది జిల్లా కలెక్టర్లు.. మరో 13 మంది గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు.. వీరందరీకి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పదే పదే చెబుతున్నమాట ఒక్కటే ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుమ్మం వద్దనే స్పందన కార్యక్రమం నిర్వహించమని. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. కానీ ఈ కాలంలో సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన  ఒక మంచి కార్యక్రమంగా ప్రజలకు చేరువ చేయలేకపోతున్నారంటే తప్పెవరది. సోమవారం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు స్పందన అర్జీదారులతో నిండిపోతున్నాయి. వందల సంఖ్యలో వివిధ సమస్యలపై దరఖాస్తులు అధికారుల ముందుకి చేరుతున్నాయి. వేల సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన నిర్వహిస్తే ఈ పరిస్థితి వచ్చేదా అంటే కాదనే చెబుతారు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నీ సచివాలయాల ద్వారానే అందించాలని సీఎం నెత్తీనోరూ కొట్టుకుంటుంటే జిల్లా కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు నిర్లక్ష్యమో తెలీదు గానీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకూ ఒక్క సచివాలయంలో కూడా స్పందన కానరావడం లేదు. 

అన్నీ వున్నా అల్లుడినోట్లో శని అన్నట్టుగా తయారైంది ఇపుడు సచివాలయాల పరిస్థితి. ఒకప్పుడు గ్రామపంచాయతీలో ఒక కార్యదర్శి, పెద్ద పంచాయతీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు లేదా, ఒక బిల్ కలెక్టర్ ఉండేవారు. ఇపుడు అదే స్థానంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత సుమారు 14శాఖల సిబ్బంది అందుబాటులో వున్నా ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇవేవో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్, www.enslive.net కావాలని అంటున్న మాటలు కాదు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మాత్రమే జరుగుతున్న స్పందన కార్యక్రమంలో నమోదవుతున్న  అర్జీలు చెప్పే సంఖ్య. విచిత్రం ఏంటంటే అర్జీదారుడు ఇచ్చే దరఖాస్తుని జిల్లా కలెక్టర్ కి ఇచ్చినా.. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినా పరిష్కారం అయ్యేది స్థానికంగానే.. ఎందకనో స్పందన అంటే ప్రజలకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయమనే గుడ్డి నమ్మకం వచ్చేసింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా రాష్ట్రంలోని మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్1,2,3,4 కార్యదర్శిలంతా వారి రాజకీయ సామర్ధ్యాన్ని ఉపయోగించి రెండు మూడు పంచాయతీలకు డిప్యుటేషన్లు, ఇన్చార్జిలు వేయించుకోవడమే. ఇలా అదనపు పనులు తమపై వేసుకొని.. ఉన్న సచివాయాల్లో పూర్తిస్థాయిలో ఉండక, అటు ఇన్చార్జి పంచాయతీలు, సచివాలయాల్లో అందుబాటులో ఉండక స్పందన కార్యక్రమ నిర్వహణ కష్టంగా మారుతోంది. అందులోనూ ప్రస్తుత సచివాలయ ఉద్యోగులు మినహా గతంలో పంచాయతీల్లో పనిచేసే 70శాతం మంతి పంచాయతీ కార్యదర్శిలకు కనీసం కంప్యూటర్ వినియోగం కూడా తెలీదు. దీనితో ఇక్కడకి ఏ సమస్యపై పరిష్కారం కోసం వచ్చినా దరఖాస్తు దారుడు తెచ్చే అర్జీ ఆన్ లైన్ చేసే దిక్కుండేది కాదు. ఇపుడు ప్రతీ గ్రామ సచివాలయాలనికి డిజిటల్ అసిస్టెంట్ తోపాటు మరో 13ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులో వున్నప్పటికీ స్పందన కార్యక్రమం మాత్రం సక్రమంగా జరగడం లేదు.

జిల్లా కలెక్టర్లు, జెసీల ఉత్తుత్తి పర్యటనలు..
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, జెసిలను తప్పనిసరిగా వారంలో 4 రోజులు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించడంతో వారంతా సచివాలయ సందర్శనకు వెళుతున్నారు.. తప్పితే అక్కడ స్పందన జరుగుతున్న తీరుపై ద్రుష్టి పెట్టడం లేదనే విషయం కలెక్టర్ కార్యాలయాలకు వచ్చే అర్జీలే తేటతెల్లం చేస్తున్నాయి. వెళ్లిన ప్రతీసారీ ప్రభుత్వ లక్ష్యాన్ని వల్లెవేస్తున్నారు తప్పితే ఎందుకు స్పందన నిర్వహించడం లేదు.. ఎందుకు గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేయడం లేదనే విమర్శలున్నాయి. అందులోనూ కలెక్టర్లు, జెసిలు సచివాలయ సందర్శనకు వెళ్లే ప్రతీసారీ ముందుగా సమాచారం ఇచ్చిగానీ వెళ్లడం లేదు. అలా సమాచారం అందుకున్న సచివాలయ సిబ్బంది కలెక్టర్ వచ్చే సమయానికి అంతా సిద్దం చేసి పనిచేస్తున్నట్టుగా కలరిస్తున్నారు. దీనితో గ్రామాల్లో సచివాలయ సేవలు బాగా అందుతున్నాయని రికార్డు చేసుకొని వచ్చేస్తున్నారు కలెక్టర్లు జేసిలు. ఒక్కసారి అధికారులు మారు వేషంలో వస్తే తప్పా సచివాలయాల్లో ఏం జరుగుతుందనేది బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది..

సచివాలయాల్లో అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిలు..
ఒక పక్క సచివాలయాల్లో తెగ పనిచేసేయాలని ఆదేశాలు, ఆగ్రహాలు వ్యక్తం చేసే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చే విషయంలో నేటికీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. జీఓనెంబరు 149 ఆధారంగా మేజర్ పంచాయతీల్లో విభజించిన సచివాలయ పరిధిలు ఆధారంగా అధికారాలు, విధులు, రికార్డులు, ఖజానా చిట్టా విభజించాల్సి వున్నా ప్రభుత్వం మాత్రం నేటికీ ఆపనిచేయలేదు. దీనితో చేతిలో అధికారం లేని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు తమపరిధిలోనే వారు ఆడుతూ, పాడుతూ పనిచేయాల్సి వస్తుంది. అలాగని కాస్త గట్టిగా పనిచేయాలంటే అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లో ఉండిపోవడంతో తాము చేయడానికి ఏముందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 వరకూ అందరూ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులమే అయినప్పటికీ కేవలం అధికారాలు మాత్రం గ్రేడ్-1,2,3,4 వాళ్లకు ఇచ్చి ఇతర కార్యాలయ పనులు మాత్రం మాతో చేయిస్తున్నారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. చేతిలో అధికారం లేకపోవడంతో సచివాలయంలో పనిచేసే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా మాట వినడం లేదని వాపోతున్నారు. ఏ చిన్న పనికోసమైనా సచివాలయం-1లో వుండే గ్రేడ్ 1,2,3,4  కార్యదర్శిల దగ్గరకే వెళ్లాల్సి వస్తుందని, అందులో వారికి డిప్యుటేషన్లు, రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు కేటాయింపు జరగడంతో సాధారణ పనులు కూడా పెండింగ్ లో ఉండిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే మండలంలోని ఎంపీడీఓ, డిపీఓ, జిల్లా కలెక్టర్, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించినా తమకు అధికార బదలాయింపులు చేయలేదని చెబుతున్నారు. తప్పులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని పనిచేయలేదని, స్పందన నిర్వహించలేదని మమ్మల్ని ఎలా నిందిస్తారని గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఒంటి కాలిపై లేస్తున్నారు.

ప్రభుత్వం ముందు గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా అధికారాలు బదలాయిస్తే తప్పా.. వారి అధికారం వినియోగించి సచివాలయాల్లో స్పందన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించే పరిస్థి కనిపించడం లేదు. అటు ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకొని, జిల్లా కలెక్టర్లు, సచివాలయ జాయింట్ కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పిస్తే తప్పా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం, ఇంటి ముంగిటే స్పందనతో సమస్యలకు పరిష్కారమనే ప్రధాన సమస్య పరిస్కారం అయ్యేట్టట్టు కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..!

Tadepalle

2021-08-10 01:34:35

ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక..

ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం సోమవారం అమరావతిలో ఏర్పాటైంది. ఇందులో స్టేట్ జనరల్ బాడీకి యునానిమస్ గా  జ్ఞానవేణి కుంచే వైస్ ప్రెసిడెంట్, రాజేష్ బాత అసోసియేట్ కార్యదర్శిలు స్థానం దక్కింది. ఇక కార్యవర్గం చూసుకుంటే ఫౌండర్ ప్రెసిడెంట్  డాక్టర్ వై ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ కె.వి రమణ, అసోసియేట్ ప్రెసిడెంట్స్ హరి దాస్ ఈరన్న, జనరల్ సెక్రటరీ ఎం సునీల్ కుమార్, సెక్రటరీ -కోఆర్డినేషన్ ఆర్. రాజా నాయక్,అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్ జయలక్ష్మి, ట్రెజరర్  సి.హెచ్ ఆనంద్, సెక్రెటరీ ఫైన్ ఆర్ట్స్ అండ్ ప్లానింగ్  డాక్టర్ ఎల్ ఆనంద్ కుమార్, యు పద్మావతి,  రీజనల్ ప్రెసిడెంట్స్  ఎం రవికుమార్, కె.వి నాగజ్యోతి,  ఎస్ కృష్ణా రావు,వెంకటేశ్వర్లు, పబ్లిసిటీ సెక్రెటరీ కొత్తపల్లి వెంకటరమణలుగా వున్నారు. ఈ కార్యవర్గం 2021-2024 వరకూ పనిచేస్తుందని ప్రచార విభాగం తెలియజేసింది.

Tadepalle

2021-08-09 14:39:53

ఇక మహిళా పోలీస్ గా పిలవాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అనే హోదా జీఓఎంఎస్ నెంబరు 129 నుంచి 60లతో మహిళా పోలీసుగా మారిపోయింది. రాష్ట్ర హోంశాఖ ఉద్యోగులుగా ఉన్నవీరందరినీ ఇకపై మహిళా పోలీసులుగానే పిలవాలని ఆదేశిస్తూ.. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు జీఓనెంబరు 129ను ఎమెండ్ మెంట్ చేస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 60ని విడుదల చేసింది. దీని ప్రకారం సాధారణ పోలీసులకు ఉండే అన్ని అధికారాలు మహిళా పోలీసులకు కూడా వర్తిస్తాయని అందులో పేర్కొంది. అంతేకాకుండా వీరికి పోలీసు సిబ్బంది మాదిరిగా శిక్షణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎక్కడైనా వారందరినీ మహిళా పోలీసులుగా పిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు ఆ జీఓలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిని అదనపు సాధారణ గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరిచినట్టుగా వివరించింది. ఈ యొక్క విషయాన్నిసీఎం ఓఎస్డీ, పీఎస్ లతోపాటు  రాష్ట్ర డీజీపి కార్యాలయం, స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హోంమంత్రి కార్యాలయాలకూ ప్రత్యేకంగా తెలియజేశారు. డిజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీ కార్యాలయాలకు, అక్కడి నుంచి ఎస్పీకార్యాలయం, సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు, అక్కడ అడ్మిన్ ఎస్పీలకు ఈ సమాచారం చేర్చింది ప్రభుత్వం. 

గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగం విషయంలో పోలీస్ శాఖలోనే కింది స్థాయి సిబ్బందికి(హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ) ఉన్న అనుమానాలు, వారి ఇబ్బందులను నివ్రుత్తి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక జీఓ, గెజిట్లను అందరికీ సర్క్యూలేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాలో వచ్చిన ఈ జీఓలు, గెజిట్ లపై పోలీసుశాఖలోని ఏ ఒక్క సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, వ్యవహరించడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుళ్లుగానీ, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఏ విధంగానూ.. ఏ స్థాయి వారైనా అదైర్య పరిచేవిధంగా కానీ, వారంతట వారే మహిళా పోలీసు ఉద్యోగాలకు రాజీనామాలు చేసే విధంగా ప్రేరేపించేలా వ్యవహరించినా వారిపై ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం నుంచి హోంశాఖలో ఏ జీఓ వచ్చినా దానిని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల గ్రూపులో పెట్టి అవగాహన కల్పిస్తున్నారు.  

అదే సమయంలో స్టేషన్ పరిధిలోని పోలీసులు కూడా వారి స్టైల్ లోవారూ నోటికొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా పసిగట్టిన జిల్లా ఎస్పీలు అన్ని డివిజన్ల డిఎస్పీలకు, సర్కిల్ ఇనెస్పెక్టర్లకు, స్టేషన్ ఎస్ఐలకు కూడా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహిళా పోలీసులను హోంశాఖ ఉద్యోగులుగా ఇష్టం ఉన్నా, లేకపోయినా గుర్తించాలని చెబుతున్నారు. అయినప్పటికీ  మహిళా పోలీసు నియామకాలు, ప్రత్యేక జీఓలు, ప్రభుత్వ గెజిట్లు(రాజపత్రం) విడుదలైనా కొందరు కిందిస్థాయి పోలీసులు వారి పద్దతి మార్చుకోని సిబ్బందిపై స్టేట్ ఇంటెలి జెన్సుతో కాకుండా, సెంట్రల్ ఇంటెలి జెన్సు ద్వారా స్టేషన్ స్థాయిలో సిబ్బంది మహిళా పోలీసుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనే కోణంలో ప్రభుత్వం నిఘా పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే డిజిపీ గౌతం సవాంగ్ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు మహిలా పోలీసు వ్యవస్థను గ్రామాల్లో పూర్తిస్థాయిలో వ్యవస్థీకరించి గ్రామ సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగానే మహిళా పోలీసులతో ప్రత్యేక గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఏం జరిగినా తక్షణమే సదరు పోలీస్ స్టేషన్ కి సమాచారం అందేవిధంగా పక్కా నెట్వర్క్ ను కూడా పెంచారు. ఈ క్రమంలో ప్రభుత్వము, ఏపీ పోలీస్ బాస్, డిజిపీ గౌతం సవాంగ్ సైతం మహిళా పోలీసు అనే పదంతోనే వీరిని వ్యవహరిస్తున్నారు. ఇకపై స్టేషన్ లోని పోలీసులు సిబ్బంది కానీ, ఎస్ఐలు, సీఐలు, డిఎస్పీలు జీఎంఎస్కే అని వ్యవహరించకూడదని, ఆ పదాలన్నీ జీఓనెంబరు 60తో కనుమరుగు అయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది..!


Tadepalle

2021-08-09 01:50:53

మరోసారి టిటిడి చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీ మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆదివారం జిఓనెంబరు 146 ను విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లోనే ట్రస్టుబోర్డు సభ్యులను కూడా నియమిస్తామని కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడీ చైర్మన్ గా వైవీ ఇప్పటికే రెండేళ్లు చైర్మన్ గా పనిచేశారు. మళ్లీ ఆయననే ప్రభుత్వం చైర్మన్ గా తిరిగి నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి తనను మరోసారి టిటిడి చైర్మన్ గా తిరిగి నియమించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్నో మంచికార్యక్రమాలు చేపట్టారు వైవీ..

Tadepalle

2021-08-08 07:38:53

మహిళా పోలీసులకూ ఖాకీ డ్రెస్సు ఖాయం..

గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ మహిళా పోలీసు ఖాకీ డ్రెస్సు వేసుకొని తిరగడం ద్వారానే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆస్కారం వుంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన సుమారు 15వేల మంది మహిళా పోలీసులకు హోంశాఖ ఖాకీ డ్రెస్సు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు గ్రామ, వార్డు మహిళా పోలీసుల నియామకాలు అస్సలు తమకు ఇష్టం లేనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాకుండా మీరు మాలా నిజమైన పోలీసులా, మీకు డ్రెస్సులుంటాయా.. శిక్షణలుంటాయా.. మీరు ఏ విషయంలో మాలాగ రెగ్యులర్ పోలీసులుగా ఫీలవుతున్నారు అంటూ మరెన్నో రకాలుగా చేసిన కామెంట్లను కేంద్ర ఇంటెలిజెన్సు విభాగం ద్వారా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులను కూడా సాధారణ పోలీసులుగా మార్పుచేస్తూ జీఓనెంబరు 59ని విడుదల చేసింది. దీనితో క్రింది స్థాయి పోలీసు సిబ్బంది కామెంట్లకు అడ్డుకట్ట పడింది. ఆ తరువాత రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీలు ముందు మీరు మహిళా పోలీసులను హోంశాఖ పోలీసులుగా ఇష్టం వున్నా, లేకపోయినా గుర్తించాలనే ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది ఒప్పుకోక తప్పలేదు. ఇపుడు తాజాగా మహిళా పోలీసులకు ప్రభుత్వం ఖాకీ డ్రెస్సు కూడా ఇచ్చి గ్రామ పరిరక్షణలో భాగం చేయడానికి అన్ని ఏర్పాట్లును చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన జీఓనెంబరు 59 ఆధారంగా వీరిని సాధారణ పోలీసులుగానే మార్పుచేసిన ప్రభుత్వం వీరికి కూడా దశల వారీగా పోలీసు శిక్షణ  ఇవ్వనుంది. 

ఈ మేరకు డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా దిశా నిర్ధేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్ధేశించిన కొత్త నిబంధన ప్రకారం వీరికి కూడా పోలీసు యూనిఫారం రానుంది. ఈ విషయాన్ని డిజిపి ఎస్పీలకు తెలియజేశారు. అంతేకాకుండా ఆ కాకీ డ్రెస్ మోడల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా చూపించారు. బహుసా ఇదే మోడల్ ఖాకీ డ్రెస్సులను మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే మహిళా పోలీసులను నియమించిన ప్రభుత్వం, హెడ్ కానిస్టేబుళ్లుగా వున్న 2052 మందిని రాష్ట్రవ్యాప్తంగా వున్న పోలీసు స్టేషన్లలో ఉన్నట్టు గుర్తించింది. సర్కిల్ లెవల్ లో ఏఎస్ఐలు 196 మంది ఉండగా, మహిళా ఎస్ఐలు 97 మంది ఎస్డీపీఓ లెవల్ లో వున్నట్టుగా గుర్తించారు. ఇక ఇనెస్పెక్టర్ గా ఒక యూనిట్ లో 18ని ఉండేలా  సర్కిళ్లలో కూడా నియమించనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక జిల్లాల్లో ప్రభుత్వం ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలను ఏ ప్రాతిపధికన రెగ్యులర్ చేయాలి, వీరికి ఏ విధమైన పరీక్షలు నిర్వహించాలి, దేహ దారుడ్యానికి, నడక లేదా పరుగు ఏ విధంగా పెట్టాలనే అంశాలకు సంబంధించి కూడా డిజిపి గౌతం సవాంగ్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఆగస్టు 15న మహిళా పోలీసులకు డ్రెస్ కోడ్ అందుబాటులోకి రానుందని సమాచారం అందుతుంది. అయితే అది ఆ తేదీనే ప్రకటిస్తారా.. లేదంటే వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షలన్నీ పూర్తయిన తరువాత, వీరి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ప్రకటిస్తారనే అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో చాలా మంది పోలీసులు మహిళా పోలీసు పోస్టుల విషయంలో, వారి విధుల విషయంలోనూ, వారిని మానసికంగా క్రుంగదీసి, వారి ఉద్యోగాలు వారంతట వారే వదిలి పోయేలా చేసిన(కొన్ని జిల్లాల్లో మహిళా పోలీసులు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు, మరికొంత మంది మహిళా పోలీసు ఉద్యోగాన్ని వదిలి వేరొక ఉద్యోగానికి వెళ్లిపోయారు) ప్రయత్నాలకు ప్రభుత్వం ఒక్కసారిగా ఖాకీ యూనిఫారం ఇస్తున్నట్టు నేరుగా పోలీస్ బాస్ డిజిపి ప్రకటించడంతో మహిళా పోలీసులపై జరుగుతున్న ప్రచారాలను, సిబ్బంది చేసే కామెంట్లకు గట్టిగానే అడ్డుకట్ట వేయగలిగింది. వాస్తవానికి మహిళా పోలీసులను ప్రభుత్వం గ్రామాల్లో నియమించడం ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐల ప్రాభల్యం గ్రామాల్లో తగ్గిపోతుందని, గ్రామాల్లోకి వెళితే అప్పటికే వున్న మహిళా పోలీసులనే గౌరవిస్తారనే  భావనకు రాష్ట్రంలో చాలా మంది పోలీసులు(హోం గార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు) వచ్చినట్టుగా తీవ్ర ప్రచారం జరగడంతోపాటు, చాలా చోట్ల పోలీసు సిబ్బందే బయట పడిపోయారు. ఇదే సమయంలో పోలీసు సిబ్బంది ఎంతో ఆందోళన చెంది, బయటపడి మరి మనసులోని ఆలోచనలు మహిళా పోలీసుల దగ్గర అన్నా.. ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేది, ఉద్యోగాల్లో నియమించేది హోంశాఖ మాత్రమే. 

అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడటం ద్వారా కొందరిలోనైనా ఆలోచన పెరిగి చేస్తున్న ఉద్యోగాలను వారంతట వారే మానివేసేలా చేయలి.. లేదంటే వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోవడం గానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఖాకీ డ్రెస్సు వద్దని చెప్పించే ప్రయత్నం చేయడంలో సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా చాలా గట్టిగానే కష్టపడ్డారనేది హాట్ టాపిక్. కానీ జిల్లా ఎస్పీలు మాత్రం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడంతో చాలామంది ఇపుడు ఆ ప్రవర్తన మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.  నిన్న డిజిపీ గౌతంగ సవాంగ్ మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు ఇస్తున్నామనే మాటను ప్రకటించిన తరువాత.. ఏదో రకంగా మాట్లాడే క్రిందిస్థాయి పోలీసు సిబ్బంది గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. అయితే మహిళా పోలీసుల ఒంటిపైకి ఖాకీ చొక్కా వచ్చేంత వరకూ పోలీసుశాఖలో ఏ నిబంధన అమలు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మహిళా పోలీసులందరికీ ఖాకీ డ్రెస్ ఇస్తారా లేదంటే.. తమ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, గ్రామాల్లో వారికి ప్రాబల్యం తగ్గిపోతుందని ఆ ఆలోచనను మార్చుకుంటారా.. తేలాల్సి వుంది..!


Tadepalle

2021-08-07 03:56:15

10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల..

రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షాఫలితాల్లో మార్చి 2020కు సంబంధించి 6,37,354 మంది, జూన్ 2021కు సంబంధించి 6,26,981 మంది ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ అన్నారు.  విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్ తో కలిసి 10వ తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈసందర్భంగా రాష్ట్రమంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జూన్ 7 నుండి 16వ తేదీ వరకూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని అయితే విద్యార్ధుల ఆరోగ్యభద్రత, ఉపాధ్యాయుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోనికి తీసుకుని మే 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి నిర్ణయం మేరకు 10వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి అన్నారు. పరీక్ష ఫీజుకట్టిన ప్రతీ ఒక్కరినీ పాస్ చేస్తూ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షల్లో మార్కులు ఎ ంతోకీలకమని మంత్రి అన్నారు. ఉద్యోగాల నియామకంలో కాలేజీ విద్యలో, కేంద్రప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాలు ముఖ్యంగా మిలటరీ రిక్రూట్‌మెంట్‌లో 10వ తరగతిలోని మార్కుల ఆధారంగానే ఉద్యోగనియామకాలు చేపడతారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షల ప్రాముఖ్యత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరినీ పరీక్ష పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని దీనిలోభాగంగా సంవత్సరకాలం పాటు విద్యార్ధుల ప్రతిభను ఆధారంగా తీసుకుని గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు.

రద్దు అయిన 10వ తరగతి పరీక్షల విధివిధానాలను పరిశీలించి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని అన్నారు. ఈహైపవర్ కమిటి ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించిన అనంతరం 10వ తరగతి పరీక్షాఫలితాలను విడుదల చేశామని మంత్రి అన్నారు. విద్యార్ధులెవరికీ నష్టంలేకుండా ఫలితాలను ప్రకటించామని మంత్రి అన్నారు. అందరికీ ఉపయోగపడేలా 2019-20, 2020-21 సంవత్సరానికి ఎ వ్వరూ నష్టపోకుండా 10వ తరగతిలో గ్రేడింగ్ ఇవ్వాలని హైపవర్ కమిటి నివేదిక ఇచ్చిందని మంత్రి అన్నారు. ఈనివేదికను యధాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను ప్రకటించిందని మంత్రి అన్నారు.
2020-21వ సంవత్సరంలో సంవత్సర కాలంపాటు వారి ప్రతిభను ఆధారంగా తీసుకుని వ్రాతపరీక్షల్లో అత్యధిక వెయిటేజ్‌ను ఇస్తూ 70 శాతం, 30 శాతం వెయిటేజ్ మార్కులతో గ్రేడింగ్ ఇచ్చామని మంత్రి అన్నారు. 2020-21 సంవత్సరంలో 6 లక్షల 26 వేల 981 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 22 వేల 391 మంది బాలురు, 3 లక్షల 04 వేల 036 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 లక్షల 37 వేల 354 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని వారిలో 3 లక్షల 26 వేల 753 మంది బాలురు 3 లక్షల 10 వేల 601 మంది బాలికలు ఉన్నారని మంత్రి అన్నారు.

10వతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెర్ ఫార్మెన్స్ స్టేట్‌మెంట్లు (గ్రేడ్ షీట్లు) కొరకు విద్యార్ధులు ఠషష://స|షషె.శి|.శూ.గుు.n వెబ్‌సైట్ నుంచి పొందవచ్చునని మంత్రి అన్నారు. విద్యార్ధులు వారి రోల్ నెంబరును ఎ ంటర్ చేయడం ద్వారా గ్రేడ్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని మంత్రి అన్నారు. ఈవెబ్ సైట్‌కు సంబంధించి పాస్‌వర్డు కఊ – 2020 అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ , కమిషనరు చినవీరభద్రుడు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎ గ్జామినేషన్స్ సుబ్బారెడ్డి, యస్ఇఇఆర్ టి డైరెక్టరు ప్రతాపరెడ్డి, ప్రకాశం జిల్లా డిఇఓ సుబ్బారావు, పెనమలూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని, పై#్రవేట్ విద్యాసంస్ధల ప్రతినిధులు వై. విజయకుమార్ , పి. వెంకటకుమార్ , తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లి

2021-08-06 16:44:15

నందిగామలో డా.జాలాది జయంతోత్సవం..

ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, కళాప్రపూర్ణ డా.జాలాది రాజారావు 90వ జయంతో త్సవాన్ని నందిగామలో నిర్వహిస్తున్నట్టు జాలాది కళాపీఠం వ్యవస్థాపకులు డా.జాలాది విజయ తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 9వ తేదిన స్నేహ క్లబ్ ఆధ్వర్యంలో నందిగామలో శ్రీవెంకటేశ్వరా ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు హాజరవుతున్నారని చెప్పారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు డా.జాలాది విజయ తెలియజేశారు. జాలాది జయంతిని ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలోని కవులు, కళాకారులు ఉన్నచోట చేయాలనే సంకల్పంతో ఈ జయంతిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సదర్భంగా ఆమె కోరారు.

Nandigama

2021-08-06 03:28:54

వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ తో ప్రాధమిక వైద్యం..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వైద్యానికి మహర్ధశ పట్టనుంది. దివంగత ముఖ్యమత్రి డా.వైఎస్ రాజశేఖకరరెడ్డి కన్న కలలను ఆయన తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేసి గ్రామంలో ప్రాధమివైద్యాన్ని అందించడానికి సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ప్రతీ గ్రామసచివాలయం పరిధిలో ఒక వైఎస్సార్ క్లినిక్ ను నిర్మిస్తున్నారు. ప్రాధమిక రోగాలకు సంబంధించి 14 రకాల మెడికల్ టెస్టులు చేసి 65 రకాల మందులను, మరో 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్లు, మరో 12 రకాల వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుంది. గ్రామంలో ఉండే ఏఎన్ఎం 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే వారికి ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 13 జల్లాల్లోని సచివాలయాల పరిధిలోని వున్న ప్రజలను ఆయా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు అనుసంధానం చేశారు. వ్యాధి నిర్ధారణ చేయడం కోసం క్యూర్ కోడ్ విధానాన్న ప్రవేశ పెడుతున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నుంచి ప్రాధమిక వైద్య కేంద్రానికి, అక్కడి నుంచి ఏరియా, జిల్లా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ డేటాను అనుసంధానం చేస్తారు. ఇలా ప్రాధమిక వైద్యం గ్రామస్థాయిలో అందించి అంతకు మించితే వారికి వైద్యం ప్రాధమిక వైద్యకేంద్రాల్లో ఇంకా అవసరమైతే జిల్లా వైద్యశాలకు పంపి ఉచితంగానే వైద్యం చేయిస్తారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు వస్తారు. ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంచుతారు. రోగులు వేచి వుండటానికి వేయిటింగ్ హాలు ల్యాబు, ఫార్మశీ, ఇలా అన్నీ వేర్వేరుగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో వుండే విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల దగ్గరకు వెళ్లే పనిలేకుండా పూర్తిస్థాయిలో గ్రామస్థాయిలోనే మినీ హాస్పపత్రులను నిర్మాణం చేస్తుంది ప్రభుత్వం. గ్రామాల్లోనే ప్రజలకు ప్రాధమిక వైద్యం పూర్తిస్థాయిలో అందించాలనుకున్న డా.వైఎస్సార్ పేరుతోనే వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు సగానికిపైగా పూర్తయ్యాయి. వాటికి అనుగుణంగా ఆగస్టు చివరినాటికి ఇందులో పనిచేయడానికి మిడ్ లెవల్ హెల్త్ ప్రొవడైర్లను కూడా ప్రభుత్వం నియమించనుంది. సుమారు 6వేలకు పైగానే వీరిని నియమించడానికి అటు ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్రవేసింది. ఇక్కడ ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించే సమయంలో ఏమైనా అనుమానాలొస్తే వైద్యులను, 104 ద్వారా సంప్రదించడానికి టెలీ మెడిసిన్ విధానాన్ని కూడా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ లోనే ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం దీనికి కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని, వీడియో కాన్ఫరెన్సు సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి నాటికి ప్రతీ గ్రామంలోనూ డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజలకు ప్రాధమిక వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లును ఇక్కడే అందించనున్నారు. దానికోసం ఆశను కూడా ఇక్కడే అందుబాటులోకి తీసుకు వస్తోంది ప్రభుత్వం.

Tadepalle

2021-08-06 02:36:33

పీవీ సింధూకి విజయవాడలో ఘన స్వాగతం..

విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి అవంతి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అండగా ఉంటామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తనపై అభిమానం చూపిన వారికి పతకం అంకితమిస్తున్నానని సింధు చెప్పారు. తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. యువత సింధును ఆదర్శంగా  తీసుకోవాలన్నారు.

Tadepalle

2021-08-05 18:00:26

ఏపీసీడ్స్ కి అవార్డు పట్ల సీఎం హర్షం..

మున్ముందు రైతుల కోసం మరింతగా సేవలందించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని  సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) అధికారులకు సూచించారు. గురువారం సంస్థకు జాతీయ అవార్డు రావడంతో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ ను కలిసి అవార్డు వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబులు తెలియజేశారు. గవర్నెన్స్‌ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ రంగ సంస్ధగా ఏపీ సీడ్స్‌ ప్రత్యేక గుర్తింపు సాధించడాన్ని సీఎం అభినందించారు. రైతులకు గ్రామస్ధాయిలో నిరాటంకంగా, సకాలంలో విత్తనాలు పంపిణీ చేసి, ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడంపై ఏపీ సీడ్స్‌ ఎండీని, సిబ్బందిని ప్రశంసించారు.

Tadepalle

2021-08-05 16:12:31

Tadepalli

2021-08-05 03:29:34

ప్రభుత్వ తప్పిదం.. సచివాలయ ఉద్యోగులకు ఇరకాటం..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. అక్టోబరు 2వ స్తే సచివాలయాలు ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెడతామని, అది పాసైతే ప్రొబేషన్ అన్న ప్రభుత్వం ఇపుడు అలాంటి పరీక్షలేవీ లేవని, పెట్టబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక కార్యదర్శి అజయ్ కల్లాం ప్రకటించి ఇక్కడో మెలిక పెట్టారు. సిబీఏసి పరీక్ష అయితే ఉండదు గానీ.. ఆయా శాఖలకు చెందిన డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాల్సి వుంటుందని ఇపుడు ప్రకటించారు. వాస్తవానికి 16 ప్రభుత్వ శాఖల్లోని సచివాలయ ఉద్యోగులకు వీరి ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా అందరికీ జీఓలు గానీ,  గెజిట్ పబ్లికేషన్లు గానీ ప్రచురించలేదు. అలా ఏశాఖ ఉద్యోగులకై గెజిట్ పబ్లికేషన్లు ప్రకటించారో, జీఓవో పలానా శాఖ డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాలని పెట్టారో ఆ మేరకు కొందరే పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. మరికొందరు తమ సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత పదోన్నతుల కోసం తర్వాత రాసుకుందామని వదిలేశారు. కాలక్రమంలో 2 నెలలు తక్కువ రెండేళ్లు గడిచిపోతున్నాయి. దీనంతో కధ మళ్లీ మొదటికి వచ్చింది. ఇపుడు తాజాగా ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్ కావాలంటే సచివాలయ ఉద్యోగులకు నిర్ధేశించిన(ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు జీఓలు విడుదలచేయకపోయినా) డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలనేది కొత్త నిబంధన పెట్టారు.వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఏశాఖలో అయినా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యేక జీఓలు విడుదల చేసిన తరువాత వాటి ఆధారంగా భర్తీ కార్యక్రమం చేపడుతుంది. ఆపై గెజిట్ పబ్లికేషన్ చేపట్టి ఏ జీఓ ద్వారా అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో.. అందులోనే సర్వీసు రెగ్యులర్ కావడానికి ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు రాయాలో పొందుపరుస్తారు. దీనితో ఉద్యోగాల్లోకి చేరిన వారంతా వారి రెండేళ్ల ప్రొబేషన్  కాలంలో నాలుగు సార్లు నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్షలను పాసై తమ సర్వీసులను రెండేళ్లు పూర్తికాగానే రెగ్యులర్ చేయించుకుంటారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సుమారు 16 రకాల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసే సమయంలో కేవలం గ్రేడ్-5 కార్యదర్శి ఉద్యోగాలకు మాత్రమే గెజిట్ నోటిఫికేషన్(రాజముద్ర) పబ్లిష్ చేసి.. మిగిలిన శాఖ ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఉత్తర్వు విడుదల చేయకుండా ఉండిపోయింది.  అలా రాజముద్ర విడుదల చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా చట్ట బద్ధత ఉండదనేది ఒక అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెట్టం కానీ సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాస్ కావాలని చెప్పడంతో... సదరు ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా, పరీక్ష రాయని వారు తాము ఆ.. పరీక్షలు పాసయ్యేంత వరకూ రూ.15వేలు జీతంతోనే కాలం వెల్లదీయాలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు ద్వారా శాఖ పరమైన జీఓలు ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో విడుదల చేస్తాయి. ప్రభుత్వం ఏ నిబంధన ద్వారా అయితే జీలో విడుదల చేసి  జిల్లాల్లో కలెక్టర్లకు పంపుతారో దానిని సదరు ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఎంపీడీఓ ద్వారా సచివాలయాల్లోని ఉద్యోగులకు జీఓలోని అంశం చేరేటట్టు తెలియజేయాలి. తద్వారా కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగాలకు ప్రభుత్వం తమ ఉద్యోగాలకు సంబంధించి ఏఏ నిబంధనలు పెట్టిందో సిబ్బందికి తెలుస్తుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో నేటికీ ఆవిధానం అమలు జరగడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. దీనితో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏ ఏ డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాలో తెలియకుండా పోయింది. ఆ కారణంతోనే చాలా మంది ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేదు. రెండేళ్ల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఈ విషయంలో లైట్ తీసుకోవడమే ఇపుడు ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇపుడు 2 నెలల్లో సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అవుతుందని తెలిసిన వేళ.. సదరు ప్రభుత్వ శాఖల్లో ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు పాసైతేనే మీ సర్వీసులు  రెగ్యులర్ అవుతాయని చెప్పడంతో ఉద్యోగుల గుండెల్లో మళ్లీ రాయి పడినట్టు అయ్యింది. ఉద్యోగాల్లోకి చేరి దాదాపు రెండేళ్లు కావొస్తున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడా ఆ డిపార్టమెంట ల్ పరీక్షల కోసం మెలిక పెట్టడమా అని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా డిపార్టమెంటల్ టెస్టులు రెండేళ్ల ప్రొబేషన్ సమయంలోనే పాసవ్వాలనే నిభందన  అమలు చేస్తే..ఈ విషయంలో ఆయా ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు, జిల్లా కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులదే తప్పు అవుతుంది. కారణమేంటంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధి విధానాలు ఏ జీఓ రూపంలో నేటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడమేనని ఉద్యోగులు బల్లగుద్ది చెబుతున్నారు. అప్పటికీ సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు తమ పదోన్నతులు సంగతేంటని కోరినా.. రాష్ట్ర అధికారులే ఇంకా అలాంటి నిబంధనలు, ప్రత్యేక అంశాలు ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏమీ పెట్టలేదని, ఒక వేళ పెడితే జిల్లా అధికారుల ద్వారా తెలియజేస్తామని, ఆ సమయంలో వారిని సంప్రదించాలని ఆ సమాచార హక్కుచట్టం దరఖాస్తులో జవాబుగా తెలియజేశారు కూడా. ఈ విషయం ఇప్పటిది కాదు 2020లో జరిగిన సంఘటన ఆ తరువాత కూడా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లో ప్రస్తుత పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ టెస్టుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇద్దామనుకుంటే సమయం చాలానే ఉండేది. కరోనా సమయంలో కాలం రివ్వున తిరిగిపోయినా.. అధికారులు ఎలాంటి జీఓలు విడుదల చేయలేదు. ఇపుడు తాజాగా సర్వీసులు రెగ్యులర్ కావాలంటే కనీసం డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలని ఎలా చెబుతున్నారో తమకు అర్ధం కావడం లేదని.. జిల్లా శాఖల అధికారులు కూడా ఈ విషయం తమకు నోటీసుల ద్వారా కూడా చెప్పలేదని వాపోతున్నారు. సర్వీసు రెగ్యులర్ లో తమకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, తప్పులను కోర్టుకి విన్నవించి న్యాయపోరాటం చేస్తామంటున్నారు ఏ సమాచారం లేకుండా డిపార్ట్ మెంట్ పరీక్షలు రాయకుండా ఉండిపోయిన అభ్యర్ధులంతా. నిజంగా అదే జరిగితే అటు రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్, సదరు జిల్లా అధికారులు కోర్టుముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాకాకుండా ఇపుడు వారి సర్వీసులను రెగ్యులర్ చేసి.. ఆపై కొంత సమయం ఇస్తున్నట్టు ప్రకటన చేసి అప్పటి కూడా సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాస్ కాపోతే అపుడు తమపై చర్యలు తీసుకోవచ్చునని ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు తప్పితే.. రాష్ట్ర అధికారులు చేసిన తప్పువలన నేటికీ చాలా మంది డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేపోయారని, దానికి కారణం వివిధ శాఖల ఉద్యోగులకు నేటికీ పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు, సర్వీసు రెగ్యులర్ కి సంబంధించి జీఓలు విడుదల చేయలేదని అడగక పోవడం విశేషం. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగానే అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖల వారీగా గెజిట్ నోటిఫికేషన్లు, జీఓలు విడుదల చేసి ఒక నిర్ధిష్ట్ ఉత్తర్వులు విడుదల చేస్తే తాము ఈ డిపార్టమెంటల్ పరీక్ష గందర గోళం విషయం నుంచి బయట పడతామని ఉద్యోగులంతా ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుంటుందా.. నాలుగైదు ప్రభుత్వ శాఖలను కలిపి ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, నాలుగు శాఖలను కలిపి విద్యా, సంక్షేమ సహాయకులను, రెండు శాఖలను కలిపి సర్వేయర్ల ఉద్యోగాలు స్రుష్టించడం వలనే ఇప్పటి వరకూ ఏ శాఖ తరపున జీఓలు, గెజిట్లు విడుదలచేయక వదిలేశామని ఒప్పుకుంటారో.. లేదంటే తాము చెప్పకపోయినా ప్రస్తుత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల నుంచి ఎందుకు మీరు దాదాపు రెండేళ్ల సమయం పూర్తవుతున్నా తెలుసుకోలేకపోయారని ఉద్యోగులపైనే నెపం అంతా నెట్టేస్తుందో..చూడాలి..!

తాడేపల్లి

2021-08-05 01:42:26

సచివాలయాల్లో సర్వీసు రూల్స్ ఎక్కడ..?

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తిచేసుకోబుతున్నా నేటికీ  కొన్నిశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ప్రభుత్వం తయారు చేయలేదు. ఈ విషయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సదరు శాఖలను ఆదేశించలేదో.. లేదంటే ఆ శాఖల ముఖ్య కార్యదర్శిలకు ఖాళీలేకనో తెలీదు కానీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేసే విషయంలో మాత్రం నేటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో కొందరు సిబ్బందిని నాలుగైదు శాఖలను కలుపుతూ ఒక ఉద్యోగంగా తయారు చేసింది ప్రభుత్వం. దీనితో ఏశాఖ తరపున వీరికి సర్వీసు రూల్సు తయారు చేయాలో తెలీక ప్రభుత్వం మధనపడుతోంది. మిగతాశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, పదోన్నతల విషయంలో ఒక క్లారిటీ వచ్చినా మరికొన్నిశాఖల సిబ్బందికి క్లారిటీ రాకపోవడంతో వారి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా..? లేదా..  తాము జీవితాంతం ఇదే ఉద్యోగం చేయాలా.? అనే అనుమానంతో కొట్టిమిట్టాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా విద్య, సంక్షేమ సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు ప్రధానంగా ఉన్నారు. విద్య, సంక్షేమ సహాయకులను తీసుకుంటే వీరి ఉద్యోగం(బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గల నాలుగు శాఖలను కలిపి ఒక ఉద్యోగాన్ని తయారు చేశారు), ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను తీసుకుంటే(పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, హౌసింగ్, ఎస్ఎస్ఏ ఇలా ఐదు ప్రభుత్వ శాఖల)ను కలిపి ఒక పోస్టుగా తయారు చేశారు. ఇక సర్వేయర్ల విషయానికొస్తే వీరు ప్రస్తుతం పనిచేసేది రెవిన్యూశాఖ అయినప్పటికీ, వీరికంటూ సర్వే శాఖ ఒకటుంది. అలాగనీ వీరు ఈ రెండు శాఖల అధికారులద దగ్గరా పనిచేస్తున్నారు. వీరంతా అన్ని శాఖలకు సంబంధించిన పనులూ చేస్తున్నప్పటికీ వీరికి ఏశాఖ నుంచి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి, వీరికి సర్వీసులో ఏశాఖ నుంచి పదోన్నతి కల్పించాలి అనే విషయంలో క్లారిటీ లేదు.

 ఈ మూడు శాఖలకు చెందిన సిబ్బంది 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 45వేలకు పైనే ఉన్నారు. ప్రస్తుతం అన్నిశాఖలకు సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు వచ్చినప్పటికీ వీరికి మాత్రం ఎలాంటి జీఓలు రాలేదు. దీనితో తాము ఏశాఖకు చెందిన ఉద్యోగులగా తమను ప్రభుత్వం గుర్తిస్తుందో తెలీక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక.. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి, మంచి ఉద్యోగాల్లో చేరిపోయారు. అంతేకాకుండా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 85శాతం ఉద్యోగులంతా పట్టభద్రులే అయినప్పటికీ, వీరి ఉద్యోగం నాల్గవ తరగతికి చెందినదా, 5వ తరగతికి చెందినదా..లేదంటే వీరిని ప్రభుత్వం ఒక ప్రత్యేక సంఖ్య ఉద్యోగులుగా గుర్తించినదా అనేదీకూడా తెలియడం లేదు. వాస్తవానికి ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా వ్యత్యాసాలు ఉండటంతో ప్రభుత్వం కల్పించే పదోన్నతుల విషయంలో చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోనీ రెగ్యులర్ ఉద్యోగం కదాని దైర్యం చేసి కొనసాగించుకుందామనుకున్నా..నేటికీ వీరందరికీ సర్వీసు రూల్సు లేకపోవడం, రెండేళ్ల ప్రొబేషన్ కాలం అక్టోబర్ 2తో పూర్తవడంతో తమను ఏ శాఖ కింద ఉద్యోగులుగా ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందోనని వీరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ద్రుష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఈ మూడు శాఖల ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

మరోపక్క మిగిలిన శాఖలకు సంబంధించి సర్వీసు నిబంధనలు అమలు చేసినా, అవి మిగిలిన ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే మరీ తక్కువ స్థాయి పదోన్నతులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోకి ఉద్యోగులుగా చేరితే తమకి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విషయంలో కనీసం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఈ ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాలు వచ్చాయని వెళ్లిపోవడంతో, మరికొంత మంది ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడగా, మరికొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇంకా భర్తీచేయకుండానే వదిలేసింది.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తోంది తప్పితే.. వీరి సర్వీసు రూల్సు, పదోతన్నల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే పనికి మాత్రం పూనుకోవడంలేదు. మరో విచిత్రం ఏంటంటే మరో మూడు నెలల్లో సర్వీసులు రెగ్యులర్ చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రం ఉద్యోగులందరికీ సర్వీసు రిజిస్టర్లు  ఓపెన్ చేసింది ప్రభుత్వం. అక్టోబరు 2 తరువాత ఆ రిజిస్టర్ లో ఆయా ప్రభుత్వ శాఖలు సర్వీసు నిబంధనల ఆధారంగా ఎంట్రీలు జరపాల్సి వుంటుంది. మరి ఆ సమయంలో ఏ ప్రభుత్వశాఖ కింద ఈ ఉద్యోగులను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తెలియన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందనేది మాత్రం అక్టోబరు 2 దాటేవరకూ ఒక కొలిక్కి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు..!

Tadepalle

2021-08-04 02:09:30

ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. సచివాలయ ఉద్యోగుల సిబిఏసీ పరీక్ష రద్దు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అక్టోబరు 2 నాటికి ఉద్యోగులందరికీ రెండేళ్ల ప్రొభేషన్ పూర్తయ్యే సమయానికి పెట్టాలనుకున్న క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఈ పరీక్ష వలన ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను, సాంకేతిక కారణాలను, అవసరమైతే కోర్టుకు వెళ్లాలనుకున్న విషయాన్ని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో రెండేళ్లపాటు సర్వీసులు అందించిన సచివాలయ ఉద్యోగులకు సిబిఏసీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారని, ఆయన ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం వెల్లడించారు. సీఎం సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఈ పరీక్షలో మినహాయింపు ఇవ్వడం పట్ల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని అన్ని రకాల ముఖ్యవిషయాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహిస్తూ.. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి సచివాలయ ఉద్యోగులు ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయంలో ఉద్యోగులంతా సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు.

తాడేపల్లి

2021-08-03 02:11:18