1 ENS Live Breaking News

జర్నలిస్టు హెల్త్ స్కీం ప్రీమియం చెల్లించాలి..

రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250/- cfms.ap వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి, 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి  జర్నలిస్టు వాటాగా రూ. 1250/- చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250/- లను చెల్లిస్తుందని కమిషనర్ తెలిపారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code:8342–00–120-01-03-001-001 VN, DDO Code : 2703–0802–003 నందు తమ వాటాను చెల్లించాలని ఆయన సూచించారు.  ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు విజయవాడలోని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులైతే సంబంధిత జిల్లా కేంద్రంలో గల సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయవలసిందిగా ఆ ప్రకటనలో తెలిపారు.

Tadepalle

2021-07-30 16:04:24

ఇక న్యాయపోరాటంతోనే సర్వీస్ రెగ్యులర్..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును కోర్టును ఆశ్రయించి సాధించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేపట్టినపుడు కనీసం మూడు నెలలు కూడా శాఖ పరమైన శిక్షణ ఇవ్వకుండా ఇపుడు ఏకంగా గ్రూప్-1 స్థాయిని తలపించేంత సిలబస్ ఇచ్చి ప్రొబేషన్ పూర్తైన సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం. దీనితో ఇప్పటికే ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నియామకాల్లో విడుల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా కాకుండా ప్రత్యేకంగా పరీక్ష పెట్టడానికి వీరితోపాటు అన్ని సుమారు 16 కేటగిరీల్లోని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అందునా రెండేళ్లు పాటు పరీక్షలు పెట్టకుండా కేవలంల అక్టోబరు 2 నాటికి రెండేళ్లు ప్రొబేషన్ కాలం పూర్తవుతుందనగా కొండంత సిలబస్ ఇచ్చి ఇపుడు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు లేకుండా జీఓనెంబరు2 ద్వారా వీఆర్వోలకు అధికారాలు కట్టబెట్టడం, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఆర్టికల్ 73కు వ్యతిరేకంగా డిడిఓ అధికారాలు వీఆర్వోలకు బదలాయించిన విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 అంతేకాకుండా జీఓనెంబరు 149ని అమలు చేయకుండా గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల వద్దే పంచాయతీల్లో అధికారాలు ఉంచేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ఎన్నిసార్లు గ్రేడ్-5 కార్యదర్శిలు ఎందరు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇపుడు ఇదే సమయంలో ఇపుడు సచివాలయ ఉద్యోగులందరికీ ఒకేసారి ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తే సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందనే ఉద్దేశ్యంతో సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష అది పాసైతేనే సర్వీసు రెగ్యులర్ చేస్తామని లేదంటే ప్రొబేషన్ మరికొంత కాలం పెంచుతామని..ఉద్యోగాలు మాత్రం తీయని చేసిన ప్రభుత్వ ప్రకటన ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలను రేకిత్తిస్తోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేనివిధంగా కేవలం రూ.15వేల జీతంతో రెండేళ్లు పనిచేయించుకొని, ఇపుడు ప్రభుత్వం ఈ విధంగా మాట మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క గ్రామ విద్యా, సంక్షేమ సహాయకులకు సైతం ఈ ఉద్యోగం తరువాత వీరికి ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తాయో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇదే విషయాన్ని ఇటు వారు కూడా సామాజిక మాద్యమాల్లో ప్రభుత్వానికి దాఖలైన సమాచార హక్కచట్టం దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. 

మరోపక్క మహిళా పోలీసులు సైతం డిగ్రీ చదువుకున్న తమను సాధారణ పోలీస్ కానిస్టేబుళ్లుగా ప్రభుత్వం గుర్తించి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తామని జీఓనెంబరు 59 ద్వారా ప్రకటించడంతో వారు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉన్నత విద్య ఉన్న తమకు ఎస్ఐగా ప్రమోషన్లు ఇవ్వాలని వీరంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్, ఫిషరీష్,  యానిమల్ హజ్బండరీ సహాయకులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సైతం ఈ ఉద్యోగం తరువాత ఏ స్థాయి ప్రమోన్ ఇస్తారో వారికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.  ఇలా గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షా 20వేల మంది ఉద్యోగులు భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ప్రభుత్వం పెడతామన్న పరీక్ష పాస్ కాకపోతే మరో ఏడాది పాటు రూ.15వేల జీతంతో ఎలా బతకాలనీ.. నిత్యవసర సరకుల ధరలు అమాంతంగా పెరిగిన సమయంలో వచ్చే జీతమే ఎటూ చాలడం లేదని ఉద్యోగులంతా గగ్గోలు పెడుతున్నారు. తమతో రెండవ శనివారాలు, ఆదివారాలు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుని ఇపుడు తీరా ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయానికి కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తీసుకు వస్తున్నారని ఉద్యోగులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇన్ని ఇబ్బందులు నడుమ తమ ఉద్యోగాలు రాజమార్గంలో రెగ్యులర్ కావాలన్నా..భవిష్యత్తులో ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష పాసవ్వాలనే మెలిక పోవాలన్నా.. పేస్కేలు అమలై జీతం పెరగాలన్నా న్యాయస్థానం ఒక్కటే సరైన మార్గమని భావించి ఆదిశగా అన్నిశాఖల ఉద్యోగులు కోర్టు ఆశ్రయించాలని, దానికోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఆ తరువాత వచ్చిన జీఓలు, గెజిట్ నోటిఫికేషన్ ఆర్డర్లు, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వమే ఇచ్చిన అధికారక సమాధానాలు, ఇప్పటి వరకూ తమ ఉద్యోగాల్లో కోల్పోయిన పేస్కేలులోని మొత్తం, ప్రభుత్వం పెట్టబోయే పరీక్ష కాకపోతే మరో ఏడాది పాటు కోల్పేయే జీతం ఇలా అన్ని అధారాలను కోర్టు ముందుంచి న్యాయం కోరాలని చూస్తున్నారట. అటు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 8 డిఏలు, ఒక పీఆర్సీ అమలు చేయలేదు. వారికి సిపిఎస్ కూడా రద్దు చేయలేదు. ఇపుడు వారి జాబితాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేరనున్నారు. వీరంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా.. సహకారం అందించకపోయినా భారీ స్థాయిలో ప్రభుత్వం వీరి నుంచి మద్దతు కోల్పోపోయే ప్రమాదం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాడు టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులు, ఉద్యోగుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం కంటే.. నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంతకంటే తప్పులు చేసే దిశగా పయనిస్తుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటోందోనని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు 40 మంది ఉన్న సలహాదారుల్లో ఒక్కరు కూడా ఈ ఉద్యోగుల విషయంలో సీఎంకు సరైన సలహాలు ఇవ్వకపోగా, ఉద్యోగ వ్యతిరేక విధానాలనే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాటినే ఇపుడు ఉద్యోగుల సామాజిక మాద్యమ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది..!

Tadepalle

2021-07-30 01:57:29

ఆ ప్రచారం అంతా అవాస్తవం..

రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునే క్రమంలో పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందనే ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ స్ధితిగతులను వివరించేందుకు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి సమాచార శాఖా కమిషనరు టి.విజయకుమార్‌రెడ్డితో కలిసి విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణ దువ్వూరి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అప్పుల విధానంపై ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్ధలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం ఏపికి వనరులు జనాభాతో పోలిస్తే సగం మాత్రమేనన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇటువంటి చర్యల వలన ఆర్ధిక సంస్ధలను కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించడమేనన్నారు. ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునేందుకు రుణాలు తీసుకోవడం ఎ ప్పటినుండో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానమని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదేవిధానాన్ని అనుసరిస్తున్నాయని ఈవిషయాన్ని ప్రతిపక్షాలు గుర్తెరెగాలని అన్నారు. 

ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం రుణం 17.15 శాతంమేర పెరిగితే రాష్ట్ర ప్రభుత్వ రుణం 15.26 శాతం మాత్రమే పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్ర విభజననాటికేమన రాష్ట్రంపై ఎ న్నో వేల కోట్ల రూపాయలు రుణం ఉందని దీనికి తోడు గత ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలను రుణం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రం తీసుకున్న రుణం విపరీతంగా పెరిగి పోయిందన్నారు. విభజన తర్వాత ఏపికి రూ. 97 వేల 102 కోట్లు అప్పు మిగలగా, ఐదేళ్లలో రూ. 2 లక్షల 68 వేల 225 కోట్ల రూపాయలకు పెరిగిపోయిందన్నారు. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ. 3 లక్షల 56 వేల 172 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. 2016-17, 2017-18, 2018-19 ఆర్ధిక సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల మేర పరిమితికి మించి అప్పులు చేసింది వాస్తవం కాదా అన్నారు. విభజన నాటికి రూ. 14 వేల కోట్లు ఉన్న అప్పులు గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 2019 మార్చి నాటికి రూ. 39 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ క్రింద రూ. 58 వేల కోట్లుగా ఉందని ఆయన అన్నారు. విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించి వ్యయం 2014లో రూ. 2893 కోట్లు ఉండగా, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 2019 నాటికి రూ. 21540 కోట్లుగా ఉందన్నారు. 

ఈపరిస్ధితుల్లో 2019లో అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు ప్రజల జీవన అవసరాలు మెరుగుచేసే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రుణాలను తీసుకోవడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అనూహ్యంగా రాష్ట్ర ఆర్ధిక స్ధితిగతులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 2020-21లో రూ. 7780 కోట్లు కేంద్ర పన్నుల వాటాలో నష్టం, రాష్ట్ర పన్నుల్లో రూ. 7 వేల కోట్లు నష్టం, కోవిడ్ వ్యయం రూ. 8 వేల కోట్ల రూపాయలతో కలిపి మొత్తం రూ. 24 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. ఈపరిస్ధితుల్లో అప్పుచేయడం తప్పని పరిస్ధితిగా మారిపోయిందన్నారు. అప్పులు పెరగలేదని తమ ప్రభుత్వం చెప్పడం లేదని ప్రజలకు మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి పాలనా లక్ష్యమన్నారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుని ఒక్క సంక్షేమ పధకం కూడా ఆగకుండా సమయానికి లబ్దిదారులకు ఖాతాలలో సొమ్ము జమచేయడమే ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. తీసుకున్న రుణంలో ఏఒక్క రూపాయి వృధాచేయ లేదని, పారదర్శకంగా అభివృద్ధికి ఖర్చు చెెస్తున్నామని ఇంతవరకూ రూ. లక్ష కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పధకాల క్రింద నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి అన్నారు.

Tadepalli

2021-07-28 15:57:34

నాడు-నేడుకి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లు విరాళం..

నాడు-నేడు పధకం రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్‌ ల్యాబ్స్‌ తరపున నాలుగు కోట్లరూపాయలను సీఈవో డాక్టర్‌ చావా సత్యనారాయణ విరాళంగా అందజేశారు. మొత్తానికి సంబంధించిన చెక్కును,  పత్రాలను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ, మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.  లారస్‌ ల్యాబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-07-28 15:36:03

ప్రభుత్వంపై రూ.300 కోట్ల భారం పడకూడదనే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని లక్షా 20వేల మంది ఉద్యోగాలను అక్టోబరు 2 తరువాత రెగ్యులర్ చేస్తే ఖజానాపై నెలకు రూ.300 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుంది. అదీ ప్రభుత్వం సచివాల ఉద్యోగులకు నియామక ఉత్తర్వుల్లో 2015 పీఆర్సీ నిబంధనలకు లోబడి ఇచ్చిన పేస్కేలు ఆధారంగా..  అదే ప్రొబేషన్ పూర్తైన సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని బావించింది. అలా చూసుకుంటే ఎంత మంది పాసవుతారో ప్రస్తుత పరిస్థితిలో చెప్పలేనివిధంగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా నియామక సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన పేస్కేలు మొత్తం అమలు చేసి జీతాలు ఇస్తారు. కానీ ప్రొబేషన్ మాత్రం రెండేళ్ల తరువాతే చేస్తారు. ఆ రకంగా చూసుకున్నా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు లక్షకు పైగా చేరడంతో ప్రభుత్వం వీరికి  రూ.15వేలు జీతమనే లక్ష్మణ రేఖ పెట్టింది. ఈ నిబంధనకు లోబడి ఉద్యోగాల్లో చేరినందుకు ఒక్కో సచివాలయ ఉద్యోగి రెండేళ్లలో కోల్పోయిన జీతం రూ.2.40లక్షలు(ప్రస్తుత పేస్కేలు ఆధారంగా రమారమీ రూ.25వేలు జీతం వస్తే). ఈ మొత్తం జీతం పోయినా రెండేళ్ల తరువాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనుకున్న ఉద్యోగులకు ప్రభుత్వ ప్రకటన గుండెళ్లో రాయిపడేసినంత పనిచేసింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగం గ్రూప్-4 కేడర్ ఉద్యోగమే అయినా వీరందరికీ క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పాస్ కావాలంటే ఇచ్చిన సిలబస్ మాత్రం గ్రూప్-1  సిలబస్ ను తలపించేదిగా ఉందని ఉద్యోగులు భయపడిపోతున్నారు. 

ప్రభుత్వం ఇంతస్థాయిలో సిలబస్ ఇచ్చే ఆలోచన ఉంటే ఈ రెండేళ్లలో ఈ తరహా ఉద్యోగం ఎప్పుడైనా పెట్టి ఉండవచ్చునని, ఉద్యోగులందరికీ ఈ పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పూర్తవదనే నిబంధన అప్పుడే పెట్టి ఉంటే ఈ రెండేళ్లలో అందరు ఉద్యోగులం పాస్ అయ్యేవారమని.. ఇపుడు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని అంతా ఆశగా ఎదరుచూసే సమయానికి క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పాసైతేనే ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని.. అపుడు మాత్రమే పేస్కేలు వర్తిస్తుందని చెప్పడం పద్దతి కాదని ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 20వేల మంది ఉద్యోగులం పనిచేస్తున్నామని.. తమకు ఇచ్చే రూ. 15వేల జీతంలో కేవలం రూ.180 కోట్ల రూపాయలు నెలకు ప్రభుత్వానికి అవుతుందని.. మా సర్వీసులు రెగ్యులర్ చేస్తే ఉన్నపళంగా ప్రభుత్వంపై రూ.300 కోట్లు భారం పడుతుందనే కారణంతోనే ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ఈ ప్రత్యేక పరీక్ష విధానాన్ని ప్రభుత్వం ముడిపెట్టి తెరపైకి తీసుకొచ్చిందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్యోగంలోనైనా ఈ తరహా పరీక్షలు ఉంటాయని చెబుతున్న ప్రభుత్వ సలహాదారులు ఈ విషయాన్ని ఉద్యోగాల్లో చేరే సమయంలో ఎందుకు ప్రకటించలేదని, ఈ రెండేళ్లలో ఈ పరీక్ష పెడితే మొత్తం ఉద్యోగులమంతా పాస్ అయి ఉద్యోగాల రెగ్యులరైజేషన్ లైన్ క్లియర్ అయ్యేది కదాని ప్రశ్నిస్తున్నారు. అలాకాకుండా ఇప్పటిప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి చాంతాండంత సిలబస్ ఇచ్చీ.. తూతూ మంత్రంగా ఉద్యోగంలో చేరినపు శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశ పరీక్ష విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే 3 నెలల సమాయానికి ముందు ప్రత్యేక పరీక్షను తీసుకురావడం భావ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగా ప్రవేశ పెడితే కనీసం రాష్ట్రవ్యాప్తంగా 50శాతం ఉద్యోగులు కూడా పాసయ్యే అవకాశం లేదని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఏడాది ఒక్కసారే పెడితే పరీక్ష పాస్ కాని వారంతా మరో ఏడాది పాటు రూ.15వేల జీతంతోనే ఉద్యోగాలు ఏ విధంగా చేయాలో ప్రభుత్వమే చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక పరీక్ష 6నెలలకు ఒకసారి, ఏడాది ఒకసారి లేదంటే రెండేళ్లకు ఒకసారి పెడుతుందా అనే విషయం కూడా ప్రభుత్వం నేటికీ క్లారిటీ ఇవ్వకపోవడం ఉద్యోగుల ఆందోళన మరింత పెంచుతున్నది. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని గ్రామస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినందకు ఆనందించామని.. ఈ వ్యవస్థలో తొలి ఉద్యోగాలు చేస్తున్నందకు గర్వపడ్డామని.. తమ ఆనందం మొత్తం ప్రత్యేక ప్రవేశ పరీక్షనెపంతో ప్రభుత్వం నీరుగార్చేయడం అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. రెండు దశల్లో కరోనా వైరస్ వచ్చినపుడు సచివాలయ ఉద్యోగుల విధులకు కనీసం రెగ్యులర్ ఉద్యోగులకి ఇచ్చిన వెసులు బాటు కూడా ఇవ్వకుండా విధులు నిర్వహించేలా చేశారని.. తామంతా కూడా ప్రజలకు సేవచేసే భాగ్యం వచ్చిందన్నట్టుగా రెండవ శనివారాలు, ఆదివారాలు అనే తేడా లేకుండా సెలవులు కూడా తీసుకోకుండా అధనపు విధులు నిర్వర్తించినందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో గుర్తిస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఉద్యోగులంతా. ప్రాణాలకు తెగించి అదనపు విధులు చేసినందుకు గుర్తుగా సర్వీసు రెగ్యులర్ అయ్యేంత వరకూ రూ.15వేలకే ఏళ్ల తరబడి పనిచేయించుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 ఇప్పటి వరకూ ఏ రాష్ట్రప్రభుత్వమూ పెట్టని నిబంధన రూ.15వేలకే ఉద్యోగం చేయడమే పెట్టి.. అదే జీతం తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేంత వరకూ ఇచ్చి తమ ముందు కొండం సిలబస్ పెట్టి ఎప్పటికీ పాస్ కాకుండా చేద్దామనే కుటిల బుద్ధితోనే ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక ఆరునెలలు, లేదా ఏడాది ముందు ఈ విషయం చెప్పినా.. సిలబస్ విడుదల చేసినా శిక్షణ పొందడానికి, సిలబస్ మొత్తం చదువుకోవడానికి వీలుండేదని.. ఆఖరి సమయంలో ఇంత పెద్ద సిలబస్ ఇస్తే ఎలాగూ వీరు పాసవరని.. ప్రభుత్వంపై పడే భారాన్ని తగ్గించుకోవడానికే ఈ విధంగా ప్లాన్ చేశారని ఇటు విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అందులోనూ వయస్సు మళ్లిన(45ఏళ్లు దాటిన వారు) సుమారు రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 30వేలకు పైగా ఉద్యోగులం ఉన్నామని, ఈ వయస్సులో తాము ఈ సిలబస్ ఎప్పటికి చదివి..మరెప్పటికీ పాసవుతామో తెలియడం లేదని వాపోతున్నారు. దీనితో ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఎంతో గౌరవం పెంచుకున్న సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినట్టుగానే రెండు రోజుల నుంచి సంకేతాలు అందతున్నాయి.. అంతేకాదు ఇంత కష్టపడి పనిచేసినందుకు ఇదా ప్రభుత్వం తమకిచ్చే గౌరవమంటూ.. ఉద్యోగ సంఘాల సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో రోజూ చర్చలు జరుగేంత స్థాయికి చేరుకున్నారు. ఇదే కొనసాగితే ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో వ్యతిరేకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయిలు సంక్షేమ పథకాలు పేదలకు అందించామని.. తెల్లవారు జామున 5గంటలకే వెళ్లి పించన్లు ఇచ్చినందుకు గుర్తుగా తమకి ప్రభుత్వం చాలా బాగా గుర్తించిందంటూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చూడాలి ప్రభుత్వ చర్యలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో రెగ్యులైజేషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో..!

Tadepalle

2021-07-28 02:00:47

మీకు మెమో ఇస్తే నాకునేను ఇచ్చుకున్నట్టే..

గ్రామ, వార్డు సచివాలయాల్లో జిల్లాకలెక్టర్లు, జేసిలు తనిఖీలు చేసినట్టుగా రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు, ఐటిడిఏ పీఓ చేయకపోవడం బాధాకరం.. మనం తరచుగా తనిఖీలు చేస్తేనే అక్కడ ప్రజలకు సేవలు బాగా అందుతాయి..పనిచేయని ఏ అధికారికైనా మెమో ఇవ్వండి..అలా మెమో ఇవ్వడమంటే నాకు నేను ఇచ్చుకున్నట్టేనని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల మంత్రులు, రాష్ట్ర శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ, వార్డు సచివాలయాలకు, ఆర్బీకెలకు  వెళ్లినప్పుడు కచ్చితంగా ఎస్‌ఓపీ పాటిస్తున్నారా?లేదా?చూడాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ ప్రజలకు అందుబాటులో ఉండి వారినుంచి విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కారాలు చూపాలన్నారు. ఖచ్చితంగా బయో మెట్రిక్ అమలు చేస్తూ రోజుకి రెండుసార్లు సిబ్బంది హాజరు నమోదు కావాలన్నారు. కరో సమయంలో రాష్ట్రవ్యాప్తం సిబ్బందిగా బాగా కష్టపడి పనిచేశారన్నారు.  నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్‌ దుకాణాలపై దృష్టి పెట్టాలి:
అలాంటి వాటిపై కలెక్టర్లు, ఎస్పీలు కలిసి.. సంయుక్తంగా దాడులు నిర్వహించాలని అప్పుడే కల్తీలు ఆగుతాయని సీఎం పేర్కొన్నారు. విధి నిర్వహణలో వున్న సిబ్బంది, ఏ స్థాయి అధికారపై అయినా చర్యలు చేపట్టాల్సిందేనంటూ అధికారులను ఆదేశించారు.  ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్టేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tadepalle

2021-07-27 17:09:11

మహిళా పోలీసులకు ఆ ఎస్పీ రోల్ మోడల్..

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని సుమారు 14న్నరవేల మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ రోల్ మోడల్ గా మారిపోయారు. సచివాలయాలు ఏర్పాటైన దగ్గర నుంచి రాష్ట్రంలో ఒక్క పోలీసు అధికారి కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓలు 129, 59లను శాఖా పరంగా క్రింది స్థాయి ఎస్ఐలు, కానిస్టేబుళ్లు తెలియజేసి..వారిని పోలీసులుగా గుర్తించే ఏర్పాటు చేయలేదు. మహిళా పోలీసులు సాధారణ పోలీసులనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిందేననే ఆదేశాలు జారీచేసిన దాఖలాలేవు. కానీ తూర్పుగోదావరి జిల్లాకి కొత్తగా వచ్చిన ఎస్పీ వస్తూ వస్తూనే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ పోలీసులను బాహ్యప్రపంచానికి నిజమైన పోలీసులుగా ప్రభుత్వం గుర్తించిన విషయాన్ని పోలీసులకు నొక్కిచెప్పి.. సచివాలయ మహిళా పోలీసులను హోంశాఖ సాదారణ పోలీసులుగా గుర్తించాల్సిందేనని మొట్టమొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సు పెట్టి అన్ని డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ల ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు మహిళా పోలీసుల సమక్షంలోనే చెప్పి ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. దీనితో ఆవిషయం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసుల సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. 

రాష్ట్రంలో డీజీపి తరువాత ఆ స్థాయిలో మహిళా పోలీసులను గుర్తించినది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మాత్రమే నంటూ వారంతా ప్రశంసల జల్లు కురిస్తున్నారు. అంతేకాకుండా దిశ ఎస్ఓఎస్ యాప్ రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రోత్సహిస్తున్న తీరును కూడా జిల్లా మహిళా పోలీసులంతా తమతో ఎస్పీ ఒక కుటుంబ పెద్దగా మాట్లాడితన తీరును ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ చాలా చోట్ల హోంగార్డు నుంచి కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు తమను మీరంతా నిజమైన పోలీసులా, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించినంత మాత్రాన మేము మిమ్మల్ని మాతో సమానంగా పోలీసులుగా గుర్తించలేమని మాట్లాడేవారని.. అలాంటి మాటలకు ఒకేఒక్క వీడియోకాన్ఫరెన్సు ద్వారా అడ్డుకట్ట వేయడంతోపాటు.. ఆ విధానాన్ని మార్చుకోవాలని తమ ముందే పోలీసులకు ఎస్పీ వివరించన తీరు తమలో ఎంతో ఆత్మస్తైర్యాన్ని నింపిందంటూ హర్షం  వ్యక్తం చేస్తున్నారు. పైగా గ్రామాల్లో మహిళా పోలీసులున్నారనే భరోసా స్టేషన్ ఎస్ఐలే ప్రజలకు అవగాహన కల్పించాలని, వీరంతా సాధారణ పోలీసులేననే విషయాన్ని జీఓనెంబరు 59తో ప్రభుత్వమే వారికి గుర్తింపు నిచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా పోలీసుశాఖలో చర్చనీయాంశమవుతోంది. 

పైగా అవినీకి పాల్పడిన పోలీసులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం, వీడియో కాన్ఫరెన్సు కి ఒక్కరోజు ముందు తూర్పుగోదావరి జిల్లాలో నలుగు ఏఎస్ఐలను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా వీరంతా ప్రస్తావించుకున్నారు. పైగా మరో ఏఎస్ఐని విధుల్లో నుంచి తొలగించిన తీరు తమ కర్తవ్యాన్ని గుర్తుచేసిందని, రెండేళ్లలో సరైన జిల్లా పోలీసు అధికారిని చూశామని.. నిజమైన పోలీసు అధికారి అంటే కింది స్థాయి ఉద్యోగులను గౌరవిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకున్నామని మహిళా పోలీసులంతా తమ ఆనందాన్ని ఎస్పీతో మాట్లాడిన తీరును తమ సహచర మహిళా పోలీసులతో పంచుకోవడం విశేషం. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా రావీంధ్రబాబు రావడంతోనే పోలీసు శాఖ ప్రక్షాలణ చేపట్టడం ఇటు జిల్లాపోలీసులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన మరుసటి రోజే జిల్లాలోని ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయడం విశేషం.

 పైగా నవంబరు2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకోబుతన్న తూర్పుగోదావరి జిల్లా మహిళా పోలీసులకు ప్రస్తుత ఎస్పీ వచ్చిన తరువాత వారికి వచ్చిన గౌరవం, పోలీసులుగా తమను గుర్తించాలని పదే పదే పోలీసులను హెచ్చరించిన తీరు తమకు మార్గదర్శకమని.. మహిళా పోలీసులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్పీ జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ల ఎస్ఐలతోపాటు కానిస్టేబుళ్లును హెచ్చరించిన విషయాన్ని జిల్లా పోలీసులు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుంటారో.. లేదంటే  గతంలో వ్యవహరించినట్టుగానే.. మీరు మాలా నిజమైన పోలీసులు కాదంటూ వెటకారంగా మాట్లాడుతూ, మహిళా పోలీసులకు గాలి తీసేసి వారిలో ఆత్మస్తైర్యాన్ని చెదరగొడతారో.. ఎస్పీ ఆదేశించిన హెచ్చరికను శిరసా వహించి ఈ విధంగా మాట్లాడినట్టు ఇక ముందు మాట్లాడకుండా ఉంటారో.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలు ఎంత వరకూ పాటిస్తారనేది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. కానీ వస్తూ వస్తూనే ఎస్పీ రవీంధ్రనాధ్ తీసుకున్న చర్యలకు పోలీసు శాఖలో తేడా అధికారులకు ముచ్చెమటులు పడుతున్నా ప్రజల నుంచి మాత్రం మంచి స్పందన వస్తోంది..! 

Tadepalle

2021-07-27 02:58:50

ఫిషింగ్ హార్బర్లు వేగంగా పూర్తిచేయండి..

రాష్ట్రంలో మంజూరైన 8 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల పై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖు స్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల అధికారులను ఆదేశించారు. ఈపిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే అప్పగించడం తోపాటు మిగతా అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని వీడియో సమావేశం ద్వారా పాల్గొన్న సంబంధిత కలెక్టర్లను ఆయన ఆదేశించారు.ఇంకా వీటి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై సిఎస్ కమిటీ సభ్యులు అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మత్స్య శాఖ కమీషనర్ కన్నబాబు, ఆర్థిక శాఖ ఇఓ కార్యదర్శి సత్యనారాయణ, మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్,ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Vijayawada

2021-07-26 16:46:26

ఎపిడిఆర్పి ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలి..

ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ(SSC)సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల రూ.ల అంచనాలతో శ్రీకాకుళం నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఎపి డిఆర్పి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. వాస్తవానికి ఈపనులన్నీ 2015-2020 ల మధ్య ఐదేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉందని అయితే కరోనా తదితర కారణాల వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు.దానివల్ల ఈప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈఏడాది వరకూ గడువును పెంచినందున ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు లోగా పనులన్నీ పూర్తి కావాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండాలోని అంశాలను వివరించారు. ఇప్పటి వరకూ 1452 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 73శాతం ఫిజికల్ ప్రోగ్రస్ ను,71శాతం ఫైనాన్సియల్ ప్రోగ్రస్ ను సాధించినట్టు తెలిపారు. ఈసమావేశంలో ఆర్థిక, టిఆర్అండ్బి శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్,యంటి కృష్ణ బాబు,  ఎపి డిఆర్పి ప్రాజెక్టు డైరెక్టర్ కె.కన్నబాబు,అటవీ,ఎపి ట్రాన్సుకో ఇతర విభాగాల అధికారులు, వీడియో సమావేశం ద్వారా జివియంసి కమీషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

తాడేపల్లి

2021-07-26 16:13:34

సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఝలక్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన ఝలక్ మామూలుగా లేదు. అక్టోబర్ నెలాఖరుకు మొదటి బ్యాచ్ ఉద్యోగులకు రెండేళ్ల ప్రొహిభిషన్ పూర్తవుతున్న సమయంలో ప్రభుత్వం పెట్టే డిపార్టమెంట్ టెస్ట్ పాసైతేనే అందరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రొహిభిషన్ సమయం రెండేళ్లూ మామూలుగా ఉండిపోయిన ప్రభుత్వం సరిగ్గా ఉద్యోగాలు రెగ్యులర్ అయి పేస్కేలు వర్తింపజేసే సమయంలో ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష పాసైతే తప్పా ఉద్యోగాలు రెగ్యులర్ కావని.. ఎంతకాలం ఆ పరీక్ష పాస్ కాకపోతే అంతవరకూ ప్రొభిషన్ సమయాన్ని పొడిగిస్తామని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. దీనితో రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు లక్షా 16 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఆలోచనలో పడింది. వాస్తవానికి ప్రభుత్వం ఈ ప్రత్యేక పరీక్ష విషయం ముందే చెబితే ప్రొహిభిషన్ రెండేళ్ల సమయంలో ఉద్యోగులు ఎప్పుడో పాసై ఉండేవారమి చెబుతున్నారు. కానీ అలా చెప్పకుండా సర్వీసు రెగ్యులర్ చేయడానికి 3నెలల సమయం వుందనగా ఈ విషయాన్ని ప్రకటించడం పట్ల ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రాష్ట్రప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ పేస్కేలు ఇస్తూ.. రెండేళ్ల ప్రొహిభిషన్ డిక్లేర్ చేస్తూ సర్వీసులు రెగ్యులర్ చేస్తుంది. ఆ సమయంలోనే ఎస్ఆర్ లు ఓపెన్ చేస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ,వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 16వేలకు పైగా ఉద్యోగులను 13 జిల్లాల్లో 15వేల 5 సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించింది. 

నియమించిన వెంటనే తూతూ మంత్రంగా ఒక నెల శిక్షణ ఇచ్చి వారందరినీ విధుల్లోకి తోసేసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో వసతులు లేకపోయినా, పూర్తిపేస్కేలు లేకపోయి వారంతా ఉద్యోగాలు రెండేళ్లు పూర్తిచేసుకోబోతున్నారు. నియామక సమయంలో ప్రకటించిన విధంగా కావాలనుకుంటే ఈ డిపార్ట్ మెంట్ పరీక్ష ఎప్పుడైనా పెట్టడానికి ఆస్కారం వుంటుంది. కానీ రెండేళ్ల పాటు కరోనో సమయంలో కనీసం సెలవులు కూడా రెండవ శనివారం, ఆదివారం  వినియోగించుకోకుండా..సచివాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్లు లేకపోయినా, సొంత కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఉపయోగించి మరీ ప్రభుత్వానికి సేవలందించారు సచివాలయ ఉద్యోగులు. తరువాత ఏడాదిలోనే ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లు ఇచ్చి ఆపై ఇంటర్నెట్ మరో 3నెలలు ఇవ్వకుండానే వీరితో సేవలు చేయించుకుంది ప్రభుత్వం. తామందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చాయనే ఆనందంతో వీరంతా ఎంతో కష్టపడి రాష్ట్రప్రభుత్వాని సేవలు అందిస్తూ ఎంతో పేరుతెచ్చారు. తీరా ఇపుడు రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం పెట్టే పరీక్ష పాసైతే తప్పా సర్వీసులను రెగ్యులర్ చేయమని, పాసయ్యేంత వరకూ ప్రొహిభిషన్ లో ఉంచుతామని ప్రకటించడం నిజంగా తమను ఇబ్బంది పెట్టడమేనని సచివాలయ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అటు ప్రభుత్వం కూడా ఒకేసారి లక్షా 16 వేల మందికి పేస్కేలు అమలు చేయాలంటే ఖజానాపై తీవ్రస్థాయిలో ఆర్ధిక భారం పడుతుందని భావించి రెండేళ్ల కాలంలో ఈ డిపార్ట్ మెంట్ పరీక్షప్రస్తావన తేకుండా.. ఇపుడు తేవడ సమంజసంగా లేదని ప్రభుత్వ ఉద్యోగులు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఈ ప్రత్యేక పరీక్ష విషయం ఉద్యోగాల్లోకి చేరిన వెంటనే ప్రకటిస్తే రెండేళ్లలో ఉద్యోగులంతా ఆ పరీక్ష పాసయ్యేవారని.. అపుడు ప్రభుత్వం అనుకున్నట్టు ఒకేసారి అక్టోబరు 2నాటికి సర్వీసు రెగ్యులర్ చేయడానికి ఉండేదని చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో ఆది నుంచి జరుగుతున్న ప్రచారం తమ సర్వీసులు రెగ్యులర్ అవుతున్న తరుణంలో  ప్రభుత్వం అమలు చేయడం ఏమాత్రం ఆహ్వానించ దగినది కాదని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, అభిమానం రెండూ ఖచ్చితంగా పోతాయని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలోనూ, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసినందుకు ఇదేనా ప్రభుత్వం తమని గుర్తించడమంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ప్రత్యేక డిపార్ట్ మెంట్ పరీక్ష నిబంధనను విరమించుకోవాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు.

 లేదంటే సర్వీసును రెగ్యులర్ చేసి తరువాత ఈ పరీక్షను పెట్టాలని, అపుడు నిబంధనలు విధిస్తే బాగుంటుంది తప్పా.. సర్వీసు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుందని ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లపాటు ప్రత్యేక నోటిఫికేషన్ అని చెప్పడంతో తమ పేస్కోలు కోల్పోయామని, అలాగని సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత తమకు రావాల్సిన రెండేళ్ల పేస్కేల్ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని కూడా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా, ఉద్యోగలకు వ్యతిరేకంగా చేయడం వలన రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల మద్దతు కూడా ఉండే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అందులోనూ గ్రామాల్లోనూ, పట్టణాల్లోనే ఏకకాలంలో కాలంలో వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఇప్పటి వరకూ దేశంలోనే గొప్ప వ్యవస్థగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వానికి భంగపాటు తప్పదని కూడా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. లేదంటే జీతాల భారం తట్టుకోలేక, నిబంధన బూచీ చూపి ఖచ్చితంగా ప్రకటించిన డిపార్ట్ మెంట్ పరీక్ష నిబంధనకే కట్టుబడి అది పాసయ్యే వరకూ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకుండా ఉంటుందా అనేది వేచి చూడాలి..!

Tadepalle

2021-07-26 13:33:29

ఏపీ ఫైబర్ నెట్ సేవలకి ఆపరేటర్ల మోకాలడ్డు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి తక్కువ ధరలకు కేబుల్ టీవీతోపాటు, గ్రామ, వార్డు సచివాలయాలకు నాణ్యమైన వేగంతో కూడిన ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఏపీ ఫైబర్ నెట్ కి రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం అందించే ఏపీఫైబర్ నెట్ కనెక్షన్ లకు బదులు వారి సొంత నెట్వర్క్ కనెక్షన్లు వేసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో 13జిల్లాల్లోని కేబుల్ నెట్ కోసం సుమారు 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఇవే కనెక్షన్లు ద్వారా ఇంటర్నెట్ అందాల్సి వున్నా కేవలం కొన్ని చోట్ల మాత్రమే అందిస్తోంది. మిగిలిన చోట్ల ఉద్యోగులే వారి సొంత ఇంటర్నెట్ ను కూడా సచివాలయ సేవలకు వినియోగించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ వెబ్ సైట్ https://apsfl.in/ లో ప్రకటించినట్టుగా 100, 50, 30ఎంబీపీఎస్ వేగం అయితే ఎక్కడా రావడం లేదు. ఇక ఇళ్లకు వేసే కనెక్షన్లకు తరచుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా సక్రమంగా అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్లు సక్రమంగా వేయకపోవడంతో చాలా గ్రామాలకు నేటికీ స్థంబాలను ఏర్పాటు చేసి హెచ్టీ కేబుల్ వైర్లు రన్ చేసి కనెక్షన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో చెట్లు పడినపుడు, వర్షాలు వచ్చేటపుడు పిడుగులు పడుతున్న సమయంలో వైర్లు దెబ్బతింటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కేబుల్ ఆపరేట్లర్ల మధ్య వున్న గొడవలన్నీ ఏపీఫైబర్ నెట్ మీద చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తోపాటు, ఇప్పటికే ఈ కనెక్షన్లు అందుబాటులో వున్న 5400 గ్రామాల్లో ప్రతీ మూడు రోజులకు ఇబ్బందులు వస్తూనే వున్నాయి. ఇక గ్రామ సచివాలయాల్లో అయితే కనీసం బయో మెట్రిక్ వేయడానికి కూడా నెట్ స్పీడ్ పెరగగక పోవడంతో ఉద్యోగులు వారి మొబైల్ నెట్ ని వినియగించి కార్యాలయ పనులు, బయోమెట్రిక్ అటెండెన్సు వేయాల్సి వస్తుంది.

 గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా కేబుల్ ఆపరేటర్లు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ రావడం లేదని ప్రచారం చేస్తూ కనెక్షన్లు వేయమన్నవారికి కనెక్షన్లు వేయడం లేదు. మరీ బలవంతం పెడితే.. వేసినా చాలా చోట్ల వారే అవాంతరాలు స్రుష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేవలం  9లక్షల 70వేల మందికి మాత్రమే ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు చేరాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా చోట్ల కేబుల్ ఆపరేటర్లు కూడా వారి కేబుల్ సెటప్ బాక్సులతో ఇంటర్నెట్ వ్యాపారం కూడా మొదలుపెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనితో ఏపీఫైబర్ నెట్ ద్వారా ఆన్ లైన్ లో కనెక్షన్ కావాలని  దరఖాస్తు చేసున్న లక్షల మందికి నేటికీ కనెక్షన్లు అందలేదు. దానికి కేబుల్ ఆపరేటర్లు చెప్పే ఒకే ఒక్క కారణం ప్రభుత్వం సెటప్ బాక్సులు సరఫరా చేయడం లేదని. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24వేల కిలోమీటర్ల పరిధిలో కేబుల్ ను నడిపింది ఏఫీఫైబర్ నెట్ సంస్త. ఇంటికి వేసుకునే ప్లాన్ల నుంచి కమర్షియల్ గా వేసుకునే ప్లాన్ల వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో అతి తక్కువ రేట్లకు పథకాలున్నా అవి ప్రజల వద్దకు చేరడంలేదు.

కరోనా సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవడానికి సైతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్లు ఇవ్వలేకపోయారు. చేసేది లేక వేల, లక్షల సంఖ్యలో సాఫ్ట్ ఇంజనీర్లు వర్క్ ఫ్రం హోమ్ పనులకు ప్రైవేటు ఇంటర్నెట్ సంస్థలనే ఆశ్రయించాల్సి వచ్చింది. వాస్తవానికి కరోనా సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అందించి వుంటే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు,  ఇటు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల ద్వారా అందించే ఆన్ లైన్ క్లాసులకు ఎంతో బాగా ఉపయోగపడేది. కానీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు చేయకపోడంతో విద్యార్ధులు ప్రైవేటు నెట్వర్క్ లను ఆశ్రయించాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో అందుతున్న ఏపీ ఫైబర్ నెట్ సేవలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. కావాలనే కేబుల్ ఆపరేటర్లు కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని ఇటు అధికారులు కూడా గుర్తించారు. దీనితో కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని ఒక ఉన్నతాధికారి ఈఎన్ఎస్ చి చెప్పారు. కేవలం గ్రామాల్లోని కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం వలన ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. వాటిని పరిష్కరించడంలో ఆపరేటర్లు చొరవ చేపడం లేదున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు 70శాతం వుంటే కేవలం ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు కేవలం 30శాతం మాత్రమే ఉన్నాయని అధికారిక లెక్కలే తెలియజేయడం విశేషం.

ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ నిరుపేదల ఇంటికి కేబుల్ లైన్ తో కూడిన ఇంటర్నెట్ అందించి ఆన్ లైన్ తరగతులు, ప్రత్యేక డిజిటల్ తరగతుల, మరికొందరికి వర్క్ ఫ్రం హోమ్, గ్రామణీ వ్యాపార సంస్తలకు ఇంటర్నెట్ చేరువ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఏపీ ఫైబర్ నెట్ జంక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే గ్రామం మొత్తం అన్ని కుటుంబాలకు, సంస్థలకు ఏపీఫైబర్ నెట్ ద్వారా కేబుల్ టీవీలతో, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసం సచివాలయాల్లో టెక్నీషియన్లను నియమించాలా... అక్కడి నుంచి మళ్లీ కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక లింక్ ఏర్పాటు చేయాలా అనే కోణంలో ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే కేబుల్ ఆపరేటర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఏపీఫైబర్ నెట్ సేవలు అందని విషయం ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం వీటి నిర్వహణను పంచాయతీలకు అప్పగించి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. గ్రామానికొక టెక్నీషియన్ ను నియమించినా.. లేదంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లనే ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలకు వినియోగించుకోవాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన.. ఎలాగూ పంచాయతీలో ఉండే పారిశుధ్య సిబ్బందిని అత్యవసర సమయంలో ఈ కేబుల్ సేవలకు కూడా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. తద్వారా వేగంతో కూడిన నాణ్యమైన ఇంటర్నెట్ ప్రజలకు అందించడంతోపాటు ఆన్ క్లాసులకు, వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు, గ్రామాల్లోని వ్యాపార సంస్థలకు ఇలా అన్నింటికీ కనెక్షన్లు ఇచ్చి సేవలందించడంతోపాటు, ఆదాయ మార్గాలను పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన. అదే జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేబుల్ వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసేందుకు వేసే ఎత్తులన్నీ చిత్తవడంతోపాటు, ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి..!

Tadepalle

2021-07-26 02:36:50

జీఓ149 అమలు కాకపోతే రూ.కోట్లలో నష్టం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు రెండేళ్లు పూర్తి కావొస్తున్నా  అధికార బదలాయింపులు గ్రేడ్-1,2,3,4 పంచాతీ కార్యదర్శిల నుంచి వేరుచేయలేదు. ఒక్క అధికారం, ఒక్క దస్త్రం కూడా లేకుండా.. కాదు కాదు ఇవ్వకుండా 2'సంవత్సరాలపాటు సచివాలయ కార్యదర్శిలతో ప్రభుత్వం గ్రామాల్లో సేవలు చేయించింది. ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు కమిషనర్ కూడా ఇక్కడే తప్పుచేశారు. ప్రభుత్వమే జారీచేసిన జీఓనెంబరు 149 అమలు చేయకుండా తాత్సారం చేయడం వలన ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ స్థాయిలో రాష్ట్రంలో నష్టం వచ్చిందో.. ఒక్కసారి గ్రామసచివాలయాల సర్వీసు రిక్వెస్టులు ద్వారా వచ్చిన ఆదాయం.. మీ-సేవా కేంద్రాలు పూర్తిచేసిన సర్వీసు రిక్వెస్టులు ద్వారా వచ్చిన ఆదాయం పరిశీలిస్తే ప్రభుత్వానికే కాదు.. ఈ జీఓని అమలు చేయకుండా ఉండిపోయిన అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇందులో మాయలేదూ మంత్రం లేదు. కేవలం రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకపోవడం, జీఓ 149అమలు చేయకపోవడం వలన ఇప్పటి వరకూ వారి చేతుల్లో ఎలాంటి అధికారాలు లేకుండా గ్రామాల్లో చెత్త ఎత్తించడం ఇంటిపన్నులు వసూలు చేయడం, కరోనా వేక్సిన్లు వేయించడం వంటి పనులు చేస్తూ ఉత్తుత్తి కార్యదర్శిలుగా యాక్టింగ్ చేస్తూ వస్తున్నారు.. 

  గ్రామ సచివాలయాల ద్వారా సుమారు 745 సర్వీలు అందుబాటులోకి వచ్చినా వాటి ద్వారా ప్రభుత్వానికి కేవలం వారి చేతుల్లో అధికారాలు లేకనే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఆదాయాన్ని ఆర్జించి పెట్టలేకపోయారు. దీనితో  ప్రభుత్వం కోట్ల రూపాయాల్లో ఆదాయం కోల్పోయింది(ఉదాహరణకు ఒక్కో సచివాలయం నుంచి అన్ని సర్వీసులు, ఇంటిపన్నులు కలుపుకొని ఏవరేజ్ న నెలకు ఒక్కో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి పనిచేసే గ్రామ సచివాలయంలో నెలకు రూ.20వేలు ఆదాయం వస్తుందను కుంటే.. రాష్ట్రవ్యాప్తంగీ 5879 మంది గ్రేడ్-5 కార్యదర్శిలు ఉన్నారు. ఆలెక్కన చూసుకున్నా సుమారుగా రూ.1 కోటి 17లక్షలు ఆదాయం నెలకు కోల్పోయింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వం 745 సర్వీసులను గ్రామసచివాలయాల్లో అందిస్తే.. వాటి ద్వారా ఒక్కోగ గ్రామసచివాలయం నుంచి ఎంతెంత ఆదాయం వస్తుందో అధికారులే లెక్కలు గట్టుకోవాల్సివుంది) అలాగని ప్రస్తుతం అధికారాలు, రికార్డులు, కనీసం సానిటేషన్ సిబ్బందిని కూడా ఇవ్వకుండా వారి దగ్గరే  అన్ని అధికారాలు రికార్డులు ఉంచుకున్న గ్రేడ్-1, 2,3,4 పంచాయతీ కార్యదర్శిలైనా ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చిపెట్టారా అంటే అదీలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సొమ్ము మొత్తం వారి బంధువుల ఖాతాలకు, చేయని పనులకు బిల్లులు పెట్టి  నిధులన్నీ  భారీ స్థాయిలో కొందరు తేడా కార్యదర్శిలు దారి మళ్లించుకున్నారు. అలా చేతివాటం ప్రదర్శించిన జిల్లాల్లో తూర్పోగోదావరి మొదటి స్థానంలో ఉండగా, విశాఖజిల్లా రెండవ స్థానం, పశ్చిమ గోదావరి మూడవ స్థానం, అనంతపురం, కడప, కర్నూలు ఇలా అన్ని జిల్లాల్లోని తేడా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు శక్తి వంచన లేకుండా వారిజేబులు నింపుకోవడానికి శక్తివంచన లేకుండా కష్టపడ్డారు..నేటికీ పడుతూ ప్రభుత్వ ఖజానికి పేద్ద రంధ్రం చేశారు. ఈ విషయంలోనే కొంత మంది సస్పెండ్ లు అయ్యి ఇంటి దగ్గరే కూర్చొని సగం జీతాలు తీసుకుంటూ ఎలాంటి చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోకుండానే దర్జాగా వున్నారు.

 ఇక్కడ మీకు ఒక్క అనుమానం రావాలి.. గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా ఆదాయం రాకపోతే ప్రభుత్వానికి ఏవిధంగా నష్టం వాటిల్లిందీ అని. అక్కడ చిన్న అవకాశాన్నే రాష్ట్రవ్యాప్తంగా మీసే-వ కేంద్రాలు జాక్ పాట్ లా వినియోగించుకున్నాయి.  అదెలాగో చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మండలంలో మీసేవా కేంద్రాలు 2019 నుంచి ఇప్పటి వరకూ ఒక్క రెవిన్యూశాఖలోని 68 రకాల సర్వీసుల నుంచి అత్యధికంగా 60వేలు దరఖాస్తులకు ద్రువీకరణ పత్రాలు అందిస్తే.. అదే మండంలోని 14 గ్రామ పంచాయతీల్లో, 16 గ్రామ సచివాలయాల ద్వారా మొత్తం పరిక్షరించిన రెవిన్యూ శాఖ ద్వారా కేవలం   18వేల సర్వీసు రిక్వెస్టులకు ద్రువకరణలు పూర్తిచేయగలిగారు. అంటే ఒక్క మండలంలోనే మూడింతలకి పైగా ఆదాయం సచివాలయాలున్నా  మీ-సేవా కేంద్రాలు తన్నుకు పోయాయి(ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క మండలాన్నే ఎందుకు ప్రస్తావించామంటే.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఎంత మేరకు ఆదాయం ఇప్పటి వరకూ కోల్పోయిందో తెలిస్తే ఒకేసారి ప్రజులు, ఉద్యోగుల ద్రుష్టిలో ప్రభుత్వం పరువు పోతుందని కేవలం జిల్లాలోని ఒక్క మండాలంలోని లెక్కలు మాత్రమే బయటపెట్టాం.. ప్రభుత్వం అన్ని జిల్లా సమాచారం జిల్లా కలెక్టర్ల ద్వారా తెప్పించుకుంటే తప్పు ఏస్థాయిలో జరిగి..అంతకంటే నష్టం మరింత స్థాయిలో జరిగిందో అర్ధం కావాలని). 

వాస్తవానికి ఆ ఆదాయం మొత్తం గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి రావాలి..ఇక్కడే అన్ని రకాల సేవలు అందిస్తున్న విషయం ప్రజలకు మరింత చేరువ కావాలి. ఇలా ఎందుకు జరగలేదనే విషయం పరిశీలిస్తే.. ఎలాంటి అధికారాలు లేని తాము ఏ మొహం పెట్టుకొని ప్రజలను చైతన్య పరుస్తామని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలంతా  గొల్లుమంటున్నారు. కనీసం కాలువల దగ్గర బ్లీచింగ్ చల్లించాలన్నా.. ఫినాయిల్ వేయాలన్నా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి సాధారణ ప్రజలు మాదిరిగా చేతులు కట్టుకొని అడుక్కోవాల్సి వస్తుందని.. అది తాము వెళ్లిన సమయానికి అక్కడ కార్యదర్శి వుంటే(ఉద్యోగం ఇక్కడైనా డెప్యుటేషన్లు, ఇన్చార్జిల బాధ్యతలు వీరికే అప్పగించడంతో ఏ ఒక్క పంచాయతీలోనూ వీరు సక్రమంగా సమాయానికి దొరకడం లేదు). ఒక్క మండలంలోనే సచివాలయాలకు రావాల్సిన సర్వీసు రిక్వెస్టులు మీసేవాలు తన్నుకుపోతుంటే..జిల్లా వ్యాప్తంగా ఎన్ని లక్షల సర్వీసులు తన్నుకుపోయారో.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల సర్వీసులు తన్నుకుపోయారో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులే చెప్పాల్సి వుంటుంది. అదీ కేవలం రెవిన్యూ ద్వారా వచ్చే సర్వీసులే.. మరి ఇతర శాఖల సర్వీసులు ఇక్కడ లెక్కల్లోకి రాలేదు. అదంతా నాణానికి ఒకవైపే. 

ఇపుడు నాణానికి రెండో వైపు చూద్దాం.. అధికారాలన్నీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల దగ్గరే వుంచేసిన రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు వారికే మేజర్ పంచాయతీల్లో ఖాళీ అయిన స్థానాలను ఇన్చార్జి బాధ్యతలు చేయాలంటూ వారికే డిప్యుటేషన్లు కూడా పనిగట్టుకొని వేస్తున్నారు. రెగ్యులర్ పంచాయతీల్లోనే పనిచేయకుండా ఆదాయం కోల్పోయేలా చేసిన వీరికే ప్రభుత్వం అదనపు పనులు అప్పగించి ఇన్చార్జి పంచాయతీల్లో కూడా ఆదాయారం రాకుండా చేయడంలో అధికారులే ముఖ్యంగా కనపిస్తున్నారు. ఇన్చార్జి బాధ్యతలపై గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు పంచాయతీల్లో ఇన్చార్జిల పేరుతో తిరుగుతుంటే గ్రామాల్లో వసూలు కావాల్సిన పన్నలున్నీ భారీగా పేరుకు పోతున్నాయి. గ్రేడ్-5 కార్యదర్శిలుగా వున్నవారు అధికారాలు లేకపోయినప్పటికీ వారి పరిధిలో వారు కాస్తో కూస్తో వసూలు చేస్తున్నా.. ఆ సేవ మొత్తం అధికారాలు, రికార్డులు వారి వద్దే ఉంచుకొని, పన్నులన్నీ కట్టించుకుని కాగితాలపై లెక్కలు చూపిస్తూ గ్రేడ్-5 కార్యదర్శిలు చేసిన పనంతా తామే చేసినట్టుగా అధికారుల ముందు తెగ కష్టపడిపోయినట్టు చూపిస్తున్నారు వీరంతా. దీంతో విషయాన్ని పసిగట్టిన చాలా మంది సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు అధికారం లేకుండా ప్రజల వద్దకి వెళ్లినా.. రికార్డులు లేకుండా ఇంటి పన్నుల వసూలుకి వెళ్లినా జనం కూడా వీరిపై తిరగబడటంతో వీరు సచివాలయాల్లో పారిశుధ్యం, ఇతర సేవలను మాత్రమే చూసుకుంటూ కాలం గడిపేస్తూ వస్తున్నారు. 

వారికి అధికారాలు లేవని.. అక్కడ సర్వీసు రిక్వెస్టులు పెడితే పనులు జరవగవని తెలుసున్న ప్రజలు కూడా తమ అత్యవసర  పనులన్నీ చేయించుకోవడానికి మీ-సేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఇక ఆఖరిగా ప్రభుత్వం ఇపుడు ఇంటిపన్నులు సవరణ చేసి కొత్త పన్నులు వేస్తున్న తరుణంలో కూడా గ్రేడ్-5 కార్యదర్శిలకు రికార్డులు ఇవ్వకుండా పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిల దగ్గరే రికార్డులన్నీ ఉంచుకున్నారు. దీనితో కొత్తగా వేయాల్సిన పన్నులు కూడా పడకేశాయి. ఇదే పరిస్థికి కొనసాగితే గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం వున్న 745 సర్వీసుల కంటే అధికంగా సేవలు పెట్టినా ప్రజల వద్దకు అవి చేరే పరిస్థితి కనిపించడం లేదు. పాత బకాయిలు వసూలయ్యే అవకాశం అంతకంటే లేదు.. అలాగని గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకపోతే  మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాలను కట్టి అక్కడ సిబ్బందిని ఉంచినా కరెంటు, ఇంటర్నెట్ బిల్లు, కార్యాలయ మెయింటినెన్సు బిల్లులు ప్రభుత్వానికి భారం తప్పా మరొక ఆదాయ వనరు అస్సలు కనిపించలేదు. అయితే ఈ విషయం మొత్తం పంచాయతీరాజ్ అధికారులకు తెలిసినా ఏమీ పట్టనట్టు వ్యవరిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా కొత్త సచివాలయ భవనాలు ప్రారంభం అయ్యాయి. అదే రాష్ట్రవ్యాప్తంగా కొత్త సచివాలయ భవనాలు ప్రారంభం అయితే ప్రభుత్వానికి ఆర్దిక భారం మరింతగా పెరిగిపోతుంది.  అపుడు ప్రభుత్వం సచివాలయాల వారీగా రికార్డులు, అధికారాలు, ఆదాయ వ్యవయాల పెత్తనాలు గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓ నెంబరు 149 ద్వారా బదలాయించకపోతే రాష్ట్రప్రభుత్వం భారీ మొత్తంలో ఆదాయం కోల్పోవలసి వస్తుంది. అంతేకాదు సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలకు కూర్చోబెట్టి మాత్రమే జీతాలు ఇచ్చే పరిస్థితే కనిపిస్తుంది.

 మరోవైపు తమకు అధికారాలు ఇవ్వనంత సేపు తాము ఎలా ప్రజలకుసేవలు చేస్తామని సచివాలయ నూతన కార్యదర్శిలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ శాఖలోని అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తూ.. ప్రభుత్వానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.esnlive.net ద్వారా కధనాలు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతిల్లోనే ఉంచేసిన అధికారాలు జీఓనెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు బదలాయించకపోవడం వలన వచ్చే వచ్చిన ఆర్దిక నష్టాలను రాష్ట్రవ్యాప్తంగా ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి మరీ తెలియజేస్తున్నారు చాలా మంది అధికారులు.  రాబోయే నష్టాలను వివరిస్తే..రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు ఏ స్థాయిలో ఆదాయాన్ని తన్నుకుపోతున్నాయో.. గ్రామ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటికి ఆదాయం ఎందుకు రావడం లేదో అనే విషయంపై పరిశోధనాత్మక వార్తలు అందిస్తే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులు ఆలోచించే అవకాశం వుంటుందనే విషయాన్ని వాస్తవ కధనాల రూపంతో వెలుగుతోకి తీసుకు వస్తుంది ఈఎన్ఎస్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జీఓనెంబరు 149ని అమలు చేస్తూ గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు బదలాయించకపోతే వారు ఉత్సవ విగ్రహాల్లానే మిగిలిపోయి.. సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందించే 745 సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

 పైగా ఇప్పటికే మండల స్థాయి నుంచి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వరకూ వినపతి పత్రాలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో తమకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా ఉండిపోవాలని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామ సచివాలయాలకు వివిధ సర్వీసుల ద్వారా రావాల్సిన ఆదాయం కోల్పోగా.. గ్రామ పంచాయతీ పరిధిలో సవరించిన ఇంటి పన్నులు వేయడంలోనూ.. వాటి ద్వారా ఆదాయం సమకూర్చడంలోనూ గ్రేడ్-5 కార్యదర్శిల నుంచి ప్రభుత్వానికి సహకారం కనిపించే అవకాశం దరిదాపుల్లో లేదు. చూడాలి పంచాయతీరాజ్ శాఖ పంతానికి పోయి ఎప్పటికీ జీఓనెంబరు 149 అమలు చేయకుండా.. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికార బదలాయింపులు చేయకపోతే..ఇప్పటికే కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని మరీ సచివాలయాలకు రావాల్సిన ఆదాయం మొత్తం కొట్టేస్తున్న మీ-సేవ ఆదాయాలను ప్రభుత్వం తహశీల్దార్ల డాష్ బోర్డులపై చూసుకోవడం తప్పా మరేమీ చేయలేని పరిస్థితులు మాత్రమే మిగులుతాయి. మరోవైపు ఉన్న పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శి స్థానం సరిపోదన్నట్టు వున్నవారికే నాలుగైదు పంచాయతీలు కట్టబెట్టడం ద్వారా గ్రామస్థాయిలో రావాల్సిన ఆదాయం మరెంత బకాయిలుగా పేరుకుపోతుందో అధికారులు గమనించాల్సి వుంది. ఏది ఏమైనా ఒక్క జీఓ అమలు చేయడం వలన ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, గ్రామ సచివాలయాలు పెట్టిన లక్ష్యం నెరవేరుతుందని తెలిసినా దానిని అమలు చేయని ఏపీ ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలను ఏమనుకోవాలో అర్ధం కావడం లేదని సచివాలయ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు..!

Tadepalle

2021-07-25 03:21:09

సచివాలయ ఉద్యోగుల రెగ్యులర్ లో మెలిక..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణలో నైపుణ్య పరీక్షలతో పాటు, క్రెడిట్ బేస్ అసెస్ మెంటు పరీక్షలను మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వం మెలికపెట్టినట్టుగా  కనిపిస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 5 సచివాలయాల్లో సుమారు లక్షా 18వేల మంది ఉద్యోగులకు అక్టోబరు 2. 2021నాటికి సర్వీసులు రెగ్యులర్ కావాల్సి వుంది. అయితే గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసైన వారి జాబితాలనే  తొలుత జిల్లాల వారీగా జాబితాలు సేకరిస్తోంది. ఇంకా చాలా మంది ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాల్సి వుంది.. మరికొందరు రాసి తప్పిన వారున్నారు. మరోవైపు మరికొంత మంది మహిళా పోలీసులకు సైతం కరోనా నేపథ్యంలో శాఖపరమైన శిక్షణ కూడా పూర్తి కాలేదు. చాలా మందికి శిక్షణలో పెట్టే పరీక్షలు పూర్తి కాలేదు దీనితో వారికి హుటాహుటీన 15 రోజుల పాటు ఆన్ లైన్ శిక్షణతోపాటు మండల కేంద్రాల్లోని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో క్షేత్ర స్థాయి శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తరువాత వీరితో పాటు మిగిలిన శాఖల ఉద్యోగులకు సెప్టెంబరు నెల 17లోపు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే  2019 అక్టోబరు నుంచి 2020 జనవరి వరకూ విడదల వారీగా సచివాలయ విధుల్లోకి చేరిన వారిని దఫ దఫాలుగా రెండేళ్ల ప్రొబిషన్ కాలాన్ని లెక్కగట్టి వారి సర్వీసులు రెగ్యులర్ చేయాల్సి వుంది. కాగా ఇపుడు వీరి ఉద్యోగాలు రెగ్యులర్ పై ప్రభుత్వం నుంచి సరైన క్లారిటీ రాలేదు. దీనితో ఇటీవలే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్రనాయకులు సీఎంను కలిసి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కూడా వినతి పత్రం అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు పంచాయతీ సర్పంచ్ లు, కార్యదర్శిల అధికారాలు వీఆర్వోలకు బదలాయిస్తు ప్రభుత్వం జారీచేసిన జీఓనెంబరు 2 ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో వుంది. దానికి నాలుగు వారాల్లో గడువు వుంది. మరోవైపు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారి జాబితాను జిల్లాల వారీగా సిద్దం చేస్తున్న తరుణంలో డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసైన వారంతా తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయనే ధీమాతో ఉండగా.. అవి రాయని వారికి భయం పట్టుకుంది. అందులోనూ సచివాలయ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారీగా ఆర్ధిక భారం పడుతంది. ఉన్న నిధులన్నీ సంక్షేమ పథకాలకే ప్రభుత్వం వెచ్చిస్తుండటం, రెండు దఫాలు కరోనాకి ప్రభుత్వం అత్యధిక మొత్తంలో నిధులు ఖర్చుచేయడంతో ఇపుడు గ్రామ, వార్డుసచివాలయ ఉద్యోగులకు తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయా లేదా అనే భయం వెంటాడుతోంది. ఇదే సమయంలో జీఓనెంబరు 2 అంశం హైకోర్టులో వాదనలు జరిగినపుడు రాష్ట్రంలో పంచాయతీలు ఉండగా ఎందుకు దానికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారనే మాటను వాడింది హైకోర్టు బెంచ్.. ఆపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం, ఇటు కార్యదర్శిలు, వీఆర్వోల ఉద్యోగ సంఘాల మధ్య అధికారానికి(డిడిఓ) సంబంధించిన వాదలను అధికమవడంతో ఆ ప్రభావం సచివాలయ ఉద్యోగులపై పడుతందనే భయంకూడా వీరిని వెంటాడుతోంది. అన్నింటి కంటే ముఖ్యంగా కరోనా నేపథ్యంలో మరో ఏడాది సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ అంశాన్ని పొడిగిస్తారనే ప్రచారం కూడా అధికంగా ప్రాచుర్యంలోకి రావంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో ఇదే అంశానికి సంబంధించి నిత్యం భారీ స్థాయిలో చర్చలు కూడా నడుస్తున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి మాత్రం ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ విషయమై సానుకూలంగానే పవనాలు వీస్తుండటం కాస్త వీరికి ఊరట నిస్తున్నా.. లోలోన ఆందోళన మాత్రం వీరిని వీడటం లేదు. ఓపక్క ప్రభుత్వంలోని రాష్ట్ర అధికారులు ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసైతే వారంతా పదోన్నతి( ప్రమోషన్) జాబితాలో రోస్టర్ విధానంలో ముందుంటారని చెబుతున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం 2015 పీఆర్సీ పేస్కేలుకి లోబడి వారికి నియామకాలు చేపట్టింది. అటు ప్రభుత్వ పరంగా చూసుకున్నా.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వీరికి కూడా పీఆర్సీ అమలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. అక్టోబరు 2 నాటికి ప్రభుత్వం అధికారంలో వచ్చి రమారమీ రెండున్నరేళ్లు గడుస్తుంది. అప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకిచ్చిన పీఆర్సీ, 8 డిఏల బాకాయిల చెల్లింపు అమలు చేయాలి. ఇవన్నీ ప్రభుత్వం ముందు వున్న భారీ నగదు పథకాలు..వాటిని అమలుచేస్తూ... సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేస్తే ఆ భారం రెండింతలు అవుతుంది. దీనితో ఉద్యోగుల సర్వీసు విషయంలో బయో మెట్రిక్, శాఖ పరమైన శిక్షణ, ఉద్యోగుల చేతివాటం, వివిధ కేసులు, కోరానా విపత్తు భారం అన్ని అంశాలను ఏకం చేసి ఏదైనా మెలిక పెట్టి మరో ఏడాది కాలయాపన చేస్తుందానే అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా అక్టోబరు  నెల నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ నాలుగు విడతలుగా సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది.. చూడాలి ప్రభుత్వం ఏదైనా మెలిక పెడుతోందో..ఉన్న మెలికలుల తీసేస్తుందో.. సర్వీసు కాలాన్ని పొడిగిస్తుందో.. డిపార్ట్ మెంటల్ టెస్టులను, వాటితోపాటు క్రెడిట్ బేస్ అసెస్ మెంట్ పరీక్షలను అడ్డుపెడుతుందో.. పీఆర్సీని బూచిగా చూపిస్తుందో.. కోర్టు కేసులను ఉద్యోగుల ముందుంచుతుందో..ఆర్ధిక భారాన్ని నెపంగా తెరమీదికి తెస్తుందో.. అవన్నీ కాదని ఇచ్చిన మాటకి కట్టుబడి 2022 జనవరి నాటికి సచివాలయ ఉద్యోగులందరి సర్వీసులను రెగ్యులర్ చేస్తుందో..తేలాల్సి వుంది..!

Tadepalle

2021-07-24 02:26:20

సచివాలయ ఉద్యోగలకి అదనపు పనిభారం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలు భర్తీ చేయక పోవడం వలన సచివాలయ సిబ్బంది అదనపు పని భారం మోయాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మేజర్ పంచాయతీల్లో ఒకే చోట రెండు నుంచి మూడు సచివాల యాలు ఏర్పడటం, సుమారు 13వేలకు పైగా ఖాళీలు మిగిలిపోవడం, గ్రేడ్1 కార్యదర్శిలు సీనియారిటీ పేరుతో పక్కకు జరిగిపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పనిభారం మొత్తం పడుతోంది. అలాగనీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానీ, కమిషనర్ గానీ జీఓనెంబరు 149 ని అమలు చేయకపోవడంతో అధికార వికేంద్రీకరణ సైతం జరగలేదు. సచివాలయ పరిధిలోని రికార్డులు, ముఖ్య విధులు, అధికార లావాదేవీలన్నీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉంచుకొని, కొత్తగా చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలతోనే పనంతా చేయిస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సచివాలయా వారీగా పరిధిని విడదీయని అధికారులు, తమతోనే అదనపు పనిచేయించే గ్రేడ్ 1, 2 కార్యదర్శిల ఉత్తుత్తి, విధులు, అనధికార ఇన్చార్జి ఉద్యోగాలు, డిప్యుటేషన్లను కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని సచివాలయాల్లో  పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, వెటర్నరీ అసిస్టెంట్, సెరీకల్చర్ అసిస్టెంట్, తదితర పోస్టులన్నీ కలిపి సుమారు 13వేలకు పైగానే ఖాళీలు ఉండిపోయాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో వాస్తవానికి ఈ ఉద్యోగాలను తొలుత భర్తీచేయాల్సి వుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 5 సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తే ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిలోనే సేవలు అందుతాయి. అలాకాకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలలను మాత్రమే చూపడం విచిత్రంగా వుందంటున్నా సచివాలయ ఉద్యోగులు. అత్యవసర ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన భర్తీచేస్తాయి. అదేంటో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో పూర్తిస్థాయిలో ఉద్యోగులను భర్తీచేయకుండా వదిలేసింది. పైగా ప్రొభిషన్ పేరుతో తమతోనే పనులు అధికారం ఇవ్వకుండా పనులు చేయిస్తూ.. యాక్టింగ్ పనులు చేసే గ్రేడ్-1 కార్యదర్శిల వైపు ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యస్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో జీతం ప్రొభిషనరీ సమయంలో కేవలం రూ.15వేలు మాత్రమే ఇవ్వడంతో ఎటూ చాలని వారు చాలా మంది ఈ ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. మరికొన్ని ఉద్యోగాలు అర్హత సాధించిన వారు లేక వదిలేస్తే..వెటర్నరీ, సెరీకల్చర్, ఫిషరీష్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శి ఇలా చాలా రకాల ఉద్యోగాలు భర్తీకాకుండా ఉండిపోయాయి. దీనితో మూడు సచివాలయాలు ఉన్నచోట ఖాళీగా వున్న పోస్టుల్లో ఆయా శాఖ సచివాలయ ఉద్యోగులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఉద్యోగులపై పనిభారం అధికంగా పడుతుంది. అధికారాలు తమకు తేకపోయినా సిబ్బందితో దగ్గరుండి అదనపు విధులు తామే చేయించాల్సి వస్తుందని చెబుతున్నారు గ్రేడ్5  పంచాయతీ కార్యదర్శిలు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వ శాఖల వారీగా వారి విధులకు సంబంధించిన డ్యూటీ చార్టులను కూడా ప్రత్యేక జీఓల రూపంలో విడుదల చేస్తుంది. ఈ క్రమంలో అదనంగా ఖాళీగా వున్న ఉద్యోగాల్లో అదనపు విధులు నిర్వహిస్తున్నవారిపై పనిభారం పడుతోందని, అయినప్పటికీ కష్టపడి పనిచేస్తున్నా ప్రభుత్వ పరంగా తమకు రావాల్సిన అధికార బదలాయింపుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు కనీసం ద్రుష్టి సారించడం లేదనే విమర్శలు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. అంతేకాకుండా వీరు ఉద్యోగస్థానంతో పాటు అధికారులు డిప్యుటేషన్, ఇన్చార్జి ఉద్యోగానికి సంబంధించిన వర్క్ టార్గెట్లపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారట.. అటు అధికారుల ఆదేశాలు పాటిస్తూ విధినిర్వహణలో అదనపు విధులు ఖచ్చితంగా నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు సచివాలయ ఉద్యోగులు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఇన్చార్జి, లేదా డిప్యుటేషన్ విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం అదనపు జీతం మంజూరు చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు ప్రొభేషన్ లోనే ఉన్నారు. వారికి వచ్చే ఆ రూ.15వేలు జీతంతోనే వారికి కేటాయించిన ఇన్చార్జి పోస్టుల బాధ్యతలు, రికార్డులు, ట్రాన్స్ పోర్టు ఇలా అన్నిరకాల ఆర్ధిక భారాలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా అదనపు విధులు చేద్దామన్నా చేతిలో కనీసం అధికారాలు పెట్టకుండా... తమ పరిధి తమకు అప్పగించకుండా.. అన్ని అధికారాలు.. రికార్డులు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే వుంచి వారి పనులు కూడా తమతోనే చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రెండవ శనివారం, ఆదివారాల్లో కనీసం సెలువులు వినియోగించుకోవడానికి వీలులేకుండా ఆరోజుల్లోనే కోవిడ్ వేక్సినేషన్ కు సైతం సచివాలయ ఉద్యోగులనే వినియోగించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులంతా. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ లో అయినా గ్రామ, వార్డు సచివాలయ మిగులు ఉద్యోగాలు భర్తీచేస్తే తమకు అదనపు పనిభారం తగ్గుతుందని ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ విచిత్రంగా సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలు కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేయడంతో ఇన్చార్జి బాధ్యతలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాల్లో డిప్యుటేషన్లు, ఇన్చార్జి బాధ్యతలు ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులకు తొలగించాలని ఆదేశాలు జారీచేసినా..మండల, వార్డు స్థాయిల్లో మాత్రం సచివాలయ ఉద్యోగులతోనే జిల్లా అధికారులు వారితో అదనపు పనులు చేయిస్తున్నారని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అదనపువిధులు, డిప్యుటేషన్లు, ఇన్చార్జిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సి వుంది..!

Tadepalli

2021-07-23 02:22:47

ఆంధ్రాలో అంతర్జాతీయ పర్యాటకం..

దేశీయ పర్యాటకులనే కాకుండా ఇతర దేశాల పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పర్యాటకం, సాంస్కృతికం, యువజన, క్రీడా శాఖలకు చెందిన ఉన్నాతాధికారులతో సచివాలయంలోని తన చాంబరులో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాలు, అటవీ ప్రాంతాలను కలుపుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు సర్క్యూట్ లుగా (రాయలసీమ, విజయవాడ, గోదావరీ, ఉత్తరాంధ్ర) పర్యాటక ప్యాకేజిలు పెట్టాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమలో తలకోన, హార్సీ హిల్స్, తిరుపతి.. కృష్ణా,గుంటూరు పరిధిలో  భవానీ ఐలెండ్, దుర్గమ్మ దేవాలయం, బౌద్దరామాలు, గోదావరి పరిధిలో అన్నవరం, పాపికొండలు, దిండి ప్రాంతంలో బోటింగ్, ఉత్తరాంధ్రలో పాడేరు, అరుకు, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం ప్రాంతాలను పర్యాటక సర్క్యూట్ పరిధిలో అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. విశాఖలో బీచ్ ల నిర్మాణం, కృష్ణా గోదావరి నదీ పర్యాటకాన్ని స్థానిక అంశాల ఆధారంగా పర్యాటకలకు ప్యాకేజీలను అందిస్తామన్నారు. విశాఖ ప్రాంతంలోని ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతాన్ని పర్యాటకాన్ని.. అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ప్రభుత్వం పర్యాటక శాఖకు స్థలం కేటాయించిందని మంత్రి తెలిపారు. 

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహకాలు అందించేందుకు 4 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో  రాష్ట్రంలో పదిహేను ప్రాంతాల్లో క్రీడా కేంద్రాలను అభివృద్ది చేసేందుకు.. ఖేల్ ఇండియా పథకం క్రింద  విశాఖపట్నం, కడప, తూర్పు గోదావరి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిస్తున్నామన్నారు. ఈ ఏడాది వై.ఎస్.ఆర్. క్రీడా పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కేటాయించామన్నారు. స్పోర్ట్సు కోటా క్రింద జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలను పరిశీలించి స్పోర్ట్సు కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. థర్డు వేవ్ లేకపోతే.. కోవిడ్  జాగ్రత్తలతో గతంలో మాదిరిగానే టూరిజం ఫెస్టివల్స్, ఆగస్టు నుంచి ప్రతి నెలా కనీసం రెండు యువజన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్, ఏపీ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఈడీ మాల్ రెడ్డి.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

Tadepalle

2021-07-20 17:17:42