1 ENS Live Breaking News

సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై ఆర్టీఐ

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న సుమారు 1.30లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై సమాచారహక్కు చట్టం దాఖలైంది. సచివాలయశాఖలోని సుమారు 19శాఖల సిబ్బంది నియామకాలు, డ్యూటీ చార్ట్, సర్వీస్ రూల్స్, పీఆర్సీఅమలు, సర్వీస్ రెగ్యులర్ చేసిన సమయంలో రెండు ఇంక్రిమెంట్లు కలపకపోవడం, కోల్పోయిన డిఏలు, పేస్కేలు, డ్యూటీచార్ట్, ప్రమోషన్ ఛానల్ తదితర అంశాలపై 20 అంశాలతో కూడిన దరఖాస్తు దాఖలైంది. సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లకు చేయాల్సిన ప్రొబేషన్ డిక్లరేషన్ తొమ్మిది నెలలు ఆలస్యంగా చేశారు. అదే సమయంలో పీర్సీ అమలు చేస్తున్నారని చెప్పి వీరికి పేస్కేలు పెంచారు తప్పితే అరియర్స్ జమచేయలేదు. ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం ఏం చేస్తుంది, వీరికి జరిగిన అన్యాయంపై ఏ విధమైన సమాధానం ఇస్తుందనే సమాచారం తెలుసుకునేందుకు దాఖలైంది. అయతే ప్రభుత్వం  సమాచారం ఏవిధంగా ఇస్తుందనేది వేచి చూడాలి.

Tadepalli

2023-08-24 03:03:55

పక్కాగా హైకోర్టు ధిక్కారం.. డిజిపి ఆదేశాలు బుట్టదాఖలు..!

ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ హైకోర్టుకి డిజిపి కార్యాలయం నుంచి ఏజి ద్వారా సమర్పించిన అఫడవిట్ అంతా వట్టిదేనని..ఈ విషయంలో డిజిపి ఉత్తర్వులు కూడా ఎక్కడా అమలు చేయమని ఉమ్మడి విశాఖజిల్లా పోలీసులు, విభజన అనకపల్లి జిల్లా పోలీసులు ఆధారాలతో సహా రుజువుచేసి చూపించారు. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడంపై హైకోర్టులో కేసు దాఖలైంది. దానికి స్పందించిన రాష్ట్రప్రభుత్వంలోని పోలీసుశాఖ..వారిని పోలీసు సిబ్బందిగా పరిగణించమని, పోలీస్ స్టేషన్ విధులు, బందో బస్తు విధులు అప్పగించమని హైకోర్టుకి ప్రత్యేక అఫడవిడ్ దాఖలు చేసింది. అయితే దాఖలు చేసిన నెలరోజులు గడవక ముందే ఉమ్మడి విశాఖజిల్లా పోలీసులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా పరిధిలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ లోనూ, అనకాపల్లి జిల్లా పరిధిలోని అరట్లకోట గ్రామంలోని జాతరలో బందోబస్తు డ్యూటీలు మహిళా పోలీసులకు వేశారు.  రెండు రోజుల వ్యవధిలో పోలీసులు దిక్కరించిన హైకోర్టు ఆఫడవిట్ నిబంధనను ఉల్లంఘించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిజిపీ లేదూ..హైకోర్టికి సమర్పించిన అఫడిట్ భయం అసలే లేదు..అలాంటివేమీ ఏపీ పోలీస్ అందునా ఉమ్మడి విశాఖజిల్లా, విభజన విశాఖ జిల్లా పోలీసులకు అసలే పట్టవని..మళ్లీ అదే పోలీసు స్టేషన్ల విధులు, బందో బస్తు విధులు మహిళా పోలీసులకు అప్పగిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 ఇపుడు ఇవే ఆధారాలు హైకోర్టుకి ఏపీపోలీసుశాఖ దిక్కరించిన ఆధారాలుగా కూడా మరనున్నాయి. పోలీసుశాఖలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ, డిజిపి ఉత్తర్వులు ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయనే అంశానికి క్రింది స్థాయి పోలీసులు ఇస్తున్న గౌరవం ఏంటో కూడా పక్కాగా రుజువైంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీసుశాఖ విధులు అప్పగించకూడదని, 26 జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ చేసిన ఆదేశాలు విశాఖ, అనకాపల్లి జిల్లాలో పక్కాగా బుట్టదాఖలు అయ్యాయి. ఇంకా కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుశాఖలోని స్టేషన్లలోని అధికారులు సచివాలయ మహిళా పోలీసులకు పోలీసు బందోబస్తు, స్టేషన్ డ్యూటీలు డిజిపి ఆదేశాలు ఉల్లంఘించి మరీ వేయడాన్ని బట్టి మహిళాపోలీసు విభాగంలో కోర్టుకేసులకు సిబ్బందే ఉప్పందించి, కేసులు వేయించారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏపీ పోలీస్ బాస్ ఆదేశాలను క్రిందిస్థాయి పోలీసులు ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో..కోర్టు కేసులు ఉండగా కోర్టు దిక్కారానికి ఏ విధంగా పాల్పడుతున్నారో రెండురోజులు పాటు మహిళా పోలీసులకు అదనంగా వేసిన విధులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.  ఇప్పటికే పోలీసుశాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా పోలీసులను పోలీసు విధులకు పక్కనపెట్టడంతో ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ఇబ్బందులను ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. విషయం చక్కబడుతుందని ఆశపడుతున్న వేళ పోలీసులు కోర్టు దిక్కారానికి పాల్పడటం కూడా చర్చనీయాంశం అవుతున్నది. చూడాలి ఈ విషయంలోడిజిపి కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందనేది.

Tadepalli

2023-08-22 17:01:58

గ్రామ, వార్డు సచివాలయశాఖలో మరణ మృదంగం..!

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులు ఉసురు అర్ధాంతరంగానే ముగిసి పోతున్నది. ఒకటి కాదు 2కాదు ఏకంగా 125 మంది ఉద్యోగులు ఒక్క విద్యుత్ విభాగం విధినిర్వహణలో మృత్యువాత పడటంతోపాటు,  మరో 250 మంది శాస్వతంగా అంగవైక ల్యాని కి గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరిగినా సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి ప్రాణ భద్రత లేకుండా పో తుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాల్లో ఒక్క ఎనర్జీ అసిస్టెంట్ కి నేటి వరకూ సేఫ్టీ పరికరాలుగానీ, పనిముట్లు గానీ ప్రభుత్వం పంపిణీ చేయలే దు. పైగా తమ పరిధిలోకి రాని 11కెవి, 33కెవి విద్యుత్ ఫోల్స్ పై పనులు చేయిస్తున్నారని వాపోతున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహా రం ఇవ్వకపోగా కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలివ్వకపోవడం విశేషం..! 

Amaravathi

2023-08-21 15:14:58

9శాతం ఫిట్ మెంట్ కి ఓకే..విద్యుత్ సమ్మె లేదు..

విద్యుత్ ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పీఆర్సీపై ఉభయుల మధ్య అంగీకారం కుదిరింది. విద్యుత్ జేఏసీ 15 శాతం ఫిట్మెంట్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం 9శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా అంగీకరించింది. ఈ ఒప్పందంపై యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు సబకమిటీ ఆమోదం తెలిపినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. ఆఖరు నిమిషంలో బంద్ లేదనే విషయం ఉపసమనం కలిగించింది.

Vijayawada

2023-08-09 16:00:27

మెగాస్టార్ ఆరోజు ప్రభుత్వానికి వ్యతిరేంగా గళమెత్తారు

మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల దినోత్సవ వేడుకలలో చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్థించారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ, చిరంజీవి చెప్పినట్లు సినీ పరిశ్రమ నిజంగా పిచ్చుకే కానీ.. చిరు మాత్రం కాదన్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కేంద్రమంత్రిగా పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. దీనితో రాజకీయంగా వేడి రాజుకుంది. కేంద్ర మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అంత ఆషామాషీ విషయం కాదు.. అలాంటి  చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందనే విషయం చాలా మంది తెలుసుకోవాలన్నారు. చిరులాంటి వ్యక్తి ప్రత్యేక హోదాపై పోరాడమని మంత్రులకు సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదని లేదన్న ఉండవల్లి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు..

ఆంధ్ర కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని.. అది సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హాయంలో కంటే వైఎస్సార్సీపీ హాయంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పత్రికను, ఛానల్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు అక్రమాలు, అవకతవకాలు పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు కళాంజలి కళకృతులు అని కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై కేసు పెట్టారన్నారు. ఈ కేసులో రామోజీరావుపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారని చెప్పారు. డబ్బున్న వారికే కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టి మార్గదర్శిపై పోరాటం చేస్తున్నానన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారిన ఈ ప్రాజెక్టు పూర్తి కాదని రుజువైందని అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ కాకుండా వేరే ప్రభుత్వం రావాలని బాంబు పేల్చారు.

Rajamahendravaram

2023-08-09 11:04:34

ఏపీలో రేపటి నుంచి విద్యుత్ కార్మికుల సమ్మె..

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు, ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు. కాగా ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌదా వద్ద 2000 మంది పోలీస్ బలగాలతో భారీ బద్రత ఏర్పాట్లు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడ నందు 144 సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై గుర్రుగా వున్న కార్మిక సంఘాలు కూడా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. కాగా ఉద్యోగుల సమ్మె ముందుగానే ఊహించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున వలనే తాము సమ్మె చేస్తున్నట్టు కార్మికులు ప్రకటించారు.

Vijayawada

2023-08-08 16:04:12

అన్నవరంలో అడ్డదారి వసతి వ్యాపారానికి చెక్

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో అడ్డదారిలో వసతి గదులు వ్యాపారం చేసే అక్రమార్కులకు చెక్ పెట్టడానికి ఈఓ చంద్రశేఖర ఆజాద్ వినూత్న చర్యలు మొదలు పెట్టారు. ఒక భక్తుడు ఒకసారి తన ఆధార్ నెంబరుతో వసతి గది తీసుకుంటే మళ్లీ 90రోజుల వరకూ గది తీసుకునే అవకాశం ఉండదు. గదులు తీసుకున్నప్పుడు, ఖాళీ చేసినపుడు బయో మెట్రిక్ ద్వారా వేలిముద్రలు తీసుకుంటారు. తద్వారా అడ్డదారిలో ముందుగానే గదులు బుక్ చేసే విధానానికి ఈఓ చెక్ పెట్టారు. ఒక కుటుంబం ఆ 90రోజుల్లో మధ్యల్లో స్వామివారిని దర్శించడానికి వచ్చిన సమయంలో ఇతర సభ్యుల ఆధార్ తో గదులు బుక్ చేసుకోవాల్సి వుంటుంది. మరోపక్క అన్నవరం దేవస్థానంలో మొత్తం గదులు, కళ్యాణ మండపాలు, ఇలా ఎంత మేరకు వసతి ఉన్నదో తెలిపే బోర్డులను సిఆర్ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయడం విశేషం.

Annavaram

2023-08-07 06:01:00

ఆఫీసర్ అనుకొని ఇంటర్వ్యూకి వెళితే ఆఫీసర్ గానే తిరిగొస్తారు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే ఎపిపిఎస్సీ గ్రూప్-1 ఇంటర్వ్యూలకి క్వాలిఫై అయిన అభ్యర్ధులందరూ మీరే ఒక ఆఫీసర్ లా ఫీల్ అవ్వండి.. అదే మనోధై ర్యంతో వెళ్లి.. ఉత్సాహంగా ఇంటర్వ్యూని ఫేస్ చేయండి..మీరు ఆఫీసర్ గా ఇంటర్వ్యూకి వెళితే తిరిగి వచ్చేటపుడు  మంచి ఆఫీసర్ గా అపాయింట్ మెంట్ తో తిరిగి వస్తారు.. మీలోని విల్ పవర్ ఏంటో మీకు కళ్లముందు కనిపిస్తుంది.. కాస్త వెరైటీగా ఉంది కదూ..నిజమే నేను ఆ సీనియర్ పోలిస్ అధికారిని ఇంటర్వ్యూ చేసినపుడు నాకూ అలానే అనిపించింది.. ఎప్పుడూ, ఎక్కడా..ఏ గ్రూప్-1 అధికారి చెప్పని విధంగా, ఫైనల్ ఇంటర్వ్యూలకు వెళ్లే ఆశావాహులకు మంచి అంశాలు సూచించిన విధానం.. ఆ స్పూర్తిదా యకమైన సూచనలు నిజంగానే ఇంటర్వ్యూని ఫేస్ చేసేవాళ్లకి దైర్యాన్ని, స్పూర్తిని కలిగిస్తాయి.. పక్కాగా జాబ్ ని తెచ్చిపెడతాయనే విషయం ఆ అధికారి మాటల్లో చాలాస్పష్టంగా కనిపించింది.  ఆయన ఎవరో కాదు.. అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్(అడ్మిన్) బి.విజయభాస్కర్. ఒకసారి సివిల్ సర్వీస్, 3 సార్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ఫేస్ చేసి చివరకు 2012లో గ్రూప్-1 డిఎస్పీగా జాబ్ సాధించిన బెస్ట్ ఆఫీసర్. ఆయనలా మరే ఫైనలిస్ట్ సివిల్ సర్వీస్/ఎపిపిఎస్సీలో జాబ్ కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా పోటీ పరీక్షల్లో ఫైనల్స్ చేరుకునేవారిని చైతన్యం చేస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net సంయుక్తంగా గ్రూప్-1 ఇంటర్వ్యూ 
అభ్యర్ధుల కోసం ఆయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఆ విలువైన వివరాలు, సూచనలు, సలహాలు మీకోసం..!

 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే ఔత్సాహికులంతా ముందు వారిలోని విల్ పవర్ ను పెంచుకోవాలంటున్నారు ఏఎస్పీ(అడ్మిన్) బి.విజయభాస్కర్. ఆయనను గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్ధుల కోసం సూచనలు, సలహాలు ఇవ్వమని చెప్పినపుడు ఆయన మాట్లాడిన మాటలు తొలుత ఒక జర్నలిస్టుగా నన్నే ప్రభావితం చేశాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇంటర్వ్యూ పూర్తిచేసుకొని బయటకు వస్తూ..నేనూ  ఒక గ్రూప్-1 అధికారిని అయ్యాననే భావన కలిగింది. ఆ స్థాయిలో ఆయన చెప్పిన స్పూర్తిదాయకమైన సూచనలు త్వరలో ఇంటర్వ్యూలకి హాజరయ్యేవారికి కూడా అలానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా గ్రూప్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల వరకూ వెళ్లారంటే వారందరూ నా ద్రుష్టిలో వారు ఆఫీసర్స్..అంతేకదా..అలా కాకపోతే వాళ్లు ఇంత వరకూ రారు..అలా చివరకు వచ్చిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆఫీసర్ లా మారిపోవాలి..అలా మారిపోయి ఇంటర్వ్యూని ఫేస్ చేస్తే..ఆ ఉత్సాహం, మనోదైర్యం మంచి అధికారిగా తిరిగొచ్చేలా చేస్తుంది అని తడుముకోకుండా చెప్పారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లో ఎన్ని రకాల ఉద్యోగాలకు ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందో చూసుకొని సదరు ఉద్యోగాలపై ముందుగా అవగాహన పెంచుకోవాలి. ఆర్డీఓ పోస్టుకైతే రెవిన్యూ అంశాలు, డిఎస్పీ పోస్టుకైతే లా అండ్ ఆర్డర్, ఐపిసి, సిఆర్పీసి సెక్షన్లు, సిటిఓ పోస్టుకై వాణిజ్య పన్నులు, ఆర్టీఓ పోస్టు కైతే రవాణా, మోటారు వెహికల్ యాక్టు.. ఇలా ఎన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయో అన్నిశాఖలపైనా 
అవగాహన పెంచుకోవాలి. దానికి అనుగుణంగానే సామాజిక రాజకీయ, బౌగోళిక, ఆర్ధిక పరమైన అంశాలను అంచనా వేస్తూ..మీ చదువు, కుటుంబ నేపథ్యం ఇలా అన్నింటిపైనా పట్టుసాధించాలి అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీయబోయే గ్రూప్-1 పోస్టులన్నింటికి ఒక్కో పోస్టుకి ఇద్దరిని మాత్రమే ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నది..అంటే సగం ఉద్యోగం మనకి వచ్చినట్టే..మిగిలిన సగం పూర్తిగా రావాలంటే అది మనం ఫేస్ చేయబోయే ఇంటర్వ్యూని బట్టే వుంటుంది. అదే మన లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పిన మాట నిజంగా ఎంతో ఛాలెంజింగ్ అనిపించింది. మధ్యలో ఆయన చెప్పే సూక్తులు ‘ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ భానిస అవుతుంది’ అని చెబుతూ..ఆ విధంగా మనం వెళ్లే ఇంటర్వ్యూలో ఒక ఉద్యోగం మన బానిసగా మనతోనే మనవెంటే వచ్చేవిధంగా ఎంతో సమయస్పూర్తితో సమధానాలు చెప్పేలా తయారు కావాలని సూచించారు. చాలా ఏళ్ల తరువాత ప్రభుత్వం అత్యంత త్వరగా ఎపిపిఎస్సీ ద్వారా భర్తీచేస్తున్న ఈ ఉద్యోగాలపై చాలామందికి అత్యంత పెద్ద స్థాయిలో అంచనాలున్నాయని..వాటిని చేరుకోవాలంటే ముందు ఆ ప్రభుత్వశాఖలు, ఉద్యోగాలు, వాటి యొక్క విధులపైన మనకి మంచి అవగాహన ఉండాలని అన్నారు. తాను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పటికీ.. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని.. ఎపిపిఎస్సీ జాబ్స్ ఇంటర్వ్యూలు కూడా సివిల్ సర్వీస్ స్థాయిలోనే ఉంటున్నందున ఆ స్థాయిలోనే అభ్యర్ధులు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లో ఎంతబాగా పరీక్షలు రాసారో..అంతకు మించి ఇంటర్వ్యూలో అంత చక్కగా ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఒక ఉన్నత లక్ష్యంతో గ్రూప్-1 జాబ్ కొట్టాలనుకునే వారికి ఈ ఇంటర్వ్యూలు నిజంగానే ఛాలెంజ్ గా నిలుస్తాయని..వాటిని సమయస్పూర్తితో అధిగమిస్తే విజయం సొంతం అవుతుందని చెప్పారు. ఉద్యోగం కోసం ఎంత శ్రమించి ఈ స్థాయి వరకూ వచ్చామో..అదే స్పూర్తితో ఉద్యోగం వచ్చిన తరువాత కూడా ప్రజలకు ఆ స్థాయిలోనే సేవ చేయాలని అపుడే మనం సాధించిన రాష్ట్రస్థాయి ఉద్యోగానికి అర్ధం, పరమార్ధం, ఒక సార్ధకత లభిస్తాయన్నారు. ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలు అన్ని తెలిసినట్టుగానే ఉంటాయని..కానీ సమాధానం చెప్పడంలోనే మనకి మంచి సర్వీసు రావడానికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. అలా మంచి సర్వీసు సాధించాలంటే ప్రభుత్వశాఖలు, వాటి విధులు, పరిపాలన, ప్రభుత్వ వ్యవహారాలపై మంచి పట్టు ఉండాలని అన్నారు. ఆ దిశగా అభ్యర్ధులు సన్నద్దం కావాలన్నారు. విజయం సాధించే సమయంలో ఇంటర్వ్యూ ఒక వారధి అని.. ఆ వారధికి మనం సారధిగా మారినపుడు మాత్రమే గ్రూప్-1 ఉద్యోగాల్లో మంచి సర్వీసు సొంతం చేసుకోవడానికి ఆస్కారం వుంటుందని ఏఎస్పీ(అడ్మిన్) బి.విజయభాస్కర్ చెప్పుకొచ్చారు. సమయం మించిపోతున్నది..ఆయనతో ఎంతసేపు మాట్లాడుతున్నా..ప్రతీ ప్రశ్నకూ ఎంతో విలువైన సమాధానాలు చెబుతూనే ఉన్నారాయణ..ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది.. దాని వైపు చూస్తూ..బాలుగారు మనం మరోసారి కలుద్దాం అంటూ పైకి లేచారు...అన్నట్టు మర్చిపోయాను గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారందరికీ.. కాదు కాదు కాబోయే ఆఫీసర్లు అందరికీ నా శుభాకాంక్షలు చెప్పండి మన ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ద్వారా అన్నారు. నాకు అర్ధమైపోయింది.. ఫోనులో ఎవరో పెద్ద అధికారే అయి ఉంటారని.. విధినిర్వహణకు గౌరవం ఇచ్చి తేంక్యూ సర్ మంచి అధికారిని, అందునా మీలాంటి 
అధికారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం గ్రూప్-1 ఇంటర్వ్యూల వలన వచ్చిందని చెప్పి వెనుతిరిగాను.. వస్తూనే నాలోనే ఏవో ఆలోచనలు.. ఆసమయంలో 
నేనూ గ్రూప్-1 ఇంటర్వ్యూకి క్వాలిఫై అయి ఉంటే బాగుణ్ణు అనిపించింది. సరే మరి.. మరో మంచి అధికారి ఇంటర్వ్యూలో మళ్లీ కలుద్దాం..అంతవరకూ సెలవ్ మీ పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), చీఫ్ రిపోర్టర్, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, Ens Live App, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net విశాఖపట్నం..!

Anakapalle

2023-08-05 02:31:18

వైనాట్ 175 కాదు..వైనాట్ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్..!

ఆంధ్రప్రదేశ్ లో వైనాట్ 175 కంటే..వైనాట్ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ అని విశాఖ ప్రజలు తనకు పట్టం కట్టడం ఖాయమని..తాను ఇక్కడి నుంచే ఎంపీగా పోటీచేస్తానని అన్నారు. గురువారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తెలుగు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మూడు రాజధానులు, సీఎం వైఎస్.జగన్ సెప్టెంబరు 1 నుంచి చేస్తానన్న ప్రకటనపై వ్యంగ్య అస్త్రాలు సంధించారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణమా అని ఎద్దేవా వచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా అభివర్ణించారు. యువకులు, మేధావులు, మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, యూనివర్శిటీల ప్రొఫెసర్లు తమతో టచ్ లో ఉన్నారన్నారు. అటు తెలంగాణాలోనూ పోటీచేసి కెసిఆర్ కి చుక్కలు చూపిస్తామన్నారు. కార్యక్రమంలో టిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు, విశాఖజిల్లా అధ్యక్షు ఎల్జీనాయుడు పాల్గొన్నొరు.

Visakhapatnam

2023-08-03 17:26:16

విలీనం దిశగా సచివాలయ మహిళా పోలీసు పోస్టులు..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయశాఖలో  గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు పోస్టులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా హైకోర్టులో దాఖలైన కేసు తరువాత ఈ పోస్టులను హోంశాఖలో ఉంచాలా..? లేదంటే వేరొక శాఖలో విలీనం చేయాలా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. 2019లో ఈశాఖను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశారు. అయితే నాటి నుంచి నేటివరకూ ఈ మహిళా పోస్టుల పోస్టులపై హైకోర్టుల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవలే నమోదైన కేసుకి సంబంధించి మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ విధులకు వినియోగించమని, వారిని పోలీసులుగా పరిగణించడం లేదని హైకోర్టుకి అఫడిట్ దాఖలు చేశారు డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి. ఆ తరువాత నుంచి మహిళా పోలీసులకు లైన్ డిపార్ట్ మెంట్ లేకుండా పోయింది. గతంలో గ్రామ సంరక్షణ, గ్రామాల్లోని విద్యార్ధినిలు, మహిళలకు అండగా ఉంటూ దిశ సేవలను అందించేవారు. ఆ తరువాత వీరిని పోలీసు స్టేషన్లలో విధులకు వినియోగించడంపై కేసు దాఖలు కావడంతో ఆ పనుల వారిని నిలిపివేశారు. అంతేకాకుండా పోలీసుశాఖకు సంబంధించి ఏ ఒక్క పనికూడా వారికి చెప్పడం లేదు. ప్రస్తుతం వారంతా ఓటరు నవీకరణ కోసం బిఎల్వో విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తమకు లైన్ డిపార్ట్ మెంట్ కేటాయించాలని, మళ్లీ పోలీసుశాఖ పనులు, పాత డ్యూటీ చార్టునే అప్పగించాలంటూ అన్నిజిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం కోర్టులో కేసులు నలుగుతున్న సమయంలోనూ.. ఒకే జాబ్ విషయంలో పదే పదే కోర్టు కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో మహిళా పోలీసులను వారి వారి విద్యార్హతను బట్టి ఖాళీగా ఉన్న పోస్టుల్లో విలీనం చేయడం ద్వారా పూర్తిస్థాయిలో సచివాలయ ఉద్యోగాలన్నీ భర్తీచేసినట్టు అవుతుందనే సూచనను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్న కోర్టుకేసులతోపాటు, భవిష్యత్తులో కోర్టుకేసులు దాఖలతై ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని చెప్పినట్టుగా కూడా తెలిసింది. ఈ శాఖఏర్పాటైన దగ్గర నుంచి నేటివరకూ దాఖలైన కేసుల్లో పురోగతి ప్రభుత్వం తరపునుంచి సాధించకపోవడాన్ని కూడా ప్రభుత్వంలోని అధికారులు, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నదని తెలిసింది. కాగా మహిళా పోలీసుల సేవలు రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పుష్కలంగా అందుతున్నాయి. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా మహిళా పోలీసులు సచివాలయాల్లోని సేవలతోపాటు, ఎన్నికల విధులు, ఐసిడిఎస్ విధులు, పోలీసుశాఖ విధులు, గ్రామ సంరక్షణ విధులు ఇలా అన్నిరకాలుగా పనిచేస్తున్నారు. ఇలా పనిచేసే శాఖను మరొక శాఖలో విలీనం చేస్తే.. ఒక్క శాఖ యొక్క పనులే చేయించగలుగుతామనే వాదన కూడా ఇతర అధికారులు తెరమీదకు తీసుకొచ్చినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అందునా గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత ఇంకా రానందున వారిని ఇతర శాఖల్లోకి ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి భర్తీచేయడం ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేసినట్టుగా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు చెబుతున్నారు.

సచివాలయ మహిళా పోలీసు విభాగం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన తరువాత దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఎంతో చక్కగా ప్రజల్లోకి వెళ్లింది. వీరి ద్వారా గ్రామంలోనే రక్షణ చర్యలు చక్కగా సాగుతున్నాయి. వర్తక వాణిజ్యాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు దగ్గర నుంచి గ్రామాల్లో జరిగే ఆందోళనలు నియంత్రించడం, ఉద్యోగులు ఇళ్ల వద్ద ధర్నాలకు వెళ్లకుండా రాత్రంతా కాపలాకాయడం, కోర్టు సమన్ల సమాచారం అందించడం, నాటు సారా నియంత్రణ, స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్ధినిలకు రక్షణ చర్యలు, దిశయాప్ వినియోగంపై అవగాహన ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం వుండేది. ఇపుడు కోర్టుకేసు కారణంగా అవన్నీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా పోలీసుశాఖ విధుల నుంచి వీరిని తప్పించారు. దీనితో మహిళా పోలీసు అనే పేరుకి అర్ధం మారిపోయింది. ఈ తరుణంలో తెరపైకి వచ్చిన అంశాలను కూడా ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నదట. మహిళా పోలీసులు ఉద్యోగులందరూ  నాల్గవ తరగతి కేడర్ కిందకు వస్తున్నందున వీరిని రాష్ట్రవ్యాప్తంగా వున్న జిల్లా ఎస్పీ కార్యాలయాలు, సబ్ డివిజన్లు, దిశ పోలీస్ స్టేషన్లు, పోలీస్ కమిషనరేట్లలో మినిస్టీరియల్ స్టాఫ్ గా నైనా వినియోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. పైగా చాలా మంది ఉద్యోగులు బిటెక్ చేసి ఉన్నందున వారిని సైబర్ విభాగం, కమ్యూనికేషన్ విభాగాల్లోనూ వినియోగిస్తే పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాలు తీసే ఒత్తిడి కూడా ఉండదనే ఆలోచన కూడా పోలీసుశాఖలోని అధికారులు చర్చిస్తున్నారని సమాచారం.

మరోప్రక్క ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సేవలు, వారి ద్వారా ప్రభుత్వానికి కలిసొస్తున్న పనులను ప్రభుత్వం బేరీజు వేస్తున్నది..ఈ నేపథ్యంలో కోర్టుకేసులు కాస్త ఇబ్బంది పెట్టినా..వీరందరినీ డిఎస్సీ ద్వారా ఏపిపిఎస్సీతో నియామకాలు చేపట్టినందున ఒక ప్రత్యేక విధి విధానాలు రూపొందించి వీరి ఉద్యోగాలకు చట్టభద్దత తీసుకువస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కోర్టులో దాఖలవుతున్న కేసులన్నీ మహిళా పోలీసు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరగలేదనే విషయాన్ని కేసుల్లో ప్రస్తావిస్తున్నారు ఫిర్యాదు దారులు. వాస్తవానికి మహిళా పోలీసులకు కూడా ప్రభుత్వంపోలీసుశిక్షణను అందించింది. వారికంటే మెరుగ్గా గ్రామాల్లో వీరి సేవలను ఎంతో చక్కగా వినియోగిస్తున్నది. కానీ ప్రభుత్వంలోని కొన్ని సర్వీసు రూల్స్ వీరి నియామకాల విషయంలో మోకాలడ్డుతున్నాయి. వాటిని అదిగమించే విషయంలో కూడా పోలీసుశాఖ గాని, హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ గానీ ప్రత్యేకంగా ద్రుష్టిసారించిన దాఖలాలు లేవు. కోర్టుల్లో కేసులు దాఖలైనపుడు కేసు నుంచి బయటపడేందకు అఫడివిల్లు దాఖలు చేస్తున్నది తప్పితే వాటికి పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని మాత్రం చూపించడంలో ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విషయం తాజా కోర్టుకేసుల్లో నిరూపితం అయ్యింది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో విలీనాన్ని ఎంచుకుంటుందా..? పోలీసుశాఖలోని మినిస్టీరియల్ సిబ్బందిగా వారిని వినియోగిస్తుందా..? లేదంటే సచివాలయాల్లోనే గ్రామ, సంరక్షణా కార్యదర్శిలుగానే పోలీసు అనుబంధ విభాగంగా వినియోగిస్తుందా..? అనేవిషయం తేలాల్సివుంది..!

Tadepalli

2023-08-01 04:19:38

గ్రామ సచివాలయ మహిళాపోలీసులకు స్టేషన్లతో కాలం చెల్లింది..!

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 15వేలకు పైచిలుకు మహిళా పోలీసులకు, పోలీస్ స్టేషన్లు,అక్కడి విధులతో కాలం చెల్లిపోయింది. ఇకపై సచివాలయ మహిళా పోలీలను ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులుగా పరిగణించేది లేదని డిజిపి రాజేంధ్రనాధ్ రెడ్డి హైకోర్టుకి ఆఫడవిట్  సమర్పించారు. ఇకపై ఎవరినీ పోలీసులుగా పరిగించమని అందులో పేర్కొన్నారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న  సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావాల్సిన పూర్తి సహాయసహకారాలు అందిస్తారని అందులో పేర్కొన్నారు. కాగా గ్రామ,వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గరనుంచి ఒక్క మహిళా పోలీసు పోస్టులపైనే హైకోర్టులో కేసులు నమోదు అవుతున్నాయి. కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ ను, తమ ఆదేశాలను ఏ ఒక్క స్టేషన్ ఆఫీసర్, సిఐ, డిఎస్సీ, ఎస్పీ ఎవరు అతిక్రమించినా కఠినచర్యలు తీసుకుంటామని కూడా స్టేట్ పోలీస్ కాన్ఫరెన్సులో డిజిపి ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. దానితో నేటి నుంచి ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. కోర్టుకి సమర్పించిన ఆఫడవిట్ లోని అంశాలన్నీ సచివాలయ మహిళా పోలీసుల విధుల విషయంలో పోలీసుశాఖ పాటించనున్నది.

 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీస్ ను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు  శాంతి భద్రతల  వంటి వాటికి వినియోగించడం,  తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే లక్ష్మణరేఖను ప్రత్యేక ఉత్తర్వులతో డిజిపి  గీసి ఉంచారు. దానితో మహిళా పోలీసులకు పోలీస్టేషన్లకు సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్టు అయ్యింది. వాస్తవానికి మహిళా పోలీసు విభాగం ఏర్పాటు చేయడం అసలు పోలీసుశాఖలోని హోం గార్డుల దగ్గర నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ఇష్టం లేదు. వారి అసహనాన్ని చాలా సందర్భాల్లో వెళ్లగక్కేవారు. వీరందరూ తమ క్రింద ఉద్యోగులుగా వ్యవహరించేవారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా డిజిపి కార్యాలయానికి తెలిసినా క్రింది స్థాయి సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అదే సమయంలో వీరిని తరచుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ డ్యూటీలు, స్టేషన్ రికార్డ్ వర్క్, సభులు, సమావేశాలు జరిగినపుడు బందోబస్తు డ్యూటీలకు, కోర్టు సమన్లు వచ్చినపుడు వాటి సమాచారం వీరితోనే సదరు నోటీసు దారులకు తెలియజేయడానికి వినియోగించేవారు. ఇపుడా విధానాలకు పూర్తిగా కోర్టుకేసు, డిజిపి ఆదేశాలతో అడ్డుకట్ట పడినట్టు అయ్యింది.

దేశంలో ఎక్కడాలేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వశాఖను అయితే ఏర్పాటు చేశారుగానీ 2019 అక్టోబరు 2 నుంచి నేటి వరకూ సుమారు 19 ప్రభుత్వశాఖల్లోని రాష్ట్ర ముఖ్యకార్యదర్శిలకు వారిలో వారికే సమన్వయం లేకుండా పోయింది. ఒకశాఖ జారీచేసిన ఉత్తర్వులు మరోశాఖ నేటివరకూ అమలు చేయడం లేదు. మరోప్రక్క జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను పక్కన పెట్టి అందరు సిబ్బందినీ అన్ని శాఖల విధులకూ నేటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ఏపీలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖ ఉద్యోగులు ఆశాఖ విధులను మాత్రమే నేటికీ చేస్తూ వస్తున్నారు. కానీ ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రమే అన్ని ప్రభుత్వశాఖల విధులు, పనులు సచివాలయాల్లో చేయాల్సి వస్తున్నది. విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా అన్నిశాఖల జిల్లా అధికారులు సచివాలయశాఖ ఉద్యోగులపై అజమాయిషీ చేస్తూ ఉండటం. ఇక్కడి ఉద్యోగులందరూ వారి జిల్లా, డివిజన్, అన్నిమండలశాఖ అధికారులతోపాటు, సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శిలకూ సమాధానాలు చెప్పుకోక తప్పడంలేదు.

ఏ ప్రభుత్వంలోనైనా ఏదైనా కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటుచేసినా..దానికి సిబంధించిన చట్టబద్దతను అసెంబ్లీలో ప్రత్యేక బిల్లుద్వారా రెండేళ్లలో పూర్తిచేస్తుంది. ఆపై సదరు ప్రభుత్వశాఖకు  ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్, అడిషనల్ డెక్టర్, జిల్లా అధికారి, డివిజన్ అధికారి, మండల అధికారి ఇలా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని రకాల పోస్టులను తయారు చేస్తుంది. ఈశాఖ అధికారులతోనే ప్రభుత్వంలోని ఏ సర్వీసు నిబంధనలతో ఏ ఉద్యోగాలను భర్తీచేశారో..దానికి తగ్గట్టుగా వారికి ప్రమోషన్ ఛానల్, ఇంక్రిమెంట్లు, డిఏలు, ఎస్ఆర్ మాన్యువల్ ఏర్పాటు చేయాలి. కానీ నేటివరకూ గ్రామ, వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం చట్టభద్దతే కల్పించలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు తరచూ ఏదోవిధంగా ఈశాఖపై కోర్టులో కేసులు దాఖలవుతూనే ఉన్నాయి. ఒక్క మహిళా పోలీసు విభాగంపై 2 కేసులు నేటికీ హైకోర్టులో ఉన్నాయి. ఫలితంగా ఈశాఖలోని ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన 2ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ఇచ్చామని ప్రకటించిన సమయంలో కూడా వీరికి ఐఆర్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డిఏ కూడా వీరికి వర్తింపచేయలేదు. ఈ కారణాలతో అసలు తమ ఉద్యోగాలు రెగ్యులర్ వా..కాంట్రాక్టు పద్దతిలోనే ఉన్నాయా అనే అనుమానాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఈశాఖ ఉద్యోగులకు అడుగడునా, అవమానాలు, ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అటు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు కూడా రావడంలేదు. చూడాలి కోర్టు కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈశాఖ విషయంలో ముందు ముందు ఏవిధంగా వ్యవహరిస్తుందనేది..!

Amaravati

2023-07-28 04:30:19

గ్రామపంచాయతీల్లో ఆగస్టు15 నుంచి డిజిటల్ చెల్లింపులు

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 12940 గ్రామ పంచాయతీల్లోని, 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 15నుంచి డిజిటల్ చెల్లింపులు చేపట్టేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో యూపిఐ, డిజిటల్ పేమెంట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంతో ఏపీలో కూడా దానికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధమవుతున్నది.కాగా ఏపీలో13 జిల్లాలు 26జిల్లాలు అయినా.. ప్రస్తుతానికి కేంద్రం ద్రుష్టిలో మాత్రం నేటికీ 13 జిల్లాలుగానే ఉన్నాయి. ఇక డా.వైఎస్సార్ కడప జిల్లాలో-800 గ్రామ పంచాయతీలు, పశ్చిమగోదావరి-888, విజయనగరం- 929, విశాఖపట్నం- 944, శ్రీకాకుళం-1101, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు-961,ప్రకాశం-1036, కర్నూలు-899, క్రిష్ణ-972, గుంటూరు-1016, తూర్పుగోదావరి-1012, చిత్తూరు జిల్లాలో-1381 పంచాయతీల్లో డిజిటల్ పేమెంట్లు చేసేలా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లుచేసింది.

Tadepalli

2023-07-27 01:40:58

కారుణ్య నియామకాల ద్వారా సచివాలయ ఉద్యోగాలభర్తీ

ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో మ్రుతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించనుంది. ఆ ఉద్యోగాలన్నీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఖాళీల్లో భర్తీచేయాలని 26 జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కరోనా రాష్ట్రవ్యాప్తంగా 2917 మంది మ్రుత్యువాత పడగా.. ఇప్పటి వరకూ 2744 మంది కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ ఆగస్టు 24 నాటికి అపాయింట్ మెంట్లు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కాగా నియామాలు పూర్తిచేసిన నివేదికను సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వానికి అందజేయాలని ఆయా ప్రభుత్వశాఖల అధికారు లు, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన తరువాతన రెండుసార్లు డిఎస్సీ నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1.25 లక్షల మంది ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది.

Amaravati

2023-07-26 15:59:07

13ఫైనాన్స్ కమిషన్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయండి

ఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్న సమయంలో 13 ఫైనాన్స్ కమిషన్ కాంట్రాక్టు హెల్త్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని స్టాఫ్ నర్స్, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో ఏపి ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రాజారావు ఆధ్వర్యంలో ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, సర్వీసుల సలహాదారు ఎన్.చంద్రశేఖరరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల వినతిని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉద్యోగులంతా 2016లో జిఓ నెంబరు 9‌0 ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్దతిలో 1‌‌‌‌00శాతం గ్రాస్ సాలరీతో నియమితులయ్యారని చెప్పారు. ఆ తరువాత ఉద్యోగులందరినీ జిఓనెంబరు 27 అమలుచేసిన సమయంలో ఎంటిఎస్ క్రిందకి మార్పు చేశారని తెలియజేశారు. అన్ని అర్హతలు ఉన్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. సలహాదారుని కలిసిన వారిలో నాగరాణి, సోమామణి, అనురాధ, శ్రీలక్ష్మి, చైతన్య, నాగరాజు అన్నపూర్ణ, సౌమ్య, కిషోర్, వలి, నిరంజన్, పల్లవి, చిన్న, వీరభద్ర, చందన, ప్రశాంతి, రవినాయక్, విజయలక్ష్మి, వినయ్, చినవెంకయ్య, రజనీ, చక్రవర్తి, శిల్ప కళ్యాణి తదితరులు పాల్గొ్న్నారు.


Amaravati

2023-07-26 11:11:25

కారుణ్య నియామకాలకు సిపిటి పరీక్ష తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కారుణ్యనియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఖచ్చితంగా ఉద్యోగాలు పొందిన వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సిపిటి) పాస్ కావాలనే కీలక నిబంధన పెట్టింది. ఈ మేరకు అభ్యర్ధులు ఉద్యోగాలు పొందిన తరువాత రెండేళ్ల ప్రొభేషన్ కాలంలో ఈపరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలని..ఆ తరువాత మాత్రమే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 75 ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ మ్రుతిచెందిన వారి పిల్లలకు కారుణ్యనియామకాలు గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేపట్టింది. అప్పటికే ఉద్యోగాల్లోకి చేరిన వారందరికీ సిపిటి పరీక్షను తప్పనిసరి చేసింది. ఇపుడు అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులు కూడా ఈ పరీక్ష పాస్ కావాలని నిబంధన పెట్టింది. కాగా ప్రస్తుతం చాలావరకూ ఉద్యోగులు విధులన్నీ కంప్యూటర్ పైనే జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ కీలకనిర్ణయం తీసుకుంది.

Visakhapatnam

2023-07-25 09:38:55