1 ENS Live Breaking News

స్నేహపూర్వకంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని రాష్ట్రానికి రప్పిస్తాం

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని స్నేహ పూర్వక వాతావారణంలో తెలంగాణ నుంచి రప్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావుకి హామీ ఇచ్చారు. విశాఖలో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డా.కంచర్ల రాష్ట్రంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యాచారణను, సినిమా వాతావరణానికి విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీయ, గోదావరి ప్రదేశాలు ఏ విధంగా ఉపయోగపడతాయో  మంత్రికి వివరించారు. అంతేకాకుంగా ఇండస్ట్రీ విశాఖకు తరలి రావడం ద్వారా . ఎన్నో వందల కుటుంబాలకు ప్రత్యేక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాది కలుతుందని చెప్పారు. దానికిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ రాష్ట్రానికి రావడం ద్వారా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కూడా రాష్ట్రానికి రావడానికి అవకాశం వుంటుందన్నారు. తద్వారా రాష్ట్రంలోని సినిమాలు నిర్మించేవారు తెలంగాణ వెళ్లే శ్రమ తగ్గుతుందన్నారు. 24 క్రాప్ట్స్ కి సంబంధించిన సిబ్బంది, 64 కళలకు సంబంధించిన కళాకారులకు కూడా నిత్యం ఉపాది లభించడానికి ఆస్కారం వుంటుందన్నారు.

 ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రతో చర్చించి సినిమా పరిశ్రమకు సంబధించిన కేంద్ర కార్యాలయాలను విభజన చేయాల్సిందిగా కోరడంతోపాటు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తనవంతు సహకారం అందింమామని చెప్పారు.అనంతరం రాష్ట్ర చాత్తాద శ్రీ వైష్టవ సంఘం వన సమారాధన కరపత్రాన్ని స్టేట్ కమిటి ఆధ్వర్యంలో మంత్రి ఆవిష్కరించారు. అలాగే బాలభాను అర్చక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతికోసం ఐదురోజుల పాటు ఆరిలోవన ఎర్ని దుర్గమాంబ ఆలయ ప్రాంగణంలో యజ్ఞం, యాగాలదులు, ప్రత్యేక పూజాకార్యక్రమాలకి సంబంధించిన కరపత్రాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి రామ్మోహన్ నాయుడుని డా. కంచర్ల ఈ సందర్భంగా ఆహ్వానించారు. ప్రపంచ శాంతి కోసం తలపెట్టే ఈ మంచి కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని డా.కంచర్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఎంపికై డా.కంచర్ల అచ్యుతరావుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కంచర్లను  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చాత్తాద శ్రీ వైష్టవ సంఘం ప్రతినిధులు, అర్చరక సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


visakhapatnam

2024-09-16 05:58:12

కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల జీవితాల్లో మట్టి..!

వైద్య ఆరోగ్యశాఖలో జీఓనెంబరు 115 రగడ తీవ్రతరం అవుతున్నది. వైఎస్సార్సీపీ చేసిన తప్పుడు విధానాలతో వైద్యఆరోగ్యశాఖలో పారా మెడికల్ ఉద్యోగాలకు రెగ్యులర్ నోటిఫికేషన్లు రాలేదు సరికదా.. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్శుల మనుగడకూడా ప్రశ్నార్ధకం అవు తున్నది. గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను ఆర్ధిక భారంతో కూటమి ప్రభుత్వం అదే తప్పును కొనసాగించాల్సి వస్తోంది. అసలు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను తేడాగా ఏవిధంగా భర్తీచేశారో తెలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలో పడుతుంది. తద్వా రా ఏళ్ల తరబడి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల కోసం ప్రభుత్వం కూడా ఒక సముచిత ఆలోచన చేయడానికి ఆస్కారం వుంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు క్రింద జిఎన్ఎం శిక్షణ ఇచ్చి పదోన్నతులు కల్పిస్తున్నట్టు వారికి ప్రయో జనం చేకూర్చినా..ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్టు బేస్ ఉద్యోగాల్లో పనిచే స్టాఫ్ నర్సుల జీవితాలు మట్టి కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నా యి.. గత ప్రభుత్వం తేడా విధానంలోని లోపాలను, తప్పని సరిపరిస్థితుల్లు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను  ఒక్కసారి తెలుసుకుంటే..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసింది. తద్వారా 1.35 లక్షల ఉద్యో గాలను భర్తీచేసి నిరుద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాలను కల్పించాలని సంకల్పించింది. అయితే అందులో చాలా పెద్ద కుట్రకోణం దాగివుం దని ఉద్యోగ సంఘాలు గొల్లు మన్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూగా తమ సేవలను పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తే కొందరి సేవలను కూడా వారికొచ్చిన మార్కులు ఆధారంగా తీసుకొని అందరినీ కలిపి ఏఎన్ఎం ఉద్యోగాల్లోకి సుమారు 15వేల మందిని భర్తీచేసింది. అంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తరువాతే పరిపాలనా సౌలభ్యం కోసం, ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడం కోసం గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. కోవిడ్ తరువాత వేల సంఖ్యలో స్టాఫ్ నర్స్ లు ఉద్యోగ విరమణలు చేస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం..  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీస్ పేరిట జిఎన్ఎం(స్టాఫ్ నర్సు) శిక్షణ ఇచ్చింది. అలా శిక్షణ ఇచ్చి ఊరుకున్న ప్రభుత్వం వారిని మళ్లీ సచివాలయాల్లోనే విధులు నిర్వహించాలని, వారికి జిఎన్ఎం పేస్కేలు కూడా వర్తింపచేయకుండా ఇక్కడే విధులు నిర్వహించుకుంటూ వచ్చింది. ఇక్కడ మీకు ఒక అనుమానం రావొచ్చు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వడం మంచిదే కదా అని.. నిజమే మంచిదే.. అది ఎలా అంటే..? ఇన్ సర్వీసులోని ఉద్యోగులకు అదనపు శిక్షణ ఇస్తే.. సదరు ప్రభుత్వ శాఖలోని ఖాళీలను బట్టి పోస్టుల్లోకి వీరికి పదోన్నతి కల్పించాలి. 

పదోన్నతి కల్పిస్తే ఏఎన్ఎం ప్కే స్కేలు సహా అపుడు జిఎన్ఎం పేస్కేలులోకి వెళుతుంది. కానీ గత ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. శిక్షణ ఇచ్చి మళ్లీ వారిని సచివాలయాల్లోనే ఉంచేసింది.  ఓ ప్రక్క అప్పటికే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో సుమారు 15వేల మంది ఉద్యోగు లు పనిచేస్తుండగా వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇపుడు ఇపుడు మళ్లీ అలా శిక్షణ పొందిన జిఎన్ఎస్ స్టాఫ్ నర్సులను భారీగా ఖాళీలు అవుతున్న రెగ్యులర్ స్టాఫ్ నర్సు ఖాళీల్లో భర్తీచేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. ఇలా చేయడం వలన ఇప్పటి వరకూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు రెగ్యులర్ కాకుండా మరికొన్నేళ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనితో రాష్ట్రవ్యాప్తం ఉన్న కాంట్రాక్టు బేస్డ్ స్టాఫ్ నర్సులంత ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది కాలంలో సుమారు మూడువేలకు పైగా రెగ్యులర్ స్టాఫ్ నర్సులు రిటైర్ కానున్నారు. ఒకేసారి అన్ని పోస్టు భర్తీచేయాలంటే ప్రభుత్వం అంత త్వరగా చేపట్టదు. దానితో సచివాలయాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఖాళ్లీల్లో సర్ధుబాటు చేయాలని యోచిస్తున్నది. అలా చేయడం ద్వారా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే సుమారు 15ఏళ్లుగా పనిచేస్తున్న వీరంతా ఉద్యోగాలు రెగ్యులర్ కావాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగిన స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేసిన తరువాత మాత్రమే మిగిలిన కార్యక్రమాలు చేపట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. వీళ్లంతా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించారు. కనీసం వారి సేవలను గత ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి త్వరలో భారీ సంఖ్యలో స్టాఫ్ నర్సులు(గత ప్రభుత్వం పెంచేసిన 2 రెండేళ్ల అదనపు సర్వీసు ఉద్యోగ విరమణతో) కొరత ఏర్పడనుండటంతో.. ఇప్పటికే శిక్షణ పొందిన సచివాలయ స్టాఫ్ నర్సులను కౌన్సిలింగ్ చేసి పదోన్నతుల పేరుతో భర్తీచేస్తున్నారు. అలా చేసినా ఇంకా చాలా ఖాళీలు భర్తీచేయాల్సి వుంటుంది. అందులోనూ.. చాలా మంది ఏఎన్ఎం లు జిఎన్ఎంగా శిక్షణ పొందలేదు కూడా. అదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేసిన తరువాత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల కోసం ఆలోచించాలని.. దానికోసం ఇచ్చిన జీఓనెంబరు 115 రద్దు చేయాలని ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు.

ఇప్పటికే కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవల్లో అంతరాయం ఏర్పడుతున్నది. అదే వీరు పూర్తిస్థాయిలో సేవల ను నిలుపుదల చేయడం మొదలు పెడితే పరిస్థితి మరింత జటిలం కానున్నది. ఇప్పటికిప్పుడు 15వేల మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన ఈ తేడా నియామకాలు, అడ్డగోలు ఇన్ సర్వీసు శిక్షణ కారణంగా ఇప్పుడు కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నష్టపోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఒక బ్యాచ్ స్టాఫ్ నర్సులకు పదోన్నతులు కల్పించే సమయంలో కనీసం కొంత శాతం మేరకైనా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఎన్నోఏళ్లుగా రెగ్యులర్ నియామకాల్లో కూడా వీరికి తీరని అన్యా యమే జరుగుతున్నది. కనీసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఏఎన్ఎంలకు జిఎన్ఎంలుగా ఇన్ సర్వీసు శిక్షణ ఇచ్చే సమయంలో నైనా అప్పటికే పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్లో కొందరినైనా రెగ్యులర్ చేసి ఉంటే మిగిలిన వారికి వారి సర్వీసులు కూడా రెగ్యులర్ అవుతాయని నమ్మకం వచ్చేది. కానీ గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వాలు అలా చేయలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 15ఏళ్లుగా కాం ట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ప్రభుత్వం ఆదుకోవాల్సి వుంది. చూడాలి కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల విషయంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది..!


visakhapatnam

2024-09-11 12:55:23

ఏపీ కేబినెట్ లో సచివాలయాల కోసం జాన్తానయ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో గ్రామ, వార్డు సచివాలయాల కోసం చర్చించి మార్పుల దిశగా చర్యలు తీసుకుంటారని రాష్ట్రప్రభుత్వంలోని అతిపెద్ద మూడవ ప్రభుత్వశాఖగా ఉన్న సచివాలయ ఉద్యోగులు భావించారు. ఇపుడు ఈ శాఖను టచ్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం అనుకున్నారో ఏమో తెలీదు గానీ. కనీసం ఒక్క అంశాన్ని కూడా చర్చించలేదు సరిగదా భవిష్యత్తులోనైనా చర్చించాలనే నిర్ణయం  కూడా తీసుకోలేదు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఒక దిశ, నిర్ధేశం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కూటమి ప్రభుత్వంలోనైనా తీరుతుందని భావించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. కేబినెట్ భేటీలో కనీసం ఈశాఖకు చట్టబద్ధత తీసుకువచ్చే విషయమైనా చర్చిస్తారనుకుంటే.. కేవలం ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలైన సెబ్, రెవిన్యూ, సివిల్ సప్లైస్ వంటి శాఖల్లో కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకొని మమ అనిపించేశారని ఉద్యోగ వర్గాలు పెదవి విరిచాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల కోసమైనా కనీసం ఏ ఒక్కప్రభుత్వశాఖ కోసం చర్చించకపోవడం 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక క్యాబినెట్ భేటీలో చర్చించిన అంశాలు, నిర్ణయాలు ఒక్కసారి తెలుసుకుంటే..

    సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం.. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులను భర్తీచేయడానికి నిర్ణయం..     కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్‌ దుకాణాల్లో ఈ- పాస్‌ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం..   సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం..   రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం.     పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు కేబినెట్‌ ఆమోదం.. గతంలోని గుత్తేదారుకే మళ్లీ పనులు చేసేలా నిర్ణయం,  ఎక్సైజ్ శాఖను
  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో  గా మార్చిన గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. మళ్లీ సదరు శాఖకు ఎక్సైజ్ శాఖగానే ఉంచాలని  కేబినెట్‌ తీర్మానం..    పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు ఆమోదం.. తద్వారా 21.86లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని ముద్రించి ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయించారు. తొలిసారిగా ఈ-కేబినెట్ నిర్వహించడంతో కొన్ని అంశాలకే ఈ భేటీని పరిమితం చేశారు. 

visakhapatnam

2024-08-28 18:22:15

నేడే ఏపీ కేబినెట్ భేటీ..సచివాలయాల సంగతేంటి..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిమండలి నేడు భేటీ అవుతున్నవేళ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన గ్రామ, వార్డు సచివాల యశా ఖకు చట్టబద్ధత విషయం కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యో గాలు తీయాల్సి వస్తుందని ఏకంగా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసి తలా తోకా లేకుండా  ప్రభుత్వశాఖను ఐదేళ్లు నెట్టుకొచ్చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే శాఖలకు ఒక దిశా నిర్ధేశం లేకుండా చేయరు. దేశం మొత్తం తొంగి చేసే విధంగా ఒక  ప్రత్యేక గ్రామస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని అంతా సగం సగం మేనత్త పనులే చేసుకొచ్చింది. దీనితో సచివాలయశాఖలోని ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సర్వీసులు రెగ్యులర్ అయ్యే సమయంలోనే 9నెలలు పేస్కేలు కోల్పోయిన ఉద్యోగులు.. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ప్రయోజనాలు కూడా కోల్పోయారు. సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో పీఆర్సీ ప్రయోజనాలు ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందోనని పీర్సీ ప్రకటించడానికి ముందుగానే హెచ్ఆర్ఏలను, డిఏలకు కుదించేశారు. 

సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పీఆర్సీ సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేస్తున్నామని చెప్పి పేస్కేలు పెంచి.. ప్రయోజనాలు ఇవ్వడం మానేశారు. మహిళా పోలీసులు ఉద్యోగాలను పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కాకుండా సాధారణ ఉద్యోగులుగా నియమించారని ఉమ్మడి విశాఖజిల్లాకి చెందిన వ్యక్తి కోర్టుకి వెళితే.. అసలు మహిళా పోలీసు లకు పోలీసుశాఖ ఉద్యోగులే కారని.. చెప్పి వారిని ఏ ప్రభుత్వ శాఖకు చెందని ఉద్యోగులుగా గాల్లో పెట్టేశారు. ఇంకా మిగిలి వున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు అమలు చేస్తే ఎక్కడ ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందని సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడం మానేశారు. అంతేకాదు..ఒకవేళ ఈ ప్రభుత్వశాఖను మనమే ఏర్పాటు చేశాం గనుక మనమే ఏదో సందర్భంలో మార్పులు చేసేసుకుందామనే గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత కూడా ఇవ్వడం మానేశారు. అసలు ఒకప్రభుత్వశాఖను ఏ రాష్ట్రంలోనైనా ఏర్పాటు చేసే ముందు ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగులకు అనుబంధంగా, ఏ కేటగిరీ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారో గుర్తిస్తూ.. వారి శాఖ పేస్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తిపంచేస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్ధత తీసుకురావాలి. 

ఐదేళ్లు దాటగానే మొదటి పదోన్నతి కల్పించాలి. లేదా ప్రమోషన్ ఛానల్ లో పొందుపరిచిన విధంగా ఏడేళ్ల తరువాతనైనా ఉద్యోగులకు తొలి పదోన్నతి కల్పించాలి. ఇలా ఎక్కడ చేయాల్సి వస్తుందోనని ముందుగానే ఆలోచించిన ప్రభుత్వం.. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులేమీ చేయకుండా అన్నీ సగం సగం చేసి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను గాల్లో ఉంచేసింది. ఆతరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వమైనా ఉద్యోగులకు మేలు చేస్తుందా అని ఆశపడిన ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో మరింత నిరాశ కలిగేలా చర్యలు మొదలు పెట్టింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాల్సిన కూటమి ప్రభుత్వం. వారికంటే పెద్ద తప్పులను చేసే విధంగానే యోచన చేస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము ఇతర 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరి గానే ఉద్యోగులమా.. లేదంటే అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగులం కాకుండా మధ్య తరహా ఉద్యోగులమా అనే అనుమానం వస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏ ప్రభుత్వమైనా ఒక కొత్త ప్రభుత్వశాఖకు సంబంధించిన అంశాలను పూర్తిచేయడానికి ఐదేళ్లు సమయం సరిపోలేదాని కూడా ప్రశ్నిస్తున్నారు.

 కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలోని క్యాబినెట్ బేటీ ఎప్పుడు జరిగినా మా ఊసు చర్చకు వస్తుందా..? అసలు మాకోసం ఆలోచిస్తారా..? మా ప్రయోజనాలు మాకిస్తారా..? లేదంటే పరిపాలనా సౌలభ్యం పేరుతో ఉన్నవి ఈ ప్రభుత్వం మరింతగా తీసేస్తుందా అనే అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. సచివాలయశాఖకు చట్టబద్ధత కల్పించడంతోపాటు, సర్వీసు రెగ్యులర్ సమయంలో ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెంట్లు, గత పీఆర్సీ సమయంలో కుదించేసిన ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి.. మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయడమో.. లేదంటే విద్యార్హతలను బట్టి డిపార్ట్ మెంట్ స్టైడింగ్ అయినా ఇచ్చి తమకు ఎంత పెద్ద బాధ్యతలు అప్పగించినా కష్టమైనా భరిస్తూ చేస్తామంటున్నారు ఉద్యోగులు. అయితే ఇవేమీ గత ప్రభుత్వంలో పట్టకపోగా.. ఈ ప్రభుత్వంలో అసలు చర్చకు వచ్చే దాఖలాలు కూడా కనుచూపు మేరలో కనిపించలేదు. ఒకవేళ గత ప్రభుత్వం కావాలని చేయకుండా మానేసిన అంశాలన్నీ టేకప్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెద్ద ఎత్తున పడుతుంది. 

అంతేకాదు.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తే వీరికి పదోన్నతులు కల్పించి ఉద్యోగుల సంబంధిత ప్రభుత్వ శాఖల్లోకి వీరిని పంపాల్సి వుంటుంది. అలా పంపితే రెండేళ్ల తరువాత మళ్లీ సచివాలయశాఖలో కొత్తగా ఉద్యోగాలు తీయాల్సి వుంటుంది. అవన్నీ చేసేకంటే అదిగో ఇదిగో అని కాలం గడిపేస్తే.. ఈ ప్రభుత్వం కూడా ఐదేళ్లపాటు గత ప్రభుత్వం సాగదీసినట్టుగా సాగదీసేయొచ్చు. అయినా సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీర్చే సమయాన్ని ఇతర ప్రభుత్వశాఖలపై వెచ్చిస్తే అన్ని ప్రభుత్వ శాఖల విధులు సచివాలయ శాఖ ఉద్యోగులతో చేయించొచ్చు.. వీరి సమస్యలు పరిష్కరించకుండా వదిలేయోచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది వ్యవహారం. చూడాలి ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు సంబంధించిన అంశాలు, ఉద్యోగుల సమస్యలు, ఈ శాఖకు చట్టబద్ధత, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్. ఇతర ప్రయోజనాల విషయంలో చర్చిస్తారో లేదోనని..లేదంటే ట్విస్ట్ ఇచ్చి.. ఈ సబ్జెక్ట్ తరువాత చూద్దాంలే అని వదిలేస్తారో మరి ఈరోజు క్యాబినెట్ ముగిసేలోగా తేలిపోతుంది..!

visakhapatnam

2024-08-27 19:07:10

సర్ధుబాటు సరే..సర్వీసు రూల్స్ మాటేంటి..?!

ఆలు లేదు సూలు లేదు కొడుకుపేరు సోమలింగం..వాడ్ని చూసి నవ్వేవాడేమో బోడిలింగం అన్నాడట వెనుకటకి ఓ మారాజు.. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసే తప్పునే కూటి ప్రభుత్వం కూడా చేసేలా ఉందనే తేడా సంకేతాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లోకి వెళుతున్నాయి.. నాటి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత, సర్వీసు నిబంధనలు, ప్రమోజషన్ ఛానల్(కొన్నిశాఖలకు) ఏర్పాటు చేయకుండా పనిచేయించుకుంది. కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశపడిన సచివాలయ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. జీవితంలో పదోన్నతులు లేని విధులు.. శాస్వతంగా ఇదేశాఖలో కూరుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే వ్యతిరేక బావం అపుడే పెరిగిపోతుంది. రాష్ట్రంలోని 74 ప్రభుత్వంశాఖల్లో మాదిరిగా 75వ ప్రభుత్వశాఖగా ఏర్పడిన గ్రామ, వార్డు సచివాల యశాఖ ఉద్యోగులకు ఎదుగూ బొదుగూ లేకుండా చేయాలని చూసిన గత ప్రభుత్వ విధానాలే ఇప్పుడు కూడా అమలు జరిగేలా కనిపిస్తు న్నాయి. ఉద్యోగులను పరిపాలనై పరమై ఇబ్బదులను అధిగమించడానికి సర్ధుబాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం..ముందు సచివాలయ ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా గుర్తించి చట్టబద్ధత కల్పిస్తే తప్పా.. న్యాయపరమైన చిక్కులు తప్పేటట్టు కనిపించడం లేదు. విజన్ ఉన్న ప్రభుత్వ అధినేత ఈ విధంగా చేస్తున్నారేంటనే చెడ్డపేరూ మోయాల్సి వస్తుందేమో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసి గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులను విభజన చేయాలని భావిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఇల్లుకట్టాలంటే పునాధులు బలంగా నిర్మిస్తే ఇంటి నిర్మాణం సజావుగా జరుగుతుంది. లేదంటే ఎక్కడో ఒక చోట కూలిపోవడం తథ్యం. అలాగే ఇపుడు గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఈ శాఖకు కనీసం చట్టబద్ధత ఇవ్వలేదు సరికదా.. ఒకే శాఖలో ఉన్న పలు శాఖల సిబ్బందికీ నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి చట్టబద్ధత తేని ప్రభుత్వశాఖలోని ఉద్యోగులను సర్ధుబాటు చేయాల్సి వస్తే ముందుగా కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వశాఖకు చట్టబద్ధత ప్రభుత్వ గెజిట్ ద్వారా తీసుకు రావాల్సి వుంటుంది. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోతే.. వీరు పీఆర్సీ సమయంలోనూ చాలా ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ కావాలని సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన మోసం కారణంగా ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్ధత లేకుండా పోయింది. అంతేకాకుండా పీఆర్సీ ప్రయోజనాలు కూడా పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఉద్యోగులందరూ 9 నెలల పాటు పేస్కేలు,  సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయారు. వాటిపై ఉద్యోగులు నేటికీ ఏమీ చేయలేని పరిస్థితి. ఉద్యోగ సంఘాలు నోరు విప్పడం లేదు. ఆ ఇబ్బందులు కనీసం కూటమి ప్రభుత్వం లోనైనా తీరుతాయనుకుంటే వైఎస్సార్సీపీ ఎంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిందో.. కూటమి ప్రభుత్వం అంతే త్వరగా ఈ శాఖను విచ్చిన్నం చేయాలని చూస్తున్నట్టుగానే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది.

పుండుపై కారం చల్లినట్టుగా గత ప్రభుత్వ విధానాల వలన తీవ్రంగా ప్రభుత్వ ప్రయోజనాలు నష్టపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇపుడు కూటమి ప్రభుత్వం తీసుకునే సర్ధుబాటు నిర్ణయం వలన ఇక జీవితాంతం ఉద్యోగులందరూ ఎలాంటి పదోన్నతులు లేకుండా సచివాలయ ఉద్యోగులుగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో పనిచేసే కొన్నిశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు. అలా ఏర్పాటు చేయకుండానే ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లోకి సర్ధుబాటు చేయాలని యోచిస్తున్నది. అదే జరిగితే వీరికి ప్రభుత్వశాఖలు మారి ఇంకా పెద్ద ఇబ్బందులు చవిచూసే ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ అసిస్టెంట్లను విభజన చేయాలని చూస్తున్న ఈ శాఖ ఉద్యోగులకు కూడా ఇంకా ఎలాంటి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు కాలేదు. వీరితోపాటు వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. మరోప్రక్క మహిళా పోలీసులను పోలీసు శాఖ నుంచి తప్పించి మరోశాఖలోకి పంపాలని చూస్తున్నది. గత ప్రభుత్వంలో వీరందరని పోలీసు విధులకు పనిచేయించుకోమని కోర్టుకి అఫడివిట్లు జారీచేశారు. దానితో నాటి నుంచి నేటి వరకూ మహిళా పోలీసులు ఏ ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా మిగిలిపోయారు. మళ్లీ ఇపుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సర్ధుబాటు పేరుతో విభజన చేసి మరో శాఖలోకి పంపే సమయంలో వారికి సదరు శాఖ నిబంధనలనైనా వర్తింపచేసి వారిశాఖ మార్పు చేస్తూ ప్రభుత్వ గెజిట్ విడుదల చేస్తే తప్పా.. వారికి శాఖాపరమైన ఇబ్బందులు తప్పవు. తప్పిదారి విధినిర్వహణలో ఏ ఉద్యోగి అయినా మరణిస్తే వారినిక కారుణ్య నియామాల్లో ఉద్యోగం పొందే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి అలానే ఉంది వీరికి కూడా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ లేకపోవడంతో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో నేటికీ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. చాలా మంది విధుల్లోనే తీవ్రంగా గాయాలపాలై చేతులు, కాళ్లూ పోగొట్టుకొని మంచాలకే పరిమితం అయ్యారు. వారికి కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కానీ, భృతిగానీ ఇవ్వడం లేదు. 

ఈ తరుణంలో ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, గత ప్రభుత్వం రెండేళ్ల పెంచేసిన ఉద్యోగుల రిటైర్ మెంట్ కాలం పూర్తయి ఉద్యోగులు వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న వేళ సచివాలయ ఉద్యోగులను సర్ధుబాటు చేయాలని చూస్తున్నది. అలా చేసే సమయంలో ఉన్నప్రభుత్వశాఖకు గుర్తింపు, చట్టబద్ధత ఇవ్వకుండా సుమారు 700 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులను శాఖలు మార్పు చేయాలని, ఆపై పంచాయతీ కార్యదర్శిలను పంచాయతీలకు పంపించాలని కూడా యోచన చేస్తున్నది. ఇదే జరిగితే చట్టబద్దత నోచుకోని ఉద్యోగులు, ప్రయోజనాలు కోల్పోయిన సచివాలయ ఉద్యోగులు కోర్టుని ఆశ్రయిస్తే ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. తాడు బొంగరం లేని గ్రామ, వార్డు సచివాలయశాఖకు ముందు చట్టబద్ధత కల్పించి.. ఆపై పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేస్తే తప్పా చిక్కులు తప్పవు. కాదు కూడదు.. మమ్మల్ని ఎదిరించేవారే నష్టపోతారనుకుంటే ఉద్యోగులు విధి నిర్వహణలో చేసే తప్పులకు, మోసాలకు, తీవ్రమైన జాప్యాలకు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. ఇదే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లినా కూటమి ప్రభుత్వం చెరుపుకోలేని చెడ్డపేరు కూడా మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ఇతర 74 ప్రభుత్వశాఖల మాదిరిగా ఈ శాఖకు కూడా చట్టబద్ధత, ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయోజనాలు పూర్తిగా కల్పించిన తరువాత మాత్రమే సర్ధుబాటు చేస్తే ఉద్యోగుల నుంచి కూడా మంచి ఆదరణ లభించే అశకాలున్నాయ్.. లేదంటే పరిపాలనా పరమైర సర్ధుబాటు కంటే కోరి కొనితెచ్చుకునే చిక్కులే కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. చూడాలి కూటమి ప్రభుత్వం సర్ధుబాటుకు ముందుగానీ.. తరువాత గానీ శాఖలు మార్పుచేసే ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేస్తుందనేది.!?

visakhapatnam

2024-08-26 17:49:23

సినీపరిశ్రమ ఉద్యోగుల అభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(హెచ్-228) సభ్యుల అభ్యున్నతి, అభివృద్ది లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తామని నూతన చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో ఫెడరేషన్ చైర్మన్ భాద్యలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమను నమ్ముకొని పనిచేస్తున్న 24 క్రాప్స్ లోని ఏ ఒక్క ఉద్యోగి అన్యా యం జరగకూడదని, కళామతల్లిని నమ్ముకుని పనిచేస్తున్నవారి అభివృద్ధి, సంక్షేమం అందించే విధంగా తనవంతు కృషి చేస్తానని అన్నారు. సినిమాలకు ప్రభుత్వం నుంచి రావాల్సి అనుమతులు ఇకపై సింగిల్ విండో విధానం ద్వారా వచ్చేవిధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రభు త్వం సినీ పరిశ్రమలకు అనుమతులతోపాటు, సినీ కార్మికులకు హౌసింగ్ కూడా మంజూరుచేయాలని.. ఈ సమస్యను తాను స్వయంగా ప్రభు త్వం దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. ఎన్ని సినిమాలు నిర్మాణం జరిగితే అన్ని రోజులు సినీ కార్మికులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు ఉంటాయన్నారు. ఉద్యోగులందరికీ ఈపిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా సంస్థలు చెల్లించే విధంగా కృషి చేస్తామన్నారు. 

సినిమా సంస్థలు తమ సిబ్బందిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చూసుకున్నరోజు వారు కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏ సమ యంలోనై కష్టపడి పనిచేయడానికి ముందుకి వస్తారన్నారు. అన్ని సినిమాలను ప్రజలు ఆదరించడం ద్వారా మరిన్ని కొత్త సినిమాలు రావడా నికా ఆస్కారం వుంటుందన్నారు. సినిమా సంస్థలకు కూడా పూర్తిస్థాయి నిర్మాణలు దిశగా ముందుడుగుు వేయాలన్నారు. అదేవిధంగా తెలు గు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ నగరాలు, సిటీల్లో సినిమాలు తీయడం ద్వారా స్థానిక సినీ కార్మికులకు ఉపాధి చూపించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ విషయంలో దర్శక, నిర్మాతలు కూడా మంచి మనసుతో ఆలోచించాలని కంచర్ల అచ్యుతరావు కోరారు.  అనం తరం ఫెడర్ సభ్యులు నూతన చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఫెడరేషన్ ఉద్యోగులు దుస్సాలువా, మాలతో ఘనంగా సత్కరించారు. కాగా ఈనెల 29న ఆయన ఫెడరేషన్ చైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఫెడరేషన్ యూనిట్ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సలాది గణేశ అచ్చుత రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Hyderabad

2024-08-23 08:36:13

సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ @ పాకీజా..!?

అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తింది కదా.. అందులో మరుగుదొడ్లు శుభ్రం చేసే ఒక క్యారెక్టర్ అదేనండీ టిప్పు టాపుగా డ్రెస్ వేసుకొని.. వెళ్లి మరీ మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంది ‘పాకీజా’ ఆ సీన్ ఆ సినిమాకే చాలా హైలేట్. ఇప్పటికీ మరుగుదొడ్లు కడికేవారికి, ఇంట్లో పనులు చేసేవారినీ ‘పాకీజా’ అనే సింబాలిక్ గా పిలుస్తారు.. అయినా ఈరోజు-ఈఎన్ఎస్  వాళ్లకి ఇదెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఆ సినిమాకి పాకీజా క్యారెక్టర్ ఎంత ఫ్యామస్ అయ్యారో.. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కుడా అంతే ఫ్యామస్ కాబోతున్నారు. కాకపోతే ఆ సినిమాలో పాకీజా దొడ్లు కడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఎడ్యుకేషన్ అండ్ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు మరుగుదొడ్లకు వారంలో రెండు రోజులు ఫోటోలు తీసి ఓ కొత్త తరహా పాకీజీలా ఫ్యామస్ కాబోతున్నారు.   గ్రామ, వార్డు సచివాలయశాఖలో మార్పు కోరుకున్న ఉద్యోగులకు ‘మహా కంపు’ అదనపు బాధ్యతలు వచ్చి చేరాయి. అదేనండీ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఎలా ఉన్నాయో సచివాలయ ఉద్యోగులే పర్యవేక్షించాలి. అంతేకాదండోయ్.. వాటిని చక్కగా ఫోటోలు తీసి ప్రభుత్వ యాప్ లో అప్లోడ్ కూడా చేయాలి. ఈ కంపు భాద్యతను సచివాలయాల్లో ఎడ్యుకేషన్ అండ్ వార్డు వెల్ఫేర్ కార్యదర్శిలు చేయాలని.. వారంలో రెండు రోజులు సోమ, గురువారాల్లో మరుగుదొడ్లను పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంద రాష్ట్ర ప్రభుత్వం. 


ఒకప్పుడు ఈ బాధ్యత పాఠశాలల్లో పాఠాలు చెప్పే గురువులకు ఉందేది. ఇపుడు దానిని సచివాలయాల్లో విధులు లేక ఖాళీగా ఉన్నట్టుగా భావించిన ప్రభుత్వం సంక్షేమ కార్యదర్శిలకు మళ్లించేసింది. సంక్షేమ పథకాలకు ప్రజలను గుర్తించి ఎంపిక చేసే వీరే ఇపుడు వారంలో రెండు రోజులు ఈ పాకీజీ పనులు చేయాలన్నమాట. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన, చేయాల్సిన పనులు సకాలంలో చేస్తే.. ఎలాంటి విధులు అప్పగించినా ఉద్యోగులు చేయడానికి సిద్దంగానే ఉంటారు. ఒక వేళ చేయకపోయినా బెదిరించి..అదిరించి మరీ పనిచేయించే పరిపాలన సౌలభ్యం కూడా ప్రభుత్వం వద్దనే వుంటుంది. గురువు గౌరవం పోకూడదని వాళ్లు చేసే పని సచివాలయ ఉద్యోగులకు అదనంగా మళ్లించిన ప్రభుత్వం.. వాస్తవానికి వీరికి చేయాల్సిన న్యాయపరమైనా, ప్రభుత్వ విధానంలోని ప్రయోజనాలను మాత్రం రాష్ట్రప్రభుత్వం చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై ఐదేళ్లు దాటిపోతున్నా..నేటికీ ఎడ్యుకేషన్ అండ్ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు సర్వీసు నిబంధనలు, పదోన్నతుల దారి చూపించలేదు ప్రభుత్వం. ఇంకతీ వీరంతా ఏ ప్రభుత్వశాఖ పరిధిలోకి వస్తారో కనీసం ఆశాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానలైనా అమలు చేయాలేదు. పైగా వీరి సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను కూడా నేటికీ ఇవ్వలేదు. పీఆర్సీ ప్రయోజనాలు కూడా వీరికి ప్రభుత్వం వర్తింపచేయలేదు. వాటి విషయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం ఇపుడు ఒకేసారి సచివాలయ ఉద్యోగులను పాకీజీ పనులు చేయాలని మాత్రం ఉత్తర్వులు జారీచేసేసింది. అదేమంటే..ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. ప్రభుత్వానికి ఆర్ధిక భారమైన పనులు ప్రభుత్వం చేయలేదు. కానీ ప్రభుత్వానికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విధులు మాత్రం ప్రభుత్వం మార్చేస్తుందన్నట్టుగా సచివాయ ఉద్యోగులకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించేసింది. 

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైంది.. వారి హయాంలోనే సచివాలయ ఉద్యోగులను అదిరించి, బెదిరించి.. ఒక్కోసారి పంచాయతీ కార్యదర్శిలు, ఎంపీడీఓలు, జిల్లా కలెక్టర్లతో వీరిపైకి పంపి మరీ బెత్తం పట్టుకొని పనిచేయించారు. అంతేకాదండోయ్ ఒక్కోసారి మీ ఉద్యోగాలు మేము ఎప్పుడు తీసేయాలనుకున్నా.. తొలగించాలనుకున్నా తీసేయడానికి సిద్దంగా ఉన్నామని.. దానికి గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత లేదని, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా మీకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా లేవని.. తాము ఏం చేయడానికైనా అవకాశాలున్నాయని చెప్పి మరీ పనులు చేయించేది. దానితో గత ప్రభుత్వంలో వారికి ఒక ప్రత్యేక శాఖ ద్వారా ఉద్యోగాలు వచ్చినా.. వేధింపులు తట్టుకొని మరీ పనిచేశారు ఉద్యోగులు. అంత చేసినా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్  9నెలలు అదనంగా కేవలం రూ.15 వేలకే కరోనా సమయంలో కూడా సెలవులు ఇవ్వకుండా కూడా పనిచేయించింది గత ప్రభుత్వం. కనీసం ఇంతలా పనిచేయించిన గత ప్రభుత్వం వీరికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలనైనా ఇచ్చిందా అంటే అదీలేదు. దానితో ప్రజలతోపాటు ఉద్యోగులు కూడా మార్పు కోరుకొని 2024 ఎన్నికల్లో కసిగా ఓట్లేశారు. ప్రభుత్వం మారింది. కనీసం ప్రభుత్వం మారిన తరువాతనైనా మంచిరోజులు వస్తాయనుకుంటే.. మరీ దారుణంగా ఇలాంటి కంపు విధులు అదనంగా వచ్చి చేరుతాయని కలలో కూడా ఊహించలేదని గగ్గోలు పెడుతున్నారు సచివాలయ ఉద్యోగులు. కేవలం రెగ్యులర్ జాబ్ అనే ఒకే ఒక్కకారణంతో పనిచేస్తున్న తమకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగుతుందనే నమ్మకం సన్నగిల్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అసెంబ్లీ రౌడీ సినిమాలో లాగా వారానికి రెండు రోజులు టిప్పు టాపుగా తయారై మరుగుదొడ్ల పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. ఇలాంటి పనులకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం తమకు చేయాల్సిన మేలుపై మాత్రం ఎంతుకు ఎందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయడం లేదని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చాలా సచివాలయాల్లో ఉద్యోగులు వారి విధులు పూర్తయిన తరువాత కాస్త సమయంల ఖాళీగానే ఉంటున్నారని భావించిన గత ప్రభుత్వం.. సిఎంఎస్ సర్వీసులన్నీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రజలకు అందించాలని భావించింది. దానికోసం ఒక్కో సచివాలయానికి సుమారు ఐదు కంప్యూటర్లను కేటాయించి అన్ని రకాల అనుమతులూ ఇక్కడి నుంచే ఇవ్వాలని కూడా ఆలోచన చేసింది. అనూహ్యంగా వైఎస్సార్సీపీ అధికారం కోల్పోవడంతో గ్రామ, వార్డు సచివాలయశాఖలో మార్పులు వచ్చేస్తున్నాయని ఇపుడు ఉద్యోగులు గొల్లుమంటున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి నియమితులమైన మేము మరుగుదొడ్ల పర్యవేక్షణ చేయాలా అంటూ మండిపడుతున్నారు. పోనీ ప్రభుత్వం ఆదేశించినపుడు చేయక చస్తామా అనుకున్నా.. తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలోన ప్రభుత్వం నోరు మెదకపోవడం, నేటికీ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం, ఇన్నిసార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. తమ సచివాలయ ఉద్యోగుల కోసం పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు ఉద్యోగులు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు సేవలు అందిస్తే.. అధికారం మారగనే కూటమి ప్రభుత్వం పూర్తిగా సచివాలయశాఖలో సమూల మార్పులు తీసుకు రావాలని యోచిస్తున్నది. పాకీజీ నుంచి మొదలైన అదనపు బాధ్యతలు ఈశాఖ ఉద్యోగులకు ఇతర శాఖల విధులు అదనంగా ఎన్ని వచ్చి చేరతాయో వేచి చూడాలి. సేవలను అదనంగా పొడిగించేస్తున్న ప్రభుత్వం వీరికి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, కోల్పోయిన పేస్కేలు, పీర్సీ ప్రయోజనాల విషయంలోనూ అంతే అదనంగా పనిచేస్తుందా.. లేదా అనేది ప్రస్తుతానికి కైతే ప్రశ్నగానే మిగిలి పోయింది.. దానికి జవాబులు వస్తాయా..లేదా అని ముందు ముందు చూడాల్సి వుంది..!

visakhapatanm

2024-08-20 18:56:50

ఇక నామినేటెడ్ పంచాయతీ..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈసారి త్వరగానే నామినేటెడ్ పోస్టులను క్యాడర్ కట్టబెట్టేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. గతంలో అధికారంలో ఉన్నపుడు ఆఖరి దశలో నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో క్యాడర్ పూర్తిగా పనిచేయలేకపోయారు. ఆ పరిస్థితి మళ్లీ రాకుండా ఈసారి వెంటనే పోస్టులు ఇవ్వడం ద్వారా కూటమి అధికారంలోకి రావడానికి శ్రమించిన నేతలకు, క్యాడర్ కి సముచిత స్థానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు యోచన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో చాలా మంది సీనియర్లు ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవా ల్సి వచ్చింది. అలా సీట్లు కోల్పోయిన వారు.. జిల్లాల్లో క్యాడర్ ను ఒక తాటిపైకి తెచ్చిన పార్టీ కోసం పనిచేసిన వారిని పార్టీ గుర్తించే పనిలో ప డింది. ప్రధాన కార్పోరేషన్లలో చైర్మన్ పదువులు, దేవస్థానాల్లో చైర్మన్ పదవులు మూడు పార్టీలకు థామాషా పద్దతిలో ఇస్తే కలిసికట్టుగా పనిచే యడానికి బావుంటుందని కూడా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసినా.. వారికి వచ్చిన ఇట్టు తక్కువగానే ఇచ్చారు.

 కనీసం నామినేటెడ్ పదవుల్లో నైనా అగ్రభాగం ఇవ్వకపోతే పొరపొచ్చాలు వచ్చే అవకాశాలున్నాయని.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యమైన కార్పోరేషన్లు, సంస్థలను ఇప్పటికే జాబితా తయారు చేసిన సీఎం చంద్రబాబు ఆగస్టు 15 తరువాత పదువులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో మైనార్టీలకు ముఖ్యమైన పదవులు దక్కలేదు. దీనితో వారికి పెద్ద కార్పోరేషన్లు ఇస్తే బాగుంటుందని కూడా పార్టీలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఇప్పటికే చంద్రబాబు ముందు ఉంచారట. గతంలో పోస్టులు ఇచ్చినా వారికి  అతి తక్కు వ పదవీకాలం మాత్రమే పనిచేయడంతో క్యాడర్ లో కూడా నిరాశ, నిస్ప్రుహలు ఉన్నాయి. జిల్లాల్లోని సంస్థలు వాటి స్థితిగతులను బేరీజు వేస్తున్న ప్రభుత్వం ఏ సంస్థకు, ఏ కార్పోరేషన్ కు ఎవరు సూటవుతారో కూడా జిల్లాల వారగా సమీక్షలు జరిపిన అనంతరం పదవులు పంచే అవకాశాలున్నాయి. కాగా ఇప్పటికే అధిష్టానం వద్ద ప్రాధమిక జాబితా సిద్దమైనందని చెబుతున్నారు. పంద్రాగస్టు హడావిడి పూర్తయిన తరు వాత నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ చేసి వాటిని క్యాడర్ కు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. దానితో పాటు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, పొలిట్ బ్యూరో, మండల కమిటీలు ఇలా అన్నింటినీ కొత్తవాటిని ఏర్పాటు చేస్తే పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లి పనిచేయడానికి బావుంటుందని ఇటీవల మంత్రుల సమావేశంలో చర్చించారని సమాచారం. 

వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇచ్చే నామినేటెడ్ పదవులు కాస్త హుందాగా, కనీస గౌరవ వేతనంతో ఇస్తే పార్టీ క్యాడర్ ని కూడా గుర్తించినట్టు వుంటుందని మంత్రుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలిసింది. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పచ్చజెండా ఊపడంతో త్వరలోనే నామినేటెడ్ పదవులు కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలకు దక్కే అశకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలకు ఒక స్థాయి నాయకులు, కార్పోరేషన్లకు ఒక క్యాడర్ ను, దేవస్థానాల చైర్మన్లకు ఒక క్యాడర్, ఇక జిల్లాల్లో చిన్నా చితకా కార్పోరేషన్లకు జిల్లా నాయకత్వంలోని ప్రధాన భూమిక వహించే వారిని ఎంపిక చేసి పదువలు ఇస్తే రెండున్నరేళ్లు ఒకరికి, మరో రెండున్నరేళ్లు మరొకరికి ఇవ్వడం ద్వారా మూడు పార్టీల్లోని అన్ని వర్గాల నాయకులకు సముచి స్థానం ఇచ్చినట్టు అవుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. అయితే ఎవరిని రెండున్నరేళ్లు ఉంచుతారు. మరెవరిని ఐదేళ్ల వరకూ కొనసాగిస్తారనే విషయం పదవులు పంపకాలు జరిగి ప్రభుత్వ ఉత్తర్వులు వస్తేగానీ తెలిసే పరిస్థితి లేదు. అనుకున్నట్టు జరిగితే ఈ నెల 15 దాటిన తరువాత కార్యాచరణ మొదలు పెట్టి వచ్చే నెలలో పదవులు ఇచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. చూడాలి కూటమి ప్రభుత్వంలో ప్రధాన సంస్థలు, కార్పోరేషన్లలోని నామినేటెడ్ పదవులు ఎవరెవరిని వరిస్తాయనేది..

visakhapatnam

2024-08-13 04:27:04

గ్రామ, వార్డు సచివాలయశాఖలో భారీ మార్పులు..!

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు, వారి సమస్యలు, సర్వీసు నిబంధనలు, పదోన్నతుల వ్యవహారంపై గ ప్రభుత్వం చేసిన తప్పిదా లపై ఈఎన్ఎస్-ఈరోజు వరుస కథనాలపై ప్రచురించడంతో ప్రభుత్వం స్పందించింది.  ఈ శాఖలోని భారీ మార్పులు చేపట్టి ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. అందునా పంచాయతీరాజ్ శాఖలోని భారీగా పంచాయతీ కార్యదర్శిల ఉద్యోగ విరమణలు కూడా ఉండటంతో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ తీసి ఉద్యోగులను భర్తీచేసే పనిలేకుండా ప్రస్తుతం సచివాలయ శాఖలో ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలనే పంచాయతీరాజ్ శాఖలో స్లైడింగ్ ఇచ్చి ఖాళీలను భర్తీచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తు న్నది. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి రెండు నుంచి నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తద్వారా పంచాయ తీల్లో ప్రభుత్వ సేలు సక్రమంగా అందడం లేదు. ఇదే సమయంలో చాలా సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలకు పూర్తిస్థాయిలో పనిలే కుం డా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. కాకపో ఇక్కడ శాఖాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వాటిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఉన్నవారిని పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వశాఖలు మార్చినా వారికి కల్పించాల్సిన ప్రయోజనాలు, బాకీ పడ్డ నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ బకాయిలపై క్లారిటీ కూడా ఇవ్వాల్సి వుంటుంది. అటు మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్ల విషయంలోనూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.

 రాష్ట్రం లోని 660 మండలాల్లోని 13 వేల 325 గ్రామ పంచాయతీలు ఉండగా 14 వేల 989 కార్యదర్శిలు పనిచేస్తున్నారు. ఇక  26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల పరిధిలో... మొత్తంగా సుమారు 1.28 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో పంచాయతీ కార్యదర్శిలకు సర్పంచ్ లతోపాటుగా  ప్రభుత్వం శిక్షణ శిక్షణ కూడా ఇవ్వడానికి ఆదేశాలు జారీచేసింది. ఇదే క్రమంలో ఒక్కో జిల్లాల్లో ఎంతమంది పంచాయతీ కార్యదర్శిలు అదనంగా పంచాయతీల్లో పనిచేస్తున్నారో కూడా లెక్కలు వేసింది. చాలా చోట్ల ఖాళీలు, కొన్ని చోట్ల అధనంగా పనిచేస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో ముగ్గురు గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు సచివాలయాల్లో ఉ న్నారని.. ఒకే పంచాయతీలో ముగ్గురిని ఉంచే కంటే.. ఖాళీగా ఉన్న అన్ని పంచాయతీల్లోనూ కార్యదర్శిలను భర్తీచేయడం ద్వారా అద నం గా విధులు నిర్వహించే పని ఉండదని యోచన చేసింది. దానికోసం ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాశాఖలో ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యద ర్శిలను పంచాయతీరాజ్ లోకి మార్చి కార్యదర్శిలందరికీ పంచాయతీలను అప్పగించనున్నారు.  ప్రస్తుతం డిజిటల్ అస్టేంట్ గా ఉన్న గ్రేడ్- 6 పంచాయతీ కార్యదర్శిలతో ఇతర సిబ్బందితో పాటు 8 మంది సిబ్బంది సచివాలయాల్లో ఉండే విధంగా మార్పులు చేయబోతున్నారు. 

గత ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని జీఓలు జారీచేసినా  అది కార్యరూపం దాల్చలేదు. దానికితోడు ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేయడంతో ఆ సమయం కాస్త కూటమి ప్రభుత్వం వచ్చేసరికి పూర్తయిపోయి.. ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగ విరమణలు చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు తీయాలంటే ప్రస్తుత రాష్ట్రప్రభుత్వ ఖజానా ప్రకారం జరిగే పని కానందున ఉన్న ఉద్యోగులనే ప్రత్యేక ఉత్త ర్వులు, విధి విధానాలు రూపొందించి స్లైడింగ్ ద్వారా పంచాయతీల్లో నియమిస్తే పైసా ఖర్చు లేకుండా పని పూర్తయిపోతుందని ప్రభు త్వం భావిస్తున్నది. ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఎలాగూ పదోన్నతులు ఇచ్చే సమయం ఆశన్నమైంది. పనిలోపనిగా పదోన్నతులు కల్పించి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా మార్చి వారందరినీ ఖాళీలు ఉన్న పంచాయతీల్లోకి సర్ధుబాటు చేయనున్నారు. అయితే సచివాల యశాఖలో ఉన్నప్పుడు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు వీరికి గత ప్రభుత్వం ఇవ్వలేదు. పీఆర్సీ ప్రయోజనాలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుం మళ్లీ వీరికి పదోన్నతి కల్పిస్తే మరో రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది..? అలా మొత్తం ఇంక్రిమెంట్లు ఇస్తుందా..? లేదంటే ఉన్నవారిని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా పంచాయతీరాజ్ శాఖలోకి మార్చేస్తుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక మిగిలిన ఉద్యోగుల్లో డిజిటల్ అసిస్టెంట్ కం గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీష్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీఆర్వో, సర్వేయర్, మహిళా పోసులను ప్రతీ సచివాలయానికి ఉండేవిధంగా మార్పులు చేయబోతున్నారట. అయితే ఇక్కడ ప్రస్తుతం మహిళా పోలీసుల ఉద్యోగాలపై కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో వీరిని ఇదే పోస్టులో ఉంచాలా..? లేదంటే క్వాలిఫికేషన్ ఆధారంగా వేరే ఉద్యోగాలకు స్లైడింగ్ ఇచ్చి పంపించేయాలా అనే కోణంలో ప్రభుత్వం ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. సచివాలయశాఖలోనే మిగులు ఉద్యోగాల భర్తీ వీరి క్వాలిఫికేషన్లు, పేస్కేలు ఆధారంగా చేపడితే ఎలా వుంటుందనే విషయంలో కూడా ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే కోర్టులో మహిళా పోలీసుల విషయంలో పెండింగ్ లో ఉన్న కేసులకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసే పనుండదు.

ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ప్రభుత్వ సౌలభ్యం కోసం వారిని పంచాయతీరాజ్ లోకి మార్పు చేసినా.. వారికి సదరు ప్రభుత్వ శాఖ సర్వీసు నిబంధలు, పేస్కేలు, ప్రమోషన్ ఛానల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాల్సి వుంటుంది. అదే జరిగి మిగిలిన సచివాలయ ఉద్యో గులు తీవ్రంగా నష్టపోతారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఒకేసారి సచివాలయ ఉద్యోగులు నియామకాలు జరిగినా ఒకటి రెండు శాఖల్లోని కొద్ది మందికి మాత్రమే పదోన్నతులు కల్పించారు. అప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. ఎందుకంటే గ్రామ, వార్డు సచివాల యశాఖ ఏర్పాటై సుమారు ఐదేళ్లు దాటిపోతున్నా..నేటికి చాలా శాఖల సిబ్బంది సర్వీసు నిబంధనలు గానీ, ప్రమోషన్ ఛానల్ గానీ లేదు. తద్వారా ఉద్యోగులు జీవితాంతం ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఇదే శాఖలో ఉద్యోగులుగా పనిచేసి..ఇక్కడే ఉద్యోగ విరమణలు కూడా చేయాలి. ప్రభుత్వం ఒకటి రెండు ప్రభుత్వశాఖల కోసం తప్పితే మొత్తం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ఆలోచన చేయడం లేదు. అలాగని ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను వారి మాతృశాఖలకు అటాచ్ చేసినా వీరికి పెద్ద మొత్తంలో ప్రయోజనాలు కల్పించాల్సి వుంటుంది. అదంతా ప్రభుత్వానికి ఆర్ధిక భారం కావడంతో గత ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులను, వారి సర్వీసు నిబంధనలు, పదోన్నతులు పట్టించుకోకుండా గాల్లో ఉంచేసింది. ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను పంచాయతీరాజ్ లోకి మార్పుచేయాలని చూస్తున్న విధానంపైనా పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. చూడాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, చర్యలు ఏవిధంగా ఉండబోతున్నాయనేది.

visakhapatnam

2024-08-09 02:24:44

ఏపీలో 26 జిల్లాలు 13 అయ్యాయి..?!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి ఒక తేడా న్యూస్..గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలు అయితే..కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ 26 జిల్లాలు 13 జిల్లాలు అయిపోయాయి. కావాలంటే సమాచార పౌరసంబంధాలశాఖ అధికారిక వెబ్ సైట్ చూడండి. పనిచేయని ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు, కేవలం 13 జిల్లాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఇది మీడియాతో పాటు ప్రజలు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం కాదా..? మళ్లీ ఏమైనా అంటే మాత్రం ఈ శాఖలోని అటెండరు దగ్గర నుంచి ఆర్జేడీ, అడిషనల్ కమిషనర్ వరకూ మనిషికి వచ్చినంత కోపాలు వచ్చేస్తాయ్.. ఆపై తెగ ఫీలైపోతారు. అదేంటి రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రజలకు మీడియాకి అందించే సమాచారశాఖ తప్పుచేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు.. ఆ అనుమానమే మీడియాకి వచ్చి సదరు సమాచారశాఖ వెబ్ సైన్ ని ఓపెన్ చేస్తే.. అక్కడున్నవి పాత ఉమ్మడి 13 జిల్లాలు మాత్రమే అంటే. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 13 జిల్లాలు అయిపోయినట్టా.. కాదా..? అదేమంటే ఈ వెబ్ సైట్ ని అసలు మీడియా తరచుగా చూస్తుందా..? లేదా..? అని టెస్టింగ్ చేస్తున్నామని తేడాగా సమాధానం ఇస్తున్నారు ఇక్కడి అధికారులు. 

గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు గెజిట్ విడుదల చేసి మరీ 26 జిల్లాలుగా మార్చారు. రాష్ట్రంలో అయితే జిల్లాలు మార్చారు తప్పితే ఇంకా ఈ కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం రాలేదు. రాష్ట్రపతి ఆమోదం వస్తే తప్పా కేంద్రంలో కూడా ఇంకా ఉమ్మడి 13 జిల్లాల క్రిందే లెక్క. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఈ విషయం అటుంచితే.. విచిత్రంగా సమాచార పౌర సంబంధాల శాఖను కూడా గత ప్రభుత్వం విభజన చేసి కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్తజిల్లాల్లో జిల్లా కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ విషయాన్ని మీడియాకి ఇదే ప్రభుత్వశాఖ సమచారం కూడా అందించింది. మరి కూటమి ప్రభుత్వం రాగానే ఇదే శాఖకు బహుసా 26 జిల్లాలను మళ్లీ 13 జిల్లాలుగా మార్చేస్తున్నామని సమాచారం ఇచ్చిందో.. లేదంటే అంతా మా ఇష్టం.. మా తేడా తనాన్ని ఏ విధంగానైనా బయటపెట్టి అటు ప్రభుత్వాన్ని, మీడియాని తప్పుదారి పట్టించి ప్రజలను అయోమయంలోకి నెట్టేయడానికి ఇలా చేసిందో అర్ధం కాని పరిస్థితి. 

అందులోనూ.. సమాచాపౌర సంబంధాలశాఖ అధికారిక వెబ్ సైట్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వెబ్ సైట్ నిర్మాణంలో ఉందని సమాచారం స్క్రోలింగ్ రూపంలో పెట్టినా... రాష్ట్రప్రభుత్వ సమాచారాన్ని కేవలం చూడటానికి మాత్రమే వీలుండేలా సీఎంఓ నుంచి కొన్ని ప్రెస్ నోట్లను ఇందులో అప్లోడ్ చేస్తున్నారు. కానీ అవి చూడటానికి మాత్రమే పనిచేస్తాయి. వాటిని మీడియా డౌన్ లోడ్ చేసుకోవడానికి గానీ, పత్రికల్లో వార్తలుగా వినియోగిండానికి గానీ వీలుపడవు. అన్నీ పీడిఎఫ్ రూపంలోనే అప్లోడ్ చేస్తున్నారు. గతంలో ఇదే సమాచారశాఖకు చెందిన వెబ్ సైట్ రాష్ట్ర సచివాలయం, సీఎంఓ ఇతర 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని, జీఓలను, ఇతర అన్ని అంశాలను ప్రెస్ నోట్లుగా రన్నింగ్ టెక్స్ట్ ను పొందు పరిచేవారు. ఇపుడు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెందిన ఒకటి అరా సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తున్నారు. దీనితో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన ఈ వెబ్ సైట్ ఎవరు చూసినా అందులో కనిపించే 13 జిల్లాలను చూసి అవాక్కవుతున్నారు. ఏంటి 26 జిల్లాలు కాస్తా 13 జిల్లాలు అయిపోయాయంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అటు మీడియా కూడా సమాచారశాఖ అన్ని వర్గాలను తప్పుదోవ పట్టించడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సమాచారశాఖ అధికారిక వెబ్ సైట్ మార్పులు, చేర్పుల దశలో ఉండటంతో కొత్తగా ప్రెస్ అక్రిడిటేషన్ ఆన్ లైన్ చేసుకోవాడినికి, ప్రెస్ లో మానేసిన జర్నలిస్టులు వారి ప్రెస్ అక్రిడిటేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి, కొత్త మీడియా సంస్థలు, పత్రికలు, టివిఛానల్స్, సిటీకేబుల్స్, న్యూస్ ఏజెన్సీలును ఆన్ లైన్ చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది.  ఇదిలాఉండగా, ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించిన గడువును పొడిగించింది. హెల్త్ కార్డు పొందాలంటే ప్రెస్ అక్రిడిటేషన్ కు దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవాల్సి వుంది. కానీ ప్రస్తుతం సమాచారశాఖ వెబ్ సైట్ లో అక్రిడిటేషన్ ఆన్ లైన్ చేసుకునే సదుపాయం అందుబాటులో లేదు. అంతేకాకుండా జర్నలిస్టుల లాగిన్ కూడా సర్వర్ సమస్య తలెత్తింది. దీనితో చాలా సంస్థల పేర్లు సమాచారశాఖ వెబ్ సైట్ లో ఆన్ లైన్ కి నోచుకోకుండా పోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచారశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా.. మీడియా సంస్థలు, జర్నలిస్టులు చేసు ఫోన్లు ఆన్సర్ చేయలేనంత బిజీగా జిల్లాల్లోని డిపీఆర్వోల దగ్గర నుంచి రాష్ట్రంలోని సమాచారశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని అధికారుల వరకూ అంతా బిజీ అయిపోయారు. 

సమాచారశాఖ అధికారిక వెబ్ సైట్ లో రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించిన సమాచారం 26 జిల్లాలకు బదులు 13 జిల్లాలే చూపిస్తుందని, ముఖ్యమైన మెనూలు వెబ్ సైట్ లో పనిచేయడం లేదనే సమాచారం తెలియజేయడానికి కూడా అధికారులు అందుబాటులో ఉండటం లేదు. అలాగని అధికారిక ఈమెయిల్ కి సమాచారం పంపినా.. అవి కూడా ఇన్ బాక్స్ పూర్తిగా నిండిపోవడం వలన మెయిల్స్ కూడా సమాచాశాఖ కార్యాలయానికి చేరుకోవడం లేదు. వెబ్ సైట్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్లు, ఫ్యాక్స్ నెంబర్లు కూడా  ట్రై చేసినా.. ఈ నెంబర్లు మనుగడలో లేవనే సమాధానం మాత్రమే వస్తున్నది. సమాచారశాఖ అధికారిక వెబ్ సైట్, రాష్ట్ర కార్యాలయాల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో వాటిని పరిశీలిన చేస్తేనే అర్ధం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారిక సమాచారం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే సమాచారశాఖ ప్రజలను, ప్రభుత్వాన్ని అలాగే మీడియాని తప్పుదారి పట్టించకుండా ఉండేలా... చాలా ఏళ్లకు ఈశాఖకు నియమితులైన ఐఏఎస్ హిమాంశు శుక్లా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. చూడాలి.. కూటమి ప్రభుత్వంలోనైనా సమాచార పౌరసంబంధాలశాఖలోనూ, ఇక్కడి అధికారుల్లోనూ మార్పువస్తుందో.. లేదో...?!

visakhapatnam

2024-07-30 03:49:01

ఏళ్ల తరబడి కదలరు..వదలరు-సమాచార శాఖలో ఇంతేమరి..!

సమాచార పౌర సంబంధాలశాఖ..ఈ శాఖ పనేంటో.. ఈ వార్త చదువులున్న ఉన్నతాధికారులు, జిల్లాల్లో పనిచేసే డిపీఆర్వోలో, జోన్ లలో పనిచేసే ఆర్జేడీలు, రాష్ట్ర కార్యాలయంలో ఉన్న అడిషనల్ డైరెక్టర్లు, కమిషనర్, డైరెక్టర్లకు కూడా పూర్తిగా తెలియదు. అదేంటి..? ఇన్నేళ్లుగా 75 ప్రభుత్వశాఖల్లో ఒక శాఖ ఉన్న సమాచారశాఖలో వారి ఉద్యోగాలేంటో వారికి తెలియవా.. నిజమా..? కాస్త అర్ధమయ్యేలా చెప్పండి సారూ అంటే.. ఇదిగో ఈ స్టోరీ అందుకే కదా మరి రాస్తున్నది.. ప్రెస్ అండ్ మీడియా కోసం రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈశాఖలో అటెండరు దగ్గర నుంచి కమిషనర్, డైరెక్టర్, డిపీఆర్వో, ఏపీఆర్వో, ఆర్జేడీలంతా మీడియా కోసం, మీడియా రూల్సు కోసం మాట్లాడేవారే తప్పితే. వాళ్లు మాత్రం రూల్స్ పాటించరు. అవి వీరికి వర్తించవు. మరీ గట్టిగా మాట్లాడితే సదరు పత్రిక, ఛానల్ కి ప్రభుత్వ సమాచారం(ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు, ఆహ్వానాలు) ఇవ్వరు. ఆయా గ్రూపుల్లో నుంచి ఈమెయిల్ ఐడీలు, వాట్సప్ నెంబర్లు డిలీట్ చేసేస్తారు. ఇలా చేస్తే దేశానికేమైనా నష్టమా..? వార్త రాయాలనుకున్న జర్నలిస్టు రాసేతీరతాడు, సమాచారం తెచ్చుకోవలనుకుంటే ఎలాగైనా తెచ్చుకుంటాడు జర్నలిస్టు. జర్నలిస్టుకి ఆ స్థాయి నెట్వర్క్ ఉంటుంది. కానీ ఒక్కసారి జర్నలిస్టు ఏ ప్రభుత్వశాఖపైనైనా దృష్టిపెడితే మాత్రం అక్కడ విషయాలన్నీ ఆధారాలతో  సహా బయటకు వచ్చేస్తాయి.. ఇదిగో ఇలా వార్తల రూపంలో రోజుకొకటి అచ్చైపోతాయ్. ఇంత అవసరమా మీరు అనుకోవచ్చు.. కేవలం మీడియాకోసం, ప్రెస్ కోసం, పత్రికల కోసం ఏర్పాటైన ఈ ప్రభుత్వశాఖలోని క్రిందిస్థాయి నుంచి పెద్దస్థాయి వరకూ అధికారులు మీడియాకి సర్వీసులు అందించాల్సింది పోయి యక్షప్రశ్నలు వేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది మరి.. ఇక విషయానికొచ్చేద్దాం..

ఆంధ్రప్రదేశ్ లోని సమాచార పౌర సంబంధాల శాఖలోని అధికారుల రూటే సెపరేటు. ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నప్పుడు అంతే ఇపుడు అవి 26 జిల్లాలు అయినా అంతే.. ఇడక్క డబ్బూ, పాలిష్ ఉంటే ఒకే జిల్లాలో 25 ఏళ్లుగా ఉండిపోవచ్చు. అప్పుడు నిబంధనలు కనిపించవు. అమలవవు. ఇదేశాఖలోని కమిషనర్ గానీ, డైరెక్టర్ గానీ ఇదేంటని ప్రశ్నంచరు కూడా. కానీ ఏ విషయంలోనైనా సొంత శాఖలో పనిచేసే సిబ్బంది ప్రశ్నిస్తే మాత్రం అలాంటి వారికి అదనపు విధులు అప్పగించేస్తారు. దానికి టిఏ,డీఏలు కూడా ఇవ్వరు. నిబంధనలు అమలు చేయరు. అంతేనా.. కనీసం ప్రెస్ నోటు కూడా రాయడం రానివారిని ఏపీఆర్వోగా కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ లో తీసేసుకొని నెల నెలా కూర్చోబెట్టి మరీ జీతాలు కట్టబెడతారు. ప్రభుత్వ సమాచారం, ప్రెస్ నోట్లు, ఫోటోలు కావాలని ఎవరైనా మీడియా ప్రతినిధులు అడిగితే మాత్రం వీరికి వెంటనే రూల్స్ గుర్తొచ్చేస్తాయ్.. ఖాళీలేని పనులన్నీ అప్పుడే వచ్చి పడిపోతాయ్.. ముందు వేసే ప్రశ్న ఏంటమ్మా నువ్వు అసలు జర్నలిస్టా కాదా(చూశారా ఎంత మర్యాదో.. ఈ జర్నలిస్టేదో వాళ్ల క్రింద పనిచేస్తున్నట్టు..వాళ్లే ఈ జర్నలిస్టుని పెంచి పోషించేస్తున్నట్టు ఏకవచన మాటల వాడకం, మరికొందు సిబ్బంది అయితే ఏకంగా ప్రతీవాడు జర్నలిస్టే అంటూ మొదలెట్టి కనీసం గౌరవం లేకుండా పేరుపెట్టి మరీ మాట్లాడతారు.. మళ్లీ ఆ విధంగా తిరిగి జర్నలిస్టు మాట్లాడినా.. పేరు పెట్టి పిలిచినా వీళ్లకి మనిషికి వచ్చినంత కోసం వచ్చేస్తుంది. గౌరవం అంటే ఎలా వస్తుందో తెలియని తేడా అధికారులు, సిబ్బందికి మాత్రమే)..? మీడియాకి సంబంధించిన డిపార్ట్ మెంట్ లోని అధికారులతో జర్నలిస్టులు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు.? ఏదైనా ప్రభుత్వ నిబంధన ప్రకారం అడిగితే మీరు అలా మాట్లాడితే ఏ సమాచారం రాదు.. ఇవ్వరు.. ఇవ్వనివ్వం అని ఖరాకండీగా చెప్పేస్తారు..ఈ ప్రభుత్వ శాఖ మొత్తం వీరయ్య జాగిరులా. అసలు అడిగిన సమాచారం ఇవ్వను అని చెప్పడానికి ఏ నిబంధన వర్తిస్తుంది.. ఏ రూలు చెబుతుంది.. సమాచారశాఖలో ఎవరు దీనికి లిఖత పూర్వక ఆదేశాలిచ్చారు.. 

ఇక్కడితో ఒకసారి ఆగి మళ్లీ అసలు విషయానికి వద్దాం.. సమాచారశాఖలో ప్రోటోకాల్ అస్సలు పాటించరు అనడానికి ఇక్కడ ఉన్నతాధికారులు కమిషనర్/డైరెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు చేసే నిర్వాకమే ఒక ఉదాహరణ. విశాఖజిల్లా అంటే ఎంతో మంది ప్రముఖులు వచ్చే మహానగరం. ఇలాంటి జిల్లాలో సమాచారశాఖలోని సిబ్బంది కొరత అని చెప్పి పార్వతీపురం ప్రాంతం నుంచి ఒక డివిజనల్ పీఆర్వోని తీసుకొచ్చిన అధికారులు.. ఇక్కడ పనిచేసే ఏపీఆర్వోని మాత్రం.. డివిజనల్ పీఆర్వో పనిచేయాల్సిన అనకాపల్లి జిల్లాకి పంపేశారు. ఇదేమంటే మేము చేసిందే రూల్.. మేమిచెప్పిందే చేయాలని అంటున్నారు. జిల్లా కేంద్రంలో డిపిఆర్వో ప్రధాన జిల్లా సమాచార అధికారిగానూ, అదనపు సమాచార అధికారిగా డివిజనల్ పీఆర్వో ఉంటారు. డిపీఆర్వో లేకపోతే ఆ ప్రాంతానికి డివిజనల్ పీఆర్వోని పంపాలి. అది ఈశాఖలో నిబంధన. మరలాగైతే ఏ నిబంధనతో డివిజనల్ పీఆర్వోని విశాఖలో ఉంచి.. ఏపీఆర్వోని ఓడి డ్యూటీ క్రింద అనకాపల్లి పంపించారో..దానికి ఇటీవలే ఈ శాఖకు డైరెక్టరుగా నియమితులైన హిమాంశు శుక్లా పర్యవేక్షణలో పనిచేస్తున్న ఆర్జేడీలు సమాధానం చెప్పాల్సి వుంది. అంటే నిబంధనలు వీరికి పట్టవనే డివిజనల్ పీఆర్వో పనిచేయాల్సిన చోటకి ఏపీఆర్వోని  పంపేశారని క్లియర్ గా అర్ధమైపోతుంది. అంతేకాదు జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ అధికారి హోదాలో ఉన్నవారి కొత్తజిల్లాల్లో డిఐపిఆర్వోలుగా కూడా నియమించేశారు. వారికి ప్రభుత్వ సమాచారం మీడియాకి ప్రెస్ నోటు రూపంలో తయారుచేసి పంపించాలంటే ఆ.. అంటే ఈ రాదు. అలాంటి వారిని డిఐపీఆర్వోలుగా నియమించేసి.. డిపీఆర్వో పోస్టులు ఖాళీలు లేవన్నట్టుగా కాగితాలపై ప్రభుత్వానికి చూపించేశారు. పని రానివారిని జిల్లా అధికారులుగా నియమిస్తే.. ఉపయోగం ఏంటి..? సాంతిక విభాగంలో అధికారులుగా పనిచేసిన వారు డిపీఆర్వో, డివిజనల్ పీఆర్వో, ఏపీఆర్వోలుగా ఎలా పనిచేస్తారో వీరిని నియమించిన రాష్ట్ర అధికారులకే తెలియాలి.. ఇక్కడ కూడా నిబంధనలు పట్టకుండానే చేశారనేది తేట తెల్లం అయిపోయింది.

ఇక ఏళ్ల తరబడి ఒకే జిల్లాలో ఉండిపోయిన సిబ్బంది, అధికారులు సమాచారశాఖలో చాలా మందే ఉన్నారు. ఇక్కడ వారి వారి సామాజిక వర్గాలు, కక్షలు, కార్ఫణ్యాలు, కావాలని చేసిన నియామకాలు, పదోన్నతులు కల్పించకుండా అదనంగా చేసిన నియామకాలే కనిపిస్తాయి. అంతెందుకు డిపిఆర్వో నుంచి ఆర్జేడీగా పదోన్నతి లభించి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కార్యాలయానికి బదిలీపై వెళ్లినా పాత జిల్లాల పరిధిలోని జోన్ లో మళ్లీ ఆర్జేడీలుగా నియమితులైన అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వారికి నిబంధనలు ఏ విధంగా వర్తిస్తాయి. అలాంటి వారిలో ఏసీబీ కేసులు ఎదుర్కొన్నవారు, శాఖాపరమైన కేసుల విచారణలు జరగకుండా పక్కన పెట్టించుకున్నవారు కూడా ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ ఏ నిబంధనతో సమాచార పౌర సంబంధాలశాఖలోని ఉన్నతాదికారులు వెలగబెట్టారో.. వారికి ప్రత్యేకంగా కమిషనర్ లేదా డైరెక్టర్ ఎలాంటి అనుమతులు ఇచ్చారో ఇక్కడి ముఖ్యఅధికారే చెప్పాల్సి వుంది. సమాచాశాఖ అధికారులు మీడియాకి సమాచారం ఇచ్చే విషయంలోనూ, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రెస్ అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలోనూ గుర్తొచ్చే నిబంధనలు మరి వారి విధి నిర్వహణ విషయంలోనూ.. తేడాగా చేసిన పనుల విషయంలో ఎందుకు గుర్తుకి రాలేదూ మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. అలాంటి తేడా పనులు, తెరచాటు వ్యవహారాలను బహిర్గతం చేయడానికి రంగంలోకి దిగారు సమాచార హక్కుచట్టం దరఖాస్తు దారులు. వారు అడిగిన సమాచారానికి ఇపుడు ఇదే సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయం, జిల్లా కార్యాలయాలు అన్నీ మల్ల గుల్లాలు పడుతున్నారు. మాట్లాడితే నిబంధనలు, రూల్స్, రెగ్యులైజేషన్స్ అంటూ తెగ బీరాలు పోయే ఇక్కడి అధికారులు ఏళ్లతరబడి పాతుకుపోయిన ఉద్యోగులు, అధికారులు ఏ నిబంధనలతో ఉండిపోయారో సమాచారహక్కుచట్టం దరఖాస్తులో అడిగిన సమాచారంలో ఈశాఖ ఇవ్వాల్సి ఉంది. అసలు ఏ ఏ అంశాలపై సమాచార హక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. వీరు అతిక్రమించిన నిబంధనలేంటి.. మీడియాకి పెట్టని ఖర్చులు పెట్టినట్టు చూపించిన చిట్టాలేంటి.. తదితర అంశాలను రేపటి ప్రత్యేకధనంలో తెలుసుకుందాం.. తవ్వేకొద్దీ వస్తుంటాయి సమాచార పౌర సంబంధాలశాఖలోని చాలా కీలకమైన విషయాలు. 

Visakhapatnam

2024-07-24 18:13:29

సమాచారశాఖ వెబ్ సైట్ లోనూ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, సమాచారం మొత్తం అన్ని వర్గాల మీడియాకి అందించేస్తే ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకి తెలిసిపోతాయ్.. ప్రభుత్వంలోని సీఎంకి, ఇతర మంత్రులకు మంచి పేరు వచ్చేస్తుంది.. అలాకాకుండా గత ప్రభుత్వంలో మాదిరిగా చిన్న, మధ్య తరహా పత్రికలను తొక్కిపెడితే కేవలం కొన్ని పత్రికలు, ఛానళ్ల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే.. ఏదో అరాకొరా మాత్రమే తెలుస్తుంది. అలా చేస్తే ప్రభుత్వం చేసే మంచి కూడా అన్ని స్థానిక జిల్లా పత్రికల ద్వారా కూడా ప్రజలకు తెలికుండా ఉంటుంది... తద్వారా గత ప్రభుత్వంమే నయం అనుకుంటారు ప్రజలు.. ఆ రీతిగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలోని కొందరు తేడా.. గత ప్రభుత్వంలోని పెద్దలకు విధేయులుగా ఉండే అధికారులు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టి కూపీలాగుతున్నా..ప్రతీరోజూ కార్యాలయంలో ఏం జరుగుతుందో పిన్ టు పిన్ తెలియజేస్తున్నారట. దానితో  రాష్ట్ర ప్రభుత్వం సమాచారశాఖ వెబ్ సైట్ రూపు రేఖలనే మార్చేయడానికి సిద్దపడి కార్యాచరణ మొదలు పెట్టింది..!

సమాచార పౌర సంబంధాలశాఖ..ప్రభుత్వ కార్యక్రమాలను, మీడియాకు చేరవేసే ఒక ప్రభుత్వ శాఖ..ఈ శాఖ పని కేవలం పత్రికలు, ఛానళ్లకు ప్రభుత్వ సమాచారాన్ని న్యూస్ ఫార్మాట్ లో అందించి.. ప్రభుత్వం ఏం చేస్తున్నది మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి.. కానీ రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయం నుంచి జిల్లా సమాచారశాఖ కార్యాలయం వరకూ కొందరు అధికారులు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వ సమాచారం మీడియాకి ఈమెయిల్ ద్వారా, వాట్సప్ గ్రూపుల ద్వారా అందించాలని ప్రత్యేకంగా లేఖల ద్వారా అభ్యర్ధించినా.. వారి ఇంట్లో ఆస్తులు.. డబ్బులు అడిగినట్టుగా తెగ ఫీలైపోతున్నారు.. సమాచారశాఖ మొత్తాన్ని వారే ఉద్దరించేస్తున్నట్టుగా తెగ నొప్పులు పడిపోతున్నారు.. కనీసం ప్రభుత్వ నిబంధనలను, జీఓలను అర్ధంచేసుకోవడం కూడా చేత కానివారు సమాచారశాఖలో అధికారులుగానూ, సిబ్బందిగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో..

 ప్రభుత్వ సమాచారం టివీలకు, పత్రికలకు ఎంత ఎక్కువగా అందిస్తే ప్రభుత్వం చేసే పనులు, పథకాలు వివరాలన్నీ అన్ని పత్రికలు, ఛానళ్లు ద్వారా ప్రజలకు చేరుతాయి. దానికి పోయి.. మీకు కనీసం అక్రిడిటేషన్ ఉందా.. మీరు ఎన్నేళ్లుగా ప్రెస్ లో పనిచేస్తున్నారు..ఎక్కడో శ్రీకాకుళంలో పత్రిక ఉంటే రాష్ట్రరాజధానిలోని సీఎం కార్యక్రమాలు మీకెందుకు.. ఇక్కడి ప్రభుత్వ సమాచారం ఇవ్వకూడదు.. వాట్స్ గ్రూపులు నిండిపోయాయి..జిమెయిల్ గ్రూపుల్లో ఖాళీలేదు.. మేము అత్యవసర సమావేశాల్లో ఉన్నాము లాంటి ప్రశ్నలు..సమాధానాలను మాత్రమె చెబుతూ కాలం నెట్టుకొచ్చేస్తున్నారు తప్పితే రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని నడుస్తున్న స్థానిక చిన్న పత్రికలకు సీఎం సమాచారం మాత్రం ఇవ్వడం లేదు.. వాస్తవానికి ప్రధాన పత్రికలతోపాటు స్థానిక పత్రికల ద్వారా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుంటాయి. అలాంటి స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కి గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర కార్యాలయ అధికారులు.

ఒకప్పుడు సమాచారశాఖ వెబ్ సైట్ అంటే రాష్ట్ర సమాచారం, ప్రభుత్వ జీఓలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలతోపాటు, అన్ని శాఖల మంత్రులు వారి కార్యక్రమాలు, దానికి సంబంధించిన సమాచారం మొత్తం అధికారిక వెబ్ సైట్ లో పొందు పరిచేవారు. కాలక్రమంలో సమాచారశాఖ వెబ్ సైట్ ను పూర్తిగా మార్చేసి..కొంత సమాచారం మాత్రమే పెడుతున్నారు. ఏడాదికి ఒకసారి ప్రెస్ అక్రిడిటేషన్లు దరఖాస్తు చేసుకునందుకు వీలుగా మాత్రమే తయారు చేసి వదిలేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అయితే మరీ దారుణంగా స్థానిక పత్రికలను, జిల్లా పేపర్లను పూర్తిగా అగణ దొక్కేందుకు జీఓనెంబరు 38 లాంటి వాటిని కూడా అమలు చేసి వేల సంఖ్యలో జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్లను దూరం చేయగలిగారు. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రంలోని పీఐబీ వెబ్ సైట్ తరహాలో వెబ్ సైట్ ని రూపొందిస్తే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సమాచారం అందించడానికి వీలుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా సమాచారశాఖ వెబ్ సైట్ రూపురేఖలను మారుస్తోంది.

 అయితే ఈ విధానం రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలోని అధికారులకు పెద్దగా రుచించడం లేదు. ఈ శాఖ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో తయారుచేస్తే.. రాష్ట్రప్రభుత్వ సమాచారం మొత్తం రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో ఉన్న అన్ని పత్రికలకు, ఛానళ్లకు, లోకల్ కేబుల్ టివిలకు తెలిసిపోతుందని భావించి జిల్లాల సమాచారం పెట్టకుండా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు..అందునా పీడిఎఫ్ ఫార్మాట్ లోనే పెట్టించే విధంగా తమ పంతాన్ని నెగ్గించుకోగలిగారు. గతంలో సమాచారశాఖ వెబ్ సైట్ లో ఏ జిల్లా సమాచారశాఖ కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఓపెన్ ఫైల్  ఫార్మాట్, మేటర్ కాపీపేస్ట్ ఫార్మాట్ లో కేంద్రప్రభుత్వ సంస్థ పిఐబీ వెబ్ తరహాలోనే ఉండేవి. కానీ ఇపుడు సమాచారశాఖ ఆధ్వర్యంలో కొత్తగా తయారైన వెబ్ సైట్ లో కూడా రాష్ట్ర అధికారులకు అనుగుణంగా మాత్రమే తయారు చేయించుకోవడంలో పై చేయి సాధిస్తున్నారు.

-సమాచారశాఖ వెబ్ సైట్ ఎలా ఉండాలంటే...
రాష్ట్ర సమాచార పౌరసంబంధాలశాఖ తన వెబ్ సైట్ ని కేంద్ర ప్రభుత్వ సంస్త పీఐబి వెబ్ సైట్ తరహాలో కొత్తగా తీర్చి దిద్దుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన సమాచారంతోపాటుగా అన్ని శాఖల మంత్రులకు చెందిన తాజా సమాచారం, కార్యక్రమాలు, ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఉండాలి. త ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న మధ్య తరహా పత్రికలు, ఇతర ప్రధాన పత్రికలు, టివి ఛానళ్లు నేరుగా వెబ్ సైట్ నుంచే డౌడ్ లోడ్ చేసుకునే విధంగా తేదీల వారీగా ఉండాలి. ప్రస్తుతం పీఐబీ వెబ్ సైట్ లో ఆ విధంగానే ప్రధానమంత్రితోపాటు ఇతర మంత్రులశాఖలకు చెందిన తాజా సమాచారాన్ని అన్ని భాషల్లోనూ పొందు పరుస్తున్నారు. ఇక 26 జిల్లాలకు చెందిన డిపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు మీడియాకి పంపే సమాచారం కూడా  ప్రతీ జిల్లాలోనూ డిపిఆర్వోకి లాగిన్ ఐడి ఏర్పాటు చేసి ప్రెస్ నోట్లు, వీడియో, యూట్యూబ్ లింక్స్ అన్నీ వెబ్ సైట్ లో జిల్లాల వారీగా అప్లోడ్ చేస్తే మీడియా స్వయంగా డౌన్ లోడ్ చేసుకునేవిధంగా ఉండాలి. ప్రెస్ నోట్లు, ఫోటోలే కాకుండా ఆహ్వానాలు కూడా వెబ్ సైట్ లోని ఏ జిల్లాకి ఆ జిల్లా వారీగా సమాచారం తెలియజేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీడియాకి అనుకూలంగా వుంటుంది.  తద్వారా రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలో నడుస్తున్న తేడా రాజకీయాలకు తెరపడినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని వర్గాల మీడియా కూడా రాష్ట్ర కార్యాలయ అధికారుల చుట్టూ ప్రెస్ గ్రూపులు, ఈమెయిల్ గ్రూపుల్లో మీడియాకి చెందిన ఈమెయిల్ ఐడిలు, వాట్సప్ నెంబర్లు యాడ్ చేయాలని కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పని కూడా ఉండదు.

-ఏపీఆర్వోల నుంచి డీపిఆర్వోల వరకూ పునశ్చరణ తరగతులు అవసరం
సమాచార పౌరసంబంధాలశాఖలోని చాలా వరకూ డిపిఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు, ఏపీఆర్వోలకు ప్రభుత్వ సమాచారాన్ని న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోట్ తయారు చేసే విధానంలో శిక్షణ ఇప్పించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నేటికీ చాలా జిల్లాల్లోని అధికారులకు ప్రెస్ నోట్ రాయడం కూడా రావడం లేదు. అలాగని అధికారులు నేర్చుకునేందుకు ముందుకి రావడం లేదు. క్రిందిస్థాయిలోని ఏపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోల మీదనే భారం మొత్తం నెట్టేస్తున్నారు. దీనితో కార్యాలయంలోని ఇతర పనులతోపాటు, డిపిఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు చేసే పనులు కూడా ఏపీఆర్వోలు చేయడం వలన దారుణంగా నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దానికితోడు ఈశాఖలో పెద్ద మొత్తంలో అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణలు చేయడంతో ఉన్నవారిపైనే పనిభారం మొత్తం పడిపోతున్నది. గత ప్రభుత్వ హాయంలో ఏపీఆర్వోలను నియమించినా వారికి సమాచారశాఖకు సంబంధించిన ఏ పనిచేయడం చేతకావడం లేదు. కనీసం ప్రెస్ నోటు రాసే విధానం కూడా ఏపీఆర్వోలకు రాకపోవడంతో వారిని కార్యాలయంలోని ఇతర పనులకు డిపిఆర్వోలు వినియోగించుకోవాల్సి వస్తున్నది. కొందరు ఏపీఆర్వోలకు, ఇతర విభాగాల్లోని వారికి పదోన్నతులు రాకపోవడం వలన కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రెస్ అండ్ మీడియాకి ప్రెస్ నోట్లు పంమన్నా, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు గ్రూపుల్లో యాడ్ చేయమంటే ఎక్కడ లేని రాజకీయం చేసే ఈశాఖలో అధికారులు... అదే మీ శాఖ పనులు మీరు చేయడం లేదని ప్రశ్నిస్తే మాత్రం ఎక్కడలేని కోపాలు వచ్చేస్తున్నాయి. 

అలాగని రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు కూడా వీరి వ్యవహారాలపై దృష్టి సారించడం లేదు. కొన్ని పత్రికలు వీరు చేసే పనులకు చక్కభజనలు చేస్తున్నా.. ప్రశ్నించేవారు మాత్రం ఎప్పటికప్పుడు సమాచార పౌర సంబంధాల శాఖ యొక్క విషయాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మీకు ప్రెస్ అక్రిడిటేషన్లు రాకుండా ఆపేస్తామని.. ప్రెస్ నోట్లు పంపమని.. దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పే అధికారులకు అల్లూరి ఆశయసాధనే ఈరోజు దిన పత్రిక ద్వారా తెలియజేసేది ఒక్కటే.  ఇకపై సమాచారలోని జరిగే ప్రతీ పని, వ్యవహారం, వ్యాపకం, తేడాతనం, అనధికారిక వ్యవహరాలు, చేయని పనులకు పెట్టే దొంగ బిల్లులు, డీజిల్ పెట్రోలు ఖర్చులు, ఒక వర్గం మీడియాకే ప్రకటనలు ఇచ్చి ఇతర మీడియాకి ఇవ్వని వైనంపై ఎప్పటికప్పుడు వార్తలు రాస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నాం. సమాచారశాఖ ద్వారా మీ మా పత్రికకు ప్రెస్ అక్రిడిటేషన్లు పెట్టకపోయినా బ్రతిమిలాడేది లేదు. మీ చుట్టు తిరేగేది అంతకంటే లేదు. వాస్తవాలు ఏ విధంగా బయటకు తీయాలో ఆవిధంగానే బయటపెడతామని కూడా ముందుగానే చెబుతున్నాం. ఇక్కడ కావాల్సింది.. జరగాల్సింది ఒక్కటే.. ఒక మంచి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నది. ఆ విషయం సమాచారశాఖ ద్వారా అన్ని వర్గాలకు తెలియాలి. 

ఆ విషయంలో గత ప్రభుత్వంలోని వారికి కోవర్టులుగా ఉంటాం.. కూటమి ప్రభుత్వ ప్రచారాలాను తమస్థాయిలో పెద్దగా బయటకు వెళ్లనీయమంటే కుదరదని కూడా తెలియజేస్తున్నాం.  ఇకపై అన్నీ ముందుగా చెప్పే చేస్తామని హింట్ ఇస్తున్నాం. కూటమి పరిపాలన సమాచారశాఖ అన్ని జిల్లాల్లోనూ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందే. లేదంటే మాత్రం వారి స్టైల్ లోనే రాజకీయాలతోనే లోన జరిగే వ్యవహారాలన్నీ బయటకు వచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా ప్రత్యేక కథనాల రూపంలో తీసుకెళతామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పత్రికలు, మీడియాకి, ఛానళ్లకి ఎందుకు సమాచారం ఇవ్వరో కూడా చూస్తాం. రాష్ట్రప్రభుత్వం కొత్తగా తయారు చేస్తున్న సమాచారశాఖ వెబ్ సైట్ ద్వారా మొత్తం సమాచారం అన్నివర్గాలకు, అన్నిజిల్లాల్లోని పత్రికలు, ఛానళ్లకు తెలిసేలా రూపొందిస్తారని భావిస్తున్నాం. లేకపోతే ఏ విధంగా తీసుకురావాలో.. ఆవిధంగానే తీసుకొస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నాం. సమాచార శాఖ మీ సొంత జాగీరు కాదు. ప్రజలకు మీడియా ద్వారా ప్రభుత్వ సమాచారం అందించాల్సిన బాధ్యత, అవసరం ఉందనేది తేడా అధికారులు, సిబ్బంది గుర్తించాల్సిందే. లేదంటే మాత్రం ఏం జరుగుతున్నా.. అక్షరాలతో సహా పక్కాగా ప్రత్యేక వార్తలు అందించే విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ముందుగానే తెలియజేస్తున్నాం..! 

visakhapatnam

2024-07-23 04:19:46

కూటిమిలోనూ కిక్కు కష్టాలే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానికి ఇనిస్టెంట్ ఆదాయం తెచ్చేపెట్టే మందు బాబులు..ప్రభుత్వమే ముద్దుగా పిలుచుకునే మహారాజ పోషకులంగే కనీసం గౌరవం లేకుండా పోయింది.. తాగి ఆదాయాన్ని పెంచుతారు. తాగి తూగి.. వాహనాలపై వెళుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కి మరీ ఫైన్ లు చెల్లిస్తారు.. కోర్టు కేసులు పడితే కోర్టు ఫీజులు చెల్లిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వం కేవలం మందు అమ్మి కేవల నిషా సేవ చేస్తే.. దానికి ప్రతిఫలంగా మందు బాబులు మూడు రకాలుగా ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వశాఖ నుంచి రాదంటే అతిశయోక్తి కాదేమో..! లాంటి మందు బాబులకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎన్నికల హామీల్లో  ఇచ్చిన మాటను, చేసిన హామీని పక్కనపెట్టేసింది ప్రభుత్వం. అవును మీరు చదువుతున్నది నిజమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో మద్యపాన నిశేషదమని చెప్పి రివర్స్ లో మద్యం రేట్లు అమాంతంగా పెంచేసి..వాటిపై వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలకు ప్రభుత్వ ఖర్చులకు జమచేసుకున్న తీరుని మందుబాబులుకూడా అదే రివర్స్ గుద్దుడుతో ఓడించారు. 

కూటమి కూడా ఎన్నికలకు ముందు నెలరోజుల్లో మద్యం రేట్లు దించడంతోపాటు, నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వానికి మహారాజపోషకులైన మందు బాబులకు మాటిచ్చింది. మాటైతే ఇచ్చింది.. కానీ మద్యం రేట్లు క్రిందికి దించడంలో ఎందుకనో మీన మేషాలు లెక్కిస్తోంది. ఎందుకా అని ఆరా తీస్తే గత ప్రభుత్వంలోని డిస్టలరీల ద్వారా తయారైపోయిన మద్యాన్ని పూర్తిగా అమ్మేసిన తరువాత, కొత్త మద్యం పాలసీని తీసుకు వచ్చిన తరువాత ధరలు దించే విషయమై ఆలోచన చేద్దాంలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అధిక మద్యం రేట్లతో కాయకష్టం చేసిన ఆదాయం మొత్తం తాగుడుకే తమ భర్తలు పోసేస్తున్నారని భావించిన మహిళలు కూడా లోతుగా ఆలోచించి..ఓట్లు వేశారు కూటమికి. కనీసం వారి కష్టాలనైనా కూటమి ప్రభుత్వం అర్ధం చేసుకొని పాత బ్రాండ్లను తీసుకొచ్చి, మద్యం రేట్లు తగ్గిస్తే..కొద్ది మొత్తమైనా కుటుంబ పోషణకు వస్తుందని. ఇటు మహిళల కష్టాలు కూటమి ప్రభుత్వంలోనూ తీరకుండా పోయాయి. మాయదారి తాగుడని ప్రభుత్వం రద్దు చేయకపోగా.. కనీసం రేట్లైనా తగ్గించడం లేదని భర్తలు కష్టం మొత్తాన్ని తాగేసి ఇంటికి వస్తే అది దిగేవరకూ ఇటు భర్తను, అటు ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిడుతున్నారు(ఆ బూతులు ఇక్కడ రాస్తే చదివేవాళ్లు కూడా చీదరించుకుంటారు.. అంతలా ఉన్నాయి అవి). 

దేశంలో ఏప్రభుత్వం ఆధ్వర్యంలోనే కనిపించని బ్రాండ్లన్నీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తెరమీదకు వచ్చాయి. ఒకప్పుడు బీరు తాగాలంటే రూ.120 ఖర్చు చేస్తే సరిపోయిది. ఇపుడు ఏకంగా షాపులో అయితే రూ. 250 బారులో అయితే రూ.350 చెల్లించాల్సి వస్తుంది. చీప్ లిక్కర్ అప్పట్లో రూ.100 పెడితే వచ్చేది ఇపుడు కనీసం రూ.200 పెడితేగానీ రావడం లేదు. అదీ నాణ్యమైన మందు కూడా కాదు. ఇక కాస్త పెద్ద బ్రాండ్ లు అయితే ఒక్కో ఫుల్ బాటిల్ పైనా రూ.1000 నుంచి రూ.1800 అదనంగా ప్రభుత్వమే అమ్ముతోంది. ఒకరకంగా మద్యంపై వచ్చినంత ఆదాయం మరే ఇతర ప్రభుత్వశాఖల్లోనూ రాకపోవడంతో గత ప్రభుత్వం కూడా దశలవారీ మద్యపాన నిషేధం అనిచెప్పి దశలవారీగా రేట్లు పెంచి మందుబాబుల జోబీలను దారుణంగా లూటి చేసేసింది. ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే మద్యంపైనే ఆదాయం వస్తున్నది దీనితో పాత రేట్లే ఉంచాలా..లేదంటే తగ్గించాల అనే ఆలోచనలో పడిపోయిందట. రేట్లు తగ్గిస్తే ఆదాయం పడిపోతుంది. ఆదాయం పడిపోతే ఇనిస్టెంట్ గా వచ్చే ఆదాయం రాదు.. వచ్చినా తక్కువగా వస్తుందని ఆలోచన చేసి..కొత్త మద్యం పాలసీ తీసుకు వచ్చేంత వరకూ రేట్లు తగ్గించకూడదని డిసైడ్ అయిపోయిందట. 

విషయం తెలుసుకున్న మందులు బాబులు.. చంద్రబాబు ఇచ్చిన హామీని పూర్తిగా పక్కనపెట్టేశారని..తలుచుకొని తలచుకొని మరీ సాధారణంగా తాగే మందుకంటే మరో క్వార్టర్ బాటిల్ ఎక్కకువగా తాగేస్తుండటంతో మందుబాబుల ప్రెస్టేషన్ ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ అదే మందుబాలు కూడా తాగింది మొత్తం దిగేవరకూ కూడా కూటమిని అమ్మనా బూతులు తిట్టడం మొదలెట్టడం తరచూ ప్రభుత్వ మద్యంషాపుల వద్దే పెద్ద పంచాయతీ అయ్యింది. పోయినోడు నాసిరకంగా బ్రాండ్లతో అడ్డంగా దోచేస్తే...మద్యం రేట్లు తగ్గిస్తానని నాణ్యమైన మద్యాన్ని అమ్ముతానని చెప్పి వీడు మరీ దారుణంగా ఆ రేట్లనే కొనసాగిస్తున్నాడంటూ తిట్ల దండకం మొదలెడుతున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచే. ఈ విషయాలేమీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడం లేదా అంటే వెళుతున్నాయి. వెళ్లినా..మరో ఐదేళ్ల వరకూ ఓటేసిన ఓటరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. 


అధికారంలో ఉన్నప్రభుత్వం ఏం చేసినా పైనా క్రిందా మూసుకొని కూర్చోవడం తప్పితే చేయడానికి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మద్యం రేట్లు తగ్గించినా ఆదాయం ఏమీ పడిపోదనే లాజిక్ ను గమనించాలి ఎందుకంటే రేట్లు తగ్గాయని తెలుసుకున్న మందుబాబులు సాధారణంగా కొనేదానికేం ఎక్కువ మద్యం కొంటారు. అలాగైనా ప్రభుత్వానికి నిండుగా ఆదాయం సమకూరు తుంది. గత ప్రభుత్వానికి కిక్కు దించేసిన మందుబాబులు అపుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వంలోనూ కష్టాలు పడుతూ, కూటమిని కూడా తిట్ల దండకంతో కుమ్మేస్తున్నారు. చూడాలి ఇంకెప్పుడు మద్యం ధరలను ప్రభుత్వం తగ్గించి మందుబాబులకి ఇచ్చిన హామీని, అక్కచెల్లమ్మలకు చేసిన బాసను నిలబెట్టుకుంటుందనేది. అదే జరిగితే మళ్లీ పాత మందు ఈజ్ బ్యాక్.. కూల్ బీర్.. వాడ్కా ఫుల్ అనే రీతిలో ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!

visakhapatnam

2024-07-19 18:03:55

అరేయ్ అన్నప్పుడు నిన్నూ ఒరేయ్ అంటే..!

మీడియా అంటే ఫోర్త్‌ ఫిల్లర్‌ ఆఫ్‌ ది సొసైటీ..కనీసం ఆ విషయం రాజ్యసభ్యుడు వి.విజయసాయిరెడ్డికి తెలిసుండకపోవచ్చు...తనపై వచ్చిన ఆరోపణలో ప్రెష్టేషన్‌ లో.. వార్తలను పదే పదే వేసినందుకు బాగా ఫీలై ఉండొచ్చు..ఆ సమయంలో విచక్షణ కోల్పోయి జర్నలిస్టులను అరే య్‌.. తురేయ్‌ అంటే..అదే ప్రెస్‌ మీట్‌ లో ఉన్న తేడా జర్నలిస్టులకు కనీసం చీమైనా కుట్టలేదా..పైగా ఇక ఇకలు పక పకలూనా.. ఈరోజు ఎవరో జర్నలిస్టుని అరేయ్‌ అన్న రాజకీయనాయకుడు..రేపు నన్నూ అనడని గ్యారెంటీ ఏంటి..? అయినా పెతోడికి జర్నలిస్టులను నోటికొచ్చి నట్టు మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయింది. ఆ ప్రెస్‌ మీట్‌ లో జర్నలిస్టులను అరేయ్‌ తురేయ్‌ అన్నప్పుడు నిజమైన జర్నలిస్టులు అక్కడ ఉండి ఉంటే ఆ మాటలను ఖండిరచేవారేమో.. లేదంటే.. జర్నలిస్టుని అరేయ్‌ అన్నందుకు..ముందేదో చెప్పావ్‌ కదరా..ఒక్కసారి మళ్లీ చెప్పరా అని తిరిగి ప్రశ్నించి ఉంటే అరేయ్‌ అన్న మాట విన్నందుకు ఎక్కడ మండాలో అక్కడ మండేది. 

బహుసా ఆ  ప్రెస్‌ మీట్‌ లో నిజమైన జర్నలిస్టులు లేకపోవడం వలనే విజయసాయిరెడ్డి అంత దైర్యంగా తనపై వచ్చిన ఆరోనపణల విషయం వివరణిస్తూ.. ఎంట్రా అనేవారు కాదేమో. బహుసా అక్కడ జర్నలిస్టులెవరూ ఉన్నట్టుగా లేదు. పైగా టివి ఛానళ్లు సైతం ఈ విషయాన్ని రీల్స్‌ గా చేసి మరీ ప్రచారం చేశాయి. బహుసా సదరు టివి ఛానళ్లలో పనిచేసేవారూ జర్నలిస్టులు కారేమో.. లేదంటే జర్నలిస్టులని లైవ్‌ లో అరేయ్‌.. ఏంట్రా.. చెప్పరా.. వాడ్ని అడగరా అన్నప్పుడే..చాలు చాల్లేరా.. అనుంటే అరేయ్‌ మాట ఎంత గౌరవంగా ఉండేదో తెలిసి వచ్చేది. తనపై సదరు జర్నలిస్టు తప్పుడు కధనాలే ప్రచురించి, ప్రసారం చేసి ఉండొచ్చు గాక.. అంతమాత్రాన కనీస గౌరవం మరిచిపోయి ప్రెస్‌ మీట్‌ లోనే జర్నలిస్టుని ఏరా అంటే అక్కడున్న తేడా జర్నలిస్టు మాట్లాడలేదంటే భయమా.. ఇంకేమైనానా..? ఇంకేమైనా అంటే ఇటీవలన ఎన్నికల సమయంలో నిజమైన జర్నలిస్టులను కాకుండా కాస్త తేడాగాళ్లే తీసుకెళ్లి మరీ ప్యాకేజీలిచ్చినందుకు సిగ్గుమాలిన గౌరవం చూపించి ఉండవచ్చు. 

పనికిమాలిన వాళ్లు, చేవలేని వాళ్లు, చేత కానీ వాళ్లు ఒక జర్నలిస్టుని అరేయ్‌ అంటే రుకుంటారేమోగానీ..దమ్మున్న జర్నలిస్టులెవరూ ఆ మాట అనిపించుకోరు. ఒక వేళ విజయసాయిరెడ్డికి అక్కడున్న జర్నలిస్టులకు కుటుంబ సంబంధాలు ఉండి ఉంటే అపుడు ఏంట్రా అని ఆప్యాయతగా పిలుచుకోవచ్చు. అదీ ప్రెస్‌ మీట్‌ లో కాకుండా ఏ బయటనో..అది నిజంగా ప్రేమకి, అభిమానాలకి, గౌరవానికి అద్దంలా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల కోసం ఏం చేశారని.. జర్నలిస్టులను ఏం ఉద్దరించారని అరేయ్‌.. ఏరా.. చెప్పరా.. వాడ్ని అడగరా.. నీకేంట్రా అని గౌరవంగా సంబోధిస్తున్నారో తెలియడం లేదు గానీ ఒక రాజ్యసభ సభ్యుడిగా మీడియాకి ఇచ్చే గౌరవం మీ దృష్టిలో ఇలా వుంటుందని ఇపుడే తెలిసింది. ఆధారాలు లేని వార్త కథనాలు ప్రచురించినపుడు, ప్రసారం చేసినపుడు సదరు మీడియాపై కన్నెర్ర చెయ్‌, కేసులు వెయ్‌ ఆ సమయంలో మిగిలిన జర్నలిస్టులు మీకు సహాయం చేసేవారేమో. కానీ ఇదేంటండీ మరీ ఇంత దారుణంగా దిగజారిపోయి జర్నలిస్టులను అరేయ్‌, ఒరేయ్‌ అనడం ఏంటి. అసలు మీకేమీ అనిపించలేదు..నిజమైన, నికార్శైన జర్నలిస్టు మీకు ఎదురు పడలేదా.. అలా పడి ఉంటే ఈ రకమైన సంబోధన వచ్చేది కాదేమో. 

ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి విజయసాయిరెడ్డి..జర్నలిస్టులను ప్రెస్‌ మీట్‌ లో అరేయ్‌ ఎందుకు పిలిచారో. ఆ సంబోధనతో మీపై ఉన్న ఆ కొద్దిపాటి గౌరవం కూడా పోగొట్టుకున్నారు. రేప్పొద్దున సైరా మీడియా వస్తే..ఏదో వార్త మీ పత్రికలోనూ, టివిలోనూ వేస్తే..అవతలి వాడు కూడా మిమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడే సంబదర్భంలో ఆ.. సైరా గాడు అంటే మీకు ఎంత విలువ తక్కువగా ఉంటుంది. మీడియాలో వస్తున్నామంటున్నారే ఇదేరకమైన వ్యవహారం మీ మీడియాలోనూ, నేతలను, వార్తలను వేస్తారా..? మీ ప్రెస్‌ మీట్‌ లో ఉన్న జర్నలిస్టులకు మంచివారేమో... మీకు గౌరవం ఇచ్చారేమో.. మీ పదవికి హోదా ఇచ్చారేమో..అంతే తప్పా..జర్నలిస్టులంటే చేతకానివారని మాత్రం అనుకోవద్దు. మీ గౌరవం నిలబడాలంటే అరేయ్‌ అన్నమాటను వెనక్కి తీసుకోండి. లేదంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు మిమ్మల్ని మీరు పెట్టే ప్రెస్‌ మీట్‌ లోనే నిజమైన జర్నలిస్టు కూడా చాలు చాల్లేరా చెప్పొచ్చావు నీతులు అనేస్తారేమో..పద్దతి...పద్దతిగా ఉంటే మీడియాలోకి రాబోతున్న మీకు మరింత విలువ పెరుగుతుంది. లేదంటే ఉన్న విలువ పోయి..నేల టిక్కెట్టు ముద్రపడిపోతారు.. ఇదేదో మిమ్మల్ని కావాలని అంటున్న మాటలు కావు. నిజమైన జర్నలిస్టుల ఆవేదన మాత్రమే అర్ధం చేసుకుంటారని మాత్రమే సుమీ..? 

అటు చాలా మంది పోలీసుల్లోనూ రేయ్‌ అనే సంభోదనలు రావడం వెనుక కొందరు జర్నలిస్టుల చేత కాని తనమే కనిపిస్తోంది. నిజమైన జర్నలిస్టులు ఎవరికైతే పబ్లిసిటీ ఇస్తున్నారో.. వారు జర్నలిస్టులను చాలా గౌరవించాలి. అలా కాకుండా అరేయ్‌ అనేస్థాయికి వస్తున్నారంటే..పరిస్థితి కొందరు తేడా జర్నలిస్టులు, తేడా పోలీసులు, మరికొందరు తేడా రాజకీయ నాయకుల వలనే జర్నలిస్టుల గౌరవం దెబ్బతింటున్నదనే విషయంలో  ప్రెస్‌ మీట్‌ లో జర్నలిస్టులను అరేయ్‌ అన్నప్పుడు మిగతా జర్నలిస్టులు దానిని ఖండిరచకపోవడం, కనీసం జర్నలిస్టు సంఘాలు సైతం ఖండిరచపోవడం చూస్తుంటే జర్నలిస్టులు రేపు పొద్దున్న పెతోడూ అరేయ్‌.. ఏరా.. రారా..పోరా అని చాలా గౌరవంగా పిలిచే రోజులొచ్చేస్తాయేమో కదా. రాజకీయ నాయకులు వారి హోదాని వారు కాపాడుకుంటే మంచిది. లేదంటే ఏ జర్నలిస్టులను అయితే ఒరేయ్‌ అని పిలుస్తున్నారో తిరిగి జర్నలిస్టులు కూడా అరేయ్‌ అని మర్యాదగా పిలిచి గౌరవించేస్తారు.. అదీ నిజమైన జర్నలిస్టులైతేనే..అదే తేడా జర్నలిస్టులైతే మాత్రం ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్‌ మీట్‌ లోజర్నలిస్టులను అరేయ్‌..ఏంట్రా అంటే మాత్రం చాలా చక్కగా చేతగాని జర్నలిస్టు ఛానల్‌ లోగో పట్టుకున్నట్టుగా.. అక్షరం రానివాడు జర్నలిస్టు అయిపోయినట్టుగా.. నేతలకు ఊడిగం చేసే సోకాల్డ్‌ మీడియాగా పూర్తిగా ఇక ఇకలు.. పక పకలు నవ్వుకుంటూ అవతలి రాజకీయనాయకుడు, అధికారి, పోలీస్‌, ఇంకా వగైరాలు ఎవరైనా అరేయ్‌, ఒరేయ్‌ అంటే.. స్టైల్‌ గా దులుపుకొని వచ్చేయొచ్చు కదా ఏమంటారు ..!

visakhapatnam

2024-07-18 03:54:57

తెరపైకి సైరా పేపర్, టివి..?!

వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి ఎంపీ వి.విజయసాయిరెడ్డి త్వరలోనే మీడియా ఏర్పాటు చేస్తున్నారనే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక గిరిజన మహిళా ఉద్యోగి విషయంలో కావాలని ఒక వర్గం మీడియా చల్లుతున్న బురదను తిప్పికొట్టాలన్నా.. రాజకీయంలో బలమైన నేతగా ఉండాలన్నా మీడియా లేకపోతే ఈరోజుల్లో పరిస్థితిలు చాలా ఇబ్బంది కరంగా మారాయి. ఇలాంటి సమయంలో సొంత మీడియా ఉంటే ఆ లెక్క వేరేలా వుంటుంది. మీడియాపై మీడియా దమ్ము ప్రదర్శిస్తే.. బలాబలాలు తేలిపోతాయి. అంతే తప్పా మీడియాచేసిన దాడిని సింగిల్ గా తిప్పికొడదామంటే ఈరోజుల్లో జరగని పని. రాష్ట్రమీడియాలో వార్తలు గుప్పుమంటే..జాతీయ మీడియాలో ఒకటి అరా అయినా సదరు వార్తలపై ఆలోచించడం మొదలు పెట్టి వాళ్లూ సోధించడం మొదలు పెడతారు. అలాంటి సందర్భంలో ఢిల్లీలో స్థాయిలో చక్రం తిప్పిన అపర చాణిక్యుడు విజయసాయిరెడ్డి ముందున్న ఒకే ఒక్క అస్త్రం మీడియా. మనకే బలమైన మీడియా ఉంటే రాజకీయంగానూ.. పార్టీ పరంగా కాస్త అండ వుంటుందని...ఎపుడైనా రాజకీయంగా అణగదొక్కాలని చూసే సందర్భంగాలను దైర్యంగా తిప్పికొట్టవచ్చునని సైరా బావించినట్టుగా చెబుతున్నారు. ఇటీవలే దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి విషయంలో ఆమె మాజీ భర్త చేసిన ఫిర్యాదులు, వీడియోలతో సైరా ప్రత్యర్ధులు మీడియాముఖంగా బదనాం చేయడం మొదలు పెట్టారు.

 ఆ సమయంలోనే స్వయంగా ఆయనే విశాఖలో మీడియా ముందుకి వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అపుడు కూడా ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణల విషయంలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఘాటుగానే స్పందించారు. ఎంత స్పందించినా..ఎలాంటి వార్నింగ్ లు ఇచ్చినా రాజకీయ నాయకుడు ఏదైనా చిన్నవిషయంలో మీడియా దొరికితే ఒక ఆట ఆడేస్తాయి. ఇపుడు సైరా విషయంలోనూ అదే జరిగింది. ఏకంగా ఒక దళిన మహిళా ఉద్యోగి అని చూడకుండా విడాకుతు తీసుకున్న మాజీ భర్త ఇచ్చిన ఒక ఫిర్యాదు, వీడియోలపై మీడియా చేసిన రచ్చకు విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు గతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఇదే విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత అధికారపార్టీ అనుకూల మీడియాపై కూడా చాలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటినీ గుర్తుపెట్టున్న మీడియా సమయం వచ్చినప్పుడు సైరాను కూడాఒక ఆట ఆడేసాయి. వచ్చిన ఆరోపణలపై కూడా ధీటుగానే సమాధానం చెప్పారు సైరా.

ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సొంత మీడియాలో పతాక శీర్షిక కవరేజీ రావాలి. కానీ ఒక సాధారణ రాజకీయనేతకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో అలాగే ఇవ్వడం.. గతంలో మాదిరిగా పార్టీలోని ముఖ్య నేతలు,  నాయకులు ఈ విషయంలో నోరు మెదకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలున్నాయా.. గిరిజన మహిళ వ్యవహారం కావడంతో ఆ బురదను సైరానే కడుక్కుంటారని వదిలేశారా అనే దానిపైనా విశాఖలో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ తరుణంలో ఇద్దరు బిగ్ షాట్ల సైరా మీడియా ఆలోచనపై సమాలోచనలు చేసినట్టు ప్రచారం జరిగింది. దానికోసం ప్రస్తుతం ఉన్న టైటిల్స్ లో ఏదైనా  తీసుకోవాలా.. లేదంటే కొత్తగా టైటిల్ పెట్టాలా...లేదంటే ఉన్న టివి ఛానల్స్ లో దేనిని కొనాలి.. అలా మీడియా ఏర్పాటైతే ప్రస్తుత జర్నలిస్టులకంటే దాడులను అక్షరాలతో సమర్ధవంతంగా ఎదుర్కొనే మెరికల్లాంటి జర్నలిస్టులు ఎక్కడ దొరుకుతారు.. దానికోసం ప్రత్యేక నెట్వర్క్ తయారు చేయాలా..? జాతీయ మీడియాతో ఉన్న సంబంధాలను వినియోగించుకొని పక్కాగా మీడియాని రంగంలోకి దించితే పరిస్థితులు ఎలా వుంటాయనే అంశాలు ఆ ముగ్గురి మధ్య చర్చకి వచ్చినట్టు సమాచారం అందుతుంది.

 ప్రస్తుతం ఎంపీగా విజయసాయిరెడ్డికి గడువు ముగిపోతున్నది. స్థానిక బలం కంటే హస్తనలో చక్రం తిప్పిన నేతగా మంచి గుర్తింపు పొందిన సైరా మరో జాతీయ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వస్తే ఎలా ఉంటుందనే చర్చలు కూడా జరిగాయని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో ఆరు నెలల్లో సైరా మీడియా ప్రారంభించేందు కార్యాచారణ చేసుకోవాలని కూడా భావిస్తున్నారట. ప్రస్తుత తరుణంలో సైరాకి మీడియాలేకపోయి... రాజకీయంగా ఎదుగుదల, ప్రత్యర్ధులను తిప్పికొట్టాలన్నా మీడియాతో పాటు, జాతీయ స్థాయిలో పదువులు కూడా చాలా ముఖ్యం లేదంటే గతంలో చేసిన, ప్రస్తుత ఆరోపణలు మీడియా ముఖంగా ఎదుర్కోవడం సైరాకు కత్తిమీద సామనే చెప్పాలి.  అందులోనూ సొంత పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా సైరా సొజిష్ ఏ2 నుంచి ఎంత వరకూ వెళ్లిపోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. మధ్యలో దూరిన ఆ నేత వైఎస్సార్సీపీ అధినేతకు అత్యంత సన్నిహితడని..ఆయన వలనే సైరాకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా చెబుతున్నారు.

 ఈ తరుణంలో సైరా మీడియా ఏర్పాటు చేయపోతే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయే టట్టు కనిపిస్తున్నాయి. దానికితోడు ఎప్పటి నుంచో ఒక బలమైన మీడియా ఏర్పాటు చేయాలనే సైరా కోరికకు ప్రస్తుత రాజకీయాలు తోడై త్వరలోనే సైరా మీడియా ప్రారంభం అవుతుందనే సంకేతాలు బయటకు వచ్చాయి. చూడాలి. నిజంగా సైరా మీడియా ఏర్పాటువుతందా.. ప్రత్యర్ధులను అదే మీడియా ద్వారా ఎదుర్కొంటారా..? సొంతపార్టీలో కుంపటి పెట్టినవారికి మీడియా ద్వారా సమాధానం చెబుతారా..? అసలేం జరగబోతుందనే ప్రశ్నలకు సైరానే సమాధానం చెప్పాల్సి వుంది. సమాధానం ఏవిధంగా వస్తుందనేది..ప్రస్తుతం ఒక ఆట ఆడిన మిడియాతోపాటు..సైరా అనుకూల, జాతీయ మీడియాకూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నది...!

vizag

2024-07-16 18:37:49