1 ENS Live Breaking News

కూటమి పాలనకు 6నెలలు.. అమలుకి నోచని హామీలు..?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపడితే పరిపాలన మొత్తం మారిపోతుంది.. ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరుతాయి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి.. అదనపు పనిభారం తగ్గి.. వేధించే అధికారులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయి.. పదోన్న తలు లభిస్తాయి..డీఏలు, ఇంక్రిమెంట్లు సమయానికి వస్తాయి.. ఇవన్నీ ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులు కన్నకలలు.. సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చేసిన ప్రచారాలు.. ఎలాగైనా భారీ మెజార్టీ గెలిపించాలని పట్టుదలతో 75 ప్రభుత్వశాఖ ల ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు.. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కానీ నాటి చంద్రబాబు మార్కు పరిపాలన మాత్రం ఎక్కడా కనపిం చలేదు కానీ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయి.. ఆరు నెలలు తిరిగే లోపే గత ప్రభుత్వమే నయమే స్థితికి వచ్చేశారు ఉద్యోగులు.. వారి ఆవేదనను సామాజిక మాద్యమాల వేదికగా పంచుకుంటున్నారు.. చంద్రబాబు మార్కు లేని పరిపాలనను ఉద్యోగులు వ్యతిరేకి స్తున్నా రు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. గత ప్రభుత్వ విధానాలే ఇంకా కనసాగుతున్నాయని ప్రభుత్వశాఖల ఉద్యోగులు వాపోతున్నారు. చంద్రబాబు మార్కు పరిపాలనపై ఎంతో ఊహించుకున్నా.. ఆరునెలలు గడిచిపోతున్నా ఇంకా పరిపాలన గాడిలో పడకపోగా.. అధికారుల వేధింపులతో నరకం చూస్తున్నామంటున్నారు క్రింది స్థాయి ఉద్యోగులు. ప్రయోజనం లేని అధనపు పనిభారం మోపి.. సర్వేలు, జియో ట్యాగింగ్లు.. సెలవురోజుల్లో పనిచేయిస్తూ అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారని గగ్గోలు పెడుతున్నారు.

 కనీసం ఉద్యోగులకు ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలకు కూడా ప్రభుత్వమే కేటాయించిన సెలవులుకూడా పెట్టుకోవడానికి వీలులేకపోవడంతో జిల్లా అధికారుల నుంచి క్రింది స్థాయి సిబ్బంది వరకూ ఒక్కొక్కరికీ సుమారు 15 ప్రభుత్వ సెలవులు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకైతే అసలు పనివేళలతో సంబంధం లేకుండా విధులు అప్పగిస్తున్నారని ఉద్యోగుల కుటుంబ సభ్యుల గగ్గోలు పెడుతున్నారు. పనిఒత్తిడి కారణంగా ఉద్యోగులు గుండెపోటుతో మృతిచెందిన సంఘనటు, కావాలని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అధికంగా ఉమ్మడి విశాఖజిల్లాలో జరగడం ఒక ప్రత్యక్ష నిదర్శనం. 

సచివాలయ ఉద్యోగులతో పనివేళల్లో కాకుండా.. సాయంత్రం 5 దాటిన తరువాత, వారాంతపు సెలవుల్లోనూ జిల్లా అధికారులు సర్వేలు, వివరాల నమోదు పేరుతో విధులు అప్పగిస్తున్నారు. ఇంత చేసినా.. అవసరం అయినపుడు సెలవులు అడిగితే మాత్రం అధికారులు షోకాజు నోటీసులు ఇస్తున్నారని, కార్యాలయాలకు పిలిపించి వారి సొంత జేబుల్లో నుంచి జీతాలు ఇస్తున్నట్టుగా తెగ ఫీలైపోయి తెగ తిడుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు ఒక శాఖ పనులు చేస్తే.. తామ సచివాలయ శాఖలో మాత్రం సుమారు పది ప్రభుత్వశాఖల విధులు తమతో చేయిస్తున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమని.. భవిష్యత్తు బాగుంటుందని కష్టమైనా పనిచేస్తున్నా అధికారుల వేధింపులు మాత్రం ఎక్కడా ఆగడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

పని ఒత్తిడికారణంగానే ఉద్యోగులు విధినిర్వహణలో గుండెపోటుతో మృతిచెందుతున్నారని వాపోతున్నారు.  ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా తమ సచివాలయశాఖలోని ఉద్యోగుల్లో చాలా విభాగాలకు సర్వీసు నిబంధనలు లేవని.. ప్రమోషన్ ఛానల్ అసలే లేదని.. కనీసం సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లకి కూడా తాము నోచుకోవడం లేదని.. తమ సమస్యను అసెంబ్లీలో ఎమ్మెల్యేలు.. మంత్రులు ప్రస్తావించినా.. క్యాబినెట్ సమావేశాల వరకూ తీసుకెళ్లి పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెబుతున్నారు. 

అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు పీఆర్సీ వలన ప్రయోజనాలు వస్తే.. కేవలం తమకు మాత్రం పెంచిన అదనపు జీతం తప్పా.. ఇతర ప్రయోజనాల ఊసేలేదని చెబుతున్నారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాల సామాజిక మాద్యమాలో పెద్ద ఎత్తున చర్చలు లేవనెత్తుతున్నారు. అయితే ఉద్యోగుల సమస్యలు, ఇబ్బందుల విషయాన్ని జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా.. తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తే మాత్రం టార్గెట్లు చేసి కార్యాలయాలకి పిలిపించుకొని అమ్మనా బూతులు తిడుతున్నారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన 74 ప్రభుత్వశాఖల్లోని అటెండర్ల దగ్గర నుంచి గ్రూప్-1 అధికారుల వరకూ పదోన్నతుల వస్తాయని ఎంతో ఆశపడినా.. ఆరునెలలు దాటిపోతున్నా ఇంకా పదోన్నతుల విషయంలో అతీగతీ కనిపించడం లేదు. 

ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు పదోన్నతులు పొందకుండానే రిటైర్ అయిపోతుండటం విశేషం. వాస్తవానికి పదోన్నతులు ఇవ్వడం వలన ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం కూడా పరిస్థితి ఉండదు. మహా అయితే ఒకటి లేదా..రెండు ఇంక్రిమెంట్లు ఉద్యోగికి కలుస్తాయి.. అవీ కూడా వెంటనే ఇవ్వరు. ఆ మాత్రం దానికి ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. చాలా ప్రభుత్వశాఖల్లోని కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పదోన్నతుల విషయాన్ని ప్రభుత్వం దుష్టికి తీసుకెళ్లకపోవడం వలన కూడా పదోన్నతులు నిలిచిపోయాయి. ప్రభుత్వ విధానాలతో క్రింది స్థాయి ఉద్యోగులే కాకుండా జిల్లా, మండల స్థాయి అధికారులు కూడా సెలువులు పెట్టినా.. జూమ్ మీటింగులతో ఇంట్లో ఉండే విధులు నిర్వహించాల్సి వుస్తున్నది అధికారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిరుద్యోగుల విషయంలో కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వున్నది. అధికారంలోకి రాగానే ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ కి అతీ గతీ లేదు. మధ్యలోనే ఉండిపోయి డిఎస్సీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు.. గత ప్రభుత్వం పెంచిన రెండేళ్ల సర్వీసు చాలా మంది ఉద్యోగులకు పూర్తయిపోవడంతో అన్ని ప్రభుత్వశాఖల్లోనూ వేలాదిగా ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదని నిరుద్యోగులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతం ప్రభుత్వం అన్నిప్రభుత్వశాకల్లోని క్రిందిస్థాయి ఉద్యోగాల ఖాళీలను ప్రాధాన్యత క్రమంలో భర్తీచేస్తూ వచ్చేది. 

గత ప్రభుత్వం నుంచి ఈ పద్దతి పూర్తిగా మారిపోయి.. ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులతోనే వారంత వారే ఉద్యోగాలుకి రాజీనామా చేయించే విధంగా పనులు, ప్రత్యేక విధులు అప్పగించి మరీ వేధిస్తున్నదని నిరుద్యోగులే పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు పరిపాలన మార్కుపై నేటికీ ప్రజల్లో విశ్వాసం ఉన్నా.. దానికి ప్రభుత్వంలోని కొందరు అఖిలభారతస్థాయి అధికారులు మోకాలు అడ్డువేస్తున్నారనే సమాచారం కూడా అందుతున్నది. అంతేకాకుండా ఉన్నవారికి అదనపు భాద్యతలు అప్పగిస్తే.. ప్రభుత్వంపై ఆర్ధిక భారం తప్పుతుందనే సలహాలు కూడా ప్రభుత్వానికి ఇస్తున్నారని జిల్లాస్థాయి అధికారులు చెబుతుండటం విశేషం. 

మొత్తానికి ఆరునెలల కూటమి పరిపాలనలో సీఎం చంద్రబాబు మార్కు పరిపాలన ఎక్కడా కనిపించలేదని.. ఎన్నికల ముందు ప్రభుత్వశాఖ ఉద్యోగులు, అధికారులకి ఇచ్చిన ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి పరిస్థితి ఇంకా ముందు ముందుకి కొనసాగుతుందా.. లేదంటే ప్రభుత్వం ఉద్యోగులకి ఇచ్చిన హామీలు నెరవేర్చి చంద్రబాబు మార్కు పరిపాలన మళ్లీ తీసుకు వస్తారా..? గత ప్రభుత్వ పాలనే బాగుందని అంటున్న ఉద్యోగులతోనే మళ్లీ కూటమి పరిపాలన చాలా బాగుంది అనిపిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సి వుంది..?!

visakhapatnam

2025-01-03 19:06:43

సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ కార్తికేయ మిశ్రా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు  కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికే య మిశ్రా , వీరపాండ్యన్‌, శ్రీధర్‌కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంవో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రా కు సీఎం కార్యదర్శిగా పదోన్నతిని కల్పించింది. డైనమిక్ ఐఏఎస్ గా.. ముక్కుసూటి అధికారిగా ఈయనకు మంచి పేరుంది.  దీనితో సీఎం కా ర్యదర్శిగా పదోన్నది దక్కినట్టు చెబుతున్నారు. ఇక గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా వీర పాండ్యన్‌ను , వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్‌లు విశ్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్‌కు పదోన్నతులు కల్పించింది.


amaravathi

2024-12-31 14:26:16

ఏపీ సమాచారశాఖలో ఏసీబీ విచారణ షురూ.. ఈరోజు-ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది..!

ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డిపై రాష్ట్రప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడం ఇపుడు ప్రభుత్వశాఖల్లో చర్చనీయాంశం అవుతున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈయనను ఢిల్లీ నుంచి సమాచారశాఖకు డిప్యూటేషన్ పై గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. అయితే అప్పటికే ఈశాఖలో ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో అడ్డగోలుగా 150 మంది వరకూ ఔట్ సో ర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఒక మీడియాకి చెందిన జర్నలిస్టులను నియమించారు. అంతేకాకుండా ఒకే మీడియా సంస్థకు కోట్లాది రూపాయ ల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి.. స్థానిక పత్రికలను పూర్తిగా అణగదొక్కారు. వర్కింగ్ జర్నలిస్టులకి ప్రెస్ అక్రిడిటేషన్ కూడా రాకుండా జీఓ నెంబరు 38ని తీసుకు వచ్చి చిన్న, మధ్య తరహా పత్రికల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యేలా చేశారు. గత ప్రభుత్వ హయాంలో సమాచారశాఖ కమిషనర్ చేసిన అడ్డగోలు వ్యవహారాలకు  అడ్డూ అదుపూ లేకుండా పోయింది. 

రెగ్యులర్ నియామకాలు చేయాల్సి వస్తే తమ వర్గానికి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు రావని.. వాటిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలోకి మార్చి అర్హతలు లేకపోయినా పోస్టులు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహారించారు. ఇదే విషయమై సమాచార హక్కు చట్టం క్రింద పలువురు జర్నలిస్టులు వివరాలు కోరినప్పటికీ సమాచారం ఎక్కువగా ఉందని చెప్పి రాష్ట్ర కమిషనరేట్ సదరు ఆర్టీఐ దరఖాస్తులను వెనక్కి తిప్పి పంపేసింది కూడా. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సదరు కమిషనర్ విజయకుమార్ రెడ్డి బిచానా మొత్తం సర్దేసి.. ఆగమేఘాలపై మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు. అయినా గత ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన వ్యవహారాలన్నింటినీ ఆధారాలతో సహాయ బయటకు తీయడానికి కమిషనర్ పై ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. 

ఈ నేపథ్యంలో ఆశక్త కరమైన సంఘటనలు ప్రాధమికంగానే బయట పడటంతో పూర్తి వివరాలు బయటకు తీయడానికి ఏసీబీ డి. జి  గుంటూరు ఏసీబీ  ఏ ఎస్ పి మహేంద్ర ని దర్యాప్తు అధికారిగా నియమించారు. గత కమిషనర్ సమయంలో కొన్ని కేడర్ ఉద్యోగాలు లేకపోవడం, అదే సమయంలో జిల్లాల విభజన జరడగంతో విభాగాలకు, విభాగాలకు సంబంధం లేని వారిని జిల్లా అధికారులుగా నియమించడంలో కమిషనర్ చక్రం తిప్పారు. దానితో అపుడే కమిషనర్ తేడా వ్యవహారాలపై ఈరోజు-ఈఎన్ఎస్ వరుస కథనాలు కూడా ప్రచురించింది. అయితే ఒక అఖిల భారత స్థాయి అధికారిపై ప్రభుత్వం విచారణ చేయదని.. ఇవన్నీ వార్తలకే పరిమితం అవుతాయని కొట్టిపారేసిన సమాచారశాఖ అధికారులు, సిబ్బందికి కూటమి ప్రభుత్వం ఏకంగా  ఏసీబీ ఏఎస్పీని విచారణ అధికారిగా నియమించడంతో గతంలో కమిషనర్ చర్యలకు వంతపాడిన వారికి ఇపుడు తడిచిపోతున్నది. ఇపుడు విచారణలో విజయకుమార్ రెడ్డిపై ఈరోజు-ఈఎన్ఎస్ కథకాలు కూడా కీలకంగా మారాయి.

-ఏపీ ఫైబర్ నెట్ మాదిరిగానే అందరూ వెనక్కి వచ్చేస్తారా..?
ఇటీవలే ఏపీ ఫైబర్ నెట్ లో అడ్డగోలుగా నియమించిన 400 మందిని తొలగించినట్టుగానే.. సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా అర్హతలు లేకపోయినా.. సిఫారసులు, కమిషనర్ పలుకుబడితో నియామకాలు చేసిన వారందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హయాంలో నియమించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.35 వేలు వరకూ జీతాలు ఇస్తూ వస్తున్నది సమాచారశాఖ. అయితే పోస్టులు ఖాళీలు చూపిస్తే పదోన్నతులు ఇవ్వాల్సి వస్తుందని.. అదే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పోస్టు భర్తీ చేపడితే పదోన్నతులు కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టవచ్చుననే కారణంతోనే అడ్డగోలుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించినట్టు ప్రాధమిక విచారణలో తేలినట్టుగా సమాచారం అందుతుంది. 

అంతేకాకుండా ఏఏ క్యాడర్ ఉద్యోగులు, అధికారులను ఏఏ క్యాడర్లకు పంపారు.. ఏఏ జిల్లాల్లో ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీచేశారు..? వారి విద్యార్హతలేంటి..? వారి నియామకం ఏ విధంగా జరిగింది..? ఎవరి సిఫారసు లేఖలతో జరిగింది..? దాని వెనుక ఉన్నది ఎవరు..? కమిషనరేట్ లో గత కమిషనర్ కి చెప్పింది చెప్పినట్టు చేసిన అధికారులు ఎవరు..? ఏ ప్రాతిపదిక ఒకే మీడియాకి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి వెంటనే బిల్లులు మంజూరు చేశారు..? తదితతర విషయాలన్నీ ఇపుడు ఏసీబీ విచారణలో బయటకు రానున్నాయి. దీనితో గత కమిషనర్ సమయంలో వివిధ క్యాడర్ లలోకి అర్హతలు లేకపోయినా వెళ్లిన వారంతా ఇపుడు ముందుగానే వారి పాత స్థానాలకు వెళ్లిపోవడానికి మార్గాలు వెతుకుతున్నారని సమాచారం అందుతుంది. చూడాలి.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ఏసీబి విచారణ చేపడుతున్నసమాచారశాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి విషయంలో ఏ విధమైన వ్యవహారాలు బయటపెడుతుందనేది..?!

visakhapatnam

2024-12-25 13:30:27

కరుణించిన కూటమి..బిఎల్వో నిధులు విడుదల.. ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలపై ప్రభుత్వం స్పందన

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సొంత ఖర్చులుతో స్టేషనరీ కొనుగులు చేసి, ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీలు వేసుకొని మరీ వైఎ స్సార్సీపీ ప్రభుత్వంలో ప్రత్యేకంగా బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులు నిర్వహిస్తే ఐదేళ్లుగా వారికి ఇవ్వాల్సిన అలవెన్సులు ఇవ్వలేదు.. ఆ విషయమై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురించడంతో నేడు కూటమి ప్రభుత్వం స్పందించింది.. అదే సమయం లో విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్, విజయవాడ జిల్లా కలెక్టర్  డా. లక్ష్మీషాలు కూడా స్పందించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వా ల్సిన ప్రత్యేక బిఎల్వో వేతనంపై ప్రభుత్వానికి  నివేధించడంతో కూటమి ప్రభుత్వం(ఎలక్షన్ కమిషన్) జీఓఆర్టీ నెంబరు 2200ని విడుదల చేసింది.

తద్వారా ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.12,250 వరకూ బిఎల్వో విధులు చేసినందుకు వేతనం రానుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కష్టాన్ని తెలుసుకున్న ప్రభుత్వం బిఎల్వో నిధులు విడుదల చేయడం.. వారి కష్టాలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురించ డంతో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సుమారు 1.28వేలకు పైగ సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందం పంచుకున్నారు..!

కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం..వారు పడుతున్న కష్టం కోసం ఆలోచించడం మొదలు పెట్టింది. గత ప్రభుత్వంలో సొంత ఖర్చులు పెట్టుకొని బిఎల్వో విధులు చేసినా.. వారికి ఇవ్వాల్సిన వేతనం మాత్రం ఇవ్వలేదు. దీనితో రంగంలోకి దిగిన ఈరోజు-ఈఎన్ఎస్ సచివాలయ ఉద్యోగుల కష్టాలను.. వారి ఆర్దిక ఇబ్బందులను ప్రత్యేక కథనాల రూపంలో ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది.   ఈ విషయంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీషాలు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రత్యేక బిఎల్వో వేతనం విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉద్యోగులకు రావాల్సిన రూ.12, 250 విడుల చేస్తూ 24 డిసెంబర్ 2024న జీఓ జీఓఆర్టీ నెంబరు 2200ని ( చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ వివేక్ యాదవ్) జారీ కావడానికి మార్గం సుగమం అయ్యింది.

2019 అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల సమస్యలను ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళుతున్నది. అయితే గత ప్రభుత్వం 75వ ప్రభుత్వశాఖగా సచివాలయాన్ని ఏర్పాటు చేసినా వీరికి ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే ఒకప్రభుత్వశాఖ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఐదేళ్లు దాటిపోతున్నా ఏర్పాటు చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. 

దానితో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఈరోజు-ఈఎన్ఎస్ వాస్తవాలను తరచుగా  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షాన ఆలోచిస్తూ.. ఒక్కో సమస్య పరిష్కరిస్తూ వస్తున్నది. ఇటీవలే విశాఖలోని జివిఎంసీ కమిషనర్ డా.సంపత్ కుమార్ వార్డు సచివాలయాల అడ్మిన్ల ఆర్ధిక కష్టాలు తెలుసుకొని..వారు సొంతంగా పెడుతున్న స్టేషనరీ ఖర్చుల భారం వారిపై పడకూడదని.. వారికి రూ.1000 నెలకి స్టేషనరీ బిల్లులు చెల్లించడానికి ముందుకి వచ్చారు. ఒక రకంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గా డా.లక్ష్మీషా ఉన్న సమయంలోనే సచివాలయశాఖలోని కొన్ని శాఖల సిబ్బందికి ప్రమోషన్లు కూడా వచ్చాయి. 

ఆయనను శాఖ మార్పు చేసిన తర్వాత ప్రభుత్వం కూడా  సచివాలయ ఉద్యోగులను గాలికి వదిలేసింది. ఆతర్వాత కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరానికి నోచుకుంటన్నాయి. ఉద్యోగాల్లో  చేరిన దగ్గర నుంచి నేటి వరకూ ఉద్యోగులకు వివిధ రకాల సర్వేలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు  సచివాలయ ఉద్యోగులే ఇంటర్నెట్, స్టేషనరీ, వైట్ పేపర్లు ఖర్చు పెట్టుకుంటున్నా.. వాటికి మాత్రం ఇంకా మోక్షం కలుగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలపై స్పందన రావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా.. కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రత్యేకంగా స్పందించం కూడా ఇపుడు ఇతర శాఖల్లో చర్చనీయాంశం అవుతున్నది..?!

visakhapatnam

2024-12-24 16:17:19

సచివాలయ ఉద్యోగులను పొమ్మనకుండా పొగపెడుతున్నారు..?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలను బ్రష్టు పట్టించేందుకు రాష్ట్రంలో కొందరు అధికారులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దారుణంగా వేధిస్తున్నారు. సీఎం మాటను స్వచ్చందంగా స్వీకరించి గ్రామాలు, వార్డుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా ఎలాగైనా ప్రభుత్వంపై బురద చల్లించే విధంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధ నలను అతిక్రమిస్తూ సొంత నిర్ణయాలు, వేధింపులతో ఉద్యోగులను ఉసూరు మనేలా చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడు ప్రభుత్వ సెలవు, రెండవ శని, ఆదివారాలు వచ్చినా ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా విధులు అప్పగించి మనశ్శాంతి లేకుండా ఉద్యోగులు వారంతట వారే ఉద్యోగాలను వదిలి వెళ్లేపోయేవిధంగా వేధింపులకు గురి చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయి. దానిని జీర్ణించుకోలేని కొందరు అధికారులు. సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వేలకు విధులకు రావడం లేదనే నెపంతో అర నిమిషం ఆలస్యంగా వచ్చినా ఆరోజు జీతం కట్ చేసేస్తున్నారు. పైగా ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఆదాయంగా చూపిస్తున్నామనే కోణాన్ని ప్రభుత్వం ముందుకి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన సెలవులను ఆరోగ్య కారణాల రీత్యా కూడా వినియోగించుకోకుండా సెలవు పెట్టిన రోజే ప్రత్యేక విధులు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ పరిస్థితి ఏ ఒక్క జిల్లాకో పరిమితం  చేయకుండా.. ముఖ్యంగా పట్టణ పురపాలక శాఖలోని జోనల్ కమిషనర్లు, కొన్ని చిన్న మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలు కావాలని ఉద్యోగులను వేధిస్తూ వారంతట వారే ఇదేం ఉద్యోగం రాబాబు అనే విధంగా వేధింపులకు గురిచేస్తున్నారు.

 పెట్టుకున్న సెలవులన్నింటిని కావాలన్ని రద్దు చేసి, ఆ సెలవులకి జీతం కూడా కట్ చేసేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వమే ప్రత్యేక పనులు అప్పగించిం దని వాటిని సెలవు రోజుల్లో చేయించే పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖలు ఉంటే ఏ శాఖలోనూ లేని నిభందనలను ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే కొందరు అధికారులు తమ సొంత నిర్ణయాలను అమలు చేస్తూ.. ఉద్యోగులను మానసికంగా కృంగ దీస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని నిఘా వర్గాలు కూపీ లాగితే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు పెట్టుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి పనితోపాటు, తీసేసిన వాలంటీర్ల క్లష్టర్ల పనులు కూడా చేస్తున్నారని.. అలా నిత్యం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని.. ఎలాగైనా ప్రభుత్వ పరిపాలనపై ఉద్యోగులతోనే బురద చల్లే విధంగా చేయాలంటే వారిని అదనపు విధుల పేరుతో వేధించడం తప్పా మరో మార్గం లేదనే విధంగా సొంత పైత్యాలను, అధికారాలను వినియోగిస్తున్నారని ఉద్యోగులు తీవ్ర మనో వేధనకు గురవుతున్నారు. 

అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సరఫరా చేయాల్సిన కార్యాలయ స్టేషనరీ సరఫరా చేయకుండా.. వాటిని సొంత డబ్బులతో కొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని.. కంప్యూటర్లు, ప్రింటర్లు పాడైనా సొంత నిధులతోనే రిపేర్లు చేయించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగులు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగని ఈ విషయాలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు దృష్టికి తీసుకెళితే ఆ విషయాన్ని మనుసులో పెట్టుకొని మరింతగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కూడా వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఉద్యోగులపై జోనల్ కమిషనర్లు చేస్తున్న ఉద్యోగ వేధింపులను చోద్యం చూస్తున్నట్టుగా చూసి పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనితో తమ సమస్యలు, వేధింపులు ఆపాలని ఉద్యోగులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో సుమారు లక్షా 28 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఇంచు మించుగా ఇలానే ఉందంటే అధికారుల వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవానికి ప్రభుత్వం తరపున ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సర్వీసు నిబంధనలు అమలు చేయకపోయినా..అత్యంత తక్కువగా జీతాలు ఉన్నా.. ఒక ఉద్యోగంతో అన్ని ప్రభుత్వ శాఖల పనులు చేయిస్తున్నా ఉద్యోగులకి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నా.. అధికారులకు మాత్రం ఇంకా కడుపు మండట చల్లారడం లేదని.. ఏదో ఒక కారణంతో తమను వేధిస్తున్నారని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అత్యధికంగా పనులు అప్పగిస్తే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగం మాకొద్దని మా అంతట మేమే ఉద్యోగాలకు రాజానామా చేసే విధంగా వేధింపులు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెలవులు కూడా వినియోగించుకోకుండా, ఆరోగ్య సమస్యలు వచ్చినా.. కూడా వాటిని వినియోగించుకోకుండా అడ్డుపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

ఇదే పద్దతి కొనసాగితే ఉద్యోగులంతా రోడ్డెక్కాలని కూడా నిర్ణయించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఒక తాటిపైకి రావడానికి సామాజిక మాద్యమాల ద్వారా చర్చలు పెట్టడం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రితోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ రంగంలోకి దిగితే తప్పా.. ఉద్యోగులను వేధించే అధికారుల శాడిస్టు చర్యలకు అడ్డుకట్టే పడే అవకాశాలు కనిపిండచడం లేదు. చూడాలి సచివాలయ ఉద్యోగులను వేధించి.. సెలవుల రద్దు చేసి.. సెలవుల్లోనే అదనపు విధులు అప్పగించి.. ఉద్యోగులను మానసికంగా కృంగదీస్తున్న అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందనేది..?!

viskahapatnam

2024-12-18 18:54:17

సచివాలయ ఉద్యోగులకు రంగు పడుద్ది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది..అదేనండీ లేట్ గా వస్తే ఒకరోజు జీతం కట్, కానీ వారు రోజంతా పనిచేయాలి.. ఆ విషయం నెలాఖరున జీతం వచ్చినపుడుగానీ వారికి తెలియదు.. అసలే ఒక ఉద్యోగం.. ప్రభుత్వంలోని అన్నిశాఖల విధులూ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు ఇదొక అదనపు బోనస్ గానే చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అనుకుంటే.. అంతకు మించి అదనపు పనులు కూటమి ప్రభుత్వంలో  చేయాల్సి వస్తుందని ఏకంగా అడ్మిస్ట్రేషన్ 2.0 ఎలా ఉంటుందో తమకు ప్రభు త్వం చూపిస్తుందని ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపారు.. అంతేకాదు కోరి మద్దతు ఇచ్చినందుకు ఆమాత్రం కూడా జీతాల్లో కోతలు, సెలవు రోజుల్లోనే విధులు, టార్గెట్లు పూర్తిచేయకపోతే మెమోలు ఇవ్వకపోతే ఎలా అంటూ సెటైర్లు కూడా వేసుకుంటు న్నారు. సీఎం చంద్రబాబు విజన్ పరిపాలన ఎక్కడా కనపడనీయకుండా  రాష్ట్ర అధికారులు అదనంగా పనిచేయించడానికే టార్గెట్ చేస్తున్నారంటూ మండి పడుతున్నారు..!

రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర అధికారులు చుక్కలు చూపించడానికి సిద్దమవుతున్నారు. అదనంగా చేసిన పనిగంటలను లెక్కించ కుండా.. విధి నిర్వహణకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఇన్ అండ్ అవుట్, మిడిల్ బయోమెట్రిక్ సక్రమంగా వేయకపోతే మాత్రం ఆరోజుని సిఎల్ గా భావించడానికి సిద్దపడుతున్నారు. అసలే గత నెల జీతాల్లో జియో ట్యాగింగ్ సర్వేలు అనుకున్నంత స్థాయిలో అవలేదని సిబ్బందికి ఒకటి, రెండు రోజుల జీతం కట్ చేసి బిల్లులు పెట్టిన ప్రభుత్వం.. మరో భారీ కోతలకు సిద్దపడుతున్నదని ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చి అన్ని శాఖల పనులూ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం దానికి రెట్టించిన ఉత్సాహంలో చేసిన పనులకు నజరానాగా జీతాల్లో కోతలు పెట్టడానికి సిద్దమవుతున్నదని బావురు మంటున్నారు. 

గత ప్రభుత్వం  సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన మోసాన్ని, కల్పించని ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం చేస్తుందని నమ్మి మద్దతు ఇచ్చినందుకు ఆదిలోనే రిటర్న్ గిఫ్ట్ ఈ రేంజ్ లో ఇస్తుందనుకోలేదని ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో చర్చిస్తున్నారు. భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయశాఖను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. ఇదంతా ప్రజా సేవ అనుకున్నామని.. కానీ అన్నిశాఖల్లో ఉద్యోగాలు భర్తీచేయాల్సి వస్తుందని.. కేవలం సచివాలయశాఖ ద్వారా 19 విభాగాల ఉద్యోగాలు తీసి అన్ని శాఖల పనులూ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదని వాపోతున్నారు. అలాగని ఈ శాఖకు చట్టబద్ధత గానీ, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబందనలు, ప్రమోషన్ చార్టు ఏమైనా ఏర్పాటు చేశారా అంటే అదేమీ చేయకుండా.. కేవలం ఉద్యోగులను అన్నిశాఖల విధులకు, పనులకు వినియోగించడానికే చూస్తున్నారని ఉద్యోగులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. 

గత ప్రభుత్వం చేయని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుందని.. కనీసం మాతృశాఖలకు తమను అప్పగిస్తుందని భావించామని.. అదేం చేయకుండా ఇక్కడే ఉంచి సెలవు రోజులు, డ్యూటీ టైమ్ కాకుండా అదనపు పనిగంటలు విధులు చేయిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. చేసిన విధులే అదనం అనుకుంటే దానికి టార్గెట్లు, వేదింపులు కూడా బోనస్ గా వస్తున్నాయని మండి పడుతూ కూటమిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నయమంటూ పశ్చాత్తప పడినట్టుగా వారి బావాలను గ్రూపుల్లో వ్యక్తం చేసు కుంటున్నారు. ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఏమీ అమలు కాకుండానే ఇంత పని ఒత్తిడి ఉంటే.. అన్ని పథకాలు అమలు చేస్తే.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మాకొద్దంటూ మా అంతట మేమే ఉద్యోగాలకు రాజీనామాలు చేసిపోయేంతగా టార్గెట్లు పెట్టేలా ఉన్నారంటూ మండిపడుతున్నారు. 

ఈ లెక్కన వీరి నిరసన ప్రజల వరకూ చేరితే ఏడాది తిరిగేలోపు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా కాకుండా జరగాలంటే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయశాఖకు కల్పించని చట్టబద్దత ఏర్పాటు చేయడంతోపాటు, ఉద్యోగుల ను మాతృశాఖల్లో విలీనం చేసి, అన్నిప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి కూడా పదోన్నతులు, ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించి.. ఆపై అడ్మిస్ట్రేటషన్ 2.0 అమలు చేస్తే ఫలితాలొస్తాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విష యంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది..?!

Visakhapatnam

2024-12-02 16:17:49

పేరుకే అడ్మిన్లు.. చేసేవి బిల్ కలెక్టర్ పనులు..?!

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడైనా ఒక శాఖ సిబ్బంది ఆ శాఖ పనులు మాత్రమే చేస్తారు..ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశా ఖగా కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం సిబ్బంది ఒక ఉద్యోగం.. అన్నిప్రభుత్వశాఖల పనులూ చేస్తారు.. ఇతరశాఖ ల్లో ఏశాఖ ఉద్యోగులకు ఆ శాఖ సర్వీసు నిబంధనలుంటే.. ఇక్కడ మాత్రం ఆరు విభాగాల సిబ్బందికి మాత్రం ఒకే రకమైన సర్వీసు నిబంధ నలుంటాయి.. కానీ ప్రమోషన్ ఛానల్ మాత్రం ఉండదు.. పైగా వార్డుల్లో పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు వాళ్లు చేయాల్సి పనులను ప్రక్కన పెట్టి..బిల్ కలెక్టర్లు, ఇంటింటా సర్వేలు, బిఎల్వో విధులు, జియో ట్యాటింగ్ సర్వేలతో పాటు వార్డుల్లో ఏదైనా శాఖల సిబ్బంది ఖాళీలు ఉంటే వారి పనులు కూడా వీరే చేయాలి.

వార్డు అడ్మిన్ లకు ఇంకో బోనస్ ఏంటంటే వీళ్లు ప్రజా సేవచేయడానికి వారికిచ్చే జీతం నుంచే అన్నీ ఖర్చుచేయాలి.. కార్యాలయాల్లో స్టేషనరీ, రిజస్టర్లు, తెల్లకాగితాలు, పెన్నులు,పెన్సిళ్లు, వీళ్లే కొనాలి, సెల్ ఫోనుల్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వీరే వేయించుకోవాలి, కంప్యూటర్లు, ప్రింటర్లు పాడైనా అవీ వీరే బాగుచేయించుకోవాలి.. ఇదెక్కడి ప్రభుత్వ ఉద్యోగమని ప్రశ్నిస్తే మాత్రం మున్సిపల్  అధికారులు వీరంతా టార్గెట్ అయిపోతారు.. మెమోలు, సస్పెన్లు, అధనపు పనుల షడన్ గా తెరమీదకు వచ్చేస్తాయి.. చదవడానికి వెరైటీగా ఉన్నాఇదే నిజం..!

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు వారి విధులే శాపాలుగా మారుతున్నాయి.. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని తేడా సర్వీసు నిబంధనలు కనీసం అమలు కాని ప్రమోషన్ ఛానల్ ఒక్క సచివాలయశాఖలోనే ప్రభుత్వం అమలు చేసి వీరందరితోనూ పొందిన ఒక్క ఉద్యోగంతో అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయించింది గత ప్రభుత్వం.. ఆ ప్రభుత్వం చేయించగా లేనిది మనమేమన్నా తక్కువ తిన్నామా అంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా రెట్టించిన పట్టుదల, ఉత్సాహంతో మరిన్ని అదనపు విధులు వీరితో చేయిస్తోందని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. వీరందరికీ ఉద్యోగాల్లోకి రాకముందు తెలియదు. ఇచ్చిన ఒక ఉద్యోగం ఒకటే అయినా.. అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాల్సి వస్తుందని.

 పైకి మాత్రం ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వంగా కీర్తి ప్రతిష్టలు పొందిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. విధుల్లోకి చేరిన తరువాత ఉద్యోగుల తిట్లు, శాపనార్ధాలను  కూడా అదే స్థాయిలో మూట గట్టుకుంది. ఇపుడు కూటమి ప్రభుత్వ పరిస్థితి కూడా అదే వీరిని చేస్తామన్న న్యాయం చేయపోగా ప్రైవేటు సంస్థల కంటే దారుణంగా టార్గెట్లు, బెదిరింపులు, వేధింపులు.. వెరసీ ఉద్యోగులు ఒక్కక్కరుగా లాంగ్ లీవ్ పై వెళ్లిపోతుంటే మరికొందరు.. ఇతర పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు.  75 ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి ఖాళీలు ఏర్పడటంతో అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుందని.. మాస్టర్ ప్లాన్ వేసిన గత ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయశాఖను తెరమీదకు తీసుకువచ్చింది. 

ఏకంగా ఒక ప్రభుత్వశాఖలో 1.30లక్షల ఉద్యోగాల కల్పన అంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే తొంగి చూసింది. కానీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అన్ని శాఖల పనులూ ఈశాఖ ఉద్యోగులే చేయాల్సి వస్తున్నది. కాదు కాదు చేయిస్తున్నారు. అలాగని వీరికి ప్రత్యేకంగా ఏమైనా సదుపాయాలు, ప్రయోజ నాలు కల్పించారా అంటే అదీ లేదు. ఇతర ప్రభుత్వశాఖల్లోని ప్రయోజనాలు, జీతాల కంటే తక్కువ. ఉన్నవి తీసేయడంతోపాటు ఇతర  ప్రభుత్వశాఖల ఉద్యోగులకు అమలు చేసే సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా..తలా తోకా లేని జీఓలతో ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.

 వాటిని సరిచేస్తామన్న కూటమి ప్రభుత్వం కూడా పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం అన్నిశాఖల పనులకు సచివాయల ఉద్యోగుల ను ఏ విధంగా వినియోగించిందో.. ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే వినియోగిస్తున్నది. కనీసం ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ఉద్యోగులుగా కూడా వీరిని చూడటం లేదు.  గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలుంటే.. వార్డుల్లో అడ్మిస్ట్రేటివ్ సెక్రటరీలను నియమిం చింది. వీరంతా పేరుకి సెక్రటరీలు, అడ్మిన్ లు మాత్రమే. చేసేవన్నీ బిల్ కలెక్టర్, సర్వేపనులు, ఇతర కార్యాలయ పనులు, జియో ట్యాగింగ్ లు, ఖాళీగా ఉన్న సిబ్బంది అదనపు విధులూ. 

విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఆరు విభాగాల్లోని ఉద్యోగులకు ఒకే రకమైన సర్వీసు నిబంధనలు అమలయ్యేవిధంగా జీఓనెంబరు-286 విడుదల చేసింది. గత ప్రభుత్వం. దానినే కొనసాగిస్తున్నది కూటమి ప్రభుత్వం కూడా. అదీ కూడా 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి వ్యతిరేకంగా. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వశాఖల్లో ఆయా శాఖలు, ఉద్యోగులు వారి కేడర్ ఆధారంగా సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఉంటాయి. అదేంటో విచిత్రంగా వార్డు సచివాలయాల్లో ఏకంగా ఆరు ప్రభుత్వశాఖల ఉద్యోగులందరికీ కలిపి ఒకే విధంగా సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేసింది. ఈ విషయమై ఉద్యోగులు ఎన్నిసార్లు ప్రశ్నించినా.. మరెన్నిసార్లు విలన్నవించుకున్నా వారి అర్జీలన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. మిగిలిన ప్రభుత్వశాఖల్లో ప్రభుత్వం స్టేషనరీకి నిధులు విడుదల చేస్తుంది. లేదంటే జిల్లా కార్యాలయాల నుంచి పంపిణీ చేస్తుంది. 

విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం కార్యదర్శిలు, అడ్మిన్లు వారికొచ్చే జీతంలో నుంచే స్టేషనరీ ఖర్చులన్నీ పెట్టుకోవాలి. అదేమంటే ప్రజల కోసం ప్రభుత్వం కోసం ఆ మాత్రం కూడా పెట్టుకోలేరా అంటూ అధికారులు ఉద్యోగులపై ఒంటికాలపై లేస్తున్నారు. సొంత శాఖ ఉద్యోగం కంటే ఇతర శాఖల్లో పనుల అధనంగా కేటాయించి అన్యాయం, స్టేషనరీలో జేబుల గుల్ల, సర్వీసు నిబంధనల్లో అన్యాయం, పేస్కేలు, పీఆర్సీ అమలులో అన్యాయం. ఇలా అడుగుడునా వీరికి కూడా అన్యాయమే జరుగుతూ వస్తున్నది. గ్రామవార్డు సచివాలయశా ఖలోని 19విభాగాల్లోని ఉద్యోగుల్లో కేవలం వ్యవసాయశాఖ, వాణిజ్యశాఖ, పంచాయతీరాజ్ విభాగాల ఉద్యోగులకు తప్పితే మరే ఇతర ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ సక్రమంగా లేవు.

 వారికి ఒకటి అరా పదోన్నతులు కూడా కల్పించింది గత ప్రభుత్వం. ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు బదిలీలు చేస్తామని కేబినెట్ లో తీర్మాణం చేసి ఆపై ఏమీ చేయకుండా కూర్చుంది. కూటమి ప్రభుత్వం లోనైనా సచివాలయ ఉద్యోగులకు ఒక దారీ తెన్నూ ప్రత్యేక జీఓ ద్వారా తీసుకురాకపోతే మాత్రం మరో ఐదేళ్లు వీరికి ఎలాంటి పదోన్నతులు, సర్వీసునిబంధనలు, ఉద్యోగ భద్రత కనిపించేట్టు లేదు..చూడాలి ఏం జరుగుతుందనేది..?!

Visakhapatnam

2024-11-25 18:36:01

మబ్బుల్లోనే మత్స్య సహాయకులు పదోన్నతులు..?!

ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలైపోవడం అంటే ఏంటో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను చూస్తే కొట్టొచ్చినట్టు ఖచ్చితంగా కనిపి స్తుంది..అవును పేరుకి ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా ఏర్పాటైనా.. ఈశాఖకు ఐదేళ్లు దాటిపోతున్నా కనీసం చట్టబద్దత లేదు.. కనీసం ఇందులో పనిచేసే ఉద్యోగులకు సక్రమమైన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా లేదు.. ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో గత ప్రభుత్వమే జాగు చేస్తుందనుకుంటే.. కూటమి ప్రభుత్వంలో మరింత ఆలస్యం అవుతున్నది.. కాదు. కాదు గత ప్రభుత్వం చేసిన తప్పు లను ఏ విధంగా సరిదిద్దాలో తెలియక కూటమి ప్రభుత్వం కూడా జుట్టుపీక్కుంటుంది..

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు.. గత ప్రభు త్వం తేడా విధానాలు.. ముందుకి సాగని ఈ ప్రభుత్వ దిద్దుటబాటు చర్యలు ఫలితంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఒక విభాగంగా వున్న గ్రా మీణ మత్స్య సహాయకులు కనీసం పదోన్నతులు లేకుండా పడిగాపులు కాస్తున్నారు.. మెరిట్ లిస్ట్ ఆధారంగా పదోన్నతులు కల్పిం చాలని చూసినా.. మత్స్యశాఖ కమిషనరేట్, జిల్లా కార్యాలయాల్లో చేసిన తప్పుల కారణంగా మెరిట్ నష్టపోయిన ఉద్యోగులకు ఉపస మనం కూడా దక్కలేదు..వెరసీ గ్రామీణ మత్స్య సహాయకుల పదోన్నతులతోపాటు.. జిల్లా అధికారులైన డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతులు కూడా పాత రోస్టర్ విధానం కాకుండా కొత్తగా కోర్టు తీర్పుల ఆధారం చేపట్టాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పదోన్నతులు మబ్బుల్లోనే ఉండి పోయా యి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ గా తలచుకున్నా ఈశాఖలోని గ్రామీణ మత్స్యసహా యకులు, ఇదేశాఖలోని డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతుల వ్యవహారం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి సాగడం లేదు. ఆఖరికి ఈశాఖ కమిషనర్  మంత్రి, ఇతర అధికారుల నిర్ణయాలు, ఉద్యోగుల అభ్యర్ధనలతో సచివాలయ శాఖ నుంచి మత్స్యశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి రాసిన సిఫారసు లేఖ కూడా పక్కన పడిఉంది. ప్రభుత్వంలో ఏవో సాంకేతిక కారణాలు చూపి అమరావతిలోని రాష్ట్ర అధికారులు ఈ పదోన్నతుల దస్త్రాలను, విఎఫ్ఏల విలీన అంశాలను ముందుకి కదపడం లేదు. గ్రామ, వార్డు సచివాలయశాఖలో విఎఫ్ఏ లుగా ఉన్న వారిని అసిస్టెంట్ ఇనెస్పెక్టర్ పదోతున్నలు ఇవ్వాల్సి వుంది. దానికోసం విఎఫ్ఏల మెరిట్ లిస్టు జాబితా సిద్దం చేయాలను కున్నారు. కానీ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వీరి నియమాకాలు జరిగిన సమయంలో విఎఫ్ఏలకు ప్రభుత్వం కొన్ని గ్రేస్ మార్కులు కలిపింది. 

తద్వారా విఎఫ్ఏల్లో కొంత మందికి మెరిట్ జాబితాలో వారి పేర్లు జిల్లా పరిధిలో టాప్ టెన్ లోకి వెళ్లే అవకాశం వుంది. కానీ అలా ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులు కొన్ని జిల్లాల్లో విఏఎఫ్ లకు కలపకపోవడంతో వారు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కమిషనరేట్లను ఆశ్రయించారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ డా.లక్ష్మీషా ఉన్న సమయంలోనే ఇక్కడ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా మిగిలిన అన్నిశాఖల సిబ్బందికి పదోన్నతులు కల్పించే పనులు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఆయ నకు మరోశాఖకు బదిలీ జరిగిపోయింది. తరువాత ఈ శాఖలోకి వచ్చిన ఏ డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల, సర్వీసు రూల్స్ విషయంలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి వేసిన దాఖలాలు నేటికీ  కనిపించలేదు.

జిల్లా మత్స్య శాఖ కార్యాలయాల్లో నియమాకాల్లో సమయంలో ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులతో కలిపి మెరిట్ లిస్టు జాబితాలను తయారు చేయాల్సిన అధికారులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. తీరా విఎఫ్ఏలకు పదోన్నతులు కల్పించాలని చూసిన సమయంలో ఈ సాంకేతిక అంశం తెరపైకి వచ్చింది. అలా మెరిట్ లిస్టులో తమపేర్లు లేవని..ప్రభుత్వం కలిపిన గ్రేస్ మార్కులు తమకు కలవలేదని మెరిట్ నష్టపోయిన విఎఫ్ఏలు జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారులతోపాటు, అమరావతిలోని కమిషనరేట్ లో కూడా ఫిర్యాదులు చేశారు. ఉద్యోగు లు నష్టపోయిన అంశంలో స్పందన లేదు. కానీ గ్రేస్ మార్కులు కలపని విషయమై జిల్లాశాఖ అధికారులు తమ సమస్య  పరిష్క రించలేదని కమిషనరేట్ కి, ఇదేశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసిన విఎఫ్ఏలకు మాత్రం మెమోలు ఇచ్చారు ఇదేశాఖ అధికారులు. 

అంటే ఇక్కడ చేయాల్సిన పనులు చేయకపోగా.. తమనకు అన్యాయం జరిగిందని రాష్ట్ర అధికారులకు మొరపెట్టుకుంటే చర్యలు తీసుకోవ డానికి అత్యంత వేగంగా ముందుకి కదిలిన జిల్లా అధికారులు, మెరిట్ లిస్టులో నష్టపోయిన విషయంలో విఎఫ్ఏలకు న్యాయం చేయడానికి మాత్రం ముందుకి రాలేదు. అలాగని జిల్లా అధికారులు పంపిన మెరిట్ లిస్టులపై కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా వీరి పదోన్నతుల వ్యవహారం ఇంకా మబ్బుల్లోనే తేలుతూ ఉంది.

మత్స్యశాఖలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులకే కాదు.. జిల్లా అధికారుల పదోన్నతులపై కూడా రాష్ట్రప్రభుత్వం గానీ, ఇదేశాఖలోని కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విఎఫ్ఏలకు మెరిట్ లిస్టుల్లో తేడాలున్నాయని వారి ప్రమోషన్ ఫైల్ పక్కన పెట్టేసినట్టే.. జిల్లా మత్స్యశాఖ అధికారులు(డిప్యూటీ డైరెక్టర్)ల పదోన్నతులు కూడా ఎప్పటి నుంచో వస్తున్న రోస్టర్ విధానం కాకుండా  కోర్టు తీర్పుల విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి పదోన్నతులను ముందుకి సాగనీయకుండా చేస్తున్నారు మత్స్యశాఖ కమిషనరేట్ అధికా రులు. ప్రభుత్వంలోని ఎప్పటినుంచో వస్తున్న రోస్టర్ విధానంలోనే పదోన్నతుల ఫైల్ పెట్టాలని మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని సామా జిక వర్గాల ఉద్యోగులకు న్యాయం చేయాలని చూస్తున్నా.. ఇదేశాఖలోని కొందరు రాష్ట్రస్థాయి అధికారులు మాత్రం కొన్ని సమాజిక వర్గాల అధికారులకు పదోన్నతులు రాకుండా చేయడానికి, రోస్టర్ విధానం కాకుండా కోర్టు అంశాలను తెరపైకి తీసుకొచ్చి పదోన్నతుల సవ్యంగా జరగకుండా అడ్డుపడుతున్నారు.

 ఫలితంగా ఇప్పటికే నలుగురు డిడిలు వారి సర్వీసులో జెడీ ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయారు. అయినా మత్స్యశాఖ అధికారులు మాత్రం డిడి ప్రమోషన్ ఫైల్స్ ని ముందుకి సాగనీయడం లేదు. ఈ విషయంలో సాక్షత్తూ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలుగజేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఒక్క గ్రామీణ మత్స్యసహాయకుల పదోన్నతులే కాకుండా జిల్లా అధికారుల పదోన్న తులు కూడా ప్రస్తుతం గాల్లోనే ఉన్నాయి. మరో వైపు జిఏడీ నుంచి కూడా నిర్ధిష్టమైన ఆదేశాలు రాకపోవడ కూడా ఆయా ప్రభుత్వశా ఖల్లో కమిషనరేట్లలలో సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, మెరిట్ లిస్టు జాబితా వ్యవహారాల పనులు జరగడం లేదు. గత ప్రభుత్వంలోనే విఎఫ్ఏల నుంచి డిడి ల వరకూ ప్రమోషన్లు రావాల్సి ఉన్నా.. ఒక వర్గం అధికారులు కావాలని చేస్తున్న తాత్సారం, అడ్డు పుల్లల చర్యల వలన అన్ని విభాగాల్లోని సిబ్బంది, అధికారులకు పదోన్నతులు లేకుండా పోతున్నాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృశాఖల్లో విలీనం చేయాలనే నిర్ణయాలన్ని 19శాఖల్లో 18శాఖల కమిషనర్లు ముందుకి కదపకపోయినా.. ఒక్క మత్స్యశాఖ కమిషనర్ కదిపినా ప్రభుత్వం లో చర్యలు మాత్రం శూన్యం. ఇదే విధానం కొనసాగితే సచివాలయ గ్రామీణ మత్స్య సహాయకులు పదోన్నతులు లేకుండా సర్వీసు మొత్తం విఎఫ్ఏలుగానే ఉండిపోవాల్సి వుంటుంది..?!

visakhapatnam

2024-11-22 13:49:38

సంక్షోభంలో సచివాలయ సంక్షేమ సహాయకులు..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువచేసే సంక్షేమ, విద్యా సహాయకులు మాత్రం ఇంకా సంక్షోభంలోనే కూరుకుపోయి ఉన్నారు.. ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇంటింటీకి తిరిగి అందించి, కొత్తవారికి పథకాలను దరఖాస్తు చేసే సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు మాత్రం వారి సంక్షేమం చూసే నాధుడి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు.. సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యు కేషన్ అసిస్టెంట్లు ఇంకా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ దూరంగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వ శాఖలో పని చేసే ఉద్యోగి ఆ శాఖపనులు మాత్రమే చేస్తాడు.. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖలకు చెందిన అన్ని పనూలు, విధులు నిర్వర్తించాలి.. ఇంత చేసినా వీరి సర్వీసు విష యంలో ప్రభుత్వం కల్పించాల్సిన సర్వీస్ రూల్స్, పదోన్నతులు, ప్రభుత్వశాఖ మాత్రం ఏర్పాటు చేయదు.. అదేమంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి సచివాలయ ఉద్యోగులు కూడా బలికావాల్సి వస్తుందనే డైలాగుని కూటమి ప్రభుత్వం ప్రతీదానికి వినియోగించడం మొదలు పెడుతోంది..!

2019 అక్టోబర్ 2 న  గ్రామ, వార్డు సచివాలయాల్లో తొలుత నియామకాల్లోకి చేరిన ఉద్యోగులు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శిలు. వీరి నియా మకాలు అన్నీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. కానీ వీరు మాత్రం బిసివెల్ఫేర్, సోషల్ వెల్పేర్, మైనార్టీ వెల్ఫేర్, రెవిన్యూ, ఎడ్యుకేషన్ ఇలా అన్ని విభాగాల పనులూ, విధులు చేపడుతున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న అన్ని కుటుం బాలకు సచివాలయాల నుంచి సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసి.. పథకాలు పొందేందుకు అన్ని పనులూ వీరే చేస్తుంటారు. అంతేకా కుండా పాఠశాల్లో మరుగుదొడ్ల సొగసు, శుభ్రం యొక్క ఫోటోలు కూడా వీరే తీసి ప్రభుత్వానికి మరుగు మురికి స్థితిని తెలియజే స్తుం టారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే వీరికి చాలా సంక్షేమం ప్రభుత్వం చేస్తుందని బావిస్తుంటారు. 

కానీ ప్రజల సంక్షేమం చూసే వీరు మాత్రం సంక్షోభంలోనే ఉండిపోయారు. ఉద్యోగాల్లోకి చేరి ఐదేళ్లు దగ్గర పడుతున్నా.. నేటికీ వెల్ఫేర్ అసిస్టెంట్లకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గానీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదంటే నమ్ముతారా..? వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖలో పనిచేసే ఉద్యోగులకు సదరు శాఖలోని ఉద్యోగుల క్యాడర్ ను బట్టి ఆయాశాఖల సర్వీసు నిబంధనలు అమలు చేస్తారు. కానీ విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేసే ఉద్యోగులకు సక్రమంగా క్యాడర్ లేదు సరికదా.. చాలా విభాగాల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండానే వదిలేసింది.

ప్రజలకు సమయానికి పించన్లు అందకపోయినా.. పథకాలకు ప్రజల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరకపోయినా ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు ఒంటికాలిపై లేచేది ఈ వెల్ఫేర్ అస్టెంట్లపైనే. కానీ వీరి సమస్యలు, సంక్షేమం మాత్రం ఇప్పటి కొచ్చి మూడు సంక్షేమశాఖల్లో ఏ శాఖ మంత్రిగానీ, ప్రభుత్వశాఖల అధికారులు గానీ తీర్చిన పాపాన పోలేదు. దీనితో వీరి సర్వీసులో అపుడే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇకనపైనా వీరికి సర్వీసు నిబంధనలు ఏ ప్రభుత్వశాఖలోనికి అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్క ముక్కలోచెప్పాలంటే సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఏ ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉంటూ.. అన్ని శాఖల పనులు చేస్తున్నట్టుగానే వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఏ శాఖ కేటాయింపులు లేకుండా.. అన్ని సంక్షేమ శాఖల పనులు చేస్తూ.. ప్రజకలు సేవలు అందిస్తున్నారు.

 గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి తమ గోడు వినిపించినా.. వీరి సమస్యలు అసెంబ్లీ  గేటు కూడా దాటలేదు. అలాగని కూటమి ప్రభుత్వంలోనైనా పరిష్కారానికి నోచుకుంటుందా అంటే.. కనీసం వీరి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే ఒక్క ఎమ్మెల్యే కూడా కనిపించలేదు. దీనితో వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఏ ప్రభుత్వశాఖ సర్వీసు నిభందనలు అమలు చేస్తారు.. మరేశాఖ ప్రమోషన్ చార్టు కల్పిస్తారో తెలియకుండా ఉంది. వీరితోపాటు విధుల్లోకి చేరిన ఆరోగ్య సహాయకులు ఇన్ సర్వీసు శిక్షణ పొంది..కాస్త జీతం పెంచుకొని మరీ స్టాఫ్ నర్సులు అయ్యారు. ఆరోగ్యశాఖలో గ్రామీణ వ్యవసాయ సహాయకులుగా ఉన్నవారు పదోన్నతులు పొందుతూ ఏఈఓలు అవుతున్నారు.. హార్టీకల్చర్ సహాయకులు కూడా హెచ్ఈఓలుగా పదోన్నతులు పొందుతున్నారు. వీరు, మహిళా పోలీసులు మాత్రం ఉన్నచోట నుంచి కనీసం అంగుళం కూడాద కదల్లేదు.

 అసెంబ్లీ ముందు జరిగిన క్యాబినెట్ సమావేశంలో వీరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించినా.. అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతున్నా ఒక్క ఎమ్మెల్యేగానీ, వెల్ఫే ర్ మంత్రులు గానీ వెల్ఫేర్ అసిస్టెంట్లకు అమలు చేయని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ పై కనీసం చర్చకు తెరలేపలేదు. క్యాబినెట్ సమావేశాల్లో మాత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేసి వారికి ఆయా ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధలు అమలు చేస్తామని నిర్ణయించారు. ఆ తరువాత ఒక్క మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తప్పితే మరే ఇతర శాఖల మంత్రులు, అధికారులు ప్రభుత్వానికి తమ శాఖ ఉద్యోగులను వెనక్కి పంపాలని లేఖలు రాయలేదు. అలా రాసిన మత్స్యశాఖ సహాయకుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే పద్దతి కొనసాగితే మరో ఐదేళ్లు గడిచినా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవు. 

ఇపుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతీదానికి ఒక కామన్ డైలాగుని జేబులో పెట్టుకొనే మాట్లాడుతున్నది.. అదేమంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలనే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని చెబుతోంది. గత ప్రభుత్వం తమ విశేష అధికారాలు వినియోగించి తప్పులు చేస్తే.. ఇపుడు కూటమి ప్రభుత్వం అదే విశేష అధికారులు వినియోగించి ఆ తప్పులను సరిచేయవచ్చు. కానీ అలా చేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకి వేయడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా దీన స్థితిలో ఉందని మాత్రం చెబుతున్నది. వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వలన ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆర్ధిక భారం పడదు. 

కానీ ప్రభుత్వం మాత్రం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు ఇంటి ముంగిటే అంది స్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో సమస్యలు పరిష్కరిం గలిగితే ప్రభుత్వానికి మేలు, పేరు వచ్చేలా ఉద్యోగులు పని చేస్తారనే గ్యారెంటీ ఉంది. అదేవిధంగా  సమస్యలు పరిష్కారం కాకపోయినా.. ఇదే ఉద్యోగుల ప్రభుత్వంపై  వ్యతిరేకతను కూడా ఆ ఇద్దరికే
( ఒకటి అడిగిన వాడికి.. రెండు అడగని వాడికి) చెప్పి మచ్చతెచ్చినా తేవచ్చు.. చూడాలి ఎన్నికల ముందు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఎప్పటికి నిలబెట్టుకుంటుందో.. సమస్యలు పరిష్కరిస్తుందో..?!

visakhapatnam

2024-11-21 12:42:43

అడకత్తెరలో మహిళా పోలీసుల భవితవ్యం..?!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల భవితవ్యం మళ్లీ అడకత్తెరలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.. వీరి నియామకాలు ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరగని కారణంగా వీరు పోలీసుశాఖకు చెందరంటూ కోర్టులో కేసులు పడ్డాయి. దానితో గత వైఎ స్సార్సీపీ ప్రభుత్వం వీరంతా పోలీసుశాఖకు సంబంధం లేదని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసి వీరికి ఏ ప్రభుత్వశాఖ కేటాయించకుండా గాల్లోనే పెట్టి మళ్లీ పోలీసుశాఖ సేవలే చేయించింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనైనా ఫలితం వుంటుందా అంటే.. ఏదో ఒకటి చేసి వీరికి న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చేసిన హోం మంత్రి ప్రకటనపై ప్రభుత్వానికి కూడా దారీ తెన్నూ కనిపించడం లేదు.. వీరిని పీఎస్పీఆర్బీ పరీక్ష రాయించి పోలీసుశాఖ శిక్షణ ఇచ్చి పోలీసులుగా తీసుకోవాలా..? లేదంటే గ్రామ, వార్డు సచివాలయ విభాగా ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి స్లైడింగ్ ఇచ్చి సర్దుబాటు చేయాలా.. అదీ కాదంటే పోలీసుశాఖలోనే మినిస్టీరియల్ స్టాఫ్ గా కొనసాగిం చాలా అనే విషయంలో ప్రభుత్వం నిర్ఱయం తీసుకోలేకపోతున్నది.. మరోవైపు తమకు పోలీసుశాఖ వద్దని, యూనిఫారం అసలే వద్దని.. మహిళా పోలీసు ల్లోనే కొందరు అటు, ఇటు గెంతులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలీక బుర్రలు పీక్కుంటున్నది. ప్రస్తుతం వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు. కానీ వీరికంటూ ఏ ప్రభుత్వ శాఖ కేటాయించలేదని గత ప్రభుత్వం హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేసింది. అలాగని వీరిని పోలీసులుగా అనడానికి ఇదే పోలీసుశాఖలో హోంగార్డు నుంచి ఎస్సై వరకూ వీరిని పోలీసులని అనడానికి ఇష్ట పడటం లేదు. కానీ.. పోలీసుశాఖకు చెందిన అన్ని పనులూ వీరితోనేచేయిస్తున్నారు. అవి కాకుండా రెవిన్యూ విభాగానికి చెందిన బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్), సంక్షేమ శాఖకు చెందిన పథకాలు పంపిణీ, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చెందిన బిల్ కలెక్టర్ సేవలు, విద్యాశాఖకు చెందిన ఎన్యుమరేషణ్, జియో ట్యాగింగ్, ఏశాఖలోనైనా సిబ్బంది తక్కువగా ఉంటే వారి పనులు, ఇతర కార్యాలయ పనులూ అన్నీ వీరే చేస్తున్నారు.

 ప్రస్తుతానికి వీరి ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేకపోయినా భవిష్యత్తులో మాత్రం చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తుంది. కారణం వీరికి ఏ ప్రభుత్వశాఖ కేటాయించకపోవడమే. అలాగని ప్రభుత్వం కోర్టుకి సమర్పించిన అఫడవిట్ కారణంగా వీరు పోలీసుశాఖకు చెందరు కనుక.. పోలీసుశాఖకు చెందిన సర్వీసు నిబంధనలు, పదోన్నతులు కూడా వీరికి వర్తించవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీరు కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలకి ఎక్కువ.. రెగ్యులర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలకు తక్కువ అన్నట్టుగా తయారైంది వీరి పరిస్థితి.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 విభాగాల్లో చాలా శాఖల్లో సిబ్బంది కొరత అధికంగా వుంది. ముఖ్యంగా వార్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ కార్యార్శిలు, గ్రామ సచివాయాల్లో పంచాయతీ కార్యదర్శిలు ఎక్కువగా వుంది. ఇక్కడ సిబ్బంది లేక ఉన్నవారిలోనే ఎవరో ఒకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలకు, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లమో విద్యార్హతలుగా ఉన్నాయి. పేస్కేలు కూడా ఒకే విధంగా వుంటుంది. ఒక్క కార్యదర్శిలకు వీరికి రూ.850 మాత్రమే వ్యత్యాహం ఉంది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తే.. ప్రస్తుతం అత్యవసరంగా ఉన్న .. ఎక్కువగా ఖాళీలున్న పంచాయతీలకు, వార్డు సెక్రటరీలకు స్టైడింగ్ ఇస్తే పరిపాలన కూడా సజావుగా సాగడానికి ఆస్కారం వుంటుంది. 

మరికొన్ని చోట్ల వెల్పేర్ అసిస్టెంట్లు, కొన్ని చోట్ల అగ్రికల్చర్, హర్టీకల్చర్, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. చాలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోస్టులు లేక ప్రజలకు సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీసులకు న్యాయం చేయాలన్నా, వారికి ప్రభుత్వశాఖ కేటాయించాలన్నా వారినికి డిపార్ట్ మెంటల్ స్లైడింగ్ ఇవ్వడమే సబబని..ఆ కోణంలోనే సలహాలు కూడా వెళుతున్నట్టు సమాచారం అందుతుంది.  

మరోప్రక్క రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13500కి పైగా ఉన్న మహిళా పోలీసుల వలన పోలీసుశాఖకు స్టేషన్లు వారీగా  కీలకమైన సమాచారం అందుతుంది. అత్యవసర పనులకు వీరినే వినియోగిస్తున్నారు. పైగా పోలీసుశాఖలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అలాగని మహిళా పోలీసులను పీఎస్పీఆర్బీ ద్వారా మళ్లీ పరీక్ష రాయించి వారికి శిక్షణ ఇచ్చి పోలీసులుగా తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా ప్రస్తుతం మహిళా పోలీసులుగా ఉన్నవారిలో కొందరు  ఈ శాఖ నుంచి తమను వేరే శాఖకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు కాఖీ చొక్కా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంకా ఎక్కువగా ఖాళీలు ఉన్న ఐసీడిఎస్ లో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

 కొందరు మాత్రం పీఎస్పీఆర్బీ ద్వారా తమను పోలీసులుగా మార్చాలని కోరుతున్నారు. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వంలోని సర్వీసు నిబంధనలు సహకరిస్తాయా..? లేదంటే వీరికోసం ఉన్న సర్వీసు నిబంధనలను సవరిస్తారా..? ప్రత్యేక ఆర్డినెన్సులు చేస్తారా..? అనేదానిపై కూడా క్లారిటీ లేదు.  మహిళా పోలీసులను గాల్లోనే ఉంచి గత ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు కాలం గడిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి వంగలపూడి అనిత విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా పరిష్కార మార్గం చూపించడానికి పోలీసుశాఖలో దారులు కనిపించకపోవడంతో మేథోమధనం ప్రారంభించారు. 

గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ఇపుడు వారి సర్వీసు మొత్తం కోల్పోవాల్సి వస్తున్నది. వారితోపాటు విధుల్లోకి చేసిన ఇతర ప్రభుత్వశాఖల సిబ్బందికి పదోన్నతులు లభిస్తుంటే.. వీరికి ప్రస్తుతం ప్రభుత్వశాఖ కూడా ఏర్పాటు కాలేదు.  ఏశాఖలోకి పంపుతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే శాఖలో ఉంచడానికి కోర్టుకేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అలాగని గత ప్రభుత్వం ఇచ్చిన జీఓలు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఆధారంగా పదోన్నతులు కల్పించానికి వీరు పోలీసుశాఖకి చెందిన వారు కాదు. పైగా పోలీసుశాఖలోని సిబ్బందే వీరిని తమశాఖ ఉద్యోగులుగా అంగీకరించడం లేదు. కోర్టుకేసులపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అఫడవిట్ ఇవ్వడంతో వీరు పోలీసుశాఖకు చెందిన వారు కాదు. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఏంటనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి.. వీరిని ఖాళీగా ఉన్న శాఖల్లోకి స్లైడింగ్ అయినా ఇవ్వాలి..? లేదంటే కోర్టు కేసులు క్లియర్ చేసి..వీరికి మళ్లీ నూతనంగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అయినా ఏర్పాటు చేయాలి..? అదీ కూడదంటే పోలీస్ రిక్రూట్ మెంట్ ద్వారా ప్రత్యే కంగా పరీక్ష పెట్టి మళ్లీ వీరిని పోలీసులుగా అయినా తీసుకోవాలి..? వీటిలో ఏ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు జీవితాంతం ఏ ప్రభుత్వశాఖకు చెందని ఉద్యోగులుగా ఉంటూ.. పనిచేస్తూ.. ఎలాంటి పదోన్నతులు, ప్రభుత్వ ప్రయోజ నాలకు నోచుకుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వశాఖల మంత్రుల ద్వారా సూచనలు, సలహాలు స్వీకరి స్తున్న హోం మంత్రి అనిత మహిళా పోలీసుల విషయంలో ఏం పరిష్కార నిర్ణయం తీసుకుంటారనే దానిపై  మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు..?!

visakhapatnam

2024-11-20 07:32:17

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే చీదరింపులు..!

ఈ గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ఏం  పనీపాటా లేదు.. సంవత్సరం పొడవునా ఏదో ఒక సర్వే పేరుతో ప్రతీ ఇంటికీ వచ్చేస్తు న్నారు.. ? మాకు ఏ ప్రభుత్వ పథకాలూ రావు.. మేం ట్యాక్సులు కడుతున్నాం.. ఏ ప్రభుత్వ పథకమూ తీసుకోని మా వివరాలతో మీరేం చేసుకుంటారు.. ఇది మా మాటగా మీ అధికారులకు చెప్పండి.. ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్లిపోండి.. అంటూ సచివాలయ ఉద్యోగులపై మొహంపై తలుపులేస్తున్నారు.. కొన్ని అపార్ట్ మెంట్లలో అయితే ఏకంగా గేటు కూడా దాటనీయకుండా సెక్యూరిటీ గార్డులే పొమ్మని కసురు కుంటు న్నారు.. కక్కలేక మింగలేక సచివాలయ ఉద్యోగులు చీదరింపులు పడుతున్నారు.. మరో వైపు 2వ శనివారాలు, ఆదివారాలు కూడా విధులకు రావాల్సిందేనంటూ అధికారులు వెంట పడుతున్నారు. రానివారికి ఆరోజు ఆఫ్ సెంట్ వేస్తున్నారు.. మరికొందరికీ షోకాజ్ నోటీసులు పంపిస్తున్నారు.. ఎవరైనా ఉద్యోగులు సెలవుపై వెళ్లినా.. వాళ్లు అక్కడ కూడా ఏదో ఒక సమాచారం అంటూ పనిచేయాల్సి వస్తున్నది. సంప న్న వర్గాల నుంచి ఎదురౌతున్న చీదరింపులు, చీత్కారాలతో సచివాలయ ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మా బాధలు అధికా రులకు తెలియవు.. వారికి కావాల్సిందల్లా అనుకున్న టార్గెట్ పూర్తవడమేనంటూ వాపోతున్నారు.. వైఎస్సార్సీపీలో పాలనలోనే అను కుంటే కూటమి పరిపాలనో మరింతగా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నాు.. ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజ నాల ఊసెత్తకుండా ఊపిరి సలపకుండా ఒక్క ప్రభుత్వశాఖ కాకుండా అన్ని శాఖల పనులూ మాకే చెబుతున్నారంటూ గొల్లుమంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న జియో ట్యాగింగ్, సర్వేలను ఉన్నతశ్రేణి కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంటింటా సర్వే, ట్యాటింగ్ ప్రభుత్వమే చేయమని సిబ్బందిని పురమాయించినా.. వాటిని నమోదు చేయడానికి అపార్ట్ మెంట్లకు వెళుతున్న సిబ్బందికి చీదరింపులు, చీత్కారాలు ఎదురువుతున్నాయి. దానితో ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎదుర్కొని మాటలన్నీ వారి నుంచి పడాల్సి వస్తున్నది. ఏకంగా కొన్ని అపార్ట్ మెంట్లు, ప్రత్యేక ఇళ్ల వద్ద సిబ్బందిని దొంగలను చూసినట్టుగానే చూస్తున్నారు. అక్కడుండే వాచ్ మెన్ లతోనే చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా.. అదంతా మాకు అనవసరం క్లస్టర్ల వారీగా ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలు జియో ట్యాగింగ్ పూర్తికావాల్సేందేనని మీరు ఏంచేస్తారో.. ఎలా చేస్తారో.. ఎవరిని బ్రతిమిలాడుకుంటారో తెలీదు.. ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయకపోతే షోకాజ్ నోటీసులు అందుకుని సమాధానం చెప్పాల్సి వుంటుందని హుకుం జారీ చేస్తున్నారు.

 తీరా ఇంటింటీకి తిరిగి జియో ట్యాగింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఉద్యోగులు విధిని సమయం ఉదయం ఐదు గంటల నుంచి సాయం త్రం ఐదుగంటల మధ్య కాకుండా ఆ తరువాత యాప్ పనిచేయడం మొదలు పెడుతున్నది. ఆ సమయంలో ఇళ్లకి వెళ్లి జియోట్యా గింగ్ చేయడానికి గృహస్తులను వెళ్లి బ్రతిమిలాడినా.. అమ్మా మీకు వేలా పాలా లేదా రాత్రి సమయంలోనూ ఇంటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు ఎవరమ్మా మిమ్మల్ని పంపిందంటూ సిబ్బందిపై ఒంటికాలపై లేస్తున్నారు స్థానికులు. మరికొన్ని చోట్ల  అపార్ట్ మెంట్ వాసులు.. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమం పథకాలూ రావు మా వివరాలు, జియో ట్యాగింగ్ చేయడానికి వీల్లేదు వెళ్లిపోండంటూ సిబ్బంది మొహంపై డోర్లు వేస్తున్నారు. మరికొందరు జియో ట్యాగింగ్ కి ఒప్పకున్నా.. ఆ సమయంలో యాప్ పనిచేయడం లేదు. దీనితో ముందుకి వెళితే నుయ్యి.. వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది సిబ్బంది పరిస్థితి. 

కార్తీకమాసంలో మహిళలు ఒకపూట ఉపవాసం ఉండి పనులన్నీ చేస్తుంటారు. అదే సమయంలో ఈ సర్వే కార్యక్రమం వచ్చినా సిబ్బంది పనిచేయడానికి సిద్దంగా ఉన్నా.. ప్రజల నుంచి మాత్రం స్పందన చాలా తక్కువగా ఉంటున్నది. ప్రభుత్వ పథకాలు పొందేవారు తప్పా.. మిగిలిన వారు వారి వివరాలను, జియో ట్యాగింగ్ చేయడానికి మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. చచ్చీ చెడి చేద్దామంటే ప్రభుత్వం కనీసం సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్యాకేజీలు కూడా ఇవ్వడం లేదు. దాని భారం మొత్తం ఉద్యోగులపైనే పడుతున్నది. ఒక్కోసారి అధికారులు సమా వేశాలు పెట్టి సిబ్బందిని చెడా మడా తిడుతుంటే అవి జీర్ణించుకోలేనివారు చేతిలో ఉన్న ఫోన్లను నేలకేసి కొట్టి వారి కోపాన్ని చల్లార్చు కుంటున్నారు. ఈ  విధంగా కూడా సిబ్బందే సెల్ ఫోన్లు నష్టపోవాల్సి వస్తున్నది. అన్ని ఒత్తిడిలు, వేధింపులు, బెదిరింపులు తట్టుకొని పనిచేస్తున్నా.. మీకు జీతాలు ఇవ్వడమే దండగంటూ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఉద్యోగులను మానసింకగా కృంగదీస్తున్నాయి. 

ఫలితంగా ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకత అధికమవుతున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే అధికంగా సర్వేలు, వివరాలంటూ సచివా లయ సిబ్బందితో అన్ని రకాల పనులు చేయిస్తున్న ప్రభుత్వంపై సిబ్బంది కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటి పరిపాలన కోస మేనా ఓట్లు వేసి గెలిపించుకున్నదీ అంటూ బహిరంగంగానే తిట్ల దండకం మొదలెడుతున్నారు. రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పడం లేదంటూ తిట్టుకుంటున్నారు. అంతేకాదు ఒక వర్గం ఉద్యోగులు అపుడే కూటమి ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నయమనే ప్రచారం కూడా మొదలు పెట్టారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేరసుకోవచ్చు.

 వాస్తవానికి ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి ఒక పెద్ద నెట్వర్క్ గానే చెప్పాలి. అసలే గ్రామ, వార్డు వాలంటీర్లను తొలగించేసిన ప్రభుత్వం వారికిచ్చిన 50 ఇళ్లను  కూడా సచివాలయంలోని సిబ్బందికి అనుసంధానం చేసేసింది. ఇపుడు అన్ని పథకాలు వీళ్లే ఇంటింటికీ వెళ్లి అందించాల్సి వుంటుంది. అలాంటి సమయంలో అధికారులు సిబ్బందిని వేధించి, వెంటాడి మరీ పనులు చేయించి వీరికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను తొక్కిపెట్టడంపైనా సిబ్బంది మండిపడుతున్నారు. సిబ్బంది కడుపు మంట ప్రజల వరకూ వెళ్లిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరు నెలలు తిరగ ముందే తారా స్థాయికి చేరుకునే ప్రమాదం కూడా లేకపోలేదు..?!

visakhapatnam

2024-11-18 14:59:07

వారందరికీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా పోస్టింగులు

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పంచాయతీ కార్యాలయాలు, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల్లో విధానంలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెం ట్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారందరనీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా నియమిస్తూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ జీఓఎంఎస్ నెం-65 ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఈ సిబ్బంది నియమాకాలు, పదోన్నతుల పై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించినా.. పని మాత్రం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను స్వీకరించడంతో అది ఉత్తర్వులు జారీ అయ్యేవారకూ వచ్చింది. 

అయితే వీరికి గ్రేడ్ 2 లేదా, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శిలుగా పదోన్నతి కల్పించి నియమాకాలు చేపట్టాల్సి ఉండగా.. సర్వీసు నిబంధనలు అడ్డురావడంతో వారికి ఎలాగైనా ఉద్యోగాలివ్వాలని సంకల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. దీనితో లైన్ క్లియర్ అయి వారందరికీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనితో ఉన్న పంచాయతీ కార్యదర్శిలకే రెండు మూడు పంచాయతీలు అప్పగించి కాలం నెట్టుకు వచ్చేసింది గత ప్రభుత్వం.

 గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలంటే గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో కార్యదర్శిలు ఉండాలని భావించిన డిప్యూటీ సీఎం ఆలోచనకు అనుగుణంగా ఎన్నాళ్ల నుంచో సర్వీసులు రెగ్యులర్ అవుతాయని ఎదురు చూస్తున్నవారికి తీపి కబురు అందిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయాల రాకతో నిర్వీర్యం కాకుడదని.. ప్రజలు ఇంటి ముంగిటే పూర్తిస్థాయిలో సేవలు అందించాలని భావించి డిప్యూటీ సీఎం ఆలోచనలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చడం చూస్తుంటే..రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయనే చర్చకు బలం చేకూరుతుంది. తాజాగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా నియమితులైన వారిని ప్రస్తుతం ఖాళీలు ఉన్న చోట నియమిస్తే చాలా వరకూ గ్రామ పంచాయతీలకు ఇన్చార్జిల బెడద తగ్గనున్నది.

visakhapatnm

2024-11-16 10:59:00

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు మహర్ధశ..?!

ఏ ప్రభుత్వ శాఖకు నోచుకోకుండా  గాల్లోనే ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందిం చింది. వీరి సమస్యలు, ఇబ్బందులు, జీఓలు, కోర్టుకేసులు, అదనపు విధుల నిర్వహణపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన ప్రత్యేక కథనా లపై  హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రస్తావించారు..2019 లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యో గుల సమస్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు.. నాటి నుంచి నేటి వరకూ వీరి సమస్యలను  ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల రూపంలో అందిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ శాఖకు చట్టబద్ధత తేకుండా.. కనీసం మాతృశాఖలోని సర్వీసు నిబంధనలకు వీరికి అమలు చేయకుండా ప్రత్యేకంగా వారికోసం రూపొందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. దానిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో ఉద్యోగులు వారి సర్వీసును, ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. సామాజిక బాధ్యతతో సచివాలయ ఉద్యోగుల సమస్యలను బుజాన వేసుకున్న ఈరోజు-ఈఎన్ఎస్.. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి వార్తల రూపంలో తీసు కెళ్లడంతో కూటమి ప్రభుత్వం స్పందించి.. అసెంబ్లీ సాక్షిగా వీరి సమస్యలను పరిష్కరించేందుకు చర్చకు తెరలేపింది. దీనితో ఏశాఖ లే కుండా గాల్లో ఉన్న మహిళా పోలీసులకి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది..!


గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శలు విధులు, జాబ్ చార్టులపై త్వరలోనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. దీని కోసం ఎమ్మేల్యే తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.  గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల విధుల గురించి క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌరు చరితారెడ్డి, మాధవిరెడ్డి కోరారు. వారి ప్రశ్నలకు అసెంబ్లీలో హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో యాక్టులు కూడా చదవకుండా జీవోలు ఎడా పెడా ఇచ్చేసిందన్నారు. 2019లో రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా ఎలాంటి ట్రైనింగ్, డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేకుండా చేశారన్నారు. సుమారు 15 వేల మందిని రిక్రూట్ చేసుకుంటే.. అందులో 13,815 మంది పనిచేస్తున్నారని.. మరో 1,189 ఖాళీలు ఉన్నాయని సభకు తెలిపారు. 2021లో మరో జీవో తెచ్చి.. వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చారన్నారు.

 వీరికి సుమారు 6 ప్రభుత్వ శాఖలతో కలిపి.. జాబ్ చార్ట్ ఇచ్చారని తెలిపారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో.. అన్ని బాధ్యతలు వీరికి ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. ఇది జగన్ ప్రభుత్వం యొక్క అవివేకానికి నిదర్శనమన్నారు దుయ్యబట్టారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే దేహధారుడ్య పరీక్షలు, రాత పరీక్షలతో పాటు ట్రైనింగ్ కూడా ఉంటుందని.. కానీ వీరికి కేవలం 2 వారాల ట్రైనింగ్ తో పోలీసులుగా మార్చే ప్రయత్నం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఇదంతా కేవలం పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని చెప్పుకొనేందుకు చేసిన వృథా ప్రయత్నమన్నారు. దీంతో పాటు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఇష్టం లేకుండానే పోలీస్ యూనిఫామ్ వేయించాలానే ప్రయత్నం చేశారన్నారు. యూనిఫామ్స్, జాబ్ ఛార్టులపై కోర్టుల్లో 7 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయన్నారు. గత ప్రభుత్వానికి జాబ్ చార్టులపైనా, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛార్ట్ లపై కనీస అవగాహన లేదని విమర్శించారు. 

అందుకే మహిళా సంరక్షణ కార్యదర్శులు రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి, అడ్మిన్ రైట్స్ పోలీస్ శాఖలు, జీతాలు, సెలవులు ఇచ్చేది ఎంపీడీవోలు వెళ్లిందన్నారు. ఇన్ని శాఖల సంబంధం వల్ల మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు వారి పనులు వారు చేసుకుంటే వీరు మాత్రం అన్ని శాఖల పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వీరిని గత ప్రభుత్వం ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉపయోగించు కుంద న్నారు. గత ప్రభుత్వ అవివేకం వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో పెద్ద చర్చ జరగాలన్నారు. వారి ని ఏ శాఖకు కేటాయించాలి అన్న అంశంపై ఎమ్మెల్యేలు  తమ సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా అందజేయాలని కోరారు. సంబం ధిత శాఖలతో చర్చ జరిపి అతి త్వరలోనే మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై శాశ్వత నిర్ణయం తీసుకుంటామన్నారు.

-  హోం మంత్రి ప్రకటనతో మహిళా పోలీసుల హర్షం
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని మహిళా పోలీసుల సమస్యలను, వారి జాబ్ చార్ట్, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, ఇతర శాఖల పనులు చేయిస్తున్న విధానంపై నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించడంపై మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వంలో మా సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి హోం మంత్రి తీసుకెళ్లగలిగారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖ లోనైనా ఆ శాఖ పనులు మాత్రమే వాళ్లు చేస్తారని.. కానీ తాము అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాల్సి వస్తుందని.. తమ సమస్య గత ప్రభుత్వంలో ఎంత మంది ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని.. కానీ హోం మంత్రి అనిత అసెంబ్లీలో ప్రస్తావించడంతోపాటు తమకు న్యాయం చేసే దిశగా తొలి అడుగు వేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మొదటి నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక కథనాల రూపంతో తీసుకెళ్లడంపై కూడా మహిళా పోలీసులు మీడియా కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. హోం మినిస్టర్ లాంటి డైనమిక్ మంత్రులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

visakhapatnam

2024-11-13 15:17:17

పరుగో పరుగు.. అయ్యబాబోయ్ సోషల్ మీడియా..?!

సూడు సెగరెట్రీ  పెన్నట్టుకున్న పెతోడూ ఇలేకరీ అయిపోడు.. ఇలేకరంటే సమాజంపై కుసింత అవగాహనుండాల.. పెజిల సమస్యలు సమాచారంగా మీడియాలో వార్తలు రాయడం వచ్చుండాల.. ముందు అది తెలుసుకో.. ప్రెస్ అనగనే ఓ.. ఎగేసుకొని వచ్చినోడిని వచ్చినట్టు లోనకంపేయడం కాదు..కాదు.. అసలు వొచ్చినోడెవడు..? ఏ పేపరు.. మరేటివి..? కనుక్కొని మరీ లోనకంపాల.. అంటాడు సినిమాల్లో రావుగోపాలరావు.. ఇది ఒకప్పటి మాట.. ఆ రోజుల్లో మీడియా అంటే విలువలుండేవి.. ఇంటర్నెట్ పుణ్యమాని  ఇపుడు ట్రెండ్ మారిపోయింది.. మీడియా రాను రాను తగ్గిపోతున్నది.. సోషల్ మీడియానే  పాపులర్ అవుతోంది అంటూ జి మెయిల్ అకౌంట్ ఉన్న ప్రతోడు యూట్యూబ్ ఛానల్, బ్లాగ్ స్పాట్ సైట్ పెట్టుకొని.. దానికొక పేరెట్టేసుకొని.. సోషల్ మీడియాగా చెలామణి అయిపోతున్నాడు.. అసలు మీడియాలో పనిచేసేవాడిని ప్రక్కన బెట్టి.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా  సోషల్ మీడియాలోనే పబ్లిసిటీ వస్తుందంటూ వారినే ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా మీడియా పక్కకి పోవాల్సి వస్తున్నది.. ఇలా ఉంటే కష్టమనుకున్న అసలు మీడియా.. తమని డామినేట్ చేస్తున్న సోషల్ మీడియాపై యుద్ధం ప్రకటించింది.. పనిగట్టుకొని జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడం మొదలెట్టింది..  అది విషయం కూడా ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నది. జర్నలిస్టులుగా ఫిర్యాదు చేసిన వారెవరూ వారి పత్రికల్లో ఈ విషయాన్ని రాయడం లేదు..?!

ఆంధ్రప్రదేశ్ లో మీడియా కంటే సోషల్ మీడియానే బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నది. దానిని అసరాగా చేసుకొని మీడియా కాని మీడియా..అసలు మీడియాకి డూపుగా సోషల్ మీడియా తయారై.. మీడియాని పక్కకి నెట్టేస్తున్నది. చేసేది లేక మీడియా ప్రభుత్వం వద్దకు వెళ్లి బాబూ మేము మీడియా వాళ్లం.. ఆ సోషల్ మీడియా సంగతేంటో కాస్త చూద్దురూ అంటూ ఎడా పెడా జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసులకు ఫిర్యాదులివ్వడం మొదలు పెట్టింది. వాస్తవానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మీడియా స్థానాన్ని పూర్తిగా తొక్కేసింది. దానితో అసలు మీడియా కిందకి పోయి.. పెసలు మీడియా ముద్రవేసుకున్న సోషల్ మీడియా హల్ చల్ చేయడం మొదలు పెట్టింది. కనీసం ఒక రెండు లైన్లు వార్త రాయడం రాని వాడు కూడా నేనూ జర్నలిస్టునే అంటూ అసలు జర్నలిస్టులను డామినేట్ చేసేస్తున్నాడు. 

చేతిలో యూట్యూబ్ గొట్టం, సెల్ లో ఫ్రీగా వచ్చిన బ్లాగ్ స్పాట్ ను చూపిస్తూ... ఇదిగో మీ వార్త అంటూ మీడియా కంటే ముందుగా వెళ్లిపోతున్నాడు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ సోషల్ మీడియాదే హవా. ఆ పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే ఒకప్పుడు ప్రెస్ మీట్ కి వెళితే కేవలం మీడియా మాత్రమే వచ్చేది. ఇపుడు మీడియాలోని జర్నలిస్టులు పది శాతం హాజరైతే సోషల్ మీడియా 70శాతం హాజరువుతుంది. అక్కడ జర్నలిస్టులకు కాస్త మర్యాద చేయడానికి ఇచ్చే మంచినీళ్లు, టీ, కాఫీ అల్ఫాహారం కూడా పెట్టడం మానేస్తున్నారు నిర్వాహకులు. లేదంటే సోషల్ మీడియాకి తెలియకుండా గుట్టు చప్పుడుగా కాకుండా ప్రెస్ మీట్లు నిర్వహించుకుంటున్నారు. ఆ విధంగా చేస్తున్నా.. ఆఖరు నిమిషంలో మూకుమ్మడిగా సోషల్ మీడియా సదరు కార్యక్రమాల్లో చటుక్కున మెరుస్తున్నది.

ఈ బాధనలు తట్టుకోలేక సోషల్ మీడియాపై మీడియా యుద్దం ప్రకటించింది. బాబోయ్ ఈ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ప్రభుత్వానికి స్పందన, మీకోసం కార్యక్రమాల్లో జర్నలిస్టులు గుంపులు గుంపులుగా వెళ్లి అర్జీలు పెడుతున్నారు. గత ఏడాది కాలంగా ఈ ఫిర్యాదులు మరీ ఎక్కువయ్యాయి. మీడియలో అయితే కొద్ది మందికే సమాచారం చేరుతుందని.. అదే సోషల్ మీడియా అయితే చాలా ఎక్కువమందికి విషయం తెలుస్తుందని భావిస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాని ప్రోత్సహిస్తుండటంతో అసలు మీడియాకి చెందిన జర్నలిస్టులు తెగ ఫీలైపోతున్నారు. దానితో పరుగులు పెడుతూ అయ్యబాబోయ్ సోషల్ మీడియా వచ్చేస్తుందంటూ లగెత్తుతున్నారు. ఇంతకీ విశేషం ఏంటంటే చాలా జర్నలిస్టుల సంఘాల్లో సభ్యులుగా ఉన్నది సోషల్ మీడియా ప్రతినిధులే. అసలు మీడియా జర్నలిస్టులు ఒక 40శాతం ఉంటే 60శాతం సోషల్ మీడియా వాళ్లే ఉండటం విశేషం.

 ఇపుడు ఆ అధిక శాతం సోషల్ మీడియాలోని వారే మీడియాగా చెప్పుకుంటూ పోలీసులకి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేస్తున్నారనే ప్రచారం కూడా గుప్పు మంటున్నది. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాకి.. అందులో పనిచేసేవారికి కనీస విద్యార్హత, జర్నలిస్టుగా పనిచేసే సామర్ధ్యం లేకపోయినా వారు జర్నలిస్టులేనని యాజమాన్యాలు వారికి ఐటెంటీ కార్దులు ఇచ్చేస్తుండటంతో ఇబ్బడి ముబ్బడిగా  విలేఖరులు తయారైపోతున్నారు. కొంత కాలం మీడియాలో పనిచేసి.. సంస్థల ఆర్ధిక భారాన్ని మోయలేక రక రకాల పేర్లతో యూట్యబూ ఛానళ్లు, న్యూస్ బ్లాగ్ స్పాట్లు పెట్టి మీడియాగానే చలా మణీ అయిపోతున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కూడా వేడుక చూస్తున్నది తప్పితే వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదు.

చాలా వరకూ మీడియాలో నేను విలేఖరి అని చెప్పుకుంటూ తిరిగేవాళ్లలో కేవలం 60శాతం మందికి మాత్రమే కనీసం వార్తలు రాయడంపై అవగాహన వుంటుంది. మిగిలిన 40శాతం మంది కూడా వారు వారి పేపర్లు, టివీలకు, న్యూస్ ఏజెన్సీలకు పంపే వార్తలన్నీ కూడా కాపీ పేస్టు వార్తలే. అన్నీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే కాపీ చేసి వాటికి డేట్ లైన్ తగిలించి మరీ పంపించేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పనిచేసేవారైతే మరీ దారుణం. వారిలో కనీసం 30శాతం మందికి వార్తలు రాయడం వస్తే మిగిలిన 60శాతం మంది.. అదే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మేమే రాసామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు వాట్సప్పుల్లో పంపేసి మరీ విలేఖరులుగా చలా మణీ అయిపోతున్నారు. గ్రామాల నుంచి రాష్ట్ర రాజధాని కేంద్రాలు ఇలా ఎక్కడ చూసినా మీడియా కంటే సోషల్ మీడియాదే హవా.  ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాల్లో కూడా అసలు మీడియా వేయని ప్రశ్నలు కేవలం సోషల్ మీడియావాళ్లే వేస్తూ.. అక్కడ వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 

మీడియా కంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కాస్త ముందుగా వస్తుండటంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సోషల్ మీడియానే ప్రోత్సహిస్తున్నారు. అంతెందుకు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభులతోపాటు రాజకీయపార్టీలు కూడా ఒక ప్రత్యేక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో అసలు మీడియాకి మెంటలొచ్చేసి.. సోషల్ మీడియాను చూసి పరుగో పరుగు అంటూ లగెత్తుతున్నారు. ఇపుడు ఆ పరుగులు ఆపేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియాని నియంత్రించాలని. చూడాలి.. ఇప్పటికైనా ప్రభుత్వం అనధికార, నకిలీ, సోషల్ మీడియాని నియంత్రిస్తుందా..? లేదంటే మీడియాకంటే వీళ్లే బాగా పనిచేస్తూ పబ్లిసిటీ కల్పిస్తున్నారని ప్రోత్సహిస్తుందా.. అనేది..?!

visakhapatnam

2024-11-11 19:13:35

కూటమిలోనూ నాటి ప్రభుత్వ పరిపాలనే..?!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అపుడే కూటమి ప్రభుత్వంలోని పరిపాలనపై పెదవి విరుపులు మొదలు పెట్టారు.. పరిపాలనా ధక్షుడు ముఖ్యమంత్రిగా వస్తే పాలన బాగుంటుందనుకుంటే.. మళ్లీ అదే పాత ప్రభుత్వ విధానాలు.. రెండవ శనివారాలు, ఆదివారాల్లోనే ఉద్యోగులకు ప్రత్యేక విధులు, జూమ్ మీటింగులు.. బిఎల్వో విధులకి సొంత ఖర్చులతోనే వైట్ పేపర్లు కొనుక్కోమని చెప్పడం.. ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ శాఖల యాప్ ల నిర్వహణ.. ఇంటర్నెట్ కి, స్టేషనరీకి చేతి చమురు వదిలిపోవడం.. వారంతంలో కనీసం బట్టలు ఉతుక్కోవడానికి.. నెరిసిన గెడ్డం గీక్కోడానికి.. పిల్లలతో ఓ పూట గడపడానికి కూడా లేదా..? నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇది కానే కాదు.. కానీ నాటి ప్రభుత్వంలోని రాష్ట్ర అధికారులే ఈ ప్రభుత్వంలోనూ ఉన్నారు కదా.. ఇంకా గత ప్రభుత్వ పరిపాలన నుంచి రాష్ట్ర అధికారులు బయటకు రాలేకపోతున్నారు..  ప్రభుత్వం కూటమిదే అయినా.. ఇంకా గత ప్రభుత్వ విధానాలనే రాష్ట్ర, జిల్లా అధికారులు అవలంభిస్తూ చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు పెదవి విరిచేలా చేస్తున్నారు.. ఇదేదో కావాలని బుదర జల్లుతున్న మాటలు కాదు.. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చల సారాంశం మాత్రమే ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం రూపంలో మీ ముందుకి తీసుకు వస్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాల్గవ తరగతి ఉద్యోగులకి జీతంలో సుమారు నెలకి 2 వేల నుంచి  మూడు వేల రూపాయల వరకూ ప్రభుత్వ విధుల కోసమే ఖర్చు చేయాల్సి వస్తున్నది. అవును మీరు చదువుతున్నది నిజం. ప్రభుత్వం ఉద్యోగులకి అప్పగిస్తున్న అదనపు విధులకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వంలోనూ అవలంభిస్తున్నది. రెవిన్యూ, పోలీసు, సచివాలయ ఉద్యోగులకు అదనంగా అప్పగిస్తున్న బిఎల్వో, ఇంటింటా సర్వే, ప్రభుత్వ యాప్ ల నిర్వహణ, కార్యాలయాల్లోని స్టేషనరీకి సైతం ఉద్యోగులే వారి జీతంలో నుంచి ఖర్చులు చేయాల్సి వస్తుంది.

 ఇంత చేస్తున్నా.. కనీసం ఆదివారాలు, పండుగ సమయాలు, రెండవ శనివారాల్లోకూ ఉద్యోగులను ఖాళీ ఉంచకుండా ప్రత్యేక విధులు అప్పగిస్తుండటంతో ఉద్యోగులు రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పడం లేదని నెత్తీ నోరూ కొట్టుకుంటూ ప్రభుత్వ పరిపాలనపై తమ నిరసనను సామాజిక మాద్యమాల వేదిక ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ.. ఆవేదన చెందుతున్నారు. అచ్చుగుద్దినట్టు గత ప్రభుత్వ విధానాలే కూటమి ప్రభుత్వంలో కూడా రాష్ట్ర, జిల్లా అధికారులు అమలు చేసి.. వారాంతంలో ఒక్కపూట కూడా ఇచ్చిన సెలవు సద్వినియోగం చేసుకోకుండా ప్రత్యేక విధులు అప్పగించడం పట్ల కూటమి ప్రభుత్వంపైనా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అంటే ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలకు పూర్తి సేవలు అందించడం ఒక్కటే ఉంటుందనుకున్నాం.. కానీ గత ప్రభుత్వంలోని అధికారులే ఇప్పడుకూడా ఉండటంతో ఆ పాత పరిపాలనే చేపట్టి సీఎం విజన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారంటూ ఉద్యోగులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వంలోని నాలుగేళ్లుగా చెల్లించని బిఎల్వో విధుల గౌరవ వేతనం కోసం కూటమి ప్రభుత్వంలో కూడా అధికారలు మాట్లాడకపోగా.. ఇపుడు మళ్లీ కొత్తగా విధులు అప్పగించి.. దానికి సరిపడా స్టేషనరీ, సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ కూడా ఉద్యోగులే భరించి.. సెలవుదినాలు, రెండివ శనివారాలు, ఆదివారాల్లో పనులు చేయాలని పురమాయించడంతో ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి ప్రభుత్వ విధులు చేయాల్సి వస్తున్నది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వస్తున్నదే తక్కువ జీతం అందులోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా అప్పగిస్తున్న విధులతో అందులో నుంచే స్టేషనరీ, మొబైల్ ఇంటర్నెట్ లకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. జిల్లా అధికారుల నుంచి ఇష్టం వచ్చిన తిట్లు తినకుండా ఉండేదుకు సొంత డబ్బులు ఖర్చుచేస్తున్నా.. కనీసం దానిని కూడా గుర్తించి ప్రభుత్వమే ఇవ్వాల్సిన అదనపు పనికి గౌరవ వేతనం ఇవ్వకపోగా.. కనీసం వారాంతంలో ప్రశాంతంగా కుటుంబాలతో గపడనీయకుండా చేస్తున్నారని ఉద్యోగులు వారిలో వారే చెప్పుకొచి మదన పడుతున్నారు. ఇంతచేస్తున్నా ప్రభుత్వం సర్వీసు ఆధారంగా ఇవ్వాల్సిన పదోన్నతులు కూడా ఇవ్వడం లేదని.. అసలు ఆ దస్త్రాలను ఆయా శాఖల కమిషనర్లు ముందుకి కదపడం లేదని మండిపడిపోతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల వ్యతిరేకత ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడే ప్రభావం ఉంటుందని కూడా సమాచారం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులను గత ప్రభుత్వంలో ఇష్టానుసారం వాడేస్తే.. ఓటుతోనే కుటుంబం మొత్తం సమాధానం చెప్పామని.. ఇపుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధానాలు అమలు చేస్తే మళ్లీ అదే ఓటు అస్త్రాన్ని వినియోగిం చాల్సి వస్తుందనే చర్చకు తెరలేపడం ఇపుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది. అంతేకాకుండా ప్రభుత్వ పరిపాలనకు సంబం ధించి త్వరగా జరగాల్సిన పనులను కూడా ప్రభుత్వం అదనంగా ఖర్చుతో కూడిన పనులను అప్పగిస్తున్నందునే అదే సాకు చూపి.. జాగు చేయాలని కూడా అధికారులు, సిబ్బంది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. 

అందునా మహిళా ఉద్యోగులైతే ప్రభుత్వానికి బయటకు చెప్పుకోలేని సమస్యలను, ఇబ్బందులను వారాంతంలో ఇచ్చే సెలవులను ప్రశాంతం గా పనులు చేసుకోవడానికి కూడా లేదని.. వారమంతా వేసుకున్న మాసిన బట్టలే.. ఉతుక్కోవడానికి కూడా కాళీ లేకపోవడంతో మళ్లీ విధులకు పాత బట్టలమీదే సెంటు కొట్టుకొని వెళ్లాలా చేస్తున్నారంటూ మండిపడిపోతున్నారు. వారానికి ఒకసారి వచ్చే సెలవుల్లో కుటుంబం లోని శుభకార్యాలు, ఇంటిపనులు చూసుకోవడానికి కూడా వీలులేకుండా వారాంతంలో అప్పగించే పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులతో మొదలైన వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజలకు పాకుతుందడనంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి ఈ అదనపు విధులకి ప్రభుత్వం చర్యలు ఏవిధంగా ఉంటాయనేది..?!

visakhapatnam

2024-11-08 19:50:31