ఆంధ్రప్రదేశ్ లోచాపక్రింద నీరులా సామాజక కుల గణన జరుగుతుందా.. అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏటెల్లకాలం ఒక్క ఆరెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో చేపడుతున్నా..బలమైన సామాజిక వర్గాలు ఉన్నవారు అధికారం చేపేట్టేవారిని చూస్తూనే ఉండాల్సి వస్తుందే తప్పా.. మరేమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా ప్రపంచాని ఒక్కసారిగా ఒణికించిన తరువాత..ఉన్నంతకాలమైనా అనుభవించి ఆ తరువాత తరం చెప్పుకునేలా ఉండాలనే నిర్ణయానికి చాలా సామాజిక వర్గాలు వచ్చినట్టుగానే కనిపిస్తున్నది. కాస్త కాసులుండి..పలుకుబడి ఉన్నవారంతా ఈసారి 2024 ఎన్నికల్లో సామాజికవర్గాల బలాన్ని..బలగాన్ని బట్టి చట్టసభలకు వెళ్లి ఆయా సామాజిక వర్గం కూడా అధికారం చేపట్టగలదు అనే విషయాన్ని రుజువుచేయాలని చూస్తున్నారట. దానికోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ..నిరుపేద నుంచి అత్యంత సంపన్నుల వరకూ సామాజికవర్గాల్లోని బలాన్ని నమోదు చేస్తే తప్పా మనమేంటో రాజకీయపార్టీలకు తెలియజెప్పే పరిస్థితులు లేవని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. దానికోసం ప్రభుత్వంలో పనిలేకుండా సామాజిక వర్గాలు వారీగా కులగణన చేపడితే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని..బలం ఆధారంగానే ఆ అధికారం కూడా మనదగ్గరకే రావాలి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారనే విషయం గుప్పుమంటుంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కుతూ వస్తుంది. కానీ ఈసారి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలో కీలకమైన పదవులు దక్కించుకోవాలంటే కులం బలమే వాటిని తీసుకొస్తుంది తప్పితే మరెవరి వలనా జరిగే పనికాదని అంటున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రాలో ఒక సామాజిక వర్గ నేతకు పదవి తీసేయాలని భావిస్తే..పార్టీ అధిష్టానమే కంగారు పడేలా తన సామాజిక వర్గం బలం చూపించి సదరు నేత తన పదవిని తిరిగి తెచ్చుకున్నారని..కాదు కాదు పార్టీయే చచ్చినట్టు పదవి కట్టబెట్టిందనే విషయం మిగిలిన సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అయితే అత్యధిక కాలం రెండు మూడు సామాజిక వర్గాలు తప్పితే మరే ఇతర సామాజిక వర్గాలకు ప్రభుత్వాల్లోగానీ, రాజకీయపార్టీల్లోగానీ మంచి పదవులు దక్కడండ లేదనే విషయాన్ని అన్ని కులసంఘాలు గట్టిగానే ఆలోచిస్తున్నాయి. దానికోసం ఎవరి సామాజిక వర్గం వారీగా వారి బలగం, ఓట్లు, మదుపరులు, వ్యాపారులు, ఉద్యోగులు, ధనికులు, సంపన్నులు, రాజకీయనేతలు, పెట్టుబది దారులు తదితర విభాగాల వారీగా కులగణన చేయడం ప్రారంభించారట.
వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం కూడా ఇంటింటి సర్వే చేపట్టిన సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల పేరుతో గణన చేపట్టింది. ఆ సమయంలో సామాజిక వర్గం వారీగా వివరాలు నమోదు అయ్యాయి. అయితే ఆ సర్వే కేవలం 70శాతం మాత్రమే జరిగిందని తెలుస్తుంది. మిగిలిన 30శాతంలో సంపన్నులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, పెట్టుబడి దారులు, రాష్ట్రం విడిచి పక్కరాష్ట్రాలకు వ్యాపారం నిమిత్తం వెళ్లిన వారు ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా సామాజిక గణన చేపట్టాలని నిర్ణయించింది. కానీ కాగితాలకే పరిమితం అయ్యింది తప్పితే గణన మాత్రం జరగలేదు. ప్రభుత్వం చేపట్టే వరకూ వేచి ఉండాలా అనుకున్న వారు..వారి వారి పరిధిలో సామాజిక గణన మొదలు పెట్టారు. కొందరు వెబ్ సైట్ల ద్వారా, మరికొందరు యాప్ ల ద్వారా, ఇంకొందరు ఉద్యోగ సంఘాల ద్వారా, మిగిలిన వారు వ్యాపారా వేత్తలు, రాజకీయపార్టీల వారీగా లెక్కలు గట్టారు. అయితే ఇపుడు ఆ వర్గాలన్నింటిని ఏకతాటిపైకి తేవడానికి ఆయా రాజకీయపార్టీల్లో కీలకంగా వున్నవారు ప్రయత్నిస్తున్నారని సమాచారం దానికోం ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి.. మన సామాజిక వర్గంలో
ఉన్నవారందరూ సంఘంలో సభ్యులుగా ఉండాలని పక్క సామాజిక వర్గం పలానా విధంగా నమోదు చేస్తుందని..మనమేమి తక్కువ అన్నట్టుగా వ్యవరిస్తూ..గల్లీ నుంచి డిల్లీ వరకూ వున్న వారందరితోనూ తమ వారి లెక్కలను కాగితాలపైకి ఎక్కిస్తున్నారట.
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వారి దగ్గర నుంచి విద్యావంతులు ఉండటంతో అందరూ ఒకతాటిపైకి వచ్చి సామాజిక బలం ప్రదర్శించడానికి చక్కని వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా వీరిని సంప్రదించిన తరువాత మాత్రమే వారి వారి సామాజిక వర్గాల్లో ఉన్న జనాభాను ద్రుష్టిలో పెట్టుకొని పదవులను కట్టబెడుతున్నాయి. ఒకే సామాజిక వర్గంలోని వర్గాలు ఉండటంతో అన్ని వర్గాలు ఇపుడు ఒకే వేదికపైకి రావడానికి ప్రత్యేక కార్యాచరణ జరుగుతోంది. అదేజరిగితే బలం, బలగం సత్తా ఏంటో కూడా రాజకీయపార్టీలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇకపై సామాజికవర్గం వారీగా రాజకీయపార్టీలు, మీడియా, వ్యాపారాలు, వ్యవహారాలు కూడా చేపట్టాలనే నిర్ణయానికి కూడా వస్తున్నారు. మీడియాలోనూ రెండు మూడు సామాజిక వర్గాలకే పెద్ద సంస్థలు ఉండటం..వారి సహకారంతోనే ప్రభుత్వాలు రాజకీయపార్టీల నిర్వహణ జరగడంతో..మీడియా సపోర్టు కూడా సామాజికవర్గాల్లో ఉంటే బావుంటుందని నిర్ణయానికి వచ్చిన వారి బలంతోనే ఏర్పాటుకి పునాధులు వేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలనుకుంటున్న కులగణన ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలు పూర్తిచేశాయని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న డేటా..సంఘాల వద్ద ఉన్న డేటాతో ఎవరి బలం ఏంటో ఈసారి 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా తేలిపోయే అవకాశాలున్నాయి..!!