1 ENS Live Breaking News

ప్రజలకు సకాలంలోనే సేవలందాలి..

ప్రజలకు సకాలంలో సచివాలయాల నుంచి సేవలు అందించేందుకు సిబ్బంది శ్రమించాలని జెసి జె.వెంకటరావు ఆదేశించారు.  విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ పరిధిలోని కొత్త అగ్ర‌హారం రెండో వార్డు స‌చివాల‌యాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం)  గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆయ‌న ముందుగా హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించి, సిబ్బంది హాజ‌రును త‌నిఖీ చేశారు. అనంత‌రం సచివాల‌య రికార్డుల‌ను ప‌రిశీలించారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై ఆరా తీశారు. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు, పెండింగ్‌ రిక్వెస్టుల పై సిబ్బందిని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారా అందించే 745 సేవలను ప్రజలకు అందించి తద్వారా వారి సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపించాలన్నారు. సిబ్బంది అంతా నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని, స‌మ‌య పాల‌న పాటించాల‌ని, వ‌చ్చిన విన‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని జెసి ఆదేశించారు.

Vizianagaram

2021-07-22 15:37:48

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో, జిల్లా యంత్రాంగాన్ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అప్ర‌మ‌త్తం చేశారు. వ‌ర్షాల కార‌ణంగా జిల్లాలో ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌కుండా ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్ లో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున, దానికి అనుగుణంగా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా ప్రాణ‌, ఆస్తి న‌ష్టాలు చోటుచేసుకోకుండా అన్ని ర‌కాల‌ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌న్నారు. వ‌ర్షాల కార‌ణంగా స‌మాచార వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌కుండా చూడాల‌న్నారు. ఒక‌వేళ ఎక్క‌డైనా  క‌మ్యూనికేష‌న్ దెబ్బ‌తింటే, వెంట‌నే పున‌రుద్ద‌రించేందుకు ముందస్తు ఏర్పాటు చేయాల‌న్నారు. అలాగే రోడ్లు ఎక్క‌డైనా కొట్టుకుపోయే ప‌క్షంలో, వాటిని హుటాహుటిన పున‌ర్‌నిర్మించేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు. ఎక్క‌డైనా చెరువుల‌కు గండ్లు ప‌డే అవ‌కాశం ఉన్నందున‌, ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు ముందుగానే త‌నిఖీ చేయాల‌ని సూచించారు. విద్యుత్ స్థంబాలు ప‌డిపోవ‌డం, విద్యుత్ వైర్లు తెగిపోవ‌డం చోటుచేసుకొనే అవ‌కాశం ఉంద‌ని, అందువ‌ల్ల విద్యుత్ అధికారులు ముందుగా త‌మ శాఖాప‌రంగా త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని సూచించారు. పెద్ద‌పెద్ద చెట్లు, పాత వృక్షాలు కూలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, వాటిని తొల‌గించేందుకు ప‌వ‌ర్ సాల‌ను, ఇత‌ర ప‌నిముట్ల‌ను సిద్దంగా ఉంచుకోవాల‌న్నారు. అలాగే లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకుగాను,  పున‌రావాస కేంద్రాల‌ను ముందుగా గుర్తించి సిద్దం చేయాల‌ని సూచించారు. వారికి అవ‌స‌ర‌మైన ఆహారం, ఇత‌ర అవ‌స‌రాల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. త్రాగునీటి ప‌థ‌కాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని, వాటిని హుటాహుటిన పున‌రుద్ద‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు.  జిల్లా వ్యాప్తంగా ఎక్క‌డ ఎటువంటి ప్ర‌మాదం చోటుచేసుకున్నా, రెవెన్యూ అధికారులు త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని, త‌మ‌కు వెంట‌నే స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశించారు. ఇరిగేష‌న్‌, విద్యుత్, త్రాగునీటి స‌ర‌ఫ‌రా అధికారుల‌ను, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌ను ముందుగానే అప్ర‌మ‌త్తం చేయాల‌ని, కంట్రోలు రూముల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.  ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ భావ‌న‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, వివిధ మండ‌లాల తాశీల్దార్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-22 15:33:07

అభివృద్ధికి సర్పంచ్ లకు శిక్షణ అవసరం..

గ్రామ సర్పంచులు తమ గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు వెల్లడించారు. గురువారం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 22నుండి 31 తేదీ వరకు పెద్దాపురం డివిజన్ సంబంధించిన సర్పంచులకు ఇచ్చు శిక్షణ కార్యక్రమాన్ని చైర్మన్ దొరబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక మండల ఎంపీడీవో రమణారెడ్డి అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా తరగతిలో చైర్మన్ దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సర్పంచులు ఈ శిక్షణా తరగతులు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది  గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం ద్వారా అందించి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరారు . ప్రజల అభిమానంతో మరో సారి  మీరే సర్పంచ్ గా గెలవాలని ఆకాంక్షించారు .రాష్ట్రప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ఇందులో భాగంగానే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లో రాష్ట్రంలో 117వేలు కాలనీలకు, 30 లక్షల పట్టాలు అందజేశారని తెలిపారు.  గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పోటీపడి గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ శిక్షణ లో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ సర్పంచ్ యొక్క విధులు- బాధ్యతలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన , త్రాగునీరు,గ్రామీణ రోడ్ల నిర్మాణం , తదితర అంశాలపై పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు,పెద్దాపురం డివిజనల్ అభివృద్ధి అధికారి ప్రసాదు, డివిజనల్ పంచాయతీ అధికారిణి అమ్మాజీ , తాసిల్దార్ బి. శ్రీదేవి  ఈ ఓ పి ఆర్ డి మహేశ్వరి. కోటనందూరు, పెద్దాపురం, తొండంగి మండలాలకు చెందిన 54 మంది గ్రామ  సర్పంచులు సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 15:26:23

గ్రామాభివ్రుద్ధిలో సర్పంచ్ లే కీలకం..

దేశం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పైనించాలంటే గ్రామాలు అభివృద్ధి సాధించాలని, అందుకు క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన  పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైన సర్పంచ్ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించి,ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు , కార్యక్రమాలు విజయవంతం కావాలంటే సర్పంచులు కీలక భాగస్వామ్యం వహించాలన్నారు. భారత రాజ్యాంగంలో పంచాయతీలకు, సర్పంచులకు ప్రత్యేక స్థానం ఉందని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పిన మహాత్ముని మాటలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన సచివాలయ  వ్యవస్థ ద్వారా సుమారుగా 530 సేవలు అందించబడుతున్నాయన్నారు. తమ సొంత అనుభవాలను ఇతరులతో పంచుకొని తమ గ్రామంలో గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సర్పంచులు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. 

జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్ నెస్  సెంటర్లు,బల్క్ మిల్క్ సెంటర్ల కు సంబంధించి సుమారుగా 4,500 నూతన భవనాలు నిర్మాణం జరుగుతుందని, త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి అయ్యే విధంగా సర్పంచులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా బహిరంగ మలవిసర్జన, పారిశుద్ధ్యంలో ఉత్తమ పనితీరు కనబరిచిన సర్పంచులకు జాతీయ స్థాయిలో  ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందించ బడుతున్నాయన్నారు. గ్రామాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారిలో మార్పు తీసుకు రావాలన్నారు. ప్రధానంగా పచ్చదనం , తడి-పొడి చెత్త సేకరణ,  పారిశుద్ధ్యం,త్రాగు నీరు ఇతర అంశాలపై  ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేకపోతే అనేక రోగాలకు నిలయంగా ఉంటుందన్నారు. 

కోవిడ్ పాజిటివ్ రేటు అత్యధికంగా ఉన్న గ్రామాల్లో పూర్తిగా ఆంక్షలు విధించడం జరుగుతుందని,కరోనా నియంత్రణకు ఎటువంటి సందేహాలకు పోకుండా సర్పంచులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన సర్పంచులు తమకు  ఎదురయే  ప్రతి సవాళ్లను ఒక ఛాలెంజ్ గా తీసుకుని గ్రామాలను  అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా జిల్లాకు మంచిపేరు వస్తుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లా పరిషత్ ప్రధాన కార్యదర్శి ఎన్ వివి.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1103 గ్రామ పంచాయతీలకు గాను 1072 మంది ఈ శిక్షణా కార్యక్రమలలో పాల్గొంటున్నారు.5 వెలు జనాభా పైనున్న 218 గ్రామాల్లో సర్పంచ్ లకు సామర్లకోట ఈటీసీ కేంద్రంలోను ,854 మందికి ఐదు డివిజన్లలో శిక్షణాతరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలిరోజు శిక్షణా కార్యక్రమానికి  సంబంధించి కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్న కాకినాడ, కరప,తాళ్ళరేవు మండలాల నుంచి సుమారుగా 49 మంది శిక్షణ తరగతులకు హాజరైనట్లుఆయన తెలిపారు.

  గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే విధంగా గ్రామ సర్పంచులు పరిపాలన విధానం పై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ ఆర్టీవో ఏజీ.చిన్నికృష్ణ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్పంచులు ఉత్సాహంగా ఉంటే లబ్ధిదారులకు మంచి జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి ఎస్ వి నాగేశ్వర నాయక్ తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి అంశం పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకొని, ఏ విధమైన సందేహం ఉన్న ఇక్కడే నివృత్తి చేసుకోవాలని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిఎల్ డీఓ. మధుసుధన్ రావు ,కో-ఆర్డినేటర్ కెఎస్ .ఆర్మ్ స్ట్రాంగ్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 14:02:01

3వ దశకు ముందస్తు ఏర్పాటు చేయండి..

తూర్పుగోదావరి జిల్లాలో 3వదశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నోడల్ అధికారులు‌, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి లతో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశ కోవిడ్ ముప్పు పొంచి యున్నందున ఆసుపత్రిలో సాధారణ ,ఆక్సిజన్, ఐసియు పడకలను, వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్ ఇతర  మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు .నియోనటల్ పడకలు కూడా తగినన్ని అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ప్రతి ఆస్పత్రికి నోడల్ అధికారులు నిరయమించడం జరిగిందని , నోడల్ అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రులను తనిఖీ చేయాలి అన్నారు. కోవిడ్ మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సరైన  కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.కేవిఎస్ గౌరీశ్వరరావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.పీ రాధాకృష్ణ,జేడ్పీసీఇవో ఎన్ వివి.సత్యనారాయణ, ఏపీఎంఐసి ఇంజనీర్లు,ఇతర అధికారులు హాజరయ్యారు.

కాకినాడ

2021-07-22 13:57:52

ఈవీఎంలకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌.. క‌లెక్ట‌ర్

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, కాకినాడ పట్టణ తాహసీల్థార్ వైహేచ్ ఎస్.సతీశ్ , క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం , త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-22 13:41:25

సీఎంను కలిసిన ఎస్పీ రవీంధ్రబాబు..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈమేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంని కలిసిన విషయం జిల్లా కార్యాలయం ప్రకటనలో  తెలియజేసింది. రవీంధ్రబాబు ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన దగ్గర నుంచి జిల్లాలో చేపట్టిన సంస్కరణలు పరిపాలనపై సీఎం ఎస్పీ రవీంధ్రబాబుని అభినందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళా పోలీస్ వ్యవస్థ, దిశ ను జిల్లాలో ప్రజలకు చేరువ చేయాలని ఈ సందర్భంగా సీఎం ఎస్పీకి సూచించినట్టు సమాచారం. చాలా కాలం తరువాత జిల్లాకి మంచి డేరింగ్ వున్న ఎస్పీ వచ్చి పోలీసుల వర్గాలే అదిరిపడేలా చేపడుతున్న  కార్యకలాపాలు, పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతున్నాయి.

Kakinada

2021-07-22 13:26:08

అప్పన్నకు రూ.1,00,116 విరాళం..

 సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహస్వామి( సింహాద్రిఅప్పన్న)వారికి విశాఖ శివాజీపాలెంకు చెందిన కండ్రప ఉష, కృష్ణమూర్తి దంపతులు  లక్షా నూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు పీఆర్వో ఆఫీసులోని డొనేషన్ల కౌంటర్లో  నగదు చెల్లించి రసీదు పొందారు.  శ్రీస్వామివారి నిత్య అన్నదాన పథకానికి ఈ విరాళమిస్తున్నట్లు దాతలు ప్రకటించారు. తమ పెళ్లిరోజైన జూన్ 21న భక్తులకు అన్నదానం చేయాలని దాతలు కోరారు. అనంతరం స్వామవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దాతకు ఆలయ సిబ్బంది ప్రసాదాన్ని అందించగా, వేదపండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-07-21 16:48:19

కాకినాడ రూరల్ లో విశేషంగా అభివ్రుద్ధి..

కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 2 ఏళ్లలో రూ.66 కోట్లుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం కాకినాడ గ్రామీణం కొత్త గైగోలుపాడు 49వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి మంత్రి కురసాల కన్నబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడం జరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో కాకినాడ గ్రామీణ  నియోజకవర్గంలో స్మార్ట్ సిటీ, జనరల్ ఫండ్స్, 14 ,15- ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారుగా 66 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. కాకినాడకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడంలో నగరపాలక సంస్థ కమిషనర్,ఇతర అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాకినాడకు పెన్షనర్ ప్యారడైజ్ గా మంచి గుర్తింపు ఉందని అదేవిధంగా ఉత్తమ నివాసయోగ్యమైన పట్టణముగా కాకినాడకు  జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. 

కాకినాడ  నగరపాలక సంస్థలో అంతర్భాగంగా ఉన్న 49 వ వార్డులో సుమారుగా రూ.80 లక్షల వ్యయంతో సిసి రోడ్లు నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సీసీ డ్రైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ సమస్యలు తొలగించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. చెత్తను ప్రాసెస్  చేసి తిరిగి వినియోగించే విధంగా గార్బేజ్ ట్రాన్సఫర్ సెంటర్ ను సుమారుగా రూ.ఏడు కోట్ల రూపాయలతో కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తయిందన్నారు. రాబోయే రెండు,మూడు సంవత్సరాల్లో కాకినాడ స్థాయిని మరింత పెంచే విధంగా ప్రజా ప్రతినిధులు ,అధికారులు సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓపెన్ సైట్స్ కి సంబంధించి ఆక్రమణలు చేసే వారిపై నగరపాలక సంస్థ ద్వారా చట్టపరమైన  చర్యలు తీసుకోవాలని  నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. 

అనంతరం కొత్త గైగొలుపాడు 49వ వార్డులో ఉన్న శ్మశానశాన వాటిక, రోడ్డును స్మార్ట్ సిటీలో భాగంగా ఆధునీకరించేందుకు  సంబంధించి కమీషనర్ , ఇతర ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి కన్నబాబు చర్చించారు. అదేవిధంగా 49 వ వార్డులో సమారుగా రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న పీ.హెచ్.సి భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి అధికారులను  వివరాలు అడిగి తెలుసుకున్నారు.  నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, తడి- పొడి చెత్తను వేరు చేయడం, స్మార్ట్ సిటీ అభివృద్ధికి స్థానిక ప్రజల భాగస్వామ్యం నూరు శాతం ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి కాకినాడను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అవకాశం ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణరాజు ,డీఈలు ,ఏఈలు ఇతర ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్

2021-07-21 16:43:32

22నుంచి నూతన సర్పంచ్ లకు శిక్షణ..

నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఈ నెల 22 నుంచి 12 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్తు సీఈవో ఎన్ వివి. సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జూలై 22 (గురువారం) ఉదయం 9:30 గంటలకు కాకినాడ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి ప్రారంభించడం జరుగుతుందన్నారు. తొలి రోజుల శిక్షణ కార్యక్రమానికి  కాకినాడ డివిజన్ లో ఉన్న గ్రామ సర్పంచులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం ,కాకినాడ,రంపచోడవరం ప్రాంతంలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 5 వెలు జనాభా దాటిన 218 సర్పంచులకు సామర్లకోట ఈటీసీ కేంద్రం నందు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మూడు రోజులపాటు సర్పంచులకు భోజనం, ఇతర అన్ని వసతులకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామ సర్పంచ్ యొక్క విధులు- బాధ్యతలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన , త్రాగునీరు,గ్రామీణ రోడ్ల నిర్మాణం , తదితర అంశాలపై అవగాహన తోపాటు తమ గ్రామాలను ఉత్తమ పంచాయతీలుగా  తీర్చిదిద్దుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని, సర్పంచులు విధిగా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జేడ్పీసీఇవో తెలిపారు.

Kakinada

2021-07-21 16:41:45

గిరిప్రదక్షిణ రద్దు..దర్శనాలుంటాయ్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ప్యూ పొడిగింపు, కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)వారి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడుతూ, కర్ఫ్యూ నేపథ్యంలో గిరిప్రదక్షిణ రద్దు చేశామన్నారు. సింహగిరిపైన కూడా ప్రదక్షిణలకు అనుమతిలేదని తెలిపారు. కాగా ఈ నెల 23, 24వ తేదీల్లో స్వామివారి దర్శనాలు మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపనున్నామని చెప్పారు. 23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి, 24వ తేదీనే తుదివిడత చందన సమర్పణ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోజు దర్శనాల కోసం  22 ఉదయం నుంచి రెండు రోజులపాటు అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఇందులో వంద, మూడు వందల రూపాయల టికెట్లు కౌంటర్లలో అడ్వాన్స్ గా  అమ్ముతున్నామన్నారు. అలాగే 300 రూపాయల టికెట్లు 2,500, వంద రూపాయల టికెట్లు 2,500 అందుబాటులో ఉంచామన్నారు.  అత్యంత పవిత్రమైన 24వ తేదీకోసం  మొత్తం 5వేల టికెట్లు అడ్వాన్స్ గా అమ్మాలని నిర్ణయించినట్టు చెప్పారు.  వీఐపీలకు కూడా లఘు దర్శనాలు మాత్రమే ఉంటాయని, వేద ఆశీర్వాదాలుండవని వివరించారు. ఉదయం6గంటల నుంచి మధ్యాహ్నం3 గంటల వరకూ విరామం లేకుండా దర్శనాలు జరిపిస్తామన్నారు. 8 లడ్డూ కౌంటర్ల ద్వారా లక్ష లడ్డూ ప్రసాదం కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తెల్లవారు జామున 3 గంటలకే సింహాచలం కొండపైకి బస్సులు నడపడంతోపాటు, టికెట్ల కౌంటర్లు, కేశ ఖండనశాల కూడా 3 గంటలకే తెరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు డా. టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గోపాల కృష్ణమాచార్య, హవల్దార్ ఈఈలు, ఏఈఓలందరూ పాల్గొన్నారు.

Simhachalam

2021-07-21 16:37:12

నేటి నుండి సర్పంచులకు శిక్షణ..

 శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికైన సర్పంచ్ లకు ఈనెల 22వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి,  జిల్లా వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ బి.లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ ను జిల్లా వనరుల కేంద్రంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ మూడు డివిజన్లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం డివిజన్ కు చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజ్ లోను, పాలకొండ డివిజన్ కు సీతంపేట యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను,  టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి టెక్కలి అయితం కళాశాలల్లోనూ, మందస యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు.  బ్యాచ్ ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 22వ నుండి 24వ తేదీ వరకు గార,  ఎల్.ఎన్.పేట, శ్రీకాకుళం, సీతంపేట, మందస, కోటబొమ్మాలి, టెక్కలి మండలాలకు., 20 నుండి  28వ తేదీ వరకు ఆమదాలవలస, సరుబుజ్జిలి, మెలియాపుట్టి, పాతపట్నం, కవిటి, సోంపేట, పలాస, జలుమూరు మండలాలకు., 29 నుండి 31వ తేదీ వరకు ఎచ్చెర్ల, జి.సిగడాం, పాలకొండ, వీరఘట్టం, ఇచ్ఛాపురం, కంచిలి, నందిగాం మండలాలకు., ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు బూర్జ, పొందూరు, కొత్తూరు, రాజాం, సంతబొమ్మాలి మండలాలకు.,ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు లావేరు, నరసన్నపేట, హిరమండలం, ఆర్ ఆమదాలవలస,  వజ్రపుకొత్తూరు మండలాలకు., 9 నుండి 11వ తేదీ వరకు రణస్థలం, పోలాకి, సంతకవిటి, సారవకోట మండలాలకు.,12 నుండి 14 వ తేదీ వరకు వంగర, భామిని మండలాలకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

 శిక్షణ తరగతులకు హాజరు అయ్యే సర్పంచుల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.  తదనుగుణంగా వారి హాజరు, పనితీరును గమనించి నిధులు మంజూరు కూడా ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే సర్పంచులకు ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పస్తున్నట్లు లక్ష్మీపతి తెలిపారు. సామర్లకోట శిక్షణ కేంద్రంలో 112 మంది సర్పంచులు శిక్షణ పొందారనీ ఆయన తెలిపారు. ప్రతి శిక్షణ కార్యక్రమానికి 5 గురుతో  శిక్షణా బృందాన్ని నియమించామని ఆయన చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని, సర్పంచులు సద్వినియోగం చేసుకావాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ప్రత్యేకంగా సర్పంచులకు ఒక లేఖ రాయడం జరిగిందని లక్ష్మీపతి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి మీ చేతుల్లో ఉందని అందుకు తగిన విధంగా మంచి పనితీరును కనబరిచాలని, శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారని ఆయన చెప్పారు. 

Srikakulam

2021-07-21 09:50:14

రైతు సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం..

రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో బుధవారం రైతు చైతన్య యాత్రలో వ్యవసాయ శాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రైతు చైతన్య రథాన్ని ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే. శ్రీధర్, డిసిసిబి చైర్మన్ గా నియమితులైన కరిమి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-21 09:47:36

డిసిసిబి పాలకవర్గ ప్రమాణస్వీకారం..

శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేస్తుందని డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి. సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ గురువారం ఉదయం 10.30 గంటలకు డిసిసిబి చైర్పర్సన్ గా కరిమి రాజేశ్వరరావు, సభ్యులుగా బంకి లక్ష్మణ మూర్తి,  గొండు నిర్మల,  బొడ్డేపల్లి నారాయణరావు,  దండాసి ఎండమ్మ,  మియాబిల్లీ శ్యామ సుందరరావు, నడిమింటి రామమూర్తి పదవి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.

Srikakulam

2021-07-21 09:46:09

78 రోజుల్లో 23 వేల మందికి అన్నదానం..

విశాఖలోని పాత నగరంలో ఉన్న వివేకానంద అనాధ, వృద్ధుల ఆశ్రమం అన్నార్తులకు, వృద్దులకు బాసటగా నిలుస్తోంది. దాతలు సహాయ,సహాకారాలతో కేవలం 78 రోజుల్లో 23 వేల మందికి అన్న ప్రసాదం అంద చేయకలిగింది.  ఈ సందర్భంగా విశాఖలో బుధవారం సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక సలహాదారు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా వేల సంఖ్యలో నిరుపేదలకు అన్నదానం చేసిన ఘనత ఒక్క వివేకానంద సంస్థకే దక్కుతుందన్నారు. అనంతరం దివ్యాంగులకు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీశారు. తదుపరి పలువురికి అన్నదానం, రిక్షా కార్మికులకు వస్త్రధానం చేపట్టారు. పాడేరు ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే చిన్నారి గత కొద్ది రోజుల క్రితం నగరంలోని వివేకానంద ఆశ్రమానికి చేరుకుంది.  ఆదరించే వారు లేకపోవడంతో లక్ష్మీ బాధ్యత ను సంస్థ సభ్యులు తీసుకున్నారు. ఇక్కడ ఆశ్రమంలో లక్ష్మీ కి ఆశ్రయం కల్పించారు. అంతే కాకుండా సంస్థ మహిళా సభ్యులు ఆధ్వర్యంలోనే రజస్వల శుభ కార్యక్రమాన్ని సైతం చేపట్టారు.  తమ పిల్లలు తో సమానం గా ఈ శుభాకార్యం జరిపించి,పలువురు కి తాంబూ లాలు లక్ష్మీ ద్వారా అందించి ఆశీస్సులు అందించారు. సంస్థ సభ్యులు తో పాటు శ్రీనుబాబు ఆశీస్సులు అందచేసి లక్ష్మికి కొంత ఆర్దిక సహాయాన్ని అందచేశారు. సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు మాట్లాడుతూ, దాతలు అందరి సహకారం తో సేవా కార్యక్రమం లు కొన సాగిస్తున్నమన్నారు. సంస్థ సభ్యులు పోతు రాజు,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-21 09:33:24