యువత సైన్యం లో చేరి దేశ సేవలో భాగస్వామ్యం కావాలని, భారత సైన్యాన్ని పెంచుదాం –దేశ రక్షణకు తోడ్పడుదామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గనులు భూగర్బ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, జిల్లా సంయుక్త కలెక్టర్లు , (అభివృద్ధి) వి.వీరబ్రహ్మం,( సంక్షేమం) రాజశేఖర్, సబ్ కలెక్టర్ యం.జాహ్నవి, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిలతో కలసి పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని మండలాలకు సంబందించిన నిరుద్యోగులకు ప్రభుత్వ శుభరాం డిగ్రీ కళాశాల నందు యువతకు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంపు నిర్వహణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మంజూరు అయిందన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశం కల్పించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయలన్నదే ముఖ్య ఉద్దేశమని వివరించారు.
ఇక్కడ సెలెక్ట్ చేసిన యువతకు తిరుపతి ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ద్వారా 60 రోజుల ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నామని, శిక్షణ సమయంలో భోజనం వసతి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. శేషారెడ్డి ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇచ్చి గతంలో కూడా చాలా మందికి పారా మిలటరీ లో ఉద్యోగ అవకాశం కల్పించారని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న యువత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుని దేశ సేవలో భాగస్వాములు కావడమే కాకుండా వారి కుటుంబానికి ఆర్థిక అభివృద్ధికి యువత సహాయపడాలని తెలిపారు. గత ఫిబ్రవరి మాసములో ఇక్కడే జాబ్ మేళా నిర్వహించి సుమారు 2400 మంది యువతకు వివిధ కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మాజీ సైనికులకు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం గతంలో ఎంపి నిధులు ద్వారా రూ.10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, అది సరిపోకపోవడం లేదని వారు నా దృష్టికి తీసుకురావడంతో ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడి జడ్పీ నిధుల నుండి రూ.10 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. రూ.5050 కోట్ల తో గండికోట రిజర్వాయర్ నుండి జిల్లాకు త్రాగు - సాగు నీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రూ.6800 కోట్ల తో పుంగనూరు బ్రాంచ్ కాల్వ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. హంద్రీనీవా కాల్వను మూడు రెట్లు వెడల్పు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయిలు ద్వారా త్రాగునీరు అందజేయడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఒక దిక్సూచి గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ మూడు సంవత్సరాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత నే ఎన్నికలకు రావడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారాకనాథ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి ఎదో రకంగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ ఈ దేశానికి బలం యువకులని, వారిని మంచి దారిలో తీసుకెళ్లాలని, వారి జీవతంలో వెలుగుతీసుకురావలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, ముందుండి నడిపించాలన్నదే మంత్రిగారి ఆలోచన అన్నారు. ఆయన ఆలోచనలను కార్యాచరణ చేసి ముందుకు తీసుకెల్లే ఈ రోజు గొప్పగా ప్రారంబించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. మన దేశంలో చాలా మంది యువకులు చదువుకొని, కొంత మంది చదువులేనివారు కూడా ఎలా జీవితంలో ముందుకెళ్లాలని ఆలోచన ఉన్నప్పుడు, నిజంగా ఈ యొక్క ఆర్మీ రెక్రూట్మెంట్ నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతున్నారు. దేశంలో 25 వేల మందికి ప్రీ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో చాలామంది యువకులు వ్యవసాయం చేసి పంట పొలాల్లో తిరిగి పని చేసిన వారు చాలా ధృఢంగా ఉంటారని, వారికి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి దారి చూపిస్తే కచ్చితంగా వారు ఆర్మీ, ప్యారా మిలిటరీ కి సెలెక్ట్ అవుతారని తెలిపారు. ఒక సారి ఉద్యోగం వచ్చిందంటే వారి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. ఈ ప్రాంత యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉద్యోగంలో చేరడానికి శిక్షణతో బాగా ఉపయోగపడుతుందని, శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, అధికారులు వివిధ హోదాలలో దేశరక్షణ కోసం పని చేసి ఇక్కడికి వచ్చిన మాజీ సైనిక అధికారులకు అభినందనలన్నారు. మాజీ సైనికులు ఇక్కడ శిక్షణ పొందే వారికి మీ అనుభవాలను వారికి తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఎన్. వెంకట్ రెడ్డి యాదవ్, ఏపీ అండ్ క్రియేటివిటీ అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పుంగనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నాగరాజ రెడ్డి , జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాథం, వైయస్సార్ సిపి అధికార ప్రతినిధిలు పోకల అశోక్ కుమార్, పెద్ది రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అంతకుమునుపు భారత సైన్యం వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ సైనిక అధికారులను శివ ప్రసాద్, నరసింహారెడ్డి, సి వి రమణలను మంత్రి, కలెక్టర్ దుశ్సాలువతో సన్మానించి, మొమెంటోలు అందించారు. అనంతరం మంత్రి, కలెక్టర్ గారు ఎమ్మెల్యే అధికారులు పావురాలను గాలిలోకి వదిలిపెట్టారు. అంతకముందు సభా ప్రాంగణం చేరుకొన్న మంత్రిగారు జాతీయ జండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ కమిషనర్ ఓ ఎస్ డి దుర్గాప్రసాద్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సెట్విన్ సి.ఈ.ఓ మురళీకృష్ణ రెడ్డి, డి.ఎస్.ఒ సయ్యద్ భాష, జిల్లా పంచాయతీ అధికారి దశరధ రామిరెడ్డి, డి.ఈ,ఓ పురుషోత్తం, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ సరళమ్మ, మున్సిపల్ కమిషనర్ కె ఎల్ వర్మ, s v డిఫెన్స్ అకాడమీ అధ్యక్షులు శేషా రెడ్డి, మునిసిపల్ చైర్మన్ అలీం భాష, వైస్ చైర్మన్ నాగేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు, పుంగనూరు నియోజకవర్గంలోని మండల తహశీల్దార్ లు, ఎంపీడీవోలు, మాజీ సైనికులు, వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నాయకులు తదితరులు, పాల్గొన్నారు.