1 ENS Live Breaking News

కాకినాడలో ప్రారంభమైన పోలీస్ స్పందన..

పోలీస్ శాఖ పరంగా వచ్చిన అర్జీల పరిష్కారంలో చొరవ చూపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్సీ రవీంద్రనాథ్ బాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన  పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన స్పందన కార్యక్రమాన్ని తిరిగి  సోమవారం ఎస్పీ లాంఛనంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా కార్యాలయంతోపాటు, సబ్ డివిజన్ కార్యాలయంలో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎవరూ వ్యయప్రయాశలకోర్చి జిల్లా కేంద్రానికే రావాలనే నిబంధన పెట్టుకోవద్దన్నారు. కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదు దారుల నుంచిం అర్జీలను స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన స్పందన కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలు తమ సమస్యల అర్జీలతో జిల్లాఎస్పీకార్యాలయానికి ఎక్కువ మొత్తంలో అర్జీలతో జనం వచ్చారు.

Kakinada

2021-07-26 10:56:20

5 ఏఎస్ఐల సస్పెన్సన్.. ఒకరు తొలగింపు

తూర్పుగోదావరి జిల్లా ఐదుగురు పోలీసులను డిఐజీ కెవి.మోహనరావు సస్పెండ్ చేసినట్టు ఎస్పీ ఎం.రవీంధ్రబాబు ఒక ప్రకటనలో  ఆదివారం  తెలియజేశారు. చింతూరు, రామచంద్రాపురం, అనపర్తి సబ్ డివిజన్లలో పనిచేస్తున్న ఐదుగరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా. ఒక ఏఎస్ఐని విధుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. సస్పెండ్ అయినవారంతా ఏఎస్ఐలే కావడం విశేషం. కాగా పలు అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న వారిపై స్వయంగా ఎస్పీ విచారణ నిర్వహించి డిఐజీకి అందజేశారు. దీనితో వాస్తవాలు వెలుగు చూడటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. 

Kakinada

2021-07-25 16:14:33

ఈరోజు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు385..

తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కొత్తగా 385 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీశ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం కరోనా బులిటిన్ మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం 309 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, జిల్లావ్యాప్తంగా 225 మందికి వేక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1085 బెడ్లు వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ఈరోజు 481 మంది కోవిడ్ రోగులు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ జిల్లాలో 15లక్షల 5502 మందికి కోవిడ్ వేక్సినేషన్ జరిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Kakinada

2021-07-25 15:47:21

నగర రోడ్లను తక్షణమే బాగుచేయండి..

విశాఖ మహానగరంలో ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న గోతుల రోడ్లను పక్కాగా వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అక్కయ్యపాలెం హైవే జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో అండ్ మోటర్ వర్కర్స్ యూనియన్, AITUCఅనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ, విశాఖ మహా నగరం మాధవధార, మురళి నగర్, ఆర్అండ్ బి జంక్షన్ ,అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ లను ప్రమాదకరంగా మారిపోయాయన్నారు. ఆ ప్రాంతంలో ప్రయాణాలు చేస్తున్న ఆటోలు, వ్యాన్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన సర్వీసులన్నీ ఆటోల రిపేర్లకు వస్తున్నాయన్నారు. ఉన్న గోతులు పడిన రోడ్లను పక్కాగా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గత మూడు సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, కేబుల్ లైన్లు వేసుటకు త్రవ్విన గోతులను కప్పలేదని ఆరోపించారు.  దీనివల్ల మోటార్ బైకులు, ఆటోలు నడపాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వం పక్కా రోడ్ల  నిర్మాణం పేరుతో లీటర్ డీజిల్ పై  రూపాయి.12పైసలు.చొప్పున పెంచి 1200కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానా నింపుకుంటున్నా.. రోడ్లు మాత్రం పక్కాగా నిర్మాణం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే గోతుల రోడ్లను పక్కాగా వేసి రోడ్డు ప్రమాదాలనివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ప్రజావ్యతిరేకతకు గురికావాల్సి వస్తుందన్నారు..
ఈ కార్యక్రమంలోప్రభాకర్, కేలం శివ,పి.బాలు, శ్రీనివాస్, సన్యాసిరావు, సత్తిబాబు, నందీశ్వర రావులు తదితరులు పాల్గొన్నారు .

Akkayyapalem

2021-07-25 14:44:35

పచ్చతోరణంలో ప్రతీమొక్కా బతకాలి..

జగనన్న పచ్చతోరణంలో నాటే ప్రతి మొక్క బతకాలని, ఆవిధంగా కార్యాచరణ ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్ధానిక మంత్రి కాంపుకార్యలయ సమావేశం మందిరంలో నరేగా డైరెక్టర్ చినతాతయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్తంశెట్టి విశ్వనాధ్ , పిడి ద్వామ చంద్రశేఖర్, నరేగా లైన్ డిపార్ట్మెంట్ లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రానున్న పదిరోజుల్లో మెగా ప్లాంటేషన్ జరగాలని, ప్రస్తుతం జిల్లాలో గుర్తించిన 1100 కిమీ జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట జరుగుతున్న మొక్కల నాటడానికి జరుగుతున్న గుంతల త్రవ్వకం వేగవంతం కావాలని సూచించారు. మొక్కల పెంపకంలో ఆవెన్యూ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత ఉండాలని , నాటే ప్రతి మొక్క బతకాలనే లక్ష్యం తో అధికారులు పనిచేయాలని, స్థానికులు సహకారం తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నరేగా లో నిర్దేశించిన 26 కోట్ల పనిదినాలు పూర్తి చేసి వేతనరూపంలో 6 నుండి 7 వెలకోట్లు నరేగా వేతన జీవులకు అందాలని సూచించారు. చేరువుల్లో పూడిక తీతపనులు , సిల్ట్ అప్లికేషన్ వంటివి ప్రాధాన్యత గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. నిధుల కొరత లేదని అనుకున్న లక్ష్యాలను అధిగమించేలా చూడాలని అన్నారు. ఈ సమీక్షలో డ్వామా డిపార్ట్మెంట్ ఎపిడీలు , అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-07-25 14:32:44

ప్రత్యేక ప్రణాళికతో పనులు వేగం..

సరైన కార్యాచరణ ప్రణాళికతో పనులను ప్రగతి దిశగా వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. గ్రామ స్థాయిలో జరుగుతున్న భవన నిర్మాణ పనులలో తక్కువ ప్రగతి ఉన్న మండలాలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం కావాలని ఆయన అన్నారు. స్థల సమస్య ఉంటే తక్షణం పరిష్కరించు కోవాలని ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాలు పూర్తి కాలేదు అంటే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి అన్యాయం చేస్తున్నట్లు భావించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రగతి మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భవన నిర్మాణాలు తమ హయాంలో పూర్తి చేయడాన్ని గర్వంగా ఫీల్ కావాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని దానిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల నిర్మాణం కూడా జరగాలని ఆయన చెప్పారు. అవసరమైతే ఇసుకను ఎడ్ల బండ్లపై తీసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. పనులు ఎందుకు జాప్యం జరుగుతోంది అని చెప్ప వద్దని, ఏ విధంగా చేయడం వలన వేగవంతం చేయవచ్చో చెప్పాలని ఆయన అన్నారు. మొదటి మూడు స్థానాలకు చేరుటకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. పోలాకి, పొందూరు, మెలియాపుట్టి, సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, రణస్థలం, కవిటి, పలాస, ఆమదాలవలస తదితర మండలాలు భవన నిర్మాణ ప్రగతిలో చివరి స్థానాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు,  ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-25 14:20:09

వాక్సినేషన్ నమోదు సక్రమంగా జరగాలి..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ వేక్సినేషన్ నమోదు సక్రమంగా జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు వైద్యాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రెండవ డోసు పూర్తి చేసుకున్న వారి పేర్లు కూడా తిరిగి జాబితాలో చేరుతున్న సందర్బాలు వస్తున్నాయని అటువంటి పరిస్థితులు పునరాృతం కాకుండా చూడాలని ఆయన తెలిపారు. పునరావృతం అయితే వాక్సినేషన్ బృందాల పై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వాక్సినేషన్ కు వచ్చేవారి ఫోన్ నంబర్లను రెండు డోసుల సమయంలో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్ లకు నమోదు కార్య్రమంలో అనుభవం ఉందని ఆయన తెలిపారు. వాక్సినేషన్ కు వచ్చే ప్రతి 50 మందికి పర్యవేక్షణకు ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాక్సినేషన్ ప్రారంభం కావాలని, ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, మున్సిపల్ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి పక్కాగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు,  ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-25 10:22:08

మెగా వేక్సినేషన్ విజయవంతం చేయండి..

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 26న  మెగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌ర‌గ‌నుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం మీడియాకి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు ల‌క్ష‌ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో 45 ఏళ్లు దాటిన వారికి మొద‌టి డోసుతో పాటు, తొలి డోసు తీసుకొని 84 రోజులు అయిన వారికి రెండో డోసు టీకాలు వేయ‌నున్న‌ట్లు జేసీ తెలిపారు. జిల్లాలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారిలో ఇంకా నాలుగు ల‌క్ష‌ల మంది మొద‌టి డోసు తీసుకోవాల్సి ఉంద‌ని, అదే విధంగా రెండో డోసు తీసుకోవాల్సిన వారు 40 వేల మంది ఉన్నార‌ని వీరంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.  గ‌ర్భిణీ స్త్రీల‌కు, ఉపాధ్యాయుల‌కు కూడా మొదటి డోసు పంపిణీ చేయ‌నున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (డి) తెలిపారు.

Kakinada

2021-07-25 10:20:15

గ్రామ సచివాలయాల్లోనే ఇక స్పందన..

స్పందన కార్యక్రమాన్ని  జిల్లాలో సోమవారం నుండి గ్రామసచివాలయాల్లో ప్రారంభి స్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. వాక్సినేషన్, స్పందన కార్యక్రమాలపై ఆదివారం సంభందిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాలలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్లు తదితర సమస్యలకు మొదటి సారిగా అర్జీలు సమర్పించే ప్రజలు గ్రామ సచివాలయంలోనే సమర్పించాలని ఆయన తెలిపారు. సచివాలయ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. మొదటి సారిగా అర్జీలు సమర్పించుటకు మండల, జిల్లా స్థాయికి రావలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలకు మాత్రమే మండల, జిల్లా స్థాయికి రావాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనల మేరకు స్పందన కార్యక్రమం నిర్వహించుటకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొంటూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ ఎస్ఇ కే. బ్రహ్మయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్. కూర్మ రావు,  ఎం.పి.డి.ఓలు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-25 09:44:09

మరో నాగుపాముకి ప్రాణం దక్కింది..

విశాఖలోని పెదగంట్యాడ సత్యన్నారాయణ పురంలో నాగుపాము(కోబ్రా) ఓ ఇంట్లో దూరడంతో సమాచారం అందుకున్న స్నేక్ సేవర్ సొసటీ నిర్వాహకులు కిరణ్ ఆదివారం తెల్లవారు జామున రెండుగంటల ప్రాంతంలో పాముదూరిన ఇంట్లోకి వెళ్లి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాము ఇంట్లోని వంటగదిలోకి దూరి బుసలు కొడుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్నేక్ సేవర్ కిరణ్ ను 98491 40500 లో సంప్రదించారు. వెంటనే సంఘటనా స్థలాని వెళ్లి నాగుపాముని ప్రాణాలతో పట్టుకొని దగ్గర్లోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీనితో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నగర పరిధిలో ఎక్కడ పాములు కనిపించినా వాటి చంపవద్దని, తమకు సమాచారం అందిస్తే వాటిని పట్టుకొని సురక్షితంగా వాటిని అడవుల్లోకి విడిచి పెతామని స్నేక్ సేవర్ కిరణ్ చెప్పారు.

Pedagantyada

2021-07-25 09:39:04

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు..

రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమం ల‌క్ష్యంగా వారి జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచేందుకు అత్య‌ధిక ప్రాధాన్య‌మిస్తూ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో అమ‌లుచేస్తోంద‌ని కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర‌రెడ్డి పేర్కొన్నారు. మేయ‌ర్ సుంక‌ర పావ‌ని తిరుమ‌ల కుమార్, కాకినాడ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి త‌దిత‌రుల‌తో క‌లిసి ఎమ్మెల్యే కాకినాడ‌లోని గాంధీన‌గ‌ర్-ఎల్విన్‌పేట‌లో డా. బీఆర్ అంబేడ్క‌ర్ సామాజిక భ‌వ‌నం మొద‌టి అంత‌స్తు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. తొలుత భారత రత్న డా. బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించిన అనంత‌రం సామాజిక భ‌వ‌న విస్త‌ర‌ణలో భాగంగా నిర్మించిన ప్రాంగ‌ణాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌జా సంక్షేమం ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నార‌ని పేర్కొన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించే అదృష్టం ల‌భించినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. ఎల్విన్‌పేట ప‌రిస‌ర ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేయ‌నున్నామ‌ని, రూ.6 కోట్ల ఖ‌ర్చుతో రిటైనింగ్ వాల్ ప‌నులు ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. భార‌త ర‌త్న డా. బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌యాల స్ఫూర్తిగా ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను గుర్తించి, త‌క్ష‌ణ ప‌రిష్కారం దిశ‌గా కృషిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మున్ముందు ఇదే స్థాయిలో స్థానికంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని మేయ‌ర్ సుంక‌ర పావ‌ని తిరుమ‌ల కుమార్ ఆకాంక్షించారు. శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రరెడ్డి నేతృత్వంలో కాకినాడ‌లో అభివృద్ధి శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో విశ్రాంత అడిష‌న‌ల్ డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ ఎం.ప‌వ‌న్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ పి.స‌త్య‌కుమారి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-25 06:40:51

కలెక్టర్ మురళీధరరెడ్డికి ఆత్మీయ వీడ్కోలు..

తూర్పుగోదావ‌రి జిల్లాకు రెండేళ్ల పాటు క‌లెక్ట‌ర్‌గా సేవ‌లందించి, ప‌దోన్న‌తిపై రాష్ట్ర వైద్య సేవ‌లు, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీగా బ‌దిలీపై వెళ్తున్న డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, హేమ దంప‌తుల‌కు అధికారులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లోని వివేకానంద స‌మావేశ మందిరంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) అధ్య‌క్ష‌త‌న ఉద్వేగ‌భ‌రిత వాతావ‌ర‌ణంలో జ‌రిగిన వీడ్కోలు కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల‌స్థాయి అధికారులు, సిబ్బంది ఘ‌నంగా స‌త్క‌రించారు. విశిష్ట అతిథులుగా హాజ‌రైన ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు, జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ త‌దిత‌రులు క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను శాలువాలతో స‌న్మానించి, జ్ఞాపిక‌లు అందించి రెండేళ్ల కాలంలో ఆయ‌న జిల్లాకు అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. జిల్లా అత్యున్న‌త అధికారితో త‌మ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పూల‌తో ప్ర‌త్యేకంగా అలంక‌రించిన వాహ‌నాన్ని లాగుతూ పోలీస్ బ్యాండ్‌తో క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ దంప‌తుల‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు.
 ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్ర‌తి అధికారి అఖిల భార‌త స‌ర్వీసు అధికారేన‌ని విధి నిర్వ‌హ‌ణ‌లో దీక్షాద‌క్ష‌త‌తో, క‌ష్టించి ప‌నిచేసి తూర్పుగోదావ‌రిని ముందు వ‌రుస‌లో నిలిపార‌ని పేర్కొన్నారు. జిల్లాస్థాయి మొద‌లు గ్రామంలోని స‌చివాల‌యం వ‌ర‌కు ప్ర‌తి కార్య‌క్షేత్ర సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేశార‌ని, ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ఎదుర్కొన్నార‌ని, వీరితో త‌న అనుబంధం మ‌రువ‌లేనిద‌న్నారు. ఏ అధికారి అయినా ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది వెళ్లేట‌ప్పుడు మాత్ర‌మే త‌న దిగువ స్థాయి సిబ్బంది క‌ళ్ల‌లో నీళ్లు చూడాలేగానీ ప‌నిచేస్తున్న స‌మ‌యంలోనే వారి క‌ళ్లలో నీళ్లు చూడ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని గుర్తుంచుకొని యువ అధికారులు విధులు నిర్వ‌హించాల‌ని.. బృంద స్ఫూర్తి, స‌మాన‌త‌తో స‌మ‌న్వ‌యంతో పేద‌ల సంక్షేమం లక్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించారు. స‌వాళ్లు వ‌స్తుంటాయ‌ని.. అయితే వాటిని సానుకూల దృక్ఫ‌థంతో ఎదుర్కోవాల‌న్నారు. రెండేళ్ల కాలంలో జిల్లా ఎన్నో మ‌ధురానుభూతుల‌ను మిగిల్చింద‌ని, మూడున్న‌ర ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు అందించ‌డం, కోవిడ్ రెండు ద‌శ‌ల‌నూ ఎదుర్కోవ‌డం వంటివి అత్యంత సంతృప్తినిచ్చిన‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. రెండేళ్ల‌కాలంలో వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద్వారా డీబీటీతో జిల్లా ప్ర‌జ‌ల‌కు రూ.10 వేల కోట్లు మేర ల‌బ్ధి జ‌రిగింద‌న్నారు.  రాష్ట్రంలో అత్య‌ధిక జ‌నాభా, భౌగోళికంగా వైవిధ్య‌మున్న జిల్లాలో సేవ‌లందించే అవ‌కాశాన్ని ఇచ్చిన గౌర‌వ ముఖ్య‌మంత్రికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు మాట్లాడుతూ సోద‌ర స‌మానులు అయిన ముర‌ళీధ‌ర్‌రెడ్డి రెండేళ్ల కాలంలో పోలీసు శాఖ‌కు ఎంతో మేలు చేశార‌ని, కారుణ్య నియామ‌కాల్లో ఎక్క‌డా పెండింగ్ లేకుండా చూశార‌ని.. ఇందుకు పోలీసు శాఖ త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

గురు స‌మానులు: జేసీ(ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ‌
నిరాడంబ‌ర‌త‌తో ఆద‌ర్శ‌నీయ ల‌క్ష‌ణాలతో ప‌నితీరులో అత్యున్న‌త ఫ‌లితాలు సాధిస్తున్న ముర‌ళీధ‌ర్‌రెడ్డిగారు త‌న‌కు గురుస‌మానుల‌ని, ఆయ‌న్నుంచి రెండేళ్ల కాలంలో ఎంతో నేర్చుకున్నాన‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. న‌లువైపుల నుంచి  ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ఎక్క‌డా ఒత్తిడి అనే మాట లేకుండా వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నార‌న్నారు. ముఖంపై చిరున‌వ్వును చెద‌ర‌నివ్వ‌కుండా, విధి నిర్వ‌హ‌ణ ప‌రంగా రాజీప‌డ‌కుండా సేవ‌లందించార‌న్నారు. ఆయ‌న నుంచి నేర్చుకున్న విష‌యాలు త‌న భ‌విష్య‌త్ కెరీర్‌కు మార్గ‌ద‌ర్శ‌నంగా ఉంటాయ‌ని తెలిపారు. చాలా కీల‌క‌మైన ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల అభివృద్ధి విభాగానికి ఎండీగా వెళ్తున్నార‌ని, ఆయ‌న ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందుతాయ‌న్నారు. రాష్ట్రంలో కొత్త‌గా రానున్న 16 బోధ‌నాసుప‌త్రుల్లో వ‌స‌తుల క‌ల్ప‌న‌లో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని జేసీ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.

- జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి మాట్లాడుతూ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌నిచేయ‌డాన్ని అదృష్టంగా భావిస్తార‌ని, అయితే క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి హ‌యాంలో ప‌నిచేయ‌డం మ‌రింత అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. స‌మ‌య‌పాల‌న‌, సానుకూల దృక్ప‌థం, బృంద స్ఫూర్తి, స‌రైన స‌మ‌యంలో వేగ‌వంతంగా స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, స‌రైన ప్ర‌ణాళిక‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ నైపుణ్యాలు, క్షేత్ర‌స్థాయికి స‌క్ర‌మ స‌మాచార పంపిణీ వంటి విశిష్ట ల‌క్ష‌ణాలు ఆయ‌న‌లో చూశామ‌ని పేర్కొన్నారు. కోవిడ్ వంటి క్లిష్ట సమ‌యంలో ఆయ‌న చూపిన ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మన్నారు. డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, కాకినాడ, రాజమహేంద్రవరం కమిష‌న‌ర్లు స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అభిషిక్త్ కిషోర్, చింతూరు, రంప‌చోడ‌వ‌రం ఐటీడీఏ పీవోలు ఎ.వెంకట రమణ, సీవీ ప్రవీణ్ ఆదిత్య; రాజమహేంద్రవరం, రంపచోడవరం సబ్ కలెక్టర్లు ఇలాక్కియా, కట్టా సింహాచలం, అదనపు ఎస్‌పీ క‌ర‌ణం కుమార్, ఏపీఎస్పీ థ‌ర్డ్ బెటాలియన్ కమాండెంట్ సుమిత్ గరుడ్‌, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ; జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌; డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, డీపీవో ఎస్వీ నాగేశ్వర్ నాయక్ , డీఎంహెచ్‌వో డా.కేవీఎస్ గౌరీశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్మీదేవి, డీడీ ట్రేజరరీ శర్మ, సివిల్ స‌ప్ల‌య్‌స్ జెడ్ ఎం డి.పుష్ప‌మ‌ణి, వివిధ ఉద్యోగ సంఘాల నేత‌లు, ప్ర‌తినిధులు; క‌లెక్ట‌రేట్ ఏవో శ్రీనివాస్‌, కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, రెడ్‌క్రాస్ ఛైర్మన్ వైడీ రామారావు; కాకినాడ, పెద్దాపురం, అమలాపురం డివిజినల్ అధికారులు.. ఏజీ చిన్నికృష్ణ, ఎస్.మల్లిబాబు, ఎస్.వ‌సంత‌రాయుడు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-07-24 15:06:05

రేపు శ్రీకాకుళంలో ర‌క్త‌దాన శిబిరం..

 శ్రీకాకుళం నగరంలోని డిసిసిబి కాలనీ చిల్డ్రన్ పార్క్ వద్ద ఆదివారం సుందర సత్సంగం బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు  పెరంబుదూర్ సూరిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఆయన  మీడియాకి లేఖ విడుదల చేశారు. తమ బృందం ద్వారా  గడిచిన పదేళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. గురుపౌర్ణిమ పురస్కరించుకొని 100 మంది సుందర సత్సంగానికి చెందిన మహిళలు రక్తదానం గురుదక్షిణగా  చేయనున్నారని చెప్పారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.  స్వచ్ఛంద రక్త దాతలు కూడా ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో రక్తం కొరత ఉన్నందున తమ బ్రుందం తరఫున ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Srikakulam

2021-07-24 14:11:32

క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉత్తేజం..

ప‌ని ఒత్తిడితో అల‌సిపోయిన‌వారికి, క్రీడ‌ల‌తో నూత‌నోత్సాహం క‌లుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. స్థానిక స‌ర్ విజ్జీ క్రీడా మైదానంలో సుమారు రూ.35ల‌క్ష‌ల‌తో ఆధునీక‌రించిన క్రికెట్ స్టేడియంను, ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి శ‌నివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా క‌లెక్ట‌ర్ పాల్గొని మొక్క‌లు నాటారు. రెవెన్యూ అధికారుల క్రీడాపోటీల‌ను క‌లెక్ట‌ర్‌, ఎంఎల్ఏలు ప్రారంభించారు.  ఇద్ద‌రూ కొద్దిస‌మ‌యం క్రికెట్ ఆడి ఆక‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ మీడియాతో మాట్లాడారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌లో గానీ, ఇత‌ర దైనందిన  ప‌నుల‌తో గానీ,  రెవెన్యూ అధికారులు నిత్యం ప‌ని ఒత్తిడితో స‌త‌మ‌తం అవుతున్నార‌ని, వారికి కాస్త ఉల్లాసం క‌ల్గించేందుకు క‌ల్గించేందుకు ఇటువంటి క్రీడాపోటీలు దోహ‌దం చేస్తాయ‌ని అన్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మాలు వారికి పున‌రుత్తేజం క‌ల్గిస్తాయ‌న్నారు. విజ్జీ స్టేడియాన్ని అభివృద్ది చేసేందుకు ఎంతో ఆస్కారం ఉంద‌ని, ఆధునిక‌ వ‌స‌తుల‌ను క‌ల్పిస్తే, అంత‌ర్జాతీయ స్థాయి పోటీల‌కు కూడా ఇక్క‌డ నిర్వ‌హించ‌వ్చ‌ని అన్నారు. స్టేడియం అభివృద్దికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. ప‌ట్ట‌ణ ప‌రిదిలో ప‌చ్చ‌ద‌నం పెంచేందుకు ఎంఎల్ఏ కృషి చేస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ అభినందించారు.

              ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, నిత్యం బాధ్య‌త‌ల్లో మునిగిఉండే రెవెన్యూ సిబ్బందికి, ఇలాంటి క్రీడాపోటీలు ఒక అట‌విడుపుగా పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌ట్ట‌ణంలో జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మం క్రింద విస్తృతంగా మొక్క‌ల‌ను నాటుతున్నామని అన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో, రెండేళ్ల క్రితం నుంచే ప‌ట్ట‌ణంలో ల‌క్ష‌లాదిగా మొక్క‌ల‌ను నాటి, హ‌రిత విజయ‌న‌గ‌రంగా మార్చినందుకు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ను కొనియాడారు. అభివృద్ది కార్య‌క్ర‌మాల‌తోపాటుగా, క్రీడాభివృద్దికి కూడా అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స‌హ‌కారంతో, విజ్జీ స్టేడియంను అభివృద్ది చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. విద్య‌ల‌తోపాటుగా, క్రీడ‌ల‌కు కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎంతో ప్ర‌సిద్ది అని, ఆ పేరును నిల‌బెట్టేందుకు త‌మ‌వంతు స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని కోల‌గ‌ట్ల పేర్కొన్నారు.

           ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ సిఇఓ శివానంద రెడ్డి మాట్లాడుతూ, విజ్జీ స్టేడియంకు ఇప్ప‌టికే గొప్ప గుర్తింపు ఉంద‌ని అన్నారు. ఈ స్టేడియంలో భార‌త‌జ‌ట్టు క్రీడాకారులు వివిఎస్ ల‌క్ష్మ‌ణ్‌, రాబిన్ సింగ్,   జిఆర్ విశ్వ‌నాధ్‌ కూడా క్రికెట్ ఆడిన విష‌యాన్ని గుర్తు చేశారు. మైదానాన్ని మ‌రింత అభివృద్ది చేసేందుకు ఏసిఏ త‌ర‌పున స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంఓయు చేయాల్సి ఉంద‌ని, దానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరారు. యువ‌త అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే, క్రీడా సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.  ఈ కార్య‌క్ర‌మాల్లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, సెట్విజ్ సిఇఓ విజ‌య్‌కుమార్‌, క్రీడాధికారి వెంక‌టేశ్వ‌ర్రావు, ఏసిఏ ట్రెజ‌ర‌ర్ గోపీనాధ‌రెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి ఎంఎల్ఎన్ రాజు, కోశాధికారి రాంబాబు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, రెవెన్యూ అసోసియేష‌న్ నాయ‌కులు తాడ్డి గోవింద‌,తాశీల్దార్ ఎం.ప్ర‌భాక‌రార‌వు, ఇత‌ర‌ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం జ‌రిగిన  పోటీల్లో క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఇత‌ర రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్రికెట్ ఆడి క్రీడాస్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించారు.

Vizianagaram

2021-07-24 13:45:37

ఫోర్టి బియ్యం పై అవగాహన కల్పించండి..

ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పోషక విలువలతో కూడిన బియ్యమని గ్రామాలలో ప్రజలకు సర్పంచులు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం సర్పంచులకు  వీడియో ప్రదర్శన ద్వారా ఫోర్టి బియ్యం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి 100 కేజీల బియ్యంలో ఒక కేజి పోర్టిఫైడ్ బియ్యం కలిపి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసి పేద ప్రజలకు అందజేయడం జరుగుతుందని అన్నారు, ముందుగా ప్రతి ఒక్కరూ ఫోర్ట్ ఫేడ్ బియ్యం పై అవగహన కలిగి ఉండాలన్నారు.  ఇందులో అధికంగా సూక్ష్మ పోషకాలు ఉన్నందున రక్త హీనత నివారణా, నాడీ వ్యవస్థ అభివృధి, గర్భస్థ శిశు వికాసం భావితరాల బంగారు భవిష్యత్తుకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారమన్నారు, చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యం ఫోర్ట్ ఫేడ్ బియ్యంతోనే సాధ్యమన్నారు. ఈ సర్పంచుల శిక్షణ ముగింపు సమావేశానికి పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, డి.ఎల్.డి. ఓ రాజ్ కుమార్, పార్వతీపురం, సీతానగరం, కొమరాడ మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపి.డి.ఓలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-24 13:44:39