మహా విశాఖ నగర పాలక సంస్థ నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. సోమవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం లో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో , టోల్ ఫ్రీ నం.1800-4250-0009 ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. ఇందులో ఒకటవ జోనుకు 04, రెండవ జోనుకు 06, మూడవ జోనుకు 03, నాల్గవ జోనుకు 02, అయిదవ జోనుకు 06, ఆరవ జోనుకు 05, ఇతరులు 01, మొత్తము 27 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు రమణి, సన్యాసిరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ప్రత్యేక కేంద్రాల నుంచి 13 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు సోమ వారం 13 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.
విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కు 220 వినతులు అందాయి. ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల, ఆరోగ్య శ్రీ , ఆదరణ, రైతు భరోసా, అమ్మ ఒడి లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, విపత్తుల శాఖ ప్రోజెక్ట్ అధికారి పద్మావతి వినతులను అందుకున్నారు. స్పందనలో అందిన వినతులను వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్పందన అనంతరం ధాన్యం సేకరణ , పౌర సరఫరాల వాహనాలు, జగనన్న తోడు, కన్వర్జెన్స్ పనులు, నాడు- నేడు , బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, తదితర కార్యక్రమాల పై కలెక్టర్ సమీక్షించారు. ఇ – సేవలు పెండింగ్ పై సమీక్షిస్తూ పౌర సరఫరాలు, జిల్లా రెవిన్యూ అధికారి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల వద్ద ఎక్కువగా ఊనయని, వాటిని ఈ రోజే క్లియర్ అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ధాన్యం సేకరణ లో మండల ప్రత్యేకాదికారులు కూడా దృష్టి పెట్టాలని అన్నారు. రైతులతో, మిల్లర్ల తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నిర్దేశిత లక్ష్యం 5 లక్షల మెట్రిక్ టన్నులను ఫిబ్రవరి లోపలే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సంయుక్త కలెక్టర్ జే.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది సేకరణ వేగవంతం అవుతుందని, అందుకు పనిచేస్తున్న అధికార బృందానికి, డ్వాక్రా, మొలక సంస్థలకు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తి తో పని చేయాలనీ ఎక్కడ ఏ సమస్య ఉన్న తన దృష్టి లోనికి వెంటనే తేవాలని జే.సి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ శాఖ ద్వారా జిల్లాకు కేటాయించిన 75,000 రూపాయల విలువ గల 5 టచ్ ఫోన్ లను 6 వేల విలువ గల రెండు వినికిడి యంత్రాలను స్పందన లో లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అందజేసారు. ఈ కార్యక్రమం లో, ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలాకుమారి, విభిన్న ప్రతిభ వంతులశాఖ సహాయ సంచాలకులు నీలకంట ప్రధానో , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైన బాలలు,పెద్దలకు జారీచేసే వైకల్య ధృవీకరణ పత్రాలను జారీ కోసం స్లాట్లు జారీ చేసే సమాచారాన్ని దివ్యాంగులు సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్ అధికారులు, సమాచార శాఖ ద్వారా పత్రికలు, వివిధ టి.వి.ఛానెళ్లు,ఎఫ్.ఎం రేడియోలు ద్వారా ప్రచారం ఉధృతంగా చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గొండు సీతారాం ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం విశాఖలోని పెదవాల్తేరు దివ్యంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏ.డి..జి.వి.ఆర్.శర్మను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినతిని పరిశీలించిన శర్మ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ వాదనను జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళతానని చెప్పారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాను ఇటు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి,ఫిబ్రవరి నెలలకు గాను దివ్యాంగ బాలలకు,పెద్దలకు వైకల్య ధృవీకరణ పత్రాల జారీకి ఇటీవల ఉత్తర్వులు జారీచేయడం హర్షణీయమని అన్నారు. ఈ స్లాట్ ల నమోదు పై ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పూర్తి సమాచారం లేక అత్యధిక శాతం మంది దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సమాచార,సాంకేతిక వ్యవస్థ దగ్గరైన సమయంలో ఏ.సెంటర్లు,కేంద్రాల్లో ఎప్పుడు,ఎక్కడ నమోదు చేస్తున్నారో వార్డు,గ్రామ వాలెంటీర్లు,సచివాలయం సిబ్బందితో గడప, గడపకీ సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారమని అన్నారు. ఎ.డి.ని కలసిన వారిలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కార్యదర్శి పి.శేఖర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆఫీస్ సూపరింటెండెంట్ జి.జగదీష్ తదితరులు ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఈవియం యంత్రాల గోడౌన్ల భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ ప్రక్కన ఉన్న ఈవిఎం గొడౌన్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల కమీషన్ సూచనల కనుగుణంగా ప్రతి నెల నిర్వహించే ఈవియంల పరిశీలనలో భాగంగా ఆయన అధికారులతో కలిసి ఈ తనిఖీ జరిపారు. ఈవియంల రక్షణ, భద్రత కొరకు చేపట్టిన ఏర్పాట్లను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, ఎలక్షన్ విభాగం అధికారి యం.జగన్నాధం, కాకినాడ అర్భన్ తహశిల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ఇసుక ఓపెన్ రీచ్ ల నుండి రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీయాలని జాయింట్ కలక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మిశ ఆదేశించారు. సోమవారం జాయింట్ కలక్టర్ జి.లక్ష్మిశ కలక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బోర్డు,మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, ఇసుక ఓపెన్ రూచ్ కంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలక్టర్ మాట్లాడుతూ ఇసుక అనేది ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలలో ప్రధానమైందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్ను ఇసుక అవసరరాలు ఉన్నాయన్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో ఒక్కొక్క రీచ్ నుండి రోజుకు ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను తీయాలన్నారు. జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాలకు 37 లక్షల మె.ట. ఇసుక అవసరమవుతుందన్నారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామసచివాలయ భవనాల నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు మూడు లక్షల మె.ట. అవసరమవుతుందన్నారు. ఈ దిశగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పొందిన ఇసుక కంట్రాక్టర్లు లక్ష్యాలకు అనుగుణంగా ఇసుకను సిధ్ధం చేయాలన్నారు.
ఇసుకను త్వరితగతిన తీసుకునే విధంగా ప్రభుత్వం సెమి మెకనైజ్డ్ మిషన్లను అనుమతించారన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్ శాఖల నిబంధనల ప్రకారం ఇసుకను త్రవ్వే రీచ్ ల వద్ద డెప్త్ , ఫ్లడ్ బ్యాంక్, స్ట్రక్చర్ నుండి 500మీటర్ల దూరం వంటి అంశాలను కాంట్రాక్టర్లు పాటించాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టకపోతే అనుమతి పొందిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్ట్ ను రద్దు చేసి వేరొక కాంట్రాక్టరుకు అనుమతులు జారీ చేయడం జరుగుతుందని జేసి స్పష్టం చేశారు. రీచ్ల వద్ద వచ్చిన సాంకేతిక ఇతర సమస్యలు ఉన్నట్లైతే నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకుని రావాలని మైనింగ్ అధికారులకు జేసి లక్ష్మిశ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఇ.బి.అవరేషన్ ఎస్.పి.లు సుమిత్ గార్గ్, రమాదేవి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు తో పాటు ఇసుక ఓపెన్ రిచ్ ల కంట్రాక్టర్లు పాల్గొన్నారు.
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పధకం క్రింద చేపట్టిన పెద్ద లేఅవుట్ లలో ఆన్ సైట్ సామగ్రి తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పధకం గృహనిర్మాణల కొరకు ఏర్పాటైన జిల్లా స్థాయి టెండర్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా గత నెల 15న జారీ చేసిన టెండర్లకు బిడ్డర్ల నుండి తగిన స్పందన రాక పోవడంతో రిటెండరింగ్ కు పిలవాలని జెసి ఆదేశించారు. అలాగే బిడ్డర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని శాఖలలో నమోదైన నిర్మాణ, సామగ్రి సరఫరా కాంట్రాక్టర్లతో మంగళవారం జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. నిర్మాణ సామగ్రి రవాణా ఖర్చులు, తరలింపులో నష్టాలు తగ్గించేందుకు 5వేలు ఆపై ఇళ్లు నిర్మించే లే అవుట్ లలో అక్కడే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించాలని, ఇందుకు అవసరమైన స్థలాలు, ముడి సరుకు టై అప్ వెసులుబాటులను తయారీదారులకు కల్పించాలని సూచించారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఫాల్జీ ఇటుకల తయారీ యూనిట్లను పెద్ద సంఖ్యలో ప్రోత్సహించాలని ఆదేశించారు. అలాగే చిన్న లే అవుట్ లలోని ఇళ్ల కొరకు క్లస్టర్ల విధానంలో యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రిటెండరింగ్ లో ఎక్కవ మంది బిడ్డర్లు పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ధరావతు సొమ్మును తగ్గించాలని, చెల్లింపుల గురించి బిడ్డర్లలో అపోహలను తొలగించాలని జేసి(డి) అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, డిపిఓ నాగేశ్వరనాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జియం బి.శీనివాసరావు, ఆర్.అండ్.బి, ఆర్.డబ్ల్యూ.ఎస్., ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో టమోటా, వేరుశెనగ, చీని తదితర పంటల ఉత్పత్తులకు సంబంధించి చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపి తలారి రంగయ్యలు సూచించారు. ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో వివిధ పంటల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్, ఎంపీలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలను 2,02,532 హెక్టార్లలో సాగు చేస్తారని, అందులో టమోటా పంటను 16 వేల హెక్టార్లలో సాగు చేస్తారని, టమోటా పంటకు సంబంధించి 10. 40 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని, ఒక హెక్టార్ కు 40 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో ఆత్మకూరు, కంబదూరు, కుందుర్పి, బుక్కరాయసముద్రం, తనకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, బొమ్మనహాళ్ లో ఎక్కువ టమోటా సాగవుతుందని, అందులో 448,440, సాహో, అభినవ్ రకాల టమోటా సాగు చేస్తారన్నారు.
ఇక్కడ పండే టమోటా ఉత్పత్తిలో ఎక్కువ శాతం పంట ఎగుమతి అవుతుందని, ధర తక్కువగా ఉన్నప్పుడు రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలో రవాణా సౌకర్యాలు లేక, మద్ధతు ధర లేక రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా నుంచి కిసాన్ రైలు ఏర్పాటు చేసి ఢిల్లీకి టమోటా, చీని, బొప్పాయి తదితర రకాల ఉద్యాన ఉత్పత్తులను తరలించామన్నారు. జిల్లాలో రైతుల మేలు కోసం చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాట్లకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకు సంబంధించి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపి తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో టమోటా, వేరుశెనగ, చీని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నస్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వల్ల రైతులకు ఎక్కువ ధర లభించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో క్లస్టర్ కి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ను మొదటిదశలో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. టమోటా, వేరుశెనగ, చీని ఉత్పత్తులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతుల పంట ఉత్పత్తులకు ఎక్కువ ధర లభిస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ టెక్నాలజీస్, మినిమల్ ప్రాసెసింగ్, బేవరేజస్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ జ్యూస్ పౌడర్స్ తదితర వాటిపై డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డిఆర్డిఓ అనుమతితో చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన టెక్నాలజీ, సపోర్ట్ ను డిఎఫ్ఆర్ఎల్ అందజేస్తుందని వారు తెలిపారు.
ఈ సమావేశంలో మైసురుకు చెందిన డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్- ఎఫ్ డా.ఆర్.కుమార్, సైంటిస్ట్- ఎఫ్ డా.పి.చౌహన్, సైంటిస్ట్- ఎఫ్ డా.టి.ఆనంద్, సైంటిస్ట్- ఈ డా.రుద్రేగౌడ, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, హార్టికల్చర్ డిడి పద్మలత, కె.వి.కె రెడ్డిపల్లి సైంటిస్ట్ లు జాన్ సన్, సుధ, హార్టికల్చర్ సైంటిస్ట్ దీప్తి, ఆదరణ రామకృష్ణ, రెడ్స్ సంస్థ భానుజ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసాధ్యమనుకున్న వాటినన్నింటినీ సుసాధ్యం చేసి చూపించారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని చీడిగలో ఏర్పాటుచేసిన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తదితరులతో కలిసి మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని, పేదలకు సొంతింటి కల సాకారమవుతోందని మంత్రి పేర్కొన్నారు. మనసున్న ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను అందిస్తున్నారని.. సంకల్పబలం ఉంటే ఏ స్థాయిలో ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టవచ్చనేదాన్ని ముఖ్యమంత్రి నిరూపించారంటూ ప్రశంసించారు. చీడిగ, ఇంద్రపాలెం, కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి గ్రామాలతో పాటు స్వామినగర్ ప్రాంతానికి చెందిన దాదాపు 3,462 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్నామన్నారు. వీరికి నేమాంలో అన్ని సౌకర్యాలతో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ఆప్షన్ మేరకు ఇళ్లు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల విలువచేసే ఆస్తిని అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామన్నారు. మహిళల పేరిట పూర్తిస్థాయి హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, అయితే దీన్ని అడ్డుకునేందుకు కొందరు కోర్టులో కేసులు వేశారన్నారు. జాప్యం జరగకూడదన్న ఉద్దేశంలో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్నామని, సమస్య సమసిపోయాక కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తామని మంత్రి వివరించారు. భవిష్యత్ తరాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి పేదలకు సొంతింటిని అందించేందుకు కృషిచేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో వంద అడుగులు ముందుకేసి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి బీసీల అభివృద్ధికి కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎక్కడా చేయిచాచాల్సిన అవసరం లేకుండా అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పథకాలు నడిచివెళ్లేలా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేశారన్నారు. వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. కులం, మతం, వర్గం అనే తేడాలేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా కేవలం అర్హత ప్రాతిపదికగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలు చేరవవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన పట్టాల పండగ మన రాష్ట్రంలో జరుగుతోందని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనించేందుకు మంత్రి కురసాల కన్నబాబు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ మార్కెట్‌యార్డు ఛైర్మన్ గీసాల శ్రీను, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ తదితరులతో పాటు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన భూ సేకరణ ను అత్యంత ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ భూ సేకరణ అధికారులకు ఆదేశించారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం లో భూ సేకరణ , ఆర్ అండ్ ఆర్ పనుల పై సమీక్షించారు. ఇప్పటికే 95 శాతం వరకు భూ సేకరణ పనులు పూర్తయ్యాయని, మిగిలినది కూడా నిబంధన మేరకు పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన భూ సేకరణ పై రైతులతో మాట్లాడి ఒప్పించాలని అన్నారు. ఈ సమావేశం లో విజయనగరం రెవిన్యూ డివిజినల్ అధికారి భావాని శంకర్, భోగాపురం తహసిల్దార్ రాజేశ్వర రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు సూర్య లక్ష్మి , రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణ రికార్డ్ స్థాయి లో జరిగిందని సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. గత ఏడాది జనవరి 3 నాటికి 7 వేల మెట్రిక్ టన్నులను సేకరించగా ఈ ఏడాది నేటికి 14 వేల 600 మంది రైతుల నుండి ఒక లక్ష 8 వేల 160 మెట్రిక్ టన్నులను సేకరించడం జరిగిందన్నారు. ఆదివారం జే.సి ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫెబ్రవరి నెలాఖరు కల్లా జిల్లా లక్ష్యం 5 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేయాలనీ అన్నారు. అందు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు జనవరి నెలలో కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నులను సేకరణ పూర్తి చెయ్యాలన్నారు. రోజుకు కనీసం 15 వేల మె.టన్నులను సేకరించేలా సమిష్టిగా పనిచేయాలన్నారు. పౌర సరఫరాల , డి.ఆర్.డి.ఎ, మొలక సంస్థ, పాక్స్, వ్యవసాయాధికారులు, ఎ.ఎస్.ఓ లు, గిరి వెలుగు అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేసారని, ఇదే స్పూర్తి కొనసాగితే జిల్లాలో సేకరణలో రికార్డ్ సృష్టిస్తామని అన్నారు. 185 మిల్లులను ట్యాగ్ చేయడం ద్వారా 257 కొనుగోలు కేంద్రాల ద్వార సేకరణ జరుగుతోందని తెలిపారు. గొనె సంచుల సమస్య లేదని, 2016-17 లో ఇచ్చిన గొనె సంచులను మిల్లర్లు తిరిగి ఇవ్వడం జరిగిందని, వాటికీ రీ కన్సిలెషన్ జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారితో గౌరవంగా మాట్లాడి, ఒప్పించి సేకరించాలన్నారు. పిపిసి వద్ద ఖచితమైన తూకం ఉండాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కుర్మనాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ , డి.సి.సి.బి సి.ఈ.ఓ, ఫై.డి. డి.అర్.డి.ఎ., మొలక ప్రతినిధులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల మండలం రామతీర్ధం కొండపై వున్న కోదండ రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుల్ని త్వరలోనే బయటపెడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్నవారి వివరాలను కూడా బయటపెడతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం సి.సి. కెమెరాల ఏర్పాటు, భద్రత పటిష్టం చేయడం వంటి చర్యలు చేపడుతుందన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ తదితరులతో కలసి రామతీర్ధంలో బోడికొండపై వున్న కోదండరాముని ఆలయాన్ని మంత్రి కాలినడకన కొండపైకి వెళ్లి శనివారం దర్శించారు. ఆలయం దిగువన ఉన్న గుంటలో విగ్రహం పడవేసిన ప్రదేశాన్ని పరిశీలించి ఘటన ఏవిధంగా జరిగిందనే విషయాన్ని ఎస్.పి. రాజకుమారి ద్వారా తెలుసుకున్నారు. కొండపై వున్న ఆలయ పూజారులతో మాట్లాడి రాముల వారికి నిర్వహిస్తున్న పూజలు, కొండపై జరుగుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు.
ప్రతిరోజూ స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత గుడి తలుపులు మూసివేస్తామని, భక్తులంతా బయట నుండే దర్శనం చేసుకుంటారని పూజారులు వివరించారు. అనంతరం మంత్రులు మెట్ల మార్గంలో చెప్పులు ధరించకుండానే కొండపై నుంచి కాలినడకన కిందకు దిగారు. రామతీర్ధంలోని రామస్వామి వారి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఇ.ఓ. కార్యాలయంలో రాజధాని నుంచి వచ్చిన దేవాదాయశాఖ కమిషనర్ పి.అర్జునరావు, అదనపు కమిషనర్ రామచంద్రమోహన్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, డిప్యూటీ కమిషనర్ సుజాత తదితరులతో విగ్రహాల పునః ప్రతిష్ట, ఆలయ సంప్రోక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రామతీర్ధంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రామతీర్ధం ఘటనలో నిందితులను పట్టుకోవడం, ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ట, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై దృష్టి సారించామన్నారు. కొందరు ఆగమ పండితులతో కమిటీ వేసి వారి ప్రతిపాదనలు, సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని, తప్పుచేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదన్నారు. రామాయణంలో రాముడు ఎలా దుష్టశిక్షణ చేశారో ఇక్కడ కూడా ఈ ఘటనకు పాల్పడిన వారికి, దానివెనుక వున్నవారికి దుష్టశిక్షణ తప్పదని స్పష్టంచేశారు. ఈ ప్రాంతవాసిగా, ప్రభుత్వంలో మంత్రిగా ఈ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిదీ, అందుకు ప్రేరేపించిన వారిదీ మానవ జన్మయేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. విజయనగరం ఎంతో శాంతికాముకమైన జిల్లా అని ఇటువంటి జిల్లాలో విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలకు ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులోనే శ్రీ వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి లక్షలాది మందికి ఇళ్లపట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొండపై జరిగిన ఘటన ఎంతో బాధాకరమని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి ఆగమశాస్త్రం ప్రకారం ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. హిందూ మతపెద్దలు, ఆగమ పండితుల సలహాలతో రామతీర్ధం దేవాలయానికి వున్న ప్రతిష్టను, విశిష్టతను పెంపొందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేవాలయం కొండపై ఏకాంత ప్రదేశంలో వున్న కారణంగా కొందరు దుండగులు రాత్రిపూట దొడ్డిదారిన వచ్చి విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు. దేవాలయాల పట్ల అందరికీ బాధ్యత వుంటుందన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతుందని దోషులను పట్టుకొని తీరతామని స్పష్టంచేశారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎం.ఎల్.సి. పెనుమత్స సురేష్ బాబు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, ఎస్.పి. బి.రాజకుమారి, వైఎస్ ఆర్ సిపి జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ప్రత్యేక కేంద్రాల నుంచి 31 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు ఆదివారం 31 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.
భారత దేశంలో స్త్రీ విద్యకు బాటలు వేసి, వితంతు దురాచారాలకు విముక్తి కలిగించిన దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీభాయ్ ఫూలే అని విశాఖజిల్లా బిసి సంఘం యువజన మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శిలు, కె.జయలక్ష్మి, ధనుకోటి రమ కొనియాడారు. ఆదివారం సీతంపేటలోని కార్యాలయంలో సావిత్రీభాయ్ ఫూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే దంపతుల చిత్రాలకి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వివక్షకు గురవుతున్న మహిళల కోసం ఉద్యమించిన తొలి మహిళ ఫూలే అని కీర్తించారు. దళితులకు అంటరాని తనంచి విముక్తి కలిగించడంతోపాటు, మహిళలు చదువుకుంటే అన్ని వాషయాలు తెలుస్తాయనే ఉద్దేశ్యంతో 1952 మహిళా సేవా మండల్ ను ఏర్పాటు చేసి మహిళలకోసం ఉద్యమించారని గుర్తు చేశారు. నేటి యాంత్రిక జీవనంలో మహిళలంతా ఫూలేని ఆదర్శంగా తీసుకొని చదువుకోడం ద్వారా సంఘంలో గౌరవం దక్కుతుందన్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతోపాటు మహిళలు కూడా రాణించడానికి అవకాశం వుంటుందన్నారు. మహిళలు, విద్యార్ధినిలు సావిత్రీభాయ్ ఫూలేని ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. అదే సమయంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వస్తున్న తరుణంలో విశాఖ వాసులు, మహిళలు జాగ్రత్తు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు చిన్నారులకు మిఠాయిలు పంపిణి చేపట్టారు.