రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు . గురువారం సీతమ్మదార వీజెఎఫ్ వినోద వేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2020-21 నూతన సంవత్సరం డైరీ , క్యాలెండర్ ఆవిష్కరణలో ముఖ్య అతిధిగా పాల్గొని వాసుపల్లి మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రతినిధులుగా తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, కోవిడ్ -19 లో వారు అందించిన సేవలు మరుపురానివన్నారు. గౌరవ అతిధులుగా హాజరైన డీసీపీ వి.సురేష్ బాబు మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహకారం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం అధ్భుతంగా పనిచేస్తుందన్నారు. మూడున్నర దశాబ్దాల చరిత్రలో వీజెఎఫ్ ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. సంక్షేమమే లక్ష్యంగా వీజేఎఫ్ పనిచేయడం, ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేయడం, అన్ని పండుగలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో కూడా సమాజాభివృద్ధిలో మీడియానే కీలక పాత్ర పోషిస్తుందని, అందులో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
ఏసీబీ డీఎస్పీ రంగరాజు మాట్లాడుతూ, నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారన్నారు. వారికి నూతన సంవత్సరంలో శుభం కలగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన సమాజం కోసం ప్రతీ ఒక్కరూ పాటు పడాలన్నారు. పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జ్ అన్నం రెడ్డి అజయ్ రాజు మాట్లాడుతూ, జర్నలిస్టుల నూతన సంవత్సరం వేడుకల్లో తాము కూడా భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉ ందన్నారు. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అందిస్తున్న సేవలను తెలియజేశారు. కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ, అందరి సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులు కూడా అన్ని పండుగలు నిర్వహించుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని 9 రకాల సామాగ్రితో సుమారు వెయ్యి మంది జర్నలిస్టులకు ప్రత్యేక కిట్ బ్యాగ్లను అందజేశామన్నారు.
ఈ ఏడాది జర్నలిస్టులకు స్వీట్స్ ను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అందజేయగా, డైరీలను పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజు పంపించారన్నారు. కార్యక్రమంలో అతిధులందరిని ఘనంగా సత్కరించగా , స్కూల్ ఆఫ్ దియేటర్ ఆర్ట్స్ సౌజన్యంతో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ కెనడీ , వీజెఎఫ్ జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పి.ఎన్.మూర్తి, కార్యవర్గ సభ్యులు గిరిబాబు, దివాకర్ , ఈశ్వరరావు, ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, వరలక్ష్మి, శేఖర మంత్రి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
చిత్లూరు జిల్లాలో ఇప్పటివరకు 78 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, నేటితో పూర్తికావలసిన పనులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సంక్రాంతి నాటికి వందశాతం పూర్తి కావాలని జెసి (అభివృద్ది) వీరబ్రహ్మం సూచించారు. గురువారం ఉదయం చంద్రగిరి, తిరుపతి నియోజవర్గాలు, మద్యాహ్నం శ్రీకాళహస్తి నియోజవర్గ పాఠశాలల మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాలు సంబంధిత అధికారులతో నాడు – నేడు పనులపై జాయింట్ కలెక్టర్ (డి) సమీక్షించారు. జెసి మాట్లాడుతూ నాడు – నేడు ముఖ్యమంత్రి గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం దీన్ని గుర్తించి ప్రధానోపాధ్యాలు తమ పాఠశాలల్లో జరుగుతున్న నాడు – నేడు పనులు జాప్యం లేకుండా సంక్రాంతి నాటికి పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి రావలసిన ఆర్.ఓ.సిస్టమ్, శానిటరీ ఐటంస్, ఫ్యాన్లు ఈ మొదటి వారంలో అందనున్నాయని ఆలోపు పెండిగ్ వున్న పనులు పూర్తిచేస్తే వీటిని త్వరగా అమర్చగలుగుతారని సూచించారు.
పాఠశాలవారిగా సమీక్ష నిర్వహించగా పూర్తి అయిన పనులకు సంబంధించి ఫోటోలు అప్ లోడ్ కూడా ఆలస్యం అవుతుండటంతో సి.ఆర్.పి.లు వెంటనే పూర్తిచేయాలని, అప్ లోడ్ ఎప్పటికప్పుడు చేస్తేనే కదా పూర్తి వివరాలు తెలుస్తాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహణ చేస్తున్నామని జనవరి 2 న సత్యవేడు, నగరి, జిడి నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, తేదీ 3 న పలమనేరు, కుప్పం,మదనపల్లి తంబళ్లపల్లి , తేదీ 4 న పీలేరు, పుంగనూరు నియోజక వర్గాలు సమీక్ష వుంటుందని తెలిపారు. ఈ సమీక్షలో డి వై ఈ ఓ విజయేంద్ర , ఎ.ఎస్.ఓ. జగన్నాధం, ఎ.పి.సి .వెంకట రమణ రెడ్డి, ఎ.ఏం.ఓ. దామోధర్ రెడ్డి, సి.ఎం.ఓ. గుణశేఖర్ రెడ్డి, ఎం.ఈ.ఓ.లు సత్యనారాయణ , బాలసుబ్రమణ్యం, లలితకుమారి, బాబ్జి, హేమలత , పాఠశాలల ప్రధానోపాధ్యాలు , అధికారులు పాల్గొన్నారు.
విశాఖపట్నం పోర్టు ట్రస్టు నిర్వహణ పరిధిలో ఉన్న నాలుగు వంతెనల సామర్ధ్య పరీక్షలను నిర్వహించే బాధ్యతలను చెన్నైకి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIRSERC) సంస్ధకు పోర్టు అప్పగించింది. వంతెనలపై లోడ్ ఇతర అంశాలకు సంబంధించిన క్షేత్ర స్ధాయి పరీక్షలు నిర్వహించిన సదరు సంస్ధ నెహ్రూ సెంటినరీ వంతెన యొక్క బరువును మోయగలిగి సామర్ధ్యం కొంత మేర తగ్గినట్లు ధృవీకరించింది. ఈ వంతెనపై నుంచి కేవలం లైట్ మోటార్ వాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించింది. దీని ప్రకారం నెహ్రూ సెంటినరీ వంతెన పై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిశేధిస్తూ విశాఖపట్నం పోర్టు ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని సూచించింది. దీని ప్రకారం లారీలు, బస్సులు ఇతర భారీ వాహనాల రాకాపోకోలను ఈ వంతెనపై నుంచి నడవడం నిషేధిస్తున్నట్లు పోర్టు వెల్లడించింది.
ఈ వంతెనపై కేవలం లైట్ మోటార్ వాహనాలు మాత్రమే అనుమతిస్తామని పోర్టు ప్రకటించింది. ఈ మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు నాల్కో ,సౌత్ వెస్ట్ గేటు వైపు నుంచి అనకాపల్లి లెవల్ క్రాసింగ్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వైపు నుంచి నగరంలోకి అలాగే నగరంలో నుంచి వచ్చే వాహనాలు నాల్కో సౌత్ వెస్ట్ కాబిన్ నుంచి అనకాపల్లి లెవల్ క్రాసింగ్ మీదుగా బిరాంప్ ఓల్డ్ అంబేద్గర్ మార్గం గుండా వెళ్లాలని సూచించారు.
నగరవాసులు ఈ మార్పులను గమనించాలని బ్రిడ్జికి సంబంధించిన మరమ్మత్తులు పూర్తి చేసి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే వంతెనపై రాకపోకలు అనుమతిస్తామని అప్పటి వరకూ నగర ప్రజలు సహకరించాలని పోర్టు యాజమాన్యం విజ్ఞ ప్తి చేసింది. ఈసమాచారాన్ని ఇప్పటికే ఈమార్గంలో ఉన్న నేవీ, హెచ్ ఎస్ ఎల్, హెచ్ పిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్, ఈఐపిసిఎల్, సిఎప్ ఎల్, విసిటిపి ఎల్, జీవీఎంసీ, పోలీస్ కమీషనర్, ఎపిఎస్ ఆర్ఠీసీ మరియూ జిల్లా యంత్రాంగానికి పోర్టు అధికారులు అందజేశారు.
రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దికై కేంద్ర ప్రభుత్వమునుంచి గరిష్టంగా నిధులు సేకరించి అభివృద్దిపధంలో నియోజకవర్గాన్ని నిలిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు స్దానిక పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. గురువారం స్దానిక మార్గాని ఎస్టేట్ నందు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో మానవాళిని దేవుడు ఆశ్వీరదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 2021 సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యపరంగా అప్రమత్తంగా వుండి భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవం వచ్చినా సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్దంగా ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ వారు స్దానికంగా ఇ ఎస్.ఐ ఆసుపత్రిని పేపరు మిల్లుగా పాత భవనాన్ని తోలగించి 3న్నర ఎకరాలు స్దలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ 97.98 కోట్లు నిధులు మంజూరు చేసారన్నారు.
అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు జనవరి రెండవ వారంలో ఆసుపత్రి శంకుస్దాపన కార్యక్రమానికి హాజరుకావన్నుట్లు ఆయన వెల్లడించారు. టెండర్లు్ల పిలవడం జరిగిందన్నారు. రాబోయే రెండు సంవత్సరాల కాలవ్యవధిలో నిర్మాణం పూర్తి చేయడానికి కార్యాచరణ తీసుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిదిలోని గౌరీపట్నం గ్రామంలో 5 ఎకరాలు స్దలంలో 100 పడకల ఇ.ఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ రెండు ఆసుపత్రులకు కేంద్ర మంత్రి శంకుస్దాపన చేస్తారన్నారు. కావున వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు వర్కర్లు దిగువ మధ్యతరగతి వర్కర్లు ఇఎస్‌ఐలో నమోదు చేసుకొని ఆయా వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించి ఆపై ఒక వైద్య కళాశాలను మంజూరు చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుందన్నారు. ఇందుకుగాను కేంద్ర కారాగారం ఎదురుగా 12.91 ఎకరాలు స్దలాన్ని ఎంపిక చేసామన్నారు.
రాబోయే రెండు సంవత్సరాల కాలములో నిర్మాణం పూర్తి చేసేందుకు కార్యాచరణ తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ చేపట్టనిరీతిలో పేదలందరికి ఉచితంగా ఇంటి స్దలంతోపాటు ఇల్లు నిర్మాణం చేపట్టి చిట్టచివరి లబ్దిదారునివరకు అందించడం జరుగుతోందన్నారు. గత 20 సంవత్సరాలుగా తిరుగుతున్నా ఏన్నాడూ ఊహించనివిధంగా ఇండ్లు స్దలాలు నిర్మాణాలు మంజూరు కావడం విశేషమన్నారు.సిఎం వారి ద్వారా దేవుడు కరుణించి ఇండ్లు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ రోజున ఎంతో పారదర్శకంగా పార్టీలకతీతంగా అర్హత కల్గిన వారందరూ ఇండ్లు పొందుతున్నారన్నారు. లబ్దిదారులు మనస్పులో వున్నా భావాలను వ్యక్తపరుస్తూ ఇంటి నిర్మాణాలు దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. అదేవిధంగా ఎన్నడూ లేనివిధంగా మౌలికసదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కాలనీలలో అన్నిరకాలు వసతులు పూర్తిస్దాయిలో కల్పించడం జరుగుతుందన్నారు. సుమారు 30.75 లక్షలు మంది లబ్దిదారులుకు ఇండ్లు నిర్మితమవుతాయన్నారు.
అద్దె ఇండ్ల ఎవ్వరూ ఉండాల్సిన పరిస్దితి ఇకపై ఉండదన్నారు. దేశవ్యాప్తంగా ఇండ్ల పంపిణీ విషయమై చర్చ మీడియాలో జరుగుతోందన్నారు.టిడ్కో ఇల్లు కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. భవిష్యత్తు ఇండ్ల విలువ పెరుగుతుందన్నారు. రైతు పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి ఆండగా నిలవాలన్నారు. మోరంపూడి ప్లైఒవరు రివైజ్డు అంచనాలు కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. మూడు బ్లాక్లులుగా విభజించి అబివృద్ది పర్చనున్నట్లు తెలిపారు. ఉండ్రాజవరం, జోన్నాడ, దివాన్‌చెరువు, కడియపులంక ప్లైఒవర్లు మంజూరు కాబడ్డాయని, లాలాచెరువు మోరంపూడి ప్లైఒవర్లు మంజూరు కావాల్సివుందన్నారు. సింగిల్ ప్మాకేజీ విధానంలో నిర్మాణపనులు పూర్తిచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొయ్యలగూడెంనుంచి జీలుగుమిల్లి వరకు రోడ్డు అబివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రూ 185 కోట్లు నిదులు మంజూరు అయ్యాయన్నారు. ఇఎస్‌ఐ ఆసుపత్రికి మరో రూ 98 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రదానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమం క్రింద రాష్ట్రానికి కీటీ క్రింద 3 వేలు కిలోమీటర్లుకు నిధులు ఇవ్వగా దీనికి అదనంగా తూర్పుగోదావరి జిల్లాలో 75 కిలోమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 123 కిలోమీటరు మేర రోడ్లు అభివృద్ది కార్యాచరణ తీసుకోవడం జరిగిందన్నారు.
గామన్ రోడ్డుకు ఒక వైపు రోడ్లు అభివృద్దిపనులు పూర్తి కావచ్చాయని, రెండవ వైపు మార్చి 31 నాటికల్లా పూర్తిచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతొందన్నారు. భవిష్యత్తులో పెద్దగా మరమ్మత్తులకు ఆస్కారము లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ 13 కోట్లు వెచ్చించామని, మరో రూ 10 కోట్లు బ్యాంకు రుణంగా తెచ్చి పటిష్టంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారదికి వైఎస్‌ఆర్ వారదిగా నామకరణం చేసి వైఎస్‌ఆర్ విగ్రహాం ఏర్పాటు చేస్తామన్నారు. స్దానిక రైల్వేస్టేష్టన్ ఉభయగోదావరి జిల్లాల ప్రజల కల అని, తూర్పు వైపు ప్లాటుపారం 4,5, అభివృద్దికి రూ 12 కోట్లు మంజూరు కాగా, పోల్ యార్టును కడియంకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఎక్సలేటరుతో 4,5, ప్లాట్ పారాలు అభివృద్దికి పక్కా ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు. రైల్వే సేష్టన్ మెయిన్‌రోడ్డు అభివృద్దికి 22 అడుగులు వెడల్సుతో స్దానిక జూనియరు కళాశాలనుంచి ఐదుబండ్లమార్కెట్ వరకు అభివృద్ది పర్చేందుకు రూ 11 కోట్లకు పరిపాలనామోదం రావడం జరిగిందన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో రూ 12 కోట్లతో స్డేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
రానున్న ప్యాకేజీలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీగా మార్చేందుకు అనుమతులు తీసుకురవడం జరుగుతుందన్నారు. జలశక్తి మిషన్ క్రింద ఎన్‌ఆర్‌సిడి ద్వారా రూ 136 కోట్లతో గోదావరి మిషన్ రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, రూరల్ సమన్వయకర్త ఆకుల వీర్రాజు, నందెపు శ్రీనివాస్, పోలు విజయలక్ష్మీ, అఖిల గాండ్ల తెలుకుల కార్పోరేషన్ చైర్‌పర్సన్ సంకిస భవానీ ప్రియ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గోన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలు, అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్సు ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్నిరకాల ఉపకరణాలు ఉండేలా.. 20 మంది ఎస్డీఆర్‌ఎఫ్ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ వాహనాలకు సంఘటనా స్థలం వద్ద జరిగిన విపత్తును లైవ్ లో రికార్డింగ్ చేయడానికి సైతం అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ అయి వుంటాయి. తద్వారా విపత్తును బట్టి లైవ్ మానటరింగ్ చేస్తూ..అవసరమైన అదనపు సిబ్బందిని పంపేందకు వీలుపడుతుంది. వీటి ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనుంది. 14 డిజాస్టర్ రెస్పాన్స్, రెస్క్యూ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామని సీఎం చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి త్వరలోనే పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పిన సీఎం త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు అప్పగిస్తామని అన్నారు. పోలీస్ శాఖ పూర్తిస్థాయి హైఎండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ గా మార్పు చేస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లాలోని బి.యస్.యన్.ఎల్ టెలికామ్ బిజినెస్ ఏరియా ఆధ్వర్యంలో జనవరి 2న ఉదయం 11.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు ఆన్ లైన్ లో వినియోగదారుల హక్కులు, బిఎస్ఎన్ఎల్ సేవలపై అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు టెలికామ్ జనరల్ మేనేజర్ జె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆన్ లైన్ సదస్సులో ట్రోయ్ ( TRAI ) లో రిజిష్టర్ అయిన కన్జ్యూమర్ అడ్వకసి గ్రూప్ మెంబర్స్ పి.చిట్టిబాబు, బి.సంజీవరాయుడు, గంగాధరమ్ పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వినియోగదారులు ఆన్ లైన్ సదస్సులో పాల్గొని తమ సమస్యలు, సలహాలను తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. ఆన్ లైన్ సదస్సులో పాల్గొనదలచిన ttps://meet.google.com/vjj.rrtc.ifg లింక్ ద్వారా పాల్గొనవచ్చని వివరించారు. ఇతర సందేహాల కొరకు AGM ( Plg ) 94904 06455 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
నూతన సంవత్సరం భోగ భాగ్యాలను జిల్లా ప్రజలకు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను గురు వారం తెలియజేస్తూ నా ప్రియమైన ప్రజలందరికి నూతన సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అందించాలని ఆకాంక్షించారు. నూతన ఉత్తేజాన్ని కల్పిస్తూ ప్రతి కుటుంబం ఆర్ధికంగా ప్రగతి పథంలో సాగాలని ఆయన పేర్కొన్నారు. 2020 సంవత్సరం కరోనాతో ఇబ్బందులకు గురి అయ్యామని ఆయన పేర్కొంటూ ప్రజల సహకారంతో సమర్ధవంతంగా నివారణకు చర్యలు చేపట్టామన్నారు. వాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కుటుంబం యావత్తు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన సంతోషం లభిస్తుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య చేసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే కుటుంబ సభ్యులు వేడుకలు చేసుకోవాలని సూచించారు. బయటకు వెళ్ళ వద్దని ఆయన కోరారు.
నూతన సంవత్సర వేడుకలు రద్దు : జిల్లా కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు నివాస్ ప్రకటించారు. కరోనా రెండవ దశ వ్యాప్తిలో ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. జిల్లాలో ప్రజల సహకారంతో కరోనా తగ్గు ముఖం మాత్రమే పట్టిందని, పూర్తిగా నిర్మూలన కాలేదని కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సవంత్సర వేడుకల శుభాకాంక్షలు తెలియజేయుటకు ఎవరూ రావద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. అందరూ కరోనా నివారణలో భాగస్వామ్యమై, సమూలంగా నిర్మూలన చేసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకుందామని సూచించారు. మాస్కు ధారణ మరవవద్దని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన కోరారు.
తూర్పు గోదావరి జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై నిషేధం అమలులో ఉందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాకి ప్రత్యేక ప్రకటన జారీచేశారు. 31.12.2020 రాత్రి బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించేందుకు జిల్లాలో ఏ ఒక్కరికీ ఏ రకమైన అనుమతులనూ ఇవ్వ లేదని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాధి ప్రాబల్యం అధికంగా ఉండటం, చలి మంచు వాతావరణంలో అది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాలలో హైవే పై , రోడ్డుల వెంబడి కేక్ కటింగ్ లు వగైరా వేడుకలు జరుపకూడదన్నారు. వ్యాపార సంస్ధలు, ఇతర షాపులు, బార్లు, వైన్ షాప్ లు రెస్టారెంట్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ఖచ్చితంగా మూసి వేయాలని బార్ అండ్ రెస్టారెంట్లలో, హోటళ్లలో అశ్లీల నృత్యాలు నిర్వహించినా వేడుకల పేరిట మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకొంటారని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో బాణ సంచా కాల్చి పక్క వారికి ఇబ్బంది కలిగించినా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, బైక్ రేసింగ్, కేరింతలు కొడుతూ మోటార్ రేసులు చేసినా కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి అదనపు బలగాలతో గస్తీ ముమ్మరంగా ఉంటుందని జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన రోడ్ల కూడళ్ళలో పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తూర్పు గోదావరి జిల్లా ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆ ప్రకటనలో కోరారు.
అనంతపురం జిల్లాలో డిశంబర్ 31 న ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు. ప్రజలు గుమిగూడటం... బహిరంగ ప్రదేశాలు, రహదారులపై కేక్ కటింగ్ లు చేయడం నిషేధమన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్ధలు నిర్ణీత సమయాల్లోనే కచ్చితంగా మూసేయాలన్నారు. మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా, అందుకు ఏర్పాట్లు సమకూర్చినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆ రోజు ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రధాన పట్టణాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. వీటితోపాటు బైక్ రేస్ లు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31 వ తేది రాత్రి 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. కోవిడ్ -19 నిబంధనలను పాటించాలన్నారు. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ రోజు ఇంటి నుండీ బయటికెళ్లే ముందు పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. అనంతపురం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులతో అందరూ సహకరించాలని ఆయన కోరారు.
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత విస్తృతం చేయాలని జాయింట్ కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను జనవరి 6,8,9 తేదీలలో ఆర్టీవో, పోలీస్, నేషనల్ హైవే అథారిటీ, జివియంసి అధికారులు సయుక్తంగా తనిఖీ చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం వున్న ప్రదేశాల దగ్గర తగిన చిహ్నాలను హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను, ప్రమాదాలు సంభవించే అవకాశం వున్న ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై ఏర్పడే గుంతలను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేయాలన్నారు. అవసరమైన చోట బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పరచాలన్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశాలలో రోడ్లను వెడల్పు చేయడం, తగిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ లో కాకుండా రోడ్లపై నిలిపిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎక్కువమంది పాదచారులు రోడ్లను దాటే ప్రదేశాలు, సమయాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో పోలీసులకు సహాయంలో వలంటీర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగిన కారణాలపై లోతుగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత పై వాహనదారులకు, పాదచారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. డి.టి.సి. జి.సి.రాజరత్నం సమావేశం ప్రారంభంలో గతంలో కమిటీ చేసిన సూచనల పై తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ సి.పి. (ట్రాఫిక్) సి.హెచ్. ఆదినారాయణ, ఆర్.టి.సి. రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు, కె.జి.హెచ్. సూపరిటెండెంట్ డాక్టర్ మైథిలి, జి.వి. యం.సి. ఎస్.ఈ. శాంసన్ రాజు, నేషనల్ హైవే అథరాటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్.వి.జూ పార్క్ నందు కోవిడ్ నిబంధనలలో సందర్శకులను అనుమతిస్తున్న విధానం బాగుందని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. బుధవారం ఉదయం ఛైర్మన్ కుటుంబ సభ్యులతో ఎస్.వి. జూ పార్క్ చేరుకోగా క్యురేటర్ హిమ శైలజ స్వాగతం పలికారు. ఛైర్మన్ జూ సందర్శన అనంతరం క్యురేటర్ తో సమావేశమై అన్ని జాగ్రత్తలతో తిరిగి సందర్శకుల అనుమతి బాగుందని తెలిపారు. ఎస్.వి. జూ పార్క్ కోసం ప్రభుత్వం నుండి గానీ, ప్రెస్ అకాడమీ నుండి ఎల్లపుడూ సహకారం ఉంటుందని తెలిపారు. క్యూరేటర్ హిమశైలజ వివరిస్తూ కోవిడ్ కారణంగా గత మార్చి 20 నవంబర్ 16 వరకు సందర్శకులను అనుమతి నిలిపి వేశామని తెలిపారు. ఎస్.వి. జూ నిర్వాహణ కు ఏడాదికి రూ.5 కోట్లుగా ఉంటుందని, అందులో సగం జంతువుల డైట్ ఖర్చులు ఉంటాయని తెలిపారు. ఎస్.వి.జూ పార్క్ మరింత అభివృద్ధి కోసం జంతువుల ఆడాప్షన్ స్కీమ్, డొనేషన్ వంటివి స్వీకరిస్తున్నామని దాతల స్పందన బాగుందని తెలిపారు. దాదాపు 1200 హెక్టార్లలో విస్తీర్ణంలో వున్నా 289 హెక్టార్లలో మాత్రమే ఈ ప్రదర్శన శాల ఉందని, ఇక్కడ ప్రత్యేకత ప్రకృతి సిద్ధంగా అడవిలో పర్యటిస్తూ జంతువీక్షన అనుభూతి కలుగుతుందని తెలిపారు. అడాప్షన్ స్కీమ్ పై ప్రచారం కల్పించాలని క్యూరేటర్ అకాడమీ ఛైర్మన్ కు విన్నవించారు. ఛైర్మన్ పర్యటనలో జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దీపక్ జంతు విశేషాలను , జూ పార్క్ ప్రాముఖ్యతను వివరించారు.
చిత్తూరు జిల్లాలో కోవిడ్ - 19 వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త అన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా అధికారుల టాస్క్ ఫోర్స్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 45 నుండి 55 లక్షల వ్యాక్సిన్ డోస్ లను నిల్వ ఉంచడానికి 135 కోల్డ్ చైన్ పాయింట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో 45 నుంచి 55 లక్షల డోస్ లను నిల్వ ఉంచేందుకు సిద్దం చేశామన్నారు. జిల్లాలో 44.91 లక్షల మంది ఉన్నారని, ఇందులో 213 ప్రభుత్వ వైద్య సంస్థలు ఉన్నాయని 527 పై ప్రైవేట్ సంస్థలు ఉన్నాయని, ప్రభుత్వ వైధ్య సంస్థలలో 15,617, ప్రైవేట్ వైధ్య సంస్థలలో 15,859 ఇందులో మెడికల్ విద్యార్ధులు 559 హౌస్ సర్జన్ వారు 424 మంది ఉన్నారని ఇటీవల నిర్వహించిన కోవిడ్ వాక్సిన్ పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా జూమ్ ట్రైనింగ్ ద్వారా బ్లాక్ లెవల్ లోనూ 427 మంది హాజరయ్యారని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణికి జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆద్వర్యంలో ఐ.సి.డి.ఎస్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్, అయూష్, పట్టణ అభివృద్ది, క్రీడలు, యువజన విభాగం, పోలీసు శాఖ, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, సమాచార శాఖ, రక్షణ విభాగం, సివిల్ సప్లైస్, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫర్, పశు సంవర్ధక శాఖ, రైల్వే విభాగం, కార్మిక విభాగం, ఐ.టి విభాగం, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, విద్యుత్ శాఖ, మునిసిపల్ శాఖ, రవాణా శాఖ, ఏ.పి.మెడికల్ ఎడ్యుకేషన్, ఐ.ఎం.ఏ వారి సహాయాలను తీసుకొని వ్యాక్సిన్ రవాణా చేసే కార్యక్రమం నుండి నిల్వ చేయడం, పంపిణి వరకు అందరి సహకారంతో పనిచేయడం జరుగుతుందని ఇందు కోసం 101 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు 18 మాక్స్ కేంద్రాలు, 4 పి.పి యూనిట్లు మరియు ఇతర సంస్థలు కలిపి 145 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. అదే విధంగా 8 మంది డాక్టర్లతో పర్యవేక్షణ బృందం ఏర్పాటు, జిల్లా స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి సరళి పరిశీలించడం కోసం కోవిడ్ వ్యాక్సిన్ సెల్ ను జిల్లా వైధ్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆద్వర్యంలో జిల్లా స్థాయిలో నడుస్తుందని ఇందు కోసం ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వి.వీరబ్రహ్మం, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, డి.ఎం అండ్ హెచ్ ఓ, డి.సి.హెచ్.ఎస్ లు డా.పెంచలయ్య, డా.సరళమ్మ, డి.టి.సి బసిరెడ్డి, ఇతర సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల కార్యాలయాలను గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం రాత్రి గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలను గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ విషయమై జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్ లు, వార్డు అడ్మిన్స్ తో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1207 గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాలను గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ ను గురువారం సాయంత్రం లోగా 100 శాతం పూర్తి చేయాలన్నారు. గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ చేయడం ద్వారా జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భవనాలు అయిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ భవనాలను సులభంగా గుర్తించే వీలు కలుగుతుందన్నారు.
జిల్లాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా మ్యాపింగ్ కాకుండా ఉండడానికి వీలు లేదన్నారు. అన్ని భవనాలకు సంబంధించి సచివాలయం పేరు, క్యాటగిరి, లొకేషన్, సచివాలయం ఫోటోలు, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ లాంటి అన్ని వివరాలతో గూగుల్ మ్యాప్ లో మ్యాపింగ్ ను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ పూర్తయిన తర్వాత అన్ని భవనాలకు సంబంధించి మ్యాపింగ్ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు అందించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం ఏ భవనంలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కార్యాలయం కొనసాగుతుందో ఆ వివరాలను మ్యాపింగ్ చేయాలని, నూతన భవనాల నిర్మాణం పూర్తయ్యాక మార్పులు చేర్పులు చేపట్టి ఆయా భవనాలను మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రజలకు పూర్తి వివరాలు తెలిసేలా మ్యాపింగ్ ను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కు సంబంధించి గూగుల్ మ్యాప్ లోకి మ్యాపింగ్ ఎలా చేయాలనేది వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ గూగుల్ మ్యాప్ లో కి మ్యాపింగ్ ను జాగ్రత్తగా చేపట్టాలని, అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలన్నారు.