నవరత్నాలు - పేదలందరికి ఇల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కష్టపడి పని చేసిన రెవెన్యూ యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని కృష్ణ కళామందిర్ లో నవరత్నాలు - పేదలందరికి ఇల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటలో భాగస్వాములైన రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 2వ స్థానంలో నిలిచిందని, ఇందుకోసం ఎంతగానో కృషి చేసిన రెవెన్యూ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి పట్టాల పంపిణీ లో మాత్రమే కాకుండా కోవిడ్, ఇతర యాక్టివిటీ లలో కూడా రెవెన్యూ శాఖ సిబ్బంది గొప్పగా పని చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున లేఔట్లను సిద్ధం చేసి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెవెన్యూ యంత్రాంగానికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికి ఇల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రెవెన్యూ యంత్రాంగం చాలా కష్టపడి పనిచేయడం జరిగిందని, అందువల్లే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని, ప్రతి ఒక్క అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నిషా0తి, డిఆర్ఓ గాయత్రి దేవి, డిప్యూటీ కలెక్టర్ లు, ఆర్డీఓ లు, తహశీల్దార్ లు, డిప్యూటీ తహశీల్దార్ లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకు రావడం జరిగిందని, అయితే కొంత మంది నిర్లక్ష్యంగా పని చేయడం తో వ్యవస్థకు ఇబ్బంది కలుగుతోందని వారి మీద చర్యలు తీసుకోక తప్పదని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక జిల్లా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎం పి డి ఓ లు, ఏ పి ఎం లు, ఏ పి ఓ లు మరియు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థితిగతులు మార్చేందుకు జగనన్న తోడు, వై.ఎస్.ఆర్ బీమా, వై.ఎస్.ఆర్ ఆసరా పథకాలను ప్రవేశ పెట్టిందని, ఇందులో జిల్లా వ్యాప్తంగా 30 మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు 20 శాతం కూడా లక్ష్యాలను సాధించ లేక పోయారని, అదే విధంగా వై.ఎస్.ఆర్ ఆసరా పథకం కూడా 25 గ్రామ సచివాలయాల్లో అట్టడుగు స్థాయిలో ఉందని ఇంకొన్ని చోట్ల దరఖాస్తులు కూడా చూపించడం లేదని అన్నారు. సరైన లక్ష్యాలను సాధించాలంటే క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, లబ్ధిదారులను గుర్తించి బ్యాంకర్లతో లింకేజీ కల్పించాలని, ఇప్పటి వరకు ఆ విధంగా చర్యలు తీసుకోని పలువురు మీద క్రమ శిక్షణా చర్యలు చేపడతామన్నారు. క్షేత్ర స్థాయిలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు సక్రమంగా పని చేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతాయన్న జిల్లా కలెక్టర్ జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన పథకాలను అమలు చేయలేకపోయిన పలు గ్రామ సచివాలయాలను పేర్లను చదివి వారి పై చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా కలికిరి, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి, చిత్తూరు, నాగలపురం లలోని పలు సచివాలయ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తో వారి పై చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. అదే విధంగా 60 సం. ల లోపు జిల్లాలో ఉన్న లక్ష మందికి చదవడం, వ్రాయడం నేర్పించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని, ఇందులో 70 శాతం మేర ఫలితాలు సాధించామని, మిగిలిన సచివాలయాల్లో వంద శాతం ఫలితాలు సాధించామన్నారు. సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు వారి విధుల పట్ల ఎం పి డి ఓ లు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జె సి (అభివృద్ధి) వీరబ్రహ్మం, జెడ్పీ సిఇఓ పభాకర్ రెడ్డి, డిఆర్డిఏ పిడి తులసి, తదితర అధికారులు పాల్గొన్నారు.
పన్నుల పెంపుదల పై 19తేదీ న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్ద కమీషనర్ పల్లి నల్లనయ్య శుక్రవారం తెలిపారు. నగరపాలక సంస్ద పరిధిలో ప్రదర్మన సామాగ్రి,ప్రచార పరికరాలు,ప్రకటన పన్నుల పెంపుదలకు, సంబందిత అధికారుల యొక్క సలహాలు, సూచనలు తెలుపుటకు మధ్యాహ్నం ౩ గం.లకు నగరపాలక సంస్ద సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భూమి మీద ఇండ్లు,భవనములు,గోడల మీద దీపాలకరణ లేని స్దంబము కట్టడములు, ప్రేమ్ బోర్డు ప్రకటనలు గతంలో రూ.180 ఉండేదని ఇప్పుడు రూ. 540 పెంపుదలకు ప్రతిపాదించడం జరిగిందన్నారు.భూమి మీద ఇండ్లు,భవనములు,గోడల మీద, స్దంబముల మీద, కట్టడములు మీద ,ప్రేముల పైనను,బోర్డుల మీదను దీపాలంకరణ గల ప్రకటనలకు గతంలో రూ.450 ఉండేదని ఇప్పుడు రూ.1350 పెంపుదలకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఎడ్లు,గుర్రములు,ఇతర జంతువులు,మనుషులతో లాగుబడు రవాణా వాహనములు,బస్సులు,ప్రకటన వ్యాన్,ఆటోల వాహనముల పై దీపాలంకరణ లేని ప్రకట నలకు రూ.900 నుండి రూ.2700 లకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.వాహనాల పై దీపాలంకరణ గల ప్రకటనలకు రూ.1800 నుండి రూ.5400 లకు, ఇరువైపుల మనుష్యులు బండి మోయబడు దీపాలంకరణ కాని ప్రకటనలకు రూ.270 నుండి రూ.810 లకు, దీపాలంకరణ గల మనుష్యులు మోయబడు బండి రూ.360 నుండి రూ.1080 పెంపుదల ప్రతిపాదించడం జరిగిందన్నారు. పబ్లిక్ ప్రదేశాలలొ లాంతర్లు,స్లైడులు ద్వారా గాని ఆమోదిత ఇతర సాధనముల ద్వారా ప్రజలకు తెర పై ప్రదర్మింపబడు ప్రకటనలకు రూ. 720 నుండి రూ. 2160 లకు , సినిమా దియోటర్లలో ప్రకటనలకు రూ. 540 నుండి రూ. 1620 పెంపుదలకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. వీధులకు అడ్డంగా పైన వేలాడదీయు దీపాలంకరణ కాని ప్రకటనలకు రూ. 180 నుండి రూ.540 లకు, అడ్వర్టైజర్ పేరు కలిగిన లేదా అద్దెకు ఇవ్వబడును అని ప్రకటన వ్రాసిన దీపాలంకరణ లేని బోర్డులకు రూ.90 నుండి రూ.270 లకు, యుని పోల్ , ఒక స్దంబం పై ప్రకటన చేయుటకు 2.50 చ.మీ. ఒక్కింటికి రూ.2500 పెంపుదల ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. అచ్చు వేయబడు ప్రకటన ప్రదర్మించుటకు రూ.720 నుండి రూ.2160 పెంచడానికి, గాలిలో తేలియాడే బెలూన్ ప్రకటనలకు రూ.5000, రిజిస్ట్రేషన్, క్రమబద్దీకరణకు ఒక్కసారి మాత్రమే చెల్లించవలసిన రుసుము ప్రస్తుతము వున్న ప్రతి ప్రదర్మన సామాగ్రి ప్రకటనలకు రుసుము ప్రతిపాదించడంజరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబందిత అధికారులు సమావేశానికి హాజరై తగు సలహాలు,సూచనలు ఇవ్వవలసిందిగా కమీషనర్ కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు,భూ యజమానుల శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ ,గ్రామ కంఠ స్థిరాస్తుల సమగ్ర రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు,భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలియ చేసారు. శుక్రవారం అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి గ్రామంలో వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద డ్రోన్ ద్వారా చేపట్టిన సమగ్ర రీ సర్వే కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ను,పారదర్శకంగాను చేపట్టిన ఈ సమగ్ర రీ సర్వే కార్యక్రమానికి రైతులు వారి సరిహద్దులు,హక్కు పత్రాలు సర్వే బృందానికి చూపించాలని,సర్వే పూర్తి అయ్యాక ప్రతి భూ యజమానికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అన్నారు.అలాగే ఈ సమగ్ర రీ సర్వే ద్వారా రైతులు,భూ యజమానులకు సంభందించిన భూములకు రక్షణ కల్పించడమే కాకుండా ఆ భూముల పై వారికి శాశ్వత హక్కు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్తి నాగేశ్వరరావు, కె.ఆర్.సి. తహశీల్దార్ సీత,డిప్యూటీ తహశీల్దార్ అశోక్,గ్రామ సర్వేయర్లు,మరియు డ్రోన్ సిబ్బంది పాల్గొన్నారు.
జగనన్న జీవక్రాంతి పథకం లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో ఉన్నతి, అమూల్ పాల వెల్లువ కార్యక్రమాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.సి., ఎస్.టి.లు, నిరుపేద వర్గాలకు అమలు చేస్తున్న ఉన్నతి కార్యక్రమంపై నిర్దేశిత ప్రణాళికలతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. అమూల్ పాల వెల్లువ కార్యక్రమంలో 5 వేల ఆవులు, గేదెల కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు. లబ్దిదారుల ఎంపికను శని వారంలోగా పూర్తి చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగాను నిక్కచ్చిగాను చేయాలన్నారు. మంచి ఆరోగ్యంతో కూడిన పశువులను కొనుగోలు చేయాలని వాటికి ట్యాగ్ లు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమీత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు,జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయక్త సంచాలకులు వెంకటేశ్వర్లు, తదితరులు హాజరైనారు.
పారిశ్రామిక రంగ అభివృద్ధికి, అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ ఉపయోగించి సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా జిల్లాలో 3.84 లక్షల మంది లబ్ధిపొందనున్నారని, దశల వారీగా ఇళ్ల నిర్మాణాలు జరగనున్నాయని ఈ ప్రక్రియలో వివిధ పరిశ్రమల యాజమాన్యాలకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. పెద్ద లేఅవుట్లలో ఫాల్-జీ బ్రిక్స్ వంటి ఇళ్ల నిర్మాణ సామాగ్రి తయారీదారులకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి, అక్కడే తయారుచేసేలా చూడాలన్నారు. దీనివల్ల అటు పరిశ్రమలకు ప్రోత్సాహం లభించడంతో పాటు పాటు తక్కువ ధరకు, నాణ్యమైన సామాగ్రి అందుబాటులోకి వస్తుందన్నారు. అదే విధంగా రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20) పరిధిలో 58 ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రోత్సాహకాల కింద రూ.2.32 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 11; 2021, జనవరి 7న స్క్రుటినీ వెరిఫికేషన్ కమిటీ (ఎస్‌వీసీ) సమావేశాలు జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆహారం, వ్యవసాయం, నిర్మాణం, ప్యాకింగ్, ఆటోమోటివ్, మెరైన్/ఆక‌్వా, మినరల్, రసాయనాలు, ఇంజనీరింగ్, స్థానిక డిమాండ్ ఉన్న ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశ్రామిక అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్ పాలసీ కింద 2021, జనవరి 7 నాటికి 113 దరఖాస్తులు అందాయని, వీటిలో 76 దరఖాస్తులకు ఆమోదం లభించిందని, 37 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. వీటిని నిర్దేశ గడువులోనే పరిష్కరించనున్నట్లు తెలిపారు. సమగ్ర పరిశ్రమ సర్వే (2020)కు సంబంధించి పెండింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. బియ్యం, చక్కెర, గడ్డకట్టించిన రొయ్యలు (Frozen shrimp), కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు ఉత్పత్తులను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు సమావేశంలో వెల్లడించారు. జిల్లా నుంచి ఎగుమతులు మరింత పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్టెయిన్‌లెస్ స్టీలు పైపులు, హెర్బల్ ప్రొడక్ట్స్, జీడిపప్పు, సేంద్రియ ఆహారం, బ్రాస్/కాపర్ వస్తువులు వంటివి కూడా ఎగుమతులకు అనువైనవని గుర్తించినట్లు వెల్లడించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, డీజీఎఫ్‌టీ జేడీ రమేశ్, ఎల్‌డీఎం షణ్ముఖరావు తదితరులు హాజరయ్యారు.
జనవరి 26న గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని డివిజన్ స్థాయిలో ఈ నెల 19, 20, 21 తేదీలలో విద్యార్థినీ ,విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిని ఎంపిక చేసి జిల్లా కేంద్రంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో కు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అందిస్తున్న సేవలు, కల్పిస్తున్న లబ్ధిని తెలియజేసేలా వినూత్నమైన తరహాలో శకటాలను రూపొందించాలన్నారు. ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రతి క్యాటగిరికి సంబంధించి 2 శాతానికి మించకుండా అధికారులను ఎంపిక చేసి జాబితాను డిఆర్ఓ కి పంపించాలన్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతి ని ప్రతిబింబిస్తూ స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్క అంశంపై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించి అత్యంత వైభవోపేతంగా ఘనతంత్ర దినోత్సవవేడుకలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డా.ఏ.సిరి, గంగాధర్ గౌడ్, అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, డిఆర్ఓ గాయత్రి దేవి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, వెల్ నెస్ సెంటర్ లను వేగవంతంగా పూర్తి చేయాలి.. ఇందుకోసం అధికారులు అలసత్వం వీడి పని చేయాలని, ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ఎన్ఆర్ఈజిఎస్ కన్వర్జన్స్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఆరు నెలల నుంచి జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, వెల్ నెస్ సెంటర్ ల నిర్మాణంలో ఎలాంటి అలసత్వం, అజాగ్రత్త వహించకుండా మార్చి 31వ తేదీ లోపు ఆయా భవనాల నిర్మాణాలను పూర్తి చేసేలా వేగవంతంగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా మార్చి నెలాఖరు లోపు పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ఖచ్చితమైన రిపోర్ట్ లు అందించాలి :
జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, వెల్ నెస్ సెంటర్ లు, సిసి రోడ్లు, బిటి రోడ్లు, సి సి డ్రైన్ నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన రిపోర్టులను జిల్లా కలెక్టర్ కు అందించాలన్నారు. ఆయా భవన నిర్మాణాల పనులపై ఎప్పటికప్పుడు ఎంతమేరకు పనులు పూర్తయ్యాయి అనేది ఫోటోలు తీసి రిపోర్టులు అందజేయాలన్నారు. ఆయా నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు సర్ప్రైజ్ విజిట్ లు చేస్తారని, ఆయా నిర్మాణాలకు సంబంధించి రిపోర్టులో అందించిన నివేదిక ప్రకారం పనులు జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా భవన నిర్మాణాలపై ప్రతిరోజూ ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి అనే విషయంపై సమీక్ష చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేసి ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. జిల్లాకు ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ పనుల కింద కేటాయించిన నిధులు మురిగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఆయా భవన నిర్మాణాల్లో ఒక ఏజెన్సీ రెండు, మూడు పనులు చేస్తుంటే పరిశీలించి ఒక ఏజెన్సీ ఒక పని మాత్రమే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ పనులపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, ఆయా డివిజన్ల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను ఎంతమేరకు పూర్తి చేశారు అనేది సమీక్ష చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కువ సమయం లో పనులు తక్కువగా జరిగాయని, ఇప్పటి నుంచి మార్చి నెలాఖరు లోపు తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేపట్టి ఆయా భవన నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు.
అలాగే మనబడి నాడు నేడు పనులపై కూడా దృష్టి సారించాలని, ఫిబ్రవరి నెలాఖరు లోపు పనులు పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఆయా పాఠశాలలను ఉపయోగించుకునేలా అన్ని రకాలుగా సిద్ధం చేయాలన్నారు. అలాగే నూతన పీహెచ్సీలకు సంబంధించి భూమి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని డిఎంఅండ్హెచ్ఓ కి సూచించారు.
నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఆయా ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు, సిసి రోడ్లు, బిటి రోడ్లు, సి సి డ్రైన్ నిర్మాణ పనులలో నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఆయా ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని ఆదేశాలు ఇచ్చారని, అందుకనుగుణంగా నాణ్యత పై ఎక్కువ దృష్టి సారించి పని చేయాలన్నారు. నాణ్యత సరిగా లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ పనుల కింద చేపట్టిన ఆయా భవన నిర్మాణాలలో ఏవైనా సమస్యలు ఉంటే ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణాలలో నిర్లక్ష్య ధోరణి వదిలివేసి ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు. జిల్లాకు 840 కోట్ల రూపాయల పనులు కేటాయిస్తే ఇప్పటివరకు 130 కోట్ల రూపాయల పనులు ఖర్చు చేశారని, మిగిలిన 710 కోట్ల రూపాయల పనులను ఖర్చు చేయాల్సి ఉందని, ఆయా పనులను వేగంగా చేపట్టాలన్నారు. మార్చి నెలాఖరు లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 1.27 కోట్ల రూపాయల పనులు ప్రతి డివిజన్ పరిధిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఎంత మేరకు పనులు చేశారనేది డివిజన్ల పరిధిలో పరిశీలించాలన్నారు. ఆయా అభివృద్ధి పనులపై వారానికి రెండుసార్లు సమీక్ష చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డుల వారిగా ఈరోజు ఎంత పని చేయాలనేది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దశల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ఒక్క పైసా నిధులు కూడా ల్యాప్స్ కాకుండా ఉండేలా పనులను వేగవంతంగా 100 శాతం నాణ్యతతో చేపట్టాలన్నారు.
కాంట్రాక్టర్లకు అప్పగించిన భవన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయగలరా, లేదా అనే అంశాలను సమీక్షించుకుని ముందుకెళ్లాలన్నారు. ఒక కాంట్రాక్టరు ఒక భవన నిర్మాణ పనులు మాత్రం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా డివిజన్, మండల పరిధిలో డిఈ లు, ఏ ఈ లు చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి ఎంత మేరకు కనిపించింది అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం లోపు ఆయా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ ( గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణంలో నాణ్యత గా పనులు జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఈలు ఖచ్చితంగా ఫీల్డ్ కి వెళ్లాలని, డి ఈ లు కూడా బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. డీఈలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ప్రతిరోజు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ల వారీగా సమీక్ష చేసుకుని పనులు వేగవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ ఎస్ఈ భాగ్యరాజ్, డీఈవో శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఎపిఈడబ్ల్యు సి, ఎస్ఎస్ఏ ఈఈ శివ కుమార్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, జెడ్పి సి ఈ ఓ శోభ స్వరూపారాణి, డిపిఓ పార్వతి, వ్యవసాయశాఖ జెడి రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ ఈఈ లు, డిఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లాస్థాయి మత సామరస్య కమిటీల ఏర్పాటు, వాటి బాధ్యతలపై పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గడిచిన కొన్ని రోజుల కాలంలో రాష్ట్రంలో మతపరమైన సంస్థలపై జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రం అన్నారు. అలాంటి రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయని, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేలా, మత సామరస్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు .రాష్ట్రంలోని ప్రజలు వసుదైక కుటుంబంగా జీవిస్తూ ఉన్నారని, అలాగే జిల్లాలో సైతం ప్రజలు మతపరమైన సంప్రదాయాలను పాటిస్తూ, ఒకరినొకరు గౌరవిస్తూ జీవించడం జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజల మతపరమైన విశ్వాసాలకు విఘాతం కలుగకుండా,వారి మనోభావాలను పరిరక్షించేందుకు జిల్లాస్థాయి మత సామరస్యం కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని, జిల్లా ఎస్పీ వైస్ ఛైర్మన్ గా ఉంటారన్నారు .అలాగే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు,జైనులు తదితర ప్రతినిధులను సభ్యులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.మైనారిటీ,ఎండోమెంట్ శాఖలకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని,ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ)సభ్యులు/ కన్వీనర్ గా ఉంటారన్నారు. ప్రతి గ్రామ ,మండల, డివిజన్ వారీగా మతపరమైన అవాంతరాలు ఏమైనా సంభవించే అంశాలు గుర్తించి వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లాలో సున్నితమైన మరియు హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల జాబితాను సిద్ధం చేసుకొని అటువంటి ప్రాంతంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గత వివాదాలు/ఘర్షణల సంఘటనలను పరిగణలోకి తీసుకొని అలాంటి కేసులను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరుగుతుందన్నారు. భూవివాదాలు/మత వివాదాలు/ఉద్రిక్తతలను ప్రేరేపించే అవకాశం ఉన్న ఇతర సమస్యలను కూడా గుర్తించి ,జాబితాను తయారు చేసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మత భవనాలు, నిర్మాణంమరియు స్మారక కట్టడాలను భద్రతా ప్రణాళిక ను పదిరోజుల్లో సిద్ధం చేసి ,వాటిని జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించడం జరుగుతుందన్నారు.
జిల్లాస్థాయి కమిటీ ద్వారా తరచూ క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించి ప్రజల విశ్వాసం కల్పించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఎవరైనా మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిపై ఐపీసీ లోని వివిధ విభాగాల క్రింద కేసులను బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయి కమిటీ తోపాటు గ్రామ,మండల ,డివిజన్ల వారీగా కూడా కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని పాఠశాలలు మరియు కాలేజీలో సోదరభావం, మతసామరస్యం పెంపొందించేందుకు విద్యాశాఖ, సర్వ శిక్ష అభియాన్ ద్వారా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు .ఇందుకు సంబంధించి గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల వారీగా సూచనలు కూడా జారీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(రైతు భరోసా, రెవిన్యూ) నిశాంత్ కుమార్ అడిషనల్ ఎస్పీ నాగేంద్రుడు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కరోనా జాగ్రత్తలతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది మాస్కులు సానిటైజర్లను వుపయోగించాలని సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. వాక్సన్ ను హైజినిక్ కండిషన్ లో వుంచాలని తెలిపారు. కరోనా బాధితులు కాని, కరోనా లక్షణాలు వున్న వారు కాని పల్స్ పోలియో విధులలో వుండరాదన్నారు. ప్రతీ పి.హెచ్.సి.లోను, సానిటైజర్లు సోప్స్, మాస్కులు అందుబాటులో వుంచాలని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లాలోని 0 నుండి 5 సం.లలోపు పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఏ ఒక్కరూ తప్పిపోరాదన్నారు. ఈ నెల 17, 18, 19 తేదీలలో పోలియో కార్యక్రమం వుంటుందని, మహిళా సంఘాలు, మారుమూల ప్రాంతాలను గుర్తించాలన్నారు. వలస కార్మికుల పిల్లలను గుర్తించాలన్నారు. ముఖ్యంగా గ్రానైట్ పనులు చేసే వారు, చెరకు తోటలలో పని చేసే వారు.బొమ్మలు అమ్ముకునే వారు, నిర్మాణ రంగంలో వుండే కార్మిక కుటుంబాలను గుర్తించాలన్నారు. హైవే రోడ్డుపనులు చేసే వారు, ఇసుక బట్టీల పని వారల పిల్లలకు తప్పని సరిగా పోలియో వేయాలన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులు, మహిళా సంఘాలు, స్వఛ్ఛంద సంస్థలు హైరిస్క్ ప్రాంతాలను వలస కార్మికులను గుర్తించాలన్నారు. కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.
జిల్లాలో 2,33,683 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని, 1616 కేంద్రాలలో పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 83 మొబైల్ టీమ్ ల ద్వారా వీధి బాలలు, సంచార జాతుల బాలలకు వేయడం జరుగుతుందని తెలిపారు. 247 హైరిస్క్ ఏరియాలలోను, బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సంతలలో సైతం 17, 18,19 తేదీలలో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. 7218 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, 158 మంది సూపర్ వైజర్లను నియమించామని, వేక్సిన్ తరలింపు కోసం 251 వాహనాలను ఏర్పాటు చేసామని తెలిపారు. మండలాలలోను, గ్రామాలలోను ప్రజలకు మైక్ ద్వారాను, టామ్ టామ్ ద్వారాను అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్ధులచే ర్యాలీలు, నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.చంద్ర నాయక్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.జగన్నాధం, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి భారతి, డి.సి.హెచ్.ఎస్. బి.సూర్యారావు,రిమ్స్ ప్రిన్సిపాల్ డా.కృష్ణ వేణి, సూపరెటెంటెంట్ డా. ఎ. కృష్ణ మూర్తి, డా.కృష్ణమోహన్, డా.అప్పారావు జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వెంకటరావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, వివిధ స్వఛ్ఛంద సంస్థల ప్రతినిధులు, మంత్రి వెంకట స్వామి, నటకుల మోహన్, ,తదితరులు హాజరయ్యారు.
మైనింగ్ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్న ఆదాయం సాధించేందుకు ఒక ప్రణాళిక ప్రకారం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి జిల్లా మైనింగ్ శాఖ డీడీ ఎస్వీ రమణా రావు, అనంతపురం ఏడీ బాలాజీ నాయక్, తాడిపత్రి ఏడీ డి.ఆదినారాయణ, జిల్లా ఇసుక అధికారి కొండా రెడ్డిలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్ఓసీలు ఉన్నా లైసెన్సులను ఇచ్చే విషయంలో సంబంధిత తహసీల్దారు కార్యాలయాలతో సమన్వయం చేసుకుని కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అధికారీ తన పరిధిలోని అప్లికేషన్లు పెండింగులో లేకుండా చూడాలన్నారు. జిల్లాలో మైనింగ్ శాఖ ఆదాయ వనరులపై కలెక్టర్ ఆరా తీసారు. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడంపై అధికారులను వివరణ కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రావాల్సిన బకాయిలను పూర్తిగా వసూలు చేయాలన్నారు. మైనింగ్ అక్రమదారుల నుంచీ పెనాల్టీల రూపంలో రావాల్సిన ఆదాయం సక్రమంగా వసూలు చేయాలన్నారు... జిల్లాలో ఉన్న ఖనిజ వనరులకు, మైనింగ్ శాఖ ద్వారా సమకూరే ఆదాయానికి పొంతన వుండేలా చూడాలన్నారు. ఇసుక పంపిణీ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బుకింగ్ చేసుకుంటున్న ఇసుక కంటే ఎక్కువ ఉత్పత్తి జరగడం మంచి పరిణామం అన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగాలనీ.. నాడు-నేడు, గ్రామ సచివాలయాలు, జగనన్న ఇళ్ల, ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక కొరత రాకుండా చూసుకోవాలన్నారు.
ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర అన్నారు. శుక్రవారం ఆయన ఏయూకు విచ్చేసి వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం వర్సిటీ ఉన్నతాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్నత విద్య రంగంలోని విశ్వవిద్యాలయాల ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవనెలకు రాష్ట్ర ప్రభుత్వం 7500 కోట్ల రూపాయలుపైగా వెచ్చించడం జరుగుతోందన్నారు. దీనిని సద్వినియోగం చేస్తూ పూర్తిస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ఎంతో అవసరమన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణ పటిష్టంగా జరగాలని సూచించారు. ఆచార్యులు నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారు తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు.
విశ్వవిద్యాలయం పరిశోధనలకు కేంద్రంగా నిలవాలని, అదే సమయంలో పరిశోధనల్లో నాణ్యత పెంపొందించాలన్నారు. ఆచార్యుల ప్రగతిని కాలానుగుణంగా నిపుణులతో మదింపు చేయాలని సూచించారు. దీనికి ప్రత్యేక కమిటీని నియమించి, పర్యవేక్షణ జరపాలన్నారు. ఆచార్యులు ప్రతీ సంవత్సరం తమ జ్ఞానాన్ని, ప్రగతిని, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, విశిష్ట పరిశోధనలు జరపడం, అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన పత్రాలను ప్రచురించడం ఎంతో అవసరమన్నారు. విశ్వవిద్యాలయాలలో ఉన్న బోధనేతర సిబ్బందికి నైపుణ్యలేమి వేధిస్తోందన్నారు. వర్సిటీలోని ప్రతీ ఉద్యోగికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని మానవ వనరుల అభివృద్ది కేంద్రాన్ని కోరారు. ఉద్యోగులు సామర్ధ్యాలు, నైపుణ్యాలకు అనుగుణంగా వారికి అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి పూర్తి సామర్ధ్యాలను ప్రస్పుటం చేస్తూ సమర్ధవంతంగా సేవలు అందించే దిశగా నడిపించాలన్నారు. ఈ పక్రియలో క్రమశిక్షణకు ప్రాధాన్యం కల్పించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై క్రమశిక్షణ చర్యలకు సైతం వెనకాడరాదని స్పష్టం చేశారు.విశ్వవిద్యాలయంలో పరిశోధకుల ప్రగతి, పరిశోధనలపై పర్యవేక్షణ జరపాలన్నారు. పరిశోధనల్లో నవ్యత, నూతనత్వం, ఆవిష్కరణలు ఉండాలని తెలిపారు.
వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో(జిఇఆర్)ను చేరుకునే దిశగా పనిచేస్తున్నామన్నారు. సాంకేతికతను లాభదాయకంగా మార్చుకుంటూ డిజిటల్ స్టూడియోను సైతం ఏయూ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయ ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం వర్సిటీ తరపున సతీష్ చంద్రను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ ఆచార్య పి.రాజేంద్రకర్మార్కర్, ఎస్.సుమిత్ర, వై.రాజేంద్ర ప్రసాద్, ఎస్.కె భట్టి, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, క్రిష్ణమంజరి పవార్, డీన్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రభుత్వ పథకాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవడంతోపాటు అవగాహన పెంచుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు గొలగాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖలోని ఆరిలోవలోని అర్బన్1, సెక్టార్ 5 గాంధీనగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోందరన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకుని పిల్లలకు మంచి విద్యను చిన్నప్పటి నుంచి అందించడానికి తల్లులు చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడీలంతా తమ తమ కేంద్రం పరిధిలోని వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలన్నారు. అంతేకాకుండా ఆరోగ్య సహాయకుల సేవలను కూడా అంగన్వాడీల ద్వారానే ప్రభుత్వం అందిస్తున్నందున, ప్రతీ బాలింత, గర్భిణీ ఖచ్చితంగా కేంద్రానికి వచ్చి అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణా కార్యదర్శిలు సికీర్తి, రేష్మా బేగం,భవానీ, అంగన్వాడీ కార్యకర్తలు శ్యామలాదేవి,రమానాగమణి, రమాదేవి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభి వృద్ధి లో భాగంగా ప్రతిష్టా త్మకంగా ఈ నెల 11 న 2వ విడత అమ్మఒడి కార్యక్ర మాన్ని పండుగ వాతావర ణం లో ప్రతి పాటశాల లో నిర్వహించాలని జిల్లా కలె క్టర్ డా.నారాయణ భరత్ గుప్త మండల విద్యా శాఖాధి కారులను, ప్రధానోపాధ్యా యులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయం లోని సమా వేశపు మందిరం లో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మండల విద్యా శాఖాధికా రులు, ప్రధానోపాధ్యా యులతో నాడు-నేడు క్రింద పాటశాలలో జరుగుతున్న పనుల పై జిల్లా సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) వి.వీర బ్రహ్మo తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం విద్యా సంస్కరణ లో భాగంగా పిల్లల బంగారు భవిష్యత్తు బాటలు వేస్తూ తీసుకొనివచ్చిన అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరు జి ల్లా లో 2020 జనవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛ నం గా ప్రారంభించారని అర్హులైన తల్లుల ఖాతాల లోకి మొదటి విడత లో రూ.15 వేలు జమచేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న 2వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని అన్నీ పాటశాలలో పండుగ వాతావరణం లో నిర్వహిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అందరూ వీక్షించే లా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిత్తూరు కు సంబందించి నాగయ్య కళాక్షేత్రం లో ఈ కార్యక్రమా న్ని నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. జగన న్న గోరుముద్ద, చదవడం నాకు ఇష్టం, జగనన్న విద్యా కానుక లాంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ లో పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనితో పాటు ప్రభుత్వ పాటశాలల రూపు రేఖలను మారుస్తూ తీసుకువచ్చిన నాడూ-నేడు కార్యక్రమంను రాష్ట్ర ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగు చున్నదని కార్పొరేట్ పాట శాలలకు దీటుగా ప్రభుత్వ పాటశాలలు సిద్దం అవుతు న్నాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాటశాలలో విద్యా ర్థుల నమోదు సంఖ్య పెరు గు తున్న నేపధ్యం లో ఉపా ధ్యాయుల పైనా మరింత బాద్యత ఏర్పడుతుందని, విద్యార్థులకు నైతిక విలువ ల తో కూడిన విద్యను అందించేoదుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చే యాలని ఈ దిశగా విద్యా శాఖ సన్నద్ధం కావాల న్నారు.
జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు క్రింద ఎంపిక చేసిన పాటశా లలో జరుగుతున్న పనుల పురోగతిని వేగవంతం చే యాలని ఫిబ్రవరి 20, 2021 నాటికి అన్నీ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావాలని ఆదేశించారు.మేజర్, మైనర్ రిపెర్ లలో భాగంగా నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్ల, త్రాగు నీటి వసతి, విద్యుధీకరణ పను లను ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని, పాటశాల పెయింటింగ్ పనులకి సం బందించి అవసరమైన మెటీ రీయల్ కొనుగోలు, చిత్రీక రించే చిత్రాలకు సంబందించి తుది నిర్ణయం తీసుకొని ఈ పెయింటింగ్ పనుల పర్య వేక్షణ బాద్యతలు డ్రాయింగ్ టీచర్ కి అప్పజెప్పాలని సూచించారు. నాబార్డ్ కింద చేసే పనులకు సంబందించి ఏ.ఈ లు ఎప్పటికప్పుడు చెక్ మెజర్మెంట్ ను అప్ లోడ్ చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కొఆర్డినేటర్ వెంకటరమణ రెడ్డి, సెక్టోరియల్ అధికారు లు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని భూగర్భ జలవనరులకు సంబంధించి పునఃమదింపు నివేదికను రూపొందించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో వివిధ విభాగాలు కచ్చితత్వంతో కూడిన సమాచారం అందించాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వర్చ్యువల్ విధానంలో కలెక్టర్ అధ్యక్షతన భూగర్భ జలవనరుల అంచనా జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. జల వనరులు, ఈపీడీసీఎల్, ప్రణాళిక, వ్యవసాయం, ఉద్యానవన, డ్వామా, అటవీ, గ్రామీణ నీటి సరఫరా, మునిసిపల్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, మత్స్య విభాగాలు సమాచారాన్ని నిర్దేశ ఫార్మాట్‌లో భూగర్భ జల, జల గణన శాఖకు అందించాలని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలవనరుల అంచనాల మదింపు ప్రక్రియ సాధారణంగా మూడేళ్లకు ఓసారి జరగుతుందని, ఇప్పటివరకు ఆరుసార్లు 1999-2000, 2004-05, 2007-08, 2010-11, 2012-13, 2016-17లకు సంబంధించి జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 2019-20కు సంబంధించి అంచనాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని, జిల్లా స్థాయి అంచనాలను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించాల్సి ఉంటుందన్నారు. 2004-05లో జరిగిన సర్వే ప్రకారం జిల్లాలో 32 గ్రామాల్లో అత్యధిక భూగర్భ జలాల వినియోగం (Over Exploited) జరిగిందని, ఈ సంఖ్య 2016-17 సర్వేలో 12గా నమోదైనట్లు తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీరు తదితరాలకు సంబంధించి ప్రణాళికల రూపకల్పనకు, ఇష్టానుసారం భూగర్భ జలాలను ఉపయోగించకుండా నియంత్రించడం వంటి వాటికి ఈ నివేదికలు ఉపయోగపడతాయని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి వివరించారు. రీఛార్జ్ కంటే ఎక్కువగా డిశ్చార్జ్ కాకుండా చూసుకునేందుకు భూగర్భ జల వనరుల నివేదికలు ఉపయోగపడతాయని భూగర్భ జల, జల గణన శాఖ ఉప సంచాలకులు పీఎస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 28లోగా జిల్లా నుంచి అంచనాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉందన్నారు. సమావేశంలో 12 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.