1 ENS Live Breaking News

కోవిడ్ వ్యాక్సినేష‌న్‌కు ఏర్పాట్లు పూర్తి..

తూర్పుగోదావ‌రి జిల్లాలో కోవిడ్‌-19 వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో నిపుణులైన వైద్య బృందాల‌తో అత్య‌వ‌స‌ర వైద్య కేంద్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శుక్ర‌వారం కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు సంబంధించి కాకినాడ జీజీహెచ్‌లో డ్రైర‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాన్ని వైద్యాధికారుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ప‌ర్య‌వేక్షించారు. ల‌బ్ధిదారుల డేటా న‌మోదు, వ్యాక్సినేష‌న్‌, అబ్జ‌ర్వేష‌న్ రూం త‌దిత‌రాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అందుబాటులో ఉంచిన మందుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ద‌శ‌ల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్షేత్ర‌స్థాయిలో యంత్రాంగం స‌న్న‌ద్ధ‌త‌ను అంచ‌నా వేసేందుకు శుక్ర‌వారం మ‌రోసారి డ్రైర‌న్ చేప‌ట్టిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. వాస్త‌వ ప‌రిస్థితుల్లో టీకా వేసే ప్ర‌క్రియ‌లో ఎలాంటి స‌మ‌స్యా ఎదురుకాకుండా ఉండేందుకు ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు క‌చ్చిత‌మైన స‌మాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు కూడా అందుబాటులో ఉన్నాయ‌న్నారు. త్వ‌ర‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఎలాంటి అపోహ‌ల‌కు తావు లేకుండా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. ప్ర‌తి కేంద్రంలోనూ అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌లు, మందులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై ఎలాంటి భ‌యాందోళ‌న‌లు అవ‌స‌రం లేద‌ని జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. ఎం.రాఘ‌వేంద్ర‌రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్ర‌చారంలో ఉన్న వ‌దంతుల‌ను న‌మ్మొద్ద‌ని సూచించారు. టీకా వేయించుకొని.. మీతో పాటు మీ కుటుంబాన్ని త‌ద్వారా దేశాన్ని ఆరోగ్య‌క‌రంగా ఉంచుకోవాల‌న్నారు. టీకాతో ఎలాంటి దుష్ప‌రిణామాలు ఉండ‌వ‌న్నారు. ఒక‌వేళ వ‌స్తే ప‌దివేల మందిలో ఒక‌రికి ద‌ద్దుర్లు వంటివి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఏవైనా దుష్ప‌రిణామాలు ఎదురైతే త‌క్ష‌ణ‌మే స్పందించేందుకు వీలుగా నిపుణులైన అత్య‌వ‌స‌ర వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయ‌న్నారు. క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో జీజీహెచ్‌లో మ‌రో రెండు వ్యాక్సినేష‌న్ కేంద్రాలు ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు రాఘ‌వేంద్ర‌రావు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఆర్ఎంవో డాక్ట‌ర్ గిరిధ‌ర్‌, కోవిడ్‌-19 కేంద్ర ఇన్‌ఛార్జ్ డాక్ట‌ర్ గంగా భ‌వాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

East Godavari

2021-01-08 15:25:04

కోవిడ్ వేక్సినేష‌న్ కు స‌మాయ‌త్తం కావాలి..

కోవిడ్ వేక్సినేష‌న్‌కు స‌మాయాత్తం కావాల‌ని వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌ను జిల్లా క‌లెక్టర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు. స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వేక్సినేష‌న్ కంట్రోల్ రూమ్‌ను శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డి సిబ్బంది ప‌నివిధానాన్ని ప‌రిశీలించారు.  ఈ సంద‌ర్భంగా  క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ వేక్సినేష‌న్ ప్ర‌క్రియ త్వ‌ర‌లో మొద‌లు కానుంద‌ని, దీనికి అన్నివిధాలా సిబ్బంది సంసిద్దంగా ఉండాల‌ని అన్నారు. మొద‌టిద‌శ వేక్సినేష‌న్‌కు 89 కేంద్రాల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని, వాటిలో అన్ని ఏర్పాట్ల‌నూ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాలు, మందులతోపాటు, శిక్ష‌ణ పొందిన నిపుణుల‌ను కూడా సిద్దం చేయాల్సి ఉంద‌న్నారు. మాన‌వ వ‌న‌రుల కొర‌త రాకుండా, అద‌నంగా మ‌రికొంద‌రికి శిక్ష‌ణ ఇచ్చి సిద్దంగా ఉంచాల‌న్నారు.  ఒకవేళ అనుకోని ప‌రిస్థితి ఎదురైతే, దానిని త‌ట్టుకొనేందుకు వీలుగా అన్నివిధాలుగా శిక్ష‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని సూచించారు. సాంకేతిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదురైన ప‌క్షంలో, ప్ర‌త్యామ్నాయాల‌ను కూడా ఇప్ప‌టినుంచే అన్వేషించాల‌న్నారు. వైద్యారోగ్య‌శాఖ‌, 108, 104 సిబ్బందికి సైతం శిక్ష‌ణ ఇచ్చి సంసిద్దుల‌ను చేయాల‌ని, ఈ మేర‌కు త‌క్ష‌ణ‌మే వారికి ఉత్త‌ర్వుల‌ను జారీ చేయాల‌ని ఆదేశించారు. వాక్సినేష‌న్‌లో పాల్గొనే ప్ర‌తీ ఒక్క‌రికీ సంబంధించిన జాబ్‌చార్ట్‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. భారీ ఎత్తున జ‌రిగే కోవిడ్ వేక్సినేష‌న్ ప్ర‌క్రియ ఎంతో విభిన్న‌మైద‌ని, దీనిని ఎంతో అప్ర‌మ‌త్తంగా, అంకిత‌భావంతో పూర్తిచేయాల్సి ఉంద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, అద‌న‌పు వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎల్‌.రామ్మోహ‌న‌రావు, డిఐఓ డాక్ట‌ర్ నారాయ‌ణ‌, ఇత‌ర వైద్య‌ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-08 11:57:14

2021-01-05 21:09:27

సచివాలయాల అభివ్రుద్ధికి సలహాలివ్వండి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాలు పని తీరును మేరుగుపరచడానికి పలువురు కమిషనర్ల నుంచి సలహాలను ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళికా శాఖా ముఖ్య కార్యదర్శి వై. లక్ష్మి అడిగి తెలుసుకున్నారు. పట్టణాలలో సాంకేతిక పద్దతుల ద్వారా అమలు చేస్తున్న చెత్త నిర్వహణను, గృహ సముదాయాల నుండి చెత్తను వేరు చేసి సేకరించే విధానం గురుంచి, పట్టణంలో ఏర్పాటు చేయబోతున్న వై.ఎస్.ఆర్. ఆరోగ్య కేంద్రాల నిర్మాణపు పనులు పురోగతి, మున్సిపల్ స్కూళ్ళలో నాడు-నేడు పధకం క్రింద జరుగుతున్నా పలు అభివృద్ధి పనుల కోసం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అడిగితెలుసుకున్నారు. సి.డి.ఎం.ఏ. విజయ కుమార్ మాట్లాడుతూ పురపాలక సంఘాలు / కార్పోరేషన్లలో త్వరలో చేపట్టబోతున్న నూతన పన్ను సంస్కరణలు పైన, ఇళ్ళ స్థలాల పంపిణీ గూర్చి కమిషనర్లను ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పలు మున్సిపాలిటీలలో / కార్పోరేషన్లలో ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్య కార్యదర్శి దృష్టికి తేవాలని సి.డి.ఎం.ఏ. విజయ కుమార్ కమిషనర్లను కోరారు. విడియో కాన్ఫెరెన్స్ సమావేశంలో పాల్గొన్న జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన కార్పోరేషన్లో జరుగుచున్న పలు పనుల పురోగతిని వివరించారు. నగర పరిధిలో వార్డు సచివాలయాలు సక్రమంగా పనిచేస్తున్నాయని, ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్లాన్నింగ్, ఎమినిటీస్, శానిటరీ కార్యదర్శులకు పునశ్చరణ తరగతులు అందించాలని సూచించారు. నగరంలో హరిత-దనాన్ని పెంపొందించడానికి నక్షత్ర వనాలు, పంచతత్వ పార్కులు, మియావాకీ పార్కులు ఏర్పాటు చేయడం, 230 చెరువులును ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి చేపదుతున్నామని చెప్పారు. ఇంకా నగరంలో  ఏర్పాటు చేస్తున్న వై.ఎస్.ఆర్. క్లినిక్ లు, సాంకేతిక పద్దతిలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ పైన, పాఠశాలలలో జరుచున్న నాడు – నేడు  పనులు పురోగతి గూర్చి తెలియపర్చారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ సమావేశంలో ముఖ్య కార్యదర్శి తో పాటు, సి.డి.ఎం.ఏ. విజయ కుమార్, ఇ.ఎన్.సి. చంద్రయ్య మొదలగు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొనగా జివిఎంసి నుండి కమిషనర్ డా. జి. సృజన తో పాటు అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, డి.సి.(ఆర్) రమేష్ కుమార్, ఏ.డి.హెచ్. ఎం. దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు గణేష్, శ్యామ్సన్ రాజు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.    

Visakhapatnam

2021-01-05 20:58:39

కొత్త ఇళ్లతో గ్రామాలకు గ్రామాలే వెలస్తున్నాయ్..

ఊళ్ల‌కు ఊళ్లను క‌ట్టిస్తున్న ముఖ్య‌మంత్రిని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రూపంలో ప్ర‌స్తుతం చూస్తున్నామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం కాకినాడ గ్రామీణ మండ‌లంలోని తిమ్మాపురంలో 50 ఎక‌రాల 30 సెంట్ల విస్తీర్ణంలో 1919 మంది ల‌బ్ధిదారుల‌కు న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఎంపీ వంగా గీతా, జేసీ (ఆర్‌) డా. జి.ల‌క్ష్మీశ త‌దిత‌రుల‌తో క‌లిసి మంత్రి క‌న్న‌బాబు ప్రారంభించారు. రూ.36.65 కోట్ల అంచ‌నా విలువ‌తో చేప‌ట్టే గృహ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ‌భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ముఖ్య‌మంత్రి పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నార‌న్నారు. న‌వ‌రత్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కాన్ని ఓ య‌జ్ఞంలా చేప‌డుతున్నార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం తిమ్మాపురం లేఅవుట్‌లో హైవేకు స‌మీపంలో దాదాపు రూ.15 ల‌క్ష‌ల విలువైన ఆస్తిని అక్కాచెల్లెమ్మ‌ల చేతుల్లో పెడుతున్నామ‌న్నారు. ఇళ్ల స్థ‌లాల‌ను పూర్తి హ‌క్కుల‌తో మ‌హిళ‌ల పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించి ఇవ్వాల‌నేది ముఖ్య‌మంత్రి ఆకాంక్ష అని, అయితే దీన్నికొంద‌రు అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేశార‌న్నారు. జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు అందిస్తోంద‌ని, కోర్టులో సానుకూల తీర్పువెలువ‌డ్డాక రిజిస్ట్రేష‌న్ చేయిస్తామ‌ని వివ‌రించారు. కుల‌మ‌త భేదాల్లేకుండా అంద‌రూ ఒకేచోట క‌లిసి ఉండాల‌నే ఉద్దేశంతో అన్నిమౌలిక వ‌స‌తుల‌తో వైఎస్సార్ జ‌గ‌న‌న్న కాల‌నీలను అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. ఏ ప‌థ‌కం కోస‌మూ ఎవ‌రి ముందూ చేయి చాచాల్సిన అవ‌స‌రం లేకుండా ప్ర‌తి ల‌బ్ధిదారుడికీ సంక్షేమ ఫ‌థ‌కాలు అందించేందుకు వ‌లంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తెచ్చి, ముఖ్య‌మంత్రి చ‌రిత్ర సృష్టించార‌న్నారు. కాకినాడ గ్రామీణ మండ‌లంలో 18,713 మందికి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. ద‌ళారుల వ‌ల‌లో ప‌డ‌కుండా చూసుకోవాల‌ని, ఎవ‌రికీ ఇళ్ల‌ను అమ్మొద్ద‌న్ని మంత్రి సూచించారు. ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల పంపిణీ అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని, అర్హులు స‌చివాల‌యాల్లో్ ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ప‌ట్టా అందుతుంద‌న్నారు. పేద‌లకు ఇళ్ల ప‌థ‌కానికి భూములు ఇచ్చిన రైతుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.  - పేద ప్ర‌జ‌ల‌కు నిజ‌మైన నీడ క‌ల్పించాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్నార‌ని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వ‌నాథ్ పేర్కొన్నారు. ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం ఫ‌లాల‌ను చివ‌రి ల‌బ్ధిదారుని వ‌ర‌కు చేర్చే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి ప‌నిచేస్తున్నార‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆశ‌యాల‌కు వార‌సుడిగా రాష్ట్ర వ్యాప్తంగా గృహం లేని 30.75 ల‌క్ష‌ల గృహిణుల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నార‌న్నారు. జిల్లాలో మూడు వేల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో దాదాపు 5,500 ఎక‌రాల ప్రైవేటు భూమిని సేక‌రించిన‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. స్వ‌చ్ఛందంగా భూములిచ్చిన రైతుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అన్ని వివ‌రాల‌తో కూడిన ప‌ట్టాల‌ను ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచిన మూడు ఆప్ష‌న్ల‌ను జేసీ.. ల‌బ్ధిదారుల‌కు వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి క‌మిటీ ఛైర్మ‌న్ కుర‌సాల స‌త్య‌నారాయ‌ణ, ఏఎంసీ ఛైర్మ‌న్ గీసాల శ్రీను, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, ఎంపీడీవో పి.నారాయ‌ణ‌మూర్తి, త‌హ‌సీల్దారు ముర‌ళీకృష్ణ‌, బెజ‌వాడ స‌త్య‌నారాయ‌ణ, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Timmapuram

2021-01-05 20:07:43

మార్చిలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు..

టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు  మార్చిలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కె. చంద్రకళ  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  డ్రాయింగ్ , హాండ్ లూమ్ వివింగ్ మరియు టైలరింగ్ ఎంబ్రాయీడరీ లోవర్ గ్రేడ్ , హైయర్ గ్రేడ్ పరీక్షలు వ్రాయవలసి ఉంటుందని అన్నారు. ఈ పరీక్షలు వ్రాయు అభ్యర్డులు  www.bseap.gov.in నందు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ ఫారం మరియు  ఛలాన్  లను జిల్లా విద్యాశాఖాధికారి  వారి కార్యాలయం  లో అందజేయవలేనని తెలిపారు.  లోయర్ పరీక్ష పాస్ అయినవారు హయ్యర్  పరీక్ష వ్రాయవచ్చాన్నారు. ఇతర రాష్ట్రల బోర్డ్ ద్వారా పాస్ అయిన అభ్యర్డులు ఈ పరీక్ష వ్రాయటకు సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ , విజయవాడ వారి నుంచి ముందుగా అనుమతి పొందాలన్నారు. ఈ  పరీక్షలు వ్రాయు అభ్యర్డులు పరీక్ష రుసుము   డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ – రూ. 100, డ్రాయింగ్ హైయర్ గ్రేడ్ –రూ.150,  హాండ్ లూమ్ వివింగ్  లోయర్ – రూ.150,  హాండ్ లూమ్ వివింగ్  హైయర్ రూ 200, టైలరింగ్ & ఎంబ్రాయీడరీ లోయర్  రూ.150, టైలరింగ్ & ఎంబ్రాయీడరీ హైయర్ రూ . 200 గా చెల్లించాలన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల  16 వ తేదీ వరకు ఉండగా రూ.  50  అపరాధ రుసుము తో  ఈ నెల  23 వ తేదీ వరకూ  దరఖాస్తు చేసుకొనవచ్చున తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను   ఫిబ్రవరి 3 లోగా  జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Srikakulam

2021-01-05 20:06:03

8కి.మీ లోపల రింగు వలలతో చేపల వేట నిషేధం..

సముద్రంలో తీరం నుండి 8 కి.మీ. లోపల రింగులవలతో వేట నిషేధమని మత్స్యశాఖ మంత్రి సీదరి అప్పలరాజు తెలిపారు.  మంగళవారం సర్క్యూట్ హౌస్ లో రెండు వర్గాల మత్స్యకారులతో రింగులవలలు వాడకంపై ఆయన పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. మోటారు బోట్ల వారు, సాంప్రదాయక బోట్ల మత్స్యకారులతో చర్చించిన తరువాత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు లైసెన్సు కలిగిన వారు 8కి.మీ.లు దాటిన తరువాత చేపల వేట కొనసాగించ వచ్చని, కొత్తగా లైసెన్సులు జారీ చేయబడవని తెలిపారు.  చట్టం ముందు అందరూ సమానమే నని, సాంప్రదాయ మత్స్యకారుల జీవన భృతిని కాపాడేందుకు, మత్స్యసంపదతో పాటు తీర ప్రాంత పర్యావరణ రక్షణకు ఇటువంటి చర్య అనివార్యమని చెప్పారు. నియమనిబంధనలను  రూపొందించి కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. మత్స్యకారుల వివరాలను సేకరించవలసినదిగా డైరెక్టరు కె.కన్నబాబును మంత్రి ఆదేశించారు. నిబందనలు రాష్ట్రవ్యాప్తంగా అమలు లోనికి వస్తాయన్నారు. దీని మూలంగా తీరంలో పెరిగే చిన్న చేపలు, చేపపిల్లలు రక్షింపబడతాయని, సముద్రం లోని పర్యావరణం (నమ్మ)కు హాని జరగదని పేర్కొన్నారు.  మేథావులు, మత్స్యకార సంఘాలు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని పూర్తి స్థాయి చట్టంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ నిర్ణయం మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూడా తోడ్పడుతుందన్నారు.  గతంలో వుండే బల్లవల, అలివల, ఎరవల (లైటింగ్ ఎరవేసి పట్టడం) మొదలైన వాటిని నిషేదించడం జరిగిందని గుర్తు చేశారు.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి మత్స్యకారులంటే ఎంతో అభిమానమని చెప్పారు.  మత్స్యకారులందరూ సమైక్యంగా వుంటారని, చూసి ఓర్వలేని శక్తులు తగవులు పెడుతున్నారన్నారు.  ప్రపంచంలో 30 శాతం దేశాల ఆర్ధిక వ్యవస్థ చేపల వేటపైనే ఆధారపడి వుందని ఆయన గుర్తుచేశారు.  దక్షిణ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ  రింగుల వలను  కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు నిషేదించాయని చెప్పారు.  బోట్లకు లైసెన్స్ లు జారీ చేసే సమయంలోనే ఎటువంటి వలలు వాడాలో నిర్ణయించి వుంటుందని  తెలిపారు.  కాబట్టి నిర్ణయానికి అందరూ కట్టుబడి వుండాలన్నారు.  అంతకు ముందు రింగులవలతో వేట సాగించే మోటారు బోట్ల వారు, సాంప్రదాయ బోట్లతో వేట సాగించే వారు తమ వాదనలు వినిపించారు.  రింగులవలతో వేట వలన ఎక్కువ మత్స్య సంపద చేజిక్కినా, దీర్ఝకాలంలో ఎంతో నష్టం జరుగుతుందని, సాంప్రదాయ మత్స్యకారుల జీవన భృతి పోతుందని కొందరు తెలియజేయగా ఆధునిక యంత్రాల సాయంతో లాభాల బాటన వేట సాగిస్తే అభివృద్ధి సాద్యమవుతుందని  వాదించారు. కోలా గురువులు  లగుడుపల్లి కొండబాబు, తాతాజీ, గురుమూర్తి, శివశంకర్, రామారావు,  తదితరులు మాట్లాడారు.   ఈ సమావేశంలో మత్స్యశాఖ సంచాలకులు కె.కన్నబాబు,  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాల రెడ్డి,  మత్స్యశాఖ జె.డి. ఫణిప్రకాష్, డిడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-01-05 19:58:44

దోమతెరలను సద్వినియోగం చేసుకోవాలి..

మన పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలబారి నుంచి రక్షణ పొందవచ్చునని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అన్నారు. మంగళవారం రెండవ జోన్ లో నక్కవానిపాలెంలోని వివేకానంద కళ్యాణ మండపంలో సుమారు 300 దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1.60లక్షల దోమతెరలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటిని జిల్లా మలేరియా విభాగం ద్వారా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. గతంలో పంపిణీ చేపట్టిన విధంగానే, జివిఎంసి పరిధిలోని 18 వార్డులలో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పంపిణీ జరుగుతుందన్నారు. అంతే కాకుండా, వసతి గ్రుహాల్లో  కూడా దోమతెరలు పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ దోమతెరలు, ఒక ప్రత్యేకమైన రసాయనాలతో తయారుచేయబడినవని, దోమలు వీటిపై వాలిన వెంటనే చనిపోతాయన్నారు.  దోమ తెరలు వాడే విధానంపై ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించారు. జివిఎంసి పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది చాలావరకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు తగ్గాయని ప్రజలు నీటినిల్వలు కొబ్బరి చిప్పలలో, పాత సీసాలలో లేకుండా చూడాలని తద్వారా మలేరియా అరికట్టవచ్చనని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అసిస్టెంట్ డైరెక్టరు కె.వి.ఎస్. ప్రసాద్, సి.ఎం.ఓ.హెచ్.   డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బయాలజిస్ట్ పైడి రాజు, ఇతర మలేరియా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Nakkavanipalem

2021-01-05 19:53:03

కరోనా నుంచి కోలుకున్న 15 మంది డిశ్చార్జ్..

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో  ప్రత్యేక కేంద్రాల నుంచి 15  మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో  కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు మంగళవారం 15  మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.

Anantapur

2021-01-05 18:54:39

భారత్ పర్వ్ లో అనంత మార్కు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26-31ల మధ్య జరుపుకునే భారత్ పర్వ్ వేడుకలను కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం డిజిటల్ వేదికపై నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. కేంద్ర టూరిజం సెక్రెటరీ యోగేంద్ర త్రిపాఠీ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు నిర్వహణ జరిగింది. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈ ఏడాది డిజిటల్ వేదికగా జరిగే భారత్ పర్వ్ వేడుకలలో జిల్లా మార్కు కనిపించేలా చూడాలని జిల్లా పర్యాటక శాఖను అదేశించారు. తెలుగు జాతికి తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించిన జిల్లా సంస్కృతి చాటిచెప్పేలా ఛాయా చిత్రాలు, వీడియోలను చిత్రీకరించాలన్నారు. ఆహారం, ఆహార్యం, ఆధ్యాత్మికం, పర్యాటకం, నాటకం, నాట్యం, శిల్పం వంటి సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబిస్తూ వీడియోలు, ఫోటోల చిత్రీకరణ జరగాలన్నారు. డిజిటల్ 'భారత్ పర్వ్' వేడుకలను ఒక అవకాశంగా మలుచుకుని జిల్లా సంస్కృతిని ఆధునిక మాధ్యమంలో ఒడిసిపట్టి రానున్న తరాలకు అందించాలన్నారు.  భారత్ పర్వ్ వేడుకల కోసం కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక వెబ్ సైట్ ను తయారు చేసి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచనుంది. వాటిల్లో రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇదే అదనుగా జిల్లా ప్రత్యేకతను దేశ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పాలని కలెక్టర్ టూరిజం శాఖను ఆదేశించారు. కాన్ఫరెన్సులో జిల్లా పర్యాటక శాఖ ప్రాంతీయ మరియు కార్యనిర్వాహక సంచాలకులు బి.ఈశ్వరయ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి పీవీ దీపక్ లు పాల్గొన్నారు. 

Anantapur

2021-01-05 18:50:09

కల్తీ భోజన మధీనా హోటల్ సీజ్..

కర్నూలు నగరంలోని యూకాన్ ప్లాజా లోని మధినా హోటల్ లో అన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా ఫ్రెష్ గా పాచిపోయి, బూజెక్కి ఉంటాయి..ఇక్కడికి వెళ్లే ఆహార ప్రియులంతా వరుసగా ఆసుపత్రి పాలవడంతో మంగళవారం నగర పాలక ప్రజారోగ్య విభాగం అధికారులు ఈ హోటల్ ను తనిఖీ చేసి సీజ్ చేశారు. బూజుపట్టి..గడ్డకట్టిన చికెన్, పాచిపోయిన మటన్ తో పాటు రెండు రోజుల క్రితం వండిన బిర్యానీ.. బూజు పట్టిన చికెన్ సెర్వా ను ప్రజలకు విక్రయిస్తూన కర్నూలు నగర ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న సదురు దుకాణాన్ని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ ఆదేశాల మేరకు మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి సీజ్ చేశారు. ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే హోటళ్లపై దాడులు ముమ్మరం చేశామని..వాటిని కూడా తప్పక సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అంతకు  ముందు పలుమార్లు చెప్పిన రహదారిపై తమ దుకాణంలో చెత్త పారబోస్తున్న అలంకార్ ప్లాజా లోని బొంబాయి డైయింగ్ యజమానికి బుద్ధి వచ్చేలా వారి దుకాణంలో చెత్త ను తిరిగి వారి దుకానంలోకే కమిషనర్ గారు పారబోయించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ యూ.శ్రీనివాసులు ఉన్నారు.

Kurnool

2021-01-05 18:35:51

ఏ ఒక్క లబ్దిదారుడు నష్టపోకూడదు..

నిరుపేదలకు లబ్ది చేకూర్చాలని, అర్హులైన ఏ ఒక్క లబ్దిదారుడూ నష్టపోకూడదని  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మంగళవారం జగనన్న కాలనీలు, ఉపాధిహామీ పనులు, అమ్మఒడి కార్యక్రమాలపై సీఎం  జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, హౌసింగ్, ఎడ్యుకేషన్, వ్యవసాయ శాఖాధికారులతో  సి.ఎం. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, జనవరి 20 వ తేదీ నాటికి అర్హులందరికీ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంల పూర్తి చేయాలని చెప్పారు.  పెండింగ్ బిల్లులు అప్ లోడ్ చేయాలని తెలిపారు.  ప్రతీ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడం జరుగుతున్నదన్నారు.  సచివాలయాలలో ఏ ఏ పథకాలను ఎన్ని రోజులలో అందచేయడం జరుగుతుంది, అనే విషయాన్ని బోర్డులపై తెలియచేయాలన్నారు. నిక్కచ్చిగా లబ్దిదారుల జాబితాలను పరిశీలించాలన్నారు.  ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, నిరుపేదలకు మంచి ఇళ్ళను అందించి చరిత్రలో నిలచిపోవడం జరుగుతుందని  కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు తెలిపారు.  కోలనీలలోని  లే- ఔట్లలో మంచి రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, మంచి నీటి సరఫరా, వంటి మౌలిక సదుపాయాలను కలుగచేయాలని తెలిపారు.  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం ద్వారా మంచి సౌకర్యవంతంగా వుంటుందన్నారు.  భవిష్యత్తరాలకు ఉపయోగ పడే విధంగా చెట్లను పెంచాలన్నారు.  సాంక్షన్ ప్రొసీడింగ్స్ ను లబ్దిదారులకు అందచేయాలని, యుధ్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలన్నారు.  ప్రతీ కాలనీలోను ఒక మోడల్ హౌస్ నిర్మించాలన్నారు. మ్యాపింగ్, జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు.    సెక్రటేరియట్ లో వున్న  ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని సి.ఎం. తెలిపారు.  సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనా లు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం,  బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్   ఉపాధిహామీ ద్వారా పూర్తి చేయాలన్నారు. ఆగష్టు కల్లా నిర్మాణాలు పూర్తి చేయాలని, మండలం ఒక యూనిట్ క్రింద మైక్రో లెవెల్ ప్లానింగ్ ద్వారా లక్ష్యాలను  సాధించాలని తెలిపారు.  నాడు నేడు  పనులను  ఫిబ్రవరి 20 నాటికి పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ భవనాలు ప్రి ప్రైమరీ స్కూల్స్ గా మార్పాలన్నారు. ప్రతీ గ్రామం లో జనతా బజారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండాలని,  మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ ఆర్ బి కే ల కు దగ్గరగా నిర్మించాలని అన్నారు.  జనవరి నెలాఖరు నాటికి భూసేకరణ చేసి అగ్రికల్చర్ శాఖకు అందచేయాలని తెలిపారు.  రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ నెలలో  అందచేయడం జరుగుతుందన్నారు.      జనవరి 11న అమ్మ ఒడి సొమ్మును  జమ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారుల జాబితా సచివాలయాలలో ఇప్పటికే వుంచడం జరిగిందన్నారు.  ఫిబ్రవరి 1వ తేదీ నుండి నాణ్యమైన బియ్యం ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సి.ఎం.తెలిపారు. సదరు కార్యక్రమానికి రవాణా నిమిత్తం వాహనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.  ఈ నెల 20న వాహనాలను  ప్రారంభం చేస్తామని, జిల్లాలలో  కలెక్టర్లు, ప్రజా ప్రతి నిధులు ప్రారంభించాలని తెలిపారు. అనంతరం దేవాలయాలపై దాడులు శోచనీయమని, దేవాలయాల పరిరక్షణ కు 36 వేల సి సి కెమెరాలని అమర్చడం జరిగిందని తెలిపారు.                                ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్,  జిల్లా పోలీసు సూపరెంటెండెంట్  అమిత్ బర్దర్, సంయుక్త కలెక్టర్లు  సుమీత్ కుమార్, కె.శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు  నాయుడు, హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్, డి.ఇ.ఓ. కె.చంద్రకళ, ఎగ్రికల్చర్ జె.డి.  కె.శ్రీధర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-05 18:29:24

లబ్దిదారులందరికీ గడువులోగా పట్టాలు..

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజురైన లబ్దిదారులందరికి  నిర్దేశిత గడువు లోగానే పట్టాల  మంజూరు ఉత్తర్వులను అందజేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ స్పష్టం చేసారు.  మంగళ వారం తాడేపల్లి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో ఇళ్ళ పట్టాల పంపిణీ,  ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులు, నాడు-నేడు, జతీయ రహదారులకు  భూసేకరణ,  అమ్మ ఒడి, వాహనాల ద్వారా రేషన్ సరకుల  పంపిణీ తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారి చేసారు. ఇళ్ళ స్థలాల  సమీక్ష లో భాగంగా జిల్లా వారీగా జరుగుతున్న పట్టాల పంపిణీ, టిడ్కో గృహాల పంపిణీ, పోసిషన్ సర్టిఫికెట్ల  జారీ, కోర్ట్ కేసుల పరిష్కారం  తదితర అంశాలలో ప్రగతి, ఓవరాల్ ప్రగతిని చదివి వినిపించి కలెక్టర్ల తో మాట్లాడించారు.  విజయనగరం జిల్లా లో జగనన్న కాలనీల  పంపిణీ లో 78.26 శాతం చేసి రాష్ట్రం లోనే ప్రధమంగా ఉన్నామని కలెక్టర్ వివరించారు.  టిడ్కో గృహాల పంపిణీ లో 65 శాతం, పోసిషన్ సర్టిఫికెట్స్ లో 77 శాతం సాధించామన్నారు.  పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7 ను గడువు  తేదీ గా  ప్రకటించగా  వీడియో కాన్ఫరెన్స్ లో ఆ తేదీని ఈ నెల 20   వరకు పోడిగిస్తున్నట్లు  ముఖ్యమంత్రి ప్రకటించారు.   ఈ గడువు లోగా  శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.  జగనన్న కాలోనీలలో సామజిక వసతులను కల్పించి, మురికి వాడలు లేని కాలనీలను తీర్చి దిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆశయం  మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్ హౌసింగ్ ను నిర్మించడానికి మనసు పెట్టి  పని చేస్తామని కలెక్టర్ తెలిపారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, జే. వెంకట రావు, సహాయ కలెక్టర్ సింహాచలం కట్టా,  జిల్లా రెవిన్యూ అధికారి కే. గణపతి రావు, అదనపు ఎస్.పి శ్రీదేవి రావు, జిల్లా అధికారులు సి.పి.ఓ విజయలక్ష్మి,  వ్యవసాయ శాఖ జే.డి ఆశదేవి, డి.ఈ.ఓ జి. నాగమణి,  డి.ఎం.హెచ్.ఓ డా. రమణ కుమారి,  పశు సంవర్ధక శాఖ జే.డి డా. నరసింహులు, డి.పి.ఓ సునీల్ రాజ్ కుమార్, డుమా పి.డి నాగేశ్వర రావు, బి.సి. కార్పోరేషన్  ఈ.డి నాగ రాణి , ఐ సి డి ఎస్ పి.డి  రాజేశ్వరి, ఎస్.ఈ పంచాయతి రాజ్   గుప్తా తదితరులు హాజరైనారు. 

Vizianagaram

2021-01-05 18:27:00

గుడులు, ప్రార్ధనా స్థలాల్లో నిఘా ఉంచండి..

విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామాలు, నిర్జ‌న ప్ర‌దేశాల్లో వుండే గుళ్లు, ప్రార్ధ‌నా స్థలాల‌పై నిఘా వుంచాల‌ని అక్క‌డి వెళ్లి వ‌చ్చేవారిని క‌నిపెట్టి వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ స‌చివాల‌య సిబ్బందిని ఆదేశించారు. బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాంలోని గ్రామ స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌చివాల‌య సిబ్బందితో మాట్లాడుతూ త‌మ ప‌రిధిలో వుండే ప్రార్ధ‌న స్థ‌లాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం తెలుసుకుంటూ ప్రార్ద‌నా స్థలాల నిర్వ‌హ‌ణ‌ను చూసే అర్చ‌కులు, పూజారుల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేయాల‌న్నారు. ముఖ్యంగా ప్రాచీన దేవాల‌యాలపై ఒక క‌న్నేసి వుంచాల‌న్నారు. స‌చివాల‌యంలో రిజిష్ట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై పోస్ట‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న వంటి అంశాల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. స‌చివాల‌య ప‌రిధిలో ఇ-సేవ‌ల‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఏవీ పెండింగులో లేక‌పోవ‌డంపై సంతృప్తి వ్య‌క్తంచేశారు. వై.ఎస్‌.ఆర్‌.బీమా అమ‌లులో బ్యాంక‌ర్ల స‌హ‌కారం త‌దిత‌ర అంశాల‌పై సంక్షేమ కార్య‌ద‌ర్శిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ఆరా తీశారు. ఫించ‌న్ల పంపిణీ గురించి తెలుసుకున్నారు. స‌చివాల‌య సిబ్బంది ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో వుంటూ గ్రామ‌స్థుల స‌మ‌స్య‌లు తెలుసుకొని ప‌రిష్క‌రించ‌డంలో క్రియాశీల‌కంగా వుండాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. గ్రామాల్లో మొక్క‌ల పెంప‌కంపై పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌లిగించ‌డంతో పాటు సిబ్బంది కూడా భాగ‌స్వాములై ప్ర‌జ‌ల‌తో మొక్క‌లు నాటించాల‌న్నారు. ప్లాస్టిక్ విచ్చ‌ల‌విడిగా వినియోగించకుండా జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌న్నారు. గ్రామాల్లో ప్ర‌జ‌లు వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లు వినియోగించేలా వారిలో అవ‌గాహ‌న క‌లిగించాల‌ని చెప్పారు.

Bondapalli

2021-01-05 18:23:54

20లోగా పట్టాల పంపిణీ పూర్తికావాలి..

ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణం, ఎన్ఆర్ఇజియస్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు(గ్రామీణ), అంగన్ వాడీ, నాడు – నేడు స్కూల్స్, రహదారులు మరియు భవనాల శాఖకు సంబంధించి భూ సేకరణ సమస్యలు, రెండవ విడత అమ్మ ఒడి పథకం ప్రారంభం, రేషన్ డోర్ డెలివరీ వెహికల్ లాంచ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థల పట్టాలు అందాల న్నారు.. దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి మంజూరు చేయడం వరకు నిరంతర ప్రక్రియని, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.   ప్రతి పెండింగ్ దరఖాస్తును పరిశీలించాలని, ఈ పరిశీలన కార్యక్రమం అనేది ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు.  లే ఔట్ లలో మౌళిక సదుపాయలైన  అంగన్ వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్ లు, పార్క్ లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, తదితర వాటిని ఇళ్ల నిర్మాణాలు అయ్యేలోగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ టిడ్కో గృహాలకు సంబంధించి ప్రింటెడ్ సేల్ ఎగ్రిమెంట్ ప్రతులు ఈ రోజు అందుతాయని, రేపటి నుండి పంపిణీ గావిస్తామన్నారు.  ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ కార్యక్రమం జిల్లా అంతటా ముమ్మరముగా జరుగుతుందని కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.  పెంచిన గడువు ఈ నెల 20వ తేదీలోగా పట్టాలు పంపిణీ పూర్తి అవుతుందని  పేర్కొన్నారు.  ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బి. కృష్ణారావు, జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ పి. శ్రీనివాసరావు, డ్వామా ప్రాజెక్టు డైరక్టర్ సందీప్, పంచాయితీ రాజ్ ఎస్ఇ సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, సర్వశిక్ష అభియాన్ పిఒ మల్లిఖార్జున రెడ్డి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పిడి సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-05 18:19:44