1 ENS Live Breaking News

ఆసుపత్రికి వెళ్లి మరీ పించన్లు అందజేత..

విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను పక్కనబెట్టి, మొదటి రోజే జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీని దాదాపు పూర్తి చేసింది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 5 గంటలకే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి, బయోమెట్రిక్ తీసుకొని పింఛన్ సొమ్ము అందజేశారు. పొలాల్లోకి వెళ్లి, పొలం పనులు చేస్తున్న వారికి కూడా, వారి పింఛన్ సొమ్ము ముట్టజెప్పారు. అలాగే ఆసుపత్రిలో చేరిన వృద్దులకు కూడా, వారు ఉన్న వార్డులోకి వెళ్లి పింఛన్ ఇచ్చారు. దత్తి రాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన వృద్ధుడు ఇమంది ఆదినారాయణ అనారోగ్యంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరగా, గ్రామ వాలంటీర్ పైడిరాజు పెద్దాసుపత్రికి వెళ్లి పింఛన్ అందజేశారు. మొత్తం మీద జిల్లాలో మొదటి రోజే సుమారు 95 శాతం మందికి పింఛన్ పంపిణీ పూర్తి అయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో, డిఆర్డీఏ పిడి కె.సుబ్బారావు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Vizianagaram

2021-01-01 19:02:28

‘’కోవిడ్-19 వాక్సిన్ ట్రైయల్ రన్’’

‘’కోవిడ్-19 వాక్సిన్ ట్రైయల్ రన్’’ను శనివారం జిల్లాలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.  కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరం లో శుక్రవారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి జిల్లా కలెక్టరు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కరోనా వాక్సిన్ వేయుటకు ముందుగా విధి విధానాలు పక్కాగా నిర్వహించేందుకు ట్రైయల్ రన్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రైయల్ రన్ ను శనివారం నగరంలో ఈ.ఎన్.టి. ఆసుపత్రి, ప్రథమ ఆసుపత్రి, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, సింహాచలంలలో  నిర్వహించేందుకు ఎంపిక చేశామన్నారు.  ట్రయిల్ రన్ ను దేశంలో నాలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చేపట్టారని, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే దేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నందున ఇటువంటి ట్రయిల్ రన్ నిర్వహించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. వాక్సిన్ ను రవాణా చేసే విధానం, వాక్సిన్ వేసే ప్రదేశం వద్ద వాటిని భద్రపరిచే విధానం, బందోబస్తు విధానం పక్కాగా నిర్వహించాలని అన్నారు.  వాక్సిన్ వేసే కేంద్రంలో  వేచి ఉండేదుకు, వాక్సిన్ వేసేందుకు, పరిశీలనకు మూడు గదులు  ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు చేసేది కేవలం ‘’డ్రై రన్’’ మాత్రమేనని, అంటే ఎటువంటి మందులను లేదా ఇంజెక్షన్లను వేయరని, కేవలం మాక్ డ్రిల్ గా మాత్రమే చేపట్టినట్లు చెప్పారు ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  వాక్సిన్ కేంద్రం వద్ద ఎన్నికల పోలింగు కేంద్రం వద్ద విధంగానే అన్ని ఏర్పాట్లు పక్కాగా జరగాలన్నారు.వాక్సిన్ కేంద్రం వద్దకు జాబితాలో  ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకునే లబ్ధిదారులుగా వైద్య సిబ్బందే ఉంటారని చెప్పారు.  వారిని వాక్సిన్ అనంతరం పరిశీలన (అబ్జర్వేషన్) గదిలో ఉంచి కనీసం 30 నిమిషాలు పరిశీలించడం జరుగుతుందన్నారు.  వాక్సిన్ కేంద్రం వద్ద అంబులెన్సు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి వాక్సిన్ ట్రైయల్ రన్ ప్రారంభం అవుతుందని,  ప్రతి కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ వేసే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వాక్సిన్ కేంద్రంలో బయో వేస్ట్ డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.    వ్యాక్సిన్  వచ్చిన తర్వాత ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సిన్ను వేస్తారని, తరువాత ఫ్రెంట్ లైన్ వర్కర్ లైన రెవిన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, మున్సిపల్ సిబ్బంది అంగనవాడి కార్యకర్తలకు వేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా మిగిలిన శాఖలలో వున్న ఉద్యోగులలో తీవ్ర అనారోగ్య సమస్యలు  (కోమోర్బిడిటీస్) కలిగి ఉన్నవారికి వేయడం జరుగుతుందన్నారు. మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రజలకు వ్యాక్సిన్ వేసే అవకాశం ఉన్నందున మండల తాసిల్దార్ లకు ఈ విషయమై పూర్తి అవగాహన  కల్పించాలని సబ్ కలెక్టర్  రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సృజన జాయింట్ కలెక్టర్లు ఎమ్.వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, పాడేరు ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్.మౌర్య, డిఆర్వో ఏ.ప్రసాద్, ఆర్డీవోలు కె.పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీశివజ్యోతి,   ఏఎంసి ప్రిన్సిపాల్  డాక్టర్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సూర్యనారాయణ, డి.ఆర్.డి.ఏ. పి.డి వి. విశ్వేశ్వరరావు జీవీఎంసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రి, డాక్టర్ దేవిమాధవి, యునిసెఫ్ ప్రతినిధి,  యు.ఎన్.డి.పి.  ప్రతినిధి పావని, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-01 18:29:23

ఏయూలో నూతన సంవత్సర సందడి..

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర సందడి నెలకొంది. ఉదయం నుంచి వర్సిటీ అధికారులు, ఆచార్యులు, ఉద్యోగులు వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజెఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లశ్రీనుబాబు విసిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్‌, ఆచార్య జేమ్స్ ‌స్టీఫెన్‌ ‌తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వీసీ ప్రసాద రెడ్డి... రాజ్యసభ సభ్యులు (ఎం.పి) వి.విజయసాయి రెడ్డిని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2021-01-01 17:53:28

అనంతలో మూడు చోట్ల డ్రై రన్..

కోవిడ్ వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఈ నెల 2వ తేదీన శనివారం డ్రై రన్ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ (గ్రామ,వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం నగరంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ (గ్రా,వా, స మరియు అభివృద్ధి) క్యాంపు కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన డ్రై రన్ నిర్వహణపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న డ్రై రన్ అనేది ఎలాంటి వ్యాక్సిన్ వేయకుండా నిర్వహించే ఒక మాక్ డ్రిల్ లాంటిదన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి డ్రై రన్ ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.  నగరంలో 3 చోట్ల డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు :  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు అనంతపురం నగరంలో 3 చోట్ల డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు జెసి తెలిపారు. డ్రై రన్ ను నగరంలోని ఇందిరా గాంధీ నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో, కిమ్స్ సవేరా హాస్పెటల్ లో, కురుగుంట పీహెచ్సీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సెంటర్లో 3 రూములు ఏర్పాటు చేయాలని, ఒకటి వెయిటింగ్ రూము, రెండోది వ్యాక్సినేషన్ రూమ్, మూడోది అబ్జర్వేషన్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్క సెంటర్ లోనూ ఎంట్రెన్స్ లో పోలీస్, వెయిటింగ్ రూం లో డిజిటల్ అసిస్టెంట్, వ్యాక్సినేషన్ రూం లో ఏ ఎన్ ఎం లేదా స్టాఫ్ నర్స్ లేదా సూపర్ వైజర్ లేదా మెడికల్ అధికారి ఉండాలని, అబ్జర్వేషన్ రూం లో ఆశా వర్కర్ లేదా ఏ ఎన్ ఎం లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి ఒక్క సెంటర్ వద్ద 108 వాహనం సిద్ధంగా ఉండాలన్నారు. ముందుగా డ్రై రన్ లో వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చే వారి ఐడి కార్డు (ఆధార్ కార్డు కాకుండా మరో ఐడి కార్డు)ను పోలీస్ చెక్ చేసి పంపించాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిచేస్తారని, అనంతరం వ్యాక్సినేషన్ రూం లో వ్యాక్సిన్ ను ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్స్ ఇస్తారని, తదనంతరం అబ్జర్వేషన్ రూంలో వ్యాక్సిన్ ను తీసుకున్న వారిని అరగంట ఉంచి వ్యాక్సిన్ వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలన చేస్తారన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారన్నారు. డ్రై రన్ లో వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చేవారికి సంబంధించి కోవిన్ యాప్ లో అప్లికేషన్లు సిద్ధం చేశామని, యాప్ ద్వారా రోజు ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలో ప్రతి రోజు ఎస్ ఎంఎస్ ద్వారా మెస్సేజ్ పంపించడం జరుగుతుందన్నారు.  కోవిన్ యాప్ లో అప్లికేషన్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది పరిశీలించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేయాలి అనేది డ్రై రన్ నిర్వహణ ద్వారా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేసి డ్రై రన్ విజయవంతం చేయాలన్నారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డ్రై రన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో రానున్న నేపథ్యంలో మొదటి దశలో అన్ని రకాల ఆరోగ్య సిబ్బందికి, రెండవ దశలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, 50 ఏళ్ళు పై బడిన వారికి, 50 ఏళ్ల లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మూడవ దశలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక సెంటర్లో ప్రతిరోజూ వంద మందికి వ్యాక్సిన్ వేస్తామన్నారు.  ఈ సమావేశంలో డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డి సి హెచ్ఎస్ రమేష్ నాథ్, డీఈఓ శామ్యూల్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, ఎం హెచ్ వో రాజేష్, ప్రభుత్వ ఆసుపత్రి విభాగాధిపతి డా. సంధ్య, డిటిసి శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-01-01 16:47:15

శనివారం కోవిడ్ ట్రైల్ రన్..

కోవిడ్ వాక్సిన్ ట్రైయల్ రన్ ను శనివారం జిల్లాలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి సమావేశం జరిగింది. వాక్సిన్ వేయుటకు ముందుగా విధి విధానాలు పక్కాగా నిర్వహించుటకు ఈ ట్రైయల్ రన్ ను నిర్వహిస్తున్నారు. ట్రైయల్ రన్ ను శని వారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రాగోలు జెమ్స్ ఆసుపత్రి, పాలకొండ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించనున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోల్డ్ చైన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. కోల్డు చైన్ యూనిట్ నుండి వాక్సిన్ ను రవాణా చేసే విధానం, వాక్సిన్ వేసే ప్రదేశం వద్ద వాటిని భద్రపరిచే విధానం, బందోబస్తు విధానం పక్కాగా నిర్వహించాలని అన్నారు. వాక్సిన్ వేసే కేంద్రంలో వాక్సిన్ వేసే గది, వేచి ఉంటే గది, అబ్జర్వేషన్ గది ఏర్పాటు చేయాలని అన్నారు. వాక్సిన్ కేంద్రం వద్ద ఎన్నికల పోలింగు కేంద్రం వద్ద విధంగానే అన్ని చర్యలు పక్కాగా జరగాలని అన్నారు. వాక్సిన్ కేంద్రం వద్దకు వాక్సిన్ జాబితాలో (ఓటరు జాబితా విధంగా) ఉన్న వ్యక్తులు మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  వాక్సిన్ కు వచ్చే వ్యక్తి తగిన గుర్తింపు కార్డు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన తీసుకునే వ్యక్తికి తగిన మార్కు పెట్టాలని అన్నారు. వారిని వాక్సిన అనంతరం అబ్జర్వేషన్ గదిలో ఉంచి కనీసం 30 నిమిషాలు పరిశీలించాలని అన్నారు. వాక్సిన్ కేంద్రం వద్ద అంబులెన్సు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి వాక్సిన్ ట్రైయల్ రన్ ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. వాక్సిన్ కేంద్రంలో బయో వేస్ట్ డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రం వద్ద విధి విధానాలు, మార్గాలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.         ఈ సమావేశెంలో వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, అదనపు పోలీసు సూపరింటిండెంట్ పి.సోమశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణ మూర్తి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు, డి.ఎస్.పి మహేంద్ర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, ఇపిడిసిఎల్ ఎస్.ఇ ఎన్.రమేష్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, నగర పాలక సంస్ధ ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-01 16:42:24

హెచ్.ఐ.వి బాధితులకు జీవన జ్యోతి..

అనాథ హెచ్.ఐ.వి. బాధితులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సరం సందర్భంగా శుక్ర వారం జిల్లా కలెక్టర్ జె నివాస్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. హెచ్.ఐ.వితో బాధపడటం అందులోనూ అనాథలుగా ఉండటం వంటి అంశాలను స్వయంగా గ్రహించిన జిల్లా కలెక్టర్ కు మానవతాధృక్పధాన్ని మరో సారి చాటుకున్నారు. పేద, బడుగు వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండేందుకు ఆలోచించే కలెక్టర్ నివాస్ మానస పుత్రికగా జీవన జ్యోతి ఆవిర్భవించింది. జిల్లాలో అనాధలుగా ఉన్న చిన్నారులు హెచ్.ఐ.వితో బాధపడుతున్నారని తెలుసుకున్న నివాస్ తక్షణం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. దీని కొరకు విరాళాలు సేకరించి తద్వారా వచ్చిన ఆదాయంతో నడపుటకు నిర్ణయించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ.31 లక్షలు, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు అందించిన విరాళాలు దాదాపుగా కోటి రూపాయలు కార్పస్ నిధిగా ఏర్పాటు చేయడం జరిగింది.  జనవరి నుండి వంద మంది హెచ్.ఐ.వి బాధితులకు పౌష్టికాహారం అందించుటకు గాను ప్రణాళిక శాఖకు చెందిన ఉద్యోగులు ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు నేతృత్వంలో రూ.1,00,116 చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేసారు. ఈ నిధులతో ఈ నెల 25 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమ పిండి, ఒక కిలో పప్పు, రెండు కిలోల పంచదార, ఒక హార్లిక్స్ ప్యాకెట్, గ్రుడ్లు అందించడం నిర్ణయించారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్ధ సభ్యులు విరాళంగా అందించిన దాదాపు రూ.3 లక్షలతో ఆరు నెలల కాలం బియ్యం మినహా ఇతర పౌష్టికాహారంతోపాటు మిగిలిన సరుకులు అందించుటకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బెజ్జిపురం యూత్ క్లబ్ రూ.10 వేలు విరాళంగా అందించడం జరిగింది.         ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి బాధితులకు మంచి పౌష్టికాహారం అవశ్యమన్నారు. పౌష్టికాహారం అందించుటకు జీవన జ్యోతి కార్యక్రమాన్ని రూపకల్పన చేసామన్నారు. ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు, సంస్ధలు విరాళంగా అందిస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సమాజంలో వివిధ కారణాల వలన వివిధ సామాజిక రుగ్మతలతో కొంత మంది బాధపడుతున్నారని, అందులో చిన్నారులు కూడా ఉండటం విచారకరమన్నారు. నూతన సంవత్సరం నుండి వారి బాధలు తొలగాలని, వారికి మంచి భవిష్యత్తు చేకూరాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలని ఆయన పేర్కొంటూ ఎంతో మంది సుహృయులు ఉన్నారని వారు ముందుకు వచ్చి విరాళాలు అందించి బాధితుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని కోరారు.  ప్రణాళిక శాఖ ఉద్యోగులు విరాళాలు అందించుటకు ఎప్పుడూ ముందుండటం ప్రశంసనీయమని ఆయన అన్నారు. 2020 సంవత్సరం కరోనాతో సమస్యలు ఎదుర్కొన్నామని, 2021 సంవత్సరంలో కరోనా పూర్తిగా అంతమై ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉండి హాయిగా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. జీవన జ్యోతి కార్యక్రమాన్ని డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దుర్గా ప్రసాద్ అనే 18 సంవత్సరాల బాలుడు ఉదర సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మంచి వైద్యం అందించుటకు ఆదేశించారు. రెడ్ క్రాస్ నుండి నెలకు రెండు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని కొద్ది నెలలపాటు అందించాలని రెడ్ క్రాస్ అధ్యక్షులు పి.జగన్మోహన రావును ఆదేశించారు.         జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ మాట్లాడుతూ, హెచ్.ఐ.వి బాధితులకు మందులతో పాటు చక్కని పౌష్టికాహారం అందంచాలని తద్వారా ఆరోగ్యం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్ష అన్నారు. ఇందులో భాగంగా జీవన జ్యోతి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. జీవన జ్యోతి కార్యక్రమానికి దాతలు విరాళాలను అందించవచ్చని చెప్పారు. జీవన జ్యోతి అకౌంట్ నంబరు – 142710100074446, ఐ.ఎఫ్.సి కోడ్ యు.బి.ఐ.ఎన్ 0814270, యూనియన్ బ్యాంకు, కలెక్టరేట్ బ్రాంచ్ కు అందించవచ్చని కోరారు.         ఈ కార్యక్రమంలో బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం.ప్రసాద రావు, రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్య కుమార్, డి.ఆర్.డి.ఏ పరిపాలన అధికారి దొర, సి.పి.ఓ కార్యాలయ డిప్యూటి ఎస్.ఓ వరహాల రావు, సంజీవ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-01-01 16:39:07

చిరువ్యాపారుల జీవనోపాది కల్పన..

తూర్పుగోదావరి జిల్లాలో వీధి విక్ర‌య‌దారులు, చిరువ్యాపారుల‌కు సుస్థిర ఆదాయం ల‌భించే జీవ‌నోపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌‌త్యేక కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్, అచ్యుత‌రామ‌య్య వీధిలో కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో హ‌రిత వీధి విక్ర‌య జోన్ (గ్రీన్ వెండింగ్ జోన్‌)ను ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, జాయింట్ క‌లెక్ట‌ర్లు డా. జి.ల‌క్ష్మీశ‌, కీర్తి చేకూరి, జి.రాజ‌కుమారి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల వ్యాపారుల‌తో మాట్లాడారు. అధికారుల‌తో క‌లిసి అల్పాహారం తీసుకొని, ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించారు. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా వ్యాపారుల‌కు సూచించారు. బ్యాంకుల నుంచి కాకుండా బ‌య‌ట వ్యాపారుల వ‌ద్ద రుణాలు తీసుకొని వ‌డ్డీల ఊబిలో కూరుకు‌పోవ‌ద్ద‌న్నారు. చిరు వ్యాపారుల‌కు అండ‌గా ఉండేందుకు పీఎం స్వ‌నిధి-జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం కింద బ్యాంకుల స‌హ‌కారంతో రూ.10 వేలు అందిస్తున్న‌ట్లు తెలిపారు.  ఈ రుణంపై సంవ‌త్స‌ర వ‌డ్డీని పూర్తిగా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని వివ‌రించారు. తోపుడుబండ్లు, ఇత‌ర వాహ‌నాల ద్వారా వ్యాపారం చేసుకునే వీధి విక్రయ‌దారుల‌కు నాణ్య‌మైన జీవ‌నోపాధి క‌ల్ప‌న ల‌క్ష్యంగా కాకినాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ప్రాంతాల్లో హ‌రిత వీధి విక్ర‌య జోన్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విధానం వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్యకు ప‌రిష్కారం ల‌భించ‌డ‌మే కాకుండా ప్ర‌జ‌ల‌కు శుచిశుభ్ర‌త‌తో కూడిన అల్పాహార విక్ర‌యానికి  వీలవుతుంద‌న్నారు. వీధి విక్ర‌య‌దారుల‌కు ప్ర‌త్యేకంగా గుర్తింపు కార్డులు అంద‌జేసిన‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 2021లో సుఖ‌సంతోషాలు వెల్లివిరియాల‌ని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ సీహెచ్ నాగ‌న‌ర‌సింహా‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-01-01 13:08:22

జనవరి 7లోగా ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తికావాలి..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికి ఇళ్లు పథకం క్రింద పట్టాల పంపిణీ, పొజిషన్ సర్టిఫికేట్  జనవరి 7లోగా లబ్దిదారులందరికి అందాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  ఆదేశించారు.  గురువారం తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎపియంలతో ఇళ్ల పట్టాలు, జగనన్న తోడు, పింఛన్లు పంపిణీ, వై.ఎస్.ఆర్.భీమా, వై.ఎస్.ఆర్. చేయూత తదితర పథకాలపై జిల్లా కలెక్టర్ మండలం వారీగా వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు.  ఈ కార్యక్రమానికి రెండు బృందాలుగా ఏర్పడి, ఒక బృందం పట్టాలు తయారు చేయాలని, రెండువ బృందం పంపిణీ చేస్తూవుండాలని సూచించారు.  సంబంధిత శాసన సభ్యులతో మాట్లాడి నిర్థేశిత గడువులో పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.  7వ తేదీలోగా పంపిణీ చేయలేని ఇళ్ల పట్టాల గురించి కారణాలు వ్రాస్తు వివరణ సమర్పించవలసివుంటుందన్నారు.  డిసెంబరు 25 నుండి పంపిణీ మొదలయిందని, ఇప్పటికే వారం పూర్తయినందున,  ఇప్పటికే 50 శాతం పైన పూర్తిచేయవలసివుందని కాని కొన్ని మండలాలలో 20, 30 శాతం చేసారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఇకపై ప్రతీరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  పింఛన్లు పంపిణీకి సంబంధించి మొదటిరోజే శతశాతం పంపిణీ చేసి ఎప్పటిలాగే రాష్ట్రంలో జిల్లా ప్రధమంగా నిలిచేలా చూడాలన్నారు.   తోడు పథకం క్రింద అందిన దఖాస్తులపై ఎక్కువగా బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, వారితో మాట్లాడుకొని అక్కడికక్కడే పరిష్కరించుకోవాలన్నారు.  తక్కువ పనితీరు చూపిన మండలాలలో కారణాలపై బ్యాంకర్లతో ఎల్.డి.ఎం. శ్రీనివాస్ మాట్లాడారు.  వై.ఎస్.ఆర్. భీమా క్రింద పూసపాటిరేగ, మెరకముడిదాం, భోగాపురం మండలాలు,  బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, సాలూరు మున్సిపాలిటీలలో ఎక్కువ  దరఖాస్తులు పెండింగు వున్నాయని, వాటిని ఆయా బ్యాంకులతో మాట్లాడి రెండురోజుల్లో శతశాతం సాంధించేలా చూడాలన్నారు.  చేయూత పథకం క్రింద ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కోసం వచ్చిన దరఖాస్తులను రుణాల కోసం వెంటనే బ్యాంకులకు పంపాలని ఆదేశించారు.          ప్రభుత్వం పథకాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎంపిడిఓలకు, ఎపిఎంలకు, బ్యాంకుర్లకు కూడా   రిపబ్లిక్ డే  సందర్భంగా ఉత్తమ సేవా పథకాలు అందించడం జరుగుతుందన్నారు.      ఈ వీడియో కాన్ఫెరెన్సులో సహాయ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్ఓ గణపతిరావు, పిడి డిఆర్డిఎ సుబ్బారావు, పశుసంవర్థక శాఖ జె.డి. డా.నరసింహులు, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-31 20:42:23

142 జిఓ ప్రకారంమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు..

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2021-2022 కాల పరిమితి కి సంబంధించి అర్హత ఉన్న జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రిడి టేషన్ ల మంజూరుకు ప్రాథమిక సమావేశం నిర్వహించడం జరిగిందని  జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్ దరఖాస్తు ను కూడా రిజెక్ట్ చేయలేదని, జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 142 లో ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి అర్హులందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేస్తామని తెలిపారు.. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని జర్నలిస్టుల కు    అర్హతలను పరిశీలించి అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరుగుతుం దన్నారు. అక్రిడిటేషన్ మంజూరు కానివారు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర సమాచార శాఖ ఆన్ లైన్ /వెబ్ సైట్ ను రీ ఓపెన్ చేసిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆ కాపీలను సమాచార పౌర సంబంధాల శాఖ, చిత్తూరు కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. అనం తరం అప్లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి వెంటనే రెండవ విడత సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రిడిటేషన్ మంజూ రు చేయడం జరుగుతుం దన్నారు. ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి మెంబెర్ కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు లాల్ జాన్ బాషా, సభ్యులు డిఎంహెచ్ఓ, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలు నాయక్, హౌసింగ్ పిడి పద్మనాభం, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్,  ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Chittoor

2020-12-31 20:37:52

ప్రజలకు పూర్తిస్థాయిలలో సేవలందాలి..

జివిఎంసి పరిధిలోని నాల్గవ, ఐదవ జోన్ లో 47, 63, 64వ వార్డులలో జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు పర్యటించి, 47వ వార్డు కోరమండల్ గేటు, జనతా కాలనీ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ముఖ్యంగా ప్రాధమిక వైద్యశాలను సందర్శించి మందులు లభ్యత, సిబ్బంది హాజరు, రోగుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వార్డు సచివాలయమును పరిశీలించి సిబ్బంది యొక్క హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీలను తనిఖీ చేసారు. తదుపరి 63వ వార్డులోని కణితిలోని రోడ్లు, కాలువలను పరిశీలించి, తడి-పొడి చెత్తను సేకరించే పద్దతిని పారిశుద్ధ్య కార్మీకులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లను, కాలువలను శుభ్రంచేసి చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు. 64వ వార్డులో గాజువాక తదితర ప్రాంతాలలో పరిశీలించారు. ప్రజా మరుగుదొడ్లను పరిశీలించి, వాటి నిర్వహణను అడిగితెలుసుకున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, రిపేర్లు ఉంటే వెంటనే చేయించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 47, 63, 64వ వార్డులలో శానిటరీ ఇన్ స్పెక్టర్లు, ఆయా వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-31 20:36:21

ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పాలి..

పిల్లలకు ఉన్నత ప్రమాణాలను అందించడంలో, సత్ప్రవర్తన నేర్పడంలో  తలితండ్రుల పాత్ర చాలా కీలకం అని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన " యువత రేపటి భవిష్యత్ కొరకు నేటి సంసిద్ధత " స్వీయ సాధికారత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ సమాజంలో పలు అంశాలపై స్వీయ అవగాహన కలిగి ఉన్నప్పుడు విద్యార్థి దశలో పెట్టుకున్న లక్ష్యాలను సాధించిన విజయాలును పొందగలరు అని పేర్కొన్నారు. 20సం.ల నుంచి 30సం.ల వయసు గల యువతీ యువకులకు సరియైన స్వీయ అవగాహన లేకపోవడం వల్ల చెడు అలవాట్లుకు బానిసై సాదించాకలేకపోతున్నారని చెప్పారు. తద్వారా యువతీ, యువకులకు చట్టం పట్ల అవగాహన లేకపోవడం వలన  నేర  వ్యవహారాల్లో చిక్కుకొని దురదృష్టవసాత్తు దోషులుగా మారుతున్నారన్నారని వివరించారు. కావున తల్లితండ్రులు పిల్లలుకున్న సమస్యలు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి మార్గాలను చూపించి వారికున్న ఒత్తిడులను తగ్గించాలని పేర్కొన్నారు.  అదేవిధంగా పిల్లలు కూడా మీకు ఎంత పెద్ద సమస్య ఉన్న తల్లితండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులు పాలుపంచుకొని ప్రశాంత వాతావరణంలో సులువుగా సమస్యలను పరిష్కరించకొని ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని యస్.పి స్పష్టం చేసారు. తమ పిల్లలు ఏమి చేస్తున్నారన్న విషయాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని, వక్రమార్గంలో వెళ్ళే వారిని సన్మార్గంలో పెట్టి, వారికి దిశా నిర్దేశం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సన్నిహితంగా, ప్రేమతో మెలగడం వలన పిల్లలు తప్పు దారుల్లో నడిచే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు.పిల్లలు తమ ఇబ్బందులను,అభిప్రాయాలను స్వేచ్ఛగా వారి తల్లిదండ్రులతో పంచుకొనే అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విలువైన  సమయంను వృధా చేసుకోకుండా మన చుట్టూ ఉన్న అవకాశాలును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రతి రోజు దినపత్రికలో ప్రచురించబడిన ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పఠించి  సమాజంలో జరుగుతున్న పరిణామాలుపై అవగాహన చేసుకోవాలన్నారు.                       ఈ కార్యక్రమంలో ఏ.యస్.పి పి.సోమశేఖర్, టి.పి.విఠలేశ్వరరావు, డి.యస్.పి ( ట్రాఫిక్ ) సిహెచ్.జి.వి.ప్రసాద్, డి.యస్.పి ఎం.మహేంద్ర, డి.యస్.పి ( దిశ ) వాసుదేవరావు, సి.ఐలు అంబేద్కర్, పి.వి.రమణ , రిమ్స్ ఫిజియాలజీ వైద్యులు డా.అనురాధ, డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం హెచ్.ఓ.డి కావ్యజ్యోత్న, జి.యం.ఆర్. కళాశాల సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తుమ్మలపల్లి గీతమ్మ, గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-12-31 20:30:36

351 నూతన అక్రిడిటేషన్లు మంజూరు..

శ్రీకాకుళం జిల్లాలో నూతన అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి (డి.ఎం.ఏ.సి) నిర్ణయించింది. డి.ఎం.ఏ.సి సమావేశం జిల్లా కలెక్టర్ జె నివాస్ అధ్యక్షతన గురు వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. జిల్లా, మండల అక్రిడిటేషన్లకు వివిధ మీడియా సంస్ధలకు చెందిన 1,455 మంది ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించారు. వీటిలో ప్రభుత్వ ఉత్తర్వులు 142కు అనుగుణంగా కేవలం 19 మంది సమర్పించగా, 351 మంది కొన్ని పత్రాలు మాన్యువల్ గా సమర్పించడం జరిగింది. పూర్తి స్ధాయిలో సమర్పించిన దరఖాస్తులను అర్హత మేరకు మంజూరు చేయడం జరిగింది. మాన్యువల్ గా సమర్పించిన వాటిపై సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ నుంచి వివరాలు పొందిన మేరకు జారీ చేయుటకు నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నివాస్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధికి మీడియా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఆర్.టి.సి డిప్యూటి సి.టి.ఎం జి.వరలక్ష్మి, కార్మిక శాఖ సహాయ కార్మిక శాఖ అధికారి బి.కొండల రావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-31 20:29:07

గ్రంధాలయ సామాగ్రి కొనుగోలుకు ఆమోదం..

గ్రంథాలయాలకు  అవసరమగు  వస్తు సామగ్రి కొనుగోలుకు ఆమోదించడం జరిగిందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. గురువారం సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం  జరిగింది.  ఈ సందర్భంగా జె.సి. మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ ఛార్జి కె.శ్రీనివాసులు మాట్లాడుతూ, గ్రంధాలయాలలో మంచి పుస్తకాలను అందుబాటులో వుంచడంతో పాటు పాఠకులు చదువుకోవడానికి సౌకర్యాలు కలుగచేయాలని, లైబ్రరీలలో మౌలిక సదుపాయాలను కలుగచేయాలని అన్నారు. ఇందు నిమిత్తం  గ్రంథాలయాలకు అవసరమగు  పుస్తకాలను, ఫర్నిచర్ కొనుగోలుకు ఆమోదించినట్లు తెలిపారు.  జిల్లాలో కేంద్ర గ్రంథాయలయంతో పాటు 44 శాఖా గ్రంథాలయాలు, 5 గ్రామీణ గ్రంథాలయాలకు గత మూడు సంవత్సరాలుగా పాఠకులకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసియుండలేదని తెలిపారు.  ఈ ఆర్ధిక సం.లో జిల్లా కేంద్రగ్రంధాలయంతో పాటు జిల్లాలోని అన్ని శాఖా గ్రంధాలయాలకు రూ.40 లక్షలతో పుస్తకాలను కొనుగోలు చేయుటకు ఆమోదించినట్లు తెలిపారు. అదే విధంగా  2020-21 సం.నికి గాను  రూ. 5 లక్షలతో ఫర్నిచర్ కొనుగోలుకు ఆమోదించినట్లు తెలిపారు.   జిల్లా కేంద్ర గ్రంధాలయం  మరియు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయానికి రూ. 1.50 లక్షలతో కంప్యూటర్లు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలపడమైనదని, రూ. 19 లక్షలతో కేంద్ర గ్రంధాలయం ప్రహారీ గోడ నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టుటకు ఆమోదించడమైనట్లు ఆయన తెలిపారు.   విద్యార్ధులకు అవసరమగు కాంపిటీటివ్ బుక్స్, రిపరెన్స్ బుక్స్ అందుబాటులో వుంచాలని తెలిపారు. పుస్తకాలను అమర్చడానికి బుక్ రాక్స్, పాఠకులకు సదుపాయం కలుగచేసేందుకు గాను రీడింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజా, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ,  జిల్లా పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, గ్రంధాలయ సంస్ధ సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.

Srikakulam

2020-12-31 20:25:12

పోటీపరీక్షలపై అవగాహన ఉండాలి..

విద్యార్ధులు పాఠ్యాంశాలతో పాటు పోటీ పరీక్షలపై అవగాహన కలిగి వుండాలని జిల్ల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.  గురువారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో విద్యార్ధులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందచేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిగ్రీ చదువుకుంటూనే పోటీ పరీక్షలపై అవగాహన కలిగి వుండాలన్నారు.  డిగ్రీ అనంతరం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. పరీక్షలకు సిధ్ధం కావాలన్నారు.  ఇందుకు పోటీ పరీక్షల పుస్తకాలు దోహదపడాతయని తెలిపారు.  నిర్ణీత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు.  తాను మధ్యతరగతికి చెందిన వాడినని, పట్టుదలతో ఐ.ఎ.ఎస్. ను సాధించడం జరిగిందని తెలిపారు.  ప్రతీ కలేజీకి ఎన్.సి.ఇ.ఆర్.టి. మెటీరియల్ ను అందిస్తున్నామని, తానే స్వయంగా పుస్తకాలను సెలక్ట్ చేయడం జరిగిందని తెలిపారు.  ఇటీవల నిర్వహించిన సెక్రటేరియట్ పరీక్షలలో డిజిటల్ అసిస్టెంట్లు, ఏనిమల్ హస్బెండ్రీ పోస్టులు చాలా ఖాళీగా వున్నాయని, పోటీ పరీక్షలపై అవగాహన లేకపోవడం వలన ఈ విధంగా జరిగిందని  తెలిపారు.  జెనరల్ నాలెడ్జి పై అవగాహన కలిగి వుండాలని తెలిపారు. బ్యాంకులలో చాలా పోస్టులు ఖాళీగా వున్నాయని తెలిపారు.  పాఠ్యాంశాలతో పాటు ఇతర నైపుణ్యాలను పెంచుకోవాలని తెలిపారు.  20 నుండి 30 సం.లలోపు వయస్సు చాలా కీలకమని, ఈ సమయంలోనే భవిష్యత్తుకు పునాదులు వేయాలని తెలిపారు.  ప్రతీ రోజు ఇంగ్లీషు న్యూస్ పేపర్లను చదవడం ద్వారా మంచి నాలెడ్జ్ వస్తుందన్నారు. కాలేజీలో  ప్రతీ శని, ఆదివారాలలో మంచి నిపుణులతో పోటీ పరీక్షలపై  తర్ఫీదును ఇవ్వడానకి  యోచిస్తున్నట్లు  తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయని, జిల్లాలో మంచి పర్యాటక స్థలాలు,  సంస్కృతి, తదితర అంశాలపై యూ ట్యూబ్  నిర్వహించడానికి ముందుకు రావాలన్నారు.  వారికి అన్ని రకాలుగా సాయం అందించడానికి సిధ్ధంగా వున్నామని తెలిపారు.  విద్యార్ధులు పోటీ పరీక్షల పుస్తకాలను సద్వినియోగ పరచుకుని మంచి ఉద్యోగాలను పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందరికీ 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం పోటీ పరీక్షల పుస్తకాలను విద్యార్ధులకు అందచేసారు.                         ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సి.ఇ.ఓ. శ్రీనివాసరావు, మేనేజరు ప్రసాదరావు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వై.లక్ష్మి, వైస్-ప్రిన్సిపాల్  జి.జనార్ధన్ నాయుడు, జె.కె.సి. కో-ఆర్డినేటర్ డా.పైడితల్లి, ఐ.ఓ.క్యూ. ఎ.సి.  కో-ఆర్డినేటర్ యు.వర్మ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.సత్యన్నారాయణ, గేదెల ఇందిరా ప్రసాద్, కాలేజీ అధ్యాపకులు, విద్యార్ధినీవిద్యార్ధులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-31 20:22:00