1 ENS Live Breaking News

విజయసాయిరెడ్డి కాన్వాయ్ పై దాడి హేయమైనది..

విజయనగరం జిల్లా రామతీర్ధంలో జరిగిన దుర్ఘటన పరిశీలించేందుకు వెళ్లిన  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి కాన్వాయి పైన జరిగిన దాడి హేయమైన చర్య అని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వకర్త కెకె రాజు అన్నారు. శనివారం విజయనగరంలో జరిగిన దాడికి కి నిరసనగా విశాఖలో జాతీయ రహదారి తాటిచెట్లపాలెం కూడలిలో నల్ల వస్త్రాలు, ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ, చంద్రబాబు డైరెక్షన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం చాలా దుర్మార్కపు చర్య అని ఆరోపించారు. ఆయన కాన్వయ్ పై దాడి జరిగినా విజయసాయిరెడ్డి హుందాగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని అడ్డుకునేందుకు దేవతా మూర్తులతోనూ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చంద్రబాబు ఈ విశాఖలో ఆగి విశాఖకు పరిపాలన రాజధాని వద్దు అని చెప్పే దమ్ము ఉందా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు,వార్డు అధ్యక్షులు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-02 20:50:30

లేఔట్ దగ్గరే 100% ఇంటి పట్టాలు పంపిణీ..

ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే 100 శాతం లబ్దిదారులకు  ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని కట్రామయ్య ( నాని ) తెలిపారు.  శనివారం సాయంత్రం  బందరు మండలంలోని తపసిపూడి  గ్రామంలో 2 ఎకరాల 18 సెంట్లలో 77 మంది అర్హులైన వారిలో లబ్ధిదారులకు 83 ప్లేటులలో ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేశారు.   ఈ  సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణి  కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఒక్క స్థాయిలో అధికారులంతా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే ఇంటి పట్టాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని, ఖచ్చితంగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన రోజున లేఔట్ స్థలంలోనే ఎలాంటి ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు పట్టాలివ్వాలన్నారు.                         ఈ కార్యక్రమంలో డ్వామా పి డీ , ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ , మచిలీపట్నం తహసీల్దార్‌ డి .సునీల్ బాబు , మాజీ  జడ్‌పీటీసీ సభ్యులు లంకె వెంకటేశ్వరరావు ( ఎల్వీయార్ ) , రాష్ట్ర  గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా , మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్   పార్టీ  అధికార ప్రతినిధి మాదివాడ రాము,  రెవిన్యూ ఇన్స్పెక్టర్లు యాకూబ్, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.

bandaru

2021-01-02 19:46:18

ఆన్ లైన్ క్లాసులకు అమ్మఒడి లింకు పెట్టొద్దు..

‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత  జనవరి 9వ తేదీన తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేయనుందని  ఆ డబ్బులు పడక ముందే కొందరు ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు చెప్పినందుకు ఫీజులు తమకు చెల్లించాలని తల్లితండ్రులపై తీవ్ర వత్తిడి తీసుకొస్తుందని ఇది ఎంత మాత్రం తగదని  రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హెచ్చరించారు. శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి నేరుగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం సూచించారు. తొలుత జిల్లా విద్యాశాఖాధికారీ కార్యాలయం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ 1 బత్తుల సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ గవర్నమెంట్ ఎక్సమినేషన్స్  జి. శ్రీనివాస్,  రాష్ట్ర ఎంజీవో నాయకులు డిఇ ఓ కార్యాలయ సూపరెండెంట్ పాండ్రక వెంకటేశ్వరరావు లు మంత్రి పేర్ని నానిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ  సందర్భంగా మంత్రి పేర్ని నాని వారితో మాట్లాడుతూ, జనవరి 5వ తేదీ వరకు అమ్మఒడి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్న సంగతి, జనవరి 6వ తేదీన ‘అమ్మఒడి’ అర్హుల తుది జాబితాను అందరికి తెలియచేయాలని సూచించారు.  రెండో విడత ‘అమ్మఒడి’ కింద ప్రభుత్వం  రూ. 6,450 కోట్లు కేటాయించిందన్నారు . గతేడాది ‘అమ్మఒడి’ లబ్ధిదారులు కూడా ఈ రెండో విడతకు అర్హులేనని.. పారిశుద్ధ్య కార్మికులకు కూడా ‘అమ్మఒడి’ ఇస్తామని మంత్రి చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం ( 2022 ) నుంచి  బందరు మండలం బొర్రుపోతుపాలెం గ్రామంలో పాఠశాలను హైస్కూల్ గా అభివృద్ధి చేయాలనీ సూచించారు. పెడన హై స్కూల్ కు ఈ గ్రామం నుంచి ఆడపిల్లలు వెళుతున్నారని, ఆటోలలో సైతం వారిని ఎక్కించుకోవడం లేదని వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.ఎ పి ఎంజీవోల తూర్పు కృష్ణా జిల్లాశాఖ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు వుల్లి కృష్ణ ,సాయికుమార్ జెఎసి కన్వీనర్ దారపు శ్రీనివాస్, టౌన్ అధ్యక్ష ,కార్యదర్శులు ఆకూరి శ్రీనివాసరావు ,రమేష్,మహిళావిభాగం. గౌరి,రమాదేవి ఇతర కార్యవర్గ సభ్యులు 2021 నూతన ఆంగ్ల సంవత్సర టేబుల్ కాలండర్ ను మంత్రి పేర్ని నాని చేత ఆవిష్కరింపచేశారు. తోట రఘుకాంత్ ( చిన్నా ) మాస్టారు ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఐక్య ఉపాధ్యాయ సంఘ నేతలు మంత్రి పేర్ని నానిను కల్సి తమ డైరీ , క్యాలండర్ ను ఆవిష్కరింపచేశారు. మచిలీపట్నం  జైహింద్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం వి ఎస్ సూర్య నారాయణ మంత్రి పేర్ని నానికి తమ హైస్కూల్  విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య వివరించారు. పల్లె తుమ్మలపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ  బస్సు ఉదయం పూటే మాత్రమే వస్తుందని, ఆ గ్రామం నుంచి తమ పాఠశాలకు 35 మంది విద్యార్థిని విద్యార్థులు వస్తుంటారని మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత బస్సు ఉండటం లేదని ,ఆటోలు సరిగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మంత్రికి తెలిపారు. గుడ్లవల్లేరు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన దివ్యా0గుడు ఓగంటి శ్రీనివాసరావు మంత్రి వద్ద తన కష్టాన్ని మొరపెట్టుకున్నారు. తన మూడు చక్రాల సైకిల్ రిక్షా నడపడం ఎంతో భారంగా ఉందని తనకు ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ కావాలని అభ్యర్ధించారు.

Machilipatnam

2021-01-02 19:37:51

2021-01-02 19:27:49

మళ్లీ మళ్లీ రాని సొంతింటి పండుగ ఇది..

పేద వారికి, అర్హత ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని, అందులో భాగంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి పట్టాల పంపిణీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో "నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు" పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి, కుంచిత వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. మడకశిర నియోజకవర్గంలో 12,800 మందికి ఇంటి పట్టాలు అందిస్తున్నామని, బాత్రూంలు, వంట రూమ్, హాల్, వరండా, బెడ్రూమ్, కిటికీలు, వెంటిలేటర్లు, ఫ్యాన్, ట్యూబ్ లైట్లతో సహా ఇల్లును ప్రభుత్వం నిర్మించి ఇస్తోందన్నారు. ప్రతి లేఔట్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందులో లబ్ధిదారుల వివరాలను, ఎవరికీ ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఇచ్చారు అనే వివరాలను పొందుపరిచామని, ప్రతి లేఔట్ ను ఇంటిగ్రేటెడ్ కాలనీలుగా తీర్చిదిద్దుతాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1045 లేఔట్ కాలనీలలో 3 లక్షల మొక్కలను నాటించామన్నారు. ప్రతి లేఔట్ ను అన్ని రకాల అభివృద్ధి చేసి పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  పాదయాత్ర హామీని అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి - ఎమ్మెల్యే తిప్పేస్వామి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారని  ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని సంకల్పించి ఇల్లు మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశారని, 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 50,940 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. పేదలందరికీ ఇల్లు కింద పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికి ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటి పట్టాల పంపిణీ కోసం జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ముందుండి నడిపించారని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందువరుసలో ఉందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే హేమావతి చెరువుకు నీటి సరఫరాకు అవసరమైన కాలువ తవ్వకం పనులకు అనుమతి ఇవ్వాలని, హేమావతి చెరువుకు నీరు వెళ్లేందుకు కాలువకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అలాగే గుడిబండ పీహెచ్సీకి వెంటనే డిప్యుటేషన్ కింద ఒక డాక్టర్ ను నియమిస్తామన్నారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కుంచిత వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు కింద ఇల్లు లేని నిరుపేదలు అందరికీ పండుగ రోజని, ప్రైవేట్ లేఔట్ లకి దీటుగా ప్రభుత్వ లేఔట్ ను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. గుడిబండ మండలం లో 21 లేఔట్ లను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కుంచిత వక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ నేత్రావతి, పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి,  డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, ఏపీ డి లక్ష్మీనారాయణ, హౌసింగ్ ఏఈ పెంచలయ్య, తహశీల్దార్ మహబూబ్ పీరా, ఎంపీడీవో నాగేంద్ర కుమార్, ఈ ఓఆర్డీ నాగరాజు నాయక్, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Gudibanda

2021-01-02 19:25:03

నాబార్డ్ పనులను వేగవంతం చేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో నాబార్డ్ సంస్థ ద్వారా చేపట్టే వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.   శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి జిల్లాస్థాయి నాబార్డ్ గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పై జూమ్ వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగ్జిక్యూటింగ్ ఎంటీటీస్( Executing Entities), వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గ్రామీణ మౌలిక సదుపాయాలు కింద చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. తదుపరి ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసి నాబార్డుకు అందించాలని కలెక్టర్ తెలిపారు. నాబార్డు సంస్థ ద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు కింద వివిధ ప్రాంతాల్లో ప్రారంభించిన ప్రాజెక్టుల పనుల వివరాలు, ఇప్పటికీ జిల్లాలో ప్రారంభంకాని ప్రాజెక్టులు వివరాలు నాబార్డ్ అధికారులకు సమర్పించాలన్నారు. ఆయా సంస్థలు చేపట్టిన  ఆర్ఐడిప్ ప్రాజెక్టుల తాజా స్థితి,పనితీరును ప్రాజెక్టుల వారిగా కలెక్టర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ వీసీ లో నాబార్డు డిడి ఎం డా.వై సోము నాయుడు, ఐసిడిఎస్ పిడి డి.పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జెడి డా.ఎన్ టి. శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి. గాయత్రిదేవి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్, రోడ్డు భవనాల, పంచాయతీ రాజ్, పారిశుద్ధ్య శాఖ ఇంజనీర్లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-01-02 19:21:00

9న నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన..

రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుందనున పక్కాగా ఏర్పాట్లు  చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికాకులను ఆదేశించారు.  శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయములో జిల్లా కలెక్టర్  శ్రీ  కె. వి. ఎన్  చక్రధర్ బాబు ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో  ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం యేర్పాట్లు గురించి జిల్లా అధికారులతో సమావేశo నిర్వహించారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా ఈ నెల 9వ తేదీన అమ్మవొడి పధకాన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాలో  ప్రారంబించనున్నoధున, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగ  పర్యటనకు సoభందించిన యేర్పాట్లు ఈ నేల 8వ తేదీ నాటికి  పూర్తి చేయాలన్నారు. పర్యతంకు సంబందించిన యేర్పాట్ల పై అధికారులకు   పలు సూచనలు జారీ చేశారు. అధికారులందరు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించిన యేర్పాట్లలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కార్యక్రమాన్ని  విజయవంతం  చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా హరేందిర  ప్రసాద్,  డా. ప్రభాకర్ రెడ్డి , డీ ఆర్ వొ శ్రీ నాగేశ్వర రావు, ఆర్ డీ వొ శ్రీ హుస్సేన్ సాహెబ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ . దినేష్ కుమార్ , అడిషనల్ ఎస్ పి . శ్రీమతి నాగరత్నం,  జిల్లా అధికారులు  పాల్గొన్నారు. 

Nellore

2021-01-02 19:15:54

ప్రజల ముంగిట సేవలకే సచివాలయాలు..

భారత దేశ చరిత్రలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ సొంతమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ప్రజాసేవకులమే అని గుర్తించుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజుపేట 37 వ డివిజన్ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో 36 వ డివిజన్  సచివాలయంలో 37 వ డివిజన్ సచివాలయ కార్యకలాపాలు నిర్వహించేవారని, ప్రజలకు మేలైన సౌకర్యాలు ఒనగూరాలంటే 37 వ డివిజన్ కు  ప్రత్యేక సచివాలయం ఉండాలని ఒక భవనంను అద్దెకు తీసుకొన్నట్లు తెలిపారు. వ్యవస్థలోకి మార్పు తీసుకువచ్చే విధంగా పరిపాలనలో అవినీతి ఎక్కడా లేకుండా చేయాలనే తపనతో, విపక్షకు తావులేకుండా చేసిన ప్రయత్నమే ఈ గ్రామ సచివాలయమని మంత్రి పేర్ని నాని తెలిపారు.  ఏ సేవ అయినా కూడా పూర్తిగా, పారదర్శకంగా, వివక్షకు తావు లేకుండా వాలింటర్లు  సేవలందిస్తారని అర్హత ఉన్న వారికి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని 72 గంటల్లోనే సంక్షేమ పథకాలు అర్హులకు  అందజేస్తామని మంత్రి వివరించారు. ఆషా బేగం అనే మహిళ తనకు జగనన్న చేయిత పథకం పడలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా సంబంధిత  వాలింటర్ ను పిలిచి ఆమెకు ఎందుకు మంజారు కాలేదో పూర్తి వివరాలు తెలుసుకొని తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే అంకెం నాంచారయ్య తనకు ఇళ్ల స్థలం రాలేదని మంత్రికి తెలిపారు.  పిండాల దొడ్డిలో చెత్తాచెదారాలు పడవేయడంతో ఆ ప్రాంతం అంతా అపరిశుభ్రంగా కనబడతుందని కొందరు మహిళలు మంత్రికి తెలిపారు. తనకు బోదకాలు వ్యాధి సోకిందని తనకు వికలాంగుల పించన్ వచ్చే అవకాశముందా పెనుబోతు సూర్యకుమారి అనే వృద్ధురాలు మంత్రిని అభ్యర్ధించింది. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం  మునిసిపల్ కార్పొరేషన్  కమీషనర్ కె . శివరామకృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మునిసిపల్ ఎం ఇ  త్రినాధ్ బాబు,  మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్ ,పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాంబాబు, 37 వ  డివిజన్ పార్టీ ఇంచార్జ్ ఐనం తాతారావు, నూకల ప్రసాద్, జవ్వాది రాంబాబు, వివిధ డివిజన్ ఇంచార్జ్ లు  రాంప్రసాద్ , గూడవల్లి నాగరాజు, మహమ్మద్ రఫీ,  బూరుగ రామారావు, కాగిత జవహర్ ( బున్నీ ) తదితరులు పాల్గొన్నారు.

Machilipatnam

2021-01-02 18:39:31

జగనన్న తోడులో మనమే టాప్..

అనంతపురం జిల్లాలో చిరు వ్యాపారులు మరియు సంప్రదాయ వృత్తిదారులను మైక్రో ఫైనాన్స్ ఊబి నుంచి రక్షించేందుకు 2019 నవంబరు 25 నాడు  రాష్ట్ర ప్రభుత్వం ప్రరిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న తోడు పథకం నిర్వహణలో జిల్లా టాప్ లో నిలిచిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా జగనన్న తోడుకు అర్హులుగా గుర్తించిన 25691 మందిలో 25035 మందికి రూ.10000 లను సున్నా వడ్డీకి అందించామన్నారు. మిగిలిన 656 మందికి వెంటనే సున్నా వడ్డీకే రుణం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 97.45 శాతం మంది అర్హులకు రుణాలు అందించి తోడందించడంలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి 17269 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 7766 లబ్ధిదారులున్నారని తెలిపారు. గ్రామాలలో 226 మంది, పట్టణాలలో 430 మందికి ఇంకా 'తోడు' అందాల్సి ఉందన్నారు.   తోపుడు బండ్లు, గంపల్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, బొమ్మల తయారీ దారుల వంటి వర్గాలకు వారికి జగనన్న తోడు పథకం అండగా నిలిచిందని కలెక్టర్ తెలిపారు. గతంలో ఐదు రూపాయలు, పది రూపాయల వడ్డీకి తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారులు అప్పుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు, పేద ప్రజలకు 'జగనన్న తోడు' మేలు చేస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే చిరు వ్యాపారులకోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పీఎం స్వానిధి పథకం నిర్వహణలోనూ జిల్లా ముందుందన్నారు. పీఎం స్వానిధి ద్వారా 8662 మంది చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణం అందించామన్నారు.  జగనన్న తోడు పథకం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంపల్లో, తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకునే వారూ మరియు ఇతర సంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి రూ.10000లు సున్నా వడ్డీకి రుణం లభిస్తుందని, పీఎం స్వానిధి పథకం పట్టణాలలోని చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీకి రూ.10000 లు ఋణంగా లభిస్తుందని,స్వానిధి పథకంలో డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా వడ్డీ కంటే ఎక్కువ మొత్తాన్ని రుణ గ్రహీతలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. 

Anantapur

2021-01-02 18:36:11

16 మంది డిజిటల్ అసిస్టెంట్లకు పోస్టింగ్..

విజయనగరం జిల్లాలోని స‌చివాలయ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించిన 16 మంది గ్రేడ్-6 డిజిట‌ల్ అసిస్టెంట్ల‌కు, జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్ శ‌నివారం పోస్టింగ్ ఆర్డ‌ర్లు ఇచ్చారు. ప్ర‌తీఒక్క‌రూ చిత్త‌శుద్దితో, అంకిత‌భావంతో ప‌నిచేసి, మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఆయ‌న‌ కోరారు. మరోవైపు  మ‌నం-మ‌న ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మంలో భాగంగా మొద‌టివిడ‌త ఎంపిక చేసిన గ్రామ పంచాయితీల‌ను ఓడిఎఫ్ ప్ల‌స్ గ్రామ పంచాయితీలుగా ప్ర‌క‌టించేందుకు క‌ర‌స‌త్తు ప్రారంభ‌మ‌య్యింది. దీనిలో భాగంగా జిల్లా పంచాయితీ అధికారి సునీల్ రాజ్‌కుమార్‌, జూమ్ కాన్ఫ‌రెన్స్ ద్వారా పంచాయితీ విస్త‌ర‌ణాధికారులు, డివిజ‌న‌ల్ పంచాయితీ అధికారులు, పంచాయితీ కార్య‌ద‌ర్శుల‌తో శ‌నివారం జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఓడిఎఫ్ ప్ల‌స్‌కు అనుస‌రించవ‌ల‌సిన విధివిధానాల‌ను ఈ సంద‌ర్భంగా డిపిఓ వివ‌రించారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా కో-ఆర్డినేట‌ర్ డి.స‌త్య‌నారాయ‌ణ‌, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-01-02 17:27:53

ఆరోగ్యశ్రీలో అధనంగా 683 వ్యాధులు..

ఆరోగ్యశ్రీ ఆసరా పథకంలో అదనంగా 683 వ్యాధులను చేర్చడం జరిగిందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు శనివారం  తెలియచేసారు.  రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా ప్రస్తుతం 836 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతున్నదని  తెలిపారు. ఈ 836 వ్యాధులతో పాటు  అదనంగా 683 వ్యాధులను జతపరచి మొత్తం 1519 వ్యాధులకు ఇకపై ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ద్వారా  చికిత్స అందించడం జరుగుతుందని జె.సి. తెలిపారు.  ఈ పథకం ద్వారా రోజుకు రూ.225ల చొ.న గరిష్టంగా నెలకు రూ.5,000 లను చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో వారి  బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆరోగ్య మిత్రలకు సరైన బ్యాంకు ఖాతా వివరాలను తెలియపరచాలని, ఆరోగ్య శ్రీ ఆసరా పథకాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.

Srikakulam

2021-01-02 17:22:48

శ్రీకాకుళంలో డ్రైరన్ విజయవంతం..

శ్రీకాకుళం కోవిడ్ వాక్సిన్ డ్రై రన్ శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, జెమ్స్ లతో పాటు పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రై రన్ ను నిర్వహించారు. కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని పక్కాగా నిర్వహించుటకు ముందుగా ఈ డ్రై రన్ ను నిర్వహించారు. ప్రతి కేంద్రంలో వేచి యుండుగది, వాక్సిన్ వేసే గది, వాక్సిన్ అనంతరం వ్యక్తుల స్ధితిగతులను పరిశీలించే గది (అబ్జర్వేషన్ రూమ్) ని ఏర్పాటు చేసారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోల్డు చైన్ స్టోరేజ్ ప్రదేశాన్ని  ఏర్పాటు చేసారు. వాక్సిన్ నిల్వ చేసే ప్రదేశం నుండి వాక్సిన్ కేంద్రం వరకు వాక్సిన్ ను రవాణా చేయడం, వాక్సిన ఇచ్చే విధానాన్ని డ్రై రన్ లో నిర్వహించారు. ఇందుకు ప్రతి కేంద్రంలో 25 మందితో వాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాక్సిన్ వేయించుకునే వ్యక్తి పేరు వాక్సిన్ జాబితాలో విధిగా నమోదై ఉండాలి. వాక్సిన్ జాబితాలో ఉన్న వ్యక్తి వాక్సిన్ వేయించుకొనుటకు గుర్తింపు కార్డుతో రావలసి ఉంటుంది.  వాక్సిన్ కేంద్రం వద్ద జాబితాలో పేరు పరిశీలించి,  గుర్తింపు కార్డు ఉంటే వాక్సిన్ కేంద్రంలోని వేచి యుండు గదిలోకి పంపడం జరిగింది. వేచి యుండు గదిలో ఏర్పాటు చేసిన ఆన్ లైన్ విధానంలో వాక్సిన్ కు వచ్చిన వ్యక్తి వివరాలు నమోదు చేసిన అనంతరం వాక్సిన్ వేసే గదిలోకి పంపించడం జరిగింది. వాక్సిన్ అనంతరం పరిశీలన గదిలోకి పంపించడం జరిగింది. 30 నిమిషాల పరిశీలన అనంతరం ఎటువంటి అవాంఛనీయ లక్షణాలు కనిపించకపోతే వారిని బయటకు విడిచి పెట్టడం జరిగింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక వ్యక్తికి పరిశీలన గదిలో అనారోగ్య పరిస్ధితి ఏర్పడినపుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా గమనించారు. ఈ ప్రక్రియను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జెమ్స్ ఆసుపత్రిలో రైతు భరోసా, రెవిన్యూ విభాగం జాయింట్ కలెక్టర్  సుమిత్ కుమార్, పాలకొండలో సమగ్ర గిరిజన ఆభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ పర్యవేక్షణ చేసారు.       జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద మీడియాకు ప్రక్రియను వివరించారు. జిల్లాలో మూడు ప్రదేశాల్లో డ్రై రన్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమంలో సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు ప్రణాళికలు చేపట్టుటకు డ్రై రన్ ను నిర్వహించడం జరిగిందన్నారు. సాఫ్ట్ వేర్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించామని, దానిలోనూ ఎటువంటి సమస్యలు రాలేదని ఆయన వివరించారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 18,700 మంది వైద్య, ఆరోగ్య సంస్ధలలో పనిచేసే సిబ్బందిని నమోదు చేసామని, ఇంకా మిగిలిన వారు ఉంటే వారు కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండవ దశలో ఫ్రంట్ లైన్ లో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, పోలీసులు తదితరులకు., మూడవ దశలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 సంవత్సరాల లోపు వయస్సుగల వ్యక్తులకు, 50 సంవత్సరాలు పైబడి వ్యక్తులకు, గర్భిణీలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు.  తరువాత సాధారణ ప్రజానీకానికి వాక్సిన్ లభ్యతను అనుసరించి విడతల వారీగా అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మొదటి మూడు దశలలో సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలలో వాక్సిన్ ఇచ్చుటకు నిర్ణయించడం జరిగిందని, సాధారణ ప్రజానీకాని జిల్లాలో 2,700 కేంద్రాలలో వాక్సిన ఇచ్చుటకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. రెండవ దశ సిబ్బంది 20 వేలు, మూడవ దశలో దాదాపు 30 శాతం జనాభాకు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ ప్రక్రియను పర్యవేక్షించుటకు తగిన సిబ్బధిని సైతం నియమించడం జరుగుతుందని అన్నారు. డ్రై రన్ లో భాగంగా ఒక్కో కేంద్రంలో  కనీసం ఐదుగురు సిబ్బందిని నియమించామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు.       జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వాక్సిన్ ఇచ్చుటకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో 105 ప్రదేశాల్లో కోల్డు చైన్ పాయింట్లు ఏర్పాటు చేసి అచ్చట నుండి వాక్సిన్ కేంద్రాలకు సరఫరా చేయుటకు చర్యలు చేపట్టామని వివరించారు.       ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్.ఎం.ఓ డా.ఆర్.అరవింద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2021-01-02 14:15:54

కోవిడ్-19 వేక్సినేష‌న్‌కు సిద్దం కావాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కోవిడ్ 19 వేక్సినేష‌న్‌కు అన్నివిధాలా సిద్దం కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ అధికారుల‌ను ఆదేశించారు. వేక్సిన్ పంపిణీ విష‌యంలో ప్ర‌భుత్వం సూచించిన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ, ఆదేశాల‌ను తూచ‌త‌ ప్ప‌కుండా అమ‌లు చేస్తూ, అత్యంత ప‌క‌డ్భంధీగా ఏర్పాట్లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.  జిల్లా కేంద్రంలో కోవిడ్ 19 వేక్సిన్ డ్రైర‌న్ శ‌నివారం విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. జిల్లా కేంద్రాసుప‌త్రి, రాజీవ్‌న‌గ‌ర్ కాల‌నీలోని అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్‌తోపాటు, వెంక‌ట‌ప‌ద్మ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో కూడా డ్రైర‌న్ నిర్వ‌హించారు. ప్ర‌తీచోటా 25 మందికి త‌క్కువ కాకుండా వేక్సినేష‌న్ చేశారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా ముందుగా పేర్లు రిజిష్ట్రేష‌న్ చేశారు. అనంత‌రం వారికి వేక్సినేష‌న్ చేశారు. వారిని సుమారు 30 నిమిషాల‌పాటు ప‌రిశీల‌న‌లో ఉంచారు. ఈ స‌మ‌యంలో వారికి ర‌క్త‌పోటు, ఇత‌ర ప‌రీక్ష‌లు చేశారు. అస‌లైన వేక్సిన్ వేసిన‌ప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌ల‌ను, కోవిడ్ నిబంధ‌న‌ల‌ను  పాటిస్తూ, డ్రైర‌న్ నిర్వ‌హించారు.                  ఈ కార్య‌క్ర‌మాన్ని మూడుచోట్లా క‌లెక్టర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ప‌రిశీలించారు. అన్ని నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్న‌దీ, లేనిదీ త‌నిఖీ చేశారు. పేర్లు రిజిష్ట్రేష‌న్‌కంటే ముందు వేచిఉండేందుకు గ‌దుల‌ను  ఏర్పాటు చేయాల‌ని, చేతులు క‌డుగుకొనేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. అలాగే వేక్సిన్ ఎట్టి ప‌రిస్థితిలోనూ వృధా కాకుండా చూడాల‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడుతూ రిజిష్ట్రేష‌న్‌,  వేక్సినేష‌న్‌, అబ్జ‌ర్వేష‌న్ విభాగాలుగా వేక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌న్నారు.  కోవిడ్ వేక్సిన్ విష‌యంలో రిజిష్ట్రేష‌న్ అత్యంత కీల‌క‌మ‌న్నారు. అవ‌స‌ర‌మైన‌వారిని కేంద్రాల‌కు స‌కాలంలో ర‌ప్పించి, వారికి వేక్సినేష‌న్ చేయాల్సి ఉంద‌న్నారు. వేక్సినేష‌న్ అనంత‌రం, వారి ఆరోగ్య ప‌రిస్థితిని త‌నిఖీ చేసేందుకు సుమారు 30 నిమిషాల‌పాటు వారిని అబ్జ‌ర్వేష‌న్ రూములో ఉంచుతామ‌న్నారు. దీనికోసం ఆయా గ‌దుల్లో ప‌డ‌క‌ల సంఖ్య‌ను పెంచి, అవ‌స‌ర‌మైన డాక్ట‌ర్లు, సిబ్బందిని, మందులు, ఇత‌ర ప‌రిక‌రాల‌ను కూడా అందుబాటులో ఉంచ‌డానికి చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. అలాగే వేక్సినేషన్ ప్ర‌క్రియ‌లో పాల్గొనే సిబ్బంది మ‌ధ్య స‌మ‌న్వ‌యం, అవ‌గాహ‌న కూడా కీల‌క‌మ‌ని క‌లెక్టర్ పేర్కొన్నారు.            ఈ డ్రైర‌న్ ప్ర‌క్రియ‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్.మ‌హేష్‌కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ఆయా ఆసుప‌త్రుల్లో ప‌రిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా జెసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, ఇన్నాళ్లూ కోవిడ్ పేరు వింటేనే వ‌ణికిపోయే ప‌రిస్థితి నుంచి, ప్ర‌జ‌లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు జిల్లాలో కోవిడ్ వేక్సినేష‌న్‌కు యంత్రాంగం సిద్ద‌మ‌వుతోంద‌న్నారు. దీనిలో భాగంగా డ్రైర‌న్ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ సంద‌ర్భంగా ఎదుర‌య్యే అనుభవాల‌ను దృష్టిలో ఉంచుకొని, భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే వేక్సినేష‌న్‌కు తగిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటామ‌ని అన్నారు.            ఈ డ్రైర‌న్‌లో జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, కేంద్రాసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ సీతారామ‌రాజు, జిల్లా ఇమ్యూనైజేష‌న్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఎం.నారాయ‌ణ‌, డిఎల్ఓ డాక్ట‌ర్ ర‌వికుమార్‌, డిపిఎం సూర్యనారాయ‌ణ‌, యుఎన్‌డిపి క‌న్స‌ల్టెంట్ క‌మ‌లాక‌ర్‌, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ వైద్యాధికారి డాక్ట‌ర్ సిహెచ్‌విఎస్ లావ‌ణ్య‌, వెంక‌ట‌ప‌ద్మ ఆసుప‌త్రి ఎండి డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు త‌దిత‌రులు, సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం

2021-01-02 13:53:21

కలెక్టర్ కు న్యూఇయర్ శుభాకాంక్షలు వెల్లువ..

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ను పలువురు అధికారులు కలసి శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కు  శుభాకాంక్షలు తెలిపిన వారిలో జివియంసి కమీషనర్ డా.జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఐటిడిఎ పిఓ డా.ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య,  జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు,  జడ్పిసిఇఓ నాగార్జున సాగర్, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, ఎస్ఎస్ఎ పి.ఓ. మళ్లిఖార్జున రెడ్డి, డిటిసి రాజరత్నం, ఎస్.సి.కార్పొరేషన్ ఇడి శోభారాణి, ఏపీ ఎన్జీఓ నాయకులు, కలెక్టర్ కార్యాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-01 19:32:44

మంత్రి అవంతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువ..

విశాఖ సితమ్మధార లోని మంత్రి వర్యులు క్యాంప్ కార్యాలయంలో.. నూతన సంవత్సర సందర్భంగా గా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది , క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కలసి అధిక సంఖ్యలో అధికారులు, నాయకులు కలసి.. పుష్పగుచ్చం అందించి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.  జిల్లాలోని ఉన్న చాలా మంది ప్రముఖులు ,  అధికారులు,  నాయకులు అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పార్టీ శ్రేణులు  కార్యకర్తలు అభిమానులు వివిధ సంఘాల నాయకులు ఉదయం నుంచి తండోపతండాలుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు  సంఘాల నాయకులు వార్డు అధ్యక్షులు కార్పొరేటర్ అభ్యర్థులు , నాయకులు ప్రజలు , అధికారులు ప్రతిఒక్కరు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి  శుభాకాంక్షలు తెలియజేశారు`. మంత్రి వర్యులను కలసి శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, నగర అధ్యక్షులు వంశీకృష్ణ, విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విజయ ప్రసాద్,  DMHO, PD DRDA, ZP CEO, Special Deputy collector, SE (PR), SE (RWS), విశాఖ ఆర్డీవో, అనకాపల్లి ఆర్డీవో,  తదితరులు ఉన్నారు. అనంతరం వీఎంఆర్డీఏ కార్యాలయంలో వద్ద రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారిని కలసి.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు.అనంతరం భీమిలీ నియోజకవర్గ లో మంత్రి వర్యులను కలసిన వారిలో   జోనల్ కమీషనర్ గోవిందరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెద్దబాబు,  నియోజకవర్గంలో ఉన్న  మండల అధికారులు , ఎంపిపి  అభ్యర్దులు, కార్పొరేట్ ర్ అభ్యర్దులు, స్థానిక నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Visakhapatnam

2021-01-01 19:14:56