1 ENS Live Breaking News

నామినేషన్ కి బలవంతంగా జనాలను తరలిస్తున్నారు

వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు రేపు నామినేషన్ వేస్తున్న సందర్భంగా జన సమీకరణ చేయమని వార్డు వాలంటీర్లంపై వత్తిడి తెస్తున్నారని మా దృష్టికి వచ్చిందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అన్నారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రతి వాలంటీరు కనీసం ఐదుగురిని తీసుకు రావాలని చెప్పినట్లు తెలిసిందని ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. గతంలో ది . వాలంటీర్ల ద్వారానే అర్హత లేని వారికి కూడా ఓట్లు నమోదు చేయించారని ఇపుడు మళ్లీ అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నిబంధనలు ఉల్లగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండవలసిన వాలంటీర్ల వ్యవస్థ అధికార పార్టీ జేబు సంస్థగా మారకుండా చూడాలని కోరుతున్నామని అన్నారు.

Visakhapatnam

2023-02-21 15:29:54

విద్యార్ధి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ద్వారా బాధ్యతాయుతంగా మెలుగుతూ ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఐఎస్ టీడీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, హెచ్ పీ సీ ఎల్ విశాఖ రిఫైనరీ చీఫ్ జనరల్ మేనేజర్ నగేష్ సూచించారు. మంగళవారం  జాతీయ నిర్వహణ దినోత్సవం సందర్భంగా విశాఖలోని గాయత్రీ విద్యా పరిషత్ ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్‌తో కలిసి లీడర్‌షిప్ స్కిల్స్‌పై సదస్సు ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు హాజరైన నగేష్ మాట్లాడుతూ పలు అనుభవాలను పంచుకు న్నారు. కెరీర్ సక్సెస్ కోసం లీడర్‌షిప్ స్కిల్స్‌పై అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రజనీ, డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సోమేశ్వరరావు, హెచ్‌ఓడీ ప్రొఫెసర్ కెఎస్ బోస్, అధ్యాపకులు, ఐఎస్‌టిడి విశాఖపట్నం చాప్టర్ చైర్మన్ డాక్టర్ ఓఆర్‌ఎం రావు,  కార్యదర్శి డాక్టర్ హేమ యడవల్లి, ఐఎస్‌టిడి సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-21 13:52:48

డ్రైన్ పూడికతీత పనులకు రూ 6.80 లక్షలు

చుంచుల మైనర్ డ్రైన్ పూడికతీత పనులకు రూ 6.80 లక్షలు మంజూరు చేసినట్టు  జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలియజేశారు.  సెంట్రల్ గోదావరి డెల్టాలో ఒకటైన చుంచుల మైనర్ డ్రైన్ 1400 ఎకరాల పరివాహక ప్రాంతాన్ని కలిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూరిలంక వద్ద  పంచనది మీడియం డ్రైన్ లో కలుస్తుంది. తద్వారా ముంపు నీటిని గోదావరి నదిలో ఖాళీ చేస్తుంది. ఈడ్రైన్ పూడిక కు గురికావడం వలన బెండమూరి లంక లోని ఆయకట్టు వర్షాకాలంలో ముంపునకు గురై ఆయకట్టు దారులకు నష్టం కలిగిస్తున్నది. చాలా కాలం నుంచి ఈ  డ్రైన్  పూడికతీత పనులు  వివిధ కారణాల చేత జరగలేదు. ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం జిల్లాలోని వివిధ డ్రైన్ల పూడికతీత పనులు  చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు.

 వ్యవసాయ భూములు, బెందమూరిలంక గ్రామం ముంపునకు గురికాకుండా పూడికతీత పనులకు ONGC కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద 6,88,157 రూపాయలు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా లో తెలిపారు. ఇటీవలే టెండర్స్ పిలవబడి పనులు మొదలయ్యాయన్నారు. చుంచుల మైనర్ డ్రైన్ లో పూడిక తీయడం వల్ల డ్రైన్ సామర్థ్యం పెరిగి ఆయకట్టు నుండి ప్రవహించే ముంపు నీరు వేగంగా వెనక్కి తగ్గి  వర్షాకాలంలో పంటకు నష్టం వాటిల్లకుండా వుంటుందని వివరించారు. ఈ పనుల వలన అల్లవరం మండలంలో 1400 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ ఈ సందర్భం గా తెలిపారు.

Amalapuram

2023-02-21 11:01:36

ఈ-ఫిష్ సర్వే ప్రతిపాదనకు కమిటీ ఆమోదం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా జోన్ పరిధిలో నూతనంగా ఇ -ఫిస్ సర్వేలో ప్రతిపాదించిన 3,878 హెక్టార్ల విస్తీర్ణానికి జిల్లాస్థాయి ఆక్వా కల్చర్ జిల్లా సమన్వయ కమిటీ ఆమోదం తెలిపినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో ఆక్వా కల్చర్  జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో చైర్మన్ , జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 2018 సంవత్సరంలో దశలవారీగా నిర్వహించిన ఆక్వా జోనేషన్ సర్వే పైన, జిల్లాలో ఇ- ఫిష్ సర్వే , విద్యుత్ కనెక్షన్ల సబ్సిడీ స్థితిపైన, ఆక్వా జోన్ డిక్లరేషన్ కింద కొత్తగా అనువైన ప్రాంతాన్ని గుర్తిం చడం కోసం నిర్వహించిన రీసర్వే, గ్రామ సభల పైన, రెండో దశ కింద వినియోగదారుల విద్యుత్ కనె క్షన్‌లు,  ఇతర అర్హత గల ప్రాంతాలకు సంబంధించి ఆక్వా జోన్ ప్రాంతాన్ని సుస్థిర ఆక్వా జోన్ మ్యాపింగ్‌గా మార్చడానికి ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు పై సమీక్షించి నూతన ప్రతిపాదన లను కమిటీ సభ్యుల ఆమోదంతో ఆక్వా జోన్ కింద ధ్రువీకరించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ  పాత విస్తీర్ణం తో కలిపి, జిల్లా వ్యాప్తంగా 15, 928 హెక్టార్ల మేర ఆక్వా జోన్ పరిధిలోకి రానున్నట్లు చెప్పారు.  2018 నాటి సర్వే ప్రకారం జిల్లాలో 12 వేల 160 హెక్టార్ల విస్తీర్ణం మేర ఆక్వా జోన్ ఉందని ప్రస్తుతం నూతనంగా 3,878 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఒక గ్రామంలో 60 శాతం విస్తీర్ణంలో ఆక్వా సాగు ఉన్నట్లయితే ఆ గ్రామం ఆటోమేటిక్ గా ఆక్వా జోన్ పరిధి లోకి వస్తుందన్నారు. మండలాల వారిగా రావులపాలెం మండలం, రాయవరం, మండపేట కే గంగవరం రామచంద్రపురం, మండపేట ఆలమూరు ,కపిలేశ్వరపురం మినహా మిగిలిన  మండలాల్లో ఆక్వా జోనేషన్ ఎంత మేర విస్తీర్ణంలో నూతనంగా ప్రతిపా దించింది ఆయన శాతాలవారీగా అధికారులతో సమీక్షించారు. ఉప్ప లగుప్తం, అల్లవరం, ఐ పోలవరం మండలాల్లో నూతనంగా ఎక్కువ మేర విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.

 జిల్లాలో ఆక్వా విద్యుత్ కనెక్షన్లు 5,862 ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ మరియు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ కమిటీ సభ్యులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీపతిరావు డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ భూగర్భ జల శాఖ డిడి రాధాకృష్ణ, ట్రాన్స్కో ఈ ఈ రవికుమార్, జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ డివి రామగోపాల్, పరిశ్ర మల శాఖ ఏడి శివరాం ప్రసాద్ కమిటీ సభ్యులు ఎన్ సూర్యనా రాయణ రాజు వి రాంబాబు, మత్స్యశాఖ ఎఫ్ డి ఓ లు సిబ్బం ది,అభ్యుదయ ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2023-02-21 10:38:59

విజయనగరంలో వచ్చే ఏడాదినుంచి మెడికల్ కాలేజీ

విజయనగరం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం  నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభానికి ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. దీనితో కళాశాల ఏర్పాటు తోపాటు వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాలలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో శరవేగంగా వైద్య కళాశాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు లభిస్తున్న వేళ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వెళ్లే ఇబ్బందులు తప్పే అవకాశముంది.

Vizianagaram

2023-02-21 09:32:15

పోలీస్ గ్రీవీవెన్స్ దరఖాస్తులకు తక్షణ పరిష్కారం

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ ద్వారా అందే దరఖాస్తులను సంబంధిత విభాగాల అధికారులు తక్షణమే పరిష్కరించాలని సిపి పిహెచ్ శ్రీంత్ అదేశించారు. మంగళవారం సిపి కార్యాలయంలో జూమ్ ద్వారా పోలీస్ గ్రీవెన్స్ ను నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది నుంచి తొమ్మిది వినతలు అందాయి. వాటిని సంబంధిత విభాగాలకు సిపి బదిలీచేశారు.  అనంతరం సిపి మాట్లాడుతూ, నగర పరిధిలోని అన్నిస్టేషన్లు, సర్కిళ్లులోని సిబ్బంది పోలీస్ గ్రీవియన్స్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాఖపరమైన సమస్యలను, రాష్ట్రపరిధిలోని సమస్యలను నేరుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిపీ, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల సిబ్బంది జూమ్ లో పాల్గొన్నారు.


Visakhapatnam

2023-02-21 09:05:26

నగదు, మద్యం అక్రమ తరలింపుపై నిఘాపెంచాలి

నగదు, మద్యం అక్రమ తరలింపులు అరికట్టడానికి మండలాల సరిహద్దులలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాల నిఘా పెంచాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆదేశించారు. శాసనమండలి ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆయా కమిటీల్లోని అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నగదు, మద్యం పంపిణీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి నగదు, మద్యం ఆయా మండలాలలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. అక్రమ తరలింపులు అరికట్టడానికి పోలీసులు సూచించిన రహదారుల వద్ద 24 గంటలపాటు నిఘా ఉంచేలా స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు పనిచేయాల్సి ఉందన్నారు. ఆ బృందాలు గుర్తించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎన్నికల కంట్రోల్ రూమ్ కి చేరవేయాలన్నారు.

 శాసనమండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండురోజుల్లో ముగుస్తున్నందున అభ్యర్థుల ప్రచారం మొదలయ్యే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల ప్రచారానికి వినియోగించే కరపత్రాలు, ఇతర సామాగ్రిని పరిశీలించాలన్నారు. కరపత్రాలు, సమావేశాలకు అనుమతులపై ప్రత్యేక పరిశీలన ఉండాలన్నారు. ఒకే ప్రాంతంలో రెండు రాజకీయ పార్టీల అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిటీల దృష్టికి వస్తే తక్షణమే కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అరికట్టాలన్నారు.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా కమిటీలోని అధికారులు పర్యవేక్షించాలని డాక్టర్ శ్రీనివాసులు చెప్పారు. ముఖ్యంగా సెక్టోరల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సమర్థంగా పనిచేయాలన్నారు.

 ఎన్నికల విధుల నిర్వహణపై పూర్తిస్థాయిలో శిక్షణలు ఇవ్వాలన్నారు. చీరాల సహాయ రిటర్నింగ్ అధికారి, ఆర్.డి.ఓ. సరోజిని నుంచి బ్యాలెట్ బాక్సులను సంబంధిత అధికారులు రెండురోజుల్లో తెచ్చుకోవాలన్నారు. వాటిని ఎన్నికలకోసం సిద్ధం చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కోసం అవసరమైన ప్రింటింగ్ ప్రెస్ లను గుర్తించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్లిప్తత ఉండరాదన్నారు. ఎన్నికల కమిషన్ ఆధీనంలో పనిచేస్తున్న విషయాలను అధికారులు గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారిణి కె.లక్ష్మీశివజ్యోతి, నోడల్ అధికారులు, వివిధ కమిటీలలోని అధికారులు, ఆయా మండలాల నుంచి మండలస్థాయి కమిటీలలోని అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Bapatla

2023-02-21 08:01:58

పటిష్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అన్నారు. ఎన్నికల నిర్వహణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సోమ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వస్తున్న పిర్యాధులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఓటరు జాబితాపై వచ్చిన క్లైమ్ లు, అభ్యంతరాలు తక్షణం పరిష్కరించాలని ఆయన పేర్కొన్ నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన పెండింగ్ అంశాలు ఏమి లేవని చెప్పారు.

డూప్లికేట్ ఓటరుగా పిర్యాదులు అందిన 12 దరఖాస్తులను పరిశీలించామని, విచారణలో అర్హతలు సరిపోతాయని ఆయన చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని బృందాలను నియమించామని ఆయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-02-20 15:02:07

శ్రీకాళహస్తీశ్వరునికి శ్రీవారి పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా టీటీడీ తరపున ఈవో  ఎవి ధర్మారెడ్డి దంపతులు సోమవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు . వీరితో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి  ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్  అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. దేవాంగుల మండపంలో అర్చకులు ధర్మారెడ్డికి తలపాగా చుట్టి  పట్టు వస్త్రాలు తలమీద ఉంచారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న ఈవో దంపతులు, ఇతర ముఖ్యులతో కలసి సోమ స్కంధమూర్తి,  జ్ఞాన ప్రసూనాంబ కు పట్టు వస్త్రాలు సమర్పించారు.  అనంతరం శ్రీ వాయులింగేశ్వరుడు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, శ్రీ గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ, ప్రసాదాలుఅందించారు. తిరుమల శ్రీవారి ఆలయ పారుపత్తే దారు  ఉమామహేశ్వరరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Srisailam

2023-02-20 14:38:40

ఉద్యాన పంటలో మేలు చేకూరేలా చేయాలి..

పశ్చిమగోదావరి జిల్లా లో ముఖ్య పంటలు హర్టి కల్చరు కొబ్బరి ,మామిడి ,కూరగాయలు,ఆక్వా రంగం,గొర్రెలు,పశువులు తది తర రైతులు ' రైతు ఉత్పత్తుల దారుల సంఘం ' ( యఫ్ పి వో ) గా ఏర్పాటు చెయ్యాలని రైతులకు ఎంతో ప్రయోజనాలు కలుగుతాయని ఇన్చార్జి జెసి యం. సూర్య తేజ అన్నారు.  సోమవారం జిల్లా జెసి చాంబరు లో 'రైతు ఉత్పత్తుల దారుల సంఘాలు (యఫ్ పి వో ) ఏర్పాటు పై వ్యవ సాయ , అర్టి కల్చరు ,నాబార్డు అధికారులతో జెసి  సమావేశం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల దారుల సంఘాలు ఏర్పాటు చేసి రైతులకు మరింత ప్రయోజనాలు కల్పించి వారికి గిట్టుబాటు ధర ,లాభాలు చేకూర్చాలని సంఘాలు ఏర్పాటుకు కు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం దేశంలో 10 వేలు రైతు ఉత్పత్తుల దారుల సంఘాలు ( యఫ్ పి వో ) ఏర్పరచాలని నిర్దేశించారన్నారు.

మన జిల్లా లో మొదటి విడతగా 4 ఏర్పరచాలని నరసాపురం ,పెనుగొండ,ఆచంట,తాడేపల్లిగూడెం గుర్తించడం జరిగిందన్నారు. వ్యవ సాయ , అర్టి కల్చరు ,ఫిషరీస్ , తది తర  శాఖలు రైతు ఉత్పత్తుల దారుల సంఘాలు  ఏర్పాటుకు కృషి చెయ్యాలని అయన అన్నారు.సంఘాలు వలన ప్రభుత్వ రాయితీలు , కలెక్షన్ సెంటర్లు ,కోల్డ్ రూమ్స్, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రిటైల్ అవుట్ లైట్స్ తది తర సదుపాయాలు పొంది ప్రతి రైతు లబ్ధి పొందుతారని అధికారులు సమన్వయంతో పని చేసి రైతు ఉత్పత్తుల దారుల సంఘాలు ఏర్పాటుకు ,రైతులకు లాభాలు కలిగేలా సమిష్టి కృషి చెయ్యాలని ఇంచార్చి జాయింటు కలెక్టరు యం. సూర్య తేజ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వేంకటేశ్వర రావు, జిల్లా హార్టి కల్చరు ఏ. దుర్గేశ్,నాబార్డు డి డి యం అనీల్ కాంత్ , తది తరులు పాల్గొన్నారు.

Bhimavaram

2023-02-20 13:32:58

మార్చి2 నుంచి వెంకన్న వార్షిక కల్యాణోత్సవాలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కల్యాణోత్స వాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. కల్యాణోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సోమవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 3న జరిగే కల్యాణోత్సవానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని, రద్దీ క్రమబద్దీకరణకు నిఘా, భద్రతా సిబ్బందితోపాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, వైద్య బృందాలను నియమించాలని కోరారు. ఈ ఉత్సవాల్లో వినియోగించే వాహనాలు, రథం పటిష్టతను ముందస్తుగా పరిశీలించాలన్నారు.

చక్రస్నానం కోసం పుష్కరిణిలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో మార్చి 4 నుండి 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.  వర్చువల్‌ సమావేశంలో విజయవాడ డెప్యూటీ ఈవో  వెంకటయ్య, డెప్యూటీ ఈవో(జనరల్‌)  గుణభూషణ్‌రెడ్డి, విజివో  మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-02-20 12:35:54

అనకాపల్లి జిల్లా స్పందనకు 159 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరష్కరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ని ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు.  ప్రజల నుంచి వచ్చిన 159 ఫిర్యాదులను పరిష్కారం నిమిత్తం ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు బదిలీచేశారు. కలెక్టర్ కార్యాలయంతోపాటు, సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. దరఖాస్తులు సచివాలయ పరిధి దాటితో మండల కేంద్రాలకు, అక్కడ కూడా పరిధి దాటితే జిల్లా కేంద్రానికి నివేదించాలన్నారు. జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి జిల్లా రెవెన్యూ అధికారికి వెంకటరమణ అర్జీలను స్వీకరించారు.  డిఆర్ఓ దివ్యాంగుల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు.

Anakapalle

2023-02-20 11:59:24

ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ

కోవిడ్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని టీటీడీ జేఈవో సదా భార్గవి చెప్పారు. విద్యార్థులు ఆయుర్వేద వైద్యాన్ని ఇష్టపడి చదివి లోతైన పరిజ్ఞానం సంపాదిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.  శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల 2022-23 బ్యాచ్ నూతన విద్యార్థులకు 15 రోజుల శిక్షణా కార్యక్రమం కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జేఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదా భార్గవి మాట్లాడుతూ,  శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత విద్యనభ్యసించడం విద్యార్హుల పూర్వజన్మ సుకృత మన్నారు. ఎంబిబిఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే అభిప్రాయం ఉంటే వెంటనే వదిలేయాలన్నారు. ఎంబిబిఎస్ సీటు వదులుకుని ఆయుర్వేద వైద్య కోర్సులో చేరుతున్న వారు చాలామంది ఉన్నారని ఆమె తెలిపారు.

 భారతీయ సనాతన వేదాలతో మిళితమై ఉన్న ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచమంతా ఆదరిస్తోందన్నారు. కోవిడ్ సోకిన వారు, కోవిడ్ సోకకుండా  ముందు జాగ్రత్తలు పాటించిన వారు ఆయుర్వేద కషాయాలు, మందులు వాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. భారతీయుల వంటిల్లే పెద్ద వైద్యాలయమని ఆమె చెప్పారు. సామాజిక, వాతావరణ మార్పుల వల్ల జనానికి అనేక జబ్బులు వస్తున్నాయని, వీటిని పూర్తిగా నయం చేయడం, రాకుండా చేయగలిగే శక్తి ఆయుర్వేదానికి ఉందని జేఈవో వివరించారు. ఆయుర్వేద వైద్యం సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుని దాన్ని జనంలోకి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. టీటీడీ ఆయుర్వేద కళాశాలకు 40 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. కళాశాలలో సెమినార్ హాల్ నుంచి అవసరమైన అన్ని వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి సెమినార్లు,వర్క్ షాప్ లు నిర్వహిస్తామన్నారు.

15 రోజుల శిక్షణా కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయుర్వేద కళాశాలను ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ,  ఆయుర్వేద ఆసుపత్రిని సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ చక్కగా నిర్వహిస్తున్నారని జేఈవో అభినందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ కళాశాల ప్రగతి, ఇక్కడి విద్యార్థులు సాధించిన విజయాలు, అందుకున్న ఉన్నత స్థానాల గురించి వివరించారు. ఆసుపత్రి అభివృద్ధి, నిర్వహణ పై సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు.  కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2023-02-20 10:45:23

కాకినాడ జిల్లా పోలీసు స్పందనకు 44 ఫిర్యాదులు

కాకినాడ జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 44 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా పోలీసు స్టేషన్లకు అక్కడికక్కడే బదిలీ చేసి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుశాఖ పరంగా ఎదరవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు స్పందన వేదికను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి  వచ్చిన ఫిర్యాదుదారులకు  ఉచిత భోజన సదుపాయంను కాకినాడ రామారావుపేటకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్  డిపిఆర్ స్వామి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి.  (అడ్మిన్)  పి.శ్రీనివాస్, అదనపు ఎస్పీ(ఎఆర్) బి.సత్యనారాయణ, ఎస్.బి. డి.ఎస్.పి.  ఎం.అంబికా ప్రసాద్, కాకినాడ డి.ఎస్.పి.  పి. మురళీక్రిష్ణా రెడ్డి,  పలువురు పట్టణ ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ. సిబ్బంది పాల్గొన్నారు

Kakinada

2023-02-20 10:37:34

విజయనగరం స్పంద‌న‌కు 112 విన‌తులు

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం జరిగిన స్పంద‌న (జ‌గ‌న‌న్న‌కి చెబుదాం) విన‌తుల కార్య‌క్రమానికి వివిధ స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన 112 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్య‌ధికంగా 78 ఫిర్యాదులు వ‌చ్చాయి. డీపీవోకు 10, డీఆర్డీఏ, గృహ నిర్మాణ శాఖ‌ల‌కు చెరో ఏడేసి ఫిర్యాదులు రాగా ఈపీడీసీఎల్ కు 5, మున్సిపాలిటీకి 3, డీఎం &హెచ్‌వోకు, స‌చివాల‌య విభాగానికి చెరో ఒక‌టి వ‌చ్చాయి. ప్ర‌జ‌ల నుంచి విన‌తుల‌పై స‌త్వ‌ర‌మే స్పందించి త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు సుద‌ర్శ‌న‌దొర‌, సూర్య‌నారాయ‌ణ‌లు ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. వివిధ విభాగాల‌కు చెందిన జిల్లా స్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-20 10:24:13