1 ENS Live Breaking News

జి-20 సదస్సు పనులు వేగవంతం చేయాలి

విశాఖలో మార్చి 3, 4 తేదీలలో జిల్లాలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వస్ట్మెంట్ సదస్సుకు సంబందించి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు.  గురువారం ఉదయం గ్లోబల్ ఇన్వస్ట్మెంట్ సదస్సు నిర్వహించే ఆంధ్రాయూనివర్సిటి గ్రౌండును నగర పోలీసు కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ పి.రాజాబాబులతో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పరిశీలించారు.  అక్కడ జరుగుతున్న పనుల పురోగతిపై  అధికారులను అడిగి తెలుసుకున్నారు.  వివిద దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరౌతారని, వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం స్థానిక ఉడా పార్కు ప్రక్కన గల ఎం .జి.ఎం పార్కును అక్కడ జరుగుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ  కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, జి.వి.ఎం .సి, అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-02-23 15:59:52

తూర్పు డెల్టాలో రబీకి సాగునీరు అందించండి

తూర్పు సెంట్రల్ డెల్టాలో రబీ సాగుకు సంబంధించి సాగునీటి  ఎద్దడి సమస్యలు పరిష్కారం కొరకు సీలేరు నుండి అదనపు జలాలను విడుదల చేయాలని, డెల్టా ప్రాంతం లో కాలువలలో పూడికతీతకు  నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డిని కోరారు. గురువారం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ 26 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు తీరు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం స్త్రీ శిశు సంక్షే మం, పాఠశాల విద్య, గ్రామ వార్డు సచివాలయాల స్పందన గ్రీవెన్స్ పరిష్కారం ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో రబీ సాగుకు సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నం కాకుండా అదనంగా సీలేరు నుండి జలాలను విడుదల చేయాలని కాలువల్లో పూడుకు పోయిన తూడును తొలగించేందుకు నిధులు కేటాయించాలని కోరామ న్నారు.

 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు శాఖల వారీగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల యాప్ లో నమోదు చేసి పోషకాహార లోపాలు, రక్తహీనత తదితర అంశాలలో లక్షిత వర్గాల వారికి పోషకాహార పథకాలను వర్తింపజేస్తూ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. 8 పారామీటర్లను రక్తహీనత, పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో జవాబుదారీ తనంతో పనిచేయాలన్నారు. బాలా మృతం వైయస్సార్ సంపూర్ణ పోష ణ, గోరుముద్ద ,పోషకాహార కిట్లు టేకు హోం రేషన్ ప్రక్రియల ద్వారా పోషకాహార లోపాలను శాఖల సమ న్వయంతో సరిదిద్దేందుకు పటిష్ట మైన చర్యలు గైకొని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఏఎన్ఎం, వసతి గృహ సంక్షేమ అధికారులు, పాఠశాల ప్రధానోపా ధ్యాయులు పోషకాహారం లోపా లను గుర్తించి ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లేదా పీహెచ్సీ వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సహకారంతో  తక్కువ బరువు ,వయసుకు తగ్గ ఎత్తు తదితర అంశాలలో వృద్ధిరే టును మానిటరింగ్ చేస్తూ ఆరోగ్య కర సమాజ స్థాపన దిశగా ముంద డుగు వేయాలన్నారు.

 కిషోర బాలి కల పోషకార లోపాలు, టీనేజ్ ప్రె గ్నెన్సీ నివారణ అంశాలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. ఆయు ష్మాన్ భారత్  హెల్త్ కార్డులు ఇకేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమాల ద్వారా బాలల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. కమ్యూన కబుల్ వ్యాధులు, నాన్ కమ్యూనక బుల్  వ్యాధులు నియం త్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నా రు కంటి వెలుగు కార్య క్రమాన్ని జూలైలోపు పూర్తి చేయాలన్నారు గర్భిణీల ప్రసవ ప్రణాళిక ,కాన్పు ప్రమాదకరమని భావించిన గర్భిణీల ప్రసవాల పట్ల అప్రమత్తంగా వ్యవ హరించాలన్నారు. బడిబయటి పిల్లలు లేకుండా విద్యాశాఖ అధి కారులు ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. సచివాలయాలలో స్పందన గ్రీవెన్స్ ను సకాలంలో పరిష్కరించి సచివాల వ్యవస్థ పనితీరు పట్ల విశ్వసనీయతను అర్జీదారులలో పెంపొందించాలన్నారు. సచివాల యాల్లో ఖాళీలు భర్తీకి ఆదాయ ధ్రువపత్రాలు జారికి వివిధ సంక్షేమ పథకాల అమలుకు వివక్షతకు తావు లేకుండా  అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.. 

సాగునీటి ఎద్దటి సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే వివిధ డ్రైనేజీలపై 42 క్రాస్ బండ్లు నిర్మించి మోటార్లు, ఆయిల్ ఇంజన్ ద్వారా నీటి ఎద్దడి ఉన్న సాగు క్షేత్రాలకు సాగు నీటిని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. అర్బన్ హెల్త్ మిషన్ గ్రామీణ హెల్త్ మిషన్ ద్వారా ఇంటింటిని  ఏఎన్ఎంలు సంద ర్శించి రోగాల బారిన పడిన వారి ఆరోగ్య పరిరక్షణకై దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామా జిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ  త్వరగా కోలుకునే విధంగా పాటుపడాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర బాబు సిపిఓ వెంకటేశ్వర్లు డిఎంహె చ్వో ఎం దుర్గారావు దొర, ఐసిడిఎస్ పిడి జీవి సత్య వాణి ,గ్రామ వార్డు సచివాలయం నోడల్ అధికారి భీమేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఇ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నా రు.

Amalapuram

2023-02-23 15:46:47

48 గ్రామాల్లో భూమి రీసర్వే సత్వరం పూర్తిచేయాలి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2వ దశ లో కేటాయించిన 48 గ్రామాలలో భూముల రీ సర్వేకి సంబందించి గ్రౌండ్ ట్రుతింగ్ ప్రక్రియ మార్చి 15 నాటికి పూర్తి పూర్తిచే యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులు ఆదేశించారు.  గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ లు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లు ,జాయింట్ కలెక్టర్లతో నిర్వహించి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష రీ సర్వే లోని పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  రీసర్వేకి సంబంధించి గ్రౌండ్ ట్రు తింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్,13 నోటిఫికేషన్, 9(2) నోటిఫికేషన్ జారీ, రెవిన్యూ రికార్డుల స్వచ్ఛీ కరణ, డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్, వెక్టర్లెజేషన్, గ్రామ సర్వేయర్ విఆర్వో లాగిన్ లలో డేటా ఎంట్రీ, రోజువారీగా రోవర్స్ వినియోగం, సరిహద్దు పాయింట్లు గుర్తింపు, సరిహద్దు రాళ్లు ఏర్పా టు ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు.

 ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సర్వేటీంలను, సర్వే మరియు రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ రీ సర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని ప్రక్రియలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జరిగేలా అదికారులు, సిబ్బంది నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. భూ యజమానుల రికార్డుల తయారీ తప్పులు లేకుండా సిద్ధం చేయా లన్నారు. స్వామిత్ర పథకం ద్వారా జరుగుతున్న గ్రామ కంఠాల సర్వేని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశ రి సర్వేలో 66 గ్రామా లలో 43 గ్రామాలకు సంబంధించి భూ హక్కు పత్రాలు పంపిణీ చేయ డం జరిగిందన్నారు. మిగిలిన గ్రామా లు పురోగతిలో ఉన్నాయన్నారు. రెండోదశకి సంబంధించి 49 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని వీటిలో 48 గ్రామాలలో సర్వే ప్రారంభమైందని  తెలిపారు. ఒక గ్రామానికి సంబంధించి రికా ర్డులు అందుబాటులో లేనందున జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మొత్తం రెండు దశల లో 115 గ్రామాలు ఎంపిక చేయగా కోనసీమ జిల్లాలో ఉన్న మొత్తం 315 గ్రామాల్లో ఇంకా 200 గ్రామాలకు ఆర్థోరేక్టిఫై మ్యాపులు రావాల్సిందని ఆయన తెలిపారు. 

సర్వే పూర్తయిన గ్రామాలలో ఏ క్లాస్ బి క్లాస్ సరిహద్దురాళ్లు ఏర్పాటుకు సంబంధించి 1,19,742 రాళ్లు అవసరం ఉండగా 69,180 సరిహద్దు రాళ్లు సరఫరా చేయడం జరిగిందన్నారు. రోజువారీగా 7,865 సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతోoదని ఆయన తెలిపారు. సరిహద్దురాళ్లు అంతర్గత రవాణా ఏర్పాట్లు స్థానికం గా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచిం చారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రోజువారీగా రోవర్స్ ద్వారా పాయిం ట్లు గుర్తించాలని సూచిం చారు. సరిహద్దు రాళ్లు ఏర్పాటుకు సంబం ధించి మార్కింగ్, ఫిట్టింగ్ ప్రక్రియ లలో రైతుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేప ట్టాలన్నారు. రెవెన్యూ సిబ్బంది ముటేషన్లు, క్లాసిఫికేషన్లు చేపట్టాల ని సూచించారు. ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ సహాయ సంచాలకులు సర్వే బృందాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచిం చారు.  ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు  గోపాలకృష్ణ లంక భూములు సర్వేయర్ ప్రసాదు, సెక్షన్ సూపరింటెండెంట్, రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2023-02-23 15:37:41

ఎస్వీబీసీ ఛానల్ దేశమంతటా ప్రసారంచేయాలి

ఎస్వీబీసీ హిందీ ఛానల్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని దేశమంతటా ప్రచారం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి గురువారం సమీక్ష  నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల, ఇతర అనుబంధ ఆలయాల్లో నిర్వహిస్తున్న వివిధ సేవలు, కైంకర్యాలు, పండుగలు, ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి భక్తుని చెంతకు తీసుకెళ్లాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైందన్నారు.  ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ ఛానళ్లు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ కు కూడా ప్రాచుర్యం కల్పించేందుకు హిందీ మాట్లాడే ప్రాంతాలలో జియో వంటి వేదిక అవసరమన్నారు. జియో ఫైబర్ నెట్ ప్లాట్‌ఫారమ్‌లో ఎస్వీబీసీ  హిందీ ఛానల్ ను ప్రసారం చేయడం, ఎస్వీబీసీ ఆన్‌లైన్ రేడియోకు మరింత ప్రాచుర్యం కల్పించడంపై జియో అధికారులతో చర్చించాలని ఎస్వీబీసీ సిఈఓను  షణ్ముఖ్‌కుమార్,  ఆదేశించారు. జియో వైస్ ప్రెసిడెంట్(ముంబై),  ఐటి జిఎం సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-02-23 13:27:11

ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత చాలా కీలకం

ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత అత్యంత కీలకమైనదని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు గురువారం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికలలో బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలన్నారు. పి.ఓ.ల విధులు, పోలింగ్ సామగ్రి, ఎన్నికలముందు నిర్వహించాల్సిన ప్రక్రియ, బ్యాలెట్ బాక్సులు సీజ్ చేసే విధానంపై అధికారులు అవగాహన పొందాలన్నారు. బ్యాలెట్ పత్రాల వినియోగం, డిక్లరేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమన్నారు. ఎన్నికలలో పి.ఓ.లు బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరుపై ఆయన అవగాహన కల్పించారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

 బాపట్ల జిల్లా పరిధిలోని 13 మండలాలలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలననుసరించి పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ఎన్నికల సామగ్రి తరలించడంలోనూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వినియోగం, ఎన్నికలలో బ్యాలెట్ పత్రాల వినియోగం, డిక్లరేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. టెండర్ బ్యాలెట్ వంటి అంశాలపై అధికారులు అవగాహన కలిగివుండాలన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల సామాగ్రి తరలింపు, ఎన్నికల తదుపరి బ్యాలెట్ బాక్సులు అత్యంత భద్రతల మధ్య తరలించాల్సివుందన్నారు. ఎన్నికల విధి విధానాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్.డి.ఓ. పి. సరోజిని, బాపట్ల ఆర్.డి.ఓ. జి. రవీందర్, పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.

Bapatla

2023-02-23 10:52:42

నగర సుందరీకరణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యత

జి-20 సదస్సుకు ఇరవై దేశాల ప్రథినిధులు రానున్న నేపథ్యంలో సదస్సులు జరిగే సమయంలో పారిశుధ్య కార్మికులను ఆయా ప్రాంతాలలో వుంచి రోడ్డును నిరంతరం శుభ్రంగా వుంచే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. పి రాజాబాబు పేర్కొన్నారు.  గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖ ఎన్ఏడి జంక్షన్ నుండి మురళి నగర్ జంక్షన్ జాతీయ రహదారి వరకు పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతాలను తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి సుందరీకరణ పనులు క్షున్నంగా పరిశీలించేందుకు నడక మార్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టామన్నారు. రహదారికి  ఇరువైపులా, సెంట్రల్ మీడియంలోను పారిశుధ్య కార్మీకులచే శుభ్రం చేయించాలని, చెట్లు, ఎలెక్ట్రికల్ పోల్సు, గోడలకు ఉన్న ప్రకటనల బోర్డులు, కేబుల్ వైర్లు, పోస్టర్లను తొలగించి శుభ్రం చేయాలన్నారు.అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-23 09:39:51

28 న వి.జె.ఎఫ్ కళారంగ ప్రోత్సాహక పోటీలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కళారంగంలో మార్చి7న ప్రోత్సాహక పోటీలను నిర్వహిస్తున్నట్లు విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు పేర్కొన్నారు. గురువాం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆయన ఓంశాంతి ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు.  గీతాలాపన రంగవల్లులు విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. పాటల పోటీలు ఎంట్రీలను మహిళా ప్రభుత్వ కళాశాల టీచర్ నంబర్ డాక్టర్ కె వి.వేణి ఫోన్ నంబర్  939 3114901... రంగవల్లులు ఎంట్రీ లకు సంబంధించి విజేఎఫ్ కార్యవర్గ సభ్యురాలు పి. వరలక్ష్మీ నంబర్ 9059308958 లలో సంప్ర దించాలి ఆని కోరారు. ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటలులోగా పంపాలన్నారు.  గీతాలాపన పోటీలో 10 నుంచి 15 సంవత్సరాలు లోపు వారిని జూనియర్స్ గాను పదహారేళ్లు పైబడిన వారిని సీనియర్స్ గానూ పరిగణిస్తామన్నారు.  ఈ కార్య క్రమంలో విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-23 09:05:15

బ్యాంక్‌ లింకేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలోని గృహనిర్మాణ లబ్థిదారులకు రూ.35వేల బ్యాంకు లింకేజీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం కొమరగిరి లేఅవుట్‌లో గృహనిర్మాణ ప్రగతిపై  అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావుతో కలిసి హౌసింగ్, ప్రత్యేకాధికారులు, ఇతరశాఖల అధికారులతో కమిషనర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాల కోసం సుమారు 9,416 మంది అగ్రిమెంట్లు పూర్తి చేసుకోగా, 3,300 ఇల్లు గ్రౌండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గృహనిర్మాణ లబ్థిదారులుగా ఉన్న 4,536 మంది గృహనిర్మాణ లబ్థిదారులకు రూ.35వేలు చొప్పున బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలిన 5వేల మందికి త్వరితగతిన లింకేజి ప్రక్రియ పూర్తయ్యేలా బ్యాంకర్లతో చర్చించాలని సూచించారు. అలాగే ఎమినిటి కార్యదర్శులు జియోట్యాగింగ్‌తోపాటు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. 

సీవోలు కూడా ఈ అంశంపై నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా గృహనిర్మాణాల ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా అంశాలపై స్పెషల్‌ ఆఫీసర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు మాట్లాడుతూ గృహనిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నందున దీనిపై సంబంధిత వర్గాలన్నీ సమన్వయంతో పనిచేసి లక్ష్యసాధన దిశగా ప్రగతి సాధించాలన్నారు. ఇందుకోసం ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్షించుకుంటూ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. సాంకేతిక పరమైన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ డిఈ సత్యనారాయణరెడ్డి, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం. ఏసుబాబు,  డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్,  మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, పలువురు ప్రత్యేక అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Kakinada

2023-02-22 16:45:54

ట్రాన్స్ జెండర్స్ కి రేషన్ కార్డులు మంజూరు

పశ్చిమగోదావరి జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి వివిధ సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ట్రాన్స్ జెండర్స్ సంక్షేమకేమానికి అధికారులు కృషి చేయాలని, ముఖ్యంగా వారికి రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.   జిల్లాలోని ఆరుగొలను,  ఎల్.బి చర్ల, ఆరుగొలను న్యూ, ఆచంట సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో  పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మంచి మార్కులు పొందేందుకు ప్రోత్సహించాలన్నారు.  జిల్లా అధికారులు వీరిని ప్రోత్సహించేందుకు సందర్శనకు రానున్నట్లు తెలిపారు. 

తణుకు, నరసాపురం చర్చ్ ల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలను  సచివాలయాల్లోనే సంక్షేమ కార్యదర్శిల ద్వారా ప్రజలోనికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జిల్లా జాయింట్ ఎం.సూర్య తేజ, భీమవరం ఆర్దిఓ దాసిరాజు, బిసి కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.కుమిదిని, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ పి.వాసవి, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి నీలకంఠ ప్రధాన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు  గణపతి రావు,  శోభారాణి,  డి.పుష్పరాణి, తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2023-02-22 16:42:36

రోడ్డు ప్రమాదాలు నివారణకు స్పెషల్ డ్రైవ్

 అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ గౌతమీ శాలి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నెలవారి నేరసమీక్ష సమావేశంలో ఆమె పలుసూచనలు చేశారు.  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై జరిమానాలు వసూలు చేయాలన్నారు.  ముఖ్యంగా  గంజాయి కేసులలో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అరెస్టులు చేయాల న్నారు. గంజాయి నిర్మూలనకు ఆయా కేసుల్లో బెయిల్ పై ఉన్న నిందితులు ,శిక్ష అనుభవించి జైలు నుండి రిలీజ్ అయిన వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తీవ్రమైన, సాధారణ పెండింగ్ కేసులు,  ముఖ్యంగా గంజాయి, ఆస్తి దొంగతనాల కేసులు దర్యాప్తును సమీక్షించారు. విశాఖపట్నం పి.డి.జె. కోర్టు స్పెషల్ పీపీ  వై.తారక రామారావు పోలీసు అధికారులు విధినిర్వహణలో అరెస్టులు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు,  41ఎ నోటీసు, 448 ఎ ఆర్డర్ పై అవగాహన కల్పించారు.

Anakapalle

2023-02-22 14:54:45

APUWJడైరీ ఆవిష్కరించిన అనకాపల్లి కలెక్టర్

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధులని సత్యాన్వేషణతోనే జర్నలిస్టులకు మంచి గుర్తింపు వస్తుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్  రవి పట్టన్ శెట్టి పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(APUWJ)డైరీ ని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు సిహెచ్ బిఎల్.స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంబాబు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ లకో కూడి బ్రుందం కలెక్టర్ తో కలిసి యూనియన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాస్తవాలు వార్తలుగా వచ్చినపుడు మాత్రమే మీడియా అంటే ప్రజలకు గౌరవం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షుడు జగదీష్, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శేఖర్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల భాస్కరరావు, ప్రసాద్ బాబు, వెలగా రమణ,మోహన్ బాబు,ఏడి బాబు, రామారావు తదితరులు  పాల్గొన్నారు.

Anakapalle

2023-02-22 14:37:37

రక్తదానానికి అన్నిశాఖల సిబ్బంది ముందుకు రావాలి

శ్రీకాకుళం జిల్లాలో రక్తనిల్వలు చాలా అవసరమని, ఇందుకోసం అన్ని శాఖలు, స్వచ్చంద సంస్థలు ముందుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పిలుపునిచ్చారు. రక్తదాతల స్ఫూర్తి హర్షణీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలతో రక్త దాతలకు సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాలోని పశుసంవర్ధక శాఖలోని అందరు వైద్యులు, సిబ్బంది, అన్ని అసోసియేషన్ల వారితో రక్తదాన కార్యక్రమం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం పశుసంవర్ధక శాఖ శిక్షణ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదాతలను కలిసి అభినందించారు. రక్తదానానికి పురుషులతో పాటు స్త్రీలు కూడా పాల్గొనడం అభినందనీయమని, ఇందులో మహిళా వైద్యులు కూడా రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది మహిళలు రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్ ఆకాక్షించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అతి పొడవైన జాతీయ రహదారిలో జరిగే ప్రమాదాలు, తలసేమియా, ఇతర అవసరాల కోసం రక్తం చాలా అవసరమని, అందుకు తగినంత రక్తనిల్వలు లేవని అన్నారు. ఇందుకు రక్తదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయగలిగితే కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.  ఈ రక్తదాన కార్యక్రమంలో సుమారు 86 మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని, ఇది శుభదాయకమన్నారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను, మెడల్స్ లను బహుకరించారు.  ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం.కిశోర్,ఉప సంచాలకులు డా.ఎం.జగన్నాధరావు, ఐ.ఎస్.డి.పి సహాయ సంచాలకులు డా. పి.సూర్యం, ఆమదాలవలస, పొందూరు, నరసన్నపేట, సరుబుజ్జిలి, గార సహాయ సంచాలకులు డా. ఆర్.ఆనందరావు, డా. పి.ఎస్.జి. బాలకృష్ణ, డా. కె.రాజగోపాలరావు, డా. సిహెచ్. సుబ్రహ్మణ్యం, డా. జి.వి.రాజశేఖరం, ఇతర వైద్యులు, రెడ్ క్రాస్ సంస్థ ఎం.సి మెంబర్లు పి.శ్రీకాంత్, శ్రీధర్, పెంకి చైతన్య కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-02-22 14:19:53

కాకినాడలో ఎమ్మెల్సీ స్థానానికి ఒక్క నామినేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గ ఎన్నికల పోటీకి ఒక నామినేషన్ దాఖలు అయింది.  డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, సూర్యనగర్, ఇంటి నెంబరు 5-4-24 నివాసి కుడుపూడి సూర్యనారాయణ రావు, వయస్సు 73 ఏళ్లు, తండ్రి గోపాలకృష్ణ గోఖలే, మంగళవారం మద్యాహ్నం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టి అభ్యర్థిగా తమ నామినేషన్ పత్రాలను, 10 మంది ప్రోపోజర్ల సంతకాలతో రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దాడిశెట్టి రాజా, వేణుగోపాల క్రిష్ణ, కాకినాడ అర్భన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇతర వైఎస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.

Kakinada

2023-02-22 14:02:59

ఒకేరోజు 12 మంది అభ్యర్ధుల ఎమ్మెల్సీ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ  ఎన్నికకు  సంబంధించి బుధవారం పన్నెం డు (12) మంది జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం జిల్లా రాజాంకి చెందిన పురిపండ శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖకు చెందిన పివీఎన్ మాధవ్ బిజేపీ అభ్యర్థిగా 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.  విశాఖపట్నం జిల్లా సిబిఎం కాంపౌండ్ కు చెందిన గుండుపల్లి సతీష్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.  విశాఖపట్నం జిల్లా వేపగుంట కు చెందిన దండేల ఆనందరావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన కాళ్ల లోకనాథం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లా పెదవాల్టేరు కు చెందిన వేపాడ చిరంజీవిరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్ కు చెందిన సీతంరాజు సుధాకర్  వైఎస్సార్సిపి పార్టీ అభ్యర్థిగా మూడు  సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. 

అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేటకు చెందిన ఈర్లే శ్రీరామమూర్తి స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . అనకాపల్లి జిల్లా గవరపాలెం చెందిన ఆడారి శరత్ చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . విశాఖపట్నం ఆరిలోవ కు చెందిన బలివాడ రామ సంతోష్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి కి చెందిన రాజాన మోహన్ రావు స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు . విశాఖపట్నం జిల్లా మధురవాడ కు చెందిన గ్రిద్దలురు విజయ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.  పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ రాగా బుధవారం   (ఫిబ్రవరి 22) నాటికి మొత్తం పద్దెనిమిది (18) మంది  అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Visakhapatnam

2023-02-22 13:42:23

జి -20 సదస్సుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి పెరగాలి

విశాఖపట్నంలో వచ్చే నెల 28,29 తేదీలలో  నిర్వహించబోయే జి-20 సదస్సులను ఎటువంటి పొరపాట్లకు  తావువివ్వకుండా నిర్వహించ డానికి  అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మీ అధికారులను కోరారు. బుధవారం మధ్యా హ్నం ఉడా కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జి-20 సదస్సు నిర్వహణ కొరకు అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ మార్చి 27వ తేదిన వివిధ దేశాల నుంచి సదస్సుకు వచ్చే ప్రతినిధులకు సాంప్రదాయ స్వాగతం పలకడంతో పాటు ఎయిర్ పోర్టు నుంచి వారికి ఏర్పాటు చేసిన  హోటల్ వరకు తీసుకు వెళ్లేందుకు అవసరమైన రవాణా, లైజినిం గ్, డెలిగేట్ కిట్స్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కు పలు సూచనలను జారీ చేసారు. 

విదేశీ ప్రతి నిధులు జిల్లాలో పర్యటించిన సందర్భాలలో భద్రత పరమైన అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు గురించి నగర పోలీసు కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్ ను అడిగి తెలుసుకున్నారు. వివిద దేశాల ప్రతినిధులకు జిల్లాలో  టూరిజం ప్రాంతాలను  సబ్ మేరైన్ మ్యూజియం, తొట్లకొండ  తదితర ప్రాంతాలను సందర్శించు నిమిత్తం తగు ఏర్పాట్లు గావించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నగరాన్ని సుందరంగా ఆధునీకరించాలని జి.వి.ఎం .సి. కమిషనర్ కు తెలిపారు.   చివరి రోజున ఆరోగ్యాన్ని మెరుగు పరిచే యోగా, మెడిటేషన్ తదితర కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని  కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, రాష్ట్ర ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మీ కి వివరించారు. 

ఈ  సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్,డి సి పి సుమిత్ సునీల్ గరుడ్, టూరిజం డైరక్టర్ మల్లిఖార్జునరావు, టూరిజం , పోలీసు,రెవెన్యూ,జి.వి.ఎం .సి, ఎయిర్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, నగర పోలీసు కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ లతో కలసి విమానాశ్రయానికి  వెళ్లి విదేశీ ప్రతి నిధుల రాక సందర్భంగా విమానాశ్రయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు .

Visakhapatnam

2023-02-22 13:37:20