దేవిశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖలోని ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ,అమ్మలగన్న అమ్మ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి క్రుపతో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ జరగాలని,జర్నలిస్టు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ గతంలో పోల్చుకుంటే ఇపుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా సూచనల మేరకు జర్నలిస్టులు ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలకు కవరేజికి వెళ్లే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. వీలైనంత వరకూ హేండ్ గ్లౌజ్ లు వేసుకోవాలన్నారు. అలా వీలు కాని పక్షంలో నాణ్యమైన శానిటైజర్లును వినియోగించాలన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలతోమాత్రమే విధులకు హాజరు కావాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా తాను అహర్నిసలు పనిచేస్తున్నట్టు గంట్ల వివరించారు.
తిరుపతి డివిజన్ లో కొత్తగా ఏర్పాటైన రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయాన్ని స్థానిక శ్రీదేవి కాంప్లెక్స్ ను ఆదివారం ఉదయం తిరుపతి ఆర్డిఓ, రెడ్ క్రాస్ డివిజన్ చైర్మన్ కనకనరసా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వైద్య సేవల్లో ముందుండే రెడ్ క్రాస్ తిరుపతి డివిజన్ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీదేవి కాంప్లెక్స్ లో కార్యాలయం కోసం టిటిడి స్పందించి కేటాయింపు చేయడం శుభ పరిణామమని అన్నారు. స్థానిక శాసన సభ్యులు కారుణాకరరెడ్డి, తుడా చైర్మన్ సహకారంతో కార్యాలయం మరింత సభ్యులతో సేవకార్యక్రమాలు రూపుదిద్దుకోవలని ఆసిస్తున్నానని అన్నారు. కొవిడ్ సమయంలో ఆసుపత్రుల వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవాలందించారని అన్నారు. బ్లడ్ డోనేషన్, సీపీఆర్ క్యాంపు ల నిర్వహణలు మరిన్ని నిర్వహించి మండల స్థాయిలో కూడా సేవాలందించాలని కోరారు. కొవిడ్ సేవలందించిన రెడ్ క్రాస్ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందించారు.
చిత్తూరు జిల్లాలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ సర్వే సౌత్ బ్లాక్ లోని 13 వేల ఎకరాలు త్వరగా పూర్తి చేయాలని ఎపిఐఐసి డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఐ.ఎ. ఎస్. సూచించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో విసిఐసి పై డైరెక్టర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త, ఆర్డీవో కనకనరసారెడ్డి కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్ తో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి వస్తుంది ప్రాధాన్యత నివ్వాలని ప్రత్యేక దృష్టి అవసరం, కొవిడ్ వల్ల ఆలస్యం రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి కొవిడ్ విధులు నిర్వహించారు అన్నారు. ఇప్పుడు విసిఐసి భూసేకరణ సర్వే సౌత్ బ్లాక్ లోని 13 వేల ఎకరాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో తిరుపతి డివిజన్లలో విసిఐసి కారిడార్ 24 వేల ఏకరాలుగా వుందని, నార్త్ బ్లాక్ 11 వేల ఎకరాలు ,సౌత్ బ్లాక్ 13 వేల ఎకరాలుగా వుందని సూచించారు. సౌత్ బ్లాక్ విలేజ్ వైస్ సర్వే పూర్తి చేయాలని సూచించారు. నెల్లబల్లి - రౌతు సూరమాల రహదారి కి స్టార్టప్ ఏరియా ప్రాధాన్యత నిచ్చి సర్వే పూర్తి చేయాలని సూచించారు. కారిడార్ బ్రిడ్జెస్ ఎన్. హెచ్., ఆర్ అండ్ బి ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించారు. ఇండస్ట్రియల్ అవసరాలకు 45 కిమి కండలేరు వాటర్ లైన్ ప్రతిపాదనలు ఈనెల 21 నాటికి పూర్తిచేసి పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ సౌత్ బ్లాక్ రెండు మండలాలు తొట్టంబేడు లో 11 గ్రామాలు, బి.ఎన్. కండ్రిగలో 7 గ్రామాలకు సంబంధించి సర్వే 13 వేలకు గాను 7 వేలు పూర్తి అయిందని తెలిపారు. పట్టాభూములు ఇక్కడ 160 ఎకరాలు కాగా మిగిలినది డికెటి భూములు అని తెలిపారు. అక్టోబర్ 31 కి నాటికి స్టార్టప్ ఏరియా రౌతుసూరమాల వద్దమరో 500 ఎకరాల డికేటి అవార్డు పాస్ చేస్తామని సూచించారు. క్రిష్ణ పట్నం పోర్టు నుండి శ్రీసిటీ, పరిశ్రమల ఎగుమతులకు తప్పనిసరి కస్టమ్స్ డ్రై పోర్ట్ అవసరమని ఇక్కడే పర్మిషన్ వస్తుందని కోరారు. ఉత్పత్తులు చెన్నై కు వెళ్లే ఇబ్బందులు తప్పు తాయని డైరెక్టర్ ను కోరారు. ఆర్డిఓ వివరిస్తూ ఆలస్యానికి కారణం 300 ఎకరాలు సేకరణ అనంతరం ఏపీఐఐసీ అధికారులు కొంతకాలం ఆపమని సూచించారని తెలిపారు. రౌతు సూరమాల వద్ద స్టార్టప్ ఏరియా 2700 ఎకరాలకు గానూ 1067 పూర్తి అయిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.36 కోట్లు పరిహారం అందించామని తెలిపారు. డికేటి పరిహారం రూ.8 లక్షలు గా ఉందని తెలిపారు.సౌత్ బ్లాక్ పరిహారం కోసం రూ. 50 కోట్లు అవసరమని తెలిపారు. సమీక్షలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎల్.రామ్, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, ఏపీఐఐసీ సంబంధించిన శాఖల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా ఆర్దిక కార్యదర్శి నాపాలక్ష్మీనారాయణ మ్రుతిచెందంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా ఏకమై ఆ కుటుంబానికి రూ.15 ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని వివిధ రూపాల్లో దఫదఫాలుగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ దగ్గరుండి వీటిని ఆందించే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరించి సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన నేత మా మధ్య లేకపోయినా, ఆ కుటుంబానికి తాము భరోసా కల్పించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రతీఒక్క ఉద్యోగి ముందుకి వచ్చారన్నారు. ఉద్యోగుల ఐకమత్యం, ఉదార స్వభావం వలనే నాపా లక్ష్మీనారాయణ కుటుంబానికి ఈ సహాయం చేయడానికి వీలుపడిందన్నారు. ఆ మొత్తంలో కిసాన్ వికాస్ పత్రం :- 2,65,000/-, సుకన్య సమృద్ధి యోజన:- 1,25,000/-,లక్ష్మి నారాయణ తల్లి గారికి ;- 1,00000/-, కుటుంబ పోణకు 2,04000/- APAEOs తరుపున రూ:- 8,00000/- లక్షలు అందించినట్టు చెప్పారు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గ్రాడ్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ అందించడానికి కూడా అసోసియేషన్ ద్వారా క్రుషి చేస్తున్నట్టు రామాజంనేయులు వివరించారు. ఇదూ స్పూర్తితో సీపీఎస్ రద్దు కూడా సాధించి తీరుతామని స్పష్టం చేశారు..
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర వాసులు 0877-2227208 కాల్ చేయాలని కమిషనర్ గిరిష సూచిస్తున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తనతో మాట్లాడి చెప్పవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఈ-స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆన్ లైన్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ eస్పందన ద్వారా అర్జీలు ఆన్ లైనులో పెట్టుకోవచ్చున్నారు. అర్జీలు పెట్టేవారు సమస్య ఏ ప్రభుత్వ శాఖకు చెందినదో సదరు దరఖాస్తుపై తెలియజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నామన్న కమిషనర్ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ పరధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు నగరపాలక సంస్థకు విన్నవించుకోవాలని కమిషనర్ కోరారు.
కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని ప్రముఖ సామజసేవకులు సానారాధ పిలుపునిచ్చారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 5.0 నిబంధనలు అనుసరిస్తూ ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. వైరస్ ఉద్రుతి తగ్గిందనే అపోహలు మానుకొని, వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దసరా నవరాత్రుల వేళ ఒకే సారి అధిక సంఖ్యలో దేవలాయాల్లో భక్తులు వెళ్లకూడదని సూచించారు. ఒకవేళ వైరస్ సోకి పాజిటివ్ వచ్చినా ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ లో ఇంటి పట్టునే ఉండి వైద్యసేవలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకుంటూ, నిపుణుల సలహామేరకు ఎప్పటి కప్పుడు ఆవిరి పట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని అన్నారు. కరోనా వైరస్ ను ద్రుష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటిస్తూనే, ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేయడానికైనా ముందు సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని కోరారు. నాణ్యమైన శానిటైజర్లు మాత్రమే వినియోగించాలని, తక్కువరకం శానిటైజర్లు వినియోగించి చర్మవ్యాధులు కొని తెచ్చుకోవద్దని కూడా సానా రాధ ప్రజలకు సూచించారు. అవసరం అయితే తప్పా, బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారిని, ఐదేళ్ల లోపు పిల్లలను జాగ్రత్త చూసుకోవాలని ఆమె మీడియా ద్వరా ప్రజలను కోరారు...
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ద్వారా విన్నవించుకోవచ్చునని కమిషనర్ డా.స్రిజన పేర్కొన్నారు. ప్రతీసోమవారం జివిఎంసీ ప్రధానకార్యాలయంలో ఫోను 1800-4250-0009 నెంబరు ద్వారా ఉదయం 10.00 గం. నుండి 11 గంటలవరకూ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కోవిడ్ ను ద్రుష్టిలో పెట్టుకొని, డయల్ యువర్ కమిషనర్, మధ్యాహ్నాం 11 నుంచి ఒంటి గంటవరకూ ఈ స్పందన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మెయిల్ ద్వారా కూడా సమస్యలను పంపి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కోవిడ్ సమయంలోనూ అన్నిరకాలుగా అధికారులు సిద్దంగా వున్నారనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. అదేవిధంగా వార్డుల్లో కూడా ప్రజలు వార్డుసచివాలయాల్లో ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను నేరుగా జీవిఎంసిలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ.టి.డి.ఏ పరిధిలో ఉన్న 33 అంగన్వాడీ కార్యకర్తలు, 89 హెల్పర్లు, 28 మినీ అంగన్వాడీ కర్యకర్తల పోస్టులకు ఆర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 21 తేదీ నుంచి 27 తేదీలోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారిణి ఐ. సి.డి.ఎస్ ప్రాజెక్ట్ వారి కార్యాలయానికి నేరుగా గాని, రిజిష్టర్ పోస్ట్ ద్వారా గాని అందజేయవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ గ్రామ వివాహిత అయి ఉండి, 2020 జూలై ఒకటవ తేదీ నాటికి 21- 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, అలాగే 10వ తరగతి ఉత్తీ ర్ణులై ఉండాలని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వికలాంగులకు కేటాయించిన ఖాళీలను వినికిడి లోపముగల అభ్యర్థులు హియరింగ్ ఎయిడ్ తో వినగలిగి, సంభాసించగలిగి ఉండాలి. శారీరక వికలాంగులు పిల్లల సంరక్షణ చేపట్టగలిగి, పూర్తి ప్రాథమిక విద్యా నేర్పించగలిగి ఉండాలి,. దృష్టి లోపముగల అభ్యర్థులు ఇతరుల సహాయ సహకారం లేకుండా విధులు నిర్వహించగలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుతో సంబంధిత దృవ పత్రాలు గజిటెడ్ ఆఫీసర్ తో ఆటేస్టేషన్ చేయించి జత చేయాలని అలాగే ఇంటర్వ్యూ సమయంలో ఆసలు ధ్రువపత్రాలు తప్పక తీసుకొని హాజరుకావాలని తెలిపారు. ఈ ప్రక్రియలో మార్పులు, చేర్పులు, రద్దు చేయుటకు పూర్తి హక్కులు ఉన్నట్లు తెలియజేశారు.