1 ENS Live Breaking News

మాస్క్ ధారణ, సామాజిక దూరం తప్పని సరి..

కోవిడ్-19 పై జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కోవిడ్ -19 ఎప్రాప్రియేట్ బిహేవియర్ పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకొని పండగ సమయంలో గుంపులుగా లేకుండా చూసుకోవాలన్నారు. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ను ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, హైస్కూల్స్, కళాశాలు, పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్, పురుగు మందుల షాపులు, మెడికల్ షాపులు, తదితరమైనవి కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, శానిటేషన్ చేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కోవిడ్ నివారణ పై ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తమ స్వంత ఖర్చులతోనే ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని వెల్లడించారు.  పంచాయితీ, మున్సిపాలిటీల పరిధిలో హోర్డింగ్ లన్నీ 10 రోజులు పాటు కోవిడ్ నివారణ ప్రచారానికే వినియోగించాలని చెప్పారు.  ఆర్.టిసి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలలో విస్తృతంగా ప్రచారం చేయాలని, హాస్పిటల్ ల్లో బ్యానర్లు, పోస్టర్లు డిసిప్లే చేయాలని పేర్కొన్నారు. మసీదులు, దేవాలయాలు, చర్చ్ లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జియస్టి కార్యాలయాలు, బార్లు, బెవరేజస్ కార్పొరేషన్ లు, ఎక్సైజ్ కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, ప్రైవేట్ బస్సులు, లారీ, టాక్సీలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.   పెట్రోల్ బంకులు, పురుగు మందుల షాపులు, మెడికల్ షాపులు, స్విమ్మింగ్ ఫూల్స్, రేషన్ షాపులు, పర్యాటక స్థలాలు, తదితర వాటిలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.  గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓలు, తహసిల్థార్లు ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.  ఆర్.టి.సి.లో ఎన్ ఫోర్స్ మెంట్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.  డిపోలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.  మాస్క్ లు, శానిటైజర్లు  అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు కోవిడ్-19 ఎప్రాప్రియేట్ బిహేవియర్ పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ వివిధ ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలు, హోటల్స్, పర్యాటక ప్రాంతాలు, తదితర వాటిలో మాస్క్ లేనిదే ప్రవేశం లేదని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ చేసుకోవాలని చెప్పారు.  ఈ సమావేశంలో  జివిఎంసి కమిషనరు జి సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, డిఆర్ఓ ఎ. ప్రసాద్, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, డిఎస్ఓలు నిర్మలాభాయ్, శివ ప్రసాద్, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, డిపిఓ లింగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-21 20:22:31

ప్రత్యేక సవరణలకు ప్రతిపాదనలు..

భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021 లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అనుమతులకు ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్ తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో  మాట్లాడుతూ   ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ  షెడ్యూల్  గురించి తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో  ఇప్పటివరకు పోలింగ్ కేంద్రాలుగా వినియోగించిన భవనాల లో నిర్మాణ పనులు చేపట్టిన కారణంగా 2 పోలింగ్ కేంద్రాలు గా వేరే భవనాలను గుర్తించి, ప్రతిపాదనలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి కోసం పంపామని తెలిపారు. అరకు వేలీ నియోజకవర్గంలోని 17 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా పాఠశాలలు అప్ గ్రేడ్ అయిన కారణంగా వాటి పేర్లు మారినందున తదనుగుణంగా పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చడానికి ప్రతిపాదనలు రూపొందించినట్టు ఆయన వివరించారు. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం 1500 కంటే   ఎక్కువ ఓటర్లు నమోదైన పోలింగ్ కేంద్రాలను విడదీసి, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం భీమిలి నియోజకవర్గంలో   12 కొత్త పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేయడానికి, పెందుర్తి నియోజకవర్గంలో  5 కొత్త పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున జి.ఎ.నారాయణ రావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి గా కొప్పల రామ్ కుమార్, సిపిఎం నుంచి వి.వి. శ్రీ నివాసరావు, తెలుగు దేశం పార్టి తరపున ఎపియం సత్యనారాయణ పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-21 20:20:45

కరోనాపై మరింత అవగాహన పెంచుకోవాలి..

కరోనా వైరస్ పై ప్రజలు మరింతగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని జిల్లా కలెక్టర్, జీవిఎంసీ స్పెషల్ ఆఫీసర్ వి.వినయ్ చంద్ కోరారు.  బుదవారం బీచ్ రోడ్డు లో కోవిడ్ నియంత్రణ చర్యలపై జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, జిల్లా జాయింట్ కలక్టరు తో కలసి అవగాహన ర్యాలీ ప్రారంబించారు. జిల్లా కలక్టర్ వినయచంద్, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ కోవిడ్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో తగు జాగ్రత్తగా  వ్యవహరించాలని, అప్రమత్తతో మెలగాలని లేకపోతే రెండవ దశ ప్రారంభమైతే పెను ప్రమాదం తప్పదని ప్రజలకు సూచించారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, చేతులు సబ్బుతో గాని శానిటైజర్ తో గాని శుభ్రంగా కడుగుకోవాలని, మార్కెట్లు, ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు మొదలగునవి సందర్శించినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ అరుణ్ బాబు, డిఎంఓహెచ్ డా. పి.ఎస్. సూర్యనారాయణ, ఏ.ఎం.సి ప్రెసిడెంట్ డా. పి.యు. సుధాకర్, డి.ఇ.ఎం.ఓ. రత్నకుమారి, జివిఎంసి అదనపు కమిషనర్లు ఆశాజ్యోతి, రమణి, డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ప్రదాన ఇంజినీరు వెంకటేశ్వరరావు, రెండవ జోన్ కమిషనర్ శ్రీనివాస్,  ప్రాజెక్టు డైరెక్టర్ (యు.సి.డి) వై. శ్రీనివాస రావు, డి.సి(ఆర్) ఫణిరాం, ఏ.డి.హెచ్. ఎం.దామోదర రావు, పర్యవేక్షక ఇంజినీరులు, వార్డు సచివాలయాల కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.               

Beach Road

2020-10-21 20:12:01

దుఖాణదారులు నిబంధనలు పాటించాలి..

శ్రీకాకుళం జిల్లాలో దుకాణదారులు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అన్ని రకాల దుకాణదారులు, సినిమా హాళ్ళు, హోల్ సేల్ వర్తకులు తదితరులతో నగర పాలక సంస్ధ కార్యాలయంలో బుధ వారం సమీక్షించారు. కోవిడ్ అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైందని, అయితే ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని జాయింట్ కలెక్టర్ అన్నారు. జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి పూర్తిగా వైరస్ నిర్మూలన జరిగినట్లు కాదని గ్రహించాలని ఆయన స్పష్టం చేసారు. ప్రపంచంలో రెండవ దశ వ్యాప్తి ప్రారంభం అయినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని, కేరళ వంటి రాష్ట్రాల నుండి ఎక్కువ కేసులు నమోదు అవుతున్న పరిస్ధితులను గమనిస్తున్నామని చెప్పారు. వీటన్నింటి దృష్ట్యా ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కోవిడ్ తో అస్వస్తతకు గురై చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఇంటికి వెళుతున్న వారిలో సైతం శ్వాస, గుండె తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తుందని అన్నారు. ఏ ఒక్కరూ కోవిడ్ భారీన పడకూడదని, అందుకు తగిన ముందస్తు చర్యలు మేలు చేస్తాయని చెప్పారు. కిరాణా దుకాణాలు, సినిమా హాల్స్, వస్త్ర దుకాణాలు, హోల్ సేల్ తదితర అన్ని విభాగాల దుకాణదారులు స్వయంగా మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించడమే కాకుండా, భౌతిక దూరం పాటించాలని, తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని చేతులు శుభ్రపరచుకోవాలని ఆయన సూచించారు. దుకాణాలు, సినిమా హాల్స్ కు వచ్చే ప్రతి వ్యక్తి కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత దుకాణ యజమానులదేనని అన్నారు. థర్మల్ స్కానర్లు, మాస్కు, ఫేస్ షీల్డు, శానిటైజర్లు ఏర్పాటు చేయడమే కాకుండా బౌతిక ధూరం పాటించడం విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు.  ఈ సమావేశంలో నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, వర్తక, వ్యాపార సంఘ ప్రతినిధులు అంధవరపు రాము, కోణార్క్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-21 19:38:09

పులస వేట బంగ్లాదేశ్ లో నిషేధం..

పొలస(హిల్సా) చేపలు సంరక్షణలో భాగంగా బంగ్లాదేశ్  ప్రభుత్వం పొలస తల్లి చేపల వేటను నిషేధించిందని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాస రావు బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 14వ తేదీ నుండి నవంబరు 4వ తేదీ వరకు పొలస (హిల్సా) తల్లి చేపల సంరక్షణ ప్రచారంలో భాగంగా పొలస తల్లి చేపల వేటను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదించారని చెప్పారు. ఈ మేరకు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ విభాగం జాయింట్ సెక్రటరీ సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీ ఆదేశాల మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ రాష్ట్ర మత్స్యకారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసారని చెప్పారు. పొలస చేపల సంరక్షణ ప్రచార సమయములో పొలస(హిల్సా) చేపలు పట్టుట, అమ్ముట, రవాణా చేయుట బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదించిందని అన్నారు. దీనిని గమనించి మత్స్యకారులు ఎవరు బంగ్లాదేశ్ ప్రభుత్వ పరిధిలో బంగాళా ఖాతం  సముద్ర జలాల్లో  వేటకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. ఇంటర్నేషనల్ మెరిటైమ్  బోర్డరు లైను దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో  ఎవరైనా మత్స్యకారులు చేపల వేట చేయుచూ బంగ్లాదేశ్ నేవీ, కోస్ట్ గార్డ్ కు పట్టు బడితే  అరెస్ట్ కాబడి తీవ్రమైన పరిణామలకు గురి కాగలరని ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు అత్యంత జాగ్రత్త వహించాలని, ఎట్టి పరిస్ధితుల్లోనూ బంగ్లాదేశ్ జలాల్లో పొరపాటన కూడా వేటకు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేసారు. 

Srikakulam

2020-10-21 19:27:13

2 నుంచి గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షలు..

శ్రీకాకుళం జిల్లాలో  నవంబర్ 2 నుంచి 13వ తేదీ వరకు గ్రూప్ – 1 సర్వీస్( మెయిన్స్ ) పరీక్షలు జిల్లాలో జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్   నిర్వహించే  ఈ గ్రూప్ – 1 పరీక్షలు Descriptive type లో ఉంటాయని, ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 01.00గం.వరకు పరీక్షలు నిర్వహించబడతాయని కలెక్టర్  పేర్కొన్నారు. పరీక్షల వివరాలు ఈ విధంగా ఉంటాయని అన్నారు. నవంబర్ 2 - పేపర్ ఇన్ తెలుగు ( Qualifying Nature ), నవంబర్ 3-పేపర్ ఇన్ ఇంగ్లీష్ ( Qualifying Nature ), నవంబర్ 5  - పేపర్ – 1, నవంబర్ 7-పేపర్ –2, నవంబర్ 9 -పేపర్ -3, నవంబర్ 11-పేపర్ -4, నవంబర్ 13- పేపర్ -5 ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా 268 మంది అభ్యర్ధులు  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారని, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో 200 మంది, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో 68 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ వివరించారు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

Srikakulam

2020-10-21 19:23:51

ప్రముఖ ఆసుపత్రిగా ఎదగాలి..

ఉత్తరాంధ్రలోనే  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఒక ప్రముఖ ఆసుపత్రిగా పేరుగాంచాలని, అదే నా కోరిక అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధిపై బుధ వారం రిమ్స్ లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 7 నెలలుగా కోవిడ్ కోసమే మాట్లాడుతున్నామన్నారు. మౌలిక సదుపాయాలు ప్రస్తుతం కల్పించుకునే అవకాశం ఉందని తద్వారా ఆసుపత్రిలో అవసరాలను సమకూర్చుకోవచ్చని ఆయన చెప్పారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు రిమ్స్ ఆసుపత్రిలో బెడ్ కావాలని సిఫారసు చేయించుకునే స్ధాయికి వచ్చారని, అదే నమ్మకం సాధారణ సమయంలోనూ కొనసాగాలని సూచించారు. ఒక ప్రముఖ, లీడింగ్ ఆసుపత్రిగా వెలుగొందాలని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలను జిల్లా కలెక్టర్ నివాస్ ఎప్పుడూ ప్రశంసిస్తూండేవారని అంతటి ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రికి అవసరమగు కార్డియాలజి, యూరాలజి, నెఫ్రాలజి యూనిట్లు మంజూరుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రి వ్యవస్ధను పునవ్యవస్ధీకరించడం వలన యూనిట్లు మంజూరు సులభతరం కాగలదని చెప్పారు. తద్వారా వైద్య సీట్లు కూడా పెరుగుతుందని మంత్రి అన్నారు. జనరల్ మెడిసిన్ లో 4 యూనిట్లు ఉన్నాయని, కొత్తగా యూనిట్లు మంజూరుకు భవనం, స్థలం, బెడ్స్ లభ్యంగా ఉన్నాయని అన్నారు. పోస్టులు మాత్రమే అవసరమని, అందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నెఫ్రాలజీ సేవలు ప్రారంభించాలని మంత్రి సూచించగా ఇప్పటికే నెఫ్రాలజీ సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కార్డియాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు 6 గురు స్పెషలిస్టుల నియామకానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ స్వతహాగా వైద్యులుగా ఉన్న మంత్రి  మంత్రి మంచి సలహాలు, సూచనలు ఇచ్చారని తద్వారా కోవిడ్ లో జిల్లాలో చేపట్టిన చర్యలు మంచి పేరు తీసుకువచ్చాయని తెలిపారు. గతసారి మంత్రి చేసిన సమీక్ష మంచి ఫలితాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి మాట్లాడుతూ రాష్ట్ర వైద్య శాఖామంత్రి సందర్శించిన తరువాత  అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 50 నుండి 100కు పెంచారని, స్టాఫ్ నర్సుల పోస్టులు 180 కి పెరిగాయన్నారు. వైద్య సీట్లు 188 ఉన్నాయని,  2 వందలకు పెరుగుటకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం ఉందని చెప్పారు. సీనియర్ ఫెకల్టీ - ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అవసరం ఉందని అన్నారు. పెడియాట్రిక్స్, గైనకాలజీలో అదనంగా రెండు యూనిట్లు చొప్పున, జనరల్ మెడిసిన్ లో 3 యూనిట్లు అవసరమని పేర్కొన్నారు. తద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించగలమని చెప్పారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు లేవని, ఇతర ఆసుపత్రులకు మంజూరు చేసారని ఆమె వివరించారు. కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలలో సూపర్ స్పెషాలిటీ అవసరం ఉందని స్పష్టం చేసారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు వసతి సౌకర్యాల కొరత ఉందని, పోస్టు గ్రాడ్యుయేట్ లకు వసతి లేదని తెలిపారు. సి.టి స్కాన్ కు  16 స్లైడ్స్ అవసరమని, క్షేత్ర స్థాయి సందర్శనలకు 50 సీట్ల బస్సు అవసరమని వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, వైద్యులు డా.ఆర్.అరవింద్, డా.సునీల్ నాయక్, చలమయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు

Srikakulam

2020-10-21 19:13:27

ప్రజా రక్షణలో పోలీసు సేవలు అపారం..

ప్రజల రక్షణలో పోలీసుల సేవలు అపారమని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ అన్నారు. బుధవారం పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా  ప్రధాన న్యాయమూర్తి కోర్టు పోలీసు సమన్వయ అధికారులు హరికృష్ణ, ఇద్దరు కోర్టు గార్డులు బి. రమణ, వి. రవిని జిల్లా కోర్టు ఆవరణలో సన్మానించారు. పౌరుల రక్షణలోను, విపత్తుల వంటి సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ప్రజలు స్వేచ్చగా ఉండటానికి, ప్రాణాలు, ఆస్తులతో అభద్రతా భావం లేకుండా జీవించుటకు పోలీసుల సేవలు ప్రధానమన్నారు. కోవిడ్ 19 సమయంలో ప్రజల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టారని, కొంత మంది పోలీసు ప్రాణాలను వదిలారని, మరికొందరు కరోనా నుండి కోలుకుని తిరిగి విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రతను కూడా విస్మరించి ప్రజల ప్రాణాలకు, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వహించడం ముదావహమన్నారు. అమర వీరులను స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మృత్యవాత పడిన వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రజలు, న్యాయవ్యవస్ధ తరపున శ్రద్ధాంజలి ఘటించారు. అమర వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమర వీరుల ఆశిస్సులతో కుటుంబాలు ధైర్యంగా, మనోస్ధైర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. పోలీసులకు ప్రతి పౌరుడు సహాయ సహకారాలు అందించి, పోలీసుల విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా తోడ్పడాలని కోరారు. ఈ  కార్యక్రమములో   రెండవ అదనపు   జిల్లా  న్యాయమూర్తి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి తదితరు పాల్గొన్నారు .

Srikakulam

2020-10-21 19:09:56

రైతులను తక్షణమే ఆదుకోవాలి..

విశాఖజిల్లాలో అధిక వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, కౌలురైతులకు ప్రభుత్వం నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం డిమాండ్ చేశారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల అప్పులను ప్రభుత్వం మాపీ చేయాలన్న ఆయన జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పూర్తి నష్ట పరిహారం చెల్లింపునకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టనమోదు తొందరగా పూర్తిచేసి పంట నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని, ఎకరా వరికి రూ.25వేలు, చెరకుకు రూ. 60 వేలు, ఉద్యాన పంటలకు రూ. 50వేలు చొప్పున ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు, కౌలురైతుకు పంట పరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లోని 359 గ్రామాల్లో 15,087 మంది రైతులకు చెందిన 15,810 ఎకరాల పంటలు నీటమునిగాయని వివరించారు. అందులో వరి-13,647.5, చెరకు-1932.5, మొక్కజొన్న-22.5, పత్తి-82.5, రాగులు (చోళ్లు)-87.5, చిరుధాన్యాలు-5, రాజ్‌మా చిక్కుల్లు- 20, పొగాకు-12.5 ఎకరాలకు నష్టం జరిగింన్నారు. అధికారిక లెక్కల్లోనికి రాని, తమలపాకులు, ఆకుకూరలు వగైరా నీటమునిగిన పంటలు మర్ని వున్నాయన్నారు. వాటిని గుర్తించి రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఈ -క్రాప్‌లో నమోదుకాని రైతులకు కూడా పరిహారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్‌ చేశారు.

Visakhapatnam

2020-10-21 14:57:17

వైఎస్.ఆర్.బీమాతో కార్మిక కుటుంబాలకు భద్రత

వై.ఎస్.ఆర్.బీమాతో కార్మిక కుటుంబాలకు భద్రత నిస్తుందని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వై.ఎస్.ఆర్.బీమా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా  సి.ఎం. మాట్లాడుతూ, అసంఘటిత కార్మికుల  కుటుంబాలలోని కుటుంబ యజమానికి ప్రమాదం జరిగిన సందర్భంలో కుటుంబానికి వై.ఎస్.ఆర్.బీమా భద్రతనిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు రూ.510 కోట్లను వై.ఎస్.ఆర్.బీమా క్రింద అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ బీమా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం ఇబ్బందులు పడకూడదనే వుద్దేశ్యంతో ప్రభుత్వమే బీమాను చెల్లిస్తున్నదని తెలిపారు.  తెలుపు రేషన్ కార్డు వున్న కుటుంబాల వారు, ఈ పథకానికి అర్హులు అని తెలిపారు. 18 నుండి 70 సం.ల వయస్సు కలిగి కుటుంబాన్ని పోషించే వారందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం జరుగుతున్నదన్నారు.  లబ్దిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదని, మొత్తాన్ని రాష్ట్ర  ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 18 నుండి 50 సం.ల వయస్సు గల లబ్దిదారుడు సహజ మరణం పొందితే రూ. 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.  18 నుండు 50 సం.ల వయస్సు గల లబ్దిదారుడు పూర్తి అంగ వైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందించడం జరుగుతుందన్నారు.   51 నుండి 70 సం.ల వయస్సుగల లబ్దిదారుడు ప్రమాద వశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా , నామినీకి రూ.3 లక్షలు  చెల్లించడం జరుగుతుందన్నారు.  18 నుండి 70 సం.ల వయస్సు గల లబ్దిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.1.50 లక్షలు బీమా పరిహారాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు.   బీమా ప్రీమియంను బటన్ నొక్కగానే వారి బ్యాంకు ఖాతాలకు జమ కాబడతాయన్నారు.  బ్యాంకులు  ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తారని తెలిపారు. అనంతరం ఇన్సూరెన్సు కార్డులు వాలంటీర్ల ద్వారా  లబ్దిదారులకు అందచేయడం జరుగుతుందని తెలిపారు.  గ్రామ సెక్రటేరియట్ ద్వారా తక్షణ సహాయంగా పదివేల రూపాయలను తక్షణ అవసరాలకు అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.  కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఇన్సూరెన్సు  క్లెయిమ్ మంజూరు కావడంలో ఆలస్యం జరుగుందనే వుద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదనే వుద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం బటన్ నొక్కి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ప్రారంభించారు. జిల్లాలో పశు సంవర్థక శాఖామాత్యులు సీదిరి అప్పల రాజు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, కిల్లి కృపారాణితో కలిసి వై.ఎస్.ఆర్.బీమా బుక్ లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి  సంయుక్త కలెకర్టర్ శ్రీరాములు నాయుడు,  డిఆర్.డి.ఎ.  పి.డి బి.నగేష్, మెప్మా పి.డి. కిరణ్ కుమార్, ఎల్.డి.ఎం. హరిప్రసాద్,   కార్మిక శాఖ సహాయ కమీషనర్లు సి.హెచ్.పురుషోత్తం, రాధ, పద్మజ, సహాయకార్మిక అధికారి బి.కొండల రావు,, బీమా మిత్రలు, లబ్దిదారులు, తదితరులు హాజరైనారు.

Srikakulam

2020-10-21 14:43:24

పోలీసు సేవలు స్ఫూర్తిదాయకం..

పోలీసు సేవలు నిరుపమానమని, స్ఫూర్తిదాయకమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా శాసన సభాపతి సీతారాం, జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తదితరులు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అమర వీరుల జాబితా కలిగిన పుస్తకాన్ని  రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. శాసన సభాపతి సీతారాం మాట్లాడుతూ చైనా  తెంపరితనంతో వచ్చి దాడులకు పాల్పడిన సమయంలో సరిహద్దుల్లో ఉన్న పోలీసులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారన్నారు. అందరం కంటి నిండా నిద్ర పోతున్నాం అంటే పోలీసులు, భద్రతా దళాలు కారణం అన్నారు. పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు. పోలీసుల గురుతరమైన బాధ్యత నిర్వహణలో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకొనుటకు సూచనలు ఇవ్వాలని అన్నారు. పోలీసులు ఎప్పుడు కంట నీరు పెట్టరాదని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కోవిడ్ విధుల నిర్వహణకు ముందుకు వచ్చిన వారిలో పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు. పోలీసుల సేవలకు ప్రజలు, ప్రభుత్వం తరపున అభినందించారు. ఐపీఎస్ అధికారులు వ్యాస్, పరదేసి నాయుడు, ఉమేష్ చంద్ర వంటివారితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్.ఐ బంగారు నాయుడు, ఏ.ఎస్.ఐ వెంకట రమణ సేవలు మరువలేనివని అన్నారు. పోలీసులకు కుటుంబం ఉంటుంది, కానీ పండగలు, పబ్బాలు లేకుండా రోడ్ల మీద ఉంటారని అన్నారు. విధుల పట్ల అంకిత భావం గొప్పదని పేర్కొన్నారు. పోలీసుల సేవలు సరైన విధానంలో బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. పోలీసుల అసాధారణ సేవలను పాత్రికేయులు గుర్తించి సమాజాన్ని ఉత్తేజ పరిచే విధంగా కథనాలను ప్రచురించాలని కోరారు. పోలీసులు మానవత్వంతో పనిచేస్తున్నారని, పోలీసులకు, వారి కుటుంబాలకు  ఆదరాభిమానాలతో, అండగా ఉందామని పిలుపునిచ్చారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ పోలీసుల సేవలు అపారమన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడటంలో విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పోలీసులు ఉత్తమ విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టిన రోజు అమర వీరుల దినోత్సవం అన్నారు.  మాజీ పోలీసు అధికారిగా పోలీసు విధుల పట్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎంతో కష్టపడిన వ్యవస్థను చూసానని అన్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి విధులకు హాజరు కావలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఎప్పుడు తింటారో, ఎప్పుడు పడుకుంటారో తెలియదని, కేసులు, ప్రమాదాలు వచ్చినపుడు పరిస్థితి మరింత జఠిలంగా ఉంటుందని అన్నారు. పోలీసులు మన కోసం సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా కాలంలో లాక్ డౌన్ లో విధులకు వచ్చిన మొదటి బృందం పోలీసులని కొనియాడారు. కోవిడ్ లో ప్రజల ప్రాణాలు కాపాడారని అన్నారు. రాబోయే కాలంలో పోలీసు, రెవెన్యూ శాఖలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి దాయక సేవలు అందించాలని కోరారు. పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఈ ఏడాది 265 మంది పోలీసులు అసువులుబాసారన్నారు. అమర వీరుల నుండి స్ఫూర్తి పొందుతామని ఆయన పేర్కొన్నారు. నిస్వార్ధ సేవలు అందించే వృత్తి పోలీసు వృత్తి అన్నారు. కోవిడ్ 19లో అత్యంత ఉత్తమ సేవలు అందించారని పేర్కొన్నారు. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ఉత్తమ సేవలను ప్రజలకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అమరులైన జిల్లా పోలీసు కుటుంబాలకు సత్కరించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, మునిసిపల్ కమీషనర్ పి.నల్లనయ్య, అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు, అదనపు ఎస్పీలు పి.సోమశేఖర్, కె.శ్రీనివాసరావు, డిఎస్పీలు సి.హెచ్.జి.వి ప్రసాద్, డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎం.శివరామి రెడ్డి, ఎన్.ఎస్.ఎస్.శేఖర్, పాలకొండ ఇన్ ఛార్జ్ మరియు శిక్షణలో ఉన్న డి.ఎస్పి ఎం.శ్రీ లత., జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దువ్వాడ శ్రీనివాస్,  ఇన్స్పెక్టర్ లు, ఎస్.ఐలు

Srikakulam

2020-10-21 14:35:08

మాస్కే మన కవచం..

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కే కవచమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బుధ వారం ఏడు రోడ్ల కూడలి నుండి భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి సీదిరి అప్పల రాజు ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై నినాదాలతో స్వామి వివేకానంద కూడలి వరకు వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్ధ, అధికారులు, సిబ్బంది, వ్యాపార వర్గాలు, ప్రజలు ర్యాలీలో పాల్గొని నినదించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా కరోనాతో పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో రోజుకు 70 వేల పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను దేశం నలుమూలల నుండి అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. మౌళికసదుపాయాలు భారీగా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్ధ, వాలంటీరు వ్యవస్ధ కోవిడ్ ను ఎదుర్కొనడంలో కీలంకగా పనిచేసాయని అన్నారు. లాక్ డౌన్ ల విధింపుతో ఇంకా ఎంత కాలం బాధలు పడాలని ప్రజలు భావించే పరిస్ధితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతోందని పేర్కొంటూ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో పండగలు నిర్వహించుకునే సమయమని, ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తద్వారా కేసులు పెరుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా రెండవ దశ వ్యాప్తి ప్రారంభం అయినట్లు సర్వేలు చెపుతున్నాయని, ఇటుంటి దశ రాష్ట్రంలో రాకుండా ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. ప్రజల్లో ఇంకా నిర్లక్ష్యం నిర్లిప్తత భావన ఉందని అన్నారు. ప్రజలు చైతన్యవంతం కావాలని, అవగాహన పెంపొందించుకుని వైరస్ భారీన పడకుండా ఉండాలని కోరారు. ప్రజల్లో అవగాహన కలిగించుటకు గ్రామ సచివాలయం పరిధి నుండి జిల్లా స్ధాయి వరకు ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు.           జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ కరోన వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కు కవచంలా పనిచేస్తుందన్నారు. అందుకే మాస్కే కవచం నినాదంతో ప్రజలను అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రజలు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంత అవగాహన రావాలని అన్నారు. కరోనా రహిత జిల్లా ఆవిర్భవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పి.వి.రమణ, వైద్య శాఖ అధికారులు కృష్ణ మోహన్, సి.హెచ్.మహాలక్ష్మి, నగర పాలక సంస్ధ ఆరోగ్య అధికారి ఎం.వెంకట రావు, ప్రత్యేక అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దువ్వాడ శ్రీనివాస్., డా.మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.  

Srikakulam

2020-10-21 14:30:37

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హైకోర్టు సిజె..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జితేంద్ర‌కుమార్ మహేశ్వ‌రి మంగ‌ళ‌వారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.  ఆలయం వద్ద టిటిడి ఈవో  కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈఓ  ధర్మారెడ్డి క‌లిసి స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా జ‌రిగిన గ‌రుడ‌సేవ‌లో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పాల్గొన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా జ‌డ్జి  ర‌వీంద్ర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అదనపు ఈవో ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  జితేంద్ర‌కుమార్ మ‌హేశ్వ‌రి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. సీజె వెంట ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌)  స‌దా భార్గ‌వి, బోర్డు స‌భ్యులు  రామేశ్వ‌ర‌రావు,  వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి,  ముర‌ళీకృష్ణ‌, డా. నిశ్చిత‌,  జి.వి.భాస్క‌ర్‌రావు, పుత్తా ప్ర‌తాప‌రెడ్డి,  శివ‌కుమార్‌, శివ‌శంక‌ర‌న్‌, ‌ గోవింద‌హ‌రి,  డిపి.అనంత‌,  కుమార‌గురు,  ర‌మేష్‌‌ శెట్టి, సిహెచ్‌.ప్ర‌సాద్‌,  దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌ధిరెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్పి  ఎ.ర‌మేష్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్, పేష్కార్  జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-20 21:33:46

స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధస్థానం దిశగా కష్టపడాలి..

స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో ప్రధమ స్థానమే లక్ష్యంగా శ్రమించి పనిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి.సృజున అధికారులను ఆదేశించారు. మంగళవారం విఎంఆర్డీఏ ఎరీనా చిల్ద్రెన్ ధియేటర్ లో శానిటరీ ఇన్స్పెక్టరులు, శానిటరీ కార్యదర్శుల సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021లో  ప్రధమ స్థానం సాధించాలంటే శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు ఇప్పటి నుండే పనిచేయాలని ఆదేశించారు. ఓడబ్ల్యూఎంఎస్ స్కానింగు గేట్స్ తక్కువుగా ఉన్న 10 వార్డులను గుర్తించి ఆయా వార్డు శానిటరీ ఇన్స్పెక్టరులకు షో కాజ్ నోటీసు ఇచ్చి 3 రోజులలోగా వివరణ తీసుకోవాలని అదనపు కమిషనర్ వి. సన్యాసి రావు ఆదేశించారు. మరల రిపీటు అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పలు వారులలోని స్కేనర్లు కనిపించక పోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తపరుస్తూ మొత్తం 1950 స్కేనర్లు ఉండాలని,  కనిపించకుండా పోయిన స్కేనర్ల ను వెంటనే పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి నంబరు తీసుకోవాలన్నారు. వార్డు కార్యదర్శులు ఉదయం 6గం.ల నుండే విధులలో హాజరు కావాలని అన్నారు. వార్డు కార్యదర్శులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. స్కేనింగు గేట్సు తక్కువుగా ఉన్న వార్డు పరిధిలోని సచివాలయాల శానిటరీ కార్యదర్శుల డైరీలను పరిశీలించారు. డైరీ లేకుండా వచ్చిన 36వ వార్డు శానిటరీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తపరుస్తూ    సమావేశం నుండి బయటకు పంపించారు. ఉద్యోగంలో చేరి సంవత్సరకాలం పూర్తీ అయినప్పటికీ వార్డు శానిటరీ కార్యదర్శులు తమ విధులపై పూర్తీ అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకపై అలా జరగకూడదని హెచ్చరించారు. అదనపు కమిషనర్ దా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ సర్వీసు రిక్వెస్ట్ లు 40కి పైగా సచివాలయాలలో ఒక్కటీ నమోదు అవకపోవడం పై ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇక ప్రతీ వార్డులోని సర్వీసు రిక్వెస్ట్ నమోదు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. సర్వీసు రిక్వెస్ట్ లో సమాదానం ఒకే  పదంలో కాకుండా, 2 లేక 3 వాక్యాలలో ఉండాలని సూచించారు. సి.ఎమ్.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ జాబ్ చార్టు ప్రకారం ఉదయం 6గం. ల నుండే శానిటరీ కార్యదర్శులు విధులలో ఉండాలని, డైరీలో ప్రతీ రోజూ చేసిన పని వివరాలు ఉండాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు, ఒక టీంగా కూర్చొని మైక్రో పోకెట్స్ వైజ్ పని వివరాలు చర్చించుకోవాలన్నారు. బయట ఏరియాలలో ఎక్కడ బడితే అక్కడ చేపల వ్యాపారం జరుగుతుందని, అలా జరగకుండా సచివాలయ శానిటరీ కార్యదర్శులు  చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎమ్.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్.లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టరులు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.   

2020-10-20 21:19:15

మనమంతా పోలీసులకు సహకరిద్దాం..

శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల విధి నిర్వహణకు సహకరించి మంచి సేవలు అందించేందుకు కృషి చేద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధ వారం పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేసారు. 1959 సంవత్సరంలో ఇండియా – టిబెట్ దేశ సరిహద్దుల రక్షణలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల చైనా దాడి చేయడంతో పలువురు పోలీసులు మృత్యువాత పడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుండి జాతీయ పోలీసు అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. పౌరుల రక్షణలోను, విపత్తుల వంటి సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఇటువంటి అమర వీరులను స్మరించడం మన విద్యుక్త ధర్మమని ఆయన చెప్పారు. ప్రజలు స్వేచ్చగా ఉండటానికి, ప్రాణాలు, ఆస్తులతో అభద్రతా భావం లేకుండా జీవించుటకు పోలీసుల సేవలు ప్రధానమన్నారు. కోవిడ్ 19 సమయంలో ప్రజల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టారని, కొంత మంది పోలీసు ప్రాణాలను వదిలారని, మరికొందరు కరోనా నుండి కోలుకుని తిరిగి విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. వ్యక్తిగత భద్రత, కుటుంబ భద్రతను కూడా విస్మరించి ప్రజల ప్రాణాలకు, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వహించడం ముదావహమన్నారు. అమర వీరులను స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాన్ని ఇవ్వాలని కోరారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మలకు శాంతి కలుగాలని కోరుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో మృత్యవాత పడిన వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రజలు, న్యాయవ్యవస్ధ తరపున శ్రద్ధాంజలి ఘటించారు. అమర వీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అమర వీరుల ఆశిస్సులతో కుటుంబాలు ధైర్యంగా, మనోస్ధైర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. పోలీసులకు ప్రతి పౌరుడు సహాయ సహకారాలు అందించి, పోలీసుల విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా తోడ్పడాలని కోరారు. 

శ్రీకాకుళం

2020-10-20 21:16:30