1 ENS Live Breaking News

సీతమ్మధారలో 12ఎకరాల్లో ఆక్రమణలు..

విశాఖనగరంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్టు అర్బన్ తహసీల్దార్ జ్ఞానవేణి తెలిపారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు  పరిరక్షణలో భాగంగా నగరంలోని సీతమ్మధార మండల పరిధిలోగల ప్రభుత్వ భూములన్నింటినీ మండల సర్వేయర్,  రెవెన్యూ ఇన్స్పెక్టర్ 'గ్రామ రెవెన్యూ అధికారులు రెండు టీములుగా గత నెల రోజుల నుండి సర్వే చేసినట్లు   ఆక్రమణలు  సుమారుగా పన్నెండు ఎకరాల్లో (కొండ పోరంబోకు , చెరువులు , వాగులు, గయాలు ) వుండగా, రెగ్యులరైజేషన్ కాని ఆక్రమణలు 15%  ఉన్నాయని వారికి రెగ్యులరైజేషన్ దరఖాస్తులు చేసుకోమని తెలియజేయడమైనదని పేర్కొన్నారు. అభ్యంతరకర ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఆక్రమణ దారుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాధానాలు వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

సీతమ్మధార

2020-10-17 20:55:33

లోక్ అదాలత్ ద్వారా 287 కేసులు పరిష్కారం..

శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా 287 కేసులు పరిష్కరించివట్లు జిల్లా జడ్డి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు.  శనివారం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగిందని,  17 బెంచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  సివిల్  కేసులు 10,    9 మోటార్ యాక్సిడెంట్ కేసులు , సివిల్ సెటిల్ మెంట్ కేసులు, 128  కాంపౌండబుల్ క్రిమినల్   కేసు, 14 ఎన్.ఐ. యాక్టు చెక్ బౌన్స్ కేసులు, 53 సి.సి. అడ్మిషన్ కేసులు, 70 ఎక్సైజ్ కేసులు, కన్స్యూమర్ కేసు  (01)ఒకటి, ఎస్.టి.సి. కేసులు  (02) రెండు  పరిష్కరించినట్లు తెలిపారు.  కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ మరియు లీగల్ సర్వీసెస్ అధారిటీ నోడల్ అధికారి సుమీత్ కుమార్, డి.ఆర్.ఓ. బి.దయానిధి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-17 20:22:49

సచివాలయాల ద్వారా 100% సేవలు అందాలి..

సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడనాకి అన్నిశాఖల అధికారులు శక్తివంచన లేకుండా క్రుషిచేయాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను కోరారు. శనివారం  జివిఎంసికి సంబందించిన పలు విభాగాల పనితీరును  ప్రజా ప్రతినిదులు, జివిఎంసి కమీషనర్ తో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అడిగిన పలు సమాదానాలకు సంబందిత విభాగాదిపతులు సవివరమైన సమాదానాలు బదులిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు విషయాలను మంత్రి అడుగగా కమిషనర్ సమాధానమిస్తూ కార్పోరేషన్ 572 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసామని, వాటిలో వివిధ కేటగిరీలలో కార్యదర్శులు ప్రభుత్వ అదేశాల ప్రకారంగా పరిపాలన కార్యదర్శుల అధ్వర్యంలో విదులు  నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సచివాలయాల పరిధిలో 10,200 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.  రెవెన్యూ విభాగపు పనితీరును సమీక్షిస్తూ మంత్రివర్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సమాధానమిస్తూ సంవత్సరమునకు రూ.350.00 కోట్లు ఆస్తి పన్ను, రూ.150.00 కోట్లు నీటి చార్జీలు రూపంలో, పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా రూ.100.00 కోట్లు రాబడి రాగా, ఆ మొత్తంతోనే కార్పోరేషన్ నిర్వహణ చేస్తున్నామన్నారు. పట్టణ ప్రణాళిక పనితీరుపై మంత్రివర్యులు సమీక్షిస్తూ ఇంటికి ప్లాను మంజూరు జరుగుతున్న విదానం, అక్రమ కట్టడాల నియంత్రణ, బిపీఎస్ అమలు తీరుపై చర్చించగా చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత సమాధానమిస్తూ ప్రభుత్వ ఆదేశాల పరంగా ఓబిఎమ్ఎస్ పద్దతి ద్వారా ఇండ్ల నిర్మాణ ప్లానులను మంజూరు జరుగుతున్నదని, బిపిఎస్ విదానం కింద 6120 అప్లికేషన్లు రాగా 5800 అప్లికేషన్లు పరిష్కరించబడగా మిగిలినవి నెల ఆఖరిలోగా పరిష్కరిస్తామన్నారు. సాంకేతిక పరంగా కొత్త యాప్ ను ప్రస్తుతం నగరంలో జరుగుతున్న నిర్మాణదశలో ఉన్న కట్టడాలను గుర్తిస్తున్నామన్నారు. జివిఎంసి ఇంజినీరింగు పనితీరుపై సమీక్షించగా ప్రధాన ఇంజినీరు బదులిస్తూ ఈ సంవత్సరంలో రూ.382.00కోట్లు ప్రతిపాదిత పనులు ప్రారంబించడమైనదని, రూ.130.00 కోట్లు పనులు సాధారణ పనులైన రోడ్లు, కాలువల పనులు సంబందించినవి ప్రధాన ఇంజినీరు వివరించారు. కాపులుప్పడ దంపింగు యార్డులో చేపడుతున్న చెత్త రహిత ప్రాజెక్టులపై మంత్రివర్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సవివరణమైన సమాధానమిచ్చారు. ప్రజారోగ్య పనితీరుపై కమిషనర్ సమాధానమిస్తూ, ఉన్నకార్మీకులతోనే జివిఎంసి పరిధిలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని, వాటి పనితీరును కూడా క్షేత్ర స్థాయిలో వివిధ స్థాయి అధికారులు పరిశీలన చేస్తన్నారని కమిషనర్ వివరించారు. నగరంలో ఆధునిక స్మశాన వాటికల  ఏర్పాటు   గురుంచి  మంత్రివర్యులు  వివరణ అడుగగా, ఇప్పటికే నగరంలో మూడు చోట్ల చావులమదుం, బక్కన్నపాలెం, గాజువాక స్మశాన వాటికల ఆధునికరణకు చర్యలు చేపడుతున్నామని, అనకాపల్లి, పెందుర్తిలలో ఆధునిక స్మశాన వాటికలు నిర్మాణానికిగల అవకాశాలను పరిశీలిస్తున్నామని కమిషనర్ వివరించారు. కోవిడ్ పై కమిషనర్ వివరిస్తూ, జూలై నుండి నేటివరకు 1,66,000 టెస్టులు చేయగా 24000 కేసులు పోజిటివ్ గా గుర్తించామని, మొదటిలో నూటికి సుమారు 30 శాతం పోజిటివ్ కేసులు రాగా, ప్రస్తుతం 3 నుండి 4 శాతం  వరకు కేసులు నమోదు అవుతున్నాయని కమిషనర్ మంత్రివర్యులకు వివరించారు. పట్టణ సామాజిక అభివృద్ధి పనితీరుపై మంత్రి సమీక్షిస్తూ గ్రామీణ విశాఖ బ్యాంకుల్లో ప్రతీ రోజు తక్కువ గ్రూపులకు ఆర్ధిక సహాయం జరుగుచున్నదని, ఈ విదంగా జరిగితే అనుకున్న టార్గెట్ ను చేరుకోలేమని కావున యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ ను గ్రామీణ బ్యాంకు మేనేజరుతో చర్చించి ఎక్కువ మహిళా గ్రూపులకు ఆర్ధిక సహాయం అందించాలని సూచించారు. నగర పరిధిలో గల శాసన సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు కమిషనర్ మరియు సంబందిత విభాగాదిపతులు సమాధానమిచ్చారు.            ఈ సమీక్షా సమావేశంలో శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ఎ.అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, నియోజిక వర్గ సమన్వయ కర్తలు  కె.కె.రాజు, వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్, అదనపు కమిషనర్లు అవ్వారి వెంకట రమణి, డా. వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు వెంకటేశ్వర రావు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాస రావు, డిసి(ఆర్) ఫణిరాం, పర్యవేక్షక ఇంజినీరులు  తదితరులు  పాల్గొన్నారు.

జీవిఎంసీ ప్రధాన కార్యాలయం

2020-10-17 20:21:18

జర్నలిస్టుల సమస్యల పరిష్కారాని క్రుషి..

విశాఖ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ‌హామీ ఇచ్చారు. శనివారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్‌ ‌జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ,ఫెడరేషన్‌ అర్బన్‌ అధ్యక్షుడు పి నారాయణ్‌, ‌బ్రాడ్‌ ‌కాస్ట్ ‌జర్నలిస్టుల జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు , రాష్ట్ర కౌన్సిల్‌ ‌సభ్యులు బి ఆనంద్‌ ‌తదితరులు వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు జర్నలిస్టులతో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయిన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి జర్నలిస్టుల కృషి వారు తనకు ఇచ్చిన సలహాలు , తనకు , ఎంతోగానో ఉపకరించాయిన్నారు. భవిష్యత్‌లో కూడా తన వంతు సహకారం వారికి అందిస్తానని  అలాగే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లేందుకు  కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కోన్నారు. జర్నలిస్టుల అభివ్రుద్ధికి సీఎం కూడా క్రుత నిశ్చయంతో ఉన్నారనే విషయాన్ని తెలియజేశారు.

Visakhapatnam

2020-10-17 20:01:21

సెక్రటరీ, వీఆర్వోలకు షోకాజ్ నోటీసులివ్వండి..

గ్రామసచివాలయాల్లో సిబ్బంది విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జెసి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం, హంపాపురం గ్రామసచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రజలకు సచివాలయాల ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందించాలన్నారు. ఏ ఒక్కరూ గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు రాకుండా సమస్యలు ఇక్కడే పరిష్కారం కావాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహించిన విఆర్వో, గ్రామ కార్యదర్శిలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను, నోటీసు బోర్డులను పరిశీలించారు. పెండింగ్ 55 దరఖాస్తులు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు సచివాలయం నుంచే జారీచేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Rapthadu

2020-10-17 19:35:43

హెచ్ఎల్సీ కాలువ నీటి సరఫరా పై ఆరా..

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కెనాల్ బాట పట్టారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ఎంతమేరకు వస్తోంది, కాలువ గట్ల స్థితిని తెలుసుకునేందుకు హెచ్ఎల్సీ కాలువ మీదుగా పర్యటించారు. శనివారం కనేకల్ మండల కేంద్రం వద్దనున్న చిక్కణ్ణేశ్వర వడియార్ చెరువును, హెచ్ఎల్సీ కాలువను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిక్కణ్ణేశ్వర వడియార్ చెరువులో నీటి నిల్వ ఎంత ఉంది,  హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం ఎంత ఉంది, రావాల్సిన వాటా ప్రకారం నీటి వాటా వస్తోందా లేదా అనే వివరాలను హెచ్ఎల్సీ ఎస్ ఈ రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెచ్ఎల్సీ కాలువపై ఉన్న బ్రిడ్జ్ ను పరిశీలించారు. అనంతరం హెచ్ఎల్సీ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. హెచ్ఎల్సీ కాలువలో నీటి ప్రవాహం పూర్తి స్థాయిలో వెళుతుందా లేదా అని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంతకు కొన్ని రోజుల ముందు ఐఏబి సమావేశం జరిగిందని, అందులో నిర్ణయించిన మేరకు హెచ్ఎల్సీ కాలువలో నీటి వాటా వస్తోందా లేదా, నీటి వాటా మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి సరఫరా చేసేందుకు, కాలువ కింద ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతున్నాయి తదితర అంశాల పరిశీలనకు కాలువ బాట కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ ఉషారాణి, హెచ్ఎల్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కనేకల్

2020-10-17 19:05:06

నాడు-నేడు పనుల్లో తేడాలొస్తే ఉపేక్షించేది లేదు..

అనకాపల్లి నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు పాఠశాలలు తెరిచేనాటికి పూర్తిచేయాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ అధికారులను ఆదేశించారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మనబడి, నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిల్లలు పాఠశాలలకు వచ్చే సమయానికి పాఠశాలలన్నీ చక్కగా కనిపించాలన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో నాణ్యతలో రాజీలేకుండా అన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తిచేయాలన్నారు. ఎక్కడైనా తేడా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తాను స్వయంగా పరిశీలిస్తానని ఎక్కడ తేడా వచ్చినా చర్యలు తప్పవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, పట్టణ కార్యదర్శి సూరి శెట్టి రమణ అప్పారావు, జాజుల రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు..

Anakapalle

2020-10-17 15:53:32

యంగ్ అచీవర్ నిఖితకు మంత్రి కితాబు..

ఆ విద్యార్ధిని ఏయూలో జర్నలిజం చదువుతూనే తన టేలంట్ ను నిరూపించుకుంది. అవార్డులతో విశాఖ కీర్తిని దేశ స్థాయిలో చాటింది. దీంతో విశాఖలోని శనివారం  నగరంలోని సితమ్మధార  క్యాంపు కార్యాలయంలో  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు యంగ్ అఛీవ్ మెంట్ అవార్డు  గ్రహీత చల్లపిల్లి నిఖితను స్వయంగా అభినందించాలరు. ప్రతి సంవత్సరం నిర్వహించే  వి ఇండియా అవార్డ్స్  కోసం ..ఈ సంవత్సరానికి (2020) నిర్వహించిన వుమెన్ ఎక్సలెంట్ అఛీవ్ మెంట్ అవార్డులు లలో  భారతదేశం నుంచి విద్యార్దిని నిఖిత  ఎమోషనల్ ఎడ్యుకేషన్ టు వుమెన్  అనే అంశం పై అవార్డ్ ను కైవసరం చేసుకున్నారు. ఈ సందర్భంగా  మంత్రి ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింతగా రాణించాలని,  మరెన్నో అవార్డులను తెచ్చుకోవాలని ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

Seethammadara

2020-10-17 14:34:22

అనంతలో ప్లాస్మా అఫెరెసిస్ యంత్రం ప్రారంభం..

 అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని అనంతపురం, హిందూపురం ఎంపిలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో కోవిడ్ పాజిటివ్ వచ్చినవారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇంతకుముందు ఆగస్టు లో జరిగిన కోవిడ్ రివ్యూ మీటింగ్ లో, అంతకుముందు జరిగిన సమావేశాలలో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి విన్నవించగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ ట్రీట్ మెంట్ లో భాగంగా ప్లాస్మా థెరపీ ని మొదలుపెట్టామని, అందులో భాగంగా 170 మందికి ప్లాస్మా ట్రీట్మెంట్ చేసి వారి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ప్లాస్మా కోసం ఇంతకుముందు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ పై ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఇక్కడే ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అలాంటి పరిస్థితుల నుంచి బయట పడ్డామన్నారు. భవిష్యత్తులో కోవిడ్ ట్రీట్మెంట్ నే కాకుండా ఇతర అన్ని రకాలుగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రం ఉపయోగపడుతుందని, పాజిటివ్ వచ్చిన వారికి మంచి మెడికల్ సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 12 కోవిడ్ ఆస్పత్రిలు ఉన్నాయన్నారు. ఆసుపత్రులలో కోవిడ్, నాన్ కోవిడ్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి, అనంతపురం సర్వజన ఆసుపత్రి లో దశలవారీగా  కోవిడ్, నాన్ కోవిడ్ కేసులు టేకప్ చేయడం జరుగుతుందన్నారు. మునుపటి మాదిరిగానే కోవిడ్, నాన్ కోవిడ్ సర్వీసులు అందిస్తామని, దశలవారీగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ కేసులకు వైద్య సేవలు అందించడం  జరుగుతుందన్నారు.జిల్లాలో 5 శాతం కంటే పాజిటివిటి రేటు తక్కువగా ఉందని, జిల్లాలో 17 కోవిడ్ కేర్ సెంటర్ లు ఉండగా 8 తగ్గించామని, వాటిలో కూడా 1,2 కోవిడ్ కేర్ సెంటర్ లు మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో ప్లాస్మా అఫెరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు సాధ్యమైందన్నారు. కోవేట్ బారిన పడినవారికి వైద్య సేవలు అందించడం ఒక యుద్ధం లాంటిదని, ప్లాస్మా అఫరెసిస్ యంత్రం ఏర్పాటు వల్ల వైద్య సేవలు అందించేందుకు ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్య సేవలు అద్భుతంగా అందిస్తున్నారని, ప్లాస్మా అఫరెసిస్ యంత్రం మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ఇంచార్జ్ డిఎంఅండ్హెచ్ఓ పద్మావతి, ఆడిసినల్ డిఎంఅండ్హెచ్ఓ రాము సుబ్బారావు, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. 

సర్వజన ఆసుపత్రి

2020-10-17 14:24:04

ఈనెల 19నుంచి సర్టిఫికేట్లు పరిశీలన..

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుండి విద్యార్ధుల సర్టిఫికేట్లను పరిశీలన చేయనున్నట్లు మహాత్మా జ్యోతీ బాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల (బాలుర) ప్రిన్సిపాల్ జల్లు లక్ష్మణ మూర్తి శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు.  అంపోలు శాస్త్రుల పేట వద్ద గల బాలుర పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి లాటరీ పధ్ధతి ద్వారా ఎంపికైన విద్యార్ధుల సర్టిఫికేట్లను ఈ నెల 19 మరియు 20వ తేదీలలో  పరిశీలించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్ధి,  రికార్డు షీట్స్, తల్లి తండ్రుల మరియు విద్యార్ధుల ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలు, రేషన్ కార్డు, కుల ధృనీకరణ పత్రం జెరాక్స్ కాపీలు మరియు 1- 4 వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లు ఒరిజనల్, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్, తల్లి యొక్క బ్యాంకు పుస్తకం జెరాక్సు కాపీ,  విద్యార్ధి యొక్క ఆరు పాసు పోర్టు సైజ్ ఫోటోలు, తల్లి తండ్రుల ఫోటోలు నాలుగు తీసుకు రావాలని తెలిపారు.

Gurukulam

2020-10-17 13:57:00

వర్చువల్ అదాలత్ లతో సత్వర న్యాయం

వర్చ్యువల్ లోక్ అదాలత్  కార్యక్రమం ద్వారా సత్వర న్యాయాన్ని అందిస్తున్నట్టు విజయనగరం జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు.  శనివారం, లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా కోర్టు ఆవరణలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించు నిమిత్తం  కరోనా నేపథ్యంలో న్యాయ సేవాధికార సంస్ధ వర్చ్యువల్ (వీడియో కాన్ఫరెన్సు) ద్వారా లోక్ అదాలత్ నిర్వహించ వలసినదిగా హైకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కావున హైకోర్టు ఆదేశాలను అనుసరించి,   జిల్లా లోని అన్ని కోర్టులలోను వీడియో కాన్ఫరెన్సు ద్వారా  లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.  ఇరు పార్టీల కక్షిదారులు ఇంటి నుండే తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ  అవకాశాన్ని  కలిగించడం జరిగిందని తెలిపారు.   మారుమూల ప్రాంతాలలో న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా సమయం, ధన నష్టం నివారణకు అవకాశం వుందన్నారు.  త్వరితగతిన నిర్ణీత సమయంలో న్యాయాన్ని అందించడం జరుగుతుందన్నారు.  లోక్ అదాలత్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయన్నారు.  మీడియేషన్ మరియు కౌన్సిలింగ్ ద్వారా ఇరు  పార్టీలు,  అంగీకారం మరియు ఆమోదం మేరకు శాంతియుతంగా పరిష్కారం లభిస్తుందన్నారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్స్ యాక్టు కేసులు, మోటారు యాక్సిడెంటు   క్లెయిమ్  కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ప్రభుత్వ భూసేకరణ కేసులు, బ్యాంక్ కేసులు, సివిల్ కేసులు, రెవిన్యూ కేసులు, ఇతర రెవిన్యూ కేసులు, సర్వీస్ మేటర్సు, పాత పెండింగ్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు, రాజీ మార్గం ద్వారా పరిష్కరించు కోవచ్చునని తెలిపారు. జిల్లా కోర్టు మరియు జిల్లాలోని  ఇతర కోర్టులలోని న్యాయ సేవాధికార సంస్ధ వారు వర్చువల్ ద్వారా  కేసులను రాజీచేయడం ద్వారా పరిష్కరించడం జరుగుతున్నదని  తెలిపారు.          కేసుల పరిష్కారానికి మూడు బెంచీల ను ఏర్పాటు  చేసామని,  పి.అన్నపూర్ణ, ఫ్యామిలీ కోర్టు కం-III అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి  మరియు జి.రాధా రాణి అడ్వోకేట్   మెంబరు లతో మొదటి బెంచ్ ఏర్పాటు చేసామని  తెలిపారు.   కె. నాగమణి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మరియు  జి.వనజాక్షి, అడ్వోకేట్ మెంబర్ లతో రెండవ బెంచ్ ఏర్పాటు చేసామని, కె.జయలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి-కం-సెక్రటరీ  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అడ్వోకేట్ మెంబరు పి.రమేష్ కుమార్ లతో 3వ బెంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అవసరం మేరకు మరిన్ని బెంచ్ లు ఏర్పాటు చేసి త్వరితగతిన కేసులను పరిష్కరిస్తామని  జిల్లా జడ్జి తెలిపారు.

Vizianagaram

2020-10-17 13:48:40

జలదిగ్బంధంలోనే నిడదఓలు సత్తమ్మతల్లి..

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ దేవస్థానం నిడదఓలు సత్తెమ్మతల్లి ఆలయం ఇంకా వరదనీటిలోనే ఉంది. ఇక్కడి ఎర్రకాలువ వరద నీరు ప్రవాహంతో అమ్మవారి ఆలయం నిండిపోయింది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను గంగమ్మ తాకింది. ఈ ఆలయంలో నిత్యం పండుగ భోజనాలు జరుగుతాయి. గత ఐదురోజులుగా కురుస్తున్నవర్షాలకు ఆలయం మొత్తం నీరు చేరి కొద్దికొద్దిగా ఇపుడిపుడే ఇంకుతోంది. కాకపోతే ఈ ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. అమ్మవారి ఆలయంలో నీరు చేరడంతో ఐదురోజుల నుంచి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కూడా బురద మొత్తం ఆరడానికి సుమారు మరో వారం రోజులు పట్టే అవకాశం వుంది. అమ్మవారి ఆలయంలో గర్బగుడి కాస్త కిందకి వుండటంతో అమ్మవారి ఆలయంలోకి కూడా నీరుపూర్తిగా చేరిపోయి పాదాలను తాకింది నీటిని ప్రత్యేక మోటార్లు ద్వారా బయటకు పంపిస్తున్నారు...

Nidadavole

2020-10-17 13:39:27

కోవిడ్ ను ఆత్మస్తైర్యంతో ఎదుర్కోవాలి..

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అభయమిచ్చారు. శనివారం నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని కోవిడ్ వార్డును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  అనంతరం పాజిటివ్ వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని, వ్యాధి నుంచి త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా భోజనం సమయానికి ఇస్తున్నారా, లేదా, ఇక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, డాక్టర్ లు సరైన చికిత్స అందిస్తున్నారా, ఆరోగ్యం బాగా ఉందా  అనే విషయాలపై జిల్లా కలెక్టర్ అరా తీశారు. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని పాజిటివ్ వచ్చిన వారు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. పాజిటివ్ వచ్చినవారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్,  పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. 

సర్వజన ఆసుపత్రి

2020-10-17 13:30:59

కిసాన్ రైల్ ట్రస్ట్ కు రూ.లక్ష విరాళం..

కిసాన్ రైల్ ట్రస్టుకు అందరూ విరివిగా విరాళాలు ఇవ్వాలన్న అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపుకి  మంచి స్పందన లభిస్తోంది. శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ.లక్ష చెక్కును ఎంపీ రంగయ్య ద్వారా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కిసాన్ రైలు కోసం, రైతుల కోసం మంచి కార్యక్రమం జిల్లా కలెక్టర్ చేపట్టారన్నారు. దాతలు ఇచ్చే మొత్తం కిసాన్ రైలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇలాంటి సమయంలో కిసాన్ రైలు ద్వారా రైతలుకు మేలు చేయాలనే ఉద్దేశ్యం జిల్లా కలెక్టర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన రావడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో జెసి డా.సిరి తదితరులు పాల్గొన్నారు.

అనంత కలెక్టరేట్

2020-10-17 13:28:41