1 ENS Live Breaking News

బాధితులకు పరిహారంపై అవగాహన

విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో "బాధితులకు పరిహారం" అనే అంశం పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బార్ అసోసియోషన్  లైబ్రేరి హాల్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా జిల్లా జడ్జ్ మరియు జిల్లా  లీగల్ సర్వీసెస్  అదారిటీ చైర్మన్ గౌ.ఎ.హరిహరనాధ శర్మ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రిమినల్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా రూపొందించిన పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, న్యాయవాధులు భాదితులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్ర్రమంలో  రెండోవ అదనపు జిల్లా జడ్జి  ఎస్.శ్రీదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. వి.రవీంద్ర ప్రసాద్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఎస్.కృష్ణమోహన్, బార్ అసోసియేషన్ కార్యదర్శి .వేణుగోపాల్, జిల్లా న్యాయ సేవాదికర సంస్ధ కార్యదర్శి  కె. కె. వి. బుల్లి కృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  శైలజ, ప్యానల్ అడ్వకేట్  ఆర్.శ్రీనివాస రావు, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-24 14:25:54

క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి

క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారులు,  మున్సిపల్ కమిషనర్లు,  తాహాసిల్దార్లు, ఎంపీడీవో లు పర్యటించి ఇంటి నిర్మాణాలు పనులను వేగవంతం చేయాలని ఈ విషయంలో మరో మాటకు తావులేదని జిల్లా కలెక్టర్ కె. మాధవిలత స్పష్టం చేశారు. మంగళవారం క్షేత్రస్థాయి అధికారులతో ఓటిఎస్ , ఇళ్ల నిర్మాణాలు పై  కలెక్టర్  టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత సమీక్షిస్తూ మండలాల్లో ఇళ్ల నిర్మాణాల వారం వారం లక్ష్యాలను వేగవంతం చేయాలన్నారు. తాసిల్దార్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పాలన్నారు.  ప్రతి 15 రోజులకు ఒకసారి  ముఖ్యమంత్రి ,  ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటి నిర్మాణాలపై కలెక్టర్లతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్స్  అధికారులు వారి పరిధిలో గల ప్రతి మండలం లోని  లేఅవుట్లలో తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని లేఅవుట్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్  ఆర్డీవో మల్లిబాబు ను  ఆదేశించారు. నిడదవోలు మునిసిపాలిటీ పరిధిలో 990 పైగా ఇల్లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 58పనులు ప్రారంభం అయి, మిగిలినవి  కాకపోవడంపై ప్రశ్నించారు.  మునిసిపల్ వార్డు సచివాలయం  పరిధిలో కనీసం వారానికి 10 ఇల్లు ప్రారంభించాలని ఇందుకు సిబ్బందికి లక్ష్యాలను విధించాలన్నారు. 

ప్రతి వారం 30 ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సచివాలయం పరిధిలో 5 ఇళ్లు ప్రారంభించేలాగా తాహాసిల్దార్ లు, ఎంపీడీవోలు హౌసింగ్ అధికారులతో సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు. జగనన్న లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీలు అందుబాటులో ఉంచుతున్నందున పనులు వేగవంతం చేయాలన్నారు. డిఆర్డిఎ, మెప్మా  స్వయం సహాయక మహిళలకు  ప్రభుత్వం అందించే రూ.15 వేలకు అదనంగా మరో రూ.35 రుణాన్ని మంజూరు చేసి, ఇంటిని నిర్మించేందుకు ముందస్తు చేయూత ను ఇస్తున్నామని, ఆ మొత్తంతో ఎటువంటి జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్ట గలుగుతామన్నారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ,  లబ్ధిదారులకు ఓటీఏస్ ద్వారా చేకూరే ప్రయోజనాలు వివరించి లక్ష్యాలను సాధించాలన్నారు.  అదే విధంగా ఎంపిడివోలు, తహశీల్దార్లు, హౌసింగ్ ఆధికారులు సమన్వయం తో పనిచేస్తు లాక్ష్యాలను అధిగమించాలన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్,నగరపాలక సంస్థ  కమీషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఏ.చైత్రవర్షిని, ఎస్.మల్లిబబాబు, తాహసిల్దార్లు, ఎంపిడీవోలు తదితరులు. పాల్గొన్నారు.

Rajahmundry

2022-05-24 11:44:46

3ఏళ్ల సమస్యకు శాస్వత పరిష్కారం

వంశధార డిస్ట్రిబ్యూటరీ - 5 కాలువ పనులకు మూడు సంవత్సరాల తరువాత పరిష్కారం లభించింది. వివరాలను పరిశీలిస్తే  భామిని మండలం పెద్ద దిమిలి గ్రామానికి సమీపంలో డిజైన్ ప్రకారం వంశధార వరద కాలువ నిర్మాణం జరగాలి. అయితే పెద్ద దిమిలి గ్రామస్తులు కాలువ నిర్మాణం వలన గ్రామంలో చెమ్మ వస్తుందని, కాలువలో ప్రమాదాలు జరగవచ్చని వివిధ సందేహాలతో గత మూడేళ్లుగా నిర్మించకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు వారికి పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ ససేమిరా అన్నారు. గ్రామం సమీపంలో నిర్మించాల్సిన దాదాపు ఆరు వందల మీటర్ల కాలువ మినహా మిగిలిన 1.20 కీలో మీటర్ల మేర నిర్మించారు. ఇంతలో జిల్లాల విభజన జరగటం, భామిని మండలం శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం మన్యం జిల్లాలో చేరడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల గూర్చి సమీక్షలో జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఈ అంశాన్ని తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించి దాదాపు రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని సంకల్పించారు. పెద్ద దిమిలి గ్రామస్తులతో మాట్లాడాలని నిర్ణయించి మంగళ వారం ఒక సమావేశాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత సమక్షంలో సమావేశం జరిగింది. గ్రామస్తుల సంశయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆలకించారు. వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ గ్రామంలో చెమ్మ రాకుండా అవసరమగు సిమెంట్ కట్టాడాలు నిర్మిస్తామని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సాగు నీరు పారుదలకు సహకరించాలని కోరారు. వంశధార రాష్ట్రంలో ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టు అని, అటువంటి ప్రాజెక్టును చిన్న కారణాలతో నిలిపివేయడం సరికాదని సూచించడంతో గ్రామస్తులు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీనితో మూడు సంవత్సరాలుగా సాగుతున్న సమస్య యువ అధికారుల చొరవతో సానుకూలంగా పరిష్కారం జరిగి ప్రాదాన్యత గల జలవనరుల ప్రాజెక్టుకు జిల్లాలో సజావుగా పనులు సాగుటకు అవకాశం కలిగింది. గ్రామంలో అవసరాలు గుర్తించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సమావేశంలో పాలకొండ డిఎస్పి శ్రావణి, వంశధార కార్యనిర్వాహణ ఇంజినీర్ ఎం.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 11:40:53

యువత మాత్రుభూమిని మరువకూడదు

నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉన్నతవిద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. యువత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2025 నాటికి దేశంలో 1.2 కోట్ల మంది యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. దేశ భవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని అన్నారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి దేశ విదేశాలకి వెళ్తారని, ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని, సామాజిక బాధ్యతని తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు మల్లారెడ్డి వర్సిటీ ఛాన్సిలర్ డీఎన్ రెడ్డి), వీఎస్ యూ వైస్ ఛాన్సిలర్ సుందరవల్లి, రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి హాజరయ్యారు.

Nellore

2022-05-24 11:34:48

సిఆర్పిఎఫ్ బరాక్ లోకి పశువుల ఆసుపత్రి

చాకలి బెలగాం లోని సిఆర్పిఎఫ్ బరాక్ లో ఉన్న భవనంలోకి వెటరినరీ ఆసుపత్రి మార్చాలని జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. వెటరినరీ ఆసుపత్రి మార్పు కోసం మంగళ వారం సిఆర్పిఎఫ్ బరాక్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భవనానికి అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టి సిద్ధం చేయాలని అన్నారు. ఒపి విభాగం, మందులు నిల్వ గదిని   ప్రాథమికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దశల వారీగా పూర్తి స్థాయి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రికి అదనంగా భవనాలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచుటకు ప్రతి పాదనలు ఉన్న సంగతి తెలిసిందే. అదనపు భవనాలను అదే ప్రాంగణంలో నిర్మించుటకు అనువుగా అచ్చట ఉన్న వెటరినరీ ఆసుపత్రిని మార్చుటకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అర్.కూర్మనాథ్, నోడల్ అధికారి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 11:10:06

జిల్లామైక్రో ఇరిగేషన్ అధికారిగా మన్మథరావు

పార్వతీపురం మన్యం జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారిగా కె.మన్మథ రావు నియమితు లయ్యారు. ఈ మేరకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మన్మథ రావు ఇప్పటి వరకు సూక్ష్మ నీటిపారుదల ఇన్ ఛార్జ్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారిగా నియమిస్తూ పార్వతీపురం మన్యం జిల్లాకు నియమితులయ్యారు. సూక్ష్మ నీటిపారుదల ద్వారా రైతులు అధిక సాగుచేసి దిగుబడులు సాధించుటకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచియం చేసుకున్నారు.

Parvathipuram

2022-05-24 08:25:29

ఖరీఫ్ కు రైతులను సిద్దం చేయాలి

ఖరీఫ్ కు రైతులను సిద్దం చేయాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను ముందుకు తీసుకు వస్తున్న దృష్ట్యా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయితీ లేని విత్తనాల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. పచ్చి రొట్ట విత్తనాలను రైతు భరోసా కేంద్రాలు వారీగా పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు వారీగా విత్తనాల అవసరాలు పక్కాగా గుర్తించాలని ఆయన అన్నారు. విత్తనాల నిలువకు గిడ్డంగుల కొరత ఉంటే ప్రైవేట్ భవనాలలో నిల్వ ఉంచుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విత్తనాల అవసరాలను మూడు రోజులలో జిల్లా వ్యవసాయ అధికారికి సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో విత్తనాల సమస్య తలెత్తరాదని కలెక్టర్ పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయ లాబ్ లను త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. మండలాల్లో కౌలు రైతులను గుర్తించి కార్డులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. గుమ్మలక్ష్మిపురం, సీతంపేట తదితర మండలాల్లో కౌలు రైతుల గుర్తింపులో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

 50 శాతం రాయితీతో పచ్చి రొట్ట విత్తనాలను సరఫరా చేయడం జరిగిందని, కొన్ని మండలాలకు 90 శాతం రాయితీ ఉందని ఏపి సీడ్స్ జిల్లా మేనేజర్ పద్మ తెలిపారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా పశు సంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ విమల, ఏపిఎం.ఐ.పి ప్రాజెక్టు డైరెక్టర్ కె. మన్మథ రావు, ఇన్ ఛార్జ్ జిల్లా మత్స్య శాఖ అధికారి గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-24 06:47:31

ఘనంగా జూ.. ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

టాలీవుడ్ యంగ్ టైగర్ సినీ నటుడు ,జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల కోలాహలం నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. విశాఖలో శుక్రవారం ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్  సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో అప్పన్నదేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయజర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అభిమానులతో కలిసి ఆయన  కేక్ కట్ చేసారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో వృద్ధులకు అనాథలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి గంట్ల శ్రీనుబాబు  మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సినీ హీరోలు అభిమానులు అంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన అభిమానులను శ్రీనుబాబు అభినందించారు. గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా తాము జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు  పేర్కొన్నారు.. సమాజ సేవలో తాము ముందు వరుస లో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బ్రహ్మయ్య, చీఫ్ అడ్వైజర్ పొలమరశెట్టి శ్రీను, అధ్యక్షుడు బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు సంతోష్, మహేష్, జాయింట్ సెక్రెటరీలు లక్ష్మణ్ చౌదరి, లోకేష్, అసిస్టెంట్ సెక్రటరీ తిరుమలరావు, కరస్పాండెన్స్ రవి, ప్రవీణ్, రవి, సురేంద్ర, సభ్యులు హరిప్రసాద్, నాని, హరిన్, దిలీప్, రెడ్డి, దివాకర్, హరి, ఆరిలోవ బుజ్జి, వెంకటేష్,  ఉప్పలపాటి సత్య రాజ్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు యల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-05-20 10:43:09

గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు

గడపగడపకు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్నదొర అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలం కందిరి వలస గ్రామంలో ఉప ముఖ్యమంత్రి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కనుక్కున్నారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని, సొంత ఇంటికి యజమాని కావాలని ఆయన కోరారు. ప్రతి ఇల్లు కనీసం రూ.15 లక్షలు విలువ చేస్తుందని ఆయన పేర్కొంటూ జగన్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉందని అన్నారు. మహిళలకు చేయూత, సున్నా వడ్డీ తదితర కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, పిల్లలకు బాల అమృతం వంటి కార్యక్రమాలను అందిస్తూ పౌష్టికాహారానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.

గర్భంలో ఉన్నప్పటి నుండే ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా మొత్తాలను సోమ వారం విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. లబ్దిదారులతో ముఖాముఖీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కందిరివలసలో ఒక వ్యక్తి రూ.2.41 లక్షలు విద్యా దీవెన క్రింద అందిందని, తన కుమారుడిని బి.టెక్ చదిస్తున్నానని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ పేదలకు మేలు చేయుటకు జగన్ మోహన్ రెడ్డి ముందు వరుసలో  ఉంటారని చెప్పారు. 

Pachipenta

2022-05-19 13:03:16

కొట్యాడ సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కోట్యాడ పంచాయితీ సెక్రటరీ బంగారు తల్లిని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విధుల నుంచి గురువారం సస్పెండ్ చేసారు.  స్పందన వినతులపై  30 రోజుల గడువు దాటినప్పటికి స్పందిక పోవడంతో  సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.  గడువులోగా స్పందన వినతులు పరిష్కరించవలసి వుండగా గడువు దాటి  2 రోజులు అయినప్పటికి స్పందించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పంచాయతీల్లో ప్రజలకు పంచాయతీల నుంచి సేవలు అందకపోవడం పట్ల  వస్తున్న ఫిర్యాలు,  స్పందన పట్ల సిబ్బంది నిర్లక్ష్యంపై  జిల్లా కలెక్టర్ చాలా గుర్రుగా ఉన్నారు. స్వయంగా హెచ్చరికలు జారీచేసినా తీరు మార్చుకోకపోవడంతో ఈ రోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Vizianagaram

2022-05-19 12:50:17

నాడు-నేడు 2వ ద‌శ త్వరితగతిన చేపట్టాలి

కాకినాడ జిల్లాలో నాడు-నేడు రెండో ద‌శ కింద పాఠ‌శాల‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన ప‌నులను త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో రెండోద‌శ నాడు-నేడు ప‌నుల‌పై క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. విద్య, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, స‌ర్వ శిక్షా అభియాన్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. నాడు-నేడు కార్య‌క్ర‌మం రెండో ద‌శ కింద అద‌న‌పు త‌ర‌గ‌తుల నిర్మాణంతో పాటు మ‌ర‌మ్మ‌తులు, విద్యుత్‌, తాగునీటి సౌక‌ర్యం త‌దిత‌ర ప‌నులు మంజూరైనందున‌.. వెంట‌నే గ్రౌండింగ్ మొద‌ల‌య్యేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌రం మేర‌కు సిమెంట్‌, స్టీల్ త‌దిత‌ర సామ‌గ్రికి ఇండెంట్ పెట్టాల‌ని.. అదే విధంగా డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్‌మెంట్ క‌మిటీ (డీపీసీ) స‌మావేశం నిర్వ‌హించి, ఇత‌ర సామ‌గ్రి సేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు.. క్షేత్ర‌స్థాయి ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నుల ప్రారంభానికి ఏవైనా అవ‌రోధాలు ఉంటే వెంట‌నే తొల‌గించి, గ్రౌండింగ్ జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప‌నుల్లో పురోగ‌తిపై రోజువారీ నివేదికలు స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో డీఈవో డి.సుభ‌ద్ర‌, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస‌రావు, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎం.శ్రీనివాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-05-19 11:34:26

కలెక్టరేట్ నిర్మాణానికి భూముల పరిశీలన

అనకాపల్లి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగం పుంజుకుంటున్నాయి. ప్రభుత్వభూముల్లో సువిశాల కలెక్టరేట్ నిర్మాణం చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కు శాశ్వత భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూములు పరిశీలిస్తున్నట్లు జెసి కల్పనా కుమారి చెప్పారు.  గురువారం ఆమె అనకాపల్లి మండలం లోని కోడూరు, కొండుపాలెం, అనకాపల్లి సౌత్ లలో ప్రభుత్వ భూములను పరిశీలించారు.  ప్రభుత్వ అంచనా మేరకు నిర్మించబోయే కలెక్టరేట్ లోనే సుమారు 75 ప్రభుత్వశాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు అంతపెద్ద స్థలాన్ని కూడా జిల్లా కలెక్టర్, జెసిల ఆధ్వర్యంలో గుర్తించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వ భూముల పరిశీలనలో  జెసి వెంట  రెవిన్యూ డివిజనల్ అధికారి చిన్నికృష్ణ, తాసిల్దార్ శ్రీనివాసరావు ఉన్నారు.

Anakapalle

2022-05-19 11:29:50

వేసవి శిబిరాలు ఉత్సాహంగా నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. వేసవి క్రీడ శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని క్రీడా శిక్షణా శిబిరాలు పక్కాగా నిర్వహించాలని తద్వారా క్రీడల పట్ల యువత ఆసక్తి పెరగుతుందని సూచించారు. చిన్నతనం నుండే అభిరుచి పెరగడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని, మానసికంగా ధైర్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఉన్నతమైన శిక్షణ కల్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని సూచించారు.  జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, క్రీడల శిక్షకులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-19 09:56:09

మినుములూరుని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

మినుములూరు గ్రామాన్ని ప్రజా భాగస్వామ్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ సూచించారు.  గురువారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో 330 గృహాలకు గాను మూడు ట్రై సైకిల్స్, పుష్ కార్టులు ఉన్నప్పటికీ, ఎత్తైన కొండ ప్రాంతంలో గృహాలు ఉన్నందున ఇంటింటికి చెత్త సేకరణ లో కొంత ఇబ్బంది అవుతుందని సర్పంచ్ ఎల్ చిట్టమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  చెత్త సేకరణలో భాగంగా గ్రామానికి అవసరమైన ఆటోలను అద్దెకు తీసుకోమని సూచించిన కలెక్టర్ యువత ఐదు వేల రూపాయలు సేకరిస్తే తన వంతుగా మరో ఐదు వేల రూపాయలు రెండు మూడు నెలల పాటు అందజేస్తామని తెలిపారు.  తద్వారా చెత్త సేకరణ సులభతరం అవుతుందన్నారు.  గ్రామంలో యూజర్ చార్జీలు వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్, కార్యదర్శులను కలెక్టర్  కోరారు. నెలకు అరవై రూపాయల యూజర్ చార్జీలు చెల్లించడం ద్వారా చెత్త సేకరణ లో సమస్యలు తొలగిపోతాయని తద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయని కలెక్టర్ వివరించారు.  గ్రామస్తులతో వెలుగు సిబ్బందిని కలుపుకొని సమావేశమై యూజర్ చార్జీల గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వాలంటీర్ తోపాటు, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు, వ్యవసాయ సహాయకులు, మహిళా పోలీస్ తదితర సిబ్బంది 50 ఇళ్ల నుండి కుటుంబీకులను చైతన్య పరిచి యూజర్ చార్జీలు వసూలు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్  ఎరువును తయారు చేసి లబ్ధి పొందాలన్నారు. సామాజిక భాద్యతతోనే అభివృద్ధి సాధ్యమని హితబోధ చేశారు. 

        పారిశుధ్య కార్మికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుగా సేకరించి వాటిని అమ్మి వచ్చిన సొమ్మును  వారే వినియోగించుకోవచ్చని సూచించారు.  పారిశుధ్య కార్మికులకు నెలకు ఒకసారి తప్పనిసరిగా హెల్త్ చెక్ చేయాలని ఆదేశించారు. వారికి గత ఆరునెలలుగా వేతనాలు అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా కలెక్టర్ స్పందిస్తూ.. కమిషనర్, కార్యదర్శిల దృష్టికి తీసుకు వెళ్లి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎల్ చిట్టమ్మ, జిల్లా పంచాయతీ అధికారి పిఎస్ కుమార్, ఎంపీడీఒ కెవి నర్సింహ రావు, ఇఒపిఆర్డి పి విజయలక్ష్మి, కార్యదర్శి బి. చిన్ని, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-05-19 09:49:59

పరిశ్రమల ఏర్పాటుకి ముందుకి రావాలి..

ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేందుకు మ‌హిళ‌లు ముందుకు రావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కు మారి పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఎన్నో అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంద‌ని, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. విటి అగ్ర‌హారం టిటిడిసిలో జిల్లా స‌మాఖ్య స‌మావేశం గురువారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌హిళా సంఘాల స‌భ్యుల‌కు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో క‌న్వ‌ర్జెన్సీ మీటింగ్‌ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా రాణించేందుకు ప్ర‌స్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు, ఇప్ప‌టికే ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను కూడా అభివృద్ది చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. ఫ‌లితాన్ని సాధించేవ‌ర‌కూ ప్ర‌యత్నం చేయాల‌ని అన్నారు.  వివిధ ర‌కాల‌ పంట‌ల‌ను, ఉత్ప‌త్తుల‌ను ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి నేరుగా విక్ర‌యించ‌డం, వాటితో ప‌చ్చ‌ళ్లు, ఇత‌ర ప‌దార్ధాల‌ను త‌యారు చేయ‌డం త‌దిత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌వ‌చ్చ‌ని సూచించారు. మ‌హిళ‌లు దైర్యంగా ముంద‌డుగు వేసి, ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు. అన‌వ‌స‌ర భ‌యాల‌ను విడ‌నాడాల‌ని, తామే మ‌రికొంద‌రికి ఉపాధిని క‌ల్పించేందుకు కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం ప్ర‌తీఒక్క‌రికి డిజిట‌ల్ ఎడ్యుకేష‌న్‌ అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికోసం కేంద్ర‌ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించింద‌ని, త్వ‌ర‌లో దీనిని జిల్లాలో అమ‌లు చేయ‌నున్నామ‌ని చెప్పారు. స‌చివాల‌య స్థాయిలో ఉచితంగా అమ‌లు చేయ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి, వ‌లంటీర్ల ద్వారా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంద‌ని సూచించారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న‌వారికి స‌ర్టిఫికేట్‌ను కూడా అంద‌జేస్తామ‌ని చెప్పారు. అలాగే ప్ర‌తీ మ‌హిళా, ఆంగ్ల భాషా ప‌రిజ్ఞానాన్ని పెంచుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

              ఈ స‌మావేశంలో డిఆర్‌డిఏ, వైకెపి ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, ఎపిడి సావిత్రి, జిల్లా స‌మాఖ్య అధ్య‌క్షురాలు సిహెచ్ వెంక‌ట‌ల‌క్ష్మి, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, ఇండ‌స్ట్రీస్ జిఎం పాపారావు, ఐసిడిఎస్ పిడి శాంత‌కుమారి, మ‌త్స్య‌శాఖ‌ డిడి నిర్మ‌లాకుమారి, ఉద్యాన‌శాఖ‌ డిడి శ్రీ‌నివాస‌రావు, ఎపిఎంఐపి పిడి ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ జెడి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, ఇత‌ర శాఖ‌ల అధికారులు, మండ‌ల స‌మాఖ్య‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ముందుగా పిఎంఎఫ్ఎంఇ ప‌థ‌కం గురించి, ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా ఎపి ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీస్‌ మేనేజ‌ర్ మారుతి వివ‌రించారు.

Vizianagaram

2022-05-19 08:43:20