1 ENS Live Breaking News

ఆధార్ లో మార్పు చేర్పులకు అవకాశం

విజయనగరం జిల్లాలో   ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి  వీలుగా విజయనగరంలో నాలుగు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విదంగా  బొబ్బిలి నెల్లిమర్లలో కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి  వీలుగా మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ లో గల  అరుంధతినగర్, రాజులవీది, లక్ష్మిగనపతికోలనీ, బాలాజీనగర్ సచివాలయాల పరిదిలో , డెంకాడ, భోగాపురం , మెంటాడ , జామి , బొండపల్లి , గుర్ల , గంట్యాడ మండల కేంద్రాల్లో నున్న సచివలయాలలో,  బాడంగి మండలం, పాల్తేరు సచివాలయాల పరిదిలో-2, బొబ్బిలి, తెర్లాం , ఎస్.కోట 1, ఎస్.కోట 2   సచివాలయాల పరిదిలో -2, వేపాడలో-1, నెల్లిమర్ల అర్బన్ లో -1 చెప్పున ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Vizianagaram

2022-05-15 10:16:57

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లోనే అల్లూరి పేరున 125 రూపే నాణేం విడుదల చేయాలి

భ‌ర‌త‌మాత ముద్దు బిడ్డ‌ స్వాతంత్య్ర సమరయోధుడు విప్ల‌వ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆజాదీకా అమ్రుత్‌ మహోత్సవంలో భాగంగా అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని విడుదల చేయాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. శనివారం విశాఖ‌లోని  విజెఎఫ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరున 125 రూపే వాణాన్ని విడుదల చేసారని అదే సంవత్సరం 1897లోనే జన్మించిన అల్లూరి పేరున 125 రూపే నాణాన్ని అల్లూరి జయంతి జూలై 4లోగా విడుదల చేయాలని ఆయన కోరారు. 2006లో పార్లమెంట్ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఉండగా ఒక్క ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చే|శార‌ని, నేటి వరకు అల్లూరి విగ్రహం ఏర్పాటుకు నోచుకోలేదన్నారు. కేంద్రానికి  ఆర్ధిక ఇబ్బందులు ఉంటే మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలకు లోబడి ఎన్ని లక్షలు ఖర్చు అయినా తాము ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి 126వ జయంతోత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించతల పెట్టినందులకు కేంద్ర ప్రభుత్వానికి పడాల కృతజ్ఞతలు తెలియచేసారు. జాతీయ జ‌ర్న‌లిస్టుల సంఘం అధ్య‌క్షులు, అప్ప‌న్న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్ర‌త్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, అల్లూరి పుట్టింది విశాఖజిల్లా ప‌ద్మ‌నాభం మండలం పాండ్రంగి గ్రామం, వీర మరణం పొందింది కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం అని అల్లూరి 125వ జయంతోత్సవాలు ప్రారంభోత్సవ సభ భీమవరంలో కాకుండా అల్లూరి పోరాటం చేసిన క్రిష్ణ‌దేవీపేట ప్రాంతంలో ఏర్పాటు చేయ‌డం ద్వారా అల్లూరి చ‌రిత్ర‌, ఆప్రాంతానికి మ‌రింత గుర్తింపు వ‌చ్చేద‌ని.. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ద్రుష్టికి తీసుకు వెళ్లేందుకు క్రుషిచేస్తామ‌న్నారు. జిల్లాల విభ‌జ‌న‌లో అల్లూరి సీతారామరాజు పేరుతో ఆయ‌న న‌డ‌యాడిన ప్ర‌దేశాల‌ను జిల్లాగా ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు. అల్లూరి చ‌రిత్ర ప‌రిశోధ‌కులు పి.బాల‌భాను(ఈఎన్ఎస్ బాలు) మాట్లాడుతూ, అల్లూరి చర‌త్ర‌ను పాఠ‌శాల  నుంచి యూనివ‌ర్శిటీ స్థాయి వ‌ర‌కూ పాఠ్యాంశాల్లో చేర్చ‌డంతోపాటు, నాటి మ‌ద్రాసు ప్రావిన్సు ప్ర‌భుత్వం నాటి గెజిట్లు కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నారు.  అల్లూరి నడయాడిన‌, పోరాటం సాగించిన ప్రాంతాల అభివ్రుద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ప్రతినిధి, పబ్లిక్ బ్యూరో ఇన్చార్జి య‌ర్రా నాగేశ్వ‌ర్రావు మాట్లాడుతూ, అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా, రాష్ట్రమంతా ఒక ఉత్స‌వంలా చేయ‌డానికి ప్ర‌త్యేక‌ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా అల్లూరి విశిష్ట‌త‌, చ‌రిత్ర‌, బావి త‌రాల‌కు తెలిసే అవ‌కాశం వుంటుంద‌న్నారు. అల్లూరి సీతారామ‌రాజు, ఆయ‌న అనుచ‌రులు స‌మ‌ధుల ప్రాంతంతోపాటు చుట్టు ప్ర‌క్క‌ల ప్ర‌దేశాలను అభివ్రుద్ధి చేయాల‌న్నారు. సంఘం కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి శ్యామ‌ల మాట్లాడుతూ, అల్లూరి ప్ర‌ధాన అనుచ‌రులు గాం గంటందొర‌, మ‌ల్లుదొర విగ్ర‌హాల‌ను అల్లూరి జిల్లాలోని అన్నిప్రాంతాల్లో పెట్టించాల‌న్నారు. కార్య‌వ‌ర్గ స‌భ్యులు ఎఎన్ఎస్‌.నారాయ‌ణ మాట్లాడుతూ, అల్లూరి చ‌రిత్ర‌ను దేశ‌వ్యాప్తంగా తెలిసేలా కేంద్రం ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవ‌డంతోపాటు ఆయ‌న వాస్త‌వ చ‌రిత్ర తెలిసే విధంగా నాటి మ‌ద్రాసు ప్రావిన్సు ప్ర‌భుత్వం నాటి ఆధారాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌న్నారు. ఆదివాసీ స‌మాఖ్య రాష్ట్ర అధ్య‌క్షులు గ‌డుతూరి రామ్ గోపాల్ మాట్లాడుతూ, అల్లూరి సెంట్ర‌ల్ పార్కును ప్ర‌భుత్వం నిర్మించ‌డానికి త‌ల‌పెట్టింద‌ని, అందులో అల్లూరి చ‌రిత్ర‌కుసంబంధించిన అన్ని అంశాల‌ను పొందుపర‌చాల‌ని, వాటి నిర్మాణం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్లూరి యువ‌జ‌న సంఘం ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

2022-05-14 06:23:07

మ‌త్స్య‌కారుల జీవితాల్లో వెలుగులే లక్ష్యం

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌నా కాలంలో మ‌త్స్య‌ కారుల జీవితాల్లో వెలుగులు నిండాయ‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. వేట నిషేధ కాలంలో వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందిస్తూ ప్ర‌భుత్వం వారికి అండ‌గా నిలుస్తోంద‌ని పేర్కొన్నారు. ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని గుర్తు చేశారు. మ‌త్స్య‌కార భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని కోన‌సీమ జిల్లా ముర‌మ‌ళ్ల నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ప్రారంభించారు. స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడిన అనంత‌రం మీట నొక్కి మ‌త్స్య‌కారుల ఖాతాల్లో నేరుగా మీట నొక్కి కుటుంబానికి రూ.10 వేల చొప్పున‌ నిధుల‌ను జ‌మ చేశారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అనంత‌రం జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌ మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. వేట నిషేధ కాలంలో మ‌త్స్య‌కారుల‌ను ఆదుకునే స‌దుద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ పెట్టార‌ని, ఈ ప‌థ‌కం ద్వారా ఎంతోమంది పేద‌ల‌కు ల‌బ్ధి చేకూరుతోంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో 2,944 కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున‌ రూ.2.94 కోట్ల ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరింద‌ని వివ‌రించారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌లేన‌న్ని మంచి ప‌నులు వైకాపా ప్ర‌భుత్వం చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వ‌ర‌కు ఉండే వేట నిషేధ కాలంలో మ‌త్స్య‌కారుల జీవ‌నోపాధికి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండాల‌నే సంక‌ల్పంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింద‌ని చేశారు. మత్స్య‌కారుల‌కు భీమా, బోట్ల‌కు ఆర్థిక స‌హాయం, డీజిల్ రాయితీ క‌ల్పించ‌టంలో ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక చొర‌వ చూపించార‌ని పేర్కొన్నారు.

అనంతరం లబ్ధిదారులకు 2.944 కోట్ల విలువ గల మెగా చెక్కును జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ సూర్యకుమారి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరుల చేతుల మీదుగా అందజేశారు.

మ‌త్స్య‌కార భ‌రోసా కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని వీసీ హాలు నుంచి జ‌డ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, మత్స్య‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మ‌లా కుమారి, ఆ శాఖ ఇత‌ర అధికారులు, మ‌త్స్య‌కార సంఘం నాయ‌కులు బ‌ర్రి చిన‌ప్ప‌న్న‌, న‌ర్శింగ‌రావు, నెడ్ క్యాప్ డైరెక్ట‌ర్ రాజు, మ‌త్స్య‌కార భ‌రోసా ప‌థ‌క ల‌బ్ధిదారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-05-13 10:13:50

విపత్తునెదుర్కొనెలా ఆసుపత్రులుండాలి

అసని తుఫాను కారణంగా సంభవించే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనుటకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన అన్నారు. అసాని తుఫాను కారణంగా అత్యవసర చికిత్సలు, అత్యవసర వైద్య సేవలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడంలో భాగంగా బుధవారం జిల్లా ఆసుపత్రిని సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పరిశీలించారు. తూఫాను తీవ్రత దృష్ట్యా విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉందని అటువంటి సమయంలో శస్త్ర చికిత్సలకు, ఇతర అత్యవసర వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్ లు సిద్ధంగా ఉండాలని ఆమె అన్నారు. శస్త్ర చికిత్సలకు అవసరమగు పరికరాలు, మందులు సిద్ధంగా ఉంచాలని, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆమె పేర్కొన్నారు. అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుఫాన్ వలన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలియజేస్తుందని అటువంటి సందర్భాల్లో జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ తో సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేయాలని అన్నారు.
 ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-05-11 16:16:57

విశాఖ దేవాదాయశాఖ డిసీగా సుజాత

దేవదాయ ధర్మాదాయశాఖ విశాఖపట్నం ఉప కమిషనర్ గా వి.సుజాతను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకూ ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న వి.శ్రీనివాసరెడ్డిని నెల్లూరులోని రాజరాజేశ్వరి దేవస్థానం ఈఓ గానే కొనసాగాలని ఆ ఆదేశాల్లో  పేర్కొన్నారు. సుజాత గతంలో విశాఖపట్నంలో డిప్యూటీ కమిషనర్ పనిచేసేవారు. ప్రస్తుతం  సింహాచలం దేవస్థానంలో పని చేస్తున్నారు. డిప్యూటి కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ గా విశాఖపట్నం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రాజారావు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇంతవరకు అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ గా విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్ కె.శాంతి కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం శాంతి సహాయ కమిషనర్ పోస్టుతో పాటు ఎర్నిమాంబ ఆలయ ఈఓగాను  కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓగాను కొనసాగుతున్నారు.

Visakhapatnam

2022-05-11 16:04:22

శత శాతం డిజిటలైజేషన్ జరగాలి

బ్యాంకులు సుల‌భ‌త‌ర విధానాల‌ను అనుస‌రించ‌టం ద్వారా ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన సేవ‌లం దించాల‌ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు.  వివిధ ప‌థ‌కాల ద్వారా ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ల‌బ్ధిదారుల‌కు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాల‌ని బ్యాంకర్లకు  విజ్ఞ‌ప్తి చేశారు. క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డీఎల్ఆర్‌సీ (డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ క‌మిటీ) స‌మావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శత శాతం డిజిటలైజేషన్ ను ఆర్.బి.ఐ ఆదేశాలు ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డిజిటల్ అకౌంట్స్ ఖాతా వివరాలు బ్యాంకుల వారీగా రివ్యూ నిర్వహించి ఆరా తీశారు.  క్యూ కోడ్ లేని వారిని గుర్తించే విధంగా వాలెంటిర్ల ద్వారా సర్వే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ను ఆదేశించారు. బ్యాంకుల వారీగా ఋణాలు మంజూరు కేటాయించిన టార్గెట్లు పై సమీక్షించి టార్గెట్లు రీచ్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకొవాలని సూచించారు. రివ్యూ కమిటీ సమావేశానికి సంబంధించిన అధికారులు మాత్రమే హాజరు కావాలి, బ్రాంచ్ మేనేజర్ల తో బ్యాంకుల కంట్రోలర్స్  సమావేశాలు నిర్వహించి సంబంధిత మినిట్స్ లోడ్ బ్యాంక్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు..

జగనన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు సంబంధించి మంజూరు చేసిన ఋణాల పై సమీక్షించారు, ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న వివిధ ప‌థ‌కాల ద్వారా ఆర్థిక‌ ఫ‌లాలు త్వ‌రిత‌గ‌తిన ల‌బ్ధిదారుల‌కు అందేలా బ్యాంక‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. స‌మావేశంలో భాగంగా జ‌గ‌న‌న్న తోడు, చేయూత, ఆస‌రా, బీసీ కార్పొరేష‌న్ త‌దిత‌ర‌ ప‌థ‌కాల్లో భాగంగా అందించే రుణ ప్ర‌క్రియ‌పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది. బ్యాంకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.విజయ సునీత, డి.సి. సి కన్వీనర్ బి.కె.వి.ఎస్.ఎస్.గురునాథ్ రావు, ఎల్‌.డి.ఎం. జి.వి.బి.డి.హరిప్రసాద్, నాబార్డ్ డి.డి. ఎం వరప్రసాద్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ లక్ష్మీపతి, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, మెప్మా పీడీ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్  కె.శ్రీధర్, పశుశుసంవ‌ర్థక శాఖ ఎ.డి ఆర్.ప్రసాద రావు, లైన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్ హెడ్స్, కంట్రోలర్స్, కోఆర్డినేటర్, స్టాక్ హోల్డర్స్ డి.సి.సి అండ్ డి.ఎల్.ఆర్, వివిధ బ్యాంకుల రీజ‌న‌ల్ మేనేజ‌ర్లు, బ్రాంచి మేనేజ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆర్.బి.ఐ, డి.డి.ఎం తేజాడిప్త బెహరా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Srikakulam

2022-05-11 15:21:02

వాయు కాలుష్య నియంత్రణకు ప్రణాళిక

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక, సమయానుకూలమైన ప్రణాళికలు తయా రుచేసి సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవా రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం (NCAP) జిల్లా సమన్వయ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, రవాణా శాఖ, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మైనింగ్, పౌర సరఫరాలు ఇతర శాఖలు జిల్లాలో వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులపై అధ్యయనం చేయ్యాలన్నరు. ఆయా శాఖ లు సమిష్టిగా పనిచేసి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ఆయా ప్రాజెక్ట్ వివరాలు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుందని, ఇందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తగిన అవగాహన కల్పిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.  వాయు కాలుష్యము నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్. సి ఎ పి. కార్యక్రమాన్ని 2017-2024 లో అమలు చేస్తూ, అందుకోసం నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ద్వారా చేపట్టిన పనులు, పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. మరింత సమర్ధంతంగా కార్యాచరణ తయారు చేసి, అమలు చేయాల్సి ఉందన్నారు.  రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ద్వారా చేపట్టినపనుల వినిమయ ద్రువపత్రం జారీచేసి, కేంద్రానికి సమర్పించాలని మాధవీలత ఆదేశించారు. ఇంకా రెండు సంవత్సరాలు కాలవ్యవధి ఉందన్నారు. ఎన్. సి ఎ పి. కార్యక్రమానికి కేటాయించిన నిధుల్లో జిల్లాకి సంబంధించి మరో రూ.80 లక్షలు నిధులు  అందుబాటులో ఉన్నాయని, వాటిని సరైన ప్రతిపాదనలు సిద్ధం చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించ వలసి ఉందని, వొచ్చే సమావేశం నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. 

పోల్యూషన్ కంట్రోల్  బోర్డు ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. అశోక్ కుమార్ మాట్లాడుతూ, గాలిలొ కాలుష్యం 2024 నాటికి పర్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలలో 20% నుండి 30% తగ్గింపును సాధించడం లక్ష్యంగా ఎన్. సి ఎ పి కార్యక్రమం ఏర్పాటు చేసి, అమలు చేయడం జరుగుతోందన్నారు. కనీసం పార్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలలో 20% నుండి 30% తగ్గింపును సాధించాల్సి ఉందన్నారు. జిల్లాలో 60 ప్రదేశాల్లో పరికరాలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని శ్రీ ఆనం కళా కేంద్రం లో ఒక పరికరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత 4 సంవత్సరాలు వివరాలు తెలుపుతూ 2018-19 లో 63 సాంద్రత, 2019-20 లో 59 ; 2020-21 లో 73, 2021-22 లో 63 గా గాలి కాలుష్యం లో పార్టిక్యులేట్ మ్యాటర్  నమోదు ఉందని, జాతీయ స్థాయి లో కనీసం 60 పాయింట్స్ కు చేరుకావాలని లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు.  ఇందుకోసం దేశంలో 122 నగరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లో ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ చేపట్టి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్ ఏం సి అధికారులు మాట్లాడుతూ, నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ ఫౌంటైన్ లతో ప్రాజెక్ట్ లను చేపట్టడం జరిగిందని, ఫౌంటైన్ లకు చెందిన పనులు 60 నుంచి 80 శాతం పూర్తి అయ్యాయని తెలియచేశారు. ఈ సమావేశంలో సంబందించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-05-11 10:03:33

ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చూడాలి..

అసని తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను     ఆదేశించారు. బుధవారం అసని తుఫాన్ పై ముఖ్యమంత్రి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, సూపరింటెండెంట్ ఆఫ్  పోలీస్ రాధిక, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి   పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ రానున్న అసని తుఫాన్ ను ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. తీర ప్రాంత మండలాల్లో  మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోరా వేయించడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు  తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  ప్రజలను అప్రమత్తం చేయాలని యంత్రాంగానికి ఆదేశించామని  తెలిపారు. జిల్లా,మండల,గ్రామ స్థాయి అధికారులు , సిబ్బంది  అందరూ అందుబాటులోనే ఉన్నారని తెలిపారు.  జిల్లా కేంద్రంలో  తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని 08942- 240557 నెంబర్ కు అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని తెలిపారు. అలాగే తీర ప్రాంత మండలాలలో తుఫాన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పటు చేయడం జరిగిందన్నారు. మండల స్థాయి అధికారులు వాలంటీర్ల సేవలను వినియోగించు కావాలన్నారు. జిల్లాలో 21 తుఫాన్ షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అందులో  721 మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను, వృద్ధులను తరలించడం జరిగిందన్నారు.  తుఫాన్ షెల్టర్లను లోతట్టు ప్రాంతాల ప్రజలు, వయోవృద్ధులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సామగ్రి  సిద్ధం చేసుకోవాలని తాసీల్దార్లకు సూచించారు.  

వైద్య-ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, రహదారులు భవనాల శాఖ, ఎస్.ఇ. ఆర్.డబ్ల్యూ. ఎస్ అధికారులు  సిబ్బంది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని,  విద్యుత్ శాఖ అధికారులు కరంట్ స్థంబాలు ఇతర సామగ్రితో తుఫాన్ ప్రభావిత  మండలాలలో సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా లో 108 వాహనాలు,  ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.టి.ఆర్. ఎఫ్ బృందాలను  సిద్ధంగా ఉన్నాయని వివరించారు.  జనరేటర్ల ను  అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని  తాసీల్దార్ల ను  ఆదేశించినట్లు చెప్పారు.  అసని  తుఫాన్ ను ఎదుర్కోవడానికి  జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఇళ్ళల్లోనే ఉండాలని తెలిపారు.  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్రం రేవుకు వింతైన రధం మంగళవారం కొట్టుకు వచ్చిందని, ఆసని తుఫాన్ ప్రభావంతో బంగారు రంగు గల రథం, తీరానికి చేరుకుందని, తీరప్రాంతంలో ఈ రధం పూర్తి భద్రత కల్పించడం జరిగిందన్నారు. మండల తహశీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. వారి నుంచి నివేదికలు వచ్చిన తరువాత  ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు.

Srikakulam

2022-05-11 09:45:07

వైశాఖపౌర్ణమికి 2వ విడత చందన సమర్పణ

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 2వ విడత 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.  ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకి తన నిజరూప దర్శనమిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్ర గా ,చందనోత్సవంగా పిలుస్తారు. నిజరూపదర్శనం రోజు రాత్రికి 3 మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించారు. 2వ విడతగా వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మరో 3 మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఇందుకోసం ఆలయ సిబ్బంది ఇప్పటికే చురుగ్గా చందనము అరగతీత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జేష్ట పౌర్ణమికి మూడో విడతగా 3మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆషాడ పౌర్ణమి 4 నాలుగో విడత గా మరో 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఇక. శ్రావణ పౌర్ణమికి కరాళ చందన సమర్పణ తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. ఇలా ఏడాదిలో 4 విడతలుగా  పన్నెండు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం పూర్వ చక్రవర్తుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కాగా గుమ్మడి పండు అలంకారంలోఉన్న సింహాద్రి నాధుడు ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి వరకూ స్వామి ఇదే అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు.

Simhachalam

2022-05-11 09:22:41

16న మన్యంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు ఈ నెల 16వ తేదీన జిల్లాలో పర్యటనకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేశారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు సీతంపేట మండలం ఆడాలి గ్రామాన్ని చేరుకుంటారని చెప్పారు. ఆడాలి గ్రామంలో 12:30 గంటల వరకు స్థానిక గిరిజనులతో మాట్లాడుతారని, అనంతరం సీతంపేట చేరుకుని భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఐటిడిఏ సమావేశ మందిరంలో వివిధ గిరిజన సంఘాలతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సమావేశం తరువాత శ్రీకాకుళం చేరుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.

Parvathipuram

2022-05-10 11:16:20

సుస్థిర అభివ్రుద్ధిలో జిల్లా ముందుండాలి..

అనకాపల్లి జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో  మొదటి స్థానంలో ఉండాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్లో ఈ విషయమై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చిన  475 లక్ష్యాలను సాధించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుని కృషి చేయాలన్నారు. విద్య ఆరోగ్యం పేదరిక నిర్మూలన ఉపాధి మొదలైన విషయాలలో లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళికాయుతంగా  చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లీలావతి జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మణ్ రావు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సీతా మహాలక్ష్మి  జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి పశుసంవర్ధక శాఖ గృహ నిర్మాణ మార్కెటింగ్ పరిశ్రమలు ఈపీడీసీఎల్ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-05-10 10:55:03

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

అనకాపల్లి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం అనకాపల్లి ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిష్కరించ దగ్గ సమస్యల పై తగు చర్యలు తీసుకుంటామన్నారు.  మిగిలిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు మే 10 మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి గారికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జర్నలిస్టు నాయకులు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కలెక్టర్ కు నివేదించిన అంశాలు తెలుసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం తక్షణం మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఇందులో అన్ని జాతీయ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలని, మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల పై దాడులను అరికట్టాలని, మీడియా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు కల్పించాలని కోరారు. అన్ని స్థాయిలలో  పనిచేస్తున్న జర్నలిస్టులకు రాయితీ రైల్వే పాసులు మంజూరు చేయాలని,  వర్కింగ్ జర్నలిస్టులందరికీ వేతనాలు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కరోనా వ్యాధి తో మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని, కొన్ని నిబంధనలను సడలిస్తూ అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల రక్షణ కోసం రాష్ట్ర స్థాయి మరియు దేశస్థాయిలో జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ స్కీమ్ పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని,  జర్నలిస్టుల కోసం  సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని,  రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పునరుద్ధరించాలని, రాఘవాచారి ప్రెస్ అకాడమీ కి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, జర్నలిస్టులకు సంబంధించి వివిధ స్థాయిల్లో, నియామకాలు నిలిపివేసిన , కమిటీలను వెంటనే పునరుద్ధరించాలని వినతిపత్రంలో కోరారు. 

ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, జిల్లా కార్యదర్శి పెంటకోట జోగినాయుడు,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా(ఏపీ యూ.ఎమ్.జే ఏ  ఉపాధ్యక్షులు ఆళ్ల వెంకట అప్పారావు, కోశాధికారి కొయిలాడ చంద్రశేఖర్,సహాయ కార్యదర్శి కాండ్రేగుల మోహన్ బాబు, మల్ల భాస్కరరావు, అజయ్ గంగాధర్, అవతారం, నానాజీ, శ్రీనివాసరావు, రమణాజీ, నటరాజ్, శశి, తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-05-10 10:49:40

పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదు

శ్రీకాకుళం జిల్లాలో జలకళ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నా రు.మంగళవారం జిల్లా కలెక్టర్  చాంబర్ లో  జలకళ సంబంధిత పనులపై ఆయన సమీ క్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జళకల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జలకళ పనులపై ఆరా తీశారు.  డ్వామా ప్రోజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2296 బోర్లు తీసేందుకు జియాలజిస్ట్లు ఇప్పటికే సర్వే నిర్వహించారని తెలుపగా జియాలజిస్ట్లు వారీగా వివరాలను కలెక్టర్ అడుగగా వివరాలు పిడి వద్ద లేకపోవడం పై పూర్తి డేటాలతో సమీక్షకు హాజరు కావాలన్నారు. పనులు అపడం కాకుండా పరిష్కారానికి కావలసిన అనుమతుల నిమిత్తం ఫైల్స్ పంపించాలన్నారు. కాంట్రాక్టర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతికి సహకరించని సిబ్బందికి వేటు తప్పదన్నారు. ఏమైనా సమస్యలు తెలిపితే పరిష్కారం చూపిస్తామన్నారు.  కాంట్రాక్టర్లు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, బిల్లులు సకాలంలో అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో డ్వామా పి.డి. ఎం.రోజా రాణి, జియాలజిస్ట్లు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:39:45

డేటాఎంట్రీ త్వరిత గతిన పూర్తిచేయాలి

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ డేటాని తప్పులు లేకుండా అప్లోడ్ వేగవంత చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.  మంగళవారం కలెక్టర్ చాంబర్లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ డేటా అప్లోడ్ పై సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి, ఆర్.ఐ.ఓ, సర్వశిఖ అభియాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లా వెనుకబడి ఉందని త్వరితగతిన ఎంట్రీ పూర్తిచేయాలన్నారు. రేపు సాయంత్రానికి శత శాతం ఎంట్రీ పూర్తి కావాలని జిల్లా విద్యా శాఖాధికారి, ఆర్.ఐ.ఓ, సర్వశిఖ అభియాన్ అధికారులను ఆదేశించారు. నేటికీ నిర్వహించిన డేటా ఎంట్రీల పై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశానికి సర్వశిక్షా అభియాన్ ఎ.పి.సి డా.ఆర్. జయప్రకేష్, జిల్లా విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ,  రీజనల్ ఇంటర్ మీడియట్ అధికారి ఎస్. తవిటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:37:52

ఉన్నత సమాజనిర్మానానికి విద్య ప్రధానం

విలువ‌లున్న విద్య‌తోనే ఉన్న‌త స‌మాజ నిర్మాణం సాధ్య‌మని, అందుకు వైస్సార్  స‌ర్కార్ నిరంత‌రం ప‌నిచేస్తోందని, పరిత‌పిస్తోంద‌ని రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వెల్ల‌డించారు. స్థానిక బాపూజీ క‌ళా మందిర్ లో జ‌గ‌న‌న్న విద్యా దీవెన, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌కి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న స‌దస్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నాణ్య‌మైన విద్య‌తోనే స‌మాజంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయ‌ని, త‌ద్వారా దేశాభ్యున్న‌తి సాధ్య‌మ‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం విద్యారంగంలో మెరుగైన అవ‌కాశాలు అంద‌రికీ వ‌ర్తించే విధంగా ప‌నిచేస్తోంద‌ని, అందుకు త‌గ్గ ఆర్థిక స్థోమ‌త  క‌ల్పించేందుకు అధిక మొత్తం వెచ్చిస్తోంద‌ని చెప్పారు. చదువుకునే అవకాశం లేని సమాజం ఎంత మాత్రం ముందున్న కాలంలో ఎవ‌రి ఆమోద యోగ్యత‌నూ సాధించ‌దు అని అభిప్రాయ‌ప‌డ్డారు. మంచి విద్యార్థులు ఉంటే, వారే బలమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించ‌డం త‌థ్యం అని అన్నారు. ఉన్న‌త విద్య ఉంటేనే మేలిమి రీతిలో సమాజం, తద్వారా రాష్ట్ర నిర్మాణం ప్ర‌గతి దిశ‌గా సాగ‌నుండ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.


దేశంలో అన్ని రాష్ట్రాల‌లో కంటే పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే వెచ్చిస్తున్నాం అని, విశాలమైన భావజాలం కలిగి ప‌థ‌కాల అమ‌లుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని వివ‌రించారు. సాంకేతికంగానూ, సామాజికంగానూ శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తున్న ప్రపంచంతో పోటీ ప‌డేందుకు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇంగ్లీష్ మధ్యమాన్ని ప్ర‌వేశపెట్టాం అని, పేద పిల్లలంద‌రూ ఉన్నత విద్యా ఫ‌లాలు అందుకోవాల‌ని, బాగా చదువుకోవాలని, ఆ ఉద్దేశం మ‌రియు దృక్ప‌థంతోనే అర్హుల‌యిన వారంద‌రికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నామ‌ని చెప్పారు. 69 వేల మందికి జిల్లాలో వసతి దీవెన అందిస్తున్నామని, అదేవిధంగా విద్యా దీవెన పేరిట కూడా అర్హులంద‌రికీ ఆర్థిక ల‌బ్ధి అందుతోంద‌ని అన్నారు. వారంద‌రికీ త‌మ ప్ర‌భుత్వం త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు చెబుతూ ప్ర‌సంగం ముగించారు.

శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ రామన్, ఎంఆర్వో వెంకటరావు,తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు,  మాజీ మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ మెంటాడ వెంక‌ట పద్మావతి, జెడ్పీటీసీ సభ్యురాలు రుప్ప దివ్య,  ఎంపీపీలు గొండు రఘురాం, అంబటి నిర్మలా శ్రీనివాస్, వైస్సార్సీపీ నాయకులు అంబటి శ్రీనివాస రావు, గొండు కృష్ణ, చల్లా శ్రీనివాసరావు, సాధు వైకుంఠ రావు, మూకళ్ల తాత బాబు, డాక్ట‌ర్ పైడి మహేశ్వరరావు, ముంజేటి కృష్ణ, ప్రకాశ్, మార్పు పృధ్వి, సీజు చల్లా అలివేలు మంగ,  ఎం.మహాలక్ష్మి, సుగుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-05-10 10:36:00