1
భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడాలి.. బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ విద్యార్ధులే ప్రభుత్వంలోని ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖను నడిపించాలి.. ప్రభుత్వానికి కావాల్సిన ఐటీ సేవలు మొత్తం ఐటీ విద్యార్ధులే చేపట్టాలి.. అధికారిక వెబ్ సైట్ల నుంచి మొబైల్ యాప్స్ వరకూ అన్నీ ఆ విద్యార్ధులతోనే చేయించాలి.. కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయనే ధీమాల కల్పిం చాలి.. దానికోసం ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలి.. ఇదే నాటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి కల. దానికి అనుగుణంగానే ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ కంప్యూర్ సైన్స్ కోర్సు ఏర్పాటు అయ్యాయి. యూవర్శిటీలు, కాలేజీలో బీటెక్ కంప్యూర్ సైన్స్ సీట్లు కూడా పెరిగాయి. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. నేటికీ డా.వైఎస్సార్ కల సాకారం కాలేదు. ప్రభుత్వంలో ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ప్రభుత్వానికి కావాల్సిన అన్నిప్రభుత్వ శాఖలకు చెందిన మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్లను థర్డ్ పార్టీ నిర్వహకులతో ప్రభుత్వం చేయిస్తోంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు డా.వైఎస్సార్ ప్రత్యేక ప్రణాళిక అప్పట్లో అమలు చేయాలని భావించారు. ఆయన మదిలో మెదిలిన ఆలోచనకు కార్యరూపంలోకి రావాల్సి వుంది. కానీ విధి వైపరీత్యం ఆయన హెలీకాఫ్టర్ ప్రమాదంలో కాలం చేశారు. ఆయనతోపాటు ఆ మంచి ఆలోచన కూడా మరుగున పడిపోయింది. దానితో ప్రభుత్వ అధికారిక పోర్టల్ నిర్వహణ కూడా వివిధ ప్తైవేటు సాఫ్ట్ వేర్ డెలప్ మెంట్, మెయింటినెన్సును ఆ సంస్థలు నిర్వహి స్తున్నాయి. దానికి ప్రభుత్వం లక్షలాది రూపాయాలు మెయింటినెన్స్ చార్జీలు చెల్లిస్తుంది.
డా వైఎస్సార్ ఆ.. ఐటీ శాఖ ఆలోచన ఏవిధంగా అమలు చేయాలనుకున్నారో ఒక్కసారి తెలుసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్ లైన్ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలకు శాఖాపరమైన వెబ్ సైట్ ఏర్పాటుచేయాలి, అత్యవసర సేవలకు మొబైల్ యాప్ రూపొందించాలి. అవన్నీ బీటెక్ కంప్యూర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్ధులతోనే చేయించాలి. అసలు ఒక ప్రభుత్వ శాఖనే ఏర్పాటు చేసి అందులో ప్రతీ శాఖను కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్ధులే నిర్వహణ చేపట్టేలా చూడాలి. తద్వారా ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అత్యధిక మొత్తంతో ప్రభుత్వం ఆ శాఖలోని ఉద్యోగులకే జీతాలు ఇవ్వొచ్చు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వమే స్వయంగా సాఫ్ట్ వేర్ డెవలెప్ మెంట్ ద్వారానే అన్ని రకాల కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి కూడా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో ఐటీశాఖను జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేసి ప్రభుత్వానికి, ప్రభుత్వశాఖలకు కావాల్సిన కంప్యూర్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సేవలన్నీ వారితోనే చేయించడం ద్వారా ప్రభుత్వానికి ఆర్ధికంగా చాలా పెద్ద మొత్తం కలిసి వస్తుంది. ప్రభుత్వమే ఒక ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వం వద్దనే వారి వారి సంస్థలకు కావాల్సిన సాఫ్ట్ వేర్లను, వెబ్ సైట్లను తయారుచేయించుకునే స్థాయికి ఎదగవచ్చు అనేది వైఎస్సార్ ఆలోచన. దానికి అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసి అన్ని ట్రిపుల్ ఐటీల్లోనూ బీటెక్ కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. వాటితో పాటు యూనివర్శిటీల్లోనూ బీటెక్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ సీట్లును పెంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తీరా ఆయన కల సాకారం కావడానికి బీజం పడుతుందనే సమయంలో ఆయన దూరమైపోయారు. నాటి నుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిశగా మళ్లీ అడుగులు వేయలేదు. నిజంగా దివంగత ముఖ్యమంత్రి ఆలోచన కార్యరూపం దాల్చితే ప్రభుత్వ శాఖలో ఇన్ఫర్నేషన్ టెక్నాలజీ శాఖఏర్పాటు అయ్యేది. అన్నిజిల్లాల్లోనూ ప్రభుత్వ శాఖలకు కావాల్సిన కంప్యూర్లు, అందులోని సాఫ్ట్ వేర్లు, ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ యాప్ లు, వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు, కంప్యూటర్ మెయింటినెన్సులు, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన ప్రత్యేక సాఫ్ట్ వేర్లు.. ఇలా అన్ని రకాలగా ఆశాఖ ఎంతగానో ఉపయోగపడేది. వారే నిర్వహణ మొత్తం చేపట్టేవారు. తద్వారా ప్రతీ జిల్లాలోనూ ఉద్యోగాల కల్పన కూడా జరిగేది. కానీ ఆ ప్రయత్నం జరగకపోవడం వలన ప్రస్తుతం ప్రతీది థర్డ్ పార్టీ ప్రైవేటు సంస్థలతోనే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించుకోవాల్సి వస్తుంది. నాడు డా.వైఎస్సార్ ఆలోచనలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్ధులకు కంప్యూటర్లపై అవగాహన కూడా కల్పించాలని. దాని కోసం సాధారణ ఉపాధ్యాయులు మాదిరిగా, బీటెక్, ఎంటెక్ చదివి విద్యార్ధులను కంప్యూటర్ కోర్సులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులుగా డిగ్రీ వరకూ నియమించాలనే ఆలోచన కూడా ఉండేదట. తద్వారా విద్యార్ధులు పదవతరగతికి వచ్చేనాటికే కంప్యూటర్ వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన రావడంతోపాటు, డిగ్రీ తరువాత వారు కూడా ప్రత్యేక కోర్సులు కళాశాలల్లోనే నేర్చుకుని ఆపై వెను వెంటనే సాఫ్ట్ ఉద్యోగాల్లో స్థిరపడటం ద్వారా ప్రపంచ దేశాల్లో భారత దేశం అందునా ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ ఎగుమతులు, దిగుమతుల్లో అగ్రస్థానంలో నిలబడుతుందని ఆలోచన చేశారట.
దివంగత ముఖ్యమంత్రి తుదిశ్వాస విడిచిన తరువాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఆదిశగా ఆలోచన చేయలేదు. అలా చేసి ఉంటే నేటికి ప్రభుత్వానికి బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూర్ సైన్స్ కోర్సులు చదివిన విద్యార్ధులకు మెండుగా ఉపాది, ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. పైగా ప్రభుత్వంలోని ఒక శాఖ ఏర్పాటుతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పన చేయడానికి ఆస్కారం వుండేది. చాలా ఏళ్ల తరువాత డా.వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఐటీకి పెద్ద పీట వేశారు తప్పితే తండ్రి ఆలోచనలు మాత్రం పునికి పుచ్చుకోలేదు. ఈ ప్రభుత్వంలో కూడా నాటి ఐటీ శాఖ మంత్రి కూడా ఆ దిశగా ఆలోచనలు చేయలేదు. కానీ ఇపుడు అదేశాఖకు యువకుడు గుడివాడ అమర్నాధ్ మంత్రి అయిన తరువాత మళ్లీ ఆ దిశగా అడుగులు పడతాయనే భావన అందరిలోనూ కలుగుతోంది. కానీ వారికున్న పదవీకాలం చాలా చిన్నది. రాజకీయాలు చేయడానికి, సంక్షేమ పథకాల అమలుకే సమయం మొత్తం అయిపోతుంది. ఆ సమయంలోనే డా.వైఎస్సార్ కలను నిజం చేస్తారా..? లేదంటే ఆయన కంటే మిన్నగా ఆలోచించి ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో ఐటీ శాఖను ఏర్పాటు చేసి యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా క్రుషి చేస్తారానే చర్చ కూడా రాష్ట్రంలో గట్టిగా జరుగుతోంది. దానికి కారణం మంత్రి కూడా బీటెక్ చదివిన వ్యక్తికావడంతో ఐటీశాఖను రాష్ట్రప్రభుత్వ శాఖలన్నింటిలోనూ అగ్రభాగన నిలబెడతారనే భావనను అంతా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి డా.వెఎస్సార్ కన్న ఐటీశాఖ ఏర్పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటవుతుందా లేదా అనేది.