1 ENS Live Breaking News

శంఖవరంలో 19 కరోనా పాజివ్ కేసులు..

శంఖవరంలో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు. శనివారం శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 50 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందలో 17 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలు ఉన్నా తక్షణమే పీహెచ్సీలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే కరోనా మందుల కిట్ ను హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాడాలన్నారు. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలవర్తక ఆహారం తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో కరోనా వైరస్ భారి నుంచి బయట పడటానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వుంటే తక్షణమే 104కి కాల్ చేయడం ద్వారా వారికి వారిని హాస్పటల్ ఐసోలేషన్ కి తరలిస్తారని డా.ఆర్వీవీ సత్యన్నారాయణ వివరించారు.

Sankhavaram

2021-06-05 12:14:11

కాలనీ పనుల లక్ష్యాలను అదిగమించాలి..

వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ పనులను లక్ష్యాలకు అనుగుణంగా  సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం డివిజన్ లోని పి.గన్నవరం గ్రామంలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన లేఅవుట్ అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగులో ఉన్న లేఅవుట్ చదును పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లెవెలింగ్ అనంతరం గృహ నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టాలని అన్నారు. లేఅవుట్ చదును పనులకు మట్టి కొరతను తీర్చేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, మట్టిని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా త్వరితగతిన గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు రెండు వారాల్లో పూర్తి స్థాయిలో లేఅవుట్ లను సిద్ధం చేయాలని జెసి అధికారులకు సూచించారు.

పి.గన్నవరం

2021-06-04 15:56:41

323 మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో శుక్రవారం 323 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా వేక్సినేషన్ కి టోకెన్లు జారీచేసిన తరువాత వాటిని ఆన్ లైన్ చేసి వెంట వెంటనే వేక్సిన్ నేషన్ చేస్తున్నామన్నారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-06-04 13:30:51

శంఖవరంలో 17 కరోనా పాజివ్ కేసులు..

శంఖవరంలో 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు. శుక్రవారం శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 44 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందలో 17 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలు ఉన్నా తక్షణమే పీహెచ్సీలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే కరోనా మందుల కిట్ ను హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాడాలన్నారు. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలవర్తక ఆహారం తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో కరోనా వైరస్ భారి నుంచి బయట పడటానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వుంటే తక్షణమే 104కి కాల్ చేయడం ద్వారా వారికి వారిని హాస్పటల్ ఐసోలేషన్ కి తరలిస్తారని డా.ఆర్వీవీ సత్యన్నారాయణ వివరించారు.

Sankhavaram

2021-06-04 13:27:50

టీకా పంపిణీలో వారికి మినహాయింపులు..

ప్రజాప్రతినిధులకు కరోనా టీకా వేసే విషయంలో 45 సంవత్సరాల వయో పరిమితిలో  ప్రభుత్వం మినహాయింపు నిచ్చిందని ఎంపీడీఓ  జె.రాంబాబు వెల్లడించారు. గురువారం ఈ మేరకు శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వయస్సు అర్హత సడలింపు నిబంధన ప్రకారం 45 ఏళ్ళ వయస్సు తక్కువ ఉన్నప్పటికీ సర్పంచులు, వార్డు సభ్యులు కూడా కరోనా నివారణా టీకాలను వేసుకోడానికి అర్హులన్నారు. మండలంలోని శంఖవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల శాశ్వత కరోనా నివారణ టీకా కేంద్రానికి అదనంగా ఉప ప్రణాళిక ప్రాంత గిరిజన గ్రామాల ముఖ ద్వారమైన గౌరంపేటలోని ఉప ఆరోగ్య కేంద్రంలో మరో  కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. శుక్రవారం నాటి ఈ టీకాల కార్యక్రమంలో 350 మందికి టీకాలు లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. వీటిలో గౌరంపేట కేంద్రంలో 200 మందికి, శంఖవరం కేంద్రంలో 150 మందికీ టీకాలు వేస్తామని ఆయన వెల్లడించారు. నూరు శాతం టీకాలు పూర్తయ్యి, కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఎంపీడీఓ. జె.రాంబాబు కోరారు.

Sankhavaram

2021-06-03 14:29:22

అయిన వారివే ఆ అనాధ శవాలు..

ఉన్నోళ్లంతా మంచోళ్లు.. పోయినోళ్లు ఉన్నోళ్లకి తీపి గురుతులు.. ఇది ఒకప్పటి మాట.. ఉన్నోళ్లే మనవారు.. పోయిన వారంతా అనాధలు.. ఇదినేటి మాట.. అవును ఆ అయిన వారిని కరోనా కాటేస్తుంటే.. ఆ..క్షణం వరకూ ఆర్తనాదాలు చేసినవారే.. దవాఖానాల్లో వారిని అనాధ శవాలుగా వదిలిపోతున్నారు.. కరోనా చేస్తున్న కరాళ న్రుత్యానికి బలైపోయిన వారిని కడసారి చూసుకోవడానికి వీలుపడక.. ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే వదిలేస్తున్నారు..  మరికొందరు ఆ వైరస్ మహమ్మారి ఇంకెంతమందని పొట్టపెట్టుకుంటుందోనని ఆ పార్ధీవ శరీరాన్ని తీసుకెళ్తూనే మార్గమధ్యలోనే దింపేస్తున్నారు.. అయినావరే ఎరుక లేక వదిలించుకుంటుంటే..కాటికాపరే వారికి కుటుంబ సభ్యుడవుతున్నాడు.. పీనుగను బూడిద చేసి మొక్క మొదటన పోస్తున్నాడు.. ఆత్మీయులు అనాధ శవాలుగా మారుతున్నా గుండెలవిసేలా రోధించి గుండెలు బాదుకుంటున్నారు  అయినవారంతా.. బహుసా వారి ఆత్మశాంతించదేమో..!

Visakhapatnam

2021-06-02 03:10:24

కలెక్టర్ గా ఎంతో సంతృప్తినిచ్చింది ప్రకాశం జిల్లా..

 ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు మనస్ఫూర్తిగా స్వీకరించి సమర్ధవంతంగా పని చేశానని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ చెప్పారు. బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ కు శాలువలు కప్పి పుష్పగుచ్ఛాలు, పుష్పమాలలతో జిల్లా అధికారులు మంగళవారం స్థానిక  స్పందన సమావేశ మందిరంలో  ఘనంగా సన్మానించారు. జిల్లా అభివృద్ధిలో మీ అందరి సహకారం ఎనలేనిదని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. మీ ఆదరణ, అభిమానాలు మరువలేనవన్నారు. అందరూ కలిసి పనిచేయడానికి చక్కని అవకాశం లభించిందన్నారు. మీ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, జ్ఞానమే మీ శక్తిగా భావించాలని, మీ నైపుణ్యాలతో దాన్ని సమయస్ఫూర్తితో వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కష్టపడటం, ఎప్పుడు సిద్ధపడటం, నేర్చుకునే మనస్సు విజయాల వైపు నడిపిస్తుందని ఆయన వివరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొని ముందుకు అడుగులు వేయాలని స్పూర్తి దాయక ప్రసంగం చేశారు. జీవితంలో ఒడిదుడుకులు,  ఉద్యోగంలో బదిలీలు సహజమేనన్నారు. 
విజయాలు సాధించాలంటే ప్రధానమైన విలువలతో కూడిన పునాది  వేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. మన వ్యవహార శైలి,  ఆధ్యాత్మికంగా మనస్సు స్థిరమైన ఆలోచనలతో  ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మెలగాలన్నారు. ఏ సమస్యలు ఎదురైనప్పటికీ తక్షణమే వాటిని పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
          ప్రకాశంలో పరిపాలనా వ్యవస్థను ఏంతో బలోపేతం చేసిన మంచి పరిపాలనాధ్యక్షుడు పోల భాస్కర్ అని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రకాశంలో కమాండింగ్ కంట్రోల్ రూమ్, కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపును సాధించి పెట్టారని ఆయన అభివర్ణించారు.  క్లిష్టమైన పరిస్థితులలో సున్నితమైన సమస్యలు చాకచక్యంగా పరిష్కరించారని ఆయన వివరించారు. జిల్లాలో కలెక్టర్ గా రెండేళ్ల పాలనలో ఎంతో సన్నిహితంగా మెల్లిగా అని ఆయనను తండ్రి గా భావిస్తున్నాను చెప్పారు. గత ఏడాది కోవిడ్ లాక్ డౌన్ లో పారా పోలీస్ విభాగాన్ని స్థాపించి రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారు. ప్రజలకు మేలు చేయాలని బడుగులకు సహాయం చేయాలని ఆలోచనతోనే రెండేళ్ల పరిపాలన సాగించారని ఆయన విశ్లేషించారు
               అభివృద్ధి పథంలో ప్రకాశం జిల్లాను నడిపిస్తూ తనదైన శైలిలో ఉత్తమ కలెక్టర్ గా పోల భాస్కర్ చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు.  ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ తొలి స్వరంగం పనులు పూర్తి చేయడానికి ఏంతో కృషి చేశారని ఆయన తెలిపారు. ఆ ప్రాజెక్టు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించారని ఆయన వివరించారు. రామాయపట్నం ఫోర్ట్, పరిశ్రమలకు భూసేకరణ, సోలార్ మెగా ప్రాజెక్టుకు భూసేకరణ, మార్కాపురం రాయవరంలో వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణలో అత్యంత కీలకపాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు.  జిల్లా యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులను ఏకతాటిపైకి తెచ్చి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అభివర్ణించారు. గొప్ప పరిపాలన అధ్యక్షుడిగా, అందరికీ మార్గదర్శిగా, స్నేహశీలిగా జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని ఆయన వివరించారు. రైతు ప్రకాశం పేరుతో ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపకల్పన చేసి వ్యవసాయ రంగం అభివృద్ధికి బంగారు బాటలు వేశారని ఆయన వివరించారు. ఐఏఎస్ అధికారిగా రెండేళ్ల కాలం జిల్లాలో పరిపూర్ణంగా పని చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సహజమేనని, ఆసమయంలో సహచర మిత్రులు, నాయకులతో అనుబంధం, ఆయన చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. ఆయన జిల్లాను వదిలి వెళ్లడం బాధాకరమైనదని జేసీ చెప్పారు.
            క్షేత్ర పరిశీలన, నిబద్ధత, ప్రత్యేక దృష్టి సారించడంతోని జిల్లా అభివృద్ధిపథంలో వేగం పుంజుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి. ఎస్. చేతన్ తెలిపారు. జిల్లాలో మంచి పాలన అందించారని ఆయన వర్ణించారు.
           లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సమర్ధంగా అందించడంలో కృతార్థులయ్యారని కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ చెప్పారు. పేదలకు గూడు కల్పించే బాధ్యత తీసుకోవడం, పరిపాలనలోను ఆదర్శంగా నిలిచారని ఆయన అభివర్ణించారు.
          జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధిలో నడిపించిన ఘనత పోల భాస్కర్ కు దక్కుతుందని జేసి కృష్ణవేణి తెలిపారు. వెనుకబడిన జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధిలో తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేశారని ఆమె ప్రకటించారు. 
        అద్భుతమైన అవగాహన, ఆచరణ, ఆదర్శంగా జిల్లా కలెక్టర్ గా పోల భాస్కర్  అందరి మన్ననలు పొందారని జడ్పీ సీఈఓ కైలాస్ గిరీశ్వర్ చెప్పారు. దశ, దిశ ప్రకాశంగా జిల్లాను చక్కగా తీర్చిదిద్దారనిఆయన వివరించారు. చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేశారని ఆయన తెలిపారు.
         మహిళా ప్రకాశం పేరుతో జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మహిళల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి ప్రశంసించారు.  
          ఈ కార్యక్రమంలో  డీఆర్వో తిప్పే నాయక్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్.సరళవందనం, జడ్పీ సీఈవో కైలాస్ గిరీశ్వర్,  సీపీవో డి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ పి రత్నావళి, డ్వామా పిడి  సీనారెడ్డి, డిపివో జి.వి.నారాయణరెడ్డి, డిఈఓ ఎస్.సుబ్బారావు, పిఆర్ ఎస్ఈ కొండయ్య, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ మర్థన్అలీ,  వ్యవసాయ శాఖ జేడీ శ్రీరాములు, డీటీసీ బి.కృష్ణవేణి, మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ జి.లక్ష్మీదేవి,  ఆర్డీవోలు ప్రభాకర్ రెడ్డి, ఎం.వి.శేషిరెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములు, ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

2021-06-01 17:09:53

ఉద్యాన పంటలతో గిరిజనుల అభివ్రుద్ధి..

ఉద్యానవన పంటలతో గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాథ్ అన్నారు.  మంగళవారం ఈ మేరకు విజయనగరం జిల్లాలోని  పాచిపెంట మండలం పాంచాలి గ్రామ పంచాయతీ జిలుగువలస గ్రామం పెదకొండలో గల ఆర్. ఓ.ఎఫ్.ఆర్ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం ఎం.జి.ఎన్.ఆర్. ఇ.జి.ఎస్, ఉద్యానవన శాఖ చేపడుతున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు పొందిన లబ్ధిదారులు అందరికి ఉద్యానవన పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలో మండల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పి. ఎ లు, ఎ.పి. ఓ లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యానవన సహాయకులు ప్రణాళికలు రూపొందించుకొని  ప్రతి లబ్ధి దారునికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో పాచి పెంట మండలం రెవెన్యూ, ఉద్యానవన ఆధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Pachipenta

2021-06-01 14:39:02

అనాధలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా..

కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర  రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు ఎం శంకర్ నారాయణ  పేర్కొన్నారు మంగళవారం స్థానిక సూపర్ స్పెషాలిటీ  వద్ద  తాత్కాలిక ఆస్పత్రివి ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొని అనంతరం    కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి 5 చిన్నారులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 50 లక్షల రూపాయల పరిహార ధ్రువీకరణ  పత్రాలను  మంత్రివర్యులు చేతుల మీదుగా   చిన్నారులకు పంపిణీ చేశారు. ఐ సి డి ఎస్, బాలల సంరక్షణ సమితి సమితి ఆధ్వర్యంలో  గుర్తించారు. అనంతపురం పట్టణానికి చెందిన కుమారి సత్య నాగ , విడపనకల్లు  సి హేమంత్, గార్లదిన్నె మండలం నికి చెందిన రాఘవేంద్ర, ధర్మవరం పట్టణానికి చెందిన జేమ్స్ బాండ్, పామిడి మండలానికి చెందిన బి.  దీపికలకు బాండ్లను అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్,జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటారామిరెడ్డి ,నగర మేయర్ మహమ్మద్ వసిమ్,జాయింట్ క‌లెక్ట‌ర్లు,నిశాంత్ కుమార్,డా. ఏ.సిరి,   ఐసిడిఎస్ పీడీ  విజయలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం,   ఇతర అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Anantapur

2021-06-01 13:57:24

శంఖుస్థాపన పనులు వేవగవంతం చేయాలి..

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించే  గృహ నిర్మాణాలకు శంకుస్దాపన చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టరు డి.మురళీధర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్  ఆలమూరు గ్రామంలో ఎర్రకాలనీ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆదేవిధంగా ఈ నెల మూడవ తేదీ శంకుస్దాపన కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లపై  ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా  కలెక్టర్  మాట్లాడుతూ  అన్ని హంగులతో ఉన్న  కొత్తపేట నియోజకవర్దం ఆలమూరు ఎర్రకాలనిలోని  7 ఎకరాల ప్రభుత్వ లేఅవుట్‌ను మోడల్‌ కాలనీగా రూపుదిద్దేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల శంకుస్దాపనకు ఆలమూరు గ్రామంలోని ఎర్రకాలనీ అనువుగా వుందని గుర్తించిందన్నారు. ఈ మేరకు శంకుస్దాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు  కార్యాచరణ ప్రణాళికలు రచించి అందుకు అనుగుణంగానే ముందస్తు చర్యలకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించిందన్నారు. ఇంటి స్దలం పొందిన లబ్దిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముఖాముఖి  స్పందన కార్యక్రమం దూరదృశ్య సమావేశం ద్వారా వుంటుదదన్నారు. పాత భూసేకరణ ప్రకారం 7 ఎకరాలు ప్రభుత్వ స్దలాన్ని సుమారు 304 మంది లభిదారులకుగాను పట్టాలు 2004 సంవత్సరంలో అందించారని  అంతుముందుకు ఈ ప్రభుత్వ స్దలాన్ని ఆక్రమించుకొని లబ్దిదారులు పాకలు వేసుకుని జీవించేవారని వారికే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ స్దలాలను  అభివృద్ది పర్చి రహదారులు, పార్కులను విభజించడం జరిగిందన్నారు. తదుపరి ఇటీవల  నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో మరో 15 ఎకరాలు భూసేకరణ ద్వారా సేకరించామన్నారు. నవరత్నాలు కార్యక్రమం సర్వేలో 7 ఏకరాలుకు సంబందించి పట్టాలు పొందిన లబ్దిదారులు ఇండ్లు నిర్మాణాలు గత 12 సంవత్సరాలు జరిగివుండలేదని గుర్తించడం జరిగిందని డ్వాక్రా పొదుపు సంఘాలు స్త్రీనిది  వి.ఓ నిదులు ఇతరత్రా పెట్టుబడి నిదులు  స్దానిక లబ్దిదారులు సేకరించుకొని గృహనిర్మాణాలు చేపట్టి పూర్తి చేసేలా జిల్లాయంత్రాంగల చర్యలు చేపట్టిందన్నారు. కాలనీలో చాలవరకు గృహనిర్మాణాలకు అనువుగా విద్యుత్‌ కనెక్షన్లు సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్పుకో ఎస్‌.ఇ టివిఎస్‌ఎన్‌మూర్తిని ఆదేశించారు. అదేవిధంగా  అంతర్దత రోడ్లు, సి.సి.రోడ్లు. డ్రైయిన్యుల నిర్మాణానికి అంచనాలు రూపోందించాలని పంచాయితీ రాజ్‌ ఎస్‌ ఇ. నాగరాజును ఆదేశించారు లబ్దిదారులు అభ్యర్దన మేరకు జియోట్యాగింగ్‌ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అదికారులను ఆదేశించారు. ప్రతి ప్లాట్‌లో ప్లాటు నెంబరు లబ్దిదారులు పేరు వివరాలుతో చిన్నబోర్డులు ప్రదర్శింపజేసి చూడగానే ఫలానా వారి స్దలం అని తెలియాలన్నారు. గ్రామీణ త్రాగునీటి సరఫరా మరియు పారిశుద్ద్యశాఖ వారు ఇంటింటికి కుళాయి ఏర్పాటు  105 లక్షలతో అంచనాలతో రూపొందించామన్నారు.  గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం వారి ఆప్షను ప్రకారం విద్యుత్‌ సౌకర్యాలు కల్సనకు పరిపాలన నిధులనుంచి రూ 21 లక్షలు వెంటనే చెల్లించాలని ఆయన ఆదేశించారు. స్దానికంగా గృహ నిర్మాణ పధకాన్ని విజయవంతం చేయాలని ఆయన అధికారులును ఆదేశించారు. మెటిరియల్‌ ప్లాట్ల వద్ద దిగుమతి చేయాలని 3వ తేదీన లబ్దిదారులు వారి మతాచారాల ప్రకారం శంకుస్దాపన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.నవరత్నాలు అమలులో భాగంగా లేఅవుట్లలో ఈనెల మూడవ తేదీన జగన్మోహనరెడ్డి చేతులుగా మీదుగా వర్చువల్‌ విధానములో భూమిపూజ మరిము శంకుస్దాపన  చేస్తారన్నారు. భూమి పూజ మరియు శంకుస్దాపన కార్యక్రమానికి కరోనా నేపధ్యంతో  లబ్దిదారులు మాత్రమే హాజరుకావాలన్నారు.

Aalamuru

2021-06-01 13:50:58

195 మందికి కోవిడ్ వేక్సినేషన్..

శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్వత కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ లో మంగళవారం 195 మందికి కోవిడ్ టీకా(కోవీషీల్డ్) వేసినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. ఈ మేరకు ఆయన వేక్సినేషన్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముందుగా వేక్సినేషన్ కి టోకెన్లు జారీచేసిన తరువాత వాటిని ఆన్ లైన్ చేసి వెంట వెంటనే వేక్సిన్ నేషన్ చేస్తున్నామన్నారు.  కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో  బయటకు వెళ్లే సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా బౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతీఒక్కరూ వేక్సినేషన్ కేంద్రానికి వచ్చేటపుడు మాస్కులు విధిగా ధరించాలని సూచించారు.  ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. అప్పటికీ ఇబ్బందులు ఉంటే 104కాల్ సెంటర్ కాల్ చేయడం ద్వారా మెరుగైన వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించే వీలుంటుందని చెప్పారు. ఏ పనిచేయడానికైనా ముందు నాణ్యమై శానిటైజర్ ను వినియోగించాలన్నారు. ఆసుపత్రిలో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే కరోనాని నియంత్రించడానికి ఆస్కారం వుంటుందని డాక్టర్  ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు.

Sankhavaram

2021-06-01 12:00:57

నిరు పేదలకు మరింతగా వైద్య సేవలు..

పేదలకు వైద్య సేవలు విస్తరించేందుకు వైద్య కళాశాలలు దోహద పడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు శంఖుస్థాపనలో భాగంగా అనకాపల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద వైద్య కళాశాలకు సోమవారం ఆయన వర్చ్యువల్ విధానంలో శంఖుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం వున్న వైద్య కళాశాల ఒత్తిడి ఎక్కువైనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పధిలో ఒక వైద్య కళాశాల నిర్మాణంలో భాగంగా వైద్య కళాశాలలు శంఖుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.  ఈ వైద్య కళాశాలు దాదాపు 8 వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి 2023 సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలు నాడు - నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 
విశాఖపట్నం జిల్లా నుండి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయితే పేద ప్రజల ఆరోగ్యం కాపాడిన వారవుతారన్నారు. నేను ఒక డాక్టరుగా ఈ ప్రాంత వైద్య కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చేప్పారు. 
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ అనకాపల్లి లో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టడం వలన ఈ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందులో సబ్ ప్లాన్ ప్రాంత ప్రజలు ఉన్నారని, సీరియస్ గా ఉన్న పేషెంట్లను విశాఖపట్నం తీసుకుని రావాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుందని, ఈ లోపల దారిలోనే పేషెంటు మరణించే అవకాశం ఉండొచ్చొన్నారు. 
       అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంతం లో ముఖ్యమంత్రి పేరు చరిత్రలో నిలచిపోయే విధంగా చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే వుంటారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  ఏ ప్రభుత్వం ఇన్ని  సంక్షేమ పథకాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. మీ పరిపాలన దేశానికే ఆదర్శమని, మీ కార్యకర్తగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.  వైద్య కళాశాల నిర్మాణం పూర్తయితే దాదాపు 15 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం రోగులను విశాఖపట్నం కెజిహెచ్ కు రిఫర్ చేస్తున్నారని చెప్పారు. నియోజక వర్గ ప్రజలు, ఈ ప్రాంత ప్రజల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
జయలక్ష్మి అనే మహిళ ముఖ్యమంత్రి తో ఇంటరాక్షన్ :  ఈ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు  మీకు కృతజ్ఞతలు తెలియజేసు కొనుచున్నాను అన్నారు.  నా భర్తకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. 60 శాతం ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ చెప్పినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వస్తే 104 కాల్ సెంటర్ కి ఫోన్ చేయండి అని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఏడ్ ను చూసి 104 కాల్ సెంటర్ ఫోన్ చేయగానే 108 ఆంబులెన్స్ ను పంపించారు.  అక్కడ నుండి విమ్స్ ఆసుపత్రికి తరలించి మంచి వైద్యం అందించి నా భర్తను కాపాడారన్నారు. డబ్బులు ఎంత కట్టాలని డాక్టర్లును అడితే ఒక్క రూపాయి కట్టక్కర్లేదని, ఆరోగ్య శ్రీ లో వైద్యం చేసినట్లు తెలిపారు. నా భర్తను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలన్నా.  అని సంబరంగా చెప్పారు.
ప్రతీ రోజు కలెక్టర్ ఆఫీసు నుండి ఫోన్ చేసి నా భర్త బాగోగులు గూర్చి అడిగి తెలుసుకునేవారన్నా. సున్నా వడ్డీ, అమ్మఒడి పథకాలు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు. ముసలి వారికి పెన్షన్లు, ఇలా ఎన్నో పథకాలు పేదవారి కోసం ప్రవేశ పెట్టి పేదవారిని ఆదుకుంటున్నారన్నారు. 
         అంతకు ముందు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు,  విశాఖపట్నం నగర మేయర్ జి. హరి వెంకట కుమారి, శాసన సభ్యులు గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, జాయింట్ కలెక్టర్-2 పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్-3 ఆర్.గోవిందరావు, అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సుధాకర్, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ డి.ఎ. నాయుడు, అనకాపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
      అనంతరం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ  అనకాపల్లిలో వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలలకు దాదాపు 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణం డిశంబరు 2023 సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేర్చుతున్నట్లు వెల్లడించారు. తాను మంత్రిగా ఉండగా జిల్లాలో రెండు వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్ వైద్య కళాశాలకు సంబంధించిన భూ సమస్య గూర్చి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు వివరించారు. 

Anakapalle

2021-05-31 12:09:27

మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పర్వత..

అన్ని వర్గాల ప్రజలకు మౌళిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని సిబ్బంది వీధిలో నిర్మించిన మినీ మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఎవరూ మంచినీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంలో యుద్ధప్రాతిపదిక ఈ మంచినీటి పథకాన్ని పంచాయతీ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ మంచినీటి ట్యాంకు ద్వారా ఈ ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు తీరిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పర్వత రాజబాబు, ఉప సర్పంచ్ కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-05-31 12:01:50

మరో 27 మందికి కరోనా పాజిటివ్..

శంఖవరంలో 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ తెలియజేశారు. సోమవారం శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొత్తం 57 మందికి ర్యాపిడ్ కరోనా పరీక్షలు నిర్వహించగా అందలో 27 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలు ఉన్నా తక్షణమే పీహెచ్సీలో పరీక్షలు చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే కరోనా మందుల కిట్ ను హోమ్ ఐసోలేషన్ లో ఉండి వాడాలన్నారు. నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ బలవర్తక ఆహారం తీసుకోవడం ద్వారా 14 రోజుల్లో కరోనా వైరస్ భారి నుంచి బయట పడటానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సమయంలో ఎవరికైనా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు వుంటే తక్షణమే 104కి కాల్ చేయడం ద్వారా వారికి వారిని హాస్పటల్ ఐసోలేషన్ కి తరలిస్తారని డా.ఆర్వీవీ సత్యన్నారాయణ వివరించారు.

Sankhavaram

2021-05-31 08:49:47

అన్నిదానాల్లో కెల్లా అన్నదానం మిన్న..

అన్ని దానాలలో కంటే అన్నదానం చాలా గొప్పదని  మహా విశాఖ నగరపాలక సంస్థ  మేయర్  గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని బ్లాక్ అండ్ వైట్ మీడియా సంస్థ చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ,  విపత్కర పరిస్థితుల్లో అన్నదానం చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం మధురవాడ మారికవలస మొదలుకుని గాయత్రి హాస్పిటల్, ఆరిలోవ విమ్స్ హాస్పిటల్, పరిసర ప్రాంతాల్లో కోవిడ్ బాధితులకు సహాయకులుగా వచ్చిన వారు పారిశుద్ధ్య సిబ్బందికి మద్దిలపాలెం జంక్షన్, ఆర్.టి.సి. కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, జగదాంబా జంక్షన్ వరకూ రహధారుల ప్రక్కన ఉన్న నిరాశ్రయులకు ఆహార పొట్లాలు  పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది కూడా ఆహారం పొట్లాలను అందజేశారు. సురక్ష హాస్పిటల్ ఎండి డాక్టర్ బొడ్డేపల్లి రఘు, తదితరులు మాట్లాడుతూ కరోనా సమయంలో చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Madhurawada

2021-05-30 14:30:42